మైలవరపు వారూ, మొదటి పూరణలో కరుణశ్రీ గారి పుష్పవిలాప ఖండకృతిని, రెండవ పూరణలో తిరుమలలో స్త్రీలు పూలు ధరించడంపై నిషేధాన్ని ప్రస్తావించారు. అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
శ్రీ బాపూజీ గారికి ధన్యవాదాలు.. నమోనమః... మీరు సాక్షాత్ కరుణశ్రీ పాపయ్యశాస్త్రి గారి పుత్రరత్నమని నేడు మీ వ్యాఖ్య తెలిపింది... ఆత్మీయభావం మరింత ఇనుమడించినది.. వైయక్తికముగా నాకు మీ తండ్రి గారి పద్యాలు అమితానందదాయకములు... (బహుశః ఇది అందరి అభిప్రాయం)... నమోనమః 🙏🙏
మధుసూదన్ గారూ, గుడిలో, వల్లకాడులో పూసిన పూల ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. 'మర్లి' శబ్ద సాధుత్వంపై సందేహం! 'మరలు' అన్న క్రియాపదానికి 'మర్లు' అన్న రూపాంతరం లేదు. 'మరులు' అన్న విశేష్యానికి 'మర్లు' రూపాంతరం ఉంది (మర్లుతీగ).
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2653 సమస్య :: *పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే ?* పూలు పెట్టుకోవాలని ఇష్టపడే అమ్మాయిలు లోకంలో ఉంటారా ? అని అడగడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం. సందర్భం :: ‘’కొమ్మ వంచి పూలు కోయాలని నేను అనుకొంటే ఆ పూలు *మా ప్రాణము తీతువా* అంటూ బావురు మన్నాయి జాలిగా ‘’ అని బాధపడుతూ కరుణశ్రీ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు *పుష్పవిలాపం* అనే కావ్యాన్ని వ్రాశారు. ఆ కావ్యంలోని పద్యాలను గాన గంధర్వుడైన ఘంటసాల గారు ఆర్ద్రతతో మనోహరంగా గానంచేశారు. కరుణ రస భరితమైన పుష్పవిలాపం లోని పద్యాలను మనసు పెట్టి వింటే పూలు పెట్టుకొవాలని ఇష్టపడే అమ్మాయిలు లోకంలో ఉంటారా ? అని ప్రశ్నించే సందర్భం.
సహృదయులు శ్రీ jjk బాపూజీ గారికి ప్రణామాలు. మీ స్పందన నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండీ. శ్రీ జంధ్యాల వారి గ్రంధాల నన్నింటినీ మా ఇంటిలో ఉంచాలని కోరుకొంటున్నానండీ. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం మీకు ఈ బ్లాగు లోనే తెలియజేసినానండీ. సలహా చెప్పగలరు. మీ కోట రాజశేఖర్
'కరుణశ్రీ సాహిత్యం'అన్నపేరుతో ఇప్పటికి అయిదు భాగాలు వచ్చాయండి.అన్నీనేనే పరిష్కరించాను.విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు.విశాలాంధ్ర బుక్ హౌస్,విజయవాడ నుండి తెప్పించుకోవచ్చు.నేను ఏడాదిగా అమెరికాలో మాఅబ్బాయి వద్ద ఉంటున్నాను.ధన్యవాదాలండీ!
శ్రీ jjk బాపూజీ గారూ! ప్రణామాలండీ. మీరు మహాకవి జంధ్యాల వారి కుమారులని శ్రీ కంది శంకరయ్య గురువర్యులు మాటల సందర్భంలో తెలియజేసినారండీ. మీతో ఇలా ఉత్తర ప్రత్యుత్తరాను జరుపగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండీ. రెండు రోజుల్లో విజయవాడ వెళ్తానండీ. అప్పుడు మీ చేత పరిష్కరింపబడిన మీ పితృదేవుల (కరుణశ్రీ) సాహిత్యాన్ని తీసికొనగలనండీ. ధన్యవాదాలండీ. భవదీయుడు కోట రాజశేఖర్ నెల్లూరు.
శూలికి న ర్ధదేహ మయి శోభి లు పార్వతి బూజసేయు చు న్ తాలిమి గల్గు ప త్నులి ల ధార్మిక చింతన గల్గిసంప్రదాయ మౌ పూల ధరిoప నిష్ట పడు ముగ్ధ లు ; లోకము నందు నుందు రే పూల సువాసన ల్ వదలు పుణ్య వ తు ల్ వి ర హాలము న్గుచు న్
ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కాని రెండింటిలోను కొంత అన్వయదోషం ఉన్నది. మొదటి పూరణలో పొలతులు - గలరే అన్న విరుపు సముచితంగా లేదు. రెండవ పూరణలో ప్రశ్నార్థకం నిశ్చయార్థకం ఎలా అవుతుంది?
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఉందురే'ను 'ఉండురే' అని టైపు చేశారు. 'మాడున' అంటేనే 'మాడునందు' అని అర్థం. 'మాడున నందున' అనడం సాధువు కాదు. 'మంది + ఇలను' అన్నపుడు యడాగమం వస్తుంది. 'బంధమున్ + అరయ = బంధము నరయ' అవుతుంది. ద్విత్వనకార ప్రయోగాన్ని వర్జించండి. 'పూర్వసుభాషిణులు' అంటే? 'పూర్వ సువాసినులు' పదమైతే విన్నాం.
ఉమాదేవి గారూ, మీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు. నాల్గవ పూరణలో 'నిత్యమున్ + ఇలను' అన్నపుడు యడాగమం రాదు. 'అని + అందురే' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
నేటి సమస్యకు మరో పూరణ చేలముఁ దెమ్మటంచు తన చేడియ కోరగ, భర్త యిత్తరిన్ వీలగు నెట్లు వచ్చు నెలవేతనమందునఁ గొందమంచనన్, వాలుజడన్ సరుల్ గిరటువైచెను; గోపము నందు నల్గి యా పూలు ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందు నుందరే?.
కవిత సంఖ్య :-- 1185. 16--4--2018. పిన్నక నాగేశ్వరరావు. స.క.స.1043. శీర్షిక :-- సమస్యా పూరణము. శంకరాభరణం వారు ఇచ్చిన సమస్య :-- పూలను ధరియింప గోరు పొలతులు గలరే. పూరణము :-- కందపద్యము.
మేలగు స్వచ్ఛ సుమమ్ముల
నే లలనలు ముడుచుకొంద్రు నిత్యము తలలో గాలికి నెండకు వాడిన
వీలుగ జంధ్యాల రచన...
రిప్లయితొలగించండిరాలిన పూవుల వెతలను రమ్యపు శైలిన్
మాలిమి తోడను చదువగ
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండికరుణశ్రీ గారి పుష్పవిలాప ఖండకావ్య ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిమా తండ్రిగారి పుష్పవిలాప కవితను స్మరించినందుకు
తొలగించండిధన్యవాదాలు శాస్త్రి గారూ !
ఆర్యా! ఈరోజు కవులూ అవధానులూ అందరూ కరుణశ్రీ గారిని తలచితిరి. పుష్ప విలాపం మాకు 1956 లో స్కూలులో పాఠము గా ఉండినది. ఇప్పటికీ ఆ పద్యాలను మరువలేదు.
తొలగించండి🙏🙏🙏
బాలా! యికపై మానుము
రిప్లయితొలగించండికాలము మారినదనుచును కాకుల వోలెన్
గోలను,నేడిల మామిడి
పూలను ధరియింప గోరు పొలతులు గలరే?
విరించి గారూ,
తొలగించండిమామిడి పూలను స్త్రీలు ధరించరంటూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమాలల గట్ట గ్రుచ్చెదరు మా హృదయమ్ముల సూదులంచనన్
జాలిగ నోళ్లువిప్పి సుమజాతి దిగాలున పల్కినట్లుగా
స్త్రీలు పఠించి , సారము రుచింపగ పాపయశాస్త్రి పద్యముల్ ,
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శ్రీ లలనా మనోహరుని చెంతనె పూసిన పుష్పకోటులన్
తొలగించండిమాలలు గట్టి దాల్పెదము మాధవమంగళకంఠసీమ ., నే
స్త్రీలును పూలు జుత్తుల ధరింపగరాదన నంజనాద్రిపై ,
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే ?!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమొదటి పూరణలో కరుణశ్రీ గారి పుష్పవిలాప ఖండకృతిని, రెండవ పూరణలో తిరుమలలో స్త్రీలు పూలు ధరించడంపై నిషేధాన్ని ప్రస్తావించారు. అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
"గుండెలోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి " అన్న నాన్నగారి పలుకులు ఉపబలకంగా గ్రహించినందుకు
తొలగించండిమైలవరపువారూ ! సాధువాదాలండీ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండినమస్కారములు
తొలగించండిబాపూజీ గారూ ! మీరు కరుణశ్రీ గారి కుమారులు గావటం మీ అదృష్టం . మీరు మాకు పరిచయం గావటం మా అదృష్టం. ధన్య వాదములు
శ్రీ బాపూజీ గారికి ధన్యవాదాలు.. నమోనమః... మీరు సాక్షాత్ కరుణశ్రీ పాపయ్యశాస్త్రి గారి పుత్రరత్నమని నేడు మీ వ్యాఖ్య తెలిపింది... ఆత్మీయభావం మరింత ఇనుమడించినది.. వైయక్తికముగా నాకు మీ తండ్రి గారి పద్యాలు అమితానందదాయకములు... (బహుశః ఇది అందరి అభిప్రాయం)... నమోనమః 🙏🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
హేలగ పరవశ మొందుచు
రిప్లయితొలగించండిలీలగ తలలూపి నంత లేలే తవిరుల్
రాలను పూసిన చక్కని
పూలను ధరియింపఁ గోరు పొలతులు గలరే
అక్కయ్యా,
తొలగించండిరాతిపూల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిడియర్ - కేన్ యు హెల్ప్ మి
ఓహ్ ! ఇయాం వెరీ వెరీ బిజీ :)
వేలకు వేలు గలరయా
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు, గలరే
వాలయము, మగండ్లు భువిన్
చాలుబడిగ కొప్పు నందు చక్కగ జొనుపన్ ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గౌలువెదజల్లు పూలను
రిప్లయితొలగించండివాలుగ కంటిధరియించు,వలదందురు ప్రో
యాలులు సుమముల్ ,పన్నా
పూలను ధరియింప గోరు పొలతులు గలరే
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండికాగితపు పూల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
రిప్లయితొలగించండివేళకు నింటికి వచ్చిన
శ్రీలొలికెడు పతిని గూడి శృంగారమునన్
దేలఁగఁ జూచుచు వాడినఁ
బూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే?
సహదేవుడు గారూ,
తొలగించండివాడిన పూల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిమేలగు జీవితమ్ముఁ గన, మీఱిన భక్తిని దైవపూజలన్
గాలముఁ బుచ్చఁగాను, ఘన కామనతోఁ జని, మ్రొక్కి, మర్లి, దే
వాలయమందునం, బితృవనాంతరమందునఁ బూచినట్టివౌ
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే?
[పితృవనము = శ్మశానము]
మధుసూదన్ గారూ,
తొలగించండిగుడిలో, వల్లకాడులో పూసిన పూల ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
'మర్లి' శబ్ద సాధుత్వంపై సందేహం! 'మరలు' అన్న క్రియాపదానికి 'మర్లు' అన్న రూపాంతరం లేదు. 'మరులు' అన్న విశేష్యానికి 'మర్లు' రూపాంతరం ఉంది (మర్లుతీగ).
పెడమర్లు అన్న ప్రయోగం నా మనస్సున మెదలి, ఆ విధంగా మర్లు అని ప్రయోగించాను.
తొలగించండితెలుఁగు నిఘంటువులోనూ...
మర్లు అ.క్రి.
మళ్లు, వెనుకఁ దిరుగు
సీ. అవల మాటాడువా రదిరిపాటున మర్లి యొఱపు వీక్షించి నివ్వెఱబడంగ.. కువల. 2.29
మ. కొలు వౌ డిగ్గున గద్దె డిగ్గు నని కేఁగు న్మర్లు గేహంబులోఁ, దలిరుం బాన్పున మర్లునం బొరలు... దశా. 7.71
జ:మర్లుఁబాము
అనియుఁ బ్రయోగములున్నవి గదా. పరిశీలించఁగలరు.
మధుసూదన్ గారూ,
తొలగించండినేను క్షుణ్ణంగా పరిశీలించకుండా వ్యాఖ్యానించినందుకు మన్నించండి. వివరణకు ధన్యవాదాలు.
మీ సహృదయతకు మనఃపూర్వక అభివాదములు...ధన్యవాదములు!
తొలగించండి
రిప్లయితొలగించండికాలపు పోకడన్ కనులు కాయలు గాయుచు తోయ జాక్షలున్
వేలకు వేలు నెక్కొనిరి వేండ్ర జిలేబులు లేమ లెల్లరున్
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు; లోకమునందు నుందురే
చాలికతో మగండ్లు సయి సన్నిధి జేరుచు కొప్పు లో నిడన్ ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీలుగ సూదులన్ జొనిపి భేషుగ దండల నల్లగా మమున్
రిప్లయితొలగించండిహేలగ గుండెలం దునను మేలము లాడుచు గొంతుకో యగా
మాలలు కొప్పులోన నిడిమాలిమి భర్తకటంచు ప్రీతిగన్
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందునుం దురే
అక్కయ్యా,
తొలగించండిమీ పుష్పవిలాప పూరణ బాగున్నది. అభినందనలు.
పుష్పవిలాప ప్రేరణతో మీపూరణ అందగించింది రాజేశ్వరి గారూ!
తొలగించండిiruvurikee dhanya vaadamulu
తొలగించండికట్టు బొట్టు లవియన చీరకట్టు
రిప్లయితొలగించండిబొట్టు పెట్టుటలే కాదు
అల్లిన వాల్జడ త్రాచది తాననగ
అతిశయోక్తి లేదు
తన జడ మరుల పాశమన పూలు
ధరింప నిష్టపడు ముగ్దలు
లోకము నందు నుందురే పూలు పడని
సుకుమార స్నిగ్దలు
రిప్లయితొలగించండిమాలతి చోదకు రాలయె!
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే!
వీలే లేదయ ! రయ్యన
ఓలా కారు నడపవలె నొప్పదు సుమ్మీ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండికొన్ని వృత్తులలో ఉన్న స్త్రీలు పూలు ధరించడం కుదరదు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2653
సమస్య :: *పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే ?*
పూలు పెట్టుకోవాలని ఇష్టపడే అమ్మాయిలు లోకంలో ఉంటారా ? అని అడగడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
సందర్భం :: ‘’కొమ్మ వంచి పూలు కోయాలని నేను అనుకొంటే ఆ పూలు *మా ప్రాణము తీతువా* అంటూ బావురు మన్నాయి జాలిగా ‘’ అని బాధపడుతూ కరుణశ్రీ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు *పుష్పవిలాపం* అనే కావ్యాన్ని వ్రాశారు. ఆ కావ్యంలోని పద్యాలను గాన గంధర్వుడైన ఘంటసాల గారు ఆర్ద్రతతో మనోహరంగా గానంచేశారు. కరుణ రస భరితమైన పుష్పవిలాపం లోని పద్యాలను మనసు పెట్టి వింటే పూలు పెట్టుకొవాలని ఇష్టపడే అమ్మాయిలు లోకంలో ఉంటారా ? అని ప్రశ్నించే సందర్భం.
పూలపయిన్ మదిన్ కరుణ పొంగగ, పాపయ శాస్త్రి గారు ‘’జం
ధ్యాల’’ రచించినారు కడు నార్ద్రత *’’పుష్పవిలాప’’* కావ్యమున్,
జాలి జనింప పద్యముల చక్కగ బాడెను ఘంటసాల ‘’యే
పూలను కోయవద్దనుచు , పుష్పము లేడ్చు నటంచు’’ ; విన్నచో
*పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే?*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (16-4-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండికరుణశ్రీ కలం, ఘంటసాల గళం పుష్పవిలాప కావ్యానికి శాశ్వతత్వాన్ని కూర్చాయి. ఆ ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సంగీత సాహిత్య సరస సమ్మేళనమైన పుష్పవిలాప స్మరణ రమణీయంగా ఉన్నదండీ రాజశేఖర్ గారూ! ధన్యవాదాలు.
తొలగించండిశ్రీ కంది శంకరయ్య గురువర్యులకు
తొలగించండిహృదయపూర్వక ప్రణామాలు.
సహృదయులు శ్రీ jjk బాపూజీ గారికి ప్రణామాలు. మీ స్పందన నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండీ.
తొలగించండిశ్రీ జంధ్యాల వారి గ్రంధాల నన్నింటినీ మా ఇంటిలో ఉంచాలని కోరుకొంటున్నానండీ. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం మీకు ఈ బ్లాగు లోనే తెలియజేసినానండీ. సలహా చెప్పగలరు.
మీ కోట రాజశేఖర్
'కరుణశ్రీ సాహిత్యం'అన్నపేరుతో ఇప్పటికి అయిదు భాగాలు వచ్చాయండి.అన్నీనేనే పరిష్కరించాను.విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్
తొలగించండివారు ప్రచురించారు.విశాలాంధ్ర బుక్ హౌస్,విజయవాడ నుండి తెప్పించుకోవచ్చు.నేను ఏడాదిగా అమెరికాలో మాఅబ్బాయి
వద్ద ఉంటున్నాను.ధన్యవాదాలండీ!
శ్రీ jjk బాపూజీ గారూ! ప్రణామాలండీ. మీరు మహాకవి జంధ్యాల వారి కుమారులని శ్రీ కంది శంకరయ్య గురువర్యులు మాటల సందర్భంలో తెలియజేసినారండీ. మీతో ఇలా ఉత్తర ప్రత్యుత్తరాను జరుపగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండీ. రెండు రోజుల్లో విజయవాడ వెళ్తానండీ. అప్పుడు మీ చేత పరిష్కరింపబడిన మీ పితృదేవుల (కరుణశ్రీ) సాహిత్యాన్ని తీసికొనగలనండీ. ధన్యవాదాలండీ. భవదీయుడు కోట రాజశేఖర్ నెల్లూరు.
తొలగించండిజిలేబీ గారికి:
రిప్లయితొలగించండినీలపు జీన్సులాగులను నీటుగ దీటుగ దాల్చుచుండగా
చీలిన బ్లౌసులన్ మురిసి చెన్నుగ మిన్నగ తీర్చుచుండగా
వీలుగ బాబ్డుహేరులను వేలల రంగుల మార్చుచుండగా
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఆధునిక వేషధారణను ప్రస్తావిస్తూ మీరు చెప్పిన పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండి
తొలగించండిమధ్యలో జిలేబి నెందుకు లాగారండీ జీపీయెస్ వారు :)
జిలేబి సలక్షణమైన పదహారణాల తమిళనాటి మడిసార మామి :)
జిలేబి
హమ్మ! కొంత కుతూహలం తీరినది...
తొలగించండిఉషా ఐయ్యర్?
మడితడి యదిమేనుకె యన
తొలగించండిగడబిడ లేదుగ జిలేబి గడుసరి బామ్మే!
వడిగొని నూతన రీతుల
యడడా! గడియించునుగద యనయము ధృతినే!
ఇంకా అణాలెక్కడ ఉన్నాయండీ! ఇది డాలర్ల కాలం!😊😊😊
*నడడా!
తొలగించండిశూలముచేతను తొడపై
రిప్లయితొలగించండిమాలిని కూర్చున్నరూపు మనసున మెదలన్
కాలాత్మునిక ర్పించిన
పూలను ధరియింప గోరు పొలతులు గలరే
సీతారామయ్య గారూ,
తొలగించండిశివార్పణమైన పూలను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు🙏🏽
తొలగించండిమేలగు తావుల నిడు పూ
రిప్లయితొలగించండిమాలలె సొబగులనొసంగు మగువలకు సదా!
వాలుజడలోన కృతకపు
పూలను ధరియింపఁగోరు పొలఁతులు గలరే?
విజయకుమార్ గారూ,
తొలగించండికృత్రిమ పూల ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మాలలు గట్టియు పూలనె
రిప్లయితొలగించండియేలా తరలింప జూతు వెందులకు సఖా?
యా లండను నగరములో
"పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే?"
జనార్దన రావు గారూ,
తొలగించండిపూమాలలను లండనుకు ఎగుమతి చేయడం వృధా అన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండికం
శూలికి కల్లలు జెప్పగ
గాలనమె యిడెను మొగలికి గౌరీపతియే!
మేలు విరులు వదిలి మొగలి
పూలను ధరియింపఁ గోరు పొలతులు గలరే!
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమొగలిపూల శాపాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాలము మారిన ద ను చు ను
రిప్లయితొలగించండిమేలము లాడు చు ను నేడు మెరిసె డు యువ తు ల్
ఫాలము న కుంకుమ యు నే
పూలను ధరి యింప గోరు పొ లతు లు గల రే!
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిఆధునిక యువతుల పోకడను తెలియజేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒక ఉద్యోగిని ఆవేదన
రిప్లయితొలగించండిపాలక మండలి రోయుచు
చాలిక నీ 'ఫైలు'చూడజాలంబనుచున్
వైళమ విసిరెడు రుసరుస....
పూలను ధరియింపఁగోరు పొలతులుఁగలరే!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆఫీసరు రుసరుసలను పూలుగా భావించారా? బాగుంది.
"చూడ జాలమటంచున్" అనండి.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిపాలన జేసెడు వేళల
చేలము గట్టగ తగదది చీకాకనుచున్
తూలెడు కురుచగు కురులను
పూలను ధరింపగోరు పొలతులు గలరే!
చేలము = చీర
తూలెడు = వదలివేయ బడిన( ముడువని)
సీతాదేవి గారూ,
తొలగించండికురుచమైన కురుల (పోనీటెయిల్) పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండి
రిప్లయితొలగించండికోలముఖమ్ములు లేవయ
గోలతనమ్ము కన రాదు గూగుల్ రమణుల్!
వాలు జడలులేవు! చెవుల
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిచెవిలో పూలు ధరించే పొలతులే కాదు మగవారూ లేరు. పూరణ బాగుంది. అభినందనలు.
మేలగు కృత్రిమ వస్తువు
రిప్లయితొలగించండిలీలోకము లోన జేయ నెంతురు;పూలన్
బోలిన కృతకపు ప్లాస్టిక్
"పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే?"
జనార్దన రావు గారూ,
తొలగించండిప్లాస్టిక్ పూలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హేలగ రమణులు నిడుపగు
రిప్లయితొలగించండిమేలగు కేశములను బరిమితమగు కొలతన్
వ్రేలాడించెడి నేడిక
పూలను ధరియింప గోరు పొలతులు గలరే?
బాపూజీ గారూ,
తొలగించండిపోనీటెయిల్ గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే"
రిప్లయితొలగించండికందము*
చేలన పూచెడు పూవుల
పోలిక జేయంగ సాటి పోలని ధరలో
మాలగ మారెడు ప్లాస్టిక్
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే
.................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిప్లాస్టిక్ పూలతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిధన్యవాదములు ఆర్యా
తొలగించండిగోదాదేవి మాలలను ధరించగా జూచిన విష్ణుచిత్తుని ఆంతర్యము
రిప్లయితొలగించండిగాలికి నూయలూగుచును గంతులు వేసెడి నంతరంగమున్
వేలుపు కంఠమాలికగ వేడ్కను గూరెడి భాగ్యమెంచుచున్
లాలన తోటమాలి తమ లాలస దీర్చగ వేచిచూచెడిన్
పూలను ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే!
బాలిక దిట్టిదోషమును బాపగ బాధ్యుడు రంగనాధుడే!
సీతాదేవి గారూ,
తొలగించండిఆముక్తమాల్యద ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో కొంత అన్వయదోషం ఉన్నట్టుంది.
గురువుగారూ! తోటమాలి తమ కోరిక తీరుస్తాడని యెదురు చూసే అన్న భావనతో వ్రాశాను. నప్పలేదా?
తొలగించండి'వేచి చూడగా' అనండి. సరిపోతుంది.
తొలగించండిఅలాగేనండీ సవరిస్తాను! 🙏🙏🙏
తొలగించండిబాలా! సందియ మీయది
రిప్లయితొలగించండిపూలను ధరియింపగోరు పొలతులు గలరే
పూలన నిష్టము కాదా?
మాలలుగా గ్రుచ్చ శిరపు మండన మౌనున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదం అర్థం కాలేదు. 'ఔనున్' అన్న ప్రయోగం సాధువు కాదు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిలీలగ బోఖెలు, దండల్
చాలగ సభలందు గొనెడు చానలు తురుమన్
కాలము చాలదు వికసిత
పూలను ధరియింప గోరు పొలతులు గలరే
డా. పిట్టా వారూ,
తొలగించండిబొకేలను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిచాలియు చాలనట్టి విడి చాకులు బాకుల వంటి కేశముల్
ఫాలము నంట సర్దుకొను ఫ్యాషనులుండగ బారులౌ జడల్
ఏల? నవేమొ పోలికల నెంచగ న్యూనత మాన్యతల్ గనన్
పూలు ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందు నుందురే!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
'జడల్ ఏల' అని విసంధిగా వ్రాయరాదు కదా!
డా.పిట్టా నుండి
తొలగించండిఆర్యా,3వపాదమును మార్చినా నిలా:
చాలునవేమొ పోలికల సాకున న్యూనత మాన్యతల్ గనన్
ధన్యవాదములు
వాలు జడల్ తొలంగె. జిగి పావడ పైట లదృశ్య మయ్యె, నే
రిప్లయితొలగించండిత్రాలకు కాటుకల్ దొలగె, రమ్య ముఖంబున కుంకుమంబు ని
ర్మూలిత మయ్యె, నివ్విధి స్వరూపము గోరుచునుండ మిత్రమా !
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే.
మద్దూరి రామమూర్తి.
మద్దూరి వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.
తొలగించండి'ఇవ్విధిన్'లో ద్రుతం లోపించింది. ఇక్కడ 'విధి' తద్భవమయింది. కనుక దాని తర్వాతి సంయుక్తాక్ష ప్రభావం ఉండదు.
తొలగించండి...కంది శంకరయ్య
శూలికి న ర్ధదేహ మయి శోభి లు పార్వతి బూజసేయు చు న్
రిప్లయితొలగించండితాలిమి గల్గు ప త్నులి ల ధార్మిక చింతన గల్గిసంప్రదాయ మౌ
పూల ధరిoప నిష్ట పడు ముగ్ధ లు ; లోకము నందు నుందు రే
పూల సువాసన ల్ వదలు పుణ్య వ తు ల్ వి ర హాలము న్గుచు న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి.
రెండవ పాదం లో ధార్మిక చింతన గల్గి భక్తి తో అని సవరణ చేయడ మైన ది
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
తొలగించండిఆలిని గోరునే పిఱుదు లంటెడు వాల్జెడ లేక యంచనన్
పేలును చుండ్రు వీడునని వేదన తీరునటంచు వాడి షాం
పూలని స్నానమాడ, జడ పొట్టిగ మారగ, లేక సౌరమున్
బూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీలుగ నింపుగ నిఁక మఱుఁ
రిప్లయితొలగించండిగే లేని గృహమ్మునందు నిత్తరి నెంచన్
బేలలయిన చీరలఁ ,దలు
పూలను, ధరియింపఁ గోరు పొలఁతులు గలరే
[తలుపు+ఊలను = తలుపూలను; ఊలన్ = పడగా]
మేలుగ శీర్ష మందున నమేయపు భక్తి ధరింతు రెల్లరుం
గాలుని పాదయుగ్మమునఁ గన్పడఁ బుష్పము లాశతో భువిన్
రాలిన వాసనాక్షయ పరాగ యుతమ్ములు వాడ మెండుగం
బూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా మొదటిది వైవిధ్యమైన విరుపుతో ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిశాలము చీరను కోఱక
రిప్లయితొలగించండికాలికి మట్టెలు ధరించకన్ కాంతలు మో
కాలి వరకె గౌనులునుచ
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే !
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధరించక' అన్నది కళ. కనుక "ధరించకయె' అనండి.
నాలుగు రోజుల బ్రతుకున
రిప్లయితొలగించండిచూలులు భర్తయు పదవులు చూడగ తానే
తాలిమి తలనే దువ్వరు
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే
Dr Varalakshmi
Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
👏👏👏
తొలగించండికాలము మారెనంచు నిల కాంతలు మార్చిరి వేషభాషలున్
రిప్లయితొలగించండిచేలములందు మార్పులు,చేతికి గాజులు భారమయ్యె గా
పాలము బోసిగుంచెదరు వాలుజడన్నది లేనివేళలో
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమాలిమి మగడే తెచ్చిన
పూలను ధరియింపగోరు పొలతులు; గలరే
మేలగు మల్లెల , జాజుల
మాలలు చేదను ముదితలు మంకుతనంబున్?
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మంకుతనమునన్" అనండి.
తొలగించండిమాలిమి మగడే తెచ్చిన
పూలను ధరియింపగోరు పొలతులు; గలరే
మేలగు మల్లెల , జాజుల
మాలలు చేదను ముదితలు మంకుతనమునన్!
🙏🙏🙏🙏
మేలగు జాతుల పువ్వులు
రిప్లయితొలగించండికాలమ్మేదయిన నిప్డు కనఁబడుచుండన్
పేలన యగు కాగితపున్
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కాగితపున్ + పూలు = కాగితపుం బూలు" అవుతుంది.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్కారములు. దయతో క్రింది పూరణలను పరిశీలించండి. శ్రమ కల్పిస్తున్నందులకు క్షమించండి.
1. శనివారం సమస్యకు పూరణ:
వనితా! మేనక! గాధిజు
మునికిన్ నేర్పంగనొప్పు మోహపు బుద్ధుల్
ననియెడి యింద్రుని పలుకుల నథ్యక్షించన్
వనికా యప్సరస జేరె వన్నెలొలుకుచున్
2. ఆదివారము నాటి సమస్యకు పూరణ:
చెంతను గల కోవెలలో
పంతము గూడుచు ననువగు పద్ధతి తోడన్
పంతుగ శివసతి గిరిజా
కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'బుద్ధుల్ + అనియెడి = బుద్ధు లనియెడి' అవుతుంది. నుగాగమం రాదు. మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. "బుద్ధుల్। చనుమనె నింద్రుం డప్పుడె" అందామా?
ప్రత్యుత్తరం
తొలగించండిగురువుగారికి ధన్యవాదములు
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిమేలుగ బరువది లేకను
వాలకమగు నరుణమ్మున వయ్యారముతో
క్రాలుకొనునట్టి మోదుగ
పూలను ధరియింపగోరు పొలతులు గలరే?
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేలగు మల్లెలు నవ్వగ?
రిప్లయితొలగించండిపూలను ధరియింప గోరు పొలతులు|”గలరే
గాలమె కాముక చేష్టకు
మూలము గుర్తించువనిత మురిపము కొరకే|”
2.కాలపు కౌగిలింతలకు గాలమె పువ్వులనవ్వులౌను|లో
కాలకు మేలుజేయ గల కాలము బంచెడి వెంకటేశుడే
మాలలు వేయుచుండ?”మనమానవు లెంచుట తప్పు గాదనిన్
పూలు ధరింపనిష్టపడు ముగ్ధలు” లోకమునందు నుందురే? {నుందురు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కాని రెండింటిలోను కొంత అన్వయదోషం ఉన్నది.
మొదటి పూరణలో పొలతులు - గలరే అన్న విరుపు సముచితంగా లేదు.
రెండవ పూరణలో ప్రశ్నార్థకం నిశ్చయార్థకం ఎలా అవుతుంది?
రిప్లయితొలగించండి.. .సమస్య
*"పూలను ధరియింపఁ గోరు పొలఁతులు*
*గలరే"*
సందర్భము: "ఈనాటి యువతులు సంప్రదాయాన్ని వదలివేసినారు. ఆధునిక యుగంలో గాజులు పూలు కుంకుమ అనాగరికము లైపోయినవి. ఇడిసిన స్యాతలు
(విచ్చలవిడి చేష్టలు లేదా బరితెగించిన పనులు) మితి మీరినవి. ఇవి మేలైనవా! ఇలాంటి పొలతులు గలరే!.. అంటే లేరు కదా!.."
అని ఒకానొక సంప్రదాయాభిమాని వాపోతున్నాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
"ఏలా! యిడిసిన స్యాతలు
మేలా!" యన సంప్రదాయమే పట్ట దయో!
మే లగు గాజులు కుంకుమ
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండినైష్టిక కుటుంబాలలో వ్యవహరించే భాషతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూలధరింప నిష్టపడు ముగ్ధలులోకమునందు నుండురే
రిప్లయితొలగించండిమాలలుగ్రుచ్చియున్మగువ మాడున నందుననలంకరించుగా
బూలను జాలమందిలను బ్రోగుగ జేసియు నమ్ముకొందురే
పూలల బంధమున్నరయ పూర్వసు భాషిణు లాకళింతురే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఉందురే'ను 'ఉండురే' అని టైపు చేశారు. 'మాడున' అంటేనే 'మాడునందు' అని అర్థం. 'మాడున నందున' అనడం సాధువు కాదు. 'మంది + ఇలను' అన్నపుడు యడాగమం వస్తుంది. 'బంధమున్ + అరయ = బంధము నరయ' అవుతుంది. ద్విత్వనకార ప్రయోగాన్ని వర్జించండి. 'పూర్వసుభాషిణులు' అంటే? 'పూర్వ సువాసినులు' పదమైతే విన్నాం.
నేటి శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండి"పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందు నుందురే"----
"ఏలొకొ సంపదల్ ?పదవు లిబ్బడిముబ్బడి గౌరవమ్ములున్
జాలిక సంతులేక మనజాల" నటంచును సంతు కోసమై
వేలుపుఁ గూర్చి నోచు తరి విశ్రతమౌ దృఢదీక్ష నుండగన్,
బూల? ధరింప నిష్టపడుముగ్ధలు లోకము నందు నుందురే?.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పూల' తరువాత ప్రశ్నార్థక మెందుకు?
అవునండి.టైపులో జరిగిన పొరపాటు
తొలగించండికృతజ్ఞతలు.
మేలుగ మల్లెలు దొరుకగ
రిప్లయితొలగించండివీలుగ మాలికలు చేసి, వెన్నలి నిండన్
దాలిచి, అక్కజమొందన్
పూలను ధరియింపఁ గోరు పొలతులు గలరే
శ్రీకాంత్ గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని సమస్య సమర్థంగా పరిష్కరించినట్టు లేదు.
పైన (ఈ కాలమున) అని రాయడం మరచానండి.. కృతజ్ఞతలు _()_
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిమేలుగ మల్లెలు దొరుకగ
తొలగించండివీలుగ మాలికలుచేసి, వెన్నలినిండన్
దాలిచియుండెడు పొలుపున
పూలను ధరియింపఁ గోరు పొలతులు గలరే
ఆలిని జేరనెంచి సుమ హారము గైకొనె ప్రేమమీరగన్
రిప్లయితొలగించండివేళయె మించ భాస్కరుని వేడికి తాళగ లేక నట్టిపూ
మాలయె వాడిపోవగను మానిని త్రోసెను వాడబాఱినన్
బూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందు నుందురే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమెరికా.
రిప్లయితొలగించండికొలంబసు కనిపెట్టిన
సోలోగా భూమి తిప్ప చూడు భూశ
క్తీ లీలగా !మరి నక్కడ
పూలను ధరయింప గోరు పొలతులు గలరే?
కోలంబసు అనండి :)
తొలగించండిశ్రీకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. 'శక్తీ' అని దీర్ఘాంతంగా వ్రాయరాదు. 'మరి యక్కడ' అనడం సాధువు.
పొడవగు జడలో తురిమెడు పూవులవియె
రిప్లయితొలగించండిజాజి మల్లెలు చేమంతి చంపకములు
కుసుమ పూలను ధరియింప గోరు పొలతు
లు గలరే యిల యరవింద లోచనాంగి.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరదాకి:
రిప్లయితొలగించండిపాలను వేటితో కలిపి పండుగ పూటను త్రాగినంతనే
బేలల వ్రేకటిన్ వెలయు పిల్లలు తెల్లగ తీరురందురో...
వేలల లక్షలందు ధర వింతగ జేసెడి కుంకుమమ్ములౌ
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే?
https://te.m.wikipedia.org/wiki/కుంకుమ_పువ్వు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.బల్లూరి ఉమాదేవి.
రిప్లయితొలగించండి1.కాలము మారెను గనుమా
వాలుగ జడవేసుకొనెడి వారలు భువిలో
గాలించకొందరె గలరు
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే.
2.ఈ లోకమునన్ కృత్రిమ
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే
మాలగ గుచ్చిన జడలో
వ్రేలాడు చునుండ మురియు వెలదుల గనుమా.
3.పూలివి వాసనజల్లుచు
నీలాల కురులనుచేరి నెమ్మిని చూపన్
గాలికి రాలిన వాడిన
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే.
4.పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే వాలుగ గట్టుచున్ సతము వారిజ నాభుని సన్నిధానమున్
పూలవి నిత్యమున్ యిలను పూజల నందగ కోరుచుండగా
నాలయమందునన్ గనుచు నర్చకు డిచ్చిన వద్దనందురే.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ నాల్గు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నాల్గవ పూరణలో 'నిత్యమున్ + ఇలను' అన్నపుడు యడాగమం రాదు. 'అని + అందురే' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
నేటి సమస్యకు మరో పూరణ
రిప్లయితొలగించండిచేలముఁ దెమ్మటంచు తన చేడియ కోరగ, భర్త యిత్తరిన్
వీలగు నెట్లు వచ్చు నెలవేతనమందునఁ గొందమంచనన్,
వాలుజడన్ సరుల్ గిరటువైచెను; గోపము నందు నల్గి యా
పూలు ధరింప నిష్టపడు ముగ్ధలు లోకము నందు నుందరే?.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅయ్యో పాపం!
తొలగించండిపూలను వాడుట తగదని
గాలికి పుప్పొడి దగిలిన గాఢపు తుమ్ముల్
పేలును మగనికి యనవిని
పూవులు ధరియింపగోరు పొలతులు గలరే?
గురువుగారి సవరణతో;
తొలగించండిఅయ్యో పాపం!
పూలను వాడుట తగదని
గాలికి పుప్పొడి దగిలిన గాఢపు తుమ్ముల్
పేలును మగనికి ననివిని
పూవులు ధరియింపగోరు పొలతులు గలరే?
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే
తొలగించండి
రిప్లయితొలగించండికోలాటపుగమ్మలతో
పూలను ధరియింపఁ గోరు పొలఁతులు గలరే
మాలావుగ పూబోడుల్
బేలలు నెలతుకలు సాఫ్టువేరులయిరయా!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చాలము మీరగా తలను చానలు బెట్టగ మల్లెలే కదా
రిప్లయితొలగించండిబేలలు మోదమున్ మదిని బేర్చిన మాలలు కాంతుకీయరే
చేలము మారెలే నరయ చేష్టలు చూడగ జుట్టునేగనం,
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే
Dr H Varalakshmi
Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గనన్ బూల ధరింప...' అనండి.
కాలము మారిపోయె కలి కాలములో, నొనరించు పూజ దే
రిప్లయితొలగించండివాలయమందునైన తమ భర్తలు భక్తిని వీనులందునన్
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే?
బేలలు చేలముల్ గొనుచు పెన్మిటికై కడు శ్రద్ధ చూపెడిన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిత సంఖ్య :-- 1185. 16--4--2018.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు. స.క.స.1043.
శీర్షిక :-- సమస్యా పూరణము.
శంకరాభరణం వారు ఇచ్చిన సమస్య :--
పూలను ధరియింప గోరు పొలతులు
గలరే.
పూరణము :-- కందపద్యము.
మేలగు స్వచ్ఛ సుమమ్ముల
నే లలనలు ముడుచుకొంద్రు నిత్యము
తలలో
గాలికి నెండకు వాడిన
పూలను ధరియింప గోరు పొలతులు
గలరే?
****************************
రిప్లయితొలగించండి.. .. సమస్య
*"పూల ధరింప నిష్టపడు ముగ్ధలు*
*లోకమునందు నుందురే"*
సందర్భము: సులభము.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
పూల మనస్సు లే కవియు
పూర్వము తెల్పడు పాప యాఖ్య స
చ్ఛీలుడె తెల్పె, వాని పరి
శీలన చేసిన చాలదొక్కొ!.. ఆ
పూలను గోసి దేవునికి
పూజ లొనర్చెడు భక్తు లుందురే!
పూల ధరింప నిష్టపడు
ముగ్ధలు లోకమునందు నుందురే!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
జలపుష్పము = మీనము
రిప్లయితొలగించండివీలుగ గంగలో నొదవి విచ్చుచు త్రుళ్ళుచు వేడ్కలందునన్
జాలరి జాలమందమరి చక్కగ చేరుచు వంటయింటిలో
మేలగు వంగదేశమున మెచ్చుచు వండగ భోజనమ్ములౌ
పూల ధరింప నిష్టపడు ముగ్ధలు లోకమునందు నుందురే?