24, ఏప్రిల్ 2018, మంగళవారం

సమస్య - 2659 (పుట్టఁ జొచ్చె గరుడుఁడు....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుట్టఁ జొచ్చె గరుడుఁడు పాములకు జడిసి"
(లేదా...) 
"గరుడుఁడు సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్"

111 కామెంట్‌లు:

 1. కనెనుగ సీతను లంకను
  హనుమంతుఁడు; పెండ్లియాడె నద్రితనూజన్
  వనమున ముక్కంటి భళిగ
  కనులను కోపమున తెరచి కంతుని పైనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 2. కనుగొనె సీతను లంకను
  హనుమంతుఁడు ; పెండ్లియాడె నద్రితనూజన్
  మనమున ముఱియుచు శివుడే,
  యొనరింపగ గొప్ప తపము నోరుపు తోడన్.

  రిప్లయితొలగించండి
 3. శివుడు భవుడు మంగళకరుడు -
  శివాంశభూతుడు మారుతి సంకటహరుడు
  గురుదక్షిణ నెపమున కపివరుడు -
  సతివియోగమున భోళాశంకరుడు
  సూర్యుడిని మామగ నెంచ సువర్చలనదె -
  హనుమంతుడు వివాహమాడె
  హిమశైలాధీశు పుత్రిన్ దమిన్ -
  కోరి శివుడు తాను పెండ్లియాడె

  రిప్లయితొలగించండి
 4. ఈ సమస్య సుమారు రెండున్నర
  నెలల క్రితమే ఇవ్వబడినది

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. సరికొత్త గా పూరించుడీ అదియే సమస్యా పూరణ లోని మైకం :)


   జిలేబి

   తొలగించండి
  2. ఈ సమస్యను గతంలో ఇచ్చానన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించి మార్చాను. మన్నించండి.
   క్రొత్త సమస్యకు పూరణలు వ్రాయండి.

   తొలగించండి
 5. వినగను సుశీలను వలచె
  హనుమంతుఁడు , పెండ్లియాడె నద్రి తనూజన్
  వనమున తపియించ పార్వతి
  మినుసిగ దేవర యటంచు మేరు ధాముడౌ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   ఈ సుశీల ఎవరు? హనుమంతుని భార్య సువర్చల అంటారు కదా!
   మూడవ పాదంలో గణదోషం. "వనమున తపించ పార్వతి" ఆనండి.
   నాల్గవ పాదంలోను గణదోషం. "మినుసిగ దేవర శివుండు మృడు డభవుండున్" అందామా?

   తొలగించండి

 6. గనుమీ తెలివిడిని జిలే
  బి, నుడివితి హ న ల కు చెల్లె విధిగన్ యతియౌ !
  గననాధారంబచ్చగు !
  హనుమంతుఁడు పెండ్లియాడెనద్రితనూజన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి


 7. మన కొండయ్య కొమర్తెకు
  హనుమచ్చాస్త్రికి వివాహ మాయెను తెలుసా ?
  వినవచ్చితినమ్మ రమణి
  హనుమంతుఁడు పెండ్లియాడెనద్రితనూజన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   కొండయ్యను సంస్కృతీకరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. ఘనుడును,త్రిణయనుడును,న
  ర్తనవర్తనుడును,పినాకధరుడును,శివుడున్,
  మునిజనతతినుతుడు,ప్రణత
  హనుమంతుడు,పెండ్లియాడె నద్రితనూజన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   'ప్రణత హనుమంతుడు' అంటూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి


 9. హనుమచ్చాస్త్రి వివాహమా!భళిభళీ ! హద్దేమి యున్లేక, తా
  హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశ పుత్రిన్ దమి
  న్ననుచున్ కొండయ పుత్రి పెండ్లిన భళా నాంత్రంబుజేసెన్ గదా !
  యనుమానంబికలే! జిలేబి తనమే ! హన్నన్న చాతుర్యమే !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 10. కవిమిత్రులారా,
  1-2-2018 నాటి సమస్య పునరుక్తమైనందున మార్చినాను. ఇప్పటికే ఆ సమస్యకు పూరణలు చేసిన కవిమిత్రులు మన్నించండి.

  రిప్లయితొలగించండి
 11. వినుటకు చోద్యంబయ్యెను
  హనుమంతుడు పెండ్లియాడె నద్రి తనూజన్?
  హనుమంతుడు శివ భక్తుడు!
  ఘనులగు సుత-మాత లెట్లు కలిసెదరొకటై!!

  రిప్లయితొలగించండి
 12. మైలవరపు వారి క్రొత్త పూరణ (పాత సమస్యకు):

  వినుమీ సుందరకాండ యందు కపిరాడ్వేషంబునున్ దాల్చునీ
  మన సింహాచలమీతడే శివుడుమామాహేశ్వరీయమ్మునం
  దున , పాత్రోచిత హావభావనటవైదుష్యమ్మునన్ నాటి యీ
  హనుమంతుండు వివాహమాడె హిమశైలాధీశుపుత్రిన్ దమిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. క్రొత్త సమస్యకు పూరణ

   పరమశివుండు భక్తులకు భద్రత గూర్చెడు వాడునై శనై...
   శ్చరునకు చిక్కకుండగ విశాల మహీజమునెక్కి వృక్షకో...
   టరమున దాగియుండెనకటా ! రజతాద్రిని వీడి , వింతయౌ !
   గరుడుడు సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  3. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అబినందనలు.

   తొలగించండి
 13. కని యె ను సీతను లంక ను
  హనుమంతు డు ;పెండ్లి యా డె న ద్రితనూ జ న్
  ద నుజు ని సంహార ము కై
  మును కొని దేవతలు మునులు పుర హరుకోర న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

 14. తే.గీ.

  పట్టుకొని చంపదలచి సర్పగణములను

  పుట్ట జొచ్చె గరుడుడు, పాములకు జడిసి

  పారిపోయెడు మామూలు పక్షి కాదు

  ఖగదళంబుకు రాజగు గరుడుడతడు
  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి
 15. పాముల ప యి పగ రగిలి భ గ్గుమ నగ
  పాముల వెదుకుచు ను దాను పంతమూని
  పుట్ట జొ చ్చే గరుడుడు పాముల కు;జడి సి
  ఆ ణ గి మ ణ గి యుండె న హు లు నడు గు యందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఒకే వాక్యంలో 'పాముల వెదకుచు, పాములకు' అనడం పునరుక్తి.

   తొలగించండి
 16. ఇనవంశోద్భవరామపత్ని, జనకాధీశాత్మజాజానకిన్
  గొనిపోవన్ దశకంఠు, డంత వెదికెన్ గోపించి లంకన్ వెసన్
  హనుమంతుండు; వివాహమాడె హిమశైలాధీశు పుత్రిన్ దమిన్
  మనసుప్పొంగ స్మరుండు నేచ శివుడున్ బద్ధార్దనారీశుడై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   విరుపుతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 17. ఉరు తప మాచరించిన మహోరగ మొక్కఁడు నాగకంఠుచే
  వరమును బొందె నెల్ల ఖగవర్గముపై గెలుపొందునట్లుగన్,
  త్వరను రసాతల మ్మరిగి తా నట వాసుకి రక్షఁ గోరఁగా
  గరుడుఁడు సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్.

  రిప్లయితొలగించండి
 18. సర్పరాజైన వాసుకి వద్దకు రసాతలానికి గరుడుడు పుట్టలో దూరి వెళ్లి నాడన్న మీకల్పన సుమనోమనోహరం మహాశయా !👌

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శివుని మెప్పించి, వరమందిన మహోరగ భీతిచేత గరుడుఁడు వాసుకి నాశ్రయించుటకయి వల్మీకమునఁ బ్రవేశించినట్టుగా నొనర్చిన మీ యూహ అద్భుతముగ నున్నదండీ శంకరయ్యగారూ! శుభాభినందనలు!

   తొలగించండి

 19. రెండవ పూరణ

  తే.గీ.

  పందెమును గాచి శనితోడ పంచముఖుడు

  తప్పు కొనుటకు శని చూపు దాగె యెచటొ

  గాంచగ నిదియెట్లుగ గనిపించె ననగ

  పుట్ట జొచ్చె గరుడుడు పాములకు జడిసి
  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   దృష్టాంతోక్తితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 20. పరుగిడె నెచటకు ఫణిని పట్టబోవ,
  హరికి వాహనమ్మేదియో తరచి చూడ,
  పరుగు లేల కప్పలు బెట్టు ధరణి పైన,
  పుట్ట జొచ్చె,గరుడుడు,పాములకు జడిసి

  అబ్బ యాండ్రాయిడ్ ఫోన్ దవారా ఈ ప్రయత్నం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 21. చెట్టునెక్కెను కరిరాజు చీమకరవ
  కలుగు దూరెను కరభము పులుగుతరమ
  పుట్టజొచ్చె గరుడుడు పాములకు జడిసి
  కాశి మజిలీలు వినగను కమ్మగుండు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!

   తొలగించండి


  3. అదురహో


   కాశి మజిలీలు వినగను కమ్మగుండు!
   సీత గారిపద్యమువలె సిరులొలుకుచు :)

   జిలేబి

   తొలగించండి
 22. మున్ను జనమేజయుండిల మునుల గోరి
  సర్పయాగము జేయగ దర్పమునను
  నభముగప్పిన నాగులనన్ని జూచి
  పుట్టఁ జొచ్చె గరుడుఁడు పాములకు జడిసి

  రిప్లయితొలగించండి
 23. క్రొవ్విడి వెంకట రాజారావు:

  విహగములపై నొక దినపు విజితి కొఱకు
  శివుని వరమొంది నాగులు దివము కేగి
  ద్విజపతి కొఱకై గాలించు వేళలోన
  పుట్టజొచ్చె గరుడుడు పాములకు జడిసి

  రిప్లయితొలగించండి
 24. తే.గీ.
  జింక తరుమగ వ్యాఘ్రమే వంకఁ బడగ
  కప్పకు బెదరి సర్పము కలుగు దూరె
  "పుట్టఁ జొచ్చె గరుడుఁడు పాములకు జడిసి"
  ఘోర కలికాల మిదిగాదె తీరు దెలియ

  వంక = కష్టము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   కలి వైపరీత్యాలపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2659
  సమస్య :: *గరుడుడు సర్పభీతుడయి గ్రక్కున జొచ్చెను పుట్టలోనికిన్.*
  గరుత్మంతుడు పాముకు భయపడి గబగబా ఒక పుట్టలో దూరినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శనైశ్చరుడు తన గొప్పతనాన్ని గుఱించి చెప్పుకొంటూ నేను పరమశివుని కూడా పట్టి పీడించగలను అని అంటూ ఉంటే శివుడు శనికి చిక్కకుండా ఉండాలని అంతటా తిరిగి ఒక చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడు. శని అక్కడికి చేరుకొని ఓ పరమ శివా! చూశావా నిన్ను నేను ఎలా ఇబ్బంది పెట్టినానో? అని అన్నాడట.
  శనికి భయపడి శివుడు ఒక తొఱ్ఱలో దాగి ఉండడాన్ని ఇలా చెప్పవచ్చు ‘’గరుత్మంతుడు పాముకు భయపడి ఒక పుట్టలో దూరినాడు’’ అని విశదీకరించే సందర్భం.

  ‘’ *స్మరహరు నైన బట్టెదను, మానను నే* ననుచున్న యా శనై
  శ్చరునికి చిక్కబో ననుచు ‘’ శంభుడు దాగెను చెట్టు తొఱ్ఱలో
  తిరుగుచు విశ్వ మంతయును ; దీనిని యిట్టుల జెప్పగా నగున్,
  *గరుడుఁడు సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్.*
  నేటి నా పద్యానికి శ్రీ చిటితోటి విజయకుమార్ గారి భావానువాద *సమస్యాపూరణ-సంస్కృత శ్లోకం*

  శనైశ్చర భయాత్ శీఘ్రం
  ప్రవిష్టః కోటరం శివః ।
  వల్మీకం ప్రావిశత్ తార్క్ష్యః
  సర్పభీత్యా ససంభ్రమః ।।

  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (24-4-20-8)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   దృష్టాంతాలంకారంగా మీ పూరణ మనోహరంగా ఉన్నది. దానికి చిటితోటి వారి సంస్కృత శ్లోకానువాదం ప్రశస్తంగా ఉన్నది. ఇద్దరికీ అభినందనలు.

   తొలగించండి
 26. డా.ఎన్.వి.ఎన్.చారి
  బురుడుడు బుట్టలల్లనొక బొద్దుగయు న్నటి బుట్ట గైకొనెన్
  గరుడుడనెండువాడొకడు,గారడివాడొక పాము బెట్టగా
  సరగునబూరనూదమనసారగపాములు జేరచెంతకున్
  గరుడుడు సర్పభీతుడయి గ్రక్కున జొచ్చెను పుట్టలోనికిన్

  రిప్లయితొలగించండి
 27. కక్ష గట్టి న గరుడుడు కరుణ వీడి
  వెదుకుతూ తాను సర్పాల వేయి చోట్ల
  పుట్ట జొ చ్చే గరుడుడు పాముల కు;జడి సి
  నక్కి యుండె ను భుజ గాలు సొ క్కిమిగుల

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   'వెదుకుతూ' అనడం వ్యావహారికం. "వెదకుచును తాను..." అనండి. ఇక్కడ కూడ ఒకే వాక్యంలో సర్పాల, పాములకు అని పునరుక్తి వచ్చింది.

   తొలగించండి
 28. తల్లి దాస్యమొదల తనయునిగ తాను
  అమృతము తెచ్చివ్వ కష్టించిన మేను
  మట్టు బెట్ట తను పుట్ట జొచ్చె గరుడుడు
  పాములకు జడిసి పారలేని శూరుడు

  రిప్లయితొలగించండి
 29. సర్పములనెల్ల దినుటకు సమయ మెఱిగి
  పుట్టజొచ్చె గరుడుడు,పాములకు జడిసి
  పారివచ్చితిమటనుండి పరుగు లిడుచు
  పాములనగను నేరికి భయముగాదె!

  రిప్లయితొలగించండి
 30. ఎండ వేడిమి గని సర్ప మేమిచేసె?
  విష్ణు మూర్తికి వాహ్యము పేరదేమి?
  కలుగు లోనికి చనెనేల యెలుక వడిగ?
  పుట్టఁ జొచ్చె, గరుడుఁడు, పాములకు జడిసి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 31. కక్ష గట్టి న గరుడుడు కరుణ వీడి
  వె దుక దొడగెను కోపాన వేయి చోట్ల
  పుట్ట జొ చ్చే గరుడుడు పాముల కు;జడి సి
  నక్కి యుండె ను భుజ గాలు సొ క్కిమిగుల

  రిప్లయితొలగించండి
 32. పిచ్చిక యొకర్తి యెంచును బీర మంది
  తన్ను గరుడుఁ డంచు సతమ్ము చెన్ను మీఱు
  సర్పములఁ గాంచి యచ్చట దర్పముడుగఁ
  బుట్టఁ జొచ్చె గరుడుఁడు పాములకు జడిసి

  [పుట్ట = జన్మ స్థానము, గూడు]


  పరిపరి తీరు లెంచ భువిఁ బ్రాణుల ధీబల శక్తి యుక్తులే
  వరమయి వెల్గు నన్నియు నపారము మూషిక రాజొకం డటం,
  దిరుగఁగ నాకసమ్మున నతీత విలోచన పక్షి రాజ మా
  గరుడుఁడు, సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి


 33. బుట్టనుండి విడువ పాము బుస్సు మనుచు?
  బుట్టబొమ్మ లక్ష్మి మొగుడి భూరి జలలి ?
  యజ్ఞ మేల పరీక్షిత్తవనిని జేసె?
  పుట్టజొచ్చె; గరుడుడు ;పాములకు జడిసి

  జిలేబి

  రిప్లయితొలగించండి
 34. ఇరవుగ వేలువేలుగను నేలనుబాఱగబాములెన్నియో
  గరుడుడు సర్పభీతుడయి ,గ్రక్కున జొచ్చెను బుట్టలోనికిన్
  గరము సరీసృపాలునట
  గాంచగ మానవ సందడిన్గడి
  న్నరయగ బాములన్నిటికి మానవులన్నను భీతియేగదా

  రిప్లయితొలగించండి
 35. మిత్రులందఱకు నమస్సులు!

  సరగున వైనతేయుఁ డొక సర్పనృపున్ మణినాథుఁ బట్టియున్
  గుఱిఁగొని వీడఁడాయె; హరి కోరిన వీడక యుండ, శ్రీశుఁడే
  "తొరఁగు బలమ్ము నీ" కనియుఁ దోరపు శాపము నీయఁగా, వెసన్
  గరుడుఁడు సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   ఈ మణినాథ వృత్తాంతం ఏదైనా పురాణంలో ఉన్నదా? మీ కల్పనయా?

   తొలగించండి
  2. ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!

   ఇది పురాణ కథయే నండీ! శేషుని పుత్రుడైన మణినాగుడను (నేను మణినాథుడు అని రాశాను) వానిని ఒకనాడు గరుడుడు పట్టుకొనగా, అతడు శివుని ప్రార్థించగా, శివుడు నందిని పంపించెను. నంది చెప్పినా విడువకపోవడంతో నంది విష్ణువుకు చెప్పగా, విష్ణువు అతడిని విడువుమన్నాడు. అయినా విడువకపోవడంతో గరుడుని "నీ బలం సమస్తం తొలగిపోవుగాక" అని శపించాడు. భయపడిన గరుడుడు మణినాథుడు తన నేమైనా చేస్తాడేమోననే భయంతో పారిపోతూనే, విష్ణువును శాపతరణోపాయాన్ని గురించి అర్థించాడు. శివుని ప్రార్థిస్తే శాపం తొలగుతుందని చెప్పగా, అట్లే చేసి, గరుడుడు శాపవిక్తుడైనాడు. ఈ కథ బ్రహ్మ పురాణంలో ఉన్నది.

   సవరణ: సరిగా కనిపించక నేను మణినాగుఁడు అను పేరును మణినాథుఁడు అని లిఖించినాను. మన్నించండి.

   సవరించిన పూరణము:
   సరగున వైనతేయుఁ డొక సర్పనృపున్ మణినాగుఁ బట్టియున్
   గుఱిఁగొని వీడఁడాయె; హరి కోరిన వీడక యుండ, శ్రీశుఁడే
   "తొరఁగు బలమ్ము నీ" కనియుఁ దోరపు శాపము నీయఁగా, వెసన్
   గరుడుఁడు సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్!

   తొలగించండి
 36. విఠ్ఠలాచార్య దీసిన వింతసినిమ
  మంత్ర తంత్రాలమాటున మాయలోళ్ల
  ట!పరకాయ ప్రవేశముటక్కు మనగ
  పుట్ట జొచ్చె గరుడుడు పాములకుజడిసి!

  రిప్లయితొలగించండి
 37. ఘనమగు తపమున నుండగ
  మనోభ వుడుపూ శరమును మానిన తోడన్
  మునివ ర్యుండా మహితా
  హనుమంతుడు పెండ్లియాడె నద్రిత నూజన్


  మహిత+హను+మంతుడు
  త్రిశూల+ఆయుధము+కలిగినవాడు
  మాను=విడుచు
  మనోభవుడు=మన్మధుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మహిత హనుమంతుడు' అనడం సాధువు. అక్కడ 'మహితా' అని దీర్ఘం రాదు.

   తొలగించండి
 38. చంపకమాల
  దొరవలెఁ దా నిరాకు నను దూగి హుసేను నిరంకుశుండుగన్
  గరువము జెందగన్న మెరికా పరిపాలకు లాక్రమించగా
  నురగము లల్లె తా కలుగు నుండుచు దాగ నిరుత్తరుండుగన్
  గరుడుఁడు సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్!

  రిప్లయితొలగించండి


 39. పరుగున వచ్చి నాడు తన పట్టెడు కూటికి యల్లలాడుచున్
  గరుడుఁడు, సర్పభీతుఁడయి, గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్,
  మరుగగు చున్విటమ్మొకడు మండలి వెంటబడన్! సదాశివున్,
  హరగిరి నాధుడాజ్ఞ యన హాంత్రమికన్నెవరెవ్వరోగదా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'కూటికి నల్లలాడుచున్' అనండి.

   తొలగించండి
 40. ప్రజల కిచ్చినమాట తప్పగనె వారు
  సలిపిన యవిశ్వాసమునకు జడిసి చట్ట
  సభను పూర్తిగచాలించ జ్ఞప్తి నొసగె
  పుట్టజొచ్చె గరుడుడు పాములకు జడిసి

  రిప్లయితొలగించండి
 41. పద్మనాభుని కెవరయ్య వాహనమ్ము?
  వాసుకి యనంగ నిలలో నెవరికి రాజు?
  పట్టు బడక వేగిరమున పాములేల
  పుట్ట జొచ్చె? గరుడుడు! పాములకు! జడిసి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 42. సమస్య : -

  "పుట్టఁ జొచ్చె గరుడుఁడు పాములకు జడిసి"

  *తే.గీ**

  వైరి వేటాడి తినరాగ వడిగ పాము
  పుట్టఁ జొచ్చె; గరుడుఁడు పాములకు జడిసి,
  ఒకటొకటిగా బయటకొచ్చు నురగములను
  పట్టి హాయిగా భుజించె భయము లేక
  ..................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రపాణి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణదోషం. "భుజియించె" ఆనండి.

   తొలగించండి
  2. అవును సర్ భక్షించె అని సరిచేసుకున్నాను సర్
   భుజియించె నే రాసుకుంటారు
   ధన్యవాదములు

   తొలగించండి
 43. విరటుని కొల్వులోన నొక పేడిగ జేరిన నేమి యాతడే
  హరి ప్రియ నేస్తమై చెఱగెడర్జును డాజిన శత్రుమూకలన్
  దరిమెడు మేటి వీరుడట దాగిన కవ్వడి గాథ గాంచినన్
  గరుడుడు సర్పభీతుడయి గ్రక్కున జొచ్చెను పుట్టలోనికిన్

  రిప్లయితొలగించండి
 44. శనికి భయపడి కాదుటే శంకరుండు
  తరువు కోటరమందున దాగె గాదె
  జగము లేలెడు వాడియా చర్య గాంచ
  పుట్ట జొచ్చె గరుడుడు పాములకు జడిసి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "చెఱగె నర్జును" డనండి.

   తొలగించండి
 45. తేటగీతి
  కోరలన్ జాచు పాములు కోరికలను
  మూల మెరుగ సిద్ధార్థుండు బుద్ధుడాయె!
  తనదు రాజ్యము వీడుచు తపమనియెడు
  పుట్టఁ జొచ్చె గరుడుఁడు పాములకు జడిసి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. అవధానులు శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారికి ధన్యవాదాలతో సవరించిన పూరణ :

   తేటగీతి
   కోరలన్ జాచు పాములు కోరికలను
   మూల మెరుగి సిద్ధార్థుండు బుద్ధుడయ్యె!
   ధనము, రాజ్యము వీడుచు తపమనియెడు
   పుట్టఁ జొచ్చె గరుడుఁడు పాములకు జడిసి!

   తొలగించండి
 46. గురువు గారికి నమస్సులు
  కరుణ,ప్రీతియు లేనట్టి ఖలు జూచి
  విష్ణు మహిమలు ధరణిలో వివిధ రూప
  పుట్టజొచ్చె గరుడుడు,పాములకు జడసి
  గట్టునున్నమాధవసింహ కర్ర బట్టె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "ఖలుని జూచి" అనండి.
   'రూప పుట్ట' అన్నది దుష్ట సమాసం.

   తొలగించండి
 47. డా}.పిట్టా సత్యనారాయణ
  గన యోగియె వనచరునిగ
  హనుమంతుడు;పెండ్లియాడె నద్రి తనూజ
  న్ననలేమా హరు నంతటి
  ఘన శక్తిని బోల్చ సముడె గాంభీర్యమునన్

  రిప్లయితొలగించండి
 48. డా.పిట్టా సత్యనారాయణ
  ఘనమౌ యాశయ సిద్ధి సిద్ధుడనగా గాణాచియౌ దాసుడే
  హనుమంతుండు; వివాహ మాడె హిమశైలాధీశ(శ)పుత్రిన్ దమిన్
  గనగా యోగి హరుండు లోకహితుడై తా దాల్చె సంసారమున్
  మన కాలంబున సంఘ సేవకునిగా మళ్యాల స్వామీజి, వం
  దన పాత్రుల్ గదె వేరు వేరు దశలన్ దాల్చంగ జాలన్ భువిన్

  రిప్లయితొలగించండి
 49. డా.పిట్టాసత్యనారాయణ
  నరుడు జంకిన ఫలమె కిన్నరుడునైన
  ఆత్మ శక్తిని గనకనె హాని కెరయ!(కి ఎర యగును)
  బ్రతుకు పై యాశ దొడ్డదై బలము నణచు
  పుట్ట జొచ్చె గరుడుడు పాములకు జడిసి!

  రిప్లయితొలగించండి
 50. డా.పిట్టాసత్యనారాయణ
  ధర నొక బోడిదైన తలదాపునదే యొక తాటి పండుగా
  నరసియు చేష్ట దప్పితివొ దారియె లేదిక కర్మ మృగ్యమౌ
  తిరమగు శాంతిమై తెరువు దేల్చుము, ధీరత నూనకున్న నా
  గరుడుడు సర్ప భీతుడయి గ్రక్కున జొచ్చెను పుట్ట లోనికిన్

  రిప్లయితొలగించండి
 51. *24-4-18*
  ..............🌻శంకరాభరణం🌻
  .. .. .. ..సమస్య
  *"పుట్టఁ జొచ్చె గరుడుఁడు*
  *పాములకు జడిసి"*

  సందర్భము: సులభము.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~

  తనకు భయపడి పుట్టలో దాగియుండె
  పాము; లాకలి మెం డాయె; పట్టి లాగఁ
  బుట్టఁ జొచ్చె గరుడుఁడు.. పాములకు జడిసి
  నట్టి వా డాతడా! వానిఁ బట్టి తినడె!

  మరొక పూరణము:

  .. .. .. .సమస్య
  గరుడుడు సర్పభీతుడయి
  గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్

  సందర్భము: భీమసేనుడెంతో గొప్ప పరాక్రమవంతుడు. కేవలం పిడి గుద్దులతోనే కీచకు నంతటివాణ్ణి మట్టి గరపించినాడు.
  అట్లయ్యును అజ్ఞాతవాసం కాబట్టి తన రూపురేక లెవరికీ తెలియనీయకుండా అతి సామాన్యుడైన వంటలవాడుగా గరిట చేత బుచ్చుకొని వంటలు చేయబోతున్నా డట!
  ఈ సన్నివేశం చూస్తే యే మనిపిస్తుం దంటారా! "గరుత్మంతుడు పాములకు భయపడి పుట్టలోనికి జొఱబడిన" ట్టున్నది.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  గురుతర విక్రముండు పిడి
  గ్రుద్దులతోడనె కీచ కాధమున్
  దురిత మనస్కుఁ బ్రాణములఁ
  దోడిన యోధుడు భీము డయ్యుఁ దా
  గరిటెను బట్టి, యే గురుతుఁ
  గన్పడనీయడె! యే మనన్ వలెన్..
  "గరుడుడు సర్పభీతుడయి
  గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్"

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 52. తురకల మాల యాదవుల తోరపు వోటులు కోలుపోవగా
  గురకలు వీడి మోడియుడు గూడుపుఠానిని తీర్చిదిద్దుటన్
  పరువులు బెట్టి బ్రాహ్మలకు పన్నుగ నిచ్చెను మేటి కోటలన్...
  "గరుడుఁడు సర్పభీతుఁడయి గ్రక్కునఁ జొచ్చెను పుట్టలోనికిన్"

  రిప్లయితొలగించండి