5, ఏప్రిల్ 2018, గురువారం

సమస్య - 2642 (వడియము లెండెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వడియము లెండెను విడువని వానలలోనన్"
(లేదా...)
"వడియము లెల్ల నెండినవి వాన లవారిత రీతిగాఁ బడన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

172 కామెంట్‌లు:

 1. (1) నాడు:

  పడిగాపులతో సీతకు
  వడియము లెండెను; విడువని వానలలోనన్
  మడికట్టుకొనుచు వేచెను
  తడిబట్టల తోడ విధిగ తల్లి పనుపునన్

  (2) నేడు:

  తడి తీసెడి యంత్రమ్మును
  గడబడ లేకయె కొనగనె గారాబముతో
  వడిగా సీతాదేవికి
  వడియము లెండెను విడువని వానలలోనన్

  తడి తీసెడి యంత్రము = food dehydrator

  https://m.indiamart.com/impcat/food-dehydrators.html

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   నాడు, నేడు అంటూ మీరు రెండు విధాల చక్కని పూరణలతో శుభోదయం పలికారు. అభినందనలు.

   తొలగించండి
  2. కొస్చిను పేపరు లీకాయె గదా సార్!

   😊😊😊

   తొలగించండి

  3. ఐ ఐ టీ బుర్ర ఐ ఐ టీ బుర్ర యే ! బామ్మ ల కొచ్చునా యీ ఐడియాల్ :)


   'సెహ' భేషు :)

   జిలేబి

   తొలగించండి
  4. ఇక్కడ క్వొశ్చెన్ పేపర్ లీకైనా పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించే ప్రసక్తి లేదు. ఇచ్చిన మార్కులకు కోత లేదు.

   తొలగించండి
  5. అన్నయ్యా! నాటి పద్యంతో మన బాల్యాన్ని , అమ్మను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!
   🙏🙏🙏🙏

   తొలగించండి
  6. అయ్యయిటీ బుర్రకు సమ
   మయ్యెడి బుర్రెక్కడుండు మాత జిలేబీ
   అయ్యహొ! ప్రభాకరుడుతా
   నయ్యెగ మరి యెండునుగద నావడియములే!

   🙏🏻💐

   తొలగించండి


  7. అడడా! మరందు పోనేన్ !
   వడియములెండెను విడువని వానలలోనన్
   మడమడ యెండ్రణ్ణావే
   కొడియాయ్ కాక్క మడియాయ్ సగోదరి యై తాన్ !


   :)
   జిలేబి
   అరవ మామి కందము

   తొలగించండి
  8. విట్టుబాబు గారూ,
   ప్రభాకర శాస్త్రి గారిపై మీ పద్యం బాగున్నది.
   *****
   జిలేబీ గారూ,
   మీ అరవ పద్యం అర్థం కాలేదు.

   తొలగించండి


 2. అడకత్తెర వేడి సుమా
  వడియము లెండెను; విడువని వాననలోనన్
  గడినుడి చేసితి; నిదురన్
  సడలుకొలుప వేడి టీని చక్కగ గొంటిన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణల అడకత్తెరలో ఏనాడో చిక్కుకున్నాను. బాగున్నది మీ పూరణ. అభినందనలు.
   మీరు ఎంచక్కా వేడి టీని తీసుకొని కూర్చున్నారు. నేనింకా కాఫీకోసం అరగంట ఎదురుచూడాలి. మా వృద్ధాశ్రమంలో ఆరుగంటలకు ఇస్తారు!

   తొలగించండి
 3. దడియక మన ధనలక్ష్మియె
  గడియను గట్టిగ బిగించి గమ్మున గదిలో
  పొడవగు హీటరు పెట్టన్
  వడియములెండెను విడువని వానలలోనన్.

  రిప్లయితొలగించండి
 4. గడియ కొకచినుకు చొప్పున
  దడదడ పడినంత నేల తడియా రకనే
  వడివడి గద్యుమణి వెలుగ
  వడియము లెండెను విడువని వానల లోనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. 'వడివడిగ ద్యుమణి' అన్నపుడు 'గ' లఘువే. అక్కడ "వడివడిగ ద్యుమణి వెలుగగ" అనండి.

   తొలగించండి
  2. గడియ కొకచినుకు చొప్పున
   దడదడ పడినంత నేల తడియా రకనే
   వడివడి గద్యుమణి వెలుగగ
   వడియము లెండెను విడువని వానల లోనన్

   తొలగించండి


 5. వడివడి గా పదమ్ములను పట్టిక జూచుచు నింపగానయా
  గడినుడి తీరు గాంచె, సయి, గట్టిగ మారుచు నచ్చటన్ భళా
  వడియము లెల్ల నెండినవి; వాన లవారిత రీతిగాఁ బడన్,
  బడబడ వాటి నన్ని టిని, పట్టుగ సర్దితి చక్కగానయా !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ


  కీచకవధ...

  పిడుగులు లేక గల్గె పెనువృష్టియనన్ వలలుండు బట్టి స..
  వ్వడియును లేక గ్రుద్దులను వానిని గీచకుఁ జంపె , నెత్తురున్
  తడియును నింకె కోపము నిదాఘగతిన్ జ్వలియింప , నస్థులన్
  వడియము లెల్ల నెండినవి వానలవారిత రీతిగాఁ బడన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కీచకుని అస్థులను వడియాలుగా చేసిన మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


  2. ఆహా ! వడియాలకు, కీచకునికి లింకు లంకె యా !

   అదురహో అవధాని గారు

   జిలేబి

   తొలగించండి
  3. అవధానుల ఊహాసామర్ధ్యానికి అంతులేదు! అందుకోండి అభినందన మందారమాల! 💐💐💐💐🙏🙏🙏🙏

   తొలగించండి
  4. ధన్యవాదాలండీ జిలేబీ గారికి... సీతాదేవి గారికి... శ్రీ శాస్త్రి గారికి కూడానూ... నమోనమః 🙏

   తొలగించండి
  5. మైలవరపువారూ!
   అద్భుతము! అనన్యసామాన్యము!!
   🙏🏻💐

   తొలగించండి
  6. ఇక్కడ కూడా చెప్పాలి మరి...

   అవధానుల్లవ ధానులె
   వివరమ్ము ల్లెరుకె వార్కి వింతగు విధమున్
   భవులే వారిల లోమరి
   దివిలో వాణికి కొమరుల ధీటగు రీతిన్
   🙏🏻

   తొలగించండి
  7. విట్టుబాబు గారూ,
   పద్యం బాగుంది. కాని 'అవధానుల్ + అవధానులె, వివరమ్ముల్ + ఎరుకె' అన్నపుడు ద్విత్వ లకారాలు రావు. 'వార్కి' అనడం సాధువు కాదు. "అవధాను లవధానులె మరి। వివరమ్ములు వారి కెరుకె" అనండి.

   తొలగించండి
  8. ఈ పద్యమును ప్రశంసించిన పెద్దలందరికీ వందనములు పేరు పేరునా 🙏🙏🙏🙏

   మైలవరపు మురళీ కృష్ణ

   తొలగించండి
  9. పార్వతమ్మకు వడియాలు తినాలని ఉంది.... కోరిక తీరింది ఇలా 👇

   మృడసతి వెండికొండపయి నెండకు బెట్టినదప్పడమ్ములున్
   వడియములెల్ల ., నెండినవి , వానలవారిత రీతిగాఁ బడన్
   తడి తడి కట్టెలన్ గనుచు తల్లడిలన్ , గమనించి , ప్రేమ రు...
   ద్రుడు తన కంటిమంటనిడి దోరగ వేగగ జేసెనన్నియున్!!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  10. ఇవేళ పురాణ పురుషుల చేత కుడా వడియాల తినిపించారు ఎండపెట్టించారు కొసకి వేయించడం కూడాను 😂😂🙏భలే ఉన్నాయి
   వడియాలా మరేమన్నానా😁

   ...రుక్మిణి

   తొలగించండి
  11. క్రెడిట్సన్నీ శ్రీమతి సీతాదేవి గారి అకౌంట్ కే జమ... నమోనమః 🙏🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
 7. నిడుజడి లో పెట్టెను మా
  గడసరి పడతి గదిలోన కడు ధైర్యముతో
  ఫ్లడులైట్ల కాంతి యందున
  వడియము లెండెను విడువని వానన లోనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   ఫ్లడ్ లైట్లు కాంతినే కాదు, విపరీతమైన వేడినీ ఇస్తాయి. మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 8. తడిసిన బట్ట్టలు యిప్పుడు
  వడివడిగా యెoడబెట్టు వాషింగు మిషన్,
  వడ యంత్రరాజ మందున
  "వడియము లెండెను విడువని వానలలోనన్
  వడ యంత్ర రాజము = డ్రైయ్యరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బట్టలు + ఇప్పుడు = బట్ట లిప్పుడు' అవుతుంది. యడాగమం రాదు. 'వడిగా + ఎండబెట్టు = వడిగా నెండబెట్టు' అవుతుంది. యడాగమం రాదు. "తడిసిన బట్టల నిప్పుడు। వడివడిగా నెండబెట్టు..." అనండి.

   తొలగించండి


 9. అడిగితి గోము గా సయి సయాటల నయ్యరు గారి నయ్య! తా
  గడగడ దేశ మెల్ల చని గామిడి యంత్రము తెచ్చి రందునన్
  వడియము లెల్ల నెండినవి; వాన లవారిత రీతిగాఁ బడ
  న్బడబడ వేగ మైన సయి నాకు భయమ్మిక లేదు గా భళా !

  రిప్లయితొలగించండి
 10. జడివాన కాలము జడుపు
  తడి చిత్తడి నేలను తడబడునడుగులతో
  వడిబోయి చూడ నీడను
  వడియము లెండెను విడువని వానల లోనన్


  Dr H Varalakshmi
  Bangalore

  రిప్లయితొలగించండి
 11. రోలు రోకలి లేకయె పొడులు పెక్కులు రాసులై
  చేరగన్
  ఆవిరి వంటలు కుతకుతమని నోరూర ఉడక
  నేర్చినన్
  రొట్టెలు మరి చపాతీలు యంత్రమున పురుడు
  పోసుకొనగన్
  వడియము లెల్ల నెండినవి వానలవారిత
  రీతిగా బడన్

  రిప్లయితొలగించండి
 12. వడివడిగా సడి లేకయె
  తడియారగ జేయునట్టి తగు యంత్రములో
  పడవేయగ నద్భుతముగ
  వడియము లెండెను విడువని వానల లోనన్
  ****)()(****
  (ఆధునిక 'డ్రైయర్'యంత్రాలు వచ్చిన యీ కాలంలో యిదేమీ పెద్ద విశేషం కాదుగదా!)

  రిప్లయితొలగించండి
 13. మిడిమిడి యెండలలోనన్
  వడియము లెండెను; విడువని వానలలోనన్
  వడివడి పప్పుకు దోడుగ
  కుడువగ వాటిని మజాయె కోరికదీరన్

  రిప్లయితొలగించండి
 14. అడిగిన వెంటనె పెట్టిన
  వడియము లెండెను ; విడువని వానలలోనన్
  సడిసేయుచు కఱకఱమని
  కడుపారగ నివి భుజింప కడుమోదమ్మో!

  రిప్లయితొలగించండి
 15. వడివడి పరుగిడి తెచ్చితి
  మడితో పెట్టిన వడియము మడినే మరచీ,
  జడివానకు తడవక మరి
  వడియము లెండెను విడువని వానల లోనన్.

  నేనూ నిన్న, మొన్న ఇలాగే పరుగెట్టి మా డాబాపై పెట్టిన వడియాల్ని తెచ్చాను నిజముగా నిజము నమ్మండి మరి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శివరామకృష్ణ శాస్త్రి గారూ,
   స్వానుభవంతో మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.
   'మరచీ' అనడం వ్యావహారికం. అక్కడ "మడిని మరచి నే। జడివానకు..." అనండి.

   తొలగించండి
 16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2642
  సమస్య :: *వడియము లెల్ల నెండినవి , వానలవారిత రీతిగా బడన్.*
  ఆగకుండా వానలు పడుతూ ఉంటే వడియాలన్నీ ఎండినాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: బ్రహ్మదేవుని నుండి వరాలను పొందిన రావణాసురునికి భయపడిన దేవతలందరూ తమ అభిమానం ప్రక్కన బెట్టి అతని అడుగులకు మడుగు లొత్తడం మొదలుబెట్టినారు. వరుణుడు కావలసినంత వర్షాన్ని కురిపిస్తున్నాడు. సూర్యుడు సేవ చేసేందుకు రావణుని ఇంటికి వెళ్లినాడు. అప్పుడు వానలు కురుస్తున్నా సూర్యుని రాకతో ఇంటిలోపల పెట్టిన వడియాలన్నీ ఎండినాయి అని విశదీకరించే సందర్భం.

  ఇడుముల బెట్టు రావణుని యిచ్ఛ మెలంగుదు రెల్ల దేవతల్,
  మడుగుల నొత్తు చుందు, రభిమానము వీడుచు లంకలోపలన్,
  వడి వడి నేగుదెంచె నట భానుడు రావణు గొల్వ, నింటిలో
  *వడియము లెల్ల నెండినవి, వాన లవారిత రీతిగా బడన్.*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (5-4-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమైన పూరణ అవధానిగారూ! నమోనమః!🙏🙏🙏🙏

   తొలగించండి

  2. ఒకరేమో మహాభారతానికి వడియాల్స్ కు లింకు
   మరొకరేమో రామాయణానికి లింకు !

   ఆహా ! అవధానులన్న అవధానులే గదా !


   జిలేబి

   తొలగించండి
  3. కోటావారూ! ఊహాతీతములనూహించగల సామర్థ్యమెటులబ్బినదో!? అద్భుతము.
   🙏🏻💐

   తొలగించండి
  4. శ్రీమతి గుఱ్ఱం సీతాదేవి గారికి హృదయపూర్వక ప్రణామాలు.

   తొలగించండి
  5. సహృదయులు శ్రీయుతులు అగు జిలేబి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

   తొలగించండి
  6. శ్రీ ps Rao విట్టు బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.

   తొలగించండి
  7. జిలేబీ గారూ!ఎంతయినా
   అవధాను ల్లవధానులె
   వివరమ్ము ల్లెరుకె వార్కి వింతగు విధమున్
   భవులే వారిల లోమరి
   దివిలో వాణికి కొమరుల ధీటగు రీతిన్

   తొలగించండి
  8. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   *****
   విట్టుబాబు గారూ,
   మీ పద్యానికి సవరణలను పైన సూచించాను.

   తొలగించండి
  9. అయ్యయ్యో గురువుగారూ!
   అవధా నులవధా నులెమరి
   అంటే ఓ లఘువెక్కువయ్యింది. :-)

   తొలగించండి
  10. అవునండీ... "అవధాను లన వధానులె" అందాం. అవధాని, వధాని పర్యాయపదాలు.

   తొలగించండి
  11. కోట రాజశేఖర్ - రెండవ పూరణ

   పడ నదె రామమూర్తిశరవర్షము, గ్రక్కుచు నగ్ని ధారలన్,
   వడియము లట్లు రాక్షసుల ప్రాణము లెండెను తాపమందుచున్,
   మడిసెను రావణాసురుడు, మైథిలి రాముని జేరె, చూడగా
   వడియము లెల్ల నెండినవి , వాన లవారిత రీతిగా బడన్.
   *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.*

   తొలగించండి
  12. గురువర్యులు
   శ్రీ కంది శంకరయ్య గారికి భక్తిపూర్వక ప్రణామాలు.

   తొలగించండి
  13. శ్రీ ps Rao విట్టు బాబు గారూ! పద్య రూప ప్రశంసల నందజేసినందులకు ధన్యవాదాలు.

   తొలగించండి
 17. వడలను వండి వేడిగ విభావరి యందున జంట గాతినన్
  దడదడ వాన కోయిల లుదారుల వెంబడి బారు తీయగా
  గడబిడ లేక యుల్లము నకారణ మెంచక వేడి గాలికిన్
  వడియము లెల్ల నెండినవి , వాన లవారిత రీతిగాఁ బడన్


  రిప్లయితొలగించండి
 18. పుడమీసుత సూచనతో
  నడుగగ పూరించ శంకరాభరణమునన్
  చడిచేయగ కవులెల్లరు
  "వడియము లెండెను విడువని వానలలోనన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తడితీసెడి యంత్రముల
   న్వడివడిగా వాడె గనక వాడలనందున్
   గడబిడ యింకేమి గలదు
   "వడియము లెండెను విడువని వానలలోనన్"

   తొలగించండి
  2. విట్టుబాబు గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 19. డా.పిట్టాసత్యనారాయణ
  కుడి యెడమన్ విపక్షములు"కూడవు మీవగు పాలనార్భటాల్
  గడి వదలండి తప్పుకొని గద్దరి చేష్టలు మాని, యొప్పమీ
  బుడిబుడి నమ్మబల్కుటలు బూటకముల్ గనుడ"న్న మధ్య స
  వ్వడి యది లేక,బిల్లుల సవాలుగ తీరిచి దిద్దగా సభన్
  వడియములెల్ల నెండినవి వానలవారిత రీతిగా బడన్!

  రిప్లయితొలగించండి
 20. కందము*

  పొడిపొడి యెండన బాగా
  వడియము లెండెను; విడువని వానలలోనన్
  తడితడిగా నున్న స్థితిన
  కడుపార కరకరమనుచు గతుకుట ముదమౌ
  ................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చక్రి గారూ, (మీ పేరు చక్రపాణియా? చక్రిపాణియా?)
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'స్థితిని' అనండి.

   తొలగించండి
  2. అవును సార్
   ఆవుల చక్రపాణి యాదవ్
   సత్రయాగం మీ పద్యం గ్రూప్ లో ఉండేవాన్ని

   తొలగించండి
 21. డా.పిట్టాసత్యనారాయణ
  అడిగిన లంచము ,వానిని
  వడి జెప్పుల గొట్టుమనిరి, వారే వహ్వా!
  నడిమిని కుంటెనగాళ్ళన్
  వడియములెండెను విడువని వానలలోనన్!

  రిప్లయితొలగించండి


 22. మడకను దున్నె నామగడు; మానిని బేర్చగ మండుటెండలో
  వడియము లెల్ల నెండినవి; వాన లవారిత రీతిగాఁ బడన్
  పడకిలు సర్దినాడు సయి పాలుషి చేరెను మోదమొందుచున్
  చిడిముడి లేని జీవులకు చేవయు గూర్చును సంజ్ఞ యే గదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 23. డా.ఎన్.వి.ఎన్.చారి
  గడబిడ జేయబట్టె సినుకాగక గట్టిగ గొట్ట బట్టెరా
  తడితడి!ముద్దలైతయిగదయ్యగవెట్ల ?ఇగేమి జేస్తవో?
  యిడువక జెప్ప నంగనె ,మరెట్లనొ హీటరు కింద బెట్టి తే
  వడియములెల్ల నెండినవి వాన లవారితరీతిగా బడన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. ఎన్వీయెన్ చారి గారూ,
   గ్రామీణ భాషలో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 24. గురువు గారికి నమస్సులు.
  వడివడిగ గ్రీష్మ నందున
  వడియము లెండెను, విడువని వానల లోలన్
  తడవక గొడుగున్ తెరువగ
  కడిగిన ముత్యము వలె కళ కనబడును సుమతీ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "గ్రీష్మమందున" అనండి. అలాగే "కనబడు సుమతీ" అనండి. లేకుంటే గణదోషం.

   తొలగించండి
 25. నిడిమట్టంతయు కూడగ
  జడివానకురువమొదలిడె జవముగనే చా
  వడి నడినుంచిన మానెడు
  వడియములెండెను విడువనివానలలోనన్

  రిప్లయితొలగించండి

 26. గోలీ వారింకా రాలె ! యేమి వచ్చునో :)


  జిలేబి

  రిప్లయితొలగించండి

 27. సందర్భము - చెల్లెలు సీతాదేవి కొరకు అన్నయ్య ప్రభాకరుడు వానొచ్చినా గొడుగు బట్టి వడియాలన నెండునట్లు చేసెను ; దీనికి స్పిరిట్ విట్టుబాబు గారి పద్యము


  అడడా! మరందు పోనేన్ !
  వడియములెండెను విడువని వానలలోనన్
  మడమడ యెండ్రణ్ణావే
  కొడియాయ్ కాక్క మడియాయ్ సగోదరి యై తాన్ !


  :)
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అహో! జిలేబి అరవపు పద్యమ్!😄😄😄

   తొలగించండి

  2. కొంత సవరించి రైమింగ్ కొరకు

   అడడా! మరందు పోనేన్ !
   వడియములెండెను విడువని వానలలోనన్
   మడమడ యెండ్రణ్ణావే
   కొడయాయ్ కాక్క అడియేన్ సగోదరి యై తాన్ !

   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీయవర్గళే!
   ఎనక్కు పురింజిపోచ్చి ఉంగళోడ గవిదై!

   ఇంకా తమిళ్ లో రాస్తే గురువుగారు దండించడమే తరువాయి :)

   మీ ముందుమాటలో నాకూ భాగమిచ్చినందులకు ధన్యవాదములు
   🙏🏻

   తొలగించండి

 28. కం
  జడివాన జోరుగ బయట

  పడతియె గృహమున తెలివిగ వడియాలుంచెన్

  పొడిచేయు యంత్రమందున

  వడియము లెండెను విడువని వానలలోనన్

  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి
 29. కడు గొని పడతు లు పెట్టిన
  వడి యము లెండె ను ;విడు వని వానల లోన న్
  తడిసి రి రైతులు పొ ల మున
  ఎడతె గ క ను కష్ట పడి రి యి చ్చార తు లై

  రిప్లయితొలగించండి
 30. బిడియమ్ముల వడియమ్ములు
  సడిసేయక వెట్టుచుండ, చటుకున పతియే
  గడివెట్టుచు సతి గలువగ
  వడియము లెండెను విడువని వానలలోనన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలివారు యమగోల జేసేశారు! సీనియర్ ఎన్టీయార్!🙏🙏🙏

   తొలగించండి
  2. హనుమచ్ఛాస్త్రి గారూ,
   కామాగ్నితో వడియా లెండబెట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
  3. గురువర్యులకు,విట్టుగారికి సీతాదేవి గారికి జిలేబి గారికి ధన్యవాదములు.

   తొలగించండి
 31. వడివడి పరుగుల చదువుల
  బడిలో గురువుల చరపుల బారిని శిష్యుల్
  గడిపిన బాల్యం బెటులన?
  వడియము లెండినవి విడువని వానలలోనన్!

  పుట్టంరాజు సునీల్ బాబు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పుట్టంరాజు సునీల్ బాబు'...?

   తొలగించండి
  2. గురుదేవులకు నమస్సులు! ఇది నా పూరణ కాదండీ! పుట్టంరాజు సునీల్ బాబుగారిదే! వారు మా అక్కకు అల్లుడు! మిమ్మల్ని ఆశ్రమంలో కలవడానికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి కూడ వచ్చారు! గుర్తుందా?
   వారు నాకు పంపితే పూరణ బ్లాగులో ఉంచాను! ఇదివరలో వారు కొన్ని పూరణలు చేసి యున్నారు బ్లాగులో!
   వారి తరఫున ధన్యవాదాలు!🙏🙏🙏

   తొలగించండి
 32. వడగాలికి కడు రయమున
  వడియము లెండెను, విడువని వానలలోనన్
  విడిది గృహమ్మున ముచ్చట
  పడి వేయించ ప్రియ సఖియ పడిపడి తింటిన్
  (పడిపడి అనే వ్యావహారకము వాడాను)

  రిప్లయితొలగించండి
 33. మడిగను బామ్మ పెట్టగనె మబ్బులు పట్టెనటంచు బల్కుచున్
  బుడుతలు గేలిసేయనొకపుత్రుడు యంత్రము వేసినంతటన్
  తడి పిసరంత లేక విశదమ్ముగ చూడ్కికి వింతగొల్పుచున్
  వడియములెల్ల నెండినవి వాన లవారితరీతిగా బడన్

  రిప్లయితొలగించండి
 34. కడు తీష్ణమైన ఎండకు
  తడియన్నది లేక హర్షదాయక మగుచున్
  వడగండ్లు ఘల్లుఘల్లున
  వడియము లెండెను, విడువని వానలలోనన్

  రిప్లయితొలగించండి
 35. వడ కడుహెచ్చ ప్రీతి సతిపట్టుగ చేసిన సగ్గు బియ్యపున్
  వడియము లెల్ల నెండినవి, వాన లవారిత రీతిగాఁ బడన్
  కడుముదమందజేయగ స్వకాంత గ్రహించి గృహేశు కోరికన్
  వడివడి వేపి తైలమున భర్తకుఁబెట్టెను భోజనమ్మునన్

  రిప్లయితొలగించండి
 36. కోట రాజశేఖర్ - రెండవ పూరణ

  పడ నదె రామమూర్తిశరవర్షము, గ్రక్కుచు నగ్ని ధారలన్,
  వడియము లట్లు రాక్షసుల ప్రాణము లెండెను తాపమందుచున్,
  మడిసెను రావణాసురుడు, మైథిలి రాముని జేరె, చూడగా
  వడియము లెల్ల నెండినవి , వాన లవారిత రీతిగా బడన్.
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   రామశరవర్షంలో రాక్షసప్రాణాలు ఎండినవన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 37. వడి వేడిగఁ దినవలయును
  వడియము లెండెను విడువని వానలలోనం
  దడిసి పరుండు ముదమ్ముగఁ
  బడ నేల కలవర మిట్లు పశు గత భీతిన్


  పుడమిని నున్న సస్యములు పుష్పము లెల్ల స తోయజమ్ములుం
  దడిసి నశించె నత్యధిక దారుణ వృష్టి విఘాత ధాటికిం
  దడఁబడి తిండి లేక యటఁ దామర సాకర మందు నిల్చి యా
  వడి యము లెల్ల నెండినవి వాన లవారిత రీతిగాఁ బడన్

  [ఆవడి =ఉపద్రవము; యములు = హంసలు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమైన విరుపు పూజ్యులు కామేశ్వరరావు గారూ! నమశ్శతములు!🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవ పూరణలోని విరుపు అనన్యసామాన్యం. అభినందనలు.

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
   డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు. సంస్కృతాంధ్ర భాషల లోని మాహాత్మ్యమే యది. కమ్మటి వడియాలు తెల్లటి హంసలైనవి మధురముగా.

   తొలగించండి
  4. విద్వజ్జనులు పరిష్కరించలేని సమస్యయేమున్నది?! 🙏🙏🙏🙏

   తొలగించండి
 38. మిడసర కాలమయ్యెగ సమీకరణమ్ములు మారె నేటికిన్
  గొడుగులు గూర్చి పంటలకు గొప్పగ జేయ నవీన సేద్యమున్
  వడిగొని యెండతోడుగ యపార ప్రవాహక శక్తిగూర్చగన్
  మడుగుల నీటితో కరవు మాన్పగ బూనగ నాయకుండహో
  యడుగిడ చంద్రమండలము హద్దులులేకయె శాస్త్రప్రజ్ఞకున్
  వడియము లెల్ల నెండినవి వానలవారిత రీతిగా బడన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "తోడుగ నపార..." అనండి.

   తొలగించండి
 39. కడివెడు దఃఖమునందున
  గడుపుచు కులకాంత లెంచుకాపురము వలెన్
  నడుపగ విద్యుత్ యంత్రము
  వడియములెండెను విడువని వానల లోనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "విద్యుద్యంత్రము" అనండి.

   తొలగించండి
 40. కందం
  తడబడ శిఖండి కనఁబడ
  కడు వీరుడు భీష్ముడెండ కవ్వడి వృష్టిన్
  తొడుగుల! కౌరవు లెండన్! !
  వడియము లెండెను విడువని వానలలోనన్!

  రిప్లయితొలగించండి
 41. పడతుల కిష్టమైనవని భాస్కరుడుంచిన వేడిచేతనే
  వడియము లెల్ల నెండినవి!వానలవారిత రీతిగాబడన్
  గొడుగులుబట్టినట్లు తగుకూరలుభోజన మందువేడిగా
  వడియము లుంచగా?"పడతివాల్జడ కుంచినమల్లెలౌనుగా!

  రిప్లయితొలగించండి


 42. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  [ వానలో వడియాలు ఎండినటుల పగటి పూట కలగని ,

  పగటికల నిజమౌ నని వడియాలు వానలో నెండబెట్టిన

  ఒక మూర్ఖపు కోడలికి , గయ్యాళి అత్తకు , ‌‌‌‌‌

  మధ్య సంభాషణ ]

  ---- -----------------------------------------------------------------------  వడియము లెండ బెట్టితివి వర్షము వచ్చును , తెమ్ము , కోడలా !
  ..................................................................................................


  జడియకు మత్త ! వానకును జక్కగ నెండును లెమ్ము , నా‌నకన్
  ....................................................................................................


  బడితను వెట్టి వెన్నుపయి బాదెద , చెప్పిన మాట దాటినన్

  వడియము లెట్టు లెండు జడివాన‌కు ? వాగకు తిక్క తిక్కగా
  .......................................................................................


  గడచిన నాడు , నేను కలగంటి బవల్ | గల లోన , వట్టిగా

  వడియము లెల్ల నెండినవి వాన లవారిత రీతిగా బడన్ |

  కడు నిజమౌ గదా పగలు‌‌ గాంచిన స్వప్న విశేష మెప్పుడున్ |
  ....................................................................................


  పడసెను నాదు కొడ్కు నిను భార్యగ ; ఛీ యవివేకురాల ! ‌ నా

  కడపను దాటి పోవె యిక ; గాళ్ళను విర్చెద నింట నిల్చినన్
  ........................................................................................

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారిగారూ! మహత్తరమైన అత్తాకోడళ్ళ వివాదం!! 👌👌👌🙏🙏🙏

   తొలగించండి
  2. గురుమూర్తి ఆచారి గారూ,
   అత్త కోడళ్ళ సంవాద రూపమైన మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  3. గురుమూర్తి ఆచారి
   ..............


   గురువర్యు లగు శ్రీ కంది శంకరయ్య గారికి మరియు

   సత్కవయిత్రి యగు శ్రీ మతి సీతా దేవిగారికి ధన్యవాదములు , నమస్సులు

   తొలగించండి
 43. బడబాగ్ని వంటి యెండన
  వడియము లెండెను విడువని వానన లోనన్
  తడవగ కడురో దించెను
  పడతియె తనదు శ్రమయంత వ్యర్థమ్మవగన్.

  రిప్లయితొలగించండి
 44. తడబడి యా మడేలు వడి తల్లిని జానకి దూలనాడగా
  నొడబడి రామచంద్రుడట నొప్పగ మిక్కిలి రాజ్యభారమున్
  విడువగ కానలోన మది వీడనిశోకమునన్ గృశింపగా
  సడలగ ధైర్యమంతయు విచారము గ్రమ్మగ సీత యాశలన్
  వడియము లెల్ల నెండినవి వానలవారిత రీతిగా బడన్!

  రిప్లయితొలగించండి
 45. వడగాలుల వేసవిలో
  వడియము లెండెను, విడువని వానలలోన
  న్నిడునవి కరకరమను రుచి
  వడివడిగా వేఁపి తినగ పలుకును కైతల్!

  రిప్లయితొలగించండి
 46. చంపకమాల

  తడిసెనయోధ్య పంక్తిరథు దైన్యపుటశ్రువు వర్షధారలై
  యడవులకేగు రాముడన నార్తిగ దేశము శోకసంద్రమై
  దుడుచుచు రామపట్టమును దుగ్ధపు మందర, కైక గుండెలన్
  వడియము లెల్ల నెండినవి వాన లవారిత రీతిగాఁ బడన్

  రిప్లయితొలగించండి

 47. కం
  పొడి పొడి యెండల నుంచిన

  వడియము లెండెను, విడువని వానలలోనన్

  కడు వాంఛలె పతికి గలుగ

  పడతియె బజ్జీలొనర్చ వడి బుజియించెన్  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి

 48. సీసం
  పడుకుల న్వండెను బాగరి యొక్కతె ఘనమైన భక్త్రితో కాస్యపేయు
  లెల్లరు పొగడగ, తల్లిఐ, తన వలువలను విడచి జేసె వడ్డనమ్ము
  తోయజ లోచన ద్యోసత్తులు పొగడన్, మడితోడ బెట్టిన మధుర మైన
  వడియము లెండెను విడువని వానల లోనన్, తురంగము లోన నేను
  పతికి పూజలు చేయుచు భక్తి కలిగి
  నత్త మామల సేవలన్ చిత్త శుద్ది
  కల్గి చేసిన ఫలమని కలవరించె
  నీరజాక్షి నొక్క దినమున్ నిదురయందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   కందపాదాన్ని సీసపాదంలో చక్కగా ఇమిడ్చారు. పూరణ బాగున్నది.
   "కలిగి యత్తమామల... నీరజాక్షియె యొకనాడు నిదురయందు..." అనండి.

   తొలగించండి
  2. స్వప్న వృత్తాంతముగ మీ సీసపద్య పూరణ చాల బాగున్నది పూసపాటివారూ! మీ వల్ల ఈరోజు తురంగ పదానికి అంతగంగమనే అర్ధాన్ని తెలుసుకోగలిగాను ధన్యవాదములు! అభినందనలు!🙏🙏🙏

   తొలగించండి
 49. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 50. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 51. పడతిని వీడి వృత్తిపయి భారముగా పరదేశమందునన్
  గడిపెడు వాడి చెంతకొక కామిని జేరెను కోర్కెమీరగన్
  బిడియము వీడుచున్నతని ప్రేమను పొందు నెపమ్ము తోడుగన్
  వడియము లెల్ల నెండినవి వానలవారిత రితిగా బడన్

  రిప్లయితొలగించండి
 52. వడిగా వేసవిలో నిడ
  వడియము లెండెను ,విడువని వానలలోనన్
  తడియగ నారుబయటగల
  వడియములనుగాంచి నాతి వగచెను మదిలో.

  రిప్లయితొలగించండి
 53. వడగళ్లాగగ నెండకు
  వడియము లెండెను ; విడువని వానలలోనన్
  పొడి వస్త్రము లేక పడతి
  తడి చీర ధరించి వేచి తన మగని కిడెన్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  తెల్లని పూవులు విరివిగ
  మల్లియ తీవియకుఁ గాసె; మామిడికాయ
  ల్లుల్లము రంజిల్లగ కో
  కొల్లల్లుగా తోటలందు కులుకుచు నిలువన్

  తే 3/4/2018 దీ నాటి సమస్యకు నా పూరణ

  గొడ్దు దానవు నీవని గొడవ జేయ
  మగడు, నెలదప్పె నని, దువ్వె మగువ మీస
  మానులెవరిట ననుచు మీమాంశ లేక
  మగని మీసము, లానంద మందజేయ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణారావు గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో 'కాయల్ + ఉల్లము' అన్నపుడు ద్విత్వలకారం రాదు. అది కేవలం నకారానికే పరిమితం.
   మూడవ పూరణలో మీమాంసను మీమాంశ అన్నారు.

   తొలగించండి
 54. మిత్రులందఱకు నమస్సులు!

  [మిక్కిలి జాగరూకత గల యొక యిల్లాలి స్వగతము]

  "వడివడిగాను బందుగులు వచ్చుచునుండఁగ, వారికై హడా
  విడిగను పిష్టపూరములఁ బ్రీతినిఁ జేయఁగ, నెండవేఁడిమిన్
  వడియము లెల్ల నెండినవి! వాన లవారిత రీతిగాఁ బడన్,
  దడిసెడి వేమొ నేఁడు! కని, దబ్బున నిన్ననె తీసి, దాచితిన్!
  వడియము లట్లె యున్నఁ, దడుపం జను వర్షము! నేఁడు వచ్చియున్
  దడిపెనె? జాగ్రతల్ గలుగు దారయె యుండిన యిల్లె స్వర్గమౌ!"

  రిప్లయితొలగించండి
 55. గుడిసెల నివసించెడి మన
  బడుగుల నిజజీవనంబు వడి యము లనఁగన్
  వడి వడి కడగండ్లు గురియ
  వడియము లెండెను విడువని వానల లోనన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి

 56. ............సమస్య
  *"వడియము లెల్ల నెండినవి*
  *వాన లవారిత రీతిగాఁ బడన్"*

  *అతిథి దేవోభవ*

  సందర్భము: " "అతిథుల కింత కూ డెవరైనా పెడుతా, రిందులో పెద్ద గొ ప్పేమి" టంటుంది అత్తమ్మ. ఇవాళ అప్పడాలు వడియాలు బాగా యెండినవి. అతిథులు హాయిగా భోజనాలు చేస్తారు.
  ఇక వానలు రోజులతరబడి కురిసినా చింత లేదు. చుట్టాల భోజనాలు సాగుతూనే వుంటాయి."
  అనుకుంటూ వున్నది ఒక కోడలు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "కుడువగ వచ్చు వారలకు
  కూ డొకటే యెవరైన పెట్టరే!
  నుడువగ నేమి గొప్పయొ!" య
  నున్ గద యత్తమ.. నేడె యప్పడాల్
  వడియము లెల్ల నెండినవి..
  వాన లవారిత రీతిగాఁ బడన్
  గడువని చింత లే దిక సు
  ఖంబున సాగవె బంధు భోజనాల్!..

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి

 57. ............సమస్య
  *"వడియము లెల్ల నెండినవి*
  *వాన లవారిత రీతిగాఁ బడన్"*

  *తోడి కోడలు సణుగుడు*

  సందర్భము: "మన వడియాలు యెండినవా!" యని విభీషణుడు భార్య నడిగితే ఆమె యిలా జవా బిచ్చిం దట!
  ప్రభువైన బావగారు ఇదిగో!.. అని వాక్యం పూర్తి చేయకముందే సూర్యుడు అతని యింటికే దిగి వచ్చాడు. వాళ్ళ వడియాలు యెండినవి. లంకా నగరంలో కుండపోతగా ఒకవైపు వర్షం. కాలువ లన్నీ నిండిపోయినవి.
  ఏం చేస్తాను? మన వడియా లెండుతా యనుకున్నారా! మీ తపస్సు నే నెఱుగనిదా! (మీ రంత తపస్సంపన్నులు కారు గదా!)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఒడయడు బావగార లిది
  గో! యన నింటనె సూర్యుడే దిగన్
  వడియము లెల్ల నెండినవి;
  వాన లవారిత రీతిగాఁ బడన్
  గడబిడలోన నీ నగరిఁ
  గాల్వలు నిండిన; వేమి చేయుదున్?..
  వడియము లెండునా మనవి!
  వాసిగ మీ తప మే నెఱుంగనే!

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి

 58. .. .. సమస్య
  వడియము లెండెను విడువని వానలలోనన్

  సందర్భము: యోగులు కష్టాలలో మునిగి తేలుతూ వున్నా ముక్తి పొందుతూనే వుంటారు. దాన్నే ఉపమానాలలో ఇమిడ్చి ఉపమానాలుగానే చెప్పా లనుకుంటే ఇలా చెప్పవచ్చు.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  వడియాలు యోగు లనదగు;
  జడివానలు కష్టము లగు;
  సరి యెండె ననన్
  గడియించిరి మోక్షము నని;...
  వడియము లెండెను విడువని
  వానలలోనన్

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ
  5.4.18

  రిప్లయితొలగించండి
 59. డా. వెలుదండ వారూ,
  మీ పూరణలన్నీ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
  ముఖ్యంగా చివరి పూరణ ఆధ్యాత్మిక భావంతో అద్భుతంగా ఉన్నది.

  రిప్లయితొలగించండి
 60. భడభడ నెండ కాయగహ భాస్కరు డెక్కగ నెత్తిమీద భల్
  వడియము లెల్ల నెండినవి;..వాన లవారిత రీతిగాఁ బడన్
  ముడుచుకు కుంపటావలను ముచ్చట లాడుచు ముద్దుమీరగా
  వడియములమ్మ వేచినవి వంకర టింకరవన్నికొర్కుమా!

  రిప్లయితొలగించండి