18, ఏప్రిల్ 2018, బుధవారం

సమస్య - 2654 (రంభం గూడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్"
(లేదా...)
"రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై"
(బాబు దేవదాసు గారికి ధన్యవాదాలతో...)

129 కామెంట్‌లు:

  1. దంభముతో లంకేశుడు
    గంభీరపు తప్పు జేసి గడగడలాడెన్
    సంభోగము పాపమనెడు
    రంభను గూడి; సుతను గనె రాజర్షి వెసన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రంభను కూడినవాడు లంకేశుడు; పొందిన వాడు రాజర్షి; శకుంతల తల్లి మేనక. తండ్రి రాజర్షి విశ్వామిత్రుడు.
      లంకేశుడు రావణుడు.
      రావణుడు నలకూబరుని భార్య రంభను వలదంటున్నా కూడి శాపగ్రస్తుడౌతాడు...

      తొలగించండి
    2. పైన సూచించిన విషయములు శంకరాభరణ వ్హాట్సప్ సమూహములో శ్రీ గౌరీభట్ల బాలముకుందశర్మగారి సందేహములు తీర్చుట కొరకు. ఇచ్చట ప్రచురించినందులకు క్షంతవ్యుడను.

      తొలగించండి

    3. జీపీయెస్ వారు ఇవ్వాళ ఐ ఐ టీ ఎంట్రెన్స్ ఎక్జామ్ టెస్ట్ పేపరు పెట్టినట్టున్నారు :)


      జిలేబి

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. శుంభద్భాగ్యోదయమై
    బంభర విన్యాస కలిత వర సుర వనితన్
    రంభను నాట్యకళా సం
    రంభనుగూడి సుతనుఁగనె రాజర్షి వెసన్

    రిప్లయితొలగించండి

  3. A marriage of happiness :)


    కంభారిని గట్టిరి సం
    రంభము మొదలయ్యె పెండ్లి రయ్యన ముగిసెన్
    శంభము గూర్చెడు సతి,యా
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకూ పెళ్ళికొడుకు పేరు రాజర్షి అనుకొమ్మంటారా?

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    రంభోరుద్వయచాలనైకనిపుణన్ రాగాన్వితన్ మేనకన్
    గంభీరోగ్రతపఃప్రభాకలితుడౌ గాధేయుడున్ పొందగా
    నంభోజాంకురదీప్తి పుత్రి జననంబందెన్ , నటచ్ఛ్రీశుభా...
    రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై !!


    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ హృద్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. దేవకార్యము ముగిసెను తాపసి తపము
    భంగపడెను
    మేనకనదె పిలిపించగ సురపతి
    తానాత్ర పడెను
    తోడ్కొన ప్రియసఖి రాగ తావెడలె
    రంభను గూడి
    సుతను గనె రాజర్షి వెసన్ తన్నంటిన
    మోహము వీడి

    రిప్లయితొలగించండి
  6. రంభోరువులు చలించగ
    జృంభించి నటనము లాడి చేరమనసులో
    కుంభిక మేనకఁ బ్రేమా
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేర సురసభా। కుంభిక..' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  7. జంభారి పనుప మేనక
    జృంభితయై తపము జెఱుప జేరగ నా శ్రీ
    శుంభచ్చృంగార కళా
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్

    రిప్లయితొలగించండి
  8. జంభారాతి మహేంద్రుడంపిన సుధాచంద్రాననన్ ,దీప్తవి
    స్రంభోద్దీపితదేహితన్ ,సరసతాసంవాదసంవాసితన్ ,
    శుంభద్వేగిని ,మేనకన్ ,సురుచిరన్ ,శోభాంచితోల్లాససం
    రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'దేహితన్' శబ్ద సాధుత్వంపై సందేహం. "దేహినిన్" అని ఉండాలనుకుంటాను. అలాగే "శుంభద్వేగిని" విషయంలో.. 'వేగిని' అంటే వేగం గల నది. అక్కడ "శుంభద్వేణిని/ శుంభద్వేగను (మునిని చేరాలనే తొందర గలది)" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  9. బంభరము వలెరా వణుడే
    రంభను గూడి , సుతను గనె రాజర్షి వెసన్
    కుంభిని పైనను మునులట
    సంభవ మనుకొని లావు సముచిత మనుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "బంభరమై రావణుడే" అనండి. కాని విరుపుతో "రంభను కూడి" అని అసమాపక క్రియారూపం అన్వయించదు కదా! చివరి పాదంలోను గణదోషం. "సంభవ మనుకొనియు లావు..." అనండి.

      తొలగించండి
  10. జృంభించెద రేరిని గని?;
    స్తంభింపగ మేనక మఱి తన యందముతో
    గుంభన మన్నది యెఱుగక;
    "రంభను ; గూడి సుతను గనె రాజర్షి వెసన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2654
    సమస్య :: *రంభన్ గూడి శకుంతలన్ గనియె నా రాజర్షి సంరంభియై.*
    రాజర్షియైన విశ్వామిత్రుడు మేనకతో కలసి శకుంతలను కన్నాడు. ఐతే అలా చెప్పకుండా రంభతో కలసి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: వసిష్ఠుని వలె తాను కూడా బ్రహ్మర్షి పదవిని పొందాలి అని నిశ్చయించుకొనిన విశ్వామిత్రుడు ఘోరమైన తపోదీక్షలో ఉండగా, లోకాలన్నీ తపిస్తూ ఉంటే, అతని తపస్సును భగ్నం చేయదలచిన ఇంద్రుడు మేనక అనే అప్సరసను విశ్వామిత్రుని దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు ఆ మోహక్రియారంభను గూడి ఆ రాజర్షి శకుంతలను కన్నాడు అని విశదీకరించే సందర్భం.

    స్తంభించెన్ తపియించె లోకములు విశ్వామిత్రుచే, సత్క్రియా
    రంభా! మేనక! వాని జేయుము తపోభ్రష్టాత్ము, మోహక్రియా
    రంభా! యంచు పురందరుం డనగ ; చేరన్ జూచి నాట్యక్రియా
    *రంభన్ గూడి శకుంతలన్ గనియె నా రాజర్షి సంరంభియై.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (18-4-2018)

    రిప్లయితొలగించండి
  12. దంభము తోడను తపమా
    రంభించిన గాధిముని సరభసము తమితో
    నంభోజాక్షిని నెఱిపరి
    రంభను గూడి సుతనుగనె రాజర్షివెసన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. చాలా బాగుందండీ సీతాదేవి గారు

      జిలేబి

      తొలగించండి
    2. ధన్యవాదములు జిలేబిగారూ! 😊😊😊🙏🙏🙏

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
    5. సవరణ సూచించిన పూజ్యులు రాజశేఖర్ అవధానిగారికి కృతజ్ఞతలతో

      దంభము తోడను తపమా
      రంభించిన గాధిజుడు సరభసము తమితో
      నంభోజాక్షిని నెఱిపరి
      రంభను గూడి సుతనుగనె రాజర్షివెసన్!ప

      తొలగించండి


  13. జంభాల్గొట్టుటగాదు చూపెదను నాశక్తిన్ వశిష్టున్ వలెన్
    జంభారాతియుభీతినొందె తపమున్ శల్కంబొనర్పన్,హ! వి
    స్రంభన్ గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై,
    స్తంభింపన్ హృది మేనకన్ గని మనోదండమ్ము దారిన్ గనన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. మహాభారతంలో నన్నయభట్టు-ఇంద్రుడు రంభను పంపిన యత్నం విఫలం కాగా, మేనకను వెళ్ళమంటే ఆమె నిరాకరిస్తూ "కోపపరుపాలికి భామలు పోవనోడరే" అని శంకించిందని వ్రాశారు.
    ఇంద్రుని బలిమిపై వెళ్ళిన మేనకను వర్ణిస్తూ "...వళిత్రయంబు.." కడుపుపై ఉన్నాయని పేర్కొని నితంబ వైశాల్యం నర్మగర్భంగా సూచించారు.
    ఆ భావాలు ప్రేరణగా నేటి పూర్ణ..-

    జృంభించెన్ తపసోగ్రతన్ ఋషి విశేషేచ్ఛాయుతోర్వీతలిన్
    కుంభాకార నితంబ సంచలితమౌ కూర్మిన్నటానందవా
    రంభింపంజనుమన్న శక్రవచనాహ్లాదమ్ముశంకించియున్
    స్తంభోద్రేకమనోభిరామమధురాంతారామయా మేనకా
    రంభంగూడి శకుంతలం గనియెనా రాజర్షి సంరంభియై

    గౌరీభట్ల బాలముకుందశర్మ,
    గోలోకాశ్రమము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంభోగము పాపమనెను
      సంభోగముచేతపాపసాధించెయనెన్
      సం భోగముకవితాఝరి
      నింభూరి ప్రభాకరులు పునీతమొనర్చెన్

      ...గౌరీభట్ల బాలముకుందశర్మ

      తొలగించండి
    2. బాలముకుంద శర్మ గారి పూరణ, ప్రభాకర శాస్త్రి గారిని ప్రశంసించిన పద్యం రెండు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. బాలముకుంద శర్మ గారు నన్ను ప్రశంసించారని తెలిపినందుకు సార్ కి ధన్యవాదములు. నాకు డౌటుగా నుండినది :)

      తొలగించండి
  15. డా.పిట్టాసత్యనారాయణ
    దంభపు బాబా లుందురు
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్
    భంభం బోళా, సాయీ!
    స్తంభంబుగ మనసు నిలుప జాలెను ధరణిన్!!

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టాసత్యనారాయణ
    శంభుండెంతటివాడు యోగి యనగా స్థాపించరే గాథలన్
    దంభం బెంతటి మోసకారియొ కదా!దాంపత్య జీవుల్ భలే
    గంభీరంబుగ నెంచుకోరె సతులన్ గార్హస్థ్య యోగంబె మేల్
    రంభం గూడి శకుంతలన్ గనియె నా రాజర్షి సంరంభియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు అర్థం కాలేదు. రెండింటా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. ఒక వాక్యానికి, మరోక వాక్యానికి సంబంధం లేదు. అసలు మీరు చెప్పదలచుకున్నదేమిటి?

      తొలగించండి
  17. ఢింభుడొకడు పలికెనిటుల,
    "రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్"
    కుంభిని సుత లీలావతి,
    స్తంభమున బుట్టెను శివుడు సాత్యకి కోరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నాల్గవ పాదంలో గణదోషం. "స్తంభమ్మున బుట్టె శివుడు..." అనండి. (సరి గణంగా జగణాన్ని వేసారు).

      తొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    దంభోజ్జృంభతపోవిశేషధరునిన్ దత్కౌశికున్, "శీఘ్రమే,
    గంభీరోజ్జ్వలదేవరాజ్యపదవిన్ గాంక్షించు" నంచు, న్వెసన్
    జంభోద్భేది, తపమ్మునాప, రభసోత్సాహప్రకర్షుండునై,
    రంభోరూత్తమరూపలబ్ధచతురప్రజ్ఞాకృతిన్మేనకన్
    శుంభన్నాట్యవిశేషగానములఁ దుష్టుంజేయఁగానంపఁ, దా
    సంభోగేచ్ఛఁ జనింపఁజేయునటనల్ సాఁగింపఁ, దన్మోహసం
    రంభం గూడి, శకుంతలం గనియె, నా రాజర్షి సంరంభియై!

    రిప్లయితొలగించండి
  19. శుంభన్మంగళ మూర్తిమత్వమున తా శోభిల్లుచున్ కూర్మిమై
    యంభోజాక్షి నిలింప వేశ్య తన యొయ్యారంపు మంజీరముల్
    జృంభింపంగను నాట్యమాడ ముని జూచెన్ లేచి కామక్రియా
    రంభన్ గూడి శకుంతలన్ గనియె నా రాజర్షి సంరంభియై.

    మద్దూరి రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  20. అంభోజ నేత్రి మేనక
    కుంభి ని లో గా ధి సుతుని ఘోర తపoబున్
    జృoభిoచి చెరు ప నా సం
    రంభ ను గూడి సు తను గ నె రాజర్ షి వె స న్

    రిప్లయితొలగించండి
  21. డా.పిట్టాసత్యనారాయణ
    కేవల ముక్కు పిడ్కిలిని గేలిగ మూసియు నర్జున ప్రభ
    న్నావల ద్రోచె విష్ణువపహాస్యము;ద్రౌపదికౌ వవిపత్తునన్
    చేవను జూపకన్నుచిత చేలమె మేలను నో? రుజాళిగా
    భావన జేయునో భవిత బాలల బోధకు భారతమ్మనన్
    (చీరలు హఠాత్తుగా వచ్చినవని గురువు చెప్పగా నమ్మరు.భీమార్జునులు కౌరవులపై బడి యుంటే బాగుండేదని నీతి పాఠం భారతం ద్వారా బోధింప వలె ననుకొన్న గురువు విఫలుడవడం తట‌స్థించును గదా!Personality development through Myth ను ఎలా సాధించేది?Rules కంటే exceptions యే ఎక్కువ గదా భారతములో అని teacher యొక్క ఆవేదన,సందర్భము,ఆర్యా)

    రిప్లయితొలగించండి
  22. కందం
    గంభీర తపో నిష్ఠుడు
    నంభోరుహనేత్ర మేనకాఖ్యకు వశుడై
    జృంభిత మోహవిభవ సం
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్

    రిప్లయితొలగించండి
  23. వీరబ్రహ్మేంద్రాచార్య.

    రంభోరున్ గణనీయ రూప విభవన్ రమ్యాంగ సంశోభితన్,

    కుంభోద్భాసి కుచద్వయన్ విషయ సంగూఢన్ చలచ్చంచలన్,

    జృంభన్మన్మథకేళికోత్సుక నమర్త్యన్ మేనకన్ విభ్రమా,

    రంభంగూడి శకుంతలం గనియె నారాజర్షి సంరంభియై.

    ముంజంపల్లి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీరబ్రహ్మేంద్రాచార్యుల పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. veerabhramendra gaaru పద్యం అమోఘం కాని ఒక చిన్న సందేహం మూడవ పాదం లో యతి సరియేనా ?

      తొలగించండి
    3. శివరామకృష్ణ ప్రసాద్ గారూ,
      ధన్యవాదాలు.
      నిజమే. నేను గమనించలేదు. మూడవపాదంలో యతి తప్పింది.
      'రంభోరువున్' అనడం సాధువు అనుకుంటాను.

      తొలగించండి
    4. 2వ పాదంలో చివర "చలచ్చంచలన్" అని నకారంతో అంతమైనది కావున 3వ పాదాదిలోని "జృంభన్" అనే పదంతో సమసించి "న్జృంభన్" ఔతుంది. నకారమునకుగాని, జకారమునకుగాని యతిమైత్రిగల అచ్చులు నకార, జకారములపైన నున్నచో యతి కుదురును. ప్రస్తుతపాదంలో "న్జృ" కు "న్మే" యతికూర్చబడినది. అనగా "నృ" కు "నే" యతియైనది. కావున యతిభంగమైనదను శంక రాకూడదు.

      వీరబ్రహ్మేంద్రాచార్య, 9948634619.

      తొలగించండి
    5. *న్జృంభన్మన్మథకేళికోత్సుక నమ*ర్త్యన్ మేనకన్ విభ్రమా,
      న్జృ-ర్త్య... యతి చెల్లదు కదా!

      తొలగించండి
    6. యతిమైత్రి చెల్లదు. నేను గమనించలేదు. గమనించి, పై వ్యాఖ్యను తొలగించాను. సవరణ సూచించాలి.

      జేజేన్ అనవచ్చునా? వేశ్యన్ అనకుండా జేజేన్ అన్నచో సరిపోవును.

      తొలగించండి
    7. శంకరాభరణం మిత్రులకు ప్రణామాలు.
      శ్రీ వీరబ్రహ్మేంద్రాచార్యులవారు తమ పద్యంలో మూడవపాదంలో మొదట
      *జృంభన్మన్మథకేళికోత్సుకను నారిన్ మేనకన్* అని వ్రాసుకొన్నారు. ఐతే మరల నారిన్ పదానికి బదులు అమర్త్యన్ అని వ్రాసినారు. అందువలన యతి మైత్రి కుదరలేదు. కావున
      మూడవపాదం
      పైన తెలిపినట్లు *నారిన్* పదంతో వ్రాసినట్లైతే యతి మైత్రి కుదురుతుంది.
      ప్రమాదో ధీమతామపి అని అంటారు కదండీ. అందరికీ ప్రణామాలు.
      *సవరణతో పూరణ*
      రంభోరున్ గణనీయ రూప విభవన్ రమ్యాంగ సంశోభితన్,
      కుంభోద్భాసి కుచద్వయన్ విషయ సంగూఢన్ చలచ్చంచలన్,
      జృంభన్మన్మథకేళికోత్సుకను నారిన్ మేనకన్ విభ్రమా,
      రంభంగూడి శకుంతలం గనియె నారాజర్షి సంరంభియై.

      తొలగించండి
    8. యతి తప్పినదన్న నా సూచన పై పలువురి అభిప్రాయములను గౌరవిస్తాను . కాని కవిగారు రంభోరువున్ అనే పదము యొక్క అర్ధము సూచించాలిసినది గా ప్రార్ధన . ఎందుకంటే నాకు ఆ పదము లభ్యము కాలేదు.

      తొలగించండి
  24. సమస్య : -
    "రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్"

    కందము*

    శంభుని మదిగొని జేయు త
    పంబును భంగము పరచిన భామిని,వేల్పూ
    చుంబన మేనక ప్రేమా
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్"
    ................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేల్పూ చుంబన'....?

      తొలగించండి
    2. సమస్య : -
      "రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్"

      *కందము**

      శంభుని మదిగొని జేయు త
      పంబును భంగము పరచిన భామిని కరిగే
      గంబుర మేనక ప్రేమా
      రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్"
      ................✍చక్రి

      గంబుర - కర్పూరము

      తొలగించండి
  25. శార్దూలవిక్రీడితము

    అంభోభృత్పథమున్ బ్రయాగభయు శీఘ్రాదేశియై వీడుచున్
    గంభీరోచిత సద్దపాది బల సాకారేచ్ఛితున్ గాధిజున్
    సంభోగాంబుధి మున్చి నిష్ఫలునిగన్ సాధించు తాపత్రయా
    రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రయాగభయు'...? "సత్తపాది బల" అని ఉండాలనుకుంటాను.
      ఆధ్యాత్మికము, ఆధిదైవికము, ఆధిభౌతికము అని తాపములు మూడు విధాలు. ఇవేవీ మేనకలో లేవు. (వ్యావహారికంలో 'తొందరపాటు' అన్న అర్థం ఉంది).

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. ప్రయాగభయుడు = ఇంద్రుడు. 'సద్దపాది' పొరబడితిని. తాపత్రయము = తపన అనె అర్థం లో వాడాను. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

      శార్దూలవిక్రీడితము

      అంభోభృత్పథమున్ బ్రయాగభయు శీఘ్రాదేశియై వీడుచున్
      గంభీరోచిత సత్తపాది బల సాకారేచ్ఛితున్ గాధిజున్
      సంభోగాంబుధి మున్చి నిష్ఫలునిగన్ సాధించు తాపత్రయా
      రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై!

      తొలగించండి
  26. శాంభవి సాయపు తూపుల
    గంభీరత కనులు దెఱవ గనడే నప్సర
    సంభ్రమ మేనక జూడగ
    రంభనుగూడి సుతనుఁగనె రాజర్షి వెసన్

    Dr Varalakshmi
    Bangalore

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర కందపద్య నియమోల్లంఘన జరిగింది. చివరి అక్షరం తప్పకు గురువు కావాలి.
      'రంభను' అన్నదానికి అన్వయం?

      తొలగించండి
  27. జంభారిపంప ఋషితో
    జంభనమున మేనకాత్మజ జననమొందన్
    డింభన్చూడగ వచ్చిన
    రంభనుగూడి సుతనుగనె రాజర్షి వెసన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ 'రంభ'కు అన్వయం?

      తొలగించండి
    2. 🙏🏽ధన్యవాదములు శంకరయ్యగారూ

      మేనక బిడ్డను చూడడానికి వచ్చిన రంభ(మేనక చెలికత్తె ) తో కలిసి కూతురును రాజర్షి చూసెను
      అనే భావాన్ని చెప్ప ప్రయత్నించాను

      తొలగించండి
  28. జృంభణమున నేడ్చుచుఁ ది
    గ్మాంభః పూరిత నయన మహా బాలను సం
    రంభమ్మునఁ జను చుండఁగ
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్

    [రంభ = బ్రహ్మచారి ధరించెడు వెదురుకోల; కనె = చూచెను; రాజర్షి = కణ్వుఁడు( పూరు వంశస్థుఁడు)]


    దంభంబే మది నావహించ ధర సంతప్తాత్మ భట్టారుఁ డా
    రంభోదగ్ర తపోక్షయం బయిన దుర్ధర్షంపుఁ గామాగ్నిఁ దా
    నంభోజాక్షిని మేనకా సతిని దేవాధ్యక్ష తత్కార్య సం
    రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా, హృద్యంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    3. సుకవులు పోచిరాజువారూ...నమస్సులు!

      మీ మొదటి పూరణమున...

      ఈ క్రింది శబ్ద సాధుత్వ విషయమున చిన్న అనుమానము కలిగినది. నివృత్తిచేయఁగలరు.

      తపస్ + క్షయంబు = తపఃక్షయంబు కావలెననిపించుచున్నది. మీరు తపోక్షయంబు అన్నారు.

      మేనక దేవవేశ్య గదా... మీరు మేనకా సతిని అన్నారు.

      సతి అన్న పదానికి శబ్దరత్నాకరములో పార్వతి, పతివ్రతా స్త్రీ అనే అర్థములు ఉన్నవి. కాని, మీరు స్త్రీ అను నర్థమున ప్రయోగించినట్లున్నారు. ప్రయోగ విషయమున సందేహమున్నది.

      కావున, మేనకా సతిని అనుటకన్న మేనకాప్సరను అనిన బాగుండు ననిపించుచున్నది.

      అన్యథా భావింపవలదని మనవి.

      తొలగించండి
    4. కవిపుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. తపఃక్షయంబు సాధువని నాకును ననుపించుచున్నది. ముందు “తపో లయంబయిన” నని వాడి క్షయ శబ్దము బాగుండునని మార్చితిని. అప్పుడు గమనిచలేదు. ధన్యవాదములు.
      మీ రెండవ సందేహమునకు నా వివరణ.

      మేనక విశ్వామిత్రుని తో 10 సంవత్సరములు కాపురము చేసినది. తత్ఫలితముగా భరత మాత యైన శకుంతలను కన్నది. అందు వలన మేనకను విశ్వామిత్రుని సతిగా (భార్య) దలఁచినఁ దప్పు లేదని నా యభిప్రాయము.

      ఇత్యుక్తా సా వరారోహా తత్ర వాసమథాకరోత్৷৷1.63.7৷৷
      తస్యాం వసన్త్యాం వర్షాణి పఞ్చ పఞ్చ చ రాఘవ !.

      విశ్వామిత్రాశ్రమే రామ సుఖేన వ్యతిచక్రము:৷৷1.63.8৷৷

      తొలగించండి
    5. సంతోషమండీ! కాని, మీరు ఉదాహరణమును చూపినను, నాకు నొక సందేహము ఇంకను తీరలేదు.

      వేనవేల సంవత్సరములుగాఁ జేసిన విశ్వామిత్రుని తపఃకాలములో నీ పది సంవత్సరము లెంత? పోనిండు. "స్వర్గలోకమున కేతెంచిన పుణ్యాత్ములను వేల, లక్షల సంవత్సరములుగా ఒక పురుషుఁడు అను నియమము లేక, అందఱను స్వర్గ సౌఖ్య సంతృప్తులనుగాఁ జేయుచున్న దేవవేశ్యలందఱను సతులుగాఁ బరిగణింపవచ్చునా?" యని నా సందేహము. దీనినెవరయినఁ దీర్చువారున్న బాగుండును!


      వేశ్య వేశ్యయే, సంసారి సంసారియే నని నా యుద్దేశము. కావున "మేనకా సతిని" అని కాక, "మేనకాప్సరను" అనవచ్చుననుకొందును. పరిశీలింపుఁడు...

      నమస్సులతో...ధన్యవాదములతో...
      స్వస్తి
      భవదీయ మిత్రుఁడు
      గుండు మధుసూదన్

      తొలగించండి
    6. మీ యభిప్రాయమును గౌరవిస్తూ “మేనకాప్సరను” పదమును స్వీకరించుచున్నాను. ధన్యవాదములండి.


      దంభంబే మది నావహించ ధర సంతప్తాత్మ భట్టారుఁ డా
      రంభోదగ్ర తపఃక్షయం బయిన దుర్ధర్షంపుఁ గామాగ్నిఁ దా
      నంభోజాక్షిని మేనకాప్సరను దేవాధ్యక్ష తత్కార్య సం
      రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై

      తొలగించండి
    7. చాలా సంతోషమండీ! మిమ్మల్ని యిబ్బందిపెట్టి వుంటే క్షంతవ్యుణ్ణి! ధన్యవాదములు!

      తొలగించండి
    8. మిత్రులు మధుసూదన్ గారూ, నాకు తెలిసిన నాలుగుముక్కలు ఒక టపాగా వ్రాసాను. దేవతలూ అప్సరసలూ అని. మీరు చదివి అభ్యంతరం లేకుంటె మీ అభిప్రాయం వ్రాయండి.

      తొలగించండి
  29. జంభారి యాఙ్ఞ మేరకు
    దంభముతోమేనకమ్మ తాఋషి జేరన్
    రంభోరురువులుగలయా
    రంభనుగూడిసుతనుగనెరాజర్షి వెసన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇక్కడ 'రంభ'కు ఏ అర్థాన్ని గ్రహించారు?

      తొలగించండి



  30. 1.జంభారి యాన మేరకు

       గుంభనముగ వనిని చేర కుతకము తోడ

     న్నంభోరుహాక్షి నాసం

     రంభను గూడి సుతనుగనె రాజర్షి వెసన్.




    2రంభోరువులను ద్రిప్పుచు

      జృంభణమున నృత్యమునట చేయగ మునియున్

     సంభ్రమ ముననా ప్రేమా

     రంభను గూడి సుతనుగనె రాజర్షి వెసన్.

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువు గారికి నమస్కారములు. నిన్నటి పూరణను మరియొకసారి పరిశీలింప ప్రార్థన.

    దేహముక్కు పిండము జేసి తీవరించి
    కలహమున దాయ కుత్తుకన్నులిచి మెఱయు
    పావనిని గాంచె విజయుడు బాళి తోడ
    దాని నోరువుతో జూచె ధర్మ రాజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మరొకసారి పరిశీలించండి' అన్నారు. నేను ఏదైనా దోషమ్మున్న దన్నానా?

      తొలగించండి
    2. గురువు గారికి నమస్కారములు. నిన్న మూడవ పాదంలో వ్యాకరణ దోషమొకటి తమరు పేర్కొని యున్నారు. అయితే మొత్తం పద్యాన్ని మార్చి మరల వ్రాసాను. అంతే! ధన్యవాదములు.

      తొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    జంభారి నొడికి మేనక
    గంభీరమగు తపమెంచు ఖదిరు నడచుచున్
    సంభోగిని చేసిన ప్రియ
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్
    (జంభారి= ఇంద్రుడు; ఖదిరుడు= తాపసి/ఋషి)

    రిప్లయితొలగించండి
  33. డా.పిట్టానుండి
    ఆర్యా,
    అది భారతం మూలాలను గ్రహించని ఆధునిక సగటు మానవుని సందేహం.
    శివుణ్ణి నేనే అంటారు.యోగిగా జీవనమునమునారంభించి మధ్యలో సంసారులౌతారు.వారి యేకాగ్రత లోపించడం వల్లనే.ఈనాడిటువంటి
    యోగా పండితులు,అ ధూతలు ఎందరో?!
    మరికొందరు సాధ్వితో సంసారాన్ని కోరి ఆరంభిస్తారు.వీరికి ఆదర్శ దంపతులే ఆదరణీయులు.వారిని అధ్యయనం చేయాలి.ఇక ఈ యుగపు బాబాలలో మన మధ్య కదిలాడిన షిరిడీ సాయీ బాబా నిజమైన యోగి.సమస్యతో సంబంధం చలించిన యోగితో నున్నది.తాను మొదలిడిన జీవనమును ధర్మ బద్ధంగా గడపాలి.కాని సమస్య వేరే దిశలో ఉండి సమస్యగా మారిందని తెలుప బూనితిని.ఇదే కథల నుండి భావి తరానికి అందజేసే Personality development బోధ.,ఆర్యా.

    రిప్లయితొలగించండి
  34. జంభారి పనుప మేనక
    దంభనముగ నాట్యమాడ తన్మయమగుచున్
    రంభను, సకలకళా సం
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తన్మయుడగుచున్' అనండి.
      మూడవ పాదందో 'రంభను' అన్నదానికి అన్వయం, అర్థం?

      తొలగించండి
  35. అంభోజాక్షి యొకడనియె
    రంభా మేనక లనబడు రమణుల మధ్యన్
    డింభకుడు భేద మెరుగక
    రంభను గూడి సుతను గనె రాజర్షి వెసన్.

    రిప్లయితొలగించండి
  36. దంభోజృంభతపమ్ము జేసెడిమునిన్ దత్కౌశికుం జెంతకున్
    జంభారాతియె పంపెనప్సరసఁ విశ్వామిత్రుఁ భంగమ్ముకై భువిన్
    యంభోజాక్షిని గాంచి తాపసియె మోహమ్మంది యానాట్య సం
    రంభంగూడి శకుంతలం గనియె నారాజర్షి సంరంభియై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. రెండవ పూరణలో రెండవ పాదంలో గణదోషం. 'భువిన్ + అభోజాక్షి' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.

      తొలగించండి
  37. శంభుని నమ్మికతో ప్రా
    రంభించిన భక్తిశక్తి రాజుకు గలుగన్
    బంభర వేణియు సతి సం
    రంభనుగూడి సుతునిగనె రాజర్షివెసన్

    రిప్లయితొలగించండి
  38. రిప్లయిలు
    1. ద్వితీయపాదాంతం లో ఈ క్రింది విధంగా సవరించాను దయతో గమనించగలరు.
      "గుర్వీనతంబన్ మేనకన్"

      తొలగించండి
    2. ద్వితీయపాదాంతంలో "గుర్వీనితంబన్ మేనకన్"
      గా గమనించ ప్రార్థన.

      తొలగించండి
    3. రామాచార్య గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. క్షమించాలి సవరణకు బదులు పూరణనే తొలగించబడినది.
      శంకరయ్యగారికి కృతజ్ఞతలు

      తొలగించండి
    5. రంభోరుస్పృహణీయసుందరతనూరాజత్కపోలాంచితన్,
      కుంభీకుంభకుచద్వయీపరిలసద్గుర్వీనితంబన్ మేనకన్,
      జంభారీరితదివ్యకార్యపటుసంసక్తన్, తపోభంగవి
      స్రంభం గూడి శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై.

      తొలగించండి
  39. .. .సమస్య
    *"రంభం గూడి శకుంతలం గనియె నా*
    *రాజర్షి సంరంభియై"*

    సందర్భము: అంభోజాక్షి యైన మేనక కెంతసేపూ తాను వచ్చిన పనిమీదనే దృష్టి. అది ముగించి వెళ్ళిపోవా లనే సంరంభమే! అంటే తొందరపాటే! అందుకే సంరంభన్ గూడి.. అని పేర్కొనబడింది. అంటే సంరంభం కలిగినది సంరంభ.. అటువంటి మేనకను గూడి.. అని.
    విశ్వామిత్రుని కేమో చూపంతా తన తపస్సుమీదనే! ఎంత మహోగ్రమైన అంభశ్ఛారము (అంపచారము.. ఎడతెగకుండా కురిసే జడివాన.. ఎప్పు డాగుతుందో తెలియని వాన) వంటి తపస్సు చేసైనా సరే బ్రహ్మర్షి కావా లనే సంరంభమే!.. అంటే తొందరపాటే! అందుకే అతడు సంరంభియైన రాజర్షి అని సమస్యా పాదంలోనే పేర్కొనబడింది.
    ఇంతకూ ఎవరి దీ సంరంభం? ఎక్కడ మొదలైంది? అంటే విధి (బ్రహ్మ) దగ్గరనే. అసలు బ్రహ్మ దేవుడే సంరంభం.. (తొందరపాటు) కలిగినవాడు.. అని పేర్కొనడం జరిగింది.
    ఆయనే అంత హడావుడిగా వీ ళ్ళిద్దరినీ కూర్చినాడు (కలిపినాడు).. మరి యేం చేస్తాం! ఎవరి కార్యం వాళ్ళు పూర్తి చేసుకొని తలా ఓ దిక్కు వెళిపోకుండా వుంటారా! చివరి కదే జరిగింది కదా!
    రుక్మిణీ కృష్ణులను కూర్చినప్పుడు.. బ్రహ్మ కీర్తించబడ్డాడు.. "తగు నీ చక్రి విదర్భ రాజ సుతకున్.." అంటూ.. "తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా!.." అంటూ..
    అప్పు డీ హడావుడి లేదేమో బ్రహ్మ దేవునికి! కాబట్టి అది సఫలీకృత మయింది అని కవి భావన..
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అంభోజాక్షికి నెంతసేపు తన కా
    ర్యం బేదొ సాధించుటన్...
    శుంభ ద్దివ్య తపస్వి కేమొ సతమున్
    చూ పింతకన్నన్ మహో
    గ్రాంభశ్ఛార తపస్సుమీద; విధి సం
    రంభంబునన్ గూర్చె; సం
    రంభం గూడి శకుంతలం గనియె నా
    రాజర్షి సంరంభియై..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  40. సవరణతో

    జంభారిపంప ఋషితో
    జంభనమున మేనకాత్మజను నిజసఖికిన్
    డింభన్చూపగ వచ్చిన
    రంభనుగూడి సుతనుగనె రాజర్షి వెసన్

    రిప్లయితొలగించండి
  41. గురువు గారికి నమస్సులు
    గంభీర వదన కవియున్
    శంభో శివయని నుడివెను,శోభా యంబౌ
    పుంభావ సరస్వతివర
    రంభనుగూడి సుతను గనె రాజర్షి వెసన్

    రిప్లయితొలగించండి
  42. శంకరాభరణం మిత్రులకు ప్రణామాలు.
    శ్రీ వీరబ్రహ్మేంద్రాచార్యులవారు తమ పద్యంలో మూడవపాదంలో మొదట
    *జృంభన్మన్మథకేళికోత్సుకను నారిన్ మేనకన్* అని వ్రాసుకొన్నారు. ఐతే మరల నారిన్ పదానికి బదులు అమర్త్యన్ అని వ్రాసినారు. అందువలన యతి మైత్రి కుదరలేదు. కావున
    మూడవపాదం
    పైన తెలిపినట్లు *నారిన్* పదంతో వ్రాసినట్లైతే యతి మైత్రి కుదురుతుంది.
    ప్రమాదో ధీమతామపి అని అంటారు కదండీ. అందరికీ ప్రణామాలు.
    *సవరణతో పూరణ*
    రంభోరున్ గణనీయ రూప విభవన్ రమ్యాంగ సంశోభితన్,
    కుంభోద్భాసి కుచద్వయన్ విషయ సంగూఢన్ చలచ్చంచలన్,
    జృంభన్మన్మథకేళికోత్సుకను నారిన్ మేనకన్ విభ్రమా,
    రంభంగూడి శకుంతలం గనియె నారాజర్షి సంరంభియై.

    రిప్లయితొలగించండి
  43. దంభమ్మందున శాపమొందె గదరా దైత్యుండు లంకేశుడే
    రంభం గూడి;...శకుంతలం గనియె నా రాజర్షి సంరంభియై
    సంభోగమ్మున గూడి యప్సరనుతా సంకల్ప భిన్నత్వమున్...
    గంభీరమ్మగు కైపదమ్మునిడితే గాండ్రించు శార్దూలమై :)

    రిప్లయితొలగించండి