8, ఏప్రిల్ 2018, ఆదివారం

సమస్య - 2645 (చెడువానిన్ గొల్వ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్"
(లేదా...)
"చెడువానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే"

163 కామెంట్‌లు:

  1. ఇడుములె మిక్కిలి గలుగును

    చెడువానిన్ గొల్వ ,దీరు చిరకామ్యంబుల్

    కడు సన్మార్గుని గొలువగ

    నడుగిడు మరి వారి దరికి హ్లాదము గలుగున్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో'మరి'కి అన్వయం లేదు.

      తొలగించండి
    2. నడుగిడు వడి వారి దరికి హ్లాదము గలుగున్...

      సరిపోతుందా గురువు గారు...

      తొలగించండి
  2. ఎడతెగని గారవమునన్
    దడయక మైత్రీమధుర హృదయుడుగ నగుచున్
    మిడిమేల మెరుగక చరిం
    చెడువానిన్ గొల్వ దీరు చిరకామ్యంబుల్ .

    రిప్లయితొలగించండి
  3. సుడిగుండపు బ్రతుకులనిడు
    చెడువానిన్ గొల్వ ,దీరు చిరకామ్యంబుల్
    కడు సశ్చీలుని స్నేహము
    విడువక కడదాక నిలుపు విశ్వమునందున్!

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    అడిగెన్ బుత్రుని నంకపీఠిఁగొని ప్రహ్లాదాఖ్యు దైత్యేంద్రుడున్
    బుడుతా ! విద్యల నేర్చితో ? గురువులున్ బోధించిరో ? యంచు ., నా..
    తడు దెల్పెన్ పలు మర్మముల్ చదివితిన్ తండ్రీ ! ప్రపంచమ్ము గా...
    చెడువానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

    2. వాహ్! అంకపీఠి !

      లాప్ టాప్ - అంకపీఠి :)

      తన పుత్రుడు లాప్టాప్ లో ఏమి నేర్చినాడో చూచెను :)


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబి గారికి... ప్రభాకరశాస్త్రి వర్యులకు నమోనమః 🙏🙏ధన్యవాదాలు కూడా 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి

  5. కం.
    తడబడుచుండగ కర్ణుడు

    అడగక రాజ్యము హితుడిడ నంగనగరమున్

    నడిచెను రారాజు చెలిమి

    చెడువానిని గొల్వదీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కర్ణుం । డడుగక..." అనండి. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.

      తొలగించండి
  6. కందం

    ఇడుముల నుంటిని, షిర్డీ
    గడపైనను ద్రొక్క నాకు కాసులు కరువే!
    కడతేర్చుమన్న వరమి
    చ్చెడు వానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబు!

    రిప్లయితొలగించండి
  7. విడువక కార్యాలయమున
    పడిగాపులు గాచినంత పని జరుగదు - తా
    నెడనెడ సేవలు జేయుచు
    చెడువానిన్ గొల్వదీరు చిరు కార్యంబుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామన కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..నెడనెడ సేవింపగ మె। చ్చెడువానిన్.." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  8. కడగండ్లు మిగులు నిక్కము
    చెడు వానిన్ గొల్వ;-దీరు చిర కామ్యంబుల్
    ముడుపులుఁగట్టుచు మ్రొక్కగ
    నడరుచు శ్రీ వేంకటేశు నతి హర్షమునన్

    రిప్లయితొలగించండి

  9. కం.
    అడుగడుగున కష్టాలే

    చెడువానిన్ గొల్వ , దీరు చిరకామ్యంబుల్

    బడిలో పాఠము నేర్వగ,

    గుడిలో దైవము నర్చించ ,గోవుల మేపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరిపాదంలో గణదోషం. "...దైవమును గొలువ గోవుల మేపన్" అనండి.

      తొలగించండి
  10. కడు యిడుములలో మరి నిను
    విడువక వేదనలు బాపి పేరిమి తోడన్
    చెడు గుణములన్నియు హరిం
    చెడువానిన్ గొల్వ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కడు నిడుమలలో' అనండి.

      తొలగించండి

  11. కడగండ్లను దీర్చు మనుచు
    పడిపడి వేంకటతపతిని ప్రార్థింపదగున్
    విడచుచు నాథుని మనసా
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తపతిని'...? "వేంకటగిరిపతిఁ బ్రార్థింప..." అనండి.

      తొలగించండి
  12. అడుగకనే వరములిడుచు
    వడివడిగా బ్రోచుచుండి వాత్సల్యమునన్
    కడుతెఱగుల యెడదకు న
    చ్చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  13. ఉడురాడ్భూషణు నంతకాంతకుని నాద్యున్ ఫాలనేత్రున్ భవున్
    మృడు నవ్యక్తుని నష్టమూర్తి నభవున్ మిన్వాకదాల్పున్ శివున్
    జడదారిన్ వృషభధ్వజున్ బురహరున్ జండీశు భక్తాళిఁ బ్రో
    చెడువానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే.

    (జి.యన్.రెడ్డి 'పర్యాయపద నిఘంటువు'నకు జేజేలు!)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పర్యాయపద నిఘంటువు!
      ఆర్యులిడిరి వందనమ్ము లాయక్షతుడి
      న్నార్యానాథుడి పేర్లను
      వర్యముగా తెలుపగాను వడగండ్లవలెన్ :)

      జిలేబి

      తొలగించండి


    2. ఆర్యానాథుడి పేర్లను
      వర్యముగా తెలుపగాను వడగండ్లవలెన్
      పర్యాయపద నిఘంటువు
      లార్యులిడిరి వందనమ్ము లమ్మ జిలేబీ!

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      వందనం. పై పూరణకోసం కష్టపడిందేమీ లేదు. పర్యాయపదాలను వరుసగా పేర్చుకుంటూ పోయాను.

      తొలగించండి
    4. అద్భుతమైన పూరణ ఆచార్యా!! ఎత్తుగడే అద్భుతంగా ఉన్నది! నమశ్శతములు!🙏🙏🙏🙏

      తొలగించండి
  14. కడు భక్తి గొలిచి యఘములు
    కడతేర్చుమనుచును వేడ కారుణ్యముతో
    తడ జేయక వేగిర గా
    చెడువానిన్ గొల్వ దీరు చిరకామ్యంబుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తడ వొనరింపక వడి గా।చెడు..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. సూచనలకు ధన్యవాదాలు గురువు గారూ...

      తొలగించండి
  15. అదేమిటో... మాస్టారు క్లాసులో లేనప్పుడే నాకు పద్యాలు ఎక్కువగా వస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  16. సహదేవుని సహకారంతో ఒక పద్యం...
    పిడికెడు బూదియు జలమును
    పడవైచిన జాలు శివుడు భక్తుల బ్రోచున్
    ఇడుములు దీరగ వరమి
    చ్చెడు వానిన్ గొల్వదీరు చిరు కార్యంబుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామన కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    2. చిరకామ్యంబుల్ మారెను
      చిరుకార్యంబులుగ నరరె చింతయు చేయన్
      స్థిరముగ విభుడే యన్నిటి
      కి రాధ నంబయ్యెనమ్మ కిసలయమొందన్ :)


      జిలేబి

      తొలగించండి


  17. కడగండ్లన్ తొల గించు వాడు, ధరణిన్ కారుణ్య మొప్పారగన్
    పిడి గుండ్రాయిగ శేష శైల పతియై, భీతావహంబైన వా
    రెడలన్ మేలును గూర్చు వాడు, విభుడై రెక్కాడ శీర్షమ్ము గా
    చెడువానిన్, గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2645
    సమస్య :: *చెడు వానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే.*
    *త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం* అని పెద్దలు చెబుతారు. అలా కాకుండా చెడ్డ వానిని కొలవాలని అలాచేస్తే పూర్తిగా కోరికలు తీరుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: భగవంతుడు ఈ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయలకు కారణమైనవాడు. మన చెడు బుద్ధిని తొలగించేవాడు. ఉత్తమ గతుల నిచ్చేవాడు. భద్రములను చేకూర్చేవాడు. వరము లిచ్చేవాడు. అతనిని స్మరిస్తే మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు. కాబట్టి ఆ పరమేశ్వరుని కొలిస్తే పూర్తిగా కోరికలు తీరుతాయి అని గురువు శిష్యునికి ఉపదేశం చేసే సందర్భం.

    చెడు బుద్ధిన్ దొలగించువాని, జగమున్ సృష్టించి లీలన్ ధరిం
    చెడు వానిన్, లయకారకున్, సుగతులన్ చేకూర్చి భద్రమ్ము లి
    చ్చెడు వానిన్, పరమేశ్వరున్, వరదునిన్, చింతింపగా మోక్ష మి
    *చ్చెడు వానిన్ గొలువంగఁ, గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (8-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మనోహరమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతమైన ప్రాసతో అలరించారు అవధానిగారూ! అభినందనలు! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
    3. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
      సహృదయులు శ్రీమతి సీతాదేవి గారికి ప్రణామాలు.

      తొలగించండి
  19. భక్తుని కలువ భక్తి తానబ్బు, జ్ఞాని చేర
    జ్ఞానమది వచ్చు
    లౌక్యమెరుగని ఉత్తముని సంగతి, మనకు
    ఇడుముల కొనితెచ్చు
    కలిలో ధర్మ విలోమము, అది పయనించు
    దారులే వేరులే
    చెడు వానిని గొలువంగ గామ్యములు
    నక్షీణంబుగా దీరులే

    రిప్లయితొలగించండి
  20. ఇహలోక కామ్య సిద్ధికి దుష్ట వర్తనంబెన్నుకొనే దుశ్చరితుని మనోగతం:

    బిడియంబేటికి? నీతి యన్న సబబే? “పాపీ చిరాయుః” కదా
    నడతల్ నల్గురు మెచ్చనేటికి? మహాఽన్యాయంబొ న్యాయంబొ యీ
    పుడమిన్ నాకు ధనంబె ముఖ్యము సుమీ
    భోగార్హమౌ స్థాయిని
    చ్చెడు వానిన్ గొలువంగఁ, గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      దయచేసి 'అద్భుతః' అనకండి. 'అద్భుతం' అనండి.

      తొలగించండి
    3. మొదటి పాదం యతి సవరణతో. శ్రీ మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలతో.

      బిడియంబేటికి? నీతి యేటికిక? “పాపీ చేత్ చిరాయుః” కదా!
      నడతల్ నల్గురు మెచ్చనేటికి? మహాఽన్యాయంబొ న్యాయంబొ యీ
      పుడమిన్ నాకు ధనంబె ముఖ్యము సుమీ
      భోగార్హమౌ స్థాయిని
      చ్చెడు వానిన్ గొలువంగఁ, గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే.

      తొలగించండి
  21. కడబంతిని గూర్చొనితా
    నడుగక నేయన్నివచ్చు నదిఎట్లన్నన్
    మడి గట్టినమన వడ్డిం
    చెడువానిన్ గొల్వ దీరు చిరుకార్యంబుల్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణ మూర్తి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  22. ఇడుముల పాలౌట తధ్యము
    చెడు వానిన్ గొల్వఁ , దీరు చిర కామ్యంబుల్
    పడిగాపులు బడి కొలిచిన
    గుడిముంగిట సాగిల బడిన కోరిక దీర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, నాల్గవ పాదాలలో గణదోషం. ఒకే వాక్యంలో 'తీరు కామ్యంబుల్, కోరిక దీర్చున్' అనడం పునరుక్తి. "పాలౌట నిజము... సాగిల బడ గోవిందునకున్" అనండి.

      తొలగించండి
    2. ఇడుముల పాలౌట నిజము
      చెడు వానిన్ గొల్వఁ , దీరు చిర కామ్యంబుల్
      పడిగాపులు బడి కొలిచిన
      గుడి ముంగిట సాగిల బడ గోవిందునకున్

      తొలగించండి
  23. బడుగుల బ్రతుకుల నీడ్చుచు
    నిడుముల నొందుట మరేల! నిదిగో వినుమా!
    తడయకఁగోరిన వరమి
    చ్చెడువానిన్ గొల్వఁ దీరు చిరుకామ్యంబుల్.

    రిప్లయితొలగించండి
  24. అడుగో కలియుగ దైవమె
    యడిగిన వారల సతతము నాదుకొనుచునే
    కడువేడుకగా దీవిం
    "చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్"

    రిప్లయితొలగించండి
  25. జడదారి భక్తజనులకు
    కడువేగమె దీవెనలను కలిగించునుగా
    అడిగిన తోడను దీవిం
    చెడువానిన్ గొల్వ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  26. గడబిడ యేమున్నది? మన
    కడగండ్లను దీర్చువాని కాముని తండ్రిన్
    కడలిశయను భక్తుల బ్రో
    చెడువానిన్ గొల్వ దీరు చిరకామ్యంబుల్!

    రిప్లయితొలగించండి
  27. చెడు స హ వాసము మానియు
    విడు వక సజ్జ నుల మైత్రి వెన్ను ని మదిలో
    కడు గొని తలచoగను గా
    చెడు వానిన్ గొల్వ్గ తీరు చిరు కామ్య oబుల్

    రిప్లయితొలగించండి
  28. జడదారి భక్తజనులకు
    కడువేగమె దీవెనలను కలిగించునుగా
    అడిగిన తోడను దీవిం
    చెడువానిన్ గొల్వ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  29. 'కురస కురస అడవిలోన ...కురిసె గాంధారివాన" - నచ్చిన చందస్సు లో పద్యం పూర్తి చేయగలరు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. కురస కురస అడవిలోన ...కురిసె గాంధారివాన
      మెరిసె మెరిసె పెదవిపైన మెరుపు లే వేడిగాను
      నలసె సొలసె వలపులేను నతివ లో చక్కగాను
      కలిసి మెలిసి తిరిగిరయ్య కవన మై వెల్గిరయ్య

      జిలేబి

      తొలగించండి
    2. చాలాబాగుంది సర్ .ధన్యవాదములు

      తొలగించండి
  30. గురువు గారికి నమస్సులు
    ఆడిగినవన్ని యు దీరవు
    చెడువానిని గొల్వ, దీరు చిరుకామ్యoబుల్
    కడుశివభక్తులకున్ విదు
    రుడు మనసుదియె నట వినునరుడసూక్తులన్

    రిప్లయితొలగించండి
  31. ఇడుగిడుగో శ్రీరాముడు
    దడబాటన్నది యొకింత దరిజేర్చకనే
    బడుగుల దురితమ్ముల ద్రుం
    "చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్"

    రిప్లయితొలగించండి
  32. కందం
    విడువ డధికారి కొలువున్!
    బడవేయుచు టీ కి కొంత బంట్రోతునకున్
    గడప ననవరతమున్ గా
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్!

    రిప్లయితొలగించండి

  33. సందర్భము- శ్రీకృష్ణుడి ని కలువ వచ్చిన దుర్యోధనుడి, అర్జునుడి మదిని ఆలోచనలు!


    "దడిచెన్నిక్కము నన్గనన్నరుడు! తధ్యంబౌత నన్జూడు కృ
    ష్ణుడు!మున్ముందుగ వచ్చినాడ గదనే!శోభిల్లు సైన్యంబు నే
    నడుగన్నిచ్చును" ;"కొంగుబంగరితడే! నా సారధీతండు,కా
    చెడువానిన్గొలువంగ గామ్యములు నక్షీణంబుగా దీరులే!"

    జిలేబి


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      అర్జున సుయోధనుల ఆత్మగతంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సారథి + ఈతండు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "నా సారథిం జేతు..." ఆనండి.

      తొలగించండి
  34. ఇడి వాగ్దానమ్ముల కడు
    వడిగ ప్రజాధనము దోచు పలువల కంటెన్
    పుడమిని జనులను బ్రేమిం
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  35. కం.
    నుడివెను భగవద్గీతను

    నడిరణరంగమున పార్థునకు బలమివ్వన్

    వడిగా రథమును నడిపిం

    చెడు వానిన్ గొల్వ దీరు చిర కామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  36. పూర్వ జన్మపు సుకృతముల్వరలు కతన
    బయట పడితిని నాస్పిట ల్బారి నుండి
    కాలు డీయగ బ్రాణముల్గనిక రించి
    చూడ గలిగితి జగమును సుజను లార!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      పెక్కుదినాల తర్వాత మీ పేరును బ్లాగులో చూడడం ఆనందాన్ని కలిగించింది. మీ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?

      తొలగించండి
  37. చెడుపను లెప్పుడు జేయును
    చెడువానిన్గొల్వ,దీరుచిరకామ్యంబుల్
    విడువక శివునిన్వేడిన
    నిడుములనేజేరనీయడెపుడున్నికయున్

    రిప్లయితొలగించండి
  38. ఇడుములు బడినను జడవని
    కడిమిని కలిగించి మమ్ము కలకాలమ్మున్
    పొడగాంచుమని వరములి
    చ్చెడు వానిన్ గొల్వ దీరు చిరకామ్యంబుల్!!!

    రిప్లయితొలగించండి
  39. అడరుచుఁ గోరుచుఁ గనులం
    బడఁ జిత్తమ్మునఁ దిరుగఁగ మధురా పురిలో
    పడతుల హృదయమ్ములు దోఁ
    చెడువానిం గొల్వఁ దీరు చిరకామ్యంబుల్


    కడు దైన్యంబగు కాపురమ్ము ఋణ సంఘాతార్తి యయ్యుం గుచే
    లుఁడు కృష్ణుం గని యీయఁ దా పృథుకముల్ రోచిష్ణుఁ డిచ్చెన్ సిరుల్
    బిడియం బెల్లను వీడి దిక్కని మదిన్ వేడంగ భక్తాలిఁ గా
    చెడువానిం గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  40. ఇడుములలో బడిపోదురు
    చెడువానిన్ గొల్వ, దీరు చిరకామ్యంబుల్
    కడువేడుకతో సతతము
    తడవులనిడుపని గొలిచిన తద్దయు భక్తిన్!!!

    తడవులనిడుపడు = విష్ణువు

    రిప్లయితొలగించండి
  41. వడిగా దోచు ప్రజాధనమ్మును సదా వ్యర్థున్ సునేతంచు ముం
    చెడువానిన్ గొలువంగఁ, గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే
    కడు నిస్వార్థముతోచరించుచు ప్రజా కార్యమ్మె ముఖ్యమ్ముగా(లోకమ్ముగా)
    పుడమిన్ వర్తిలు వాని సేవలను సంపూర్ణమ్ముగా చేసినన్

    రిప్లయితొలగించండి
  42. కడు పుణ్యాత్ములఁ కామధేనువయి భక్తశ్రేణి స్వర్శాఖయై
    యిడుముల్ మ్రాంపెడు వేంకటేశ్వరుడునై హృత్పీఠి సర్వాత్ముడై
    వడి దుష్టాత్ములఁ రామబాణమయి సర్వ ప్రాణి లోకంబు గా
    చెడువానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే

    స్వ: + శాఖ = స్వర్శాఖ ( కల్పవృక్షము )
    సంధి సరియైనదేనా గురువుగారూ ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      సంధి విషయంలో నాకు అంతగా సంస్కృత జ్ఞానం లేదు. అక్కడ "కల్పాగమై" అంటే ?

      తొలగించండి
    2. సంపత్ కుమార్ శాస్త్రి గారు నమస్సులు. నాకు తెలిసిన దిది:
      స్వః + శాఖి = స్వశ్శాఖి; నమశ్శివాయ వలె.
      శాఖి యనిన వృక్షము, శాఖ యనిన కొమ్మ.

      తొలగించండి
    3. సంపత్ కుమార్ శాస్త్రి గారు నమస్సులు. నాకు తెలిసిన దిది:
      స్వః + శాఖి = స్వశ్శాఖి; నమశ్శివాయ వలె.
      శాఖి యనిన వృక్షము, శాఖ యనిన కొమ్మ.

      స్వః+వాయుః+ అగ్ని =స్వర్వాయురగ్ని.
      స్వః పదము రేఫాంతావ్యయము.
      అవ్యయ పుటకారము మీది విసర్గకు మృదు వ్యంజనములు (“ర” తక్క) కాని యచ్చులు కాని పరమైన విసర్గ “ర్” మారును.

      తొలగించండి
    4. గురువుగారికి ధన్యవాదములు.
      మీ సూచన స్వీకరిస్తాను గురువర్యా.

      గురుతుల్యులు శ్రీపోచిరాజు కామేశ్వరరావుగారికి నమస్సులు.
      సందేహ నివృత్తి చేసినందులకు ధన్యోస్మి.
      భక్తశ్రేణి స్వశ్శాఖియై అంటే సరిపోతుందనుకుంటాను.

      _/\_ .

      తొలగించండి
    5. సహృదయము తో గ్రహించినందులకు ధన్యవాదములు.
      మ్రాంపెడు? మాన్పెడు నకు ముద్రణ దోషమనుకుంటాను.

      తొలగించండి
  43. రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "గుణములు" అన్న పదాన్ని తొలగిస్తే సరి!

      తొలగించండి
    2. స వ రిం చి న ప ద్య ము

      క్రిం ద ను న్న ది

      తొలగించండి
  44. మిత్రులందఱకు నమస్సులు!

    ఇడుముల్ దీర్చియు, నిత్యసౌఖ్యమిడియున్, హింసాది దుష్కృత్యముల్
    విడిపోవంగనుఁజేసి, మోహమును నిర్వీర్యమ్ముగా మార్చియున్,
    నడువం జేసియు సర్వధర్మముల, సన్మాన్యత్వ సంసిద్ధిఁ గూ
    ర్చెడువానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      సద్గురువును ప్రస్తావించినట్టున్నారు! మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ఇంకెవరండీ...దైవమే! ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!

      తొలగించండి
  45. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,,



    చెడుపున్ జేయకు మెప్పు డన్యులకు | సౌశీల్య ప్రదుండై - రహిం

    చెడు వానిన్ గొలువంగ , గామ్యములు నక్షీణంబుగా దీరు || లే

    చెడు - షడ్వైరి సమూహమున్ సతము ప్రక్షీణంబు గావించి , ప్రో

    చెడు సర్వేశ్వరు నామ మంత్రము నుపాసింపన్ శుభంబౌ సఖా !


    { కొలువంగ = సేవింప ; లేచెడు = విజృంభించు ; ఉపాసించన్ =

    పారాయణము సేయగా }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా బాగున్నదండీ మీ యమక పూరణము! అభినందనలు!

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి


      మ హా క వి శే ఖ రు ల గు శ్రీ గుండు మ ధు సూ ద న్ గా రి కి


      ధ న్య వా ద ము లు , ప ద న మ స్కృ తు లు

      తొలగించండి
    3. గురుమూర్తి ఆచారి గారూ,
      సవరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  46. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గుడిలో గంగాధరునకు
    కడు భక్తిని సేవజేసి గణనీయముగా
    యెడదను తెలచుచు నా కా
    చెడు వానిన్ గొల్వ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గణనీయముగా । నెడదను...' అనండి.

      తొలగించండి
  47. పుడమిని సతిసావిత్రికి
    మడమను దిప్పక నొసగెను మాంగల్యమునే
    నుడివెద నే ప్రాణము దీ
    "చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్"

    రిప్లయితొలగించండి
  48. వడివడి రాముని దలచుచు
    జడువకనే రామదాసు జైలున గడుపన్
    యిడుములు దుడుపని భావిం
    చెడువానిని్ గొల్వ దీరుచిరుకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గడుపన్ + ఇడుమలు' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  49. డా.పిట్టాసత్యనారాయణ
    పడి పడి నయీము గలిసియు
    మడి మాన్యములందుకొన్న మాన్యులు లేరే?
    వడి నడచియు పడిపోగల
    చెడువానిం గొల్వ దీరు చిరు కామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  50. డా.పిట్టాసత్యనారాయణ
    బడుగుల్ భార్యల వెంట నంటి జనుచో భాగ్యంబు రాదంచు వే
    లడుగుల్ ముందుకు వేసి యోగుల కథాలాపంబులన్ జేయుచున్
    మడి మాన్యంబుల దోచి బాధ గురువై మాటేసి లోకాల ముం
    చెడు వానిం గొలువంగ గామ్యములు నక్షీణంబుగా దీరులే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. డాపిట్టానుండి
      ఆర్యా,ధన్యవాదములు. నారెండవ స.పూ.త్రిశతి కృతి స్వీకరణ గూర్చి మీ సందేశము వ్రాసి పంప గలరు.

      తొలగించండి
  51. విడువక సతతము మదిలో
    గుడికట్టి తలచిన చాలు కుడుముల ప్రియునిన్
    గడు ప్రీతిన్, గోరికదీ
    ర్చెడు వానిన్ గొల్వ దీరు చిరుకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  52. ఇడుముల్ దీర్చున దీశుడే జగతి లోకేశుండువాడొక్కడే
    గుడిలోనుండడు వాడు గాంచగ సదా గుండెన్ గదా యుండెడిన్
    జడధారిన్ శశి భూషణున్ భవుని యాచండీశుఁ భక్తాళి బ్రో
    చెడువానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగా దీరులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


  53. పెడతలలవాని శత్రుని
    కడుభక్తిని మదినిగొల్చు కపివరు స్వామిన్
    విడువక హరుడే మది దల
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్

    రిప్లయితొలగించండి
  54. కడివెడు కష్టములున్నను
    జడువక నియమముల తోడ సాధన చేతన్
    విడువక నా గోవుల గా
    "చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్"

    రిప్లయితొలగించండి
  55. (2)
    కడలిన్ మత్స్యము ద్రుంచె ముష్టి దళిత గ్రావున్ హయగ్రీవునిన్
    దొడి నా కూర్మము మోసె మంథరగిరిన్ దోరంపు స్త్యేనమ్ముకై
    వెడరూపాన వరాహమూర్తి తునిమెన్ వృత్రున్ హిరణ్యాక్షునిన్
    బుడుతన్ గావఁగ నా హిరణ్యకశిపున్ నూర్చెన్ నృసింహుండునై
    వడుగై త్రొక్కె బలిన్ ద్రివిక్రమగతిన్ బాతాళలోకానికిన్
    విడకే యిర్వదియొక్కమాఱు నృపులన్ వ్రీల్చెన్ భృగూత్తంసుఁడై
    గడపెన్ రావణు మూర్ఖ కాముకునిఁ బ్రాఘాతాన శ్రీరాముఁడై
    చెడుగుం గూర్చెడి దుష్టరాక్షసుల శిక్షించెన్ దగం గృష్ణుఁడై
    పుడమిన్ ధర్మము నిల్పఁగాను వెలసెన్ బుద్ధాఖ్య సర్వజ్ఞుఁడై
    సడివోవన్ దెగటార్చెఁ గల్కియయి దుష్టమ్లేచ్ఛపృథ్వీశులన్
    వడి నీ రీతిని లోకమందుఁ జెడుగుల్ వాయంగఁ బోద్రోలి, కా
    చెడువానిం గొలువంగఁ, గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహాఁ!!
      అద్భుతం...పరమాద్భుతం...నభూతో!..
      సర్వ భాగవతసారాన్నీ..మత్తేభారోహణ చేయించిన మధుసూదనా!
      వేనోళ్ళ పొగడినా తనివి తీరదే!!!
      సాష్టాంగ ప్రణామాలందుకోండి కవీంద్రా!!
      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

      తొలగించండి
    2. ధన్యవాదములండీ బాబు గారూ! మీ యభిమానమునకుఁ గడుంగడు కృతజ్ఞుఁడను!

      తొలగించండి


    3. సిరులొల్కంగ తెలుంగు చక్కదనమున్ సింగారమున్నొల్కెనే!
      విరిసెన్ శ్రీమధుసూధనార్య! పదముల్ విభ్రాజ మానమ్ముగా
      పరమాత్ముండు దశావతారముగ మీపద్యంబు లోనన్, భళా
      పరమానందము! ధన్యవాదములయా, భాసించె శ్రేష్టమ్ముగా!


      జిలేబి

      తొలగించండి
    4. ధన్యవాదములండీ జిలేబీ గారూ! మీ యభిమానమునకుఁ గడుంగడు కృతజ్ఞుఁడను!

      తొలగించండి
    5. మధుసూదన్ గారూ,
      అత్యద్భుతమైన పూరణ. భగవంతుని దశావతారలను కళ్ళముందుంచారు. అభినందనలు.
      "తెగటార్చుఁ గల్కి యయి..." అనాలి. కల్కి రానున్నాడు కదా?

      తొలగించండి
    6. మాన్యులు శ్రీ మద్దూరి రామమూర్తి గారు నన్నుఁగూర్చి వ్రాసిన పద్యము:

      ఆర్యా ! నమోనమః.

      ధుర్యత గ్రంథ వార్నిధిని దోయిలి బట్టు నగస్త్యుడీవు! మా
      ధుర్య మనోజ్ఞ పద్యముల ధూర్జటికిన్ సరిజోదువౌదు వీ!
      వర్యముడై వెలింగితివి! యబ్బురమయ్యె కవీశ! నీవు వా
      క్సూర్యుడవయ్య! గుండు మధుసూదన వర్య ! నమస్సుమాంజలుల్.


      -మద్దూరి రామమూర్తి.

      తొలగించండి
    7. అత్యద్భుతము కవివర్యా! నమశ్శతములు! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    8. ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!

      నిజానికి ఇప్పుడు కలియుగమే గదా! భాగవతంలో కలియుగం రాకమునుపు, భవిష్యత్కాలాన్ని ఊహించి చెప్పడం జరిగింది! అందుకనే నేను భూతకాలంలో రాశాను. అంతే కాకుండా అన్ని యవతారాలకూ భూతకాలంలోనే... త్రుంచె, మోసె, తునిమె, నూర్చె, త్రొక్కె, వ్రీల్చె, కడపె, శిక్షించె, వెలసె, తెగటార్చె... అని వారి వారి మహిమలను వర్ణించడం జరిగింది. కాబట్టి తెగటార్చు కన్న తెగటార్చె అంటేనే బాగుంటుందని నా భావన.

      మీ మెప్పులకు కడుంగడు కృతజ్ఞుఁడను!

      తొలగించండి
    9. మాన్యులు శంకరయ్య గారి చరవాణి సంభాషణానంతరం "తెగటార్చుఁ గల్కి యయి..." అనే సవరణను స్వీకరిస్తున్నాను. అలాగే, ద్వితీయ పాదాంతంలో "స్త్యేనమ్ముకై" అను దానిని, "స్త్యేనానికై" అని సవరించుకొంటున్నాను. అట్లే, రామావతార పంక్తిలో "కడపె" అని పరుషాదిగా సవరిస్తున్నాను.

      మాన్యులు శంకరయ్య గారికి ధన్యవాదములు!

      తొలగించండి
  56. అడిగిన వెంటనె వర మొస
    గెడు దైవంబున కనయము కేల్మోడ్చంగన్
    తడయక దయతో దీవిం
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్.


    2.పడతియు వేడగ వలువలు
    తడయక కృష్ణుండొసంగె ధర్మజు సతికిన్
    విడువక సతము హరిని కొలి
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్.

    3.కడివెడు దుఃఖంబున్నను
    నిడుములు విడువక మనుజుల నిల బాధింపన్
    విడువక మును లెప్పుడు కొలి
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్.

    4.ఇడుగో హరియంచు సతము
    కడుభక్తిని చూపుచుండ కరుణామయుడై
    వడిగా నసురుని తలద్రుం
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్.

    5.విడువక నెపుడు హరిని కొలి
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్
    తడయక సేవింప సతము
    వడిగా బాయును నిడుములు వసుమతి యందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. మత్తేభవిక్రీడితము

      గుడిదర్శించఁగఁ బిల్వఁడెప్పుడునుఁ దాఁ గోరండుఁ బెన్గోర్కెలన్
      పెడితే పుష్ప ఫలాది పత్ర జల నైవేద్యాదు లేవైనఁ దాఁ
      గడు మోదమ్మున స్వీకరించి మనపై గారుణ్యమున్ జూప (వ)మె
      చ్చెడు వానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే

      తొలగించండి
    3. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెడితే' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
    4. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

      మత్తేభవిక్రీడితము

      గుడిదర్శింపఁగఁ బిల్వఁడెప్పుడునుఁ దాఁ గోరండుఁ బెన్గోర్కెలన్
      బుడమిన్ పుష్ప ఫలాది పత్ర జలముల్ ముందుంచ నేదైనఁ దాఁ
      గడు మోదమ్మున స్వీకరించి మనపై గారుణ్యమున్ జూప (వ)మె
      చ్చెడు వానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే

      తొలగించండి
  57. కందము :
    కడుదీన కష్టము గలుగ
    చెడురోజులు తీరు పూజచేయగ నెంచన్
    విడువకు హరి పదముల, గా
    చెడువానిన్ గొల్వఁ దీరు చిరకామ్యంబుల్


    Dr Varalakshmi
    Bangalore

    రిప్లయితొలగించండి

  58. .. .సమస్య
    *"చెడువానిన్ గొలువంగఁ గామ్యములు*
    *నక్షీణంబుగాఁ దీరులే"*

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    తడబా టన్నది లేక జీవితమునన్
    ధర్మంబునే భక్తి నె
    ప్పు డనుష్ఠింతు నటంచు చూపిన మహా
    పుణ్యావతారుండు రా
    ముడు.. నా స్వామి" యటంచు నమ్మి మన
    ముప్పొంగన్ తదీయాంఘ్రిఁ గొ
    ల్చెడు వానిన్ గొలువంగఁ గామ్యములు
    నక్షీణంబుగాఁ దీరులే!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  59. అడుగో! చూడుడు! కల్వకుంటలడు సయ్యాటాలు సంధించుచున్
    బడుగుల్ బాధల ద్రోలెదంచు శతముల్ వాగ్దానముల్ జేయుచున్
    కడుపుల్ నిండుగ కల్లు బోయుచును మా కష్టాలు వోట్లందు దీ
    ర్చెడువానిన్ గొలువంగఁ గామ్యములు నక్షీణంబుగాఁ దీరులే

    రిప్లయితొలగించండి