22, ఏప్రిల్ 2018, ఆదివారం

నక్షత్ర బంధ తేటగీతి చిత్రమాలిక

శివ స్తుతి
సర్గుడు! సనాతనుడు! శార్ఙ్గి! శశివకాళి!
శబరుడు! మదనారి! నియంత! జనుడు! భీష
ణుడు! విషధరుడు! వసుధారథుడు! అరింద
ముడు! పురాoతకుoడు! నగచాపుడు! ఉదర్చి!
భూతపతి! సంయుతుడు! శశి భూషణుడు! ని
రంజనుడు! చేతనుడు! కోడె రౌతు! స్థాణు
వు! నభవుడు! మేరుధాముడు! మనము కొలువ
సతతము శరణు నిడునుగ సరస గతిని.
రచన
బంధకవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి