జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. సాధ్యమైనంత వరకు పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. (సమస్య ఇచ్చే ముందు సభికుల నుద్దేశించి "ఎక్కడో వరంగల్ వాణ్ణి. పిలిచి వేదిక నెక్కించి గౌరవిస్తే ఇలాంటి సమస్య నిస్తారా అని కోపగించుకోకండి. సమస్యాపూరణం ఒక సరదా ప్రక్రియ. మీ మనస్సులను నొప్పిస్తే క్షమించండి" అని చెప్పి సమస్య నిచ్చాను. దానిని వినగానే అవధాని మురళి "సమస్యకు అనుకూలంగా పూరణ చెప్తే మీరు, నేను నంద్యాలనుండి క్షేమంగా వెళ్ళగలమా?" అని చమత్కరించారు).
ఆర్యా!నమస్కారం అవగుణాలు ఉన్నది కాలపు జాలమున్ బడు ప్రకాండులు,నేతలు ఇతరులు నంద్యాల వారు కాదునంద్యాల పురప్రజల్ అన్నచోట,ఉంచితే 3,4పాదాలో అవగుణాలున్నవారినీ గురించి చెప్పటం జరిగింది
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2639 *నంద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్.* నంద్యాల వాళ్లను పొగడకూడదు, వీళ్లు విజ్ఞత లేనివారు, నీతి లేనివారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. ఛందో గోపనము ద్వారా ఈ సమస్య ఏ పద్య పాదమో వెంటనే తెలిసికొనే వీలు లేకుండా చేశారు. సందర్భం :: మానవులు మందమతులుగా, మందభాగ్యులుగా ఉంటూ మంచిపనులు చేయకుండా ఉంటారు కలియుగంలో అని కలియుగ ధర్మాన్ని శౌనకాది మహర్షులు సూతమహర్షి దగ్గర తెలియజేశారు అని వ్యాసమహర్షి తన భాగవతంలో వ్రాశారు. ఈ విషయాన్ని పోతనగారు కూడా ఇలా చెప్పినారు.
అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగసం కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే. కాబట్టి నంద్యాల ప్రజలు ఆనాడు కృతయుగంలో పుణ్యాత్ములు, ప్రస్తుతం యుగధర్మం కారణంగా కలియుగంలో మంచివారు కాదు అని విశదీకరించే సందర్భం.
నాలుగు పాదముల్ దనరె నాడు కృతమ్మున , త్రేతఁ మూడు , నం ద్యాలను , రెండు ద్వాపరమునన్ , బరికింపగ ధర్మ ధేను పా దా లటు తగ్గు , వ్యాసముని దా యుగ ధర్మములన్ వచించెగా, కాలము మారెగా , కలియు గమ్మిది గావున నేడు జూడ *నం* *ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్.* *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-4-2018)
తేలిక గెల్పు నిచ్చుటకు తెన్ గు ప్రథానికి తా వొసంగు , ప్రాన్ తాల విభేదమెన్నని యుదారులు సుమా మన యాంధ్ర లోని నం ద్యాల పురప్రజల్ , స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్ కాలము నెల్ల ప్రాంతముల కక్షల మ్రగ్గెడు క్రొత్త నేతలే .
(తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రథాని పి వి నరసింహా రావు గారిని ఆంధ్రా లోని నంద్యాల ప్రజలు పార్లమెంట్ కి ఎన్నుకున్నారు . నాటి సమైక్యతని ఉదహరించాను . ఆయన తేలికగా గెలవటానికి యన్ టి రామా రావ్ ప్రతిపక్షం లో ఉండి కూడా సహకరించాడు. తెలుగు ప్రథాని అనే మమకారం తో )
తేలిక గెల్పు నిచ్చుటకు తెన్ గు ప్రథానికి తా వొసంగు , ప్రాన్ తాల విభేదమెన్నని యుదారులహో మన యాంధ్ర లోని నం ద్యాల పురప్రజల్ , స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్ కాలము నెల్ల ప్రాంతముల కక్షల నింపెడు క్రొత్త నేతలే . (తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రథాని పి వి నరసింహా రావు గారిని ఆంధ్రా లోని నంద్యాల ప్రజలు పార్లమెంట్ కి ఎన్నుకున్నారు . నాటి సమైక్యతని ఉదహరించాను . ఆయన తేలికగా గెలవటానికి యన్ టి రామా రావ్ ప్రతిపక్షం లో ఉండి కూడా సహకరించాడు. తెలుగు ప్రథాని అనే మమకారం తో )
కంది శంకరయ్యమార్చి 26, 2018 2:26 PM కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. ముఖ్యంగా నామగోపన విధానంలో చేసిన రెండవ పూరణ అనన్యసామాన్యం. అభినందనలు. పూరణలను అనుసరించిన శ్రీరామస్తుతి దుష్కరప్రాసతో అద్భుతంగా ఉన్నది. మీ పద్యాన్ని చూసిన తర్వాత ఈ సమస్య తోచింది. "ఇక్ష్వాకు కులాబ్ధి చంద్రుఁ డీ కృష్ణుండే" (లేదా...) "ఇక్ష్వాక్వన్వయ దుగ్ధవార్ధి శశయౌ నీ కృష్ణుఁడే చూడఁగన్".... ఎలా ఉంటుంది?
అమ్మా జిలేబీ గారూ, ఇదేదో సరదాకు అనుకున్న సమస్య. బ్లాగులో ఇవ్వడం లేదు.
చాలు పరాపనిందలిక, చక్కని వారు పరోపకారులై మేలును గూర్చువారిలను మేధను గల్గినవారుగారె వా చాలత లేని సద్గుణులు శాస్త్రమెఱంగిన వారు, కారు నం ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్
.........సమస్య *"నంద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు* *లవిజ్ఞులు నీతి దూరులున్" *
సందర్భము: నంద్యాల ప్రాంతంలో నందీశ్వరుడు తొమ్మిది రూపాలలో వెలసినాడు. అవి నవ నందులుగా ప్రసిద్ధములు. చామ కాల్వ ఒడ్డున గల నంది. నాగ సోమ సూర్య శివ కృష్ణ (విష్ణు) గరుడ వినాయక నామములతో నలరారే నందులు ఏడు. సుప్రసిద్ధమైన స్వయంభువైన *మహానంది* యొకటి. ఇక్కడినుంచి సుమారు ఇరువై కి.మీ. దూరంలో ఇవన్నీ నెలకొని వున్నాయి. సకల జనుల పాపహరములై వెలిగిపోతూ వున్నాయి. అందువల్ల ఈ ప్రాంత ప్రజలు సంప్రదాయజ్ఞులు. ఇంకా ఈ ప్రాంతంలో కొత్తూరు అనే పుణ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో వెలసి అనుగ్రహిస్తూ వున్నాడు. దీనినే ఎస్. కొత్తూరు లేక *సుబ్బరాయ కొత్తూరు* అని పిలుస్తారు. ("నవ్య గ్రామ" మని యిందులో పేర్కొనబడింది.) మాన్యశ్రీ విద్వాన్ గొట్టిముక్కుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ క్షేత్రం గురించి అపురూపమైన గ్రంథాన్ని వ్రాశారు. దాని పేరు *కోరిన వారికి కొంగు బంగారం శ్రీ కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రం.* ఆ స్వామి కంకితంగా చి. మేడిచర్ల హరినాగభూషణం "కొత్తూరు సుబ్బరాయుని శతకము" ను సంతరించినారు. కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజలు దైవ భక్తి సంపన్నులు.. సాహితీ ప్రియు లని అర్థ మౌతున్నది. వీరు స్తుతి పాత్రులే! విజ్ఞులే! అనవచ్చు. అందువల్ల వీరు అనర్హులు, అవిజ్ఞులు అనే మాటలు సత్య దూరములే! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ నాలుగు నైదు రూపముల.. నంది కటాక్షముఁ జూపు పుణ్యమౌ నేలయు.. సుబ్బరాయ డిట నిల్చి దయన్ గను "నవ్య గ్రామ" దే వాలయ మున్న నేల.. విన వా! యిటు లన్నను సత్య మౌనె! "నం ద్యాల పుర ప్రజల్ స్తుతి క నర్హు, లవిజ్ఞులు నీతి దూరులున్"
చాలిక నిందలు వేయుట
రిప్లయితొలగించండిబాలా! నగరము లయందు పరిశీలింపన్
మేలిది, యిటకారట నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేలును జేయుచు నుందురు
రిప్లయితొలగించండిగోలలు మరిచి మెలుగుదురు కూరిమితోడన్!
జాలిపరులున్;యెటుల నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జాలిపరుల్ + ఎటుల = జాలిపరు లెటుల' అవుతుంది. యడాగమం రాదు. "జాలిపరులు నెట్టుల నం..." ఆనండి.
రిప్లయితొలగించండిలాంఛనములిచ్చి కవి గారిని కట్టి పడేయండ్రా :)
ఎవర్రా అక్కడ :)
మా లావుగ చెప్పకు, నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్!
ఓ లాక్షణికుడ! కందివ
రా!లాంఛనములిక మీకు రాధన మిచ్చున్
జిలేబి
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధ్యమైనంత వరకు పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.
(సమస్య ఇచ్చే ముందు సభికుల నుద్దేశించి "ఎక్కడో వరంగల్ వాణ్ణి. పిలిచి వేదిక నెక్కించి గౌరవిస్తే ఇలాంటి సమస్య నిస్తారా అని కోపగించుకోకండి. సమస్యాపూరణం ఒక సరదా ప్రక్రియ. మీ మనస్సులను నొప్పిస్తే క్షమించండి" అని చెప్పి సమస్య నిచ్చాను. దానిని వినగానే అవధాని మురళి "సమస్యకు అనుకూలంగా పూరణ చెప్తే మీరు, నేను నంద్యాలనుండి క్షేమంగా వెళ్ళగలమా?" అని చమత్కరించారు).
జాలములేని వర్థనలు;చల్లని మెల్లని మాటతీరు;ల
రిప్లయితొలగించండిశ్లీలములేని వాక్కులును;శీఘ్రమె స్పందనమందు డెందముల్;
మేలగు నాతిథేయతయు;మిత్రత పంచెడు సంగడీలు ;నం
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హుల? విజ్ఞులు నీతిదూరులున్.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అనర్హుల?' అని ప్రశ్నార్థకంగా విరిచి 'విజ్ఞులు' అనడం బాగుంది. కాని 'నీతిదూరులున్' అన్నదానికి అన్వయం?
“నంద్యాల పురప్రజల్ నీతిదూరులున్ స్తుతి కనర్హుల? విజ్ఞులు.” అని పద విభాగము చేసిన సాన్వయ మగు నను కుంటాను.
తొలగించండిమూడవపాదంలో "మిత్రత పంచెడువారు ; కారు నం
తొలగించండిద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్
- అందామండీ!
రిప్లయితొలగించండిమేలుగ బల్కు మయ్య కవి ! మెచ్చుదు రెల్లరు కంది వర్య !నం
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్
నీలకముల్? జిలేబులయ ! నీమము తప్పక లాంఛనమ్ములన్
సాలువ కప్పి యిత్తురయ, సాంకవ మద్ది సుశోభలొప్పగన్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవధానానంతరం నంద్యాల వాసులు కొందరు సమస్య బాగున్నదని, దానికి మంచి పూరణ వచ్చిందని సంతోషంగా చెప్పారు.
మొదటిపాదంలో వర్తనలు-అని చదువమనవి.
రిప్లయితొలగించండినేలది యుక్తికి,భక్తికి
రిప్లయితొలగించండినేలది ప్రేమకి,నెలవగు నీతికి నెపుడున్!
చాలిక ప్రేలకిటన్ "నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్ "
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రేమకు' అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఒక బిచ్చగాని మాటలు...
నాలుగు దిక్కులందు నవ నందులు రాజ్యమునేలు నేల , కా...
పాలికి దివ్యధామమని భ్రాంతిని మున్గితి , బిచ్చమెత్తగా
రాలదు గింజయైన , యనరాదని మానుటె గాని , చూడ నం...
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్" !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
బిచ్చగాని ఆవేదనగా మైలవరపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గింజయైన ననరాదని..." అని ఉండాలి కదా!
మేలుగ సాహితీ సభల మేటిగఁ జేయుచు బండితాళికిన్
రిప్లయితొలగించండిజాలగ సత్కృతుల్ సలిపి సజ్జనులై చెలఁగన్ శకారునిన్
బోలియు మద్యముం గొనిన మూర్ఖుఁ డొకం డిటులన్ వచించె నం
ద్యాల పుర ప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్.
కొన్ని జటిలమైన సమస్యలను పూరించడానికి శకారుడో, పిచ్చివాడో, త్రాగుబోతో, మొద్దబ్బాయో దిక్కవుతారు. తప్పదు మరి!
తొలగించండి
తొలగించండిజిందాబాద్ శకారుడ ; నీవే దిక్కు క్లిష్టసమయాలలో !
జిలేబి
శకార ! జగణపు మానవుడు :)
తొలగించండిబై ది వే అవధాని గారి పూరణ యేమిటండి ?
జిలేబి
మరో పోస్టులో ఉన్నది చూడండి
తొలగించండి
తొలగించండిమనలనందరిని గట్టెక్కించు శకారుని కి జై !
జగణపు శకారుడా నీ
వు గదా మాకెల్ల వేల్పువు! జిలేబివి, నీ
వె గురో రక్షణ మా కిల
న గట్టిగా దెబ్బలను తినక తప్పుకొనన్ :)
జిలేబి
పాలనలోని మర్మములపారముగా గ్రహియించి P.V.నిన్
రిప్లయితొలగించండిలాలితుడౌ ప్రధానిగ భళా గెలిపించిరి గాదె నాడు నం
ద్యాల పురప్రజల్; స్తుతికనర్హులవిజ్ఞులు నీతి దూరులున్
కాలపు జాలమున్బడు ప్రకాండులు,నేతలు,నిమ్న బుద్ధులై.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమంచి అంశాన్ని ఎంచుకున్నారు. కాని పి.వి. ని ఎన్నుకున్నందుకు ఆ అవగుణాలున్నవారుగా చెప్పుకోవాలా? అన్వయం కుదరడం లేదు.
ఆర్యా!నమస్కారం అవగుణాలు ఉన్నది కాలపు జాలమున్ బడు ప్రకాండులు,నేతలు ఇతరులు నంద్యాల వారు కాదునంద్యాల పురప్రజల్ అన్నచోట,ఉంచితే 3,4పాదాలో అవగుణాలున్నవారినీ గురించి చెప్పటం జరిగింది
తొలగించండిమేలగు వర్తనల్ గలిగి మేదిని నేరికి దీసిపోరుగా
రిప్లయితొలగించండికాలమదెంత మారినను గౌరవ భంగము జేయకుంద్రుగా
చేలను బోలుచుండియును చేయరు చేటది యెట్టులౌనునం
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్?
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...యెట్టులందు నంద్యాల..." అనండి.
నీలాల నింగి నంటిన
రిప్లయితొలగించండివేలాదిగ ప్రాజ్ఞు లుండ వెలుగులు నింపన్
చాలిం చుముపొగ డకునం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చాలింపు మిట్లనుట నంద్యాల..." అంటే బాగుంటుందేమో?
నీలాల నింగి నంటిన
తొలగించండివేలాదిగ ప్రాజ్ఞు లుండ వెలుగులు నింపన్
చాలింపు మిట్లనుట నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్
మేలగు వర్తనల్ గలిగి మేదిని నేరికి దీసిపోరుగా!
రిప్లయితొలగించండికాలమదెంత మారినను గౌరవ భంగము జేయకుంద్రుగా!
చేలను బోలుచుండియును జేటును జేయరదెట్టులౌను నం
ద్యాల పుర ప్రజల్ స్తుతికనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్ ?
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేలిమి బంగరునే యిల
రిప్లయితొలగించండిబోలిన వారగు జనులను బొగడగ వశమే?
యేల పలికెద వెటుల నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్ ?
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2639
*నంద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్.*
నంద్యాల వాళ్లను పొగడకూడదు, వీళ్లు విజ్ఞత లేనివారు, నీతి లేనివారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
ఛందో గోపనము ద్వారా ఈ సమస్య ఏ పద్య పాదమో వెంటనే తెలిసికొనే వీలు లేకుండా చేశారు.
సందర్భం :: మానవులు మందమతులుగా, మందభాగ్యులుగా ఉంటూ మంచిపనులు చేయకుండా ఉంటారు కలియుగంలో అని కలియుగ ధర్మాన్ని శౌనకాది మహర్షులు సూతమహర్షి దగ్గర తెలియజేశారు అని వ్యాసమహర్షి తన భాగవతంలో వ్రాశారు. ఈ విషయాన్ని పోతనగారు కూడా ఇలా చెప్పినారు.
అలసులు మందబుద్ధియుతు లల్పతరాయువు లుగ్రరోగసం
కలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే.
కాబట్టి నంద్యాల ప్రజలు ఆనాడు కృతయుగంలో పుణ్యాత్ములు, ప్రస్తుతం యుగధర్మం కారణంగా కలియుగంలో మంచివారు కాదు అని విశదీకరించే సందర్భం.
నాలుగు పాదముల్ దనరె నాడు కృతమ్మున , త్రేతఁ మూడు , నం
ద్యాలను , రెండు ద్వాపరమునన్ , బరికింపగ ధర్మ ధేను పా
దా లటు తగ్గు , వ్యాసముని దా యుగ ధర్మములన్ వచించెగా,
కాలము మారెగా , కలియు గమ్మిది గావున నేడు జూడ *నం*
*ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-4-2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఎందుకైనా మంచిది ఈమద్యకాలంలో నంద్యాలకు వెళ్ళకండి!
. కోట రాజశేఖర్ రెండవ పూరణ ( నంద్యాల వారు చాలా మంచివారు )
తొలగించండిజాలి, దయాగుణమ్ము, కృషి, సత్యము, జ్ఞానము, దాన ధర్మముల్,
శీలము, సాధుభావము, విశిష్టత నందిన వారు, సర్వదా
మేలి గుణాల నందఱిని మించెడి వారలు ; కారు కారు *నం*
*ద్యాల పుర ప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-4-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఇప్పుడు మీరు నిరభ్యంతరంగా నంద్యాల వెళ్ళవచ్చు.
తొలగించండిఏమండీ రాజశేఖర్ గారు
ఇట్లా భయపడి పద్యం మార్చేస్తే ఎట్లా :)
ధైర్యం గా మాట మీద నిలబడి వుండాలికదండీ !
జిలేబి
🙏🙏🙏
తొలగించండిమేలుగ రెండు విధమ్ముల
నేలను నింగిని కలిపిరి నెల్లూరికవుల్
వీలుగ కారౌరని నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్
శ్రీ ప్రభాకర శాస్త్రి గారూ! హృదయపూర్వక ప్రణామాలు. మీరు పద్యరూపంలో పంపిన నాప్రశంస నా ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసిందండీ. కృతజ్ఞతలు. కోట రాజశేఖర్.
తొలగించండిచాలింపుము నీ వ్యర్థపు
రిప్లయితొలగించండిప్రేలాపనలను మఱియును వెఱ్ఱి పలుకులన్
గోలను మానుమెటుల నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్ ?
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తేలిక గెల్పు నిచ్చుటకు తెన్ గు ప్రథానికి తా వొసంగు , ప్రాన్
రిప్లయితొలగించండితాల విభేదమెన్నని యుదారులు సుమా మన యాంధ్ర లోని నం
ద్యాల పురప్రజల్ , స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్
కాలము నెల్ల ప్రాంతముల కక్షల మ్రగ్గెడు క్రొత్త నేతలే .
(తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రథాని పి వి నరసింహా రావు గారిని ఆంధ్రా లోని నంద్యాల ప్రజలు పార్లమెంట్ కి ఎన్నుకున్నారు . నాటి సమైక్యతని ఉదహరించాను . ఆయన తేలికగా గెలవటానికి యన్ టి రామా రావ్ ప్రతిపక్షం లో ఉండి కూడా సహకరించాడు. తెలుగు ప్రథాని అనే మమకారం తో )
రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "...యుదారులులే మన..." అందామా?
రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "...యుదారులులే మన..." అందామా?
ఏల నిటుల ననుచుండిరి
రిప్లయితొలగించండిచాలించండిక దెలియును స్వానుభవమునన్!
ఏలిక! యే తీరున నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్?
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సాధ్యమైనంత వరకు పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి.
ధన్యవాదాలు గురువర్యా!
తొలగించండి🙏🏻
తేలిక గెల్పు నిచ్చుటకు తెన్ గు ప్రథానికి తా వొసంగు , ప్రాన్
రిప్లయితొలగించండితాల విభేదమెన్నని యుదారులహో మన యాంధ్ర లోని నం
ద్యాల పురప్రజల్ , స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతి దూరులున్
కాలము నెల్ల ప్రాంతముల కక్షల నింపెడు క్రొత్త నేతలే .
(తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రథాని పి వి నరసింహా రావు గారిని ఆంధ్రా లోని నంద్యాల ప్రజలు పార్లమెంట్ కి ఎన్నుకున్నారు . నాటి సమైక్యతని ఉదహరించాను . ఆయన తేలికగా గెలవటానికి యన్ టి రామా రావ్ ప్రతిపక్షం లో ఉండి కూడా సహకరించాడు. తెలుగు ప్రథాని అనే మమకారం తో )
ధనికొండ వారూ,
తొలగించండిసవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
రిప్లయితొలగించండినీలగళుని నవనందులఁ
గాళీ సహితాన గొల్చ, కవి సూరనకున్
మేలగు వారసు లే నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్?
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సహితమున గొల్వ" అనండి.
గురుదేవులకు ధన్యవాదములు.
తొలగించండిసవరించిన పూరణ :
నీలగళుని నవనందులఁ,
గాళీ సహితముగ గొల్వ, కవి సూరనకున్
మేలగు వారసు లే నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్?
తాలిమి తోడ మె ల్గుచును ధర్మము తప్పని మేటి వార లై
రిప్లయితొలగించండికీలక నిర్ణ యాలు గొను గేస్తులు గా నుతు లంది నార హో
మేలిమి కృత్యము ల్ స లి పి మేదిని వెల్ గెడి వార లె ట్లు నం
ద్యాలపుర ప్రజల్ స్తుతి క న ర్హు లవిజ్ఞులు నీతి దూరు లు న్ ?
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిజాలము లేవెఱుంగకయె సన్నుతు లందెడునట్టి మేటి నం
ద్యాలపురప్రజల్ ఘనులు దాతలు మాన్యులు సాహితీ ప్రియుల్
మేలొనఁ గూర్చుచుందురయ! మీ రన ధర్మమె? కారు కారు నం
ద్యాలపురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండివాలము లేదుగాని మరి,వానర జాతి వతంసులే గదా
రిప్లయితొలగించండిపోలిక చెప్పవచ్చు శశిభూషణుఁ నందిని వారి భక్తికిన్
వేలుగ బ్యాంకు ర్యాంకులట, పేలెను,ప్రాజ్ఞులు వారు,కారు *నం*
*ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్*
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
శ్రీహర్ష గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలకులాడు మాటలను బాధ్యతతోడ గ్రహించి వారి లో
రిప్లయితొలగించండిపాల క్షమించి నమ్ముదురు వంచన నెంచక నేతలందునన్
జాలము లేని వారలు రసజ్ఞు లమాయకు లెంచ నెట్లు నం
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవధాని ఆముదాల మురళి గారి పూరణ.....
రిప్లయితొలగించండిశైలనిభంపు గష్టముల సాహసవృత్తి భరించినారు, మీ
సాలను దువ్వకుండగనె శత్రుల గుండెలఁ జీల్చినారు, ప
ద్యాలను జెప్పినారు రసభావమనస్కులు; కారు కారు నం
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు, లవిజ్ఞులు, నీతిదూరులున్.
. కోట రాజశేఖర్ రెండవ పూరణ ( నంద్యాల వారు చాలా మంచివారు )
రిప్లయితొలగించండిజాలి, దయాగుణమ్ము, కృషి, సత్యము, జ్ఞానము, దాన ధర్మముల్,
శీలము, సాధుభావము, విశిష్టత నందిన వారు, సర్వదా
మేలి గుణాల నందఱిని మించెడి వారలు ; కారు కారు *నం*
*ద్యాల పుర ప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-4-2018)
గ్రోల ధనమ్మును తమ పా
రిప్లయితొలగించండిర్టీలను మార్చి చరియించు రీతిని కని నే
రాలను నిరసించని నం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిఏలిక పివి గెలిచె నెచట?
రిప్లయితొలగించండిమేలగు నాచరణ నెవరు మిన్నగ మన్నున్?
శీలము గోల్పోయిన? నం
ద్యాల, పురప్రజలు, స్తుతి కనర్హు లవిజ్ఞుల్!
సీతాదేవి గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండివాలము నందుండు విషము
రిప్లయితొలగించండితేలునకు దురాత్ముల కది దేహం బెల్లం
గ్రాలును గావున నభినం
ద్యాల పురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్
[అభినంది+ఆల పురప్రజలు= =అభినంద్యాల పురప్రజలు:: సంతోషపు తేలుకొండి వంటి నగరజనులు; ఆలము = తేలుకొండి ]
మేలుగ గౌరవింపఁ దగు మించిన పండిత కోటి నిద్ధరం
గేలు మొగిడ్చఁ గీ డగును గీర్తన సేయ దురాత్ములం జుమీ
చాలిఁక విజ్ఞులై కల రసత్య విశారదులుం గనుండు నం
ద్యాల పురప్రజల్! స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిగురుదేవులకు నమస్సులు!
రిప్లయితొలగించండిఆరాశవాణి వారి సమస్యకు నా పూరణను పరిశీలింప ప్రార్ధన!
ధర్మరాజు
ఎన్నడు సత్యమున్ బలుకు, నేరికి ద్రోహము నెంచడెప్పుడున్
మన్నన బొందుచున్ బుథుల, మాయని కీర్తిని ధర్మమూర్తిగా
నున్నత రీతులన్ బరుల కున్నతి గూర్చుచు నెట్టి థూర్తపుం
గన్నులు లేనివాడు కనగల్గెను లోకము కన్నువిందుగన్!
బాగుంది.
తొలగించండి
తొలగించండిఆ,రాశ, వాణియే :)
జిలేబి
గురుదేవులకు ధన్యవాదములు!
తొలగించండి🙏🙏🙏🙏
జిలేబిగారూ! ఈ మధ్య అది నిరాశ వాణిగా ఐపోయింది! 😊😊😊
తొలగించండి
తొలగించండిఓ లార్డ్ మెర్సీ బీ అపాన్ అస్ !
అన్నుల మిన్న గాను నిను నాడుచు నమ్మగ కాళ్ళులేనివా
డెన్న భళారె వేగముగ రెక్కల జాపుచు లేచె నయ్య నీ
సన్నిధి చేర గాను ప్రభు! సాచివిలోకితమౌత నీదయన్
కన్నులు లేనివాడు కనగల్గెను లోకము కన్నువిందుగన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
పాలసముద్ర మందు బ్రభవమ్మును గాంచిన లక్ష్మి యుండె | పా
పాల నెరుంగ నట్టి జనవాహిని యిచ్చటనే వసించు | లో
పా లవి కానిపించవు | కృపారస సేచకు లై చరిం త్రికన్ |
పాలన సేయుచుండు నవనందుల యీశుడె | నిత్యసాహితీ
పాలకు | లాదరింత్రు బుధ వర్గము నెప్పుడు || కారు , కారు నం
ద్యాలపురప్రజల్ స్తుతి కనర్హులు విఙ్ఞులు నీతిదూరులున్ ! !
( సేచనము = వెదజల్లు ; సేచకుడు = వెదజల్లు వాడు )
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి
తొలగించండిగు రు భ్యో న మః • ధ న్య వా ద ము లు గు రు వ ర్యా ! !
పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నాటి (శ్రీ రామ నవమి) మీ మనోరంజక సమస్యలకు నా పూరణములు:
రిప్లయితొలగించండిఇక్ష్వాయుధ జనకుండు ము
ముక్ష్వాశ్రయ సుప్రదాత పూజ్యుండు మహా
భిక్ష్వాత్మ సఖుఁడు రణ తు
ల్యేక్ష్వాకు కులాబ్ధి చంద్రుఁ డీ కృష్ణుండే
ఇక్ష్వత్యుగ్ర శరాసన చ్యుత శితాగ్రేషు క్షతాత్మున్ శివున్
చక్ష్వాభీల హుతాశన జ్వలిత నిస్కంధుం డుమా నాథునిన్
భిక్ష్వాగ్రేసర పూజనీయ కబరీ వేశ్మున్ విలోకించె తు
ల్యేక్ష్వాక్వన్వయ దుగ్ధవార్ధి శశియౌ నీ కృష్ణుఁడే చూడఁగన్
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణలు. అభినందనలు.
ఈ పద్యాలను చదివి స్పందించినట్టున్నానే!
కంది శంకరయ్యమార్చి 26, 2018 2:26 PM
తొలగించండికామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. ముఖ్యంగా నామగోపన విధానంలో చేసిన రెండవ పూరణ అనన్యసామాన్యం. అభినందనలు.
పూరణలను అనుసరించిన శ్రీరామస్తుతి దుష్కరప్రాసతో అద్భుతంగా ఉన్నది.
మీ పద్యాన్ని చూసిన తర్వాత ఈ సమస్య తోచింది. "ఇక్ష్వాకు కులాబ్ధి చంద్రుఁ డీ కృష్ణుండే" (లేదా...) "ఇక్ష్వాక్వన్వయ దుగ్ధవార్ధి శశయౌ నీ కృష్ణుఁడే చూడఁగన్".... ఎలా ఉంటుంది?
అమ్మా జిలేబీ గారూ,
ఇదేదో సరదాకు అనుకున్న సమస్య. బ్లాగులో ఇవ్వడం లేదు.
సవరణతో :
తొలగించండిఇక్ష్వత్యుగ్ర శరాసన చ్యుత శితాగ్రేషు క్షతాత్మున్ శివున్
సక్ష్వే లాయత కంఠ భాసిత మహా శర్వుం డుమా నాథునిన్
భిక్ష్వాగ్రేసర పూజనీయ కబరీ వేశ్మున్ విలోకించె తు
ల్యేక్ష్వాక్వన్వయ దుగ్ధవార్ధి శశియౌ నీ కృష్ణుఁడే చూడఁగన్
ఉత్పలమాల(మాలిక)
రిప్లయితొలగించండినాలుగు దిక్కులందు నవనందుల దీవెన లందుచుండగన్
శూలిపదార్చనన్నుడువసూరన రాఘవ పాండవీయమున్
మేలుగ నా కళోదయముమేదిని నాధుని కాది కావ్యమై!
నీలము వారలొక్కరినినేరుగ రాష్ట్రపతిన్నొనర్చుచున్
శీలుడటంచు పీవి నరసింహు ప్రధానిగ జాతికిచ్చి శ్రీ
శైలపు నీటి పారకము సస్య మొనర్చగ నన్నపూర్ణయై
చాలిన వారసత్వమునసంబర మందగ నౌదు రెట్లు నం
ద్యాలపురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్?
(కళోదయము = కళాపూర్ణోదయం)
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురుమూర్తి ఆచారి
తొలగించండి** VERY GOOD **
..... ....
గురుదేవులకు మరియు గురుమూర్తి గారికి ధన్యవాదములు
తొలగించండికాలము జెప్పుచుండెగద కావ్యసుధారసభావబంధముల్
రిప్లయితొలగించండిమూలముబంచె”సూరన”సమూహమురాయల మెప్పు బొందె|నం
ద్యాల పుర ప్రజల్ స్తుతికనర్హుల?”విజ్ఞులు”|నీతి దూరులున్
దేలరు|పండితుల్గలరు|దీప్తినిబెంచెను నందియాలతో. {నంద్యాల =నంది+ఆలు=పాలు}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
చాలు పరాపనిందలిక, చక్కని వారు పరోపకారులై
రిప్లయితొలగించండిమేలును గూర్చువారిలను మేధను గల్గినవారుగారె వా
చాలత లేని సద్గుణులు శాస్త్రమెఱంగిన వారు, కారు నం
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
హాలికు లథిపతులు కవులు
రిప్లయితొలగించండిమేలిమి మనుజుల నెలవిది మేదిని జూడన్
యేల పలికెదరిటుల నం
ద్యాలపురప్రజలు స్తుతి కనర్హు లవిజ్ఞుల్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండివేల కొలది దీవెనలట
చాలవటంచు పలుకగా సరసచతురలనన్
కాలమహిమాన్ గతనం
ధ్యాలపుర ప్రజలు స్తుతి కనర్హుల విజ్ఞుల్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజాలము చేయగా నిచట జాలిగ చూసిన వేచునే మదిన్
రిప్లయితొలగించండిమేలము లాడగా నగవు మేలిమి తీయని మందహాసమున్
తాలిమి చూడగా తినగ తాళగ విందుల వేడుకే గ,నం
ద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు లవిజ్ఞులు నీతిదూరులున్
Dr H Varalakshmi
Bangalore
(Cancelled?)
04-04-2018
.........సమస్య
రిప్లయితొలగించండి*"నంద్యాల పురప్రజల్ స్తుతి కనర్హు*
*లవిజ్ఞులు నీతి దూరులున్" *
సందర్భము: నంద్యాల ప్రాంతంలో నందీశ్వరుడు తొమ్మిది రూపాలలో వెలసినాడు. అవి నవ నందులుగా ప్రసిద్ధములు. చామ కాల్వ ఒడ్డున గల నంది. నాగ సోమ సూర్య శివ కృష్ణ (విష్ణు) గరుడ వినాయక నామములతో నలరారే నందులు ఏడు.
సుప్రసిద్ధమైన స్వయంభువైన *మహానంది* యొకటి. ఇక్కడినుంచి సుమారు ఇరువై కి.మీ. దూరంలో ఇవన్నీ నెలకొని వున్నాయి. సకల జనుల పాపహరములై వెలిగిపోతూ వున్నాయి. అందువల్ల ఈ ప్రాంత ప్రజలు సంప్రదాయజ్ఞులు.
ఇంకా ఈ ప్రాంతంలో కొత్తూరు అనే పుణ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి సర్ప రూపంలో వెలసి అనుగ్రహిస్తూ వున్నాడు. దీనినే ఎస్. కొత్తూరు లేక *సుబ్బరాయ కొత్తూరు* అని పిలుస్తారు. ("నవ్య గ్రామ" మని యిందులో పేర్కొనబడింది.)
మాన్యశ్రీ విద్వాన్ గొట్టిముక్కుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ క్షేత్రం గురించి అపురూపమైన గ్రంథాన్ని వ్రాశారు. దాని పేరు
*కోరిన వారికి కొంగు బంగారం శ్రీ కొత్తూరు సుబ్బరాయుడు క్షేత్రం.* ఆ స్వామి కంకితంగా చి. మేడిచర్ల హరినాగభూషణం "కొత్తూరు సుబ్బరాయుని శతకము" ను సంతరించినారు.
కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజలు దైవ భక్తి సంపన్నులు.. సాహితీ ప్రియు లని అర్థ మౌతున్నది. వీరు స్తుతి పాత్రులే! విజ్ఞులే! అనవచ్చు.
అందువల్ల వీరు అనర్హులు, అవిజ్ఞులు అనే మాటలు సత్య దూరములే!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
నాలుగు నైదు రూపముల..
నంది కటాక్షముఁ జూపు పుణ్యమౌ
నేలయు.. సుబ్బరాయ డిట
నిల్చి దయన్ గను "నవ్య గ్రామ" దే
వాలయ మున్న నేల.. విన
వా! యిటు లన్నను సత్య మౌనె! "నం
ద్యాల పుర ప్రజల్ స్తుతి క
నర్హు, లవిజ్ఞులు నీతి దూరులున్"
🖋~డా.వెలుదండ సత్యనారాయణ