23, ఏప్రిల్ 2018, సోమవారం

సమస్య - 2658 (మోదము నందెదరు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్"
(లేదా...)
"మోదము నందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్"

124 కామెంట్‌లు:




  1. మా నారా వారి మన్ కీ "ఫట్" గా :)


    మోదీ మోదీ యనిరే
    నోదార్పులు కూడ లేవు నోర్మియు లేదే
    పోదు సుమి మీ బడాయీ !
    మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్?



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "యనిరే। యోదార్పులు కూడ లేవె యోర్మియు..." అనండి.

      తొలగించండి
  2. ఖేదము లేకుండినచో
    భేదమ్ములు రాజకీయ భిన్నమ్ములతో
    వాదము ప్రతివాదముతో
    మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    ఏ దయ లేనివాడు , జనులెవ్వరినిన్ దరి జేరనీడు , సం...
    పాదన దక్కనీడు , పలు పన్నుల సమ్మెటపోటులట్లుగా
    మోదియు మోది మోది భయమున్ కలిగించి యశాంతిఁ బెంచెడున్
    మోదము నందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్"

    మోదమును + అందరు (అందుకొనరు) + ఏ ప్రజలు....
    ఎవ్వరూ సంతసింపరని భావము.

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. భేదమనస్కయైన సతి , విద్యల నేర్వని యాత్మజుండు , వా..
      గ్వాదములాడు పుత్రిక , వివాదముఁ బెంచెడి బంధువర్గమున్ ,
      మోదము గూర్చినట్టులు , సముద్రజలంబుల తీపి వోలె స...
      మ్మోదమునందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్ !


      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. ఆహాహ్లాదముఁగూర్చెమీరచనమందానందమొప్పారెనిం
      దూహాపోహలకింతతావయిన నిర్దుష్టేతరంబైన సం
      దేహభ్రాంతివికారమైననొకియింతేనింక లేదీవిధ
      మ్మీహోరున్ కవితాఝరిన్ వెలయ మిమ్మేప్రస్తుతింతున్ కవీ!
      సౌహార్ద్రప్రతిభావరేణ్య! మురళీ! సద్యస్స్ఫరద్ధీమణీ!

      గౌరీభట్ల బాలముకుందశర్మ,
      గోలోకాశ్రమము.

      తొలగించండి
    4. శ్రీ బాలముకుందశర్మణే నమః🙏

      సారోదార సుశబ్ద భాసుర ప్రశంసావాక్య నిర్మాణ గం..
      భీరార్థప్రతిపాదకామల లసద్విజ్ఞానవిద్యా యశో
      ధీరానందకరానుమోదితవచోదివ్యాకృతీ ! భారతీ !
      గౌరీభట్ల శుభాకృతీ యని నమస్కారమ్ములర్పించెదన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. సేయంసత్కవితావితానకలితా శ్రీశారదాసారదా
      వాఙ్నైపుణ్యవిధాతృమండితసుధా భావప్రచోదాముదా |
      సారాసారవిచారధారకరుణా‌ సంచారసచ్చారితా
      దత్తాస్వాదమృదూక్తియుక్తవచనం తాంనౌమి దోషాపహామ్ || 🙏🏻

      ...గౌరీభట్ల బాలముకుంద శర్మ

      తొలగించండి
  4. ఏదీ కుదరని ఆంక్షలు
    ఖేదము గలిగించు శిక్ష కోరి విధించ
    న్నాదర ముగప్రీతి కురియగ
    మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కోరి యిడగ నా। యాదరముగ..." అనండి.

      తొలగించండి
    2. ఏదీ కుదరని ఆంక్షలు
      ఖేదము గలిగించు శిక్షకోరి యిడగనా
      యాదర ముగప్రీతి కురియగ
      మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచే

      తొలగించండి


  5. జూదము లొడ్డ గా నరరె చూకురు గల్గెను రాష్ట్ర శోభకున్
    మాదము గూడగన్ జనులు, మాన్యత, ధీమక శక్తి చూడరే,
    మోదమునందరే! ప్రజలు, మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్
    ఖేదము చెంది నిల్తురయ, కేవడముల్ గొని కత్తి కట్టగన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చూకురు, మాదము, ధీమక, కేవడము శబ్దాల అర్థాలకోసం ఆంధ్రభారతి తలుపు తట్టవలసి వచ్చింది.

      తొలగించండి

    2. మాస్టారు గారికే పని పెట్టామన్న మాట :)

      నెనరులు కందివారికి

      నిన్నటి నిషిద్ధారి దుమారం చూసేరా ?

      కొండల రాయుడిని "రవలడ్డు" లేకుండా ర వ లడ్దు లేకుండా స్తుతించేరు శంకరాభరణ కవులు :)




      జిలేబి

      తొలగించండి
  6. వాదము లేని జీవనము,పాడియు పంటయుఁగల్గు పట్టునన్
    మోదము నందరే ప్రజలు;-మూర్ఖుడొకండు నృపాలుడైనచో
    ఖేదముఁగల్గు నెల్లరకు,కిల్బిష క్రూర విధాన వర్తనల్
    పాదులువేయ,దుష్ట పరిపాలన రోదన కాలవాలమౌ.

    రిప్లయితొలగించండి
  7. వేదమె జన సేవయనగ
    "మోదము నందెదరు ప్రజలు; మూర్ఖ నృపునిచేన్"
    వేదన పడుదురు చివరకు
    వాదము లింకేమిలేక వాని న్విడరే!

    రిప్లయితొలగించండి
  8. ఆదరణకలుగు నేలన
    మోదము నందెదరు ప్రజలు, మూర్ఖ నృపునిచేన్
    ఖేదమునొందుట తథ్యము
    బీదల బాధలనెరుగక బీరముచూపన్

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2658
    సమస్య :: మోదము నందరే ప్రజలు మూర్ఖు డొకండు నృపాలు డైనచో.
    ఒక మూర్ఖుడు రాజు ఐనట్లయితే ప్రజలు సంతోషాన్ని పొందుతారు కదా అని చెప్పడం ఈ పద్యంలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శ్రీ రామ చంద్ర ప్రభువు కోసల దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు. ఎలాంటి వాదనలకు తావు లేకుండా, యేమాత్రం స్వార్థం లేకుండా, ఎవరికీ భయపడకుండా, ఎక్కడా బాధపడకుండా, ఎటువంటి అపకీర్తిని పొందకుండా, ప్రజలందఱూ అన్ని కాలాలలో *రామరాజ్యమే* కావాలి అని కోరుకొనే విధంగా శ్రీరాముడు రాజ్య పరిపాలన చేశాడు. శ్రీ రాముని వంటివాడు కాకుండా ఒక మూర్ఖుడు రాజు ఐనట్లయితే ఏ ప్రజలూ సంతోషాన్ని పొందరు అని విశదీకరించే సందర్భం.

    వాదము లేక, యెన్నడును స్వార్థము లేక, భయమ్ము లేక, యే
    ఖేదము నందబోక, యపకీర్తిని బొందక, *రామరాజ్యమే*
    మోదము గూర్చు నిత్య మని పౌరులు పల్కగ , రాము డేలెగా,
    *మోదము నంద రే ప్రజలు మూర్ఖు డొకండు నృపాలు డైనచో.*
    {మోదము నందరు+ఏ ప్రజలు = మోదము నంద రే ప్రజలు}
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. (సవరణను దయతో గమనింప ప్రార్థన మూడవ పాదంలో)
      మోదము గూర్చు నంచు జనముఖ్యులు పల్కగ, రాము డేలెగా,
      (అవధాని శ్రీ లక్ష్మీకాంత రాజారావుగారికి ధన్యవాదాలతో)

      తొలగించండి
    3. నేటి రెండవ పూరణ (కోట రాజశేఖర్)
      వాదముతో, శకారు డిల స్వార్థముతో, కడు దుష్ట బుద్ధితో,
      ఖేదముతో, సతమ్ము నపకీర్తులతో, ఘన మూర్ఖ రాజుగా,
      వేదన గూర్చెగా ప్రజకు, వింతగ పాలన జేసి ; యెన్నడున్
      *మోదము నంద రే ప్రజలు మూర్ఖు డొకండు నృపాలు డైనచోన్.*
      {మోదము నందరు+ఏ ప్రజలు = మోదము నంద రే ప్రజలు}
      *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (23-4-2018)

      తొలగించండి
  10. వాదము లేలనో!ప్రజల బాగు దలంచుచు బిడ్డలట్లుగా
    పేదల సాకుచున్ గడిమి వేదన లొందని పాలనమ్మునన్
    మోదము నందరే ప్రజలు!; మూర్ఖుడొకండు నృపాలుడైనచో
    ఖేదము నందరే జనులు!, ఖిన్నులు గారె. దురంత బాధలన్.

    రిప్లయితొలగించండి
  11. కం.
    ఆదుకొను రాజు వలనన్
    మోదమునొందెదరు ప్రజలు ,మూర్ఖనృపునిచేన్
    ఆదాయమున్న కానీ
    వేదనలే మిగిలె నకట! వేదధరణిలో...

    రిప్లయితొలగించండి
  12. చేదగు పాలన మఱియును
    వేదన గలిగించు చుండు వికృతపు చేష్టల్
    రోదనల నడుమ నెవ్విధి
    "మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్?"

    రిప్లయితొలగించండి
  13. ఓటుకు నోటుతొ పాటుగ తాగుటకదె
    మందిత్తురు
    ఎన్నికలవి ముగియు వరకు జాతరలను
    తలపింతురు
    ప్రజల స్వామ్యం ఈగతి కామ్యములు
    తీర్చగన్
    మోదము నందెదరు ప్రజలు మూర్ఖ
    నృపునిచేన్

    రిప్లయితొలగించండి

  14. గాథలవి రాజధానిని
    చేదగు రీతిని దొరల్చ చీటికిమాటిన్
    దాదా తుగ్లకు వనుచును
    మోదము నందెదరు ప్రజలు మూర్ఖనృపునిచేన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      థ-ద లకు ప్రాసమైత్రి లేదు. 'చీటికిమాటికిన్' అనడం సాధువు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా!
      సవరించిన పూరణ
      కాదన్నను రాజపురిని
      చేదగు రీతిని దొరల్చ సేనలతోడన్
      దాదా తుగ్లకు గాథల
      మోదము నందెదరు ప్రజలు మూర్ఖనృపునిచేన్

      తొలగించండి
  15. ఏదియు జేయకే ప్రజల కెవ్విధి సుంతయు మేలు గూర్చకే
    కాదని జెప్పచున్ జనుల కామిత సౌఖ్యము లెల్ల వేళలన్
    వేదన కల్గ జేయుచును వెఱ్ఱిగ వర్తిలు చుండ నెప్పుడున్
    "మోదము నందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్"
    ****)()(****
    (మోదము నందరు + ఏ ప్రజలు )

    రిప్లయితొలగించండి
  16. దారి చూపిన మైలవరపు వారికి ధన్యవాదములతో...🙏🏻

    వేదము యంచు నా జనుల వేడుక సేవను జేసినంతటన్
    మోదము నందరే! ప్రజలు మోహన రీతిన పాలనందగన్
    వాదము లేల వేయి మరి పాపపు పాలన సల్పుచుండినన్
    "మోదము నంద రే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేదము + అంచు = వేదమంచు' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "వేద మటంచు" ఆనండి.
      'పాలనందగన్' అన్నచోట 'పాలనన్ + తగన్' అన్న విరుపుంటే సరే. కాని 'పాలన + అందగన్' అన్న విరుపు కుదరదు. "పాలన నందగన్" అన్నది సాధువు.

      తొలగించండి
  17. సాదర ప్రభు పాలన లో
    మోదము నందె ద రు ప్రజలు ;మూర్ఖ నృపుని చే న్
    చేదగు నను భవ ము గలిగి
    వాదు కుదిగెదరు విసిగి యు వసుధ ను జన ము ల్

    రిప్లయితొలగించండి
  18. వాదన తోఖలు లెప్పుడు
    మోదము నందెదరు, ప్రజలు మూర్ఖ నృపుని చేన్
    వేదన బొందుచు నిత్యము
    రోదించుచునుంద్రు గాదె లోకము నందున్

    రిప్లయితొలగించండి
  19. వేదనను రాజు తీర్చిన
    మోదమునందెదరు ప్రజలు మూర్ఖనృపుని చేన్
    రోదన తప్పదు జనులకు
    వాదనలేదింక వినుము భారమె బ్రతుకుల్

    రిప్లయితొలగించండి

  20. ఆదర మొప్పగన్ బ్రజల యాలన పాలన జూచు చుండగన్
    "మోదము నందరే ప్రజలు ; మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్"
    వేదన బొందరే జనులు వేసట జెందుచు బాధనొందుచున్
    కాదను వారలుండరుగ కానగ సత్యము చింతజేయగన్.

    రిప్లయితొలగించండి
  21. (సవరణను దయతో గమనింప ప్రార్థన మూడవ పాదంలో)
    మోదము గూర్చు నంచు జనముఖ్యులు పల్కగ, రాము డేలెగా,
    (అవధాని వరేణ్యులు శ్రీ లక్ష్మీకాంత రాజారావు గారికి ధన్యవాదాలతో)

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆదుకొను దొర లభించిన
    మోదము నొందెదరు ప్రజలు; మూర్ఖ నృపునిచేన్
    ఖేదము చవిగొను వారలు
    నౌదాస్యముతో నుపేక్ష నందరె నెపుడున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..నందరె యెపుడున్' అనండి.

      తొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆదుకొను దొర లభించిన
    మోదము నొందెదరు ప్రజలు; మూర్ఖ నృపునిచేన్
    ఖేదము చవిగొను లోకులు
    నౌదాస్యముతో నుపేక్ష నందరె నెపుడున్?

    రిప్లయితొలగించండి
  24. ఖేదము లొందుచుఁ మేలని
    వాదముఁ జేయుచు మురిసెడు వైధేయుల యా
    మోదముకని దుర్బలతన్
    మోదమునందెదరు ప్రజలు మూర్ఖనృపుని చేన్

    రిప్లయితొలగించండి
  25. భూదారి వంటి భూపతి
    సోదిని జెప్పుచు ను బాగు చూడని వాడ
    య్యే! దీనుల యే పాప
    మో! దము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్

    దము - డమరుకం, డోలు

    మూర్ఖ రాజు పాలన వలన ఉద్యమించి డోలు పట్టారు జనాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకర్ గారూ,
      వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అయ్యే' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. భూదారి వంటి భూపతి
      సోదిని జెప్పుచు ను బాగు చూడని వాడ
      య్యేన్! దీనుల యే పాప
      మో! దము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచేన్

      తొలగించండి
  26. [23/04, 08:22] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
    రోదనచెందినన్ గనక కౄరత వీడక పౌరులన్ సదా
    వేదనలందునుంచుచున విజ్ఞుడు భూపతి నీతిదప్పనా
    మోదముతోడయెన్ను కొనిన మొద్దని యెంచలేక తా
    మోదమునందరే ప్రజలు మూర్ఖుడొకండు నృపాలుడైనచోన్
    [23/04, 08:23] Nvn Chary: తము *ఓదము* జంతువులు పడేందుకు తీయు గొయ్యి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క్రూరత' టైపాటు. మూడవ పాదంలో గణదోషం. "మోదముతోడ నెన్నుకొన..." ఆనండి.

      తొలగించండి
  27. డా.పిట్టా సత్యనారాయణ
    జూదము త్రాగుడు భోగమె
    నాదముగా నడువ నాప నౌనడెపుడున్
    వాదమె లేదను కుహనా
    మోదమునందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచే

    రిప్లయితొలగించండి
  28. డా.పిట్టా సత్యనారాయణ
    పాదము మంచిదై వసుధ బంగరు పంటలనివ్వ, శత్రువు
    న్నూదరగొట్టి యాపు కళ నోచిన వాడయి పద్మ రేకులన్
    సాదర లీల నిద్రగను చక్కని రేడన"Nero"నీరొ తమ్ముడే
    జూదమునాడుచున్ జనుల జూడని మూలవిరాట్టు మ్రోల నా
    మోదము నందరే ప్రజలు మూర్ఖుడొకండు నృపాలుడైనచోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  29. రాజకీయ ప్రజలు:

    ఖేదము లేకయే జనుల ఖిన్నతనొప్పక విర్రవీగుచున్
    భేదములన్నిటిన్ మలచి భీకర రూపుల చిక్కులల్లుచున్
    వాదనలాడుచున్ మురిసి వాగుచు సాగుచు వీధులందునన్
    మోదము నందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్!

    రిప్లయితొలగించండి
  30. కాదన గలమే యితని మ
    హోదారుఁడు సాధువృత్తుఁ డుత్తముఁ డెంచన్
    వేదన లుండవు ఘన స
    మ్మోదము నందెదరు ప్రజలు మూర్ఖ! నృపునిచేన్


    ఆదరణీయ మంత్రి గణ మారయ నోచని దేశ మందునన్
    సాదర జీవనక్షయము హ్లాద వినాశ కరమ్ము నిత్యమున్
    ఖేద పరంపరా జనిత కీర్ణ కపోల యుగోష్ణ నేత్ర భీ
    మోదము నందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలుఁ డైనచోన్

    [భీమ+ఉదము భీమోదము; ఉదము = నీరు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణలు ఉత్తమంగా ఉన్నవి. మొదటి పూరణలో 'మూర్ఖ' శబ్దాన్ని సంబోధనగా చేయడం అనన్యసామాన్యం. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వేదన నీయనట్టిదగు పెత్తనమెంచుచు వన్నెకెక్కెడిన్
    మాదిరి శాసనమ్ములిడు మాన్య మహీపతి పాలనమ్మునన్
    మోదము నందరే! ప్రజలు; మూర్ఖుడొకండు నృపాలుడైనచోన్
    ఖేదముగల్గి లోకులట కీడును బొందుచు నుందురే గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  32. ఉత్పలమాల
    రాదగు వంశనాశనము రాముని కీయగ జానకీ సతిన్
    రాదన సోదరుండు విన రావణు డొప్పక విర్రవీగినన్
    మీదట జాతినష్టమున మిత్తిని జూపఁగ రామచంద్రుడున్
    మోదము నంద రే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయదోషం ఉన్నది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. అన్వయదోషము వివరించ దిద్దుకొందునని ప్రార్థన

      తొలగించండి
    3. శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారి సూచిత సవరణతో :
      ఉత్పలమాల
      రాఁ దగు వంశనాశనము  రాముని కీయగ జానకీ సతిన్
      రాదన సోదరుండు , విని , రావణు డొప్పక విర్రవీగినన్
      మీదట , దైత్యజాతిఁ గన మిత్తిని పొందె సమూలమట్లు , స...
      మ్మోదము నంద రే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్!

      తొలగించండి
  33. జూదము వంటి యెన్నికల జొచ్చిన నేతలు గెల్చినంత, సం
    పాదన గోరుచుంద్రు, సము పార్జన జేయగ వక్రమార్గమున్
    బేదలు గొప్పవారనెడు భేదము చూపని వేళలో గదా
    మోదము నందరే ప్రజలు మూర్ఖుడొకండు నృపాలుడైనచోన్

    ( మోదము నందరు ఏ ప్రజలు..........)

    రిప్లయితొలగించండి
  34. ఖేదము చెందగ మదియే
    మోదము నెటులుండనోపు మోసపు పాలన్
    చేదుని రాజే తేనెన
    మోదము నందెదరు ప్రజలు మూర్ఖనృపునిచేన్


    Dr H Varalakshmi
    Bangalore

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మోసపు పాలన్ చేదుని రాజే తేనెన'... అర్థం కాలేదు.

      తొలగించండి
  35. కందం
    నా దగు బీకాం నందున
    నాదట జదివితి కెమిస్ట్రి నందితి మార్కుల్
    వాదన లేలని బల్కగ
    మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపునిచే!

    రిప్లయితొలగించండి
  36. ఆదరణంబగు రాజన?
    మోదము నందెదరుప్రజలు:మూర్ఖనృపునిచేన్
    కాదన లేకను నష్టపు
    వేదన వెటకారమందు విసుగున బ్రతుకౌ!

    రిప్లయితొలగించండి
  37. నా కంప్యూటర్ పాడై పోయంది బాగు అయిందాక బ్లాగుకు వీడ్కోలు బై బై

    రిప్లయితొలగించండి
  38. బేధము నెంచగా మతము వింతగు పన్నుల వేసెనొక్కడున్
    వాదము చేయుచున్ మిగుల వంతల బెట్టెనొకండు యూదులన్
    మాదగు దేశమున్ విడిచి మాతృపురమ్ము జనుండనొక్కడున్
    కాదని మమ్ములన్ జగతి కమ్ముల నెవ్వడు గూర్చునోయనన్
    మోదము నంద రే ప్రజలు మూర్ఖుడొకండు నృపాలుడైనచో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అని + ఒక్కడ' అన్నపుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. తప్పని తెలిసినా తప్పలేదాచార్యా! సవరణ సూచించ ప్రార్ధన!🙏🙏🙏

      తొలగించండి
    3. చక్కని సవరణ సూచించినందులకు ధన్యవాదములార్యా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
    4. మనోహరమైన పూరణ డా. సీతా దేవి గారు. నమస్సులు.

      తొలగించండి
  39. వాదముల, వర్గ,కుల, మత
    భేదముల ననుదినము తగ పెంచుచు పోవన్
    ఖేదమును గాక యే దెస
    మోదము నందెదరు ప్రజలు మూర్ఖ నృపుని చేన్?

    గురువర్యులకు నమస్సులు, నా నిన్నటి పూరణను కూడా పరిశీలించి తప్పొప్పుల తెలియజేయ ప్రార్థన.
    ఆపదనిన యాదుకొనెడి యయ్య, సతము
    నీదు నామమె గొని సాగి పోదు నేను
    అన్నమయ్య పాడిన పాటనందు కొనుచు
    భక్తి తోడ నుతింతును పద్మనాభ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "ఆపదనిన నాదుకొనెడి..." ఆనండి.

      తొలగించండి
  40. మిత్రులందఱకు నమస్సులు!

    ఖేదము నిచ్చుచున్, సతముఁ గేఁకలు వేయుచు, నెల్లవారలన్
    భేదపు దృష్టినిన్ గనుచుఁ, బేదల కెప్పుడు హానిఁ జేయుచున్,
    "నాదియ యాజ్ఞ మీఱిన జనాలకు దండన నిత్తు!" నాన్, మహా
    మోదము నంద, రే ప్రజలు, మూర్ఖుఁ డొకండు నృపాలుఁ డైనచోన్!
    [మోదమున్ - అందరు + ఏ ప్రజలు]

    రిప్లయితొలగించండి
  41. ఆదరణమ్మును చూపగ
    మోదము నందెదరు ప్రజలు,మూర్ఖనృపునిచేన్
    వేదన తప్పదు ప్రజకిల
    వాదనలే మిగులు కాని బాధలు హెచ్చున్.

    మేదిని నేలిన చక్కగ
    మోదము నందెదరు ప్రజలు,మూర్ఖనృపునిచేన్
    రోదనలే మిగులు భువిని
    పేదలకనుచు విలపించె పేద యొకండున్

    రిప్లయితొలగించండి
  42. రిప్లయిలు
    1. బాధలు వీడగ బహుస
      మ్మోదము నందెదరు జనులు మూర్ఖనృపునిచేన్
      బోధించుచు సన్మార్గము
      సాధింపగ గొప్ప మార్పు సంఘటితముగన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  43. వేదమునైన తప్పనుచు వేలుపు లేడనుచిత్తవృత్తితో
    జూదము,కామవాంచ మనసొప్పని కార్యమునిండుగర్వమున్
    ఆదరణంబు లేక ప్రజకందక పాలన సాగు టన్నచో?
    మోదమునంద రేప్రజలు మూర్ఖు డొకండు నృపాలు డైనచో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గర్వమున్ + ఆదరణంబు' అని విసంధిగా వ్రాయరాదు కదా?

      తొలగించండి
  44. (2)
    గాదెల దాఁగుచుండుఁ, జిఱుగాలులకే భయమందుచుండుఁ, దాన్
    "బేదల కన్నఁ బేద" నని పెద్దగ నేడ్చుచునుండుఁ, బ్రేమగా
    జాదులఁ జూపి, వాని "జలజమ్ము" లటంచునుఁ బల్కఁ, గాంచుచున్
    మోదము నందరే ప్రజలు, మూర్ఖుఁ డొకండు నృపాలుఁ డైనచోన్!

    రిప్లయితొలగించండి
  45. యోధుడు రాజైన సతము
    మోదము నందెదరు ప్రజలు, మూర్ఖ నృపునిచేన్
    రోదనలఁ జలుపు చుందురు
    వేదనల భరించలేక వెఱ్రి కొలువునన్

    రిప్లయితొలగించండి
  46. (3)
    దూదినిఁ జూపి, లోహమనఁ; దొందరగాఁ జనుదేర జాప్యమన్
    వాదముఁజేయఁ; దాను వనిఁ బట్టు శశమ్మునకుం గనంగనౌఁ
    బాదములుండు మూఁడనఁగఁ; బాపిని ధార్మికుఁడన్నఁ జూచి, స
    మ్మోదము నంద రే ప్రజలు, మూర్ఖుఁ డొకండు నృపాలుఁ డైనచోన్!

    [సమ్మోదమున్ అందరు + ఏ ప్రజలు]

    రిప్లయితొలగించండి
  47. సాదరమైన పాలనము చక్కగ చేయుచు నుండ రాజు తాన్
    మోదము నందరే ప్రజలు? మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్
    వేదన హెచ్చునిచ్చ కడుఁ బేదల జీవన యానమందునన్
    రాదు వెలుంగు వారలకు రక్కస రాజ్యమునందు నెంచగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాక్షస రాజ్యము' అనండి.

      తొలగించండి
  48. నేటి రెండవ పూరణ (కోట రాజశేఖర్)
    వాదముతో, శకారు డిల స్వార్థముతో, కడు దుష్ట బుద్ధితో,
    ఖేదముతో, సతమ్ము నపకీర్తులతో, ఘన మూర్ఖ రాజుగా,
    వేదన గూర్చెగా ప్రజకు, వింతగ పాలన జేసి ; యెన్నడున్
    *మోదము నంద రే ప్రజలు మూర్ఖు డొకండు నృపాలు డైనచోన్.*
    {మోదము నందరు+ఏ ప్రజలు = మోదము నంద రే ప్రజలు}
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (23-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      శకారుడు రాజశ్యాలకుడే కాని రాజు కాడు కదా?

      తొలగించండి
    2. గురువారం! మీ రన్నది నిజమేనండీ. వింతగా పాలించాడు అని అన్నానండీ. రాజు కాకపోయినా రాజుగా చక్రం తిప్పినాడు అని నా భావన. నమోనమః

      తొలగించండి
  49. డా.పిట్టా సత్యనారాయణ
    పాదము మంచిదై వసుధ బంగరు పంటలనివ్వ, శత్రువు
    న్నూదరగొట్టి యాపు కళ నోచిన వాడయి పద్మ రేకులన్
    సాదర లీల నిద్రగను చక్కని రేడన"Nero"నీరొ తమ్ముడే
    జూదమునాడుచున్ జనుల జూడని మూలవిరాట్టు మ్రోల నా
    మోదము నందరే ప్రజలు మూర్ఖుడొకండు నృపాలుడైనచోన్

    రిప్లయితొలగించండి
  50. గేదెలు దున్నపోతులును కీటక పన్నగ జంబుకమ్ములున్
    భేదము లేక నత్తలును పీతలు కొంగలు కొండముచ్చులున్
    వాదన జేయ ప్రీతిగను పందుల రీతిని కొల్వునందునన్
    మోదము నందరే ప్రజలు మూర్ఖుఁ డొకండు నృపాలు డైనచోన్

    రిప్లయితొలగించండి