అమ్మో.. సైకిలూ.. ఫేనూ... కమలం... కొడవలీ... పిడికిలీ.. అన్నీ ఒకటే.... రాష్ట్ర ప్రగతిని ఎవరూ శ్రుతి చేయడానికి వీణ మెట్లు నొక్కడం లేదని చెప్పానండీ... అందరూ ఎవరికి వారే.. యమునా తీరే... నమోనమః 🙏
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2647 సమస్య :: *ఒక్కడు నొక్కడే మఱియు నొక్కడు నొక్కడె యొక్క డొక్కడే.* ఒకడు ఒకడు ఒకడు ఒకడు ఒకడు అని వరుసగా చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం :: చూచినాను సీతమ్మను లంకలో అని హనుమంతుడు చెప్పిన తరువాత శ్రీరాముడు సపరివారంగా సముద్రాన్ని దాటి లంకకు వెళ్లదలచినాడు. అప్పుడు సముద్రుడు ఓ శ్రీరామా! విశ్వకర్మ కుమారుడు వానరవీరుడు అగు ఈ నలుడు వారధి నిర్మించగలడు అని తెలియజేయగా నలుడు రామ సేతు నిర్మాణమును ప్ర్రారంభిస్తాడు. అప్పుడు ఇతర వానరవీరులు ఒక్కొక్కరుగా వారధి నిర్మాణంలో నలునికి సహాయపడ్డారు అని విశదీకరించే సందర్భం.
ఆలి తను పూని అడుగంటిన ప్రేమను ఆవిరి చేసొదులును ఉన్న నలుగురిలో కొడుకువుగ నీవు మాత్రమే కాదనును ముదిమిని ఆదుకొన నలుగురు రారెవ్వరు చూచు ఉన్నొక్కడె ఒక్కడు నొక్కడే మఱియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే
గురువుగారికి నమస్సులు. బానిస బతుకులు ముక్తికి పరితపింప పరుల పాలన హేయాతి పాపమవ్వ బాల వృద్ధాక్రనందన్క్ బాపు శ్రీ శ్రీ ఒక్కడొక్కడె మఱి యొక డొక్క డొకడె .. బస్సులో నిల్చొ ని పూరణ చేసి నాను.
వెంకట నారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం. "బానిస బ్రతుకు..." అనండి. 'అవ్వ' అన్నది సాధువు కాదు. "పాపమగుట" అనండి. "వృద్ధాక్రనందనల్" టైపాటు. 'శ్రీశ్రీ'...? రెండవ శ్రీ వల్ల గణదోషం. శ్రి అని హ్రస్వంగా ప్రయోగించరాదు. "బాపెను ఘను। డొక్క..." అనండి.
గురువుగారూ, తప్పు దొర్లినది. మీసవరణ సర్వదా ఆమోదయోగ్యమే. "వేదోనిత్యమధీయతాం" అనే వాక్యములోనుంచి ఈ అధీయత అనే పదాన్ని వాడినాను. ఆ సంస్కృత పదాన్ని తెలుగు చేయడములో తప్పు దొర్లినది.
మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట-10-04-2018. ************************ చక్కని శంకరాభరణ* సాగు సమస్యల పూరణమ్ములో! కొక్కెములాగనిల్చుబుధ* కోవిద, పండితు లావధానులన్! పెక్కుగనొక్కచోటకడు* పేర్మినచేర్చినకందిశంకరుం డొక్కడునొక్కడేమరియు* నొక్కడునొక్కడెయొక్కడొక్కడే!
సాటి రాడుగా మేటి కిరీటి కెవడు
రిప్లయితొలగించండినాల మందను గావగ నాలమందు
భీష్ము డాదిగా గలసేన పీచ మడచె
"ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కిరీటి కెవ్వ। డాల..." అనండి. బాగుంటుంది.
పరుల యిండ్లను దూరుచు బాలు బెరుగు
రిప్లయితొలగించండివెన్నలను దోచి, స్నానించు వేళ లోన
పడచుల వలువలన్ దోచి, పడతి కృష్ణ
బ్రోవగన్ చీర లొసగిన పుణ్య పురుషు
డొక్కఁడొక్కడె మఱి యొక్కడొక్కఁడొకడె.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్కని గానమున్ వినగ సంతస మొందుచు తన్మయత్వమున్
రిప్లయితొలగించండిచిక్కని పాలమీ గడల చెక్కిలి బోలిన చిన్నదున్న చో
మక్కువ తోనమైక మున మాయను తేలెడి వాడునూ టికిన్
ఒక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁడొక్కఁడే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మక్కువతోడ.. వాడు నూటిలో।నొక్కఁడు..." అనండి.
చక్కని గానమున్ వినగ సంతస మొందుచు తన్మ యత్వమున్
తొలగించండిచిక్కని పాలమీ గడల చెక్కిలి బోలిన చిన్నదున్న చో
మక్కువ తోడమైక మున మాయను తేలెడి వాడు నూటిలో
నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
రిప్లయితొలగించండిబెంగాల్ టైగర్ కిక్ ౨ మిరపకాయ్ డాన్ సీను :)
డొక్క చీల్చెద భళిరనే డోలు కట్టె
దనను చున్ బీరముల బల్కి దబద బయని
నొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె
వచ్చి దెబ్బలు తినిరయ వార వేళ
చిత్ర సీమ కతలలోన జికిరి లేక :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిదేశ దేశాల వెదకిన దేవు డొకడె
కోట్ల కోట్ల దేవులు లేరు కొండలందు
మంచిమనసులోన గలడు మర్మమదియె
ఒక్కడొక్కడె మరియొక్కడొక్కడొకడె
..
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిప్రవరుడు....
చక్కని యా వరూధిని మృషల్ పలుకన్ ఘన ధర్మశాస్త్ర స...
మ్యక్కథనమ్ములంచు దన మాటల., చేష్టల కౌగిలింపగా
ప్రక్కకు ద్రోసె భూసురుడు , భాసుర నైష్ఠిక విప్రకోటియం...
దొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే" !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఎవరికి వారే ..యమునా తీరే...
తొలగించండిఎక్కడి పాదయాత్రలివి ? యేటికి ముట్టడి మోది యింటిపై ?
నెక్కడ దొంగదీక్షలివి ? యేటికి సైకిలు యాత్రలక్కటా ?
వెక్కసమయ్యె ! రాష్ట్ర హిత వీణ సురాగములొల్క మెట్లపై
నొక్కఁడు *నొక్కఁడే* ! మఱియు నొక్కఁడు *నొక్కఁడె*! యొక్కఁ డొక్కఁడే" !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
తొలగించండిఆయ్ ! మా చంద్రన్న కే యెదురా ! ఖబడ్దార్ :)
ఎవర్రా అక్కడ ! అవధానుల గార్ని సైకిల్ ఎక్కించండి :)
జిలేబి
మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅమ్మో.. సైకిలూ.. ఫేనూ... కమలం... కొడవలీ... పిడికిలీ.. అన్నీ ఒకటే.... రాష్ట్ర ప్రగతిని ఎవరూ శ్రుతి చేయడానికి వీణ మెట్లు నొక్కడం లేదని చెప్పానండీ... అందరూ ఎవరికి వారే.. యమునా తీరే... నమోనమః 🙏
తొలగించండి...మైలవరపు మురళీకృష్ణ
(కురుసభలో కృష్ణుని పల్కులు....)
రిప్లయితొలగించండిఇక్కురుపక్షమందు గల రెక్కటి జోదులు భీష్ముఁ డాదిగన్
బెక్కు రటంచు గెల్తుమని ప్రేలకు మోయి సుయోధనా! యిదే
నిక్కము, ఘోరయుద్ధమున నిల్చి జయంబును బొందు నర్జునుం
డొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే !
శ్రీకృష్ణ రాయబారము ననుసరించి చేసిన మీ పూరణ మద్భుతముగా నున్నది శంకరయ్యగారూ! అభినందనలు!
తొలగించండి
రిప్లయితొలగించండిఒక్కడు ఒక్కడు మారవి తేజుడే :) బెంగాలు టైగర్ :)
బక్కగ నుండు జూడన! తుపాకి వలెన్ రవితేజ రాజిలె
న్నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
చక్క సినీ జగత్తు మజ శాల్తిర కొట్టును బిల్చి దబ్బనన్
పిక్కల పై విలన్లట గుభిల్లను కైపుల వీరుడాతడే!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు:
రిప్లయితొలగించండి"తిక్క మాటలు మానుము పిక్కటిల్లి!
ఎక్కడుండుర బాలుడ? చిక్కగలడ?"
"అక్కడుండునిక్కడనుండు నిక్కముంగ!
ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె!"
(ఏకో దేవ: సర్వ భూతేషు...")
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నిక్క మరయ। నొక్కఁ డొక్కఁడె...' అనండి.
తేటగీతి
రిప్లయితొలగించండిబానిసత్వము నోపక భారతమున
దేశమంతయు వెన్నుగా దిటవు నీయ
చేతఁ బట్టె సత్యమహింస జాతికి పిత
యొక్కఁ డొక్కఁడే మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(మహాసహస్రావధాని గరికిపాటివారిలోని ఆరు విశిష్టగుణాలు)
రిప్లయితొలగించండిచిక్కని భావసంపదను, చిందెడి శాబ్దికనవ్యభంగులన్,
చక్కని భాషణ౦బునను, చారుతరోజ్వల ధారణంబునన్,
స్రుక్కని ధీర గాత్రమున, సూనృత ధార్మిక వాక్యరీతులన్,
నెక్కడనైన సాటిగలరే వెదుకన్ మన గర్కిపాటికిన్
ఒక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే.
బాపూజీ గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించండిశ్రీ బాలాజీ గారూ నమోనమః. సహస్రావధాని శ్రీ గరికపాటి వారిని ధారణను ప్రశంసిస్తూ నేను ఒక సమస్యను పూరించానండీ. మీకు తరువాత పంపగలనండీ. కోట రాజశేఖర్
తొలగించండిశ్రీ బాపూజీ గారూ నమోనమః
తొలగించండినమస్సులండీ!రాజశేఖర్ గారూ!
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2647
సమస్య :: *ఒక్కడు నొక్కడే మఱియు నొక్కడు నొక్కడె యొక్క డొక్కడే.*
ఒకడు ఒకడు ఒకడు ఒకడు ఒకడు అని వరుసగా చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: చూచినాను సీతమ్మను లంకలో అని హనుమంతుడు చెప్పిన తరువాత శ్రీరాముడు సపరివారంగా సముద్రాన్ని దాటి లంకకు వెళ్లదలచినాడు. అప్పుడు సముద్రుడు ఓ శ్రీరామా! విశ్వకర్మ కుమారుడు వానరవీరుడు అగు ఈ నలుడు వారధి నిర్మించగలడు అని తెలియజేయగా నలుడు రామ సేతు నిర్మాణమును ప్ర్రారంభిస్తాడు. అప్పుడు ఇతర వానరవీరులు ఒక్కొక్కరుగా వారధి నిర్మాణంలో నలునికి సహాయపడ్డారు అని విశదీకరించే సందర్భం.
ఒక్కడు, విశ్వకర్మసుతు, డుత్తమ శిల్ప కళా విశారదుం,
డక్కపివర్యుడౌ నలుడె యబ్ధికి వారధి గట్ట బూనగా,
తక్కిన వానరేశ్వరులు తామును సాయము చేసినారుగా,
*ఒక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కడే.*
*కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (10-4-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఒక్క మాటయె రాజ్యము ధిక్కరింప
రిప్లయితొలగించండినొక్క బాణమె శత్రువు తుక్కుజేయ
నొక్క దారయె బ్రతుకును చక్కదిద్ద
చక్కనయ్యయౌ మా రామ చంద్రమూర్తి
ఒక్కడొక్కడె మరియొక్క డొక్కడొకడె!
సీతాదేవి గారూ,
తొలగించండిచక్కనయ్యను గురించి చక్కనైన పూరణ చెప్పారు. అభినందనలు.
👏👏👏
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏🙏
తొలగించండిఅన్నయ్యకు ధన్యవాదములు!🙏🙏🙏🙏
తొలగించండిమర్మమెఱుగని మృదుశబ్ద మాన్యుడతడు
రిప్లయితొలగించండిసాధువులలోన యసదృశ సాధువతడు
విశ్వకీర్తిని బొందిన విబుధుడతడు
పాఠములు నేర్పు సద్గురు వర్యుడతడు
పద్య కవులకు శంకరాభరణమతడు
నిశ్చితముగ ప్రాతః స్మరణీయుడైన
వంద్య కంది శంకర కవి వరుడొకండె
యొక్కడొక్కడె మరియొక్కడొక్కడొకడె
నిక్క మిద్దియె మరివేరు నిజము లేదు!
తొలగించండి🙏🙏🙏🙏🙏🙏🙏
వందనమ్ములు వేవేలు' కంది'వర్య
తొలగించండి🙏🙏🙏
తొలగించండివిజయకుమార్ గారూ,
తొలగించండిప్రశంసారూపమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!
ధర్మ సంస్తాప నార్ధమై తనరు మదిని
రిప్లయితొలగించండిరక్క సులజంపి జగతిని రక్ష జేసి
దేవ లోకము మించిన దైవ మనగ
ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంస్థాప' టైపాటు.
ఆలి తను పూని అడుగంటిన ప్రేమను
రిప్లయితొలగించండిఆవిరి చేసొదులును
ఉన్న నలుగురిలో కొడుకువుగ నీవు మాత్రమే
కాదనును
ముదిమిని ఆదుకొన నలుగురు రారెవ్వరు
చూచు ఉన్నొక్కడె
ఒక్కడు నొక్కడే మఱియు నొక్కడు నొక్కడె
యొక్కడొక్కడే
స వ్య సాచి గ పేరొంది సమర మందు
రిప్లయితొలగించండిశత్రు సేనల చెండా డు శక్తి యుతు డు
విజయు డ రి వీర భీకర విక్రము దత
డొక్క డొక్క డె మరి యొక్క డొక్క డొకడె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విక్రము డత...' టైపాటు.
ఆంధ్ర కేసరి 'కేసరి'యనగనొప్పు
రిప్లయితొలగించండిగుండె చూపించి'సైమను'కుటిల దమన
కాండ నసమాన ధైర్యముఁగల్గ నాపె
ఒక్క డొక్కడె మఱియొకడొక్కడొకడె!
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కేసరి' పునరుక్తమయింది. "ఆంధ్రకేసరియె ప్రకాశ మనగ నొప్పు" ఆనండి.
ధన్యవాదములు
తొలగించండిచక్కగ నేడు గుఱ్ఱముల చంకుర మెక్కుచు చక్రధారియై
రిప్లయితొలగించండిదిక్కుగ ప్రాణికోటికిని దీప్తుల నిచ్చుచు నాప్తబంథుడై
మిక్కిలి చేతనత్వమును మిన్నగు బుద్ధిని నిచ్చువాడగున్
జక్కవ మిత్రుడా యరుణసారథి నెంచగ లోకమందునన్
నొక్కడె నొక్కడే మరియు నొక్కడు నొక్కడు నొక్కడొక్కడే
జక్కవ = చాతకపక్షి
విశ్వములో చాలమంది సూర్యులున్నా మనకు మనసూర్యుడొక్కడే!
నాల్గవ పాదంలో చివర ‘ లోకమందు దా’
తొలగించండినొక్కడె నొక్కడే యని చదువ ప్రార్ధన!
సవరణ సూచించిన జి.పి. శాస్త్రిగారికి ధన్యవాదములు!🙏🙏🙏
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిసవరణ:
తొలగించండిజక్కవ మనగా చక్రవాకము! పొరబాటున చాతకమని వ్రాశాను!
గురువుగారికి నమస్సులు.
రిప్లయితొలగించండిబానిస బతుకులు ముక్తికి పరితపింప
పరుల పాలన హేయాతి పాపమవ్వ
బాల వృద్ధాక్రనందన్క్ బాపు శ్రీ శ్రీ
ఒక్కడొక్కడె మఱి యొక డొక్క డొకడె ..
బస్సులో నిల్చొ ని పూరణ చేసి నాను.
వెంకట నారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "బానిస బ్రతుకు..." అనండి. 'అవ్వ' అన్నది సాధువు కాదు. "పాపమగుట" అనండి. "వృద్ధాక్రనందనల్" టైపాటు. 'శ్రీశ్రీ'...? రెండవ శ్రీ వల్ల గణదోషం. శ్రి అని హ్రస్వంగా ప్రయోగించరాదు. "బాపెను ఘను। డొక్క..." అనండి.
దోషాలను సవరించినందులకు నమోవాకములు.
తొలగించండిఉత్పలమాల (పంచపాది)
రిప్లయితొలగించండిచిక్కనిదౌ కవిత్వమును జేర్చుచుఁ దా నవధాన మందునన్
దిక్కుల నెల్ల కీర్తి గొనె దేశ విదేశము లందు మెచ్చఁగన్
మక్కువతో యనన్ గురు సమానులటంచును గర్కి పాటియే
దక్కిన వెన్ని యున్న బిరుదమ్ముల దాల్చరు మా *నరాల* వా
రొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మక్కువతో ననెన్' అనండి.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
తొలగించండిఉత్పలమాల (పంచపాది)
చిక్కనిదౌ కవిత్వమును జేర్చుచుఁ దా నవధాన మందునన్
దిక్కుల నెల్ల కీర్తి గొనె దేశ విదేశము లందు మెచ్చఁగన్
మక్కువతో ననెన్ గురు సమానులటంచును గర్కి పాటియే
దక్కిన వెన్ని యున్న బిరుదమ్ముల దాల్చని మా *నరాల* వా
రొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే!
ఎన్నికల సమయముఁ గడు మిన్నగాను
రిప్లయితొలగించండివ్యవహ రించెను శేషను ప్రతిభజుపి
దొరక డటు వంటి మేధావి మరల జగతి
నొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రావణాదుల దునుమాడె రహిని రాము
రిప్లయితొలగించండిడొక్కడొక్కడెమరియొక్కడొక్కడొకడె
సత్యమిద్దియ వలదింక సందియంబు
పేరు గాంచెను జగదేక వీరు డనుచు
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చక్కని జవ్వనిన్ నతని చక్కని రూపము జూడమోహమున్
రిప్లయితొలగించండిమక్కువ భూసురోత్తముని మత్తుగ కూడగ కోరగా జనన్
తక్కువ జూడగా వనిత తాపము తీరని అందమే లనన్
నొక్కడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
Dr H Varalakshmi
Bangalore
వరలక్ష్మి గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని కొంత అన్వయలోపం ఉంది. 'జవ్వనిన్ + అతని = జవ్వని నతని, అనన్ + ఒక్కడు = అన నొక్కడు' అవుతుంది.
చుక్కల దారిలో జనెను చుట్టె సముద్రము నొక్క గెంతులో
రిప్లయితొలగించండినుక్కడగించె సిం హికను హుమ్మని మోదెను రక్కసాళినిన్
చక్కని జానకిం గనెను సర్వము గాల్చెను వాతసూతి తా
నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
'రక్కస' శబ్దం తద్భవం. దానికి సవర్ణదీర్ఘసంధి రాదు. "రాక్షసాళినిన్" అనండి.
ధన్యవాదాలు గురువు గారికి. తప్పును సరిదిద్దుకుంటాను.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఎక్కడి కక్కడే హితులు నెయ్యము ,వియ్యము నాలు బిడ్డలున్
ఇక్కడివే భ్రమల్ ,రుచులు యేడుపు నవ్వులు సర్వ సౌఖ్యముల్
చక్కబడున్ బ్రపంచమున చాలును కాటికి జేర దాపలన్
ఒక్కడునొక్కడే,మరియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే!!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలొ యతి తప్పింది. "హితులు నెయ్యది వియ్యము..." అనండి. 'బిడ్డలున్ ఇక్కడివే' అని విసంధిగా వ్రాయరాదు. "రుచులు + ఏడుపు" అన్నపుడు యడాగమం రాదు. "రుచులు నేడుపు..." అనండి.
డాపిట్టాసత్యనారాయణ
రిప్లయితొలగించండిబక్క పంతులు బడి వీడి బడయ విడుపు
నక్కయౌ నూర నూరను నలిగి నలిగి
చక్కనౌ పేరు నందిన జగతి వెలుగు
ఒక్కడొక్కడె మరి, యొక్క డొక్కడొకడె
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ అర్థం కాలేదు. "బడయ విడుపు నక్కయౌ"...?
డా.ఎన్.వి.ఎన్.చారి
రిప్లయితొలగించండినొక్కుట నేర్వజాలగనె నొక్కున వెక్కడ నెట్లు గాంచినన్
నొక్కెడివాడితో పరులు నొత్తురు చత్తురు నొక్కు ట్రిక్కులన్
నొక్కును డబ్బులున్ పదవి నొక్కున వన్నియు నావినావన
న్నొక్కడెనొక్కడే మరియు నొక్కడు నొక్కడయొక్కడొక్కడే
డా. ఎన్వీయెన్ చారి గారూ,
తొలగించండిమీ నొక్కి వక్కాణించిన పూరణ బాగున్నది. అభినందనలు.
'అనన్ + ఒక్కడె = అన నొక్కడె' అవుతుంది.
ఒక్కనిచే జనించె జగ మొక్కని లోపల నుండె లీనమై
రిప్లయితొలగించండిఒక్కని యందు డిందుఁ దను నొక్కడె జీవుల సాకెను మూలహేతువౌ
నొక్కడె; వాడె పో యరయ నూతగఁ ద్రాతగ నున్న శ్రీధరుం
డొక్కడు నొక్కడే మరియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే.
రామాచార్య గారూ,
తొలగించండిపోతన పద్యానికి పేరడీగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. "జీవుల మూలహేతువౌ" అనండి.
సహజకవిభక్తపోతనకు క్షమాపణలు.
రిప్లయితొలగించండినమోవాకములు
స్రుక్కిన హైందవంబును విశుద్ధ తరంబుగ నిల్పి జాతికిన్
రిప్లయితొలగించండినిక్కపు బోధనల్ గఱపి నిత్యమధీయమయంబగు స్తోత్రపాఠముల్
పెక్కులుగా రచించి యలరించిన శంకర సద్గురూతముం
డొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. సవరించండి. "నిత్య మధీయపు స్తోత్రపాఠముల్" అందామా?
చక్కని పూరణ శాస్త్రిగారూ! నమస్సులు!🙏🙏🙏🙏
తొలగించండిగురువుగారూ,
తొలగించండితప్పు దొర్లినది.
మీసవరణ సర్వదా ఆమోదయోగ్యమే.
"వేదోనిత్యమధీయతాం" అనే వాక్యములోనుంచి ఈ అధీయత అనే పదాన్ని వాడినాను.
ఆ సంస్కృత పదాన్ని తెలుగు చేయడములో తప్పు దొర్లినది.
శ్రీమతి సీతాదేవిగారికి,
నమస్సులు. ధన్యవాదములు
అంగజ హరుడు! అజితుడు!హరుడు!అజుడు!
రిప్లయితొలగించండిగట్టు విలుకాడు! ఖట్వాంగి!కరిమెడదొర!
కాలకాలుడు!నటరాజు!నీలగళుడు!
కొండ మల్లయ్య!గోపతి!కోకనదుడు!
మేరుధాముడు!ముక్కంటి!మిత్తిగొంగ!
రాజశేఖరుడు!విధుడు!రాజధరుడు!
వాకదాలుపు!పురభిత్తు!వాజసనుడు!
ఫాల నేత్రుడు!బడరుడు!పంచ ముఖుడు!
వేల నామము లు గలిగి, వేదనలను
తీర్చు వాడు సాంబశివుడు ధిషణి లోన
ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరుడు అజితుడు హరుడు అజుడు... అని పద్యం మధ్యలో అచ్చులు రాకూడదు.
ఇవి దేవ నామాలు అందుకే సంబోధన గుర్తు వాడాను. ఆ ప్రకారం వాడిన తప్పులేదని గురువు గారు సెలవిచ్చారు.
తొలగించండిచక్రి సైన్యవిభాగమ్ము జరిపినంత
రిప్లయితొలగించండియూధమునె యెంచుకొనియె దుర్యోధనుండు
భక్తి తో గృష్ణు నెన్నుచు బార్థుడనియె
"ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె"
రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గగన యానము సలుపంగఁ గరము నియతి
రిప్లయితొలగించండినరులు పాటించి మౌనము కరము లెత్తి
రక్షక భట విశోధ నార్థముఁ జన వలె
నొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె
ఉక్కడఁగించె నా యసురు లుగ్ర మతుల్ పదునాల్గు వేలురం
ద్రొక్కెను ఘోరు లా త్రిశిర ధూషణ దైత్యుల దండకా వనిం
గ్రుక్కెను రావణానుజునిఁ గ్రూర ఖరున్ రణ మందు రాముఁడే
యొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
'పదునాల్గు వేగురం/వేవురం' అని ఉండాలనుకుంటాను.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. అవునండి. పదునాల్గు వేగురం సరియైనది. బాలురు మదిలో మెదలగా నసంకల్పితముగా వేలుర ని వ్రాసేశాను. వేలే బహువచనము కదా!
తొలగించండిఉక్కడఁగించె నా యసురు లుగ్ర మతుల్ పదునాల్గు వేగురం
తొలగించండిద్రొక్కెను ఘోరు లా త్రిశిర ధూషణ దైత్యుల దండకా వనిం
గ్రుక్కెను రావణానుజునిఁ గ్రూర ఖరున్ రణ మందు రాముఁడే
యొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
చిక్కులు బెట్టగా శివుని జేయగ జాయను పార్వతీసతిన్
రిప్లయితొలగించండిచిక్కుచు నగ్నికీలలను జీర్విని వీడగ దాననంగుడై
పెక్కగు తీరులన్ జనుల పెట్టగ జిక్కుల
యవ్వనంబునన్
చక్కని దోడుగా రతిని చైత్రము కోరిక లగ్గలింప దా
నొక్కడె నొక్కడే మరియు నొక్కడు నొక్కడు నొక్కనొక్కడే
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తోటనందలి ఫలముల దోచు చుండ
రిప్లయితొలగించండిప్రోచువారి కంటపడగ లొంగిపోయి
రొక్కడొక్కడె, మఱియొక్కడొక్కడొకడె
పారిపోయిరి భయమున వారినుండి
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మాడుగుల మురళీధర శర్మ
రిప్లయితొలగించండిసిద్ధిపేట-10-04-2018.
************************
చక్కని శంకరాభరణ*
సాగు సమస్యల పూరణమ్ములో!
కొక్కెములాగనిల్చుబుధ*
కోవిద, పండితు లావధానులన్!
పెక్కుగనొక్కచోటకడు*
పేర్మినచేర్చినకందిశంకరుం
డొక్కడునొక్కడేమరియు*
నొక్కడునొక్కడెయొక్కడొక్కడే!
*లేదా*
శంకరాభరణసమూహ*
సత్కవులను!
ఓలలాడించుచున్నట్టి*
నోర్పుజూపి!
శంక తీర్చెడు సాహితీ*
శంకరయ్య!
ఒక్కఁడొక్కఁడె మఱి యొక్క*
డొక్కఁడొకడె!
🙏🙏🏼🙏🏼🙏🏼
కంది శంకరయ్య:
తొలగించండిమీ ప్రశంసారూపమైన పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!
*"శంకరాభరణ మందు... పేర్మిని..."* అనండి.
అక్కట యేమనంగనగు నాస్తులనన్నియు గూడబెట్టిన
రిప్లయితొలగించండిన్నొక్కడు నొక్కడే మరియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే
యెక్కుచుబోవుగా నపుడ యేడగు కట్లును నుండగా దగన్
లెక్కలు సూచి యాయముడు లెంకను జేయును నుంట పాపమున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...గూడబెట్టె తా। నొక్కడె..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
తొలగించండిచిక్కుల నుండ ధర్మమది శిష్టుల కై యవతార మెత్తుచున్
చక్కఁగ మీన కూర్మ కిటి సామి నృసింహపు వామనాదిగా
మ్రొక్కు త్రిరాములైన హరి రూపమె కృష్ణుడు! వచ్చు కల్కియౌ
నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
సహదేవుడు గారూ,
తొలగించండిదశావతారాల ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'కిటి సామి' దుష్టసమాసం.
గురుదేవులకు ధన్యవాదములు. కిటి సామి అని కాకుండా కిటి వద్ద విరామమొసఁగి 'సామి నృసింహపు' అనిచదువుకుఅని సరిపోతుందా సర్?
తొలగించండియన్:టి,ఆర్ సినిమాలలోనాదినుండి
రిప్లయితొలగించండిరకరకాలైన పాత్రలు గన?సకలురకును
సంతసంబొసగెనుగద!వింతలేక
ఒక్కడొక్కడె మరియొక్క డొక్కడొకడె!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గన'? దీనివల్ల గణదోషం కూడా.
తేటగీతి.
రిప్లయితొలగించండిఎక్కడ వెదుక చక్కని వెన్నదొంగ?
చిక్కు వడడట శ్రీ హరిచక్కనయ్య!
ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె!!
తక్కువేటికి కృష్ణుడు దక్కె నింక
టక్కరి దొరకె, మొక్కితి ఠాకురు డని
శివరామకృష్ణ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కజ మిత్తరిన్ ప్రజననంతముగా తను సృష్టి జేయుచున్
రిప్లయితొలగించండిమక్కువ మీఱ రక్కసుల మార్కొని దాఁ స్థితి కారకుండునై
నక్కము నుంచి లోకముల నాశము జేయుచు నుండువాఁడు దాఁ
నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఔర ! మేధావి యంబేద్క రద్భుతముగ
రిప్లయితొలగించండిరమ్య మగురీతి రాజ్యాంగ రచన సలిపి
యాధునిక మనువని పేరు నందుకొనెగ
యొక్క డొక్కడె మఱియొక్క డొక్క డొకడె !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పెక్కగు రూపముల్ కలిగి, పెక్కు మఠాలుమతాలు యుండగా
రిప్లయితొలగించండియిక్కడి భారతావని సమైక్యత భావము పొందకున్న యా
యొక్కడు శంకరార్యుడుదయించెను పల్కెను దైవమొక్కడే
ఒక్కడు నొక్కడే మరియు నొక్కడు నొక్కడె యొక్క డెక్కడే
శ్రీకర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మతాలు నుండగా। నిక్కడి ... పొందకున్న నా..." అనండి.
ధన్యవాదాలు
తొలగించండికనగ సాంఘిక విజ్ఞాన గతిని మార్చి
రిప్లయితొలగించండిప్రగతి సాధింప చక్కని బాట వేసి
మార్క్సు మహనీయు డానాడు మహిని వెలిగె
నొక్కడొక్కడె మఱియొక్క డొక్క డొకడె !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కడ సింగపూరున విహాయస మందున వెన్నెలీనినన్
రిప్లయితొలగించండియిక్కడ భారతావనిన నింపగు చంద్రుడు కాంతు లీనినన్
యెక్కడి ప్రాంతమందయిన యెవ్వరి కైనను మోదమొప్పుచున్
చుక్కల మధ్యజేరి ఘన శోభల నీనెడు మామ యేగదా
యొక్కడు, నొక్కడే మఱియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఈనినన్ + ఇక్కడ, ఈనినన్ + ఎక్కడి, అందయిన + ఎవ్వరి' అన్నపుడు యడాగమం రాదు. 'వెన్నెల + ఈనినన్' అన్నపుడు సంధి లేదు. "విహాయసమందున చాంద్రి నీనె దా। నిక్కడ భారతావనిని... కాంతు లీనె దా। నెక్కడి... మందయిన నెవ్వరికైనను..." అనండి.
రిప్లయితొలగించండితే.గీ
ఈశ్వరుండు నల్లా బుద్దు డేసుప్రభువు
ననుచు ధారణీ ప్రజలంద రమిత భక్తి
కొలుచు రూపాలు వేరైన కోవెలేశు
డొక్క డొక్కడె మఱి యొక్క డొక్క డొకడె
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధారుణీ' అనండి. 'కోవెల' దేశ్యం. దానిని ఈశుడుతో గుణసంధి చేయరాదు. "కోవెల పతి। యొక్క..." అనండి.
రిప్లయితొలగించండిఏమండీ జీపీయెస్ వారు
ఆకాశవాణి సమస్య లేటెస్ట్ ఏమిటండి ?
జిలేబి
పగలే వెన్నెల నాట్యమాడ విరిసెన్ పర్వమ్ము లెన్నో మహిన్
తొలగించండిధన్య వాదాలండి విరించి వారు
తొలగించండినిగడమ్ముల్ విడి మానసమ్ము తనివిన్నీరాడి రామా యనన్,
ముగలిన్నిల్వగ నీశుడమ్మ సుదతీ ముద్దార బిల్వన్, ప్రియా
జగమే ఊయల నయ్యనే ప్రకృతియున్ జాడ్యమ్ము వీడన్ సఖీ
పగలే వెన్నెల నాట్య మాడ విరిసెన్ పర్వమ్ము లెన్నో మహిన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ ఆకాశవాణి పూరణ బాగున్నది.
మత్స్య యంత్రమ్ము గొట్టిన మహిసురుండు
రిప్లయితొలగించండితరుణిని సుభద్రఁ మనువాడు తాపసైన
విరటుఁ గొల్వున జేరిన పేడియైన
శరములఁ గురిపించు రణాన సవ్యసాచి
యొక్క డొక్కడె మరి యొక్క డొక్కడొకడె.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాపసి + ఐన' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
చిక్కని పాలు వెన్నలను శీఘ్రముగా హరియించి పోవుచున్
రిప్లయితొలగించండిపెక్కురు గోపకాంతలకు వేడ్కను పెంచిన వాడు, పట్టగా
చిక్కని వాడు, కాళియుని శీర్షము పైనను నాట్య మాడువా
డొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
భువిని విడుచునపుడు యేది భుజము నుండు?
రిప్లయితొలగించండితుది వఱకు వెంట వచ్చెడి తోడు యెవరు?
సంపదల? బంధువుల? కీర్తి జన్య సుఖమ?
నిక్కమేది యనుచు నెంచ నిజము నతడె
"ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అపుడు + ఏది, తోడు + ఎవరు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "భువిని విడువడునపు డేది భుజమునుండు... తోడెవండు' అనండి.
మిక్కిలి స్థావిరమ్మునను మీరిన మాలిమి సాకతమ్ముతో
రిప్లయితొలగించండిచిక్కులు చింతలన్నిటిని చీలిచి త్రచ్చుచు పారద్రోలుచున్
చక్కని లాలికమ్ము తగు చంకురమౌచును మోయుచుండు తా
నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే :)
అద్భుతమైన , విలక్షణమైన పూరణ!👌👌👌🙏🙏🙏
తొలగించండి🙏🙏🙏
తొలగించండిహనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏🙏🙏
తొలగించండిఎక్కడ వెదకి జూచిన చక్కగ కను
రిప్లయితొలగించండిపించు నక్కడ, యిక్కడ, విశ్వమందు
నంతటను నిండి యుండునా యబ్దిశయను
డొక్కఁడొక్కడేఁమహియొక్కఁడొక్కడొకడె!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"..నక్కడ నిక్కడ..." అనండి.
ప్రియమగుబహుమతుల గొని వేడుక కరు
రిప్లయితొలగించండిదెంచి రుద్యోగు లెల్లరు! దీటుగ జనె
నొక్క డొక్కడె మఱి యొక్క డొక్క డొకడె
మక్కువను జూపి యధికారి మన్నన గొన!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి1.ఒక్కమాటయు,శరమును నొక్కసతియు
నిలను వలెనటంచు జగతి కెల్ల చాటి
శిష్టులనుబ్రోచి కాచిన శ్రీ రఘుపతి
యొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె.
2.గోపకాంతల మనమును కూర్మి తోడ
గెలిచి వలచిన వాడిల కేలు తోడ
గిరిని యెత్తిన బాలుడు కేశవుండు
నొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె.
3.వెలదికి వలువలొసగిన వాడు స్యంద
నమును నడిపిన ధీరుడునగధరుండు
కోకలను దాచినట్టి యా గోపబాలు
డొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె"*
4.కరి మొరవిని కాపాడిన కారుణికుడు
బాల ప్రహ్లాదుని భయము బాపినట్టి
వాడు విశ్వరూపము జూపి పార్థునకట
జయము కూర్చిన శౌరియు జగతిలోన
నొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె.
5.కమ్మ వ్రాసిన కాంతను కరము పట్టి
పరిణయమ్ము నాడినవాడు వసుధలోన
బాల ధృవుని కాపాడిన వాసుదేవు
డొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె"*
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో "గిరిని నెత్తిన..." అనండి.
చక్కని పద్యధారగల సత్కవి వర్యుడు, ధర్మ పద్ధతిన్
రిప్లయితొలగించండిమక్కువ నాచరించు గుణ మాన్యుడు, పెక్కు సమస్యలన్ హృదిన్
జెక్కుచు శంకరాభరణ శ్రీ ఘన సంస్థను నిల్పి ప్రేమతో
నక్కున జేర్చె కంది సుకులాబ్జుడు సత్కవి శంకరయ్య తా
నొక్కడు నొక్కడే నొకడు నొక్కడు నొక్కడు నొక్కడొక్కడే
మద్దూరి రామమూర్తి..
మద్దూరి రామమూర్తి గారికి నమస్సులు!
తొలగించండిఇక్కిటి రూపుడై ధరకు నిక్కుల బాపెను, మీనకూర్ములై
రిప్లయితొలగించండియుక్కడగించె రక్కసుల, నుగ్రనృసింహుగఁ గాచె భక్తునిన్,
చక్కని ధార్మికాధ్వముల సారముఁ జూపెను రామకృష్ణులై,
యొక్కడు నొక్కడే మరియు నొక్కడు నొక్కడె యొక్కడొక్కడే.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిచిక్కని మొక్కవోనివగు సింగిణిఁ దూఁపులఁ జేఁతఁగొంచుఁ దా
నిక్కముగానుఁ గౌరవుల నెయ్యుల గుర్వుల సేనలందఱన్
జక్కఁగఁ జివ్వలోన నెద్రుచం జనె నా యభిమన్య బాలకుం
డొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే!
మధుసూదన్ గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండి(2)
రిప్లయితొలగించండిఒక్కట యోచనం గొని, తనొక్కఁడు బ్లాగు సృజించియుం దగన్
నిక్కములైన పద్దెముల నెన్నియొ వ్రాసెడు సత్కవీశులన్
జక్కఁగఁ బెంపొనర్పఁగను, సాహస మొప్పఁగఁ జేసె శంకరుం
డొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే!
మూడో పాదంలో... పెంపొనర్ప, ఘనసాహస .... అని పఠించగలరు.
తొలగించండిమధుసూదన్ గారూ,
తొలగించండిప్రశంసారూపమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!
తొలగించండిఎక్కువ లైకులుండునని యెంచితి నెంతయొ నేటి పోస్టుకున్
రిప్లయితొలగించండిపెక్కురు మెచ్చుకొందురని పించెను నాకును పోస్టు జేయగన్
యెక్కువదేమొ గాని మఱి యెవ్వడు నొక్కడు లైకు క్లిక్కునే
"ఒక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే"
రిప్లయితొలగించండి.. .. సమస్య
*"ఒక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు*
*నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే"*
సందర్భము: మహాకవి బమ్మెర పోతనామాత్యుల వారిని భక్తి పూర్వకంగా సంస్మరిస్తూ..
ఎవ్వని చేజనించు జగ మెవ్వనిలోపల నుండు లీనమై... అనే ప్రసిద్ధమైన భాగవత పద్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ వ్రాసిన ప్యారడీ లాంటి పద్య మిది.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఒక్కని చేజనించు జగ
మొక్కనిలోపల నుండు లీనమై
యొక్కనియందు డిందు నెపు
డుండున దొక్కడె మూలకారణం
బొక్క డనాది మధ్య లయు
డొక్కడె సర్వము తానె యైన వా
డొక్కఁడు నొక్కఁడే మఱియు
నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే...
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
రిప్లయితొలగించండి.. .సమస్య
*"ఒక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ*
*డొకఁడె"*
సవరణతో....
సందర్భము:
*ఏకం సత్ విప్రా బహుధా వదంతి...*
అని ఆర్యోక్తి. ఆ పరబ్రహ్మమే అన్ని రూపాల లోను నటిస్తూ వున్నాడు.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఒక్కడే పెక్కు రూపాల నొప్పువాడు
చక్కగా నన్ని నటనల సలుపువాడు
చిక్క డాత్మ స్వరూపుడై నక్కి యుండు
నొక్కఁ డొక్కఁడె మఱి యొక్కఁ డొక్కఁ డొకఁడె
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
రిప్లయితొలగించండి.. .. సమస్య
*"ఒక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు*
*నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే"*
సందర్భము: సులభం
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఒక్కడె దాటె నంబునిధి,
నొక్కడె లంకను జొచ్చె, వింతగా
నొక్కడె సీత జూచె, మరి
యుక్కడగించెను లంకలోన దా
నొక్కడె పెక్కు రక్కసుల,
నొక్కడె లంకను గాల్చి వచ్చెనే!
యెక్కడ జిక్కడేమి? పర
మేశ్వరు, డంజని పుత్రు... డడ్డు లే;
దొక్కఁడు నొక్కఁడే! మఱియు
నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే!
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
రిప్లయితొలగించండి.. ..సమస్య
*"ఒక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు*
*నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే"*
సందర్భము: సులభం
సరదా పూరణం
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
ఒక్కడు చాలుగా కడలి
"ను" ప్ఫని దూకడె తాఁ "జటుక్కునన్"
"టక్కున" లంకలో బడడె
"ఢా" మ్మని బాం బటు! సీతఁ జూడడే!
ఒక్కడె తా "గిరుక్కు" మని
యొప్పుగ చప్పున రాముఁ జేరడే!
ఒక్కఁడు నొక్కఁడే మఱియు
నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే
🖋~డా.వెలుదండ సత్యనారాయణ
పెక్కులు యాగముల్ సలిపి ప్రేమను పంచుచు భాగ్యనగ్రిలో
రిప్లయితొలగించండిముక్కుకు సూటిగా నడచి పూవులు త్రిప్పుచు నార నాసికన్
చుక్కల లోన చందురుడు సుందర రూపుడు గుండు ముక్కుడౌ
నొక్కఁడు నొక్కఁడే మఱియు నొక్కఁడు నొక్కఁడె యొక్కఁ డొక్కఁడే