26, ఏప్రిల్ 2018, గురువారం

డమరుక బంధ తేటగీతి


శివ స్తుతి
కరమునన్ త్రిశూలము,నొక్క కరము నందు 
డమరుకము గూడ,శంఖము నమరె మరియొ
క కరమున, యభయము నిడునొక కరము,ము
రము నిడుచు నర్తనం బాడు దక్ష వరుడ 
వందనమ్ము శూలీ నీకు వందనమ్ము

పద్యము చదువు విధానము: పైన (క )నుంచి మొదలు పట్టి  (శూలము) తోటి కలుపుకొని మరల క్రిందకు దిగాలి   (డమరుకము గూడ)  అని మధ్యలో ఉన్న పాదము  చదివి (శంఖము)నమరి అని ప్రక్కకు తిరిగి (మరి యెక)  అని చదివి తిరిగి పైకి (కరము) దగ్గిర ఆపి మరల  (మురము)  అని చదివి  క్రిందకు దిగి (బాడు )తో పైకి వెళ్లి ( వందనము శూలీ)   అని ముగించాలి.
కవి 
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి