(హరిణి వృత్తము - గణములు - న, స, మ, ర, స, లగ; యతిస్థానం 11)
బెగడు వడుచుండెన్ జూపుల్, శోభితంబుగ కర్ణముల్
నిగుడు వడుచుండెన్,శృoగమ్ముల్ నిటారుగ నెక్కొనెన్,
సొగసుగ ఖజాకమ్మున్ యొప్పెన్ సువర్ణ హొరంగు తోన్,
మెగము గనుమా!శ్రీరామా! కామితమ్ము మనమ్మునన్
నెగడు వడుచుండెన్, తెమ్మా! చిన్నిదంపు మృడీకమున్,
తగిన కెలసమ్మే యంచున్ సీత బల్కె ముదమ్ముగన్
తాత్పర్యము
బెదురు చున్నట్టి చూపులు, శోభితముగా చెవులు నిక్క బొడుచు కొనెను, కొమ్ములు నిటారుగా నిలబడెను చక్కగా బంగారు రంగుతో శరీరము ఉండెను, జింకను చూడుమా శ్రీ రామా నా మనసులో కోరిక దహించుచున్నది. స్వర్ణ లేడిని తెమ్ము. సరి అయిన పనియే అని సీత సంతోషముగా బలికెను.
అర్ధములు
బెగడు వడు = భయపడు, నిగడువడు = నిక్క బొడుచుకొను; నెక్కొను = అతిశయించు, ఖజాకమ్ము = శరీరము; హొరంగు = కాంతి; మొగము = జింక, కామితమ్ము = కోరిక; నెగడు = దహించు; చిన్నిదంపు = బంగారపు, మృడీకము = జింక; కెలసము = పని.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసూర్య కుమార్ గారు హరిణి వృత్తమునకు యతి మైత్రి స్థానము 12 వ యక్షరము గదా. మీరు 11 న మైత్రి చూపారు. పరిశీలించండి.
తొలగించండికామేశ్వర రావు గారి పాదములకు నమస్కారములు నా దగ్గిర ఉన్న శబ్ద రత్నాకరము బహుజనపల్లి వారు వ్రాసినది పుస్తకములో చందో ప్రకరణములోని ౧౨౪౪ వ పేజిలో 11 వ అక్షరము యతి అని ఉన్నది ఆ ప్రకారము వ్రాశాను మీరు సలహా ఇవ్వ గలరు
రిప్లయితొలగించండిబహుశః 11వ అక్షరము తరువాత యతిమైత్రి పాటించవలెను అని ఉందేమో పరికించండి పూసపాటి వారూ.
తొలగించండిసూర్య కుమార్ గారీ సందేహమును మన గురువు గారే తీర్చ గలరు. వారిని సంప్రదించండి.
రిప్లయితొలగించండిశబ్ద రత్నాకరము నిఘంటువు కదా. నా దగ్గర యున్న దాని లో ( పిడిఎఫ్ ఫైల్) ఛందస్సు లేదు.
శబ్దరత్నాకర కర్త, ప్రౌఢ వ్యాకర్త బహుజనపల్లి సీతారామాచార్యులు గారు ఛందో ప్రకరణమని యసాధు రూపమును వాడరే!
నావద్ద ఉన్న ఛందోగ్రంథా లన్నింటిలోను హరిణి వృత్తానికి యతిస్థానం 12 అనే ఉన్నది.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిహరిణి! అళదీ! కావేరీ !యామి ! హట్టవిలాసినీ
జిలేబి
రిప్లయితొలగించండిపదము లివియే యిష్టంబై నట్టి పద్యమిదే సుమా !
జిలేబి