9, ఏప్రిల్ 2018, సోమవారం

సమస్య - 2646 (కోతులె కవులెల్ల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్"
లేదా... 
"కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్"
ఈ సమస్యను పంపిన బాబు దేవదాసు గారికి ధన్యవాదాలు.

95 కామెంట్‌లు:

 1. ప్రీతిగ రాముని బంటుగ
  నీతిగ సేవలను జేసి నిష్టగ కొలిచెన్
  సూతుని విద్యల బడసిన
  కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్

  రిప్లయితొలగించండి
 2. కైతల సృష్టింపగ ని
  ర్భీతిగ కవితా వనమున విహరించెదరీ
  జాతికి రత్నము లనుగన
  కోతులె కవులెల్ల రనుచు కోకిల కూసెన్.

  రిప్లయితొలగించండి


 3. నీతుల జుర్రుకొన, నిరతి
  దాతుఫలము బట్టి నేర్వ దలితపదమ్ముల్,
  చూతము కొరకై వేచెడు
  కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. "నీతిని దప్పని రఘుకుల
  నేతకు సహచరులెవ ?" రని "నెవ్వరు నిల ప్ర
  ఖ్యాతిని దెచ్చి ? "రని యడుగ
  "గోతులె కవులెల్ల" రనుచు గోకిల గూసెన్ .

  రిప్లయితొలగించండి
 5. జాతికి రక్షకుల మని పు
  నీతులమని గద్దె నెక్కి నీతిని విడు దు
  ర్నేతల నడచు కపిదళపు
  కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్

  రిప్లయితొలగించండి
 6. మేతలె కావ్యపు ఫలములు
  కూతలె పద్యపు గవితలు గోలను జేయన్
  చేతలె సరసపు విరుపులు
  కోతులె కవులెల్ల రనుచు కోయిల కూసెన్!

  రిప్లయితొలగించండి

 7. కోతులు వనమున పరుగిడు
  కూతలిడుచు గుంపుగ, పరుగులిడ కవనమున్
  రాతలు వ్రాయుచు విబుధులు
  "కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్"

  రిప్లయితొలగించండి
 8. ప్రీతిగ నేతల భటులై
  నీతులు నియమములు వీడి నిష్ణాతులుగా
  కైతలు కుప్పించినచో
  కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్

  ...కొంత అన్యాయము చేసినందుకు కోతులకు క్షమాపణలు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జీపీయెస్ వారూ...
   భేషుగ్గా చెప్పితిరిగ
   వేషములన్వేయుచు దమ భూసుర ఘనులన్
   ఘోషాలో నుండియు దా
   మాషా లెక్కన పొగడెడి మాన్యుల తీరున్!
   🙏🏻💐

   తొలగించండి
  2. భేషుగ్గా చెప్పితిరిగ
   వేషములన్వేయుచు దమ పృథ్వీపతులన్
   ఘోషాలో నుండియు దా
   మాషా లెక్కన పొగడెడి మాన్యుల తీరున్!
   🙏🏻💐

   తొలగించండి

 9. చేతల్ గాంచిన లెక్క బెట్టు గణముల్ చేర్చన్యతుల్ప్రాసలన్
  వాతన్ పాడన మేలు పద్యములు నెవ్వల్దీర్చు రీతిన్ సదా
  సాతాళించన, నాంధ్ర భారతిని వేసారించి సాధింతురే
  కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్


  జిలేబి
  (పరార్ :)


  రిప్లయితొలగించండి
 10. భావముల వెతుకగ గెంతెదరు నటునిటు
  ఊహల శాఖల అంచులన్
  మన కవితలు ధీటైనవనుచు తలలోని
  పేలను ఏరి చూడగన్
  కలము పేరునదె తన శిశువుగ నెంచి
  కడుపుకతికి మిద్దెలెగురగన్
  కోతుల్ గారె కవీంద్రులెల్లరనుచుం గూసెం
  బికం బొయ్యనన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ప్రాతఃకాలమునందు గెంతుదురయా భావమ్ములన్ పొందనే
   చేతుల్ తా తల పేనులేరు కదయా చేవన్ కవిత్వమ్ము రాన్
   శ్రోతల్ పోహణ జేయ మిద్దెల‌ పయిన్ శోభిల్ల గన్ జూతురే
   కోతుల్ గారె కవీంద్రు లెల్లరనుచున్ గూసెం బికం బొయ్యనన్!


   జిలేబి

   తొలగించండి
  2. ఇదేదో శంకరాభరణంలో నా గుఱించే రాసినట్టుంది.
   :)

   తొలగించండి


  3. అబ్బే ! విట్టుబాబు గారు నేనే మళ్లీ చదివినా వామ్మో ఇది నాగురించేలా అనిపిస్తోందండి ! అంటే చదివిన వారికందరికి వారి గురించేనేమో అనే "some" దేశం వస్తోందంటారా :)


   జిలేబి
   నారదా!

   తొలగించండి
  4. గురువు గారు...దేవదాసు గారు చెప్పగానే మనలాంటి కారణజన్ములైన పరమానందయ్య శిష్యులకు సరిఘ్ఘా వర్తిస్తుందనే ఇచ్చినట్టుంది...ఇంకేం పరమానందయ్య శిష్యులకథ తో ఓ శారదా దూలాన్ని అందుకోండి...
   :)

   తొలగించండి
 11. మైలవరపువారి పూరణ

  🙏వందే వాల్మీకి కోకిలమ్..

  కవి = పండితుడు

  ప్రీతిన్ మారుతి పండితాగ్రణియె వార్ధిన్ దాటె , నవ్వార్ధిపై
  సేతున్ గట్టు ప్రణాళికారచనలో శ్రేష్ఠుల్ నలాదుల్ కవుల్ ,
  ఖ్యాతిన్ సూరియె యంగదుండచట వ్యాఖ్యానించె సందేశమున్
  కోతుల్ గారె కవీంద్రు లెల్లరనుచుం గూసెం బికం బొయ్యనన్ !

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రీతిగ వసంతమున నా
   ఖ్యాతిని వర్ణింపనట్టి కవిత కవితయే ?
   ఏ తావున మిము బొగిడెదఁ ?
   గోతులు కవులెల్లరనుచు కోయిల కూసెన్ !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. వందే నవ వ్యాకరణ స్వభావ!! కపీంద్రులను కవీంద్రులు చేసిన పూరణ అద్భుతమ్!! 🙏🙏🙏💐

   తొలగించండి
  3. మొత్తానికి వానర కవి శ్రేష్టులను శార్‌'దూలా'నికి కట్టి పడేశారు. ప్రణామాలు మైలవరపువారూ!!
   🙏🏻💐

   తొలగించండి
 12. నీతుల్ చెప్పుచు గద్దె నెక్కుచును దుర్నీతిన్ ప్రజాళిన్ సదా
  నేతల్ వంచన చేయుచుండ దృతి నానేరాత్ములన్ ద్రుంపి యీ
  జాతిన్ కాయ జనించి, నిచ్చ హనుమత్సైన్యంబులైవెల్గుటన్
  కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్

  రిప్లయితొలగించండి
 13. నూతన వత్సర దినమున
  సూతులు యవధానమునను సొంపుగ సలుపన్
  లేతగు చూతము దినుచును
  "కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్"

  రిప్లయితొలగించండి
 14. భూతల మందున సరసులు
  సూతులు సుకవీంద్రులెగద జూడండనుచున్
  యేతావాతా గనుడిక
  "కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్"

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2642
  సమస్య :: *కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్.*
  కవీంద్రు లందరూ కోతులే గదా అని కోకిల కూసింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: గురువుగారు విద్యార్థులకు ఉక్తలేఖనంలో పరీక్ష పెడుతూ సమస్యకోసం ఇచ్చిన ఒక పద్య పాదాన్ని తాను చెబుతూ పిల్లలను వ్రాయమన్నారు. ఒక విద్యార్థి ‘’కపీంద్రులెల్ల’’ అనే పదాన్ని ‘’కవీంద్రులెల్ల’’ అని పొరపాటున వ్రాసినాడు. అప్పుడు గురువు శిష్యుని మందలించే సందర్భం.

  వ్రాతన్ దిద్దుము, బాగుగా విను, మికన్ భాషా పరిజ్ఞానమున్
  ప్రీతిన్ పొందుము, *పీ* ని వ్రాసితివిగా *వీ* గా నిటన్ జూడు, నీ
  వ్రాతన్ నేటి సమస్య మారి, జటిలం బైపోయెగా నిట్టులన్
  *’’కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్.’’*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (9-4-2018)

  రిప్లయితొలగించండి
 16. గురువర్యా! భ్రమపడి మొదట ఉత్పలమాల మొదలు పెట్టినానండీ.
  వ్రాతను దిద్దుకోవలెను, భాషను బాగుగ నేర్చుకోవలెన్,
  ప్రీతి పఠింపగావలెను, పీ యన వీ యని వ్రాసినావు, నీ
  వ్రాతను మారిపోయె గద బాలక ! నేటి సమస్య చూడుమా
  *కోతులెగా కవీంద్రు లని కోకిల కూసెను తీయగా నిటన్.*

  రిప్లయితొలగించండి
 17. డాపిట్టా సత్యనారాయణ
  వాతలు బెట్టడె మారుతి
  నీతిని దప్పిన సహింప నేరడు మహిలో
  ఈ తరపు నతనివారీ
  కోతులె కవులెల్లరనుచు గోకిల గూసెన్

  రిప్లయితొలగించండి
 18. నీతులు జెప్పుచు వ్రాయుచు
  జాతికి సంస్కరణలుంచి చైతన్యపుసం
  దాతలు "రసికతయందున
  కోతులె కవులెల్లరనుచు" గోకిలగూసెన్

  రిప్లయితొలగించండి
 19. సేతువు గట్టగ తోడ్పడె;
  నీతి నిపుణులని బలికిరి నేర్పుగ పెద్దల్;
  లేత చిగురు దిని మత్తుగ ;
  కోతులె ;కవులెల్లరనుచు ; గోకిలగూసెన్

  రిప్లయితొలగించండి
 20. ఈ నాటి నా సమస్యాపూరణ పద్యానికి అనువాదం :
  సంస్కృత శ్లోకం :: రచన అవధాని చిటితోటి విజయకుమార్ కలకత్తా.

  సంశుద్ధిం కురు లేఖనాని - శృణుతాత్ సమ్యక్ - లభస్వ స్వయం
  భాషా జ్ఞాన ఫలం - కృతోఽత్ర భవతా పీవర్ణ ఏష భ్రమాత్
  వీవర్ణః త్వదీయ రచనే- జటిలా చేత్థంసమస్యాఽభవత్
  సశ్రావ్యం పరభృత్ చుకూజ కపయః సర్వే కవీంద్రా ఇతి.
  అనువాద శ్లోక రచన : అవధాని చిటితోటి విజయకుమార్ కలకత్తా.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. వామ్మో! సంస్కృతం లో శార్దూలమే !


   జిలేబి

   తొలగించండి
  2. పై శ్లోకంలో సవరణ మూడవ పాదంలో
   వీ వర్ణః త్వదీయ రచనే అనే దానికి బదులుగా
   వీ వర్ణ స్తవ లేఖనేన అని ఉండాలి. గమనించ మనవి.

   తొలగించండి
 21. చూతము కిందకలిసికొని
  వాతావరణ చలువపయి వాదములాడన్
  కైతలు చెప్పుటను వినగ
  కోతులె కవులెల్ల రనుచు( గోకిల కూసెస్

  రిప్లయితొలగించండి
 22. సీతాపతి దండు యెవరు?
  కైతలు రచియించు నెవరు,? కామసఖమ్మున్
  ప్రీతిగ యిది గూసె నెవరు ?
  కోతులె, కవులెల్ల ,రనుచుఁ గోకిల గూసెన్!!!

  రిప్లయితొలగించండి
 23. ఆకాశవాణి ,హైదరాబాద్ వారిచ్చిన సమస్య:
  " పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ములెన్నో భువిన్"
  పూరణలు :

  నగుబాటయ్యెను పాలనే కుటిలమై నాశమ్మె లక్ష్యమ్ముగా

  మగువల్ తల్లడ మందు చుండిరిలలో మానమ్మె కోల్పోవుచున్

  తెగువన్ జూపియు కొత్త పాలకులనే దీవించి రప్పింపగన్

  పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ములెన్నో మహిన్.

  ****)()(****

  భగవంతుండగు రామచంద్ర విభుడే ప్రద్యోతనుండోయనన్
  మగువన్ జేకొని వెంటరాగ ప్రముఖుల్ మార్మోగ జేజేలువేల్
  నగరమ్మందున కాలుమోపు తఱియా నాకమ్మె శోభిల్లగన్
  పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ములెన్నో మహిన్.

  రిప్లయితొలగించండి

 24. క్రోతులు నటునిటు తిరుగుచు
  మూతులు త్రిప్పుచు నరచుచు మూకుమ్ముడినన్
  నీతులు చెప్పుచు వ్రాసెడి
  కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్

  రిప్లయితొలగించండి
 25. ప్రీతి సమాజ శ్రేయ ము
  చైతన్యము నింపగోరి స లి పె డు రచన ల్
  రాతలు మార్చే నవ్య పు
  కోతులె కవులె ల్లర ను చు గోకి ల కూ సె న్

  రిప్లయితొలగించండి
 26. కోతుల్ గొమ్మల, కావ్యశాఖల కవుల్, గుప్పించి లంఘించగన్;
  కోతుల్ గానన, సత్కవుల్ సుకవితాగుల్మాటవిన్ చారులౌ;
  కోతుల్ సత్కవిరాజులందు కనగన్ గోకొల్లలీసామ్యముల్
  కోతుల్ గారె కవీంద్రులెల్లరనుచున్ గూసెన్ బికం బయ్యెడన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. సంస్కృతం లో యతి ప్రాసల ఝమేలా లేవాండీ ?

   జిలేబి

   తొలగించండి
  2. ఇదే సమస్యకు స్వీయసంస్కృతీకరణ;--
   శార్దూలశ్లోకం:---
   తే శాఖాసు కపీశ్వరా, స్సుకవితాశాఖాసు కవ్యర్షయో
   లంఘ్యంతే, కపయో వనాంతగమనాః, కావ్యాటవీగామినో
   యే విద్వత్కవయ, స్సమాః ఖలు తయో నైకా గుణా స్తద్వధాః
   ఇత్థం కూజతి కోకిల స్సుకవయ శ్శాఖాచరా ఏవ హి.


   తొలగించండి
  3. సంస్కృతం లో ప్రాస లేదు. ఇక యతి అంటే పదం యొక్క విరుపు. యతిస్థానంలో పదం పూర్తి అయుండాలి.

   తొలగించండి
  4. తృతీయపాదాంతంలో "స్తద్విధాః" అని సవరణ.
   దయతో గమనించగలరు.

   తొలగించండి
  5. యో అంటే ఏకవచనం ఎవడైతే అని అర్థం.
   యః యౌ యే ఏకద్విబహువచనరూపాలు.
   విద్వత్కవయః అనే బహువచనపదానికి విశేషణమైనందున యే అనే బహువచనరూపమే సరియైనది.

   తొలగించండి
  6. ధన్యవాదములండి. బహువచనమన్న విషయమును విస్మరించాను.

   తొలగించండి
 27. రిప్లయిలు
  1. p
   కోతులు గుంపుగ నేర్పడి
   ప్రీతిని శ్రీరామ యనుచు బ్రేమగ బలుకన్
   గోతుల పధ్ధతి జూచియు
   కోతులె కవులెల్లరనుచు గోకిల కూసెన్

   తొలగించండి
 28. రిప్లయిలు
  1. వాతముఁ జొర నీయక వసు
   ధాతలమున లంక యందు దానవ వరు లీ
   రీతి ననిరి, చేసిన వటఁ
   గోఁతులె కవు లె,ల్ల రనుచుఁ గోకిల గూసెన్

   [కవి = ఆక్రమణము]


   భూతవ్రాతము లందు నెంచఁ గవి సంపూర్ణ స్వతంత్రుం డిలన్
   వ్రాతల్మారు నెదుర్చ నౌదురు వడిన్ వాగ్బాణ తప్తుల్ ధరా
   పాత త్రస్త వరాంగ యుక్తులు దలంపన్ జోలి కెన్నండుఁ బో
   కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్

   [పోకు+ఓతుల్ =పోకోతుల్; ఓతులు = పిల్లులు]

   తొలగించండి
 29. డాపిట్టా సత్యనారాయణ
  వాతలు బెట్టడె మారుతి
  నీతిని దప్పిన సహింప నేరడు మహిలో
  ఈ తరపు నతనివారీ
  కోతులె కవులెల్లరనుచు గోకిల గూసెన్

  రిప్లయితొలగించండి
 30. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  4 5 ‌ Years క్రింద B S C , B Z C పూర్తి చేశాను . తర్వాత నేను

  Syndicate Bank లో C A S H I O R గా 3 8 years.

  పనిచేశాను . ఏదో ఈ పాటి పద్య రచన గావిస్తున్నాను .


  నాకు సంగీతము లో కూడ ప్రవేశ మున్నది . హార్మోనియం , తబల

  వచ్చును . నేను ఘంటసాల గారి పద్యాలు , పాటలు పెక్కు

  కచేరీలలో గానం చేశాను . నేను గానం చేసిన భక్తి గీతాల.

  Casset . లు మరియు C . D . లు కలవు .

  ‌నేను ఆకాశ వాణి , కడప కేంద్ర ము లో లలిత సంగీత గాయకునిగా

  20. Years. పాటు Continue అయ్యాను .

  ==============================================
  కవి మిత్రు లారా ! మీ సమస్యా పూరణా పద్యములను నే‌ను

  చక్కగా రాగయుక్తంగా గానము చేసి ఇస్తాను . మీరు C .D. గా

  రూపొందంచు కొనవచ్చు . ఇంచు మించు భగవద్గీత శ్లోకాల type లో

  గానము చేసి యివ్వగలవాడను .

  నా గాత్రమును కవిమిత్రు లకు ఉపయోగ పడేలా చేద్దామను

  కున్నాను నా సత్సంకల్పము గౌరవిస్తారని భావిస్తాను

  కవులకు కవయిత్రులకు ఇదే విన్నపము . న మ స్తే !

  ===============================================

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారు పద్యకుసుమ మకరందమునే గాక గానామృతమును కూడా పంచెదననిన మాకన్న నదృష్ట వంతు లన్యులు గలరె! నమస్సులు ధన్యవాదములు.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుమూర్తి ఆచారి గారూ. మీ ప్రయత్నం బహుధా ప్రశంసనీయం. నమోన్నమః!
   🙏🏻💐

   తొలగించండి

  3. నమో నమః

   ఇంటర్నెట్ జమానా లో సీడీలూ గట్రా అంటారేమిటండి బాబు !

   గానాన్ని ౨ లేక ౩ నిమిషాల క్లిప్పింగ్ గా యూ ట్యూబు లో పెట్టి బ్రాడ్కాస్ట్ యువర్ సెల్ఫ్


   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  4. ఆచారి గారు మీ ఫోన్ నెంబరు మెఇల్ ఐడి ఇవ్వండి

   తొలగించండి
  5. ఆచారిగారూ! మీరు పాటలుకూడ పాడతారని విని చాల ఆనందమైనది’! అభినందనలు! జిలేబిగారు చెప్పినట్టు మీ పద్యాలను మీరే పాడి( కోటవారి వలె) యూ ట్యూబులో పెడితే మేము విని ఆనందిస్తాము!! 🙏🙏🙏🙏

   తొలగించండి
  6. ఇంతకన్న మహద్భాగ్యము వేరే మా కింకొకటి యుండునా గురుమూర్త్యాచారిగారూ? మీ రీ పనిని నెంత తొందరఁగఁ జేసిన నంత మహదానందము మాకుఁ బ్రసాదించినవారగుదురు కదా! ధన్యవాదములు...నమస్సులు! 🙏🙏🙏

   తొలగించండి
 31. కందం
  ప్రీతిగ సమ్మేళనమునఁ
  గైతల రఘరాముఁ బొగడఁ గమ్మఁగ విని యీ
  రీతి జనించిరొ యప్పటి
  కోతులె? కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్!!

  రిప్లయితొలగించండి
 32. చేతిన్ కఱ్ఱను జూసి గంతులిడుచున్ చేదోడు వాదోడుగా
  ప్రీతిన్ దండము బెట్టుచున్ కిచకిచల్ పీడించి పాడింపగా
  నేతల్ మెచ్చిన రీతిగా పలుకుచో నేపథ్య గానమ్ములన్
  కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్

  రిప్లయితొలగించండి
 33. ప్రీతిం దూకుచు నాడుచుండు నొకచో వృత్తమ్ములన్ వెంటనే
  జాతిం జేరి గుభిల్లున న్నెగురు నాశ్చర్యమ్ముగ న్నంతలో
  తేతెయ్యంచును నాట్యమాడు నుపజాతి న్నిట్టు లశ్రాంతముం
  గోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్.

  రిప్లయితొలగించండి
 34. పద్యపు తరుశాఖలపై విహరించే వానరముల వలె చక్కగా కవులను పోల్చారార్యా! అభినందనలు! నమస్సులు!🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుకవి మిత్రులు మిస్సన్న గారూ....నానావిధ వృత్తజాత్యుపజాతి పద్యములను లిఖించుటకై యనేక విన్యాసముల నొనర్చు పద్యకవుల స్థితిని దెలుపు మీ పూరణము చాలా బాగున్నది! అభినందనలు!

   తొలగించండి
  2. ధన్యవాదాలు మధుసూదన మిత్రమా. నిన్నటి మీ దశావతార మాలిక అద్భుతః.

   తొలగించండి
 35. మిత్రులందఱకు నమస్సులు!

  కూఁతుం దెల్గు లిఖింపఁబూనియును సంకోచింపకే నేర్పఁ; ద
  న్మాతం గోరఁగ నుక్తలేఖనముఁ, జెన్నారం "గవీంద్రుం"డనన్,
  బ్రీతిం బుత్రి "కపీంద్రుఁ" డంచనియుఁ దా వేగమ్ముగా వ్రాయఁగాఁ
  "గోఁతుల్ గారె కవీంద్రు లెల్ల" రనుచుం గూసెం బికం బొయ్యనన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చిన్న సవరణము:

   మొదటి పాదంలో "కూఁతుం దెల్గు లిఖింపఁజేయఁగను..." అని పఠించఁగలరు.

   తొలగించండి
 36. ప్రీతిగ మాటలాడుచు
  సీతాపతి మదిను దోచి సేతువు కట్టన్
  త్రేతా యుగమ్ము నందా
  కోతులె కవులెల్ల రనుచు కోకిల కూసెన్.

  సేతువు కట్టిన దెవరన,
  యా తరణియు గాంచని విషయాలను భువిలో,
  ప్రీతిగ యామని యందున
  కోతులె కవులెల్ల రనుచు కోకిల కూసెన్.

  రిప్లయితొలగించండి
 37. నీతిన్ దప్పి చరించు స్వార్థపరులన్ నిత్యమ్ము ఖండింపగన్
  సీతన్ బాసిన రామచంద్రునిసదా క్షేమంబునే గోరుచున్
  భీతిన్ వీడిన వానరాళి యనిలో భీభత్సమున్ సల్పినా
  కోతుల్ గారె కవీంద్రులెల్లరునుచుం గూసెం బికంబొయ్యనన్

  రిప్లయితొలగించండి
 38. శార్దూలవిక్రీడితము

  ప్రీతిన్ గూర్చును పాతపాట వినగన్ వేనోళ్ల గానమ్ముగన్
  శ్రోతల్ మెత్తురొ? లేదొ? నేడు రొదలన్ జొప్పించఁ బాణీల ని
  ర్మాతల్ వ్రాయు మనంగఁ బాటలను గూర్చన్ జూడ స్వార్థమ్ముతో
  కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం గూసెం బికం బొయ్యనన్!

  రిప్లయితొలగించండి
 39. మేతల్ గాగను కావ్య చూతఫలముల్
  మిన్నంటు నానందమున్
  కూతల్ వేయగ పద్య కైతలనహో కోలాహలంబెల్లెడల్
  చేతల్ గావుత సారసంపు విరుపుల్
  జేకూర నుత్సాహమున్
  గోతుల్ గారె కవీంద్రులెల్ల రనుచున్ గూసెన్ బికం బొయ్యెనన్

  రిప్లయితొలగించండి
 40. గు రు మూ ర్తి ఆ చా రి

  పూసపాటి . క్రిష్ణ సూర్యకుమార్ గా రు !

  నా cell = 99 66 22 56 40 . phone . చేయదలచుకుంటే , night

  9 - 30 తర్వాత చేయండి , న మ స్తే

  రిప్లయితొలగించండి
 41. డా.ఎన్ .వి.ఎన్.చారి
  ప్రీతిగ శాలువ కొఱకై
  రోతగు కపితమును జెప్ప శ్రోతలు బెదరన్
  భీతిలి యుగాది రోజున
  కోతులె కవులెల్ల రనుచు గోకిల కూసెన్

  రిప్లయితొలగించండి
 42. డా.ఎన్.వి.ఎన్.చారి
  సీతామాతను రామచంద్రు దరికిన్ జేర్పించె నెవ్వారహో ?
  నీతిన్ గోరుచు,సంఘ శ్రేయమునకై నెవ్వారలన్ లేపునో
  ప్రాతఃకాలమునందుగూయు మృదు రావంబుల్ ప్రమోదించగన్???
  కోతుల్ గారె!కవీంద్రులెల్ల రనుచున్ బికంబొయ్యనిన్!!!

  రిప్లయితొలగించండి
 43. డా.పిట్టా సత్యనారాయణ
  చేతల్ జేయరు యక్రమార్క వితతిన్ జించేరు కొమ్మల్ యనన్
  శ్రోతాళిన్ మరిపించి యుద్యమములన్ జొప్పించి భీభత్సముల్
  ఆతంకాలను మాన్ప మూకల గన న్నౌత్సాహకుల్ వీరలే
  కోతుల్ గారె కవీంద్రులెల్లరనుచున్ గూసెం బికం బొయ్యనన్

  రిప్లయితొలగించండి
 44. డా.పిట్టా}సత్యనారాయణ}
  చేతల్ జేయరు ,యక్రమార్క వితతిన్ జించేరు కొమ్మల్ యనన్
  శ్రోతాళిన్ మరిపించి యుద్యమములో జొప్పించి ,భీభత్ససముల్
  ఆతంకాలను మాన్ప మూకల గనన్నౌత్సాహకుల్ వీరలే
  కోతుల్గారె కవీంద్రులెల్ల రనుచున్ గూసెం బికం బొయ్యెడన్!

  రిప్లయితొలగించండి
 45. డాపిట్టా}సత్యనారాయణ}
  ఆ.వా, స.పూరణం
  సొగసుల్ జూడగ లేని కన్నులకు సుశ్లోకుండ్రు వైద్యాళినిన్
  జగమే మెచ్చగ మారు మూలలకు వే జార్చన్ వయో వృద్ధ యో
  లగముల్ భేషన దృష్టి నందిరి బలే లాస్యంబులన్ జేసి రా
  పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ములెన్నో మహిన్,
  తగునీ సాయము చంద్ర శేఖరుని యౌదార్యంబు విఖ్యాతమౌ!

  రిప్లయితొలగించండి
 46. *9-4-18*. సమస్య
  *"కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం*
  *గూసెం బికం బొయ్యనన్"*

  సందర్భము: సులభము
  కృష్ణము= కోకిల
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  కోతల్ కోయరు; నీతులన్ మిడుకరే
  కోకొల్లలౌ తీరునన్;
  చేతల్ మాత్రము చేయు శ్రద్ధ విడరే
  శ్రీ మారుతిన్ బోలుచున్
  బ్రీతిన్ సత్కవు లుందు రి... ట్లనియె వా
  ల్మీక్యాఖ్య కృష్ణం బహో!
  కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం
  గూసెం బికం బొయ్యనన్

  2 వ పూరణము:--

  *కుకవులు*

  సందర్భము: సులభం
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  కోతల్ కోయరు సత్కవీంద్రు లెపుడున్
  కోకొల్లలౌ తీరుగా
  వ్రాతల్ వ్రాయరు; చెప్ప రే విధమునన్
  బాహుళ్యమౌ నీతులన్;
  మూతుల్ నాకరు నాయకాళికిని స
  మ్మోదార్థమై... కానిచో
  కోతుల్ గారె కవీంద్రు లెల్ల రనుచుం
  గూసెం బికం బొయ్యనన్

  మరొక పూరణము:-(కందము)

  .. .. .. ..సమస్య
  కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్

  సందర్భము: కోతులు కవులు కాగల రన్నది తేలి పోయింది హనుమంతుడు
  అశోక వనంలో సీత వద్ద రామ కథను గానం చేసినప్పుడే!
  కాని కవులు కోతు లెలా ఔతారు? ఇది పొసగునది కాదేమో!
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  కోతులు కవు లౌదురులే!
  సీతకు రామ కథఁ జెప్పు శ్రీ పవన సుతుం
  రీతిగ... నిది యెట్లు పొసగు?
  "కోతులె కవు లెల్ల రనుచుఁ గోకిల గూసెన్"

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి