గణపతి సతము నొసగుము గరిమ కరుణ,
గజముఖ
బగితి నెపుడును కనుల నిలుప
గలను,
కరివదన యిపుడె గనప వినతి
గనుమ, నగసుత నిడుము సుఖము నిరతము
గ, సువదన నిలుపుము ఘనతన కలన ద
గము, జఠర దివిషదుడ వినుము కణితము,
గజ వదన
దొరయ వలయు కరటి
రహి గ
గనమున
కెపుడు, మలక లపన కలిమి ని
గనిగ
మెరయ వలయు వసతిని, నను
విడు
గడ బరచుము
తొగ వలన, పొడిగుణ
యను
గతిని నను నడుప వలయు, సతము పలుక
గ వలయు సమబిధమెపుడు గయమున, సలి
గ నిడుము
నిచట నిరతముగ, తదుపరి మి
గత దివిజులను గొలుతును ఘన నుతులు, నె
గడగ తెలుచెద
నిను సుముఖుడ, రతన పు
గనిని గడచగ నెలమిని
ఘనతగ నిడు
గరిమ = గొప్ప ,
బగితి = భక్తి ,గనప = పెద్ద , కలన = జ్ఞాన ,దగము = దప్పిక,
జఠర =
ఉదరము, దివిషుదుడు = దేవుడు, కణితము =
మొర, దొరయు =
తాకు ,కరటి = మూర్ఖుడు
రహి= కీర్తి, ,మలక =
వక్రము, లపనము = తుండము, విడుగడబరచు=
విముక్తి చేయు , తొగ = బాధ,
, పొడిగుణ = న్యాయ గుణము ,అనుగతి =
అనుసరించు, సమబిధము
= పేరు, గయము = ఇల్లు , సలిగ =
ఆశ్రమము, నెగడు = ప్రకాశించు, తెలుచెద = వేడుకొనెద రతనపుగని =
సముద్రము ,కడచు = దాటు , ఎలమి
= ధర్యము
పద్యము చదువు విధానము : (గ)
ప్రతి పాదమునకు మొదటి అక్షరము . (గ ) తోటి ప్రతి పాదము చదువ వలెను , ఆఖరి పాదము చదివిన తర్వాత తిరిగి (జి) తోటి పారంభించి పదము చివరి అక్షరములు ఒక్కొక్కటి కలుపుటూ చదివన
(గణపతి ముదముగ నిడును కలిమి నెపుడు ) అన్న
వాక్యము బంధింప బడుట మరియొక విశేషము
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి