25, ఏప్రిల్ 2018, బుధవారం

సమస్య - 2660 (పొలమును దున్నినంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో"
(లేదా...)
"పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో"

132 కామెంట్‌లు: 1. వలదీ సందేహమయా
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో,
  కలమును చేర్చగ పద్యపు
  జలతారెట్లో నటులనె చక్కగ రాజా!

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "జలతా రెటులో యటులనె..." ఆనండి.

   తొలగించు
 2. అలమిథిలను జన్మించెను
  పొలమును దున్నగనె పుత్రి; పుట్టుట యెటులో?
  ఫలమది పూర్వపు కర్మల;
  సులభముగా తెలియగలము సూక్షపు రీతిన్!

  రిప్లయితొలగించు
 3. పలునాళ్ళుగ సంతానము
  కలగని వాడొకడడిగెను కవిశ్రేష్ఠుడనే
  యలనాటి సీత విధమున
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'శ్రేష్ఠుడనే' అనడం సాధువు కాదు. "కవి శ్రేష్ఠుని దా। నలనాటి..." అనండి.

   తొలగించు
 4. హలమును కదిపిన చాలును
  పొలమును దున్నగను పుత్రి పుట్టుట యెటులో
  కలమును బట్టగ కావ్యము
  చెలువము తోవ్రాయు నంట శ్రీరాముని కై

  రిప్లయితొలగించు
 5. పలికెన్ జానకి "తమ రఘు
  కులమున పాయసము తిన్న కొడుకుల ! " యన న
  వ్వులు చిలుకుచు రాముడనెను
  "పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో !"

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   'బలరాముఁడు సీతఁ జూచి పక్కున నవ్వెన్' అన్న ప్రసిద్ధ సమస్యకు "...పొలమున దొరికెదరని ధీబలరాముఁడు..." అన్న పూరణ స్ఫూర్తితో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   నేను ఇదే భావంతో పద్యాన్ని టైపు చేస్తుండగా మీ పూరణ వచ్చింది కాకతాళీయంగా!

   తొలగించు


 6. పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో?
  బలబల లాడకోయి సయి బాళిభగమ్మును జేయుమయ్యరో,
  కలమును దూయ గా నరుడ కావ్యము కైపుల జేర్చు నెట్లయా?
  జలజల పారు నెట్లు మజ? చక్కగ రీతిగ నట్లనే సుమా

  జిలేబి

  రిప్లయితొలగించు
 7. సమస్య : -

  "పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో"

  కందము*

  హలమును చేతను భూనుచు
  పొలమును దున్నగనె పుత్రి; పుట్టుట యెటులో
  మొలకకు ముదమున తికమక
  కలిగి తుదకు మంచిపంటగా రానెంచెన్
  .................✍చక్రి

  రిప్లయితొలగించు
 8. మైలవరపు వారి పూరణ

  పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో !
  కలిగెను సందియమ్మని యొకండడుగన్ జనయిత్రి చెప్పెడిన్
  పొలమున బుట్టు , నద్రికిని బుట్టును స్వేచ్ఛగ , మంగళంబిడన్
  జలధిని బుట్టు , శక్తిదన జన్మము కాదవతారశోభయే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

   అలయక చెప్పుము తృటిలో
   పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?
   తెలిపెద బాతిగ వినుమా
   కలశోదధి నుండి సుధయె కలిగిన రీతిన్!

   తొలగించు
  3. రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 9. లక్ష్మి తనువీడి ధరణితలమునకేగ ,
  విష్ణు వామెను వెదకుచు వింతగొల్పు
  పుట్ట జొచ్చె ; గరుడుడు పాములకు జడిసి
  శేష శయనుని వరివస్య జేయ వేచె .

  రిప్లయితొలగించు
 10. హలమును బట్టి ప్రజాపతి
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో
  కలగా ననిపించె మొదట
  నిలలో కనిపించె కనుల కింపగు శిశువై

  రిప్లయితొలగించు
 11. "అలరుచుఁ బాయసమ్ముఁ దినినంతనె పుత్రులు గల్గు టెట్టులో
  తెలియఁగఁ జెప్పుఁ" డంచుఁ బతిదేవుని సీతయె గేలిసేయఁగన్
  బలికెను రాముఁడా పుడమిపట్టినిఁ గాంచుచు మేలమాడుచున్
  "బొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో?"

  రిప్లయితొలగించు
 12. చెలియరొ పాయసము తాగవలదె,తాగిన పుట్టెదరు
  నీకు సుతులు
  గడసరి జానకి గడబిడలకు,ఎగిరినవి
  రామలక్ష్మణుల మతులు
  రామానుజుని గని రాముడనె,వింటివా
  చోద్యమిది అయ్యరో
  పొలము దున్నినంత సుత పుట్టుట
  యెట్టుల సాధ్యమమ్మరో

  రిప్లయితొలగించు
 13. వలపుల రాజు మోహమున భామిని కూడగ చోద్య మేమనన్
  హలమును బట్టి దున్నగను నాగలి చాలుకు సీత గాంచగా
  కలమును చేత బూనగను కావ్యము లల్లుట వింత గాదటన్
  పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టు లసాధ్య మమ్మరో

  రిప్లయితొలగించు
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2660
  సమస్య :: *పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో ?*
  అమ్మా! పొలాన్ని దున్నితే ఆడపిల్ల పుట్టిందట. ఇది ఎలా సాధ్యం ? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
  సందర్భం :: దివ్యమైన పాయసాన్ని త్రాగిన తరువాత కౌసల్య సుమిత్ర కైకేయి లకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు కదా. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని సీతాదేవి శ్రీరాముని చూస్తూ ఓ ప్రాణనాథా ! మీ అయోధ్యలో పాయసం త్రాగితే పిల్లలు పుడతారట. ఇది ఎలా సాధ్యం ? అని చమత్కారంగా ప్రశ్నించింది. అప్పుడు జనక మహారాజు పొలాన్ని దున్నుతుండగా సీత లభించింది కదా. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని శ్రీరాముడు ఓ ప్రాణేశ్వరీ ! మీ మిథిలా నగరంలో పొలం దున్నుతూ ఉంటే ఆడపిల్ల పుట్టిందట. ఇది ఎలా సాధ్యం అని పరిహాసంగా సీతను ప్రశ్నించిన సందర్భం.

  తలపగ నర్మగర్భముగ తా ననె భూసుత సీత ‘’ నాథుడా !
  తెలుపుము నాకు, పాయసము దిన్న సుతోత్తము లీ యయోధ్యలో
  కలుగుట సాధ్యమా ? ‘’ యనుచు ; కాంతుడు రాముడు ప్రశ్న వేసె ‘’ మీ
  *పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో ? ‘’*

  ఇటువంటి నర్మగర్భ సంభాషణతో తెనాలి రామకృష్ణ కవి గారు తనకిచ్చిన ‘’ * బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్ * ‘’ అనే సమస్యను ఈ క్రింది విధంగా పూరించారు అని వాడుకలో ఉన్న పద్యం.
  ‘’ లలనలు పాయస మానిన
  కలుగుదురే పిల్ల ‘’ లనుచు క్ష్మాసుత నవ్వన్,
  ‘’ పొలమున దొరికెద’’ రని ధీ
  బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్.
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (25-4-2018)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   రామకృష్ణుని పూరణగా ప్రచారంలో ఉన్న పద్యాన్ని ప్రకటించినందుకు ధన్యవాదాలు.

   తొలగించు
 15. తెలివిగ యోచన జేయ గ
  పొలము ను దున్న గ నె పుత్రి పుట్టు ట యె టు లో
  కలలో గాంచిన వన్ని యు
  ఫలియించుట నటుల గు గద వసుధ ను సు క వీ !

  రిప్లయితొలగించు
 16. వలదు జనకా మలికితము,
  "పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో",
  తెలియదు గదా,వినుము పూ
  జిలు నెళవిదియనుచు తాపసి పలికె నపుడున్

  జనకుడు పొలమును దున్నిన సమయమున సీత జనించిగ ఆశ్చర్యముతో రాజ గురువును అడుగగా రాజగురువు సందియము వలదు ఇది దేవ రహస్యము అని చెప్పిన భావన

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నెల విది' అనండి.

   తొలగించు
 17. చెలువము నడిగెను జవ్వని
  బలవంతుడు హనుమ సూర్యుఁ బండని దినుటన్
  నలుగురు పాయసమునకును
  "పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో"

  రిప్లయితొలగించు


 18. తెలుసుకొనుమా జిలేబీ
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో
  కలకాదిది నిజ మోయీ
  తలచన్ బ్రహ్మయ్య సాధ్య తరమగు నమ్మా !

  జిలేబి

  రిప్లయితొలగించు
 19. తలపు న సందియ మొదవ గ
  పొలమును దున్న గనె పుత్రి పుట్టు ట యె టు లో
  విల సి త మగు రామ కథ ను
  పలు మరు చదివి న ను తొలగు భావము నందు న్

  రిప్లయితొలగించు
 20. అలసిరి రైతులు మెండుగ
  పొలమును దున్నగనె; పుత్రి పుట్టుట యెటులో
  వలపుల రాణిని నడుగగ
  కిలకిల నవ్వుచు మురిసెను క్రిందను మీదై

  రిప్లయితొలగించు

 21. కవివర్యుల పంథాలో :)


  కిలకిల నవ్వుల నడిగె
  న్నిలన్ తిరుకణామధువున నిన్గనినారో?
  వలపుల భూజ! మహీసుత!
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తిరుకణామధువు' అర్థం కాలేదు.

   తొలగించు

  2. తిరుకణామధువు - పాయసము - ఆంధ్ర భారతి ఉవాచ

   జిలేబి

   తొలగించు
 22. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
  ‌‌‌‌‌‌‌‌‌ ‌‌ ‌‌

  చండార్కుని కరములతో

  బెండగిలుచు గూలిపోతి | బెడ్ పేషంటై

  యుండితి వార | మవుర ! మా

  ర్తాండు‌ని మించు‌ కఠినుడు గలండె జగతిలో ?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గు రు మూ ర్తి ఆ చా రి గారు వడదెబ్బ నుండి పూర్తిగా కోలుకున్నట్లు తలుస్తాము.
   చిన్న చిట్కా యుల్లిపాయ జేబులో వేసుకున్న (వాసనకు) వడదెబ్బ తగులదు!

   తొలగించు
  2. గురుమూర్తి గారూ,
   నీడ పట్టున విశ్రాంతి తీసుకొనండి.
   నేను కూడా ప్రొద్దున ఒక పని ఉండి గ్రామాంతరం వెళ్ళి ఎండలో ఇంతకు క్రితమే తిరిగి వచ్చాను. ఎండ ప్రభావం నామీద కూడ కొంత పడింది.

   తొలగించు
  3. శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి పాదనమస్కృతులు . ధన్యవాదములు .

   శ్రీ గురువర్యులకు శంకరార్యులకు పదనమస్కారములు . ధన్యవాదములు .

   తొలగించు
 23. డా.ఎన్.వి.ఎన్.చారి
  బలజముతో నలరారును
  పొలమును దున్నగనె; పుత్రిపుట్టుట యెటులో
  తెలియును నేడందరికిని
  కలిగిన నెట్టింటి తెలివి "కనగా" నదియున్
  నెట్ +ఇల్లు internet

  రిప్లయితొలగించు

 24. కలుగుదురే పిల్లలు వని
  తలు పాయసమును గొననని ధరణిజ యనగా
  నలుగక రాముడనె నిటులు
  "పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?"

  రిప్లయితొలగించు
 25. ఇలజానకి పుట్టెనుగద
  పొలమును దున్నగనె,పుత్రిపుట్టుటయెటులో
  యలయా బ్రహ్మయె యెఱుగును
  దెలియంగా రాదుసుమ్మి తిరుమలరాయా!

  రిప్లయితొలగించు

 26. కలుగగ సందేహమ్మది
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?
  విలువగు లలనల పొలమున
  నిలుపగ కర్మల బలముల నిజమౌవినుమా!

  పొలము = క్షేత్రము = శరీరము
  బలము = బీజము = విత్తనము

  రిప్లయితొలగించు
 27. .
  గలగల పారే నదిలో
  నలలోనల పెట్టెనందు నబ్బాయెటులో
  తొలకరి చినుకుల హలమున
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మల్లేశ్వర్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నదిలో నలలోపల పెట్టెనందు...' అర్థం కాలేదు.

   తొలగించు
  2. నదిలోన్+అలలోన్+అల...
   నదిలోని అలలో ఆవిధంంగా..

   తొలగించు
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించు
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించు
 28. కలవరపడకిల మనసా!
  "పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో!"
  అలమిథిలాపుర నృపునికి
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట గనలే!

  రిప్లయితొలగించు
 29. కందం
  భళి భళి పాయసమున్ గొనఁ
  గులసతులకు పుత్రులనెడు కుజ గేలికి ధీ
  బలరాముఁడు నవ్వి యనెన్
  "పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?"

  రిప్లయితొలగించు
 30. ఫలములు దొరకునె రైతులు
  పొలమును దున్నగనె? పుత్రి పుట్టుట యెటులో
  జలజాక్షులు తెలుపగలరె?
  కలమది వ్రాయుట తెలుపున కావ్యము సుమతీ :)

  రిప్లయితొలగించు
 31. కలమునుపట్టి శోభిలురకంగ తలంపులురావదేలనో
  జలధినిచిల్కినంతనె విషంబుజనించగ వింతగాదకో
  చలపతిచెంత చేరగను చప్పునబోవగ నొవ్వదేలనో
  పొలమును దున్నినంత సుతపుట్టుట యెట్టుల సాధ్యమమ్మరో

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'రకంగ'...? "శోభిలగ కమ్మ తలంపులు..." అంటే బాగుంటుందేమో?

   తొలగించు
  2. మీ సవరణకు ధన్యవాదములు శంకరయ్య గారూ

   తొలగించు
 32. పొలమునుదున్నినంతసుతపుట్టుటయెట్టులసాధ్యమమ్మరో
  పొలమును దున్నినంత సుతపుట్టెనుజానకిగా వసుంధర
  న్దెలియుము రాముజన్మము ను దీయని పాయస పానమేగదా
  లలిత!జరుంగు గొందరివి లాంఛనమియ్యది యిజ్జగంబునన్

  రిప్లయితొలగించు
 33. మిత్రులందఱకు నమస్సులు!

  [సీతారాముల సరస సంభాషణము]

  "ఇలఁ గొనఁ బాయసమ్ము, సుతు లెట్టులఁ బుట్టెదరో?" యనెన్
  గలికి మహీజ రాఘవునిఁ గాంచుచుఁ జిన్నగ నవ్వుచున్ వెసన్;
  "పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో?"
  కిలకిల నవ్వుచున్ బలికెఁ గేలి యొనర్చుచు రాఘవుం డటన్!

  రిప్లయితొలగించు
 34. నెల లంత నిండఁగఁ దనదు
  పొలఁతుక మహిషియ యరణ్యమునఁ గనుచుండం,
  దలఁచెను దున్నయె డెక్కల
  బొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో

  [పొలము =ప్రదేశము; దున్ను = సమము చేయు]


  దున్న గనె (చూచెను) పుత్రి పుట్టుట యని యన్వయించుటకు నఱ సున్న (గనెఁ బుత్రి పుట్టుట) యాటంకమైనది!


  పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో
  హలమున హాటకద్యుతుల యజ్ఞ తటిం గృషి చేయు చుండగం
  గలిగె సుమాస్తరమ్మున సు కన్యక పద్మ యనంగ ఱేనికిం
  గలవర మేల సీత నలఁ గాంచమె యవ్విధి సంభవింపగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వరాహపురాణమూల ప్రణీతము నా “పద్మావతీ శ్రీనివాసము” ద్విపద కావ్యము:

   యజ్ఞార్థి కాంచన హలమూని చేతిఁ
   బ్రజ్ఞానిధి కృషి యారణి తటిఁ జేయ 16.

   బీజములు భువిని వెదజల్లు చుండ
   యాజన స్థలమున నాధరణి పతి 17.

   పద్మదళ నివహ భాసిత శయన
   పద్మ సన్నిభ మార్దవ శిశువుఁ గాంచె 18.

   విస్మయానంద వివృత హృదయుండు
   విస్మరించి హలముఁ బ్రియ బాలఁ గొనియె 19.

   తొలగించు
  2. సీతా:

   పోచిరాజు వారి ఈ ద్విపద కావ్యమును ప్రింటు జేసి కాపీలు నీకునూ, మరికొందరికీ, గత ఉగాదినాడు పంపితిని; జ్ఞాపకమున్నదా?

   తొలగించు
  3. అవును . నాదగ్గర ఆప్రతి ఉన్నది!🙏🙏🙏

   తొలగించు
  4. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   సందర్భశుద్ధితో మీ స్వీయకావ్యములోని ద్విపదలను ప్రకటించినందుకు ధన్యవాదములు.

   తొలగించు
  5. డా. అన్నాచెల్లెండ్రులకు ధన్యవాదములు.
   పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 35. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

  నిన్నటి పూరణ స్వీకరింప మనవి
  :::::::::: ::::::::::: :::::::::::::::::::::::::::

  జ్వరములో వ్రాశాను . TYPE MISTAKES ఉంటే క్షమించాలి  హరిహరు డయ్యె సేవకుడు | నయ్యె వశం బల ముజ్జగంబులున్ |

  హరి కనిపింప ఖండన మొనర్చెద | నేనె ప్రభుండ | భక్తి నం

  దరు స్మరియింపగా వలయు నా ఘననామమె | యెవ్వరేనియున్

  మరచి మదాఙ్ఞ , నీచహరినామము కూసిన , వారి నాల్కలన్

  సరసర కోసివైచెదను | ‌సాగెద సత్వర‌ మేను దుగ్ధసా

  గరమునకున్ | వధించెదను కష్టుని విష్ణు నటంచు గ్రూర భా

  స్కరకశిపుండు కేశవుని కై వెదుకంగ > నదృశ్య మౌచు నా

  పరమపరాత్పరుండయిన పంకజనాభుడు దాగె నెచ్చటో !

  " గరుడుడు సర్పభీతుడయి గ్రక్కున జొచ్చెను పుట్డ లోనికిన్ "


  { హరిహరుడు = ఇంద్రుడు ; భాస్కరము = సువర్ణము ,

  హిరణ్యము ; భాస్కరకశిపుడు = హిరణ్యకశిపుడు }

  రిప్లయితొలగించు
 36. చంపకమాల
  కులసతులిష్టి పాయసము గ్రోలఁగ పుత్రులయోధ్య పుట్టుట
  న్నెలతుక సీత పల్కగనె నీలకళేబరు నాలి సేయుచున్
  బొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో
  భళి మిథిలాపురిన్ యనెడి వాక్కుల రాముడు మేలమాడడే!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పురిన్ + అనెడి' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించు
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

   చంపకమాల
   కులసతులిష్టి పాయసము గ్రోలఁగ పుత్రులయోధ్య పుట్టుట
   న్నెలతుక సీత పల్కగనె నీలకళేబరు నాలి సేయుచున్
   బొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో
   భళి మిథిలాపురంబు నను వాక్కుల రాముడు మేలమాడడే!

   తొలగించు
 37. జలముల దొరికెను రాధకు
  కిలకిల మనుగోదనుగనె కేళీవనమున్
  తలచగ బ్రహ్మకసాధ్యమె
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో!

  రిప్లయితొలగించు


 38. కలయో వైష్ణవ మాయో
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట! యెటులో
  కలిగెను కొమర్తె ! నిచ్చెద
  విలుకాడికి శివధనుస్సు విరువన్ ముదమున్ !

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విలుకానికి' అనండి.

   తొలగించు
 39. కలమును పట్టినంతట సుకావ్యము వ్రాయుట సాధ్య మమ్మరో?
  శిలలను తట్టినంతటనె సింగము పారుట సాధ్య మమ్మరో?
  జలమును పట్టినంత జలజమ్ములు పూయుట సాధ్య మమ్మరో?
  పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


  2. పట్టు పట్టరాదు పట్టి విడువ రాదు
   గట్టి యత్న మున్న గడ్డిలోన
   బుడత బుట్టునయ్య బుడిబుక్క లాటగన్
   మడత కాజ పాల మహిమ యనగ :)

   జిలేబి

   తొలగించు
  3. చివరి పాదం:

   దీని యర్థ మేమి తెలుపు మమ్మ !

   తొలగించు
  4. డా. శాస్త్రి గారు నమస్సులు. ఆహా మీ పద్యలతామతల్లి వికసించిన దీ వేళ!

   తొలగించు
  5. పురాణములు తెలియనందున వక్రమార్గమే నాకు శరణ్యం సార్!

   తొలగించు
 40. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అలయక చెప్పుము తృటిలో
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?
  తెలిపెద బాతిగ వినుమా
  కలశోదధి నుండి సుధయె కలిగిన రీతిన్!

  రిప్లయితొలగించు
 41. తెలుపవె, జానకమ్మ సరి ధీటగు సద్గుణ వంతురాలె యౌ
  కలికిని బిడ్డగా బడచు కాంక్షయె మిక్కుట మయ్యె భారతీ
  విలసిత పత్ర నేత్ర నిను వేడెద, సంతతి లేదునాకు నా
  పొలము దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్యమమ్మరో

  రిప్లయితొలగించు
 42. గురువు గారికి ఆరోగ్యం ఎలా ఉన్నదో ఉదయము హాజరు వేసుకొని స్కూలుకు డుమ్మా కొట్టారు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మా దగ్గర పనిచేసే అతని కూతురు పెళ్ళి. పెళ్ళిపత్రికలు ప్రింటు చేయించడానికి సూరారం వెళ్ళాను. అక్కడ పని కాలేదు. షాపూరుకు వెళ్తే అందరూ రెండు మూడు రోజుల తర్వాత ఇస్తామన్నారు. అతనికేమో అర్జంటు. చివరికి ఒక ప్రెస్సువాళ్ళు రేపు ఇస్తామంటే ఇచ్చి వచ్చాను. ఎండలో ప్రయాణం. కొంత ప్రభావం పడింది. నీరసంగా ఉంది. అంతే! అందువల్లనే స్పందించడానికి ఆలస్యమయింది.

   తొలగించు
 43. ఇలనిది సాధ్యమౌన కడునింపుగ యజ్ఞముజేయ గా సుతుల్
  గలుగుట యంచు సీత పలుకన్ పరిహాసముగా చెలంగుచున్
  చెలిఁగనుఁగొంచు రాముడనె చెన్నగు పత్నిని గాంచి నవ్వుచున్
  “పొలమును దున్నినంత సుత పుట్టట యెట్టుల సాధ్య మమ్మరో”

  రిప్లయితొలగించు
 44. బల హనుమంతుడే యెగిరి పండని సూర్యుని బట్టెనెట్టులో
  పొలతులు పాయసమ్ము దిన పుత్రులు నల్గురు గల్గిరెట్టులో
  "పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో"
  తెలియవవేమి మర్మములొ దేవ రహస్యపు జాడలేమిటో!?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  2. చక్కని పూరణ విట్టుబాబుగారూ! అభినందనలు! 👏👏👏💐💐💐

   తొలగించు

 45. బలిమిని రావణాసురుడు భామను వేదవతిన్ వరింపగా
  వలదని యగ్నినందునను ప్రాణమువీడుచు దాను పిమ్మటన్
  జలజము నందు బాలికగ జన్మమునొందగ లంకచేటుగన్
  జలధిని ద్రోయగాను నొకసంపుట మందున, లభ్యమయ్యెగా
  పొలమును దున్నినంత సుత, పుట్టుట యెట్టుల సాధ్యమమ్మరో
  తులువగు రాక్షసాధముని ద్రుంచను శ్రీహరి యోజనేయగున్!

  రిప్లయితొలగించు
 46. డా.పిట్టా సత్యనారాయణ
  హలధరుడై వరుడుండగ
  చలమున సంతాన లక్ష్మి చానను జూచున్
  నిలయమునన్ గలియనిచో
  పొలమమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?

  రిప్లయితొలగించు
 47. డా.పిట్టా సత్యనారాయణ
  హలమున గోండ్ర ద్రిప్పగనె హాయిని బెండ్లి వరుండు, నాడు, నా
  జలజ సునేత్రి యౌ వధువు చక్కగ వెంటనె రాగ గాలియే
  విల విలలాడ లే మనువు వింతగ గోర్కులు బెంచుకోగనే
  ఫలితమె పుష్ప బాణుడట పంతము బూనక యున్న నూరకే
  పొలమును దున్నినంత సుత పుట్టుట యెట్టుల సాధ్యమమ్మరో!

  రిప్లయితొలగించు


 48. ఆకాశ్ వాణి వారి సమస్య


  మధులకు భారమయ్యె మధు మాసపు కోకిల గాన మాధురుల్ !

  రిప్లయితొలగించు
 49. పలుకును కోకిల నేర్వకె
  నిలచిన పువ్వులకురంగు నిలచినరీతే
  వలపులు గలుపగ జోడును
  పొలమునుదున్నగనె పుత్రి పుట్టుటయెటులో?(అటులే)

  రిప్లయితొలగించు
 50. ఇలలో నెల్లరు చూడగ
  హలమును పట్టుచును దున్న నా జనకునికిన్
  లలన లభించెను మిథిలను..
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో?


  రిప్లయితొలగించు
 51. *25-4-18*
  ..............🌻శంకరాభరణం🌻...............
  .. .. సమస్య
  పొలమును దున్నినంత సుత పుట్టుట
  యెట్టుల సాధ్య మమ్మరో

  సందర్భము: ప్రేమలో పడిపోయి తనకు పుట్టబోయే కూతురును గూర్చి పగటి కలలు గంటున్న ఒక అమ్మాయికి ఆమె తల్లి యిలా చెబుతున్నది.
  "మనసులు కలిసినవి. సరిపోయిందా! పెండ్లి కావాలి. గర్భధారణ జరుగాలి.
  పొలం దున్నగానే పంట యింటికి వచ్చేస్తుందా! సకాలంలో నాట్లు వేయాలి. కలుపు తీయాలి. కాపు కాయాలి. కోత కోయాలి.
  అప్పుడు గదా పంట యింటికి వచ్చేది!"
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ఇలఁ దగు వేళ నాటవలె,
  నేర్పడు కల్పును దీసి వేయగా
  వలె, మరి కోయగావలెను
  వాసిగ; నింటికి పంట వచ్చునే
  పొలమును దున్నినంత!.. సుత
  పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో!
  కలిసె మనస్సు లింతె కద!
  కావలె పెండిలి, గర్భ ధారణల్..

  2 వ పూరణము:

  .. .సమస్య
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో

  సందర్భము: కమ్మని కథ లెన్నో మన కున్నాయి. పొలాన్ని దున్నగానే పుత్రిక పుట్టిన సంగతి తెలుసుకోవా లంటే జనక మహారాజు కథ వినాలి.
  కాని "మనకు కూడా అలాగే కలుగుతారా!" అని మాత్రం అడుగవద్దు.
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ఇలఁ గమ్మని కథ లెన్నో!
  పొలమును దున్నగనె పుత్రి
  పుట్టుట యెటులో...
  తెలియగ.. జనకుని కథ విన
  వలె "కలుగరె మనకును నటువలె!"
  ననకుండన్..

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించు
 52. *25-4-18* 3 వ పూరణము:

  ..............🌻శంకరాభరణం🌻...............
  .. ..సమస్య
  పొలమును దున్నగనె పుత్రి పుట్టుట యెటులో

  సందర్భము: ఒక గురువు శిష్యునితో యిలా కసురుకున్నాడు..
  "జనకు న్నడుగాలి పొలాన్ని దున్నగానే పుత్రిక యెలా పుట్టిందో! న న్నడిగితే యేం లాభం? నా కేం తెలుసు?
  కాల హరణం కాకపోతే... "
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  అల జనకుని నడుగన్ వలె
  పొలమును దున్నగనె పుత్రి
  పుట్టుట యెటులో...
  యిల న న్నడిగిన లాభము
  గలదే యిసుమంత గూడ!
  కాల హరణమే!..

  4 వ పూరణము:

  .. ..సమస్య
  పొలమును దున్నినంత సుత పుట్టుట
  యెట్టుల సాధ్య మమ్మరో

  సందర్భము: కుశధ్వజ మహర్షికి వేదం చెబుతున్నప్పు డుద్భవించిన కన్యయే వేదవతి. శ్రీ హరికే సమర్పించుకోవా లనుకున్నాడు. ఆమెకూ శ్రీ హరియందే మనసు.
  లక్ష్మీదేవి సభలో ఒకనాడు తుంబురుడు అద్భుతంగా గానం చేస్తాడు. నారదుడు నేనూ చేస్తా నని ఆరంభిస్తాడు. లక్ష్మీదేవి దాసీలచేత బెత్తములతో కొట్టించి వెళ్ళగొడుతుంది. నారదుడు 'నీవు రాక్షస కృత్యం చేశావు కాబట్టి రాక్షస గర్భంలో జన్మించు' మని శపిస్తాడు. కేవల రాక్షస గర్భంలో కాకుండా మహర్షుల రక్తాన్ని పానం చేసిన రాక్షస స్త్రీకి పుట్టేట్టు సడలించు మనగా నారదుడు సరే నన్నాడు. లక్ష్మీదేవియే వేదవతి.
  కొందరు రాజు లామెను పెండ్లాడుతా మన్నారు. కుశధ్వజు డొప్పుకోలేదు. పగబట్టిన రాజులు కుమ్మక్కయి వచ్చి ఆ మహర్షిని హతమార్చినారు.
  వేదవతి శ్రీ హరినే భర్తగా పొందా లని తపస్సు కుపక్రమించింది. కొంతకాలం గడచింది. రావణుడు వచ్చి తనను భర్తగా స్వీకరించు మనగా ఆమె కా దన్నది. అత డామె జుట్టు పట్టుకున్నాడు. ఆ సాధ్వి దాన్ని తానే తెగగోసుకొని తప్పించుకొని వెళ్ళి అగ్నిలో దూకింది.
  దూకే టప్పుడు "నీ పట్టణంలోనే పుట్టి నిన్ను సర్వ నాశనం చేస్తా" నని హెచ్చరించింది.
  (ఆమెయే క్రమంగా లంకలో పుట్టి మిథిలలో లభించిన సీత.)
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  వెలయగ నా కుశధ్వజుడు
  వేదముఁ జెప్పెడు వేళఁ బుట్టె.. నా
  లలనకు పేరు వేదవతి;
  లక్ష్మియు నారద శప్త యామెయే!
  పొలమును దున్నినంత సుత
  పుట్టుట యెట్టుల సాధ్య మమ్మరో!
  యిల నన నట్టి వేదవతి
  యే మిథిలన్ లభియించె సీతగా..

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించు