13, ఏప్రిల్ 2018, శుక్రవారం

సమస్య - 2650 (రణముఁ జేయని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రణముఁ జేయని కవికె పరాభవమ్ము"
(లేదా...)
"రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్"

161 కామెంట్‌లు:

  1. పద్యముల నల్లగలనని పరిఢవిల్లి
    ధారణము ధారయును లేక తగుదుననుచు
    పృచ్ఛకుల ప్రశ్నలకు తగు స్వచ్ఛపు వివ
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము

    రిప్లయితొలగించండి

  2. పరిణితియిదియె కవిరాయ! పాండితినట
    సాన రాయిన గీచుచు చక్క గాను
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము!
    మేలు కొనుమయ పూరణ మెండు కొలుప !



    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి

  3. శంకరాభ 'రణం' లో కవిరాజుల రోజు వారి రణం :)


    పణముగ బెట్టి నాను తల! పాండితి నెల్లను నేను! మేలుగన్
    గణముల జూడ కున్న భళి గట్టిగ వేతురు మొట్టికాయలన్
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్!
    అణకువ తోడు వృత్తమును నాణ్యపు చంపక మాల జేతునే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పండిత గరువ మందున పరుగు లిడుచు
    పద్య మల్లుట తెలియని పామ రుండు
    నిండు సభలోన తడబడి మెండు గాను
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పండిత గరువము' దుష్టసమాసం.

      తొలగించండి
    2. హలము బట్టిన చేతిని కలము బట్టి
      పద్య మల్లుట కాదేది బ్రమ్మ విద్య
      నిండు సభలోన తడబడి మెండు గాను
      రణముఁ జేయని కవికె పరాభవమ్ము

      తొలగించండి
  5. (శ్రీనాథుడు డిండిమభట్టును విజయనగరం లో జయించటం)

    ఝణ ఝణ మోగు శబ్ధముల జాంగలికుండయి ప్రౌఢరాయనిన్
    మణిమయ పద్య భాషణల మంత్రపు ముగ్ధు ని జేసి, డిండిమున్
    కణ కణ లాడు వాదమున ఖండిత డిండిము జేయ సాహితీ
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కవిరాజు శ్రీనాథ మహాకవి డిండిముని ఓడించిన విషయాన్ని తెలుపుతున్న మీ పూరణ చాలా బాగుందండీ. అభినందనలు.
      ఇలాంటి సమస్యను పూరిస్తూ నేను మహాసహస్రావధాని శ్రీ గరికపాటి వారిని ప్రశంసిస్తూ వ్రాసిన పద్యం
      అణకువ తోడ జేయుచు సహస్ర వధానము నూతన ధారణా
      ఫణితి వెలింగె నా గరికపాటి నృసింహుడు కాకినాడలో,
      గణుతికి నెక్కె నీ జగతి , గాంచగ నాతని యేకధాటి ధా
      రణ మది యెల్లవారలను రంజిలజేసి ముదంబు గూర్చెడిన్.
      మహాకవి జంధ్యాల వారి గ్రంథాలను పూర్తిగా చదువదలచినానండీ. . వాటిని పొందే మార్గాన్ని మీరు తెలుపగలరా? కోట రాజశేఖర్ 9966236604

      తొలగించండి
  6. భళిర శంకరాభరణపు పద్యరచన
    కేళిన సమస్యనందలి కిటుకు మదికి
    తట్టగ ప్రాసకొఱకై పదముల తోడ
    రణముజేయని కవికెపరాభవమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కేళిని సమస్య యందలి...' అనండి.
      మూడవ పాదంలో గణదోషం. "తట్టగన్ ప్రాసకొఱకై..." అనండి.

      తొలగించండి

  7. తే.గీ
    పృచ్ఛకతతికి ధీటైన విధముగను జ
    వాబులిచ్చుటనందు సఫలత లేక
    సాహితీ సమరమునను చక్కగాను
    రణము జేయని కవికె పరాభవమ్ము!

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జవాబు లిచ్చుటయందు...' అనండి.

      తొలగించండి
  8. గణములు జూడ కుండగనె కబ్బము లల్లుట తేలి కౌనటన్
    వణకుచు వ్రాయ నెంచిమరి భావము పొంతన కూడ కున్నచో
    మణిమయ భూషణం బుగను మాలకు పద్దెము శోభ గూర్చునే
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  9. చిన్న సవరణము ( రణము తప్పలేదు) తో

    భళిగ శంకరాభరణపు పద్యరచన
    కేళిన సమస్యనందలి కిటుకు మదికి
    తట్టగ ప్రాసకొఱకై పదముల తోడ
    రణముజేయని కవికెపరాభవమ్ము

    రిప్లయితొలగించండి
  10. ఘన వధానము నందున గణగణమను
    గళము పద జృంభణము ధార కొఱతతోడ
    కనక ధారణ, పృచ్ఛక కవుల తోడ
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది శంకరయ్యఏప్రిల్ 13, 2018 7:28 AM
      అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పూరణలో యతి తప్పింది. సవరించండి. ప్రాసయతి అనుకున్నా ఱ-ళ లకు ప్రాసమైత్రి లేదు.
      'కనక'...? అది "కనగ" అనుకుంటాను.

      తొలగించండి
    2. ధన్యవాదములు. సవరణతో

      తే: ఘన వధానము నందున గణగణమను
      గళము పద జృంభణము ధారఁ గాంచక మరి
      కనక ధారణ, పృచ్ఛక కవుల తోడ
      రణముఁ జేయని కవికె పరాభవమ్ము

      తొలగించండి
  11. కవితలవి వెలువడగ నింగి చూపుల
    భావ జాలముగ రణము
    సంపుటిగ ముద్రణకు తానదె చేసెను
    అకటా గొప్ప ఋణము
    పీఠిక రాతలు ఆవిష్కరణలు
    ఆర్భాటముగ చెల్లెడిన్
    రణమొనరింపకున్న కవిరాజు
    పరాభవ మందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2650
    సమస్య :: *రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్.*
    యుద్ధం చేయకపోతే కవి పరాభవాన్ని పొందుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: కవి యైనవాడు పద్యపాదంగా ఉన్న సమస్యను స్వీకరించాలి. విద్య వలన సంక్రమించిన అణకువతో, అద్భుతమైన భావంతో, ప్రసాదము మాధుర్యము మొదలైన గుణములతో, చక్కనైన పద గుంభనతో, గొప్పవైన కావ్య లక్షణములతో, మనోహరమైన కవిత్వంతో, శుభమును చేకూర్చే హితోపదేశంతో విరాజిల్లునట్లుగా ఆ సమస్యను పూరించాలి. అలా చేయలేకపోతే ఆ కవి అవమానాల పాలవుతాడు అని విశదీకరించే సందర్భం.

    అణకువ తోడ, కైపదము నద్భుత భావము తోడ, హృద్యమౌ
    గుణముల తోడ, రమ్య పద గుంభన తోడ, విశుద్ధ కావ్య ల
    క్షణముల తోడ, దివ్యమగు కైతల తోడ, హితమ్ము తోడ, పూ
    *రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (13-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  13. జటిలపు సమస్య కెందును జంక కుండ
    ప్రతి భ జూపి oచి పూరణ న్ పండి తాళి
    మెచ్చు కరణి గ స ల్పు చు న్ మేలగు వివ
    రణము జేయని కవి కె పరా భ వ మ్ము

    రిప్లయితొలగించండి
  14. కవిత లల్లెడి రచయిత కవి యనబడు
    నడిగి నంత వేగ కవిత లల్ల వలయు
    పృచ్చకుల తోడ సాహిత్య విషయ ములను
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..నడుగ వేగముగ కవిత లల్లవలయు" అంటే బాగుంటుందేమో.

      తొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    మణులను బోలినట్టి మృదు మంజులభావరసప్రపూర్ణ పూ...
    రణముల పద్యతోరణము రంజిలజేసియు నంత్యమందు ధా...
    రణమొనరింపకున్న కవిరాజు పరాభవమందు నెల్లెడన్!!
    ప్రణుతుల పొంద ధారణము భాసురరీతిని నిల్పగావలెన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరుసవరణకు మన్నించండి..

      మణులను బోలినట్టి మృదు మంజులభావరసప్రపూర్ణ పూ...
      రణముల పద్యతోరణము రంజిలజేసి , వధానమందు ధా...
      రణమొనరింపకున్న కవిరాజు పరాభవమందు నెల్లెడన్!!
      ప్రణుతుల పొంద ధారణము భాసురరీతిని నిల్పగావలెన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. మిడిమిడిజ్ఞానము గలిగి వడివడి యవ
    ధానమున పాల్గొనగ కవు లడుగు ప్రశ్న
    లకు తగినజవాబులు నుడువక యట వివ
    రణము జేయని కవికె పరాభవమ్ము!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మిడిమిడి జ్ఞానము' అన్నపుడు జ్ఞాకు ముందున్న డి లఘువే. దానివల్ల గణదోషం. "మిడిమిడియగు జ్ఞానము గల్గి వడివడి..." ఆనండి.

      తొలగించండి
  17. గణములు సరి వేయగ గద్యపద్య మేగ
    గణ విభజన యతిప్రాస గద్య చూడ
    గణము తెలిసిన చాలుగ గద్యమే, చ
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము

    Dr H Varalakshmi
    Bangalore

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణలో కొంత గందరళగోళం ఉంది.
      మొదటి పాదంలో యతి తప్పింది. రెండవ పాదంలో 'గద్య' అని విభక్తిప్రత్యయం లేకుండా ప్రయోగించారు.

      తొలగించండి

  18. రమేశు గారి భావానికి కవిత్వం రాస్తే మాత్రం చాలదు వూరూరూ తిరిగి పుస్తకానికి పబ్లిసిటీ యిచ్చుకోవాలి :)


    వణికముగాను కావ్యమును వాసిగ బేర్చి జిలేబులన్, భళా
    రుణముల జేసి పబ్లిషరు రూఢిగ ముద్రణ జేయ బాసటై,
    యణకువ తోసహాయము సయాటల జేయుచు మార్కటింగుకున్
    రణమొనరింపకున్న కవిరాజుపరాభవ మందు నెల్లెడన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      రమేశ్ గారి భావానికి మీ పద్యరూపం బాగుంది.
      ఎంత పబ్లిసిటీ చేసుకున్నా లాభంలేదు. కవిత్వాన్ని కొని చదివేవాళ్ళు లేరు. కనబడ్డవాళ్ళకల్లా ఉచితంగా పంపిణీ చేసుకోవాల్సిందే. వాళ్ళలో 5% కూడా చదువుతారన్న నమ్మకం లేదు.

      తొలగించండి
    2. మా అందరి "కవిత్వాలను" ఓపికగా చదివి ఉచితముగా మెచ్చుకునే వారు మీరొక్కరే!

      🙏🙏🙏

      తొలగించండి

    3. కందివారు

      ఎవరు బాధ్యులండీ ?

      కవిత్వాన్ని యతి ప్రాస గణ గ్రామ్య, వ్యావహారిక మాండలిక అచ్చులు సంధులు సమాసాలు ఛందస్సు గట్రాలతో శృంఖలాబద్ధం గావించేసి నాయనా చదువురా చదువురా అంటే ఎవరు చదువుతారండీ !

      హాయిగా కొలవెరి కొలవెరి ఢీ అంటూనో లేక ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా అంటూనో రాయాలి గాని :)


      నారాయణ నారాయణ ! ఏమి పేలపోతోందో ఇవ్వాళ జిలేబి పైన :)


      యతియున్ ప్రాసలు మా తెలు
      గు తెగులుగా వచ్చె గుప్పు గుప్పుయనంగన్
      కతలన్ చేర్చిర యా సం
      గతులన సంస్కృతమునకు సగర్వము గానన్ !



      చీర్స్

      తొలగించండి
    4. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను. వచన, గేయ కవితా సంకలనాలను ఎందరు కొని చదువుతున్నారు. ఛందో వ్యాకరణాల శృంఖలాలతో ఉన్న పద్యాలే నేటికీ జనం నాలుకలపై నడయాతున్నవి. "తెలుగు పద్యమ్ము నిత్యమై తేజరిల్లు!".. జై తెలుగు తల్లీ!

      తొలగించండి
    5. నిజం సార్. ఛందోబద్ధం కాని కవనం కాలగమనంలో దూదిపింజల్లే ఎగిరిపోతుంది. మనం చదవలేక నారికేళపాకమనీ ఇంకా తెగించి పాషాణపాకమనీ పేర్లు పెట్టేశాం...

      తొలగించండి
  19. మనమున నిల్పి వాక్సతిని మాన్య వచస్సుల స్వీయ కీర్తి కా
    రణ మగు సద్గురూత్తముల ప్రార్థనముల్ పొనరించి కైతలన్
    ఘనముగ నింపి వాజ్మయ వికాసము మించెడు రీతి మంచి ప్రే
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  20. భాష యనెడు సంద్రమ్మున భావమనెడు
    సుధను చిలికింప నిత్యమ్ము శోధనమ్ము
    తానొనర్చుచు నూత్న పదాల గోరి
    రణము జేయని కవికె పరాభవమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      రణమును స్వార్థంలో ప్రయోగించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  21. తొణకక చెప్పగా వలయు దోసమొకింతయె లేక పద్యముల్
    యణకువ నాశ్రయించి కవి యందఱి మెప్పును బొందగా వలెన్
    వణకక పృఛ్ఛకుల్ తఱచు వాకొను నట్టి సమస్యలన్ని పూ
    "రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పద్యముల్ + అణకువ = పద్యము లణకువ' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  22. రిప్లయిలు
    1. సరదాగా
      క్షణక్షణము కైతల కాపురమ్ము
      పణము నార్జించు పద్ధతి పట్టదేమొ
      విపణి వీధిని ధరలెల్ల పెరిగెననుచు
      సణిగి సాధించు నిజపత్ని సంతుతోడ
      రణము జేయని కవికె పరాభవమ్ము

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "క్షణము క్షణమును కైతల కాపురమ్ము" అందామా?

      తొలగించండి
    3. ధన్యవాదములు గురువుగారూ! క్షణక్షణములో క్ష కారాన్నెందుకో గురువుగా పొరబడ్డాను!
      సవరిస్తాను!🙏🙏🙏

      తొలగించండి
    4. క్షణము క్షణమును
      కైతల కాపురమ్ము
      పణము నార్జించు పద్ధతి పట్టదేమొ
      విపణి వీధిని ధరలెల్ల పెరిగెననుచు
      సణిగి సాధించు నిజపత్ని సంతుతోడ
      రణము జేయని కవికె పరాభవమ్ము

      తొలగించండి
  23. సరస గతిని సమస్యను విరిచి, దత్త
    పదిని చక్కగా పూరించి, పనికి రాని
    యక్షరములను వర్జించి, నన్నిభాగ
    ములను ఘనముగ పూరించి, ముఖ్య మైన
    ధారణమ్ము చేసిన యవధాని జనత
    మన్ననలను పొందగలడు, మది ముద మిడు
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము
    కలుగు నిండోలగము నందు ఖచ్చితముగ

    కవి ఎంత గా రాణించినా చక్కని కంచు కంఠమ్ము తో (రణము) ధ్వని
    చేయలే నప్పుడు పరాభవము ఎదుర్కొనును

    రిప్లయితొలగించండి
  24. సరస వర్ణనలు సమాసములు లేక
    చప్పనైయొప్పు రచనలు సల్పువారు
    యతి,గణాదుల,ప్రాసల,నసలు సంస్మ
    రణముఁజేయని కవికె పరాభవమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "సరస వర్ణనములు సమాసములు లేక" అనండి.

      తొలగించండి
  25. మణులను బో లు పద్యము లు మాన్యులు మెచ్చువి ధానహృద్యమై
    గ ణ యతు లం దు చక్క న యి కందువ భావ ము లుప్ప తిల్లగ న్
    చెణుకులు రువ్వుచు న్ జనులు చిందె డు నవ్వులు గాంచి తాను ధా
    రణ మొన రింప కున్న కవి రాజు పరా భవ మందు నెల్ల డ న్

    రిప్లయితొలగించండి
  26. కవిననుచు నొంటరిగ వ్రాయు కవిత లేల
    సాహితీ మిత్రులం గూడి జరుపు నా ర
    చనలఁ చర్చించి శోధించు శంకరాభ
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము

    రిప్లయితొలగించండి
  27. డా.పిట్టా సత్యనారాయణ
    గణనమె లేని గద్యముల గాంచి కవిత్వమటంచు ఛందమే
    ఫణముగ బెట్టి వ్రాయుచు షభాసనిపించుకొనంగ నా యతుల్
    గణముల గాలికిన్ వదలు గద్దరి చేష్టలు జేయు వారిపై
    రణమొనరింపకున్న కవి రాజు పరాభవమందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  28. పద్య మయ్యది వ్రాసియు భావమువివ
    రణముజేయనికవికె పరాభవమ్ము
    ప్రాస,యతులును,గణములు భావములవి
    సరిగ యుండుచో మెత్తురు సత్కవులిల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సరిగ నుండుచో' అనండి.

      తొలగించండి
  29. డా.పిట్టా సత్యనారాయణ
    యతులు గణములు బ్రాసల గతులనెంచి
    స్పష్ట దుష్ట సమాసాల పరిగణనము
    అన్వయము.శబ్దముల కూర్పు కనవరతము
    రణము జేయని కవికె పరాభవమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కూర్పునకు' అనడం సాధువు. "కూర్చి యనవరతము" అందామా?

      తొలగించండి
  30. తేటగీతి
    గెలిచి యింట మొదట రచ్చ గెలువ పిదప 
    గౌరవమ్ములు బహుబాగు తీరు నింట! 
    గృహ సమస్యల పూరించ దృష్టిని ప్రస
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము!!

    రిప్లయితొలగించండి
  31. పరుషపు సమస్యనిచ్చిన పాటుపడక
    రసభరితములైన సుమధురపదములను
    శంకలేక పూరించక శంకరాభ
    రణముజేయనికవికెపరాభవమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకాంత్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కృతజ్ఞతలండీ... "పటువగు సమస్యనిచ్చిన" అంటే ఇంకా బావుండేదని తరువాత తోచిందండి.

      తొలగించండి
  32. జన మది దోచు పద్యమది శ్రావ్యత తోడను సాగుభంగి తా
    ఘనముగ జెప్పబూను కవి కాలపు రీతిని విస్మరింపకన్
    వినయము వీడకుండ కడు విజ్ఞత తో నవినీతిపై సదా
    రణమొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జనుల మది' అనడం సాధువు. 'జన మది' అనరాదు. అక్కడ "జను లలరార పద్యమది..." అందామా? 'విస్మరింపక' కళ. కనుక "విస్మరింపకే" అనండి.

      తొలగించండి
  33. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    రణ సమమౌ వధానకళ | రమ్యపదమ్ముల (న్) సాహితీ సతీ

    ప్రణవము జేసి , పృఛ్ఛకుల ప్రశ్నల కెల్ల మనోఙ్ఞ పద్య పూ

    రణ సహి తోత్తర మ్మిడుచు , బ్రాఙ్ఞులు రంజిలు రీతి నంత్య ధా

    రణమున నుగ్గడించవలె || ••••• త్రాగెడు పానక మందు పుల్లయై

    వ్రణము నొనర్చు భావనకు , బాపురె ! యయ్యధిక ప్రసంగితో

    రణ మొనరింప కున్న > గవిరాజు పరాభవ మందు నెల్లెడన్ ! !

    రిప్లయితొలగించండి
  34. వసుధ నవధాన మందునఁ గొసరి కొసరి
    స్వచ్ఛపుఁ గవి భావ మెఱుంగఁ బృచ్ఛకుండు
    ముద్దుగ నడుగ నింపుగఁ బూరణ వివ
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము


    వ్రణములు కల్గు నంచును బరాభవ మెంచక భీత చిత్తుఁడై
    రణమునఁ బాఱు వీరు వలె రాజిత పండిత సజ్జనాది స
    ద్గణ పరివేష్టితంపు టవధాన సభాస్థలి యందు మేటి ధా
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  35. మిత్రులందఱకు నమస్సులు!

    గుణఖని! శంకరార్య, విను! కోర్కెల నెల్లనుఁ దీర్చి, నిత్యస
    ద్గుణగణమాన్యుఁడై, ప్రజకుఁ గూరిమిఁ బంచుచుఁ, బాలకాగ్రధీ
    మణియయి, న్యాయమిచ్చి, మతిమంతుఁడునై, పరిగొన్న వైరితో
    రణ మొనరింపకున్నఁ, గవి! రాజు పరాభవ మందు నెల్లెడన్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు... సుకవి మిత్రులు మిస్సన్న గారూ!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      కవిని సంబోధించి రాజును గురించిన చేసిన మీ పూరణ నిజంగా అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. అద్భుతమైన విరుపు మధుసూదన్ గారూ!
      👌🏻👏🏻🙏🏻💐

      తొలగించండి
  36. కణకణమందుసత్కవితగాంచగ పద్య చమత్కృ తాదులన్
    గణగణగంటమ్రోగినటుగాత్రమునుండియు జారపద్యముల్
    ప్రణతులనందినన్ తన ప్రభాసిత మైన మహాయు ధంబు పూ (ధా)
    రణమొనరించకున్నకవిరాజు పరాభవమందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చమత్కృతి + ఆదులన్ = చమత్కృత్యాదులన్' అవుతుంది. అక్కడ "పద్యచమత్క్రియాదులన్" ఆనండి.

      తొలగించండి
  37. గణయతు లట్లు ప్రాసముల కట్టడి మీరక, వ్యంగ్యభావవి
    స్ఫురణముఁ గొల్పురీతి,నుడిసోయగముల్విలసిల్లుభంగి,ధా
    రణతడవొందనీక,యవధానసమస్యల నెల్ల రమ్యపూ
    రణమొనరింపకున్న కవిరాజు పరాభవమొందునెల్లెడన్.

    రిప్లయితొలగించండి
  38. . మంచియవధాని యనియెంచి కంచియందు
    జేయునప్పుడు పృచ్చకుల్ మాయచేత
    కంగుదిన్నట్టి పూరణల్ పొంగిరాని
    రణముజేయని కవికె పరాభవమ్ము|
    2.గుణమును బెంపు జేయగల గుప్త ధనమ్మెకవిత్వమన్న|ప్రే
    రణమొనరింప కున్న?కవిరాజు పరాభవమందు నెల్లెడన్|
    “నణకువ,మంచిమానవత,నాదరణంబగునీతి నిష్టలున్
    మణిమయ భూషణా లగును|మంగళ దాయక మౌనుశక్తిచే”|



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఎల్లెడన్ + అణకువ = ఎల్లెడ నణకువ' అవుతుంది. అక్కడ ".నెల్లచో। నణకువ..." ఆనండి.

      తొలగించండి
  39. గణ యతి ప్రాస దోషముల కాటుల నొల్లక రచ్చ జేయుచున్
    రణగొణ నాదమీనగ ధరాధరు లెల్లరు మెచ్చుచుండగన్
    తృణములు సేకరించి కడుతీరుగ చెన్నుగ గూడు కట్టుచున్
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్

    కవి = నీటికాకి (జలపక్షి)
    ధరాధరులు = తాబేళ్ళు
    (ఆంధ్ర భారతి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రిగారూ ! " యతి ప్రాస " అను సమయమున ' తి ' గురువగును కదా ! కాస్త గమనించ గలరు.

      ...మద్దూరి రామమూర్తి

      తొలగించండి
    2. సార్! ఈ విషయముపై అనేక తర్జన భర్జనులు శంకరాభరణములో జరిగినవి. రేఫయుక్త "ప" ను రెండు విధములుగా పరిగణింప వచ్చుననీ, ఉచ్చారణలో ఊనికను బట్టి యుండుననీ. నాకు తెసినంత వరకూ ఇదీ సంగతి...నేను పండితుడను కాను.

      🙏🙏🙏

      ...ప్రభాకర శాస్త్రి

      తొలగించండి
    3. ఆర్యా ! మీరు యతి ప్రాస అని సమాసము చేసితిరి. యతియు ప్రాసయు అని ఉన్న ' యు ' గురువు కాదు. ఇంత మంచి పద్యము వ్రాసిన మీరు ఆ చిన్న దోషమును సవరించ గలరని తెలిపితిని. మీరన్నట్లుగ చాలా మంది పండితులు దీనిని అంగీకరించిరి. కాని నాకిది శాస్త్ర సమ్మతము కాదేమో అన్నదే అనుమానము. అన్యధా భావించకుడు. వీలున్న సవరించుడు. నమస్సులతో

      మద్దూరి రామమూర్తి.

      తొలగించండి
    4. గణములు ,ప్రాసలున్ , యతుల కాటుల అన్న బాగుండునా ?

      ...మద్దూరి రామమూర్తి

      తొలగించండి
    5. బ్రహ్మాండముగా నుండును. కడుంగడు ధన్యవాదములు సార్!!!

      👌👌👌🙏🙏🙏👏👏👏

      ...ప్రభాకర శాస్త్రి

      తొలగించండి
    6. ధరణిప్రజ ధర్మ సుతుసు
      స్థిర నిర్మల ధర్మ చరితఁ జేసి రుజా త
      స్కర పరరాష్ట్ర విబాధలఁ
      బొరయిక సంతత సమృద్ధిఁ బొందె విభూతిన్ భార. ఆది. 8-83


      నన్నయ భట్టారకుఁడు ధరణిప్రజ లో “ణి” ని లఘువు గా గ్రహించుట గమనార్హము.
      రేఫ తోటి ప, బ, క సంయుక్తాక్షరముల వెనుక నున్న, “హ” తో ప్రారంభమగు సంయుక్తాక్షరము ( ఈ నాలుగు సందర్భములలో మాత్రమే) వెనుక నున్న హ్రస్వ వ్యంజనమును లఘువు గా గాని గురువు గా గాని యవసరార్థము గ్రహించు నవకాశము కలదు.

      తొలగించండి
    7. ఒకానొక గాడిదకు ఒకరోజు నిద్ర లేవగానే ఎడమ వైపున ఒక గ్రాసపు కుప్ప, కుడి వైపున సమానమైన మరొక గ్రాసపు కుప్ప, కనిపించాయట. ఇటు తిరిగితే ఈ కుప్ప, అటు తిరిగితే ఆ కుప్ప, సమానముగా పెరుగుతుండినవట. ఏ కుప్పను ముందుగా తినవలెనో నిర్ణయించుకొన లేక ఆ గాడిద ఆకలితో మరణించినదట.

      "ప్ర"స్తుత విషయములో నా పని ఆ గాడిద వలెనున్నది.

      "ప్ర"ణతులతో

      "ప్ర"భాకర శాస్త్రి

      తొలగించండి

    8. ప్రణతులిడినారు శాస్త్రులు
      గణముల లెక్కసరి తేల కన్ బోవ భళీ
      హణిగెల జేసి జిలేబియు
      వణికము గా కందమొకటి వడికె భళిభళీ !

      ಜ಼ಿಲೇಬಿ

      తొలగించండి
    9. హణిగెలు = దండములు
      వణికము = మనోహరము

      🙏🙏🙏

      తొలగించండి
    10. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      సమాసంలో ఉత్తరపదాద్యక్షరం రేఫ సంయుక్తమైనపుడు పూర్వపదాంత్యాక్షరం అనుకూలతను బట్టి లఘువుగానో, గురువుగానో స్వీకరించే సంప్రదాయం కొనసాగుతున్నది. అందుకు ప్రాచీన కావ్యాలలో పెక్కు ఉదాహరణాలున్నవి. గతంలో దీనిని గురించి మన బ్లాగులో ప్రత్యేక పాఠమే ఇచ్చాను.
      ఈ విషయంలో నేను నా పద్యాలలో కచ్చితంగా గురువుగానే ప్రయోగిస్తాను. కాని ఎవరు లఘువుగా ప్రయోగించినా అభ్యంతరం చెప్పను.
      *****
      జిలేబీ గారూ,
      మీ పద్యంలో 'తేలక' కళ. "తేలకన్" అనరాదు.

      తొలగించండి

    11. అది కన్బోవ అండి :)

      గణమల లెక్క తేల కన్బోవ :)


      జిలేబి

      తొలగించండి
  40. సవరణతో :
    తొణకక చెప్పగా వలయు దోసమొకింతయె లేక కైతలే
    యణకువ నాశ్రయించి కవి యందఱి మెప్పును బొందగా వలెన్
    వణకక పృఛ్ఛకుల్ తఱచు వాకొను నట్టి సమస్యలన్ని పూ
    "రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్"

    రిప్లయితొలగించండి
  41. చం. మణిమయహారపద్యసుమమాలలనెన్నియెయేర్చి ప్రోగినన్
    గుణమును గ్రోలుపండితులుగూడి శభాషను మెప్పెమేప్పుధీ
    మణులసమూహమందునసమస్యలనివ్వసమున్నతంబుపూ
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిరాట్ల వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రోగినన్' అన్న క్రియాపదం లేదు. 'ప్రోగు' విశేష్యము. 'ప్రోగుపడు, ప్రోగుచేయు' అన్నవి క్రియాపదాలు.

      తొలగించండి
  42. డా.పిట్టా సత్యనారాయణ
    గణనమె లేని గద్యముల గాంచి కవిత్వమటంచు ఛందమే
    ఫణముగ బెట్టి వ్రాయుచు షభాసనిపించుకొనంగ నా యతుల్
    గణముల గాలికిన్ వదలు గద్దరి చేష్టలు జేయు వారిపై
    రణమొనరింపకున్న కవి రాజు పరాభవమందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి
  43. చంపకమాల
    గణయతి ప్రాస ౘందములు గ్రక్కున గూడగ వాణి దీవెనన్
    గుణ, రస పాటవమ్మునను గూర్చుచు దత్తపదాది పూరణల్
    ప్రణుతులఁ బొందు నాశువుల వర్ణన లెన్నొ వధానమందు ధా
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'ఛందములు' టైపాటు.

      తొలగించండి
    2. మీరు 'విధములు' అనే అర్థంలో 'ౘందము' పదాన్ని వాడినట్లైతే అక్కడ దుష్టసమాసం అవుతుంది.

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు.

      ౘందముpermalink
      ౘందము : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report an error about this Word-Meaning గ్రంథసంకేతాది వివేచన పట్టిక
      వై. వి.
      1. ఛందస్సు;
      2. విధము* .
      "సీ. పదబంధ శిథిలత పాటిల్లఁగానీక యేచందములయందు నేమఱిలక." కళా. ౧, ఆ.

      ఛందములనే అర్థము కలదని వ్రాశాను. పరిశీలించి స్పందించ మనవి.

      తొలగించండి
    4. ఛందములకు వికృతిగా చందములు వాడినను ప్రాస చందములు దుష్ట సమాసము. ఛందము పదము వాడిన ప్రాస చ్ఛందము లగును.

      తొలగించండి
    5. గురుసమానులు శ్రీ పోచిరాజు వారికి ప్రణామములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

      చంపకమాల
      గణయతి ప్రాస బంధములు గ్రక్కున గూడగ వాణి దీవెనన్
      గుణ, రస పాటవమ్మునను గూర్చుచు దత్తపదాది పూరణల్
      ప్రణుతులఁ బొందు నాశువుల వర్ణన లెన్నొ వధానమందు ధా
      రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్!

      తొలగించండి
    6. సహదేవుడు గారు సవరణ తో మీ పూరణ మద్భుతముగ నున్నది. అన్యుల భావములను గౌరవించు సుహృదయము మీది. ధన్యవాదములు.

      తొలగించండి

  44. అనయము పెక్కు గ్రంథముల నధ్యయనమ్మును నొజ్జ యిచ్చు ప్రే
    రణమున జేయుచున్ భువి నిరంతర సాధనతోడ స్వీయ ధా రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్ మనునను నిత్యమున్ ప్రజల మానసమందున ధార ముఖ్యమౌ

    రిప్లయితొలగించండి
  45. ప్రణయము చేయనొప్పును,విరాజతరంగ విలాసవల్లియౌ
    గణికల కేళియున్,కొలుచు గారపుభూపతి యానతిచ్చుచో
    ఘనతలుయొప్ప జాణయగు కావ్యము శారదకంబువందు తో
    రణమొనరింపకున్న కవిరాజు పరాభవమందునెల్లెడన్

    --- శ్రీకాంత్ గడ్డిపాటి.
    (మొదటి చంపకమాల అండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకాంత్ గారూ,
      మొదటి చంపకమాల అయినా చక్కగా ఉంది. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఘనతలు + ఒప్ప = ఘనత లొప్ప' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "ఘనత సెలంగ" అనవచ్చు. 'శారదకంబువందు' అర్థం కాలేదు.

      తొలగించండి
    2. కృతజ్ఞతలండీ.. (శారదా దేవి మెడలో అనుకున్నానండి.. కంబు అందు)

      తొలగించండి
  46. +9948634619 వీరబ్రహ్మేంద్రాచార్య

    గణములు, ప్రాసలున్, యతు, లఖండసమాసపదార్థ శస్త్రముల్,

    ప్రణతులు జేయగాఁ గదలి, భావపరంపర మోహనాస్త్రమై,

    క్షణము విరామమీయక, విచక్షణఁ గల్గిన ధారతో, మహా

    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవమందు నెల్లెడన్.

    ముంజంపల్లి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. अदुरहो ! बहुत् खूब् सूरत है

      जिलॅबी

      తొలగించండి
    2. వీరబ్రహ్మేంద్రాచార్య గారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదాలు మిత్రమా!

      ...వీరబ్రహ్మేంద్రాచార్య

      తొలగించండి
    4. ఆర్యా ! పద్యం చాలా బాగుంది.
      ప్రతిమాట మణుల‌ పేటిక
      ప్రతి భావము నిధులమూట. రమ్య తరమ్మై
      ప్రతిభావంతులు మెచ్చగ
      పితికితిరమృతమ్ము చెవుల విజ్ఞాన నిధీ !

      మద్దూరి రామమూర్తి.

      తొలగించండి
    5. ఆహా అద్భుత పూరణ
      పద్యం నడక శుమ్భత్
      వేగ గోదావరీ

      ...బాబూ దేవిదాస్

      తొలగించండి
  47. ఘనుడగు పండితుండనుచు , కష్టమొసంగు సమస్య యేది చే
    కొనక దయామయుండు ధనికొండ యొసంగగ తేటగీతి యిం
    కను పరిపూర్తి చేయక మొగమ్ముల జూచునదేమి యిట్టి పూ
    "రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్"

    రిప్లయితొలగించండి
  48. గుణమ దవశ్యమెంచగను
    కూరిమిగావగ పీడితాత్ములన్
    గుణగణ శోభితమ్మగుచు కూడగ కైతలు మేలుకొల్పులై
    ప్రణతుల నొందగా దగిన రాతల జాతికి దోషముల్ నివా
    రణ మొనరించకున్న కవిరాజు పరాజయ మొందు నెల్లెడల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదంలో రాతలను వ్రాతలుగా చదువ ప్రార్ధన!🙏🙏🙏

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      'అది + అవశ్యము' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "గుణ మది తప్ప దెంచగను..." అందామా?

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! తప్పక సవరిస్తాను! 🙏🙏🙏🙏

      తొలగించండి
    4. గుణమది యెంచనుత్తమము
      కూరిమిగావగ పీడితాత్ములన్
      గుణగణ శోభితమ్మగుచు కూడగ కైతలు మేలుకొల్పులై
      ప్రణతుల నొందగా దగిన వ్రాతల జాతికి దోషముల్ నివా
      రణ మొనరించకున్న కవిరాజు పరాజయ మొందు నెల్లెడల్!

      తొలగించండి



  49. 1.ఘనమగువ ధానమందున గడగడమని

    యొప్ప జెప్పక యున్నను నుత్సుకతను

    చూపి సభికుల కెల్లను చొక్కపు వివ

    రణముఁ జేయని కవికె పరాభవమ్ము.


    చొక్క:మనోహరమైన.


    2.ప్రాసలు గణములెంచక పద్యములను

    దెల్పుచు పొరపాటునెరింగి తెలివి తోడ

    నక్కరములను మార్చుచు చక్కగ సవ

    రణముఁ జేయని కవికె పరాభవమ్ము.


    3.పృచ్ఛకులట నడుగు పలు విధములైన

    నంశముల నలవోకగ నప్ప చెప్పు

    చును సభికులు మెచ్చు నటుల సుందర సవ

    రణముఁ జేయని కవికె పరాభవమ్ము.


    4.పద్యవిద్యలో పట్టున్న వానికైన
    చక్కని యవధానము లందు మక్కువూని
     పద్యములలవోకగసభన్ పాడుచు వివ
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      చివరి పూరణలో "మక్కువ గొని" అనండి.

      తొలగించండి

  50. రణమును వాడరే గనగ రాయుధమే, సభలో కలంబునే
    గణముల చూడరే కవులు, గద్యము చెప్పగ, పాదకూర్పిడిన్
    తృణముగ చూడరే కవులు, తృప్తిని నూహలఁ తీరు, పాద, పూ
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్

    Dr H Varalakshmi
    Bangalore

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాయుధమే'...? 'పాదకూర్పిడి' దుష్టసమాసం.

      తొలగించండి
  51. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సంఘ వర్థనమ్ము కొఱకు సంతతమ్ము
    నీతి గూడిన కవనమ్ము నివ్వ దలచి
    కల్పన లొనరించినను సక్రమమగు వివ
    రణము చేయని కవికె పరాభవమ్ము

    రిప్లయితొలగించండి
  52. రసమయ, కమనీయవధాన రణము నందు
    పద్య ధారణ కవులకున్ పంచ చామ
    రకవిత ప్రశంసనిచ్చున్ పర కవి వివ
    రణము జేయని కవికి పరాభవమ్మె.
    గురువు గారికి నమస్సులు.పూర్వ కవులను ప్రస్తావించకుండా కవితలు చెప్పువారికి పరాభవమగునని నా భావన.

    రిప్లయితొలగించండి
  53. సరళమృద్వీకఫలరససంగతార్థ
    మృదులపదలసితసృజనమేదురంబు
    వాచ్యవిషయమ్ము సముచితవ్యంజకస్ఫు
    రణము జేయని కవికెపరాభవమ్ము

    రిప్లయితొలగించండి
  54. 13-4-18 సమస్య
    *"రణముఁ జేయని కవికె పరాభవమ్ము"*

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ఆ దెసకు నొకసారి తా నీ దెసకును
    మరియు నొకసారి పరికించి మాట దొరల
    కది యెదో చెప్పి యవధాని యయ్యును సవ
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము

    మరొక పూరణము...

    సందర్భము: బయటి వ్యక్తులనో పరిసరాలనో చూస్తేనే స్ఫూర్తి కలుగుతుం దనుకోవడం భ్రమ.
    యా దేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థితా.. మొదలైన వెన్నో వున్నాయి. ఆధారపడవలసింది ఆ పరమేశ్వరి మీదనే!...
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పరగ నే దేవి స్ఫూర్తి రూపంబుతోడ
    సకలభూతాలయందున సంస్థితయగు
    నట్టి దేవిని స్మరియింప కడిగిన వివ
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  55. 3 వ పూరణము..

    సందర్భము: ఒకడు కవి యౌతున్నా డంటేనే సరస్వతీ కరుణా కటాక్షం వుండడంవల్లనే! కవి యొక్క జీవితం పేరుకోసం ధనంకోసం బలి కారాదు.
    కేవలం జీవించడమే కాదు.. జీవితం సార్థకం చేసుకోవా లని తపించాలి. భవ తరణం కోసం సాధన సలుపాలి. లేకుంటే కవి యవమానాలను భరించవలసి వస్తుంది.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    నాలుకను శారదామాత నాట్య మాడ
    కవి యగును; పేరు, ధనములకా! బ్రదుకున
    సార్థకతకయి సాధన సలిపి, భవ త
    రణముఁ జేయని కవికె పరాభవమ్ము

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  56. అణకువ తోడ తగ్గకయె హైరన నొందక జుట్టుపట్టులన్
    ప్రణతుల నిచ్చి నొంగకయె వంకరటింకర మాటలొల్లకే
    తొణకక భీతి జెందకను తత్తర లేకయె నత్తగారితో
    రణ మొనరింపకున్న కవిరాజు పరాభవ మందు నెల్లెడన్

    రిప్లయితొలగించండి