6, ఏప్రిల్ 2018, శుక్రవారం

సమస్య - 2643 (ద్రౌపది వలువ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి"
(లేదా...)
"ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ గిరీటి నిర్దయన్"

110 కామెంట్‌లు:

 1. జూద మందు నోడెసతిని , జుట్టు బట్టి
  తెమ్మని బలికె రారాజు, తమ్ముడు వెను
  వెంటనే సభ లోనకు విర్ర వీగు
  చుగొని దెచ్చి జనమెల్ల జూచు చుండ
  ద్రౌపది వలువ లూడ్చె, దత్సభఁ గిరీటి
  ఘనులగు ననుజల యెదుట కనుచునుండె
  మారు మాటల నాడక మౌన గతిని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూసపాటి వారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జూదమందు నోడె సతిని'... ఎవరు అన్నది పేర్కొనలేదు.

   తొలగించండి
  2. "...దెచ్చియు జనులెల్ల..." అంటే గణదోషం తొలగిపోతుంది.

   తొలగించండి

 2. గీ:పతుల సభ వీరగీతము ! సీ యన
  ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి,
  యాపతులు తలదించి యావద్బలము
  చాపచదరగు కైపు చక్కగ కోల్పోవ !

  (అంతరాక్కర)
  జిలేబి

  రిప్లయితొలగించండి


 3. ద్రౌప ది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి
  వాయు నందను తలదింప వరుస గాను
  భర్త లెల్లరు మౌనము! భారతమిది
  పడతి కన్నీటి కథయిద్ది పంకజాక్షి !

  తేట గీతి
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'గీఃపతులు'...?
   రెండవ పూరణలో 'వాయుపుత్రుడు' అంటే అన్వయం బాగుంటుందని నా భావన.

   తొలగించండి
 4. (గురువు ప్రశ్న - శిష్యుని సమాధానం)
  "చెనటి దుస్ససేనుం డేమి చేసెచెపుమ?
  మత్స్యయంత్రము గొట్టిన మహితు డెవడు?"
  "వదిన యను భావమది మది వదలివైచి
  ద్రౌపది వలువలూడ్చే దత్సభ ; గిరీటి."

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 5. తేటగీతి
  దుష్టుఁ డా దుస్ససేనుండు తుచ్ఛుఁ డగుచు
  ద్రౌపది వలువ లూడ్చెఁ, దత్సభఁ గిరీటి
  తో సహ యనుజు లన్న లాదు కొనకున్నఁ
  గృష్ణ పరమాత్మయేఁ గాచె కృష్ణనపుడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం నడక కొంత తడబడుతున్నది.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

   తేటగీతి
   దుష్టుఁ డా దుస్ససేనుండు తుచ్ఛుఁ డగుచు
   ద్రౌపది వలువ లూడ్చెఁ, దత్సభఁ గిరీటి
   తోడ నట నన్నలనుజు లాదు కొనకున్నఁ
   గృష్ణ పరమాత్మయేఁ గాచె కృష్ణనపుడు.

   తొలగించండి
 6. కన్ను గానని మదమేమొ మిన్ను ముట్టె
  దుష్ట బుద్ధిని సభలోన దుశ్శా సనుడు
  ద్రౌపది వలువ లూడ్చెఁ , దత్సభఁ గిరీటి
  సిగ్గు జెందిన భ్రాతలు శిరము లొంచె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదాన్ని "దుస్ససేనుడు సభలోన దుష్టుడగుచు" అనండి. గణదోషం తొలగిపోతుంది.

   తొలగించండి
  2. కన్ను గానని మదమేమొ మిన్ను ముట్టె
   దుస్స సేనుడు సభలోన దుష్టు డగుచు
   ద్రౌపది వలువ లూడ్చెఁ , దత్సభఁ గిరీటి
   సిగ్గు జెందిన భ్రాతలు శిరము లొంచె

   తొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  "ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ గిరీటి నిర్దయన్"*

  చేపను గొట్టలేరనెడి చింత , వరుండెవడన్న భీతియున్ ,
  చాపము బట్టి కొట్టెనట సాహసి క్రీడి యనంగ సిగ్గుతో
  తాపమునొందు కాంతఁ గని తాను *మనమ్మును గప్పునిట్టివౌ*
  *ద్రౌపది వల్వ లూడ్చె* నదె తత్సభలోనఁ *గిరీటి* నిర్దయన్"!!

  ( చింత.. భీతి.. వీటిని నిర్దయగా తొలగించాల్సిందే కదా !)

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతమైన అన్వయంతో ఉత్తమంగా ఉన్నది. వారికి అభినందనలు.

   తొలగించండి
  2. అద్భుతమైన పూరణ మైలవరపువారూ! అసాధారణంగా ఆలోచించడం అవధానులకే చెల్లు! నమోనమః!🙏🙏🙏

   తొలగించండి
  3. ధన్యవాదాలండీ శ్రీమతి సీతాదేవి గారూ.. నమోనమః 🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
 8. పంచ పతుల ద్రుపద పుత్రి మక్కువ మిక్కిలి
  పార్థుని యందు
  వంచనచె కొలువుకీడ్చబడి నిలబడె సిగ్గుగ
  సభికుల ముందు
  దుష్ట దుశ్శాసనుడు ద్రౌపది వల్వలూడ్చెనదె
  తత్సభలోన
  గిరీటి నిర్దయన్ చూడ నొప్పునె నాతికి
  ప్రీతి పాత్రుడన

  రిప్లయితొలగించండి


 9. ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ గిరీటి, నిర్దయ
  న్నాపతు లెల్ల వీరులు వినాశకుడిన్ ఖలు దుస్స సేనుడి
  న్నాపక జూడ నచ్చట! సనాతన ధర్మము గావ పోత్రమై
  శ్రీపతి కృష్ణుడయ్యెను సుశీలము చేర్చగ భారతావనిన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయదోషం కన్పట్టుతున్నది.

   తొలగించండి

 10. తే.గీ.

  జూదమున నోడె ధర్మరాజు తన సతిని 
  పణముగా పెట్టి;యా సుయోధ ననుజుండు
  ద్రౌపది వలువ లూడ్చె దత్సభ గిరీటి,
  భీము,ద్రోణు,భీష్మాదులు వీక్షజేయ!
  కృష్ణ పరమాత్మ రక్షించె కృష్ణ వేడ!
  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘ వనపర్తి☘

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుయోధను ననుజుడు' అనడం సాధువు. 'భీమ ద్రోణ భీష్మాదులు...' అనండి.

   తొలగించండి
 11. దుష్ట దుశ్శాసనుండు తా తుచ్ఛ మదిని
  ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ, గిరీటి
  పాశుపతమును సాధించి, భండనమున
  కౌరవానీకమును చంపె కర్కశముగ

  రిప్లయితొలగించండి
 12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2643
  సమస్య :: *ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ గిరీటి నిర్దయన్.*
  సభలో (కిరీటి) అర్జునుడు ద్రౌపది వలువల నూడ్చినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: శ్రీపతి అనే పేరు గల వ్యక్తి తన నటనాకౌశలంతో కీర్తి గడించి ప్రేక్షకులందఱూ భళీ అని మెచ్చుకొంటూ ఉండగా *నటకిరీటి* అనే బిరుదాన్ని పొందినాడు. అతడు ఒక నాటకంలో దుశ్శాసనుని పాత్ర ధరించి సభలో ద్రౌపది వలువ నూడ్చినాడు. ఆ సన్నివేశాన్ని చూచిన వారు *కిరీటి ద్రౌపది వలువల నూడ్చినాడు* అని పలికే సందర్భం.

  చూపఱు లందఱున్ నటన జూచి భళీ యని మెచ్చుచుండగా,
  శ్రీపతి వెల్గెగా, నటకిరీటిగ ; నాతడె నేడు జూడగా
  పాపిగ దుష్టశాసనుని పాత్ర ధరింపగ , పల్కి రిట్టులన్
  *ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ గిరీటి నిర్దయన్*
  *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (6-4-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   నటకిరీటిని ఆశ్రయించి చేసిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 13. వావి వరసలు మరచిన పాతకుండు
  దుష్ట దుశ్శాసనుండు సంతుష్టితోడ
  ద్రౌపది వలువ లూడ్చెఁ, దత్సభఁ గిరీటి
  అన్నమాటకు లోబడి మిన్నకుండె!!!

  రిప్లయితొలగించండి
 14. ధూర్త దుశ్శాసనుడుదాను దోషబుద్ధి
  ద్రౌపది వలువలూడ్చె దత్సభ కిరీటి
  ధర్మరాజాదుల యెదుట దాష్టికముగ
  భీమసేనుడు కినుకను భీకరముగ
  నాన బూనెను జంపెద నాతననుచు
  చెవుల బడనంత వరకట్టి చావువార్త
  కురుల ముడివేయనని బల్కె కోమలాంగి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "..జంపెద నాతని నని" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏🙏

   తొలగించండి
 15. దుస్ససేనుండు చెలరేగి దుష్కృతమున
  ద్రౌపదివలువలూడ్చె దత్సభఁ గిరీటి
  భీమ ధర్మరాజాదులా వీరపతులు
  ఖిన్న వదనులై వారంత మిన్నకుండ్రి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ఆ వీరపతులు.. అని.. మళ్ళీ వారంత అనడం కొంత అన్వయదోషం.

   తొలగించండి
 16. దుస్స సేనుడు జూడగ ధూర్తు డగుచు
  ద్రౌపది వలువ లూడ్చెఁ ; దత్సభఁ గిరీటి
  పగను రగులుచు మనమున బ్రతిన బూనె
  నాల మందున కురుసేన నణచెదనని.

  రిప్లయితొలగించండి
 17. సమస్య : - "ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి"

  తే.గీ*

  పాండవులు చూచుచుండగా భారతమున
  దుస్ససేనుని దుర్మార్గ దుష్ట చర్య
  ద్రౌపది వలువలూడ్చె;తత్సభగిరీటి
  అన్న నాజ్ఞతో కోపము నణచు కొనెను
  ..............✍చక్రి

  రిప్లయితొలగించండి
 18. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,

  .............................................................................................


  అన్నయగు ధర్మజుని కన్నను , సహోదరులు బహు శౌర్యవంతులు .

  ఐనను అన్న కనుసన్నల‌‌ లోనే తమ్ములు ‌నడచిరి . ‌

  అన్నమాట ఏనాడు జవదాట లేదు గదా . ఆహా !

  తమ్ము లనగా అలా ఉండాల‌ని భారత గాథ మనకు బోధిస్తూ ఉంది

  ....................................................................................................


  పాపమనస్కుడై రగులు పాండవ కంటకు డాఙ్ఞ నివ్వగా

  పాప పథానువర్తి - కులపాంసనుడౌ యల దుస్ససేను , డే

  పాప మెరుంగ నట్టి సతి (న్) , పయ్యెద లాగుచు నీడ్చె | నక్కటా

  ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభ లోన || గిరీటి నిర్దయన్

  జాపము వీడి దూరముగ సవ్వడి సేయక నుండె | భీముడున్

  గోపము మ్రింగి మౌనముగ గూర్చొనియెన్ , గద గ్రింద వైచు | చా

  హా ! పటు శైర్యవంతు లయి ‌నగ్రజు సంఙ్ఞ నతిక్రమించ లే ,

  దా పరమస్వభావనిధులౌ యనుజన్ములు | తమ్ము లన్నచో =

  ‌నా పగిదిన్ మెలంగ వలె నంచును భారత గాధ తెల్పెడిన్ ! !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. ప్రశస్తమైన పూరణండీ!! అభినందనలు, నమస్సులు! 🙏🙏🙏🙏

   తొలగించండి
  3. గురుమూర్తి ఆచారి


   గురువర్యు డగు శ్రీ కంది శంకరయ్య గారికి మరియు

   సత్కవయిత్రి యగు శ్రీ మతి సీతా‌ దేవి గారికి ధన్యవాదములు , నమస్సులు

   తొలగించండి
  4. కురువృద్ధుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ సూచుచుండన్‌ మదో
   ద్ధురుఁడై ద్రౌపది నిట్లు సేసిన ఖలున్‌ దుశ్శాసనున్‌ లోకభీ
   కరలీలన్‌ వధియించి తద్విపులవక్షశ్శైలరక్తౌఘ ని
   ర్ఝర ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్‌. --భార. సభా. 2. 233

   తొలగించండి

 19. .. .. .. సమస్య
  *ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి*


  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ధర్మమును దైవమును నమ్మి ధర్మజుండు
  నంత కనుగొనె నంట కం డ్లప్పగించి!
  చావు మూడిన ఖలుడు దుశ్శాసనుండు
  ద్రౌపది వలువ లూడ్చెఁ;
  దత్సభఁ గిరీటి
  నోరు మూసికొనుచుఁ దాను కూరుచుండె

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ధర్మతనయు। డంత కనుగొనె..." అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 20. దుస్స సేను డు నిర్దయన్ దుష్ టు డ గు చు
  ద్రౌపది వ లు వ లూ డ్ చె త త్ సభ ;కిరీటి
  కృ ద్దుడౌ చు ను లోలోన కుము లు చుండి
  యన్న యా జ్ఞకు లోబడి మిన్న కుండె

  రిప్లయితొలగించండి
 21. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దుస్ససేను డన్న నొడువ దురుసు తోడ
  ద్రౌపది వలువ లూడ్చె; దత్సభ గిరీటి
  దుష్కృతమగు నాచర్యను తూలగించి
  యన్నదమ్ములతో నట నటమటించె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నొడువ' అంటే తప్పులు పట్టగా అన్న అర్థం వస్తున్నది. అక్కడ "అన్న నుడువ" అంటే బాగుంటుందని సూచన.

   తొలగించండి
 22. డా.పిట్టాసత్యనారాయణ
  పక్కింటి మండోదరి ద్రౌపది ఆనే యువతితో........
  "నీవు రాలేదు పార్కున నెన్నలేని
  చీరలను బ్రదర్శించిరి చేరదీసీ
  ఎట్టులూరెనో తన ముక్కు కిరుగడలను
  ద్రౌపది! వలువ లూడ్చె దత్సభ గిరీటి(కోడి)..(ఆకర్షణ కొరకు అదృష్టం చెప్పే చిలుకకు వలె నియమించబన యంత్రపు కోడి)

  రిప్లయితొలగించండి
 23. డా.పిట్టా సత్యనారాయణ
  ఆపదలెన్న శ్రోతలకు నన్నియు నిన్నియుగావు మైకుతో
  కూపమునన్ బడేసెదరు కొందరుగానరదెంత కాలమో
  రూపము రంగు నిడ్వి నట రువ్వుచు జార్చరె వీనులందు యా
  ద్రౌపది వల్వలూడ్చెనదె1 తత్సభలోన"కిరీటి" నిర్దయన్.(కిరీటి,వక్తపేరు)
  1.ఎడతెగని పొడవు గల ఉపన్యాసము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   పద్యం బాగున్నది. కాని పూరణ అంత సమర్థంగా ఉన్నట్టు లేదు.
   'బడేసెదరు' అన్నది వ్యావహారికం. 'వీనులందు నా ద్రౌపతి' అనండి.

   తొలగించండి
 24. మిత్రులందఱకు నమస్సులు!

  [యుద్ధరంగమున నిల్చిన యర్జునుఁడు, స్వపర సేనలలోని బంధువులందఱనుఁ గాంచి, నిర్వేదమునఁ దాను యుద్ధమొనర్పలేనని తెలుపఁగా, శ్రీకృష్ణుఁడు పలికిన సందర్భము]

  "దాపున మృత్యుదేవతయె తాండవమాడుచునుండఁ గౌరవుల్
  గాపటికంపు ద్యూతమునఁ గాంచఁగ గెల్పును, దుస్ససేనుఁ డా
  ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ! గిరీటి! నిర్దయన్
  మోపిన యట్టి కష్టములు మొత్తము మాసెనె? "సంగరమ్ము నే
  నోపఁగ లే" నటంచు వగ నొందెద వేలయ? లెమ్ము దొమ్మికిన్!"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మధుసూదన్ గారూ,
   చక్కని విరుపుతో అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
  2. అద్భుతమైన పూరణార్యా!! నమోనమః! 🙏🙏🙏🙏🙏

   తొలగించండి
  3. మాన్య సీతాదేవి గారికి, మాన్యులు శంకరయ్య గారికి ధన్యవాదములు!

   మీ యభిమానమునకుఁ గడుంగడు కృతజ్ఞుఁడను!

   తొలగించండి
  4. చిన్న సవరణముతో...

   [యుద్ధరంగమున నిల్చిన యర్జునుఁడు, స్వపర సేనలలోని బంధువులందఱనుఁ గాంచి, నిర్వేదమునఁ దాను యుద్ధమొనర్పలేనని తెలుపఁగా, శ్రీకృష్ణుఁడు పలికిన సందర్భము]

   "దాపున మృత్యుదేవతయె తాండవమాడుచునుండఁ గౌరవుల్
   గాపటికంపు ద్యూతమునఁ గాంచిరి గెల్పును; దుస్ససేనుఁ డా
   ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ! గిరీటి! నిర్దయన్
   మోపిరి వారు కష్టములు! మొత్తము మాసెనె? "సంగరమ్ము నే
   నోపఁగ లే" నటంచు వగ నొందెద వేలయ? లెమ్ము దొమ్మికిన్!"

   తొలగించండి
  5. ఆర్యా! మాన్యులు గురువుగారండీ! నేను సామాన్యనేనండీ! వారి ప్రక్కన నిలబడే అర్హత లేదు! 🙏🙏🙏🙏

   తొలగించండి
  6. నేనసామాన్య అన్నారా :)


   జిలేబి

   తొలగించండి
  7. దీనినే గురువుగారు “కెలుకుడు” అన్నారు!
   నమోనమః! 🙏🙏🙏🙏

   తొలగించండి
 25. అక్షయాగతములు నలినాక్షి మాన
  రక్షకములు మాధవ కృపా వీక్ష ణాతి
  దక్షతా సూచకమ్ము లవి క్షితి నుండ
  ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి!

  [ఊడ్చు = త్యజించు]


  పాప ఫలంబుఁ బొందె ననిఁ బావని హస్త గదా విఘాతియై
  భూపతి తాస్ర పాన సువిభూషిత భీముఁడు ధార్త రాష్ట్రుఁ డీ
  కాపురుషుండు నిష్ఫలిత కార్యుఁ డవిజ్ఞుఁడు దుస్ససేనుఁడే
  ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ గిరీటి నిర్దయన్

  [కిరీటి = కిరీటమును ధరించిన వాఁడు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ పూరణలు ఎప్పటి వలెనే వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి

 26. భూపసభాంతరాళపరిభూతసుయోధనసోదరుండు తా
  కోపవశస్ఫురజ్జ్వలితఘూర్ణితరాగవిలోచనుండునై,
  ద్రౌపది వల్వలూడ్చె నదె తత్సభలోన; కిరీటి నిర్దయన్
  చాపము నెక్కుపెట్టి కురుసంగరమందునఁ గూల్చె వానిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విఱుపుతో నద్భుతముగ నున్నదండీ మీ పూరణము! అభినందనలు!

   నాలుగవ పాదము చివర నొక యక్షరము తక్కువ పడినది. వానినిన్ అనండి.

   తొలగించండి
  2. రామాచార్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   సభలో దుశ్శాసనుడు పరిభూతుడు కాలేదు కదా! అతనిని చంపినది భీముడు. కిరీటి కాదు.

   తొలగించండి
  3. ధన్యవాదాలండి
   మీ సూచనప్రకారం ఈ క్రింద సవరించాను
   "పరిభూతసయోధను సోదరుండు"
   "గూల్చె వారలన్"
   అని ఆ రెండు చోట్ల మార్చాను.

   తొలగించండి
 27. అన్నయాజ్ఙ దుశ్యాసనుడమలుజేయ?
  ద్రౌపది వలువలూడ్చె!"దత్సభ గిరీటి
  యన్న కనుసైగ?రోషాన్నిచిన్న బుచ్చ"
  భారతంబాయె!లోకాలతీరుతెన్ను!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   ? అవసరం లేనిచోట ప్రశ్నార్థకాల నుంచారు.

   తొలగించండి
 28. పాప భయంబు లేని ఖలు భ్రాతయె జెప్పగ దుశ్శసేనుడే
  ద్రౌపది వల్వలూడ్చె నదె తత్సభలోన, గిరీటి, నిర్దయన్
  పాపులు కౌరవాధముల బట్టి వధింపగ బాస జేయగా
  నాపెను భీమసేనునపు డన్న యుధిష్ఠురుఁ గౌరవించుచున్

  రిప్లయితొలగించండి
 29. సవరించిన పద్యం

  దుస్ససేనుండు చెలరేగి దుష్కృతమున
  ద్రౌపదివలువలూడ్చె దత్సభఁ గిరీటి
  భీమ ధర్మరాజాదులా వీరపతులు
  ఖిన్న వదనులై సభలోన మిన్నకుండ్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   అయినా సభలో బాస చేసింది భీముడు కదా!

   తొలగించండి
 30. చూపగ దారి యగ్రజుడు చూడగ పెద్దలు, దుస్ససేనుడే
  ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ, గిరీటి నిర్దయన్
  పాపుల సంహరించగను పాశుపతమ్మును పొంది దీక్షతో
  కోపముతో చెలంగి కడుఁ గ్రూరుల కౌరవ సంతుఁ దున్మెతాన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగునంది. అభినందనలు.
   "దారి నగ్రజుడు..." ఆనండి.

   తొలగించండి
 31. పాపపు టూహలన్ దనదు పాలన మందున ధార్తరాష్ట్రుడే
  చూపుచు మత్సరంబు దన సోదర వర్గము నోడజూదమున్
  ద్రౌపది వల్వలూడ్చెనదె, తత్సభలోన గిరీటి నిర్దయన్
  చూపక ధర్మబుద్ధినట చోద్యము గాంచుచు మిన్నకుండెనే
  చూపది లేనివానినటు చుట్టగ పాశము పుత్రరూపునన్!

  కిరీటి= కిరీటధారి = రాజు =ధృతరాష్ట్రుడు!

  రిప్లయితొలగించండి
 32. భూపతిరాణివాసమున బొమ్మికమున్సవ రించ ద్రౌపదిన్
  దాపుగ వచ్చెవేగముగ దాసియు పయ్యెద
  బారుగా విడన్
  ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోన; గిరీటి నిర్దయన్
  యాపనిపిల్లనాఱడిగ యానెఱినెప్పుడు చేయరాదనెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
   'నిర్దయన్ + ఆ, ఆఱడిగ + ఆ' అన్నపుడు యడాగమాలు రావు.

   తొలగించండి
  2. 🙏🏽
   ధన్యవాదములు. తెలుసుకొంటిని

   తొలగించండి
 33. ఉత్పలమాల

  చూపుకు పెద్దవారలని జూపెడు మీవగు వస్త్రధారణల్
  పాపపు దుస్ససేనుని స్వభావముఁ ద్రుంచక వ్యర్థమంచు నా 
  ద్రౌపది, వల్వలూడ్చె నదె తత్సభలోనఁ, గిరీటి నిర్దయన్ 
  బాపని నిస్సహాయతను !వాయు సపుత్రుని దైన్యమెంచుచున్! !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగునంది. అభినందనలు.
   కాని పూరణ భావం అర్థం కాలేదు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. దుర్మార్గము నాపలేని మీపెద్దరికపు గుర్తుగా కనిపించే వస్త్రధారణ వ్యర్థము అను మాటలతో ద్రౌపది పెద్దల వల్వలూడ్చిందను భావము. అన్వయము సరికాదన సవరించగలవాడను సర్

   తొలగించండి
  3. ఇలా సవరిస్తే బాగుంటుందంటారా సర్?

   చూపుకు పెద్దవారలని జూపెడు మీవగు వస్త్రధారణల్
   పాపపు దుస్ససేను నెడబాయక వ్యర్థమటంచు వారికిన్
   ద్రౌపది వల్వలూడ్చె నదె తత్సభలోనఁ గిరీటి నిర్దయన్
   బాపని నిస్సహాయతను, వాయు సపుత్రుని దైన్యమెంచుచున్!

   తొలగించండి
  4. సహదేవుడు గారూ,
   సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 34. కోపముచేత ధర్ముజుడు క్రోధము నోడగ పంచభర్తృ కన్
  ఆపగలేని మోదమున ధార్తుని తమ్ముడు జుట్టుపట్టగన్
  ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ , గిరీటి నిర్దయన్
  మోపగలేని భారమున మోముల దాచిరి పాండునందనుల్

  Dr H Varalakshmi
  Bangalore

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వరలక్ష్మి గారూ,
   మీ పూరణ బాగున్నది. కాని కొంత అన్వయదోషం ఉంది.
   'ధార్తుని'...?

   తొలగించండి
 35. డా.పిట్టా సత్యనారాయణ
  ఆపదలెన్న శ్రోతలకు నన్నియు నిన్నియుగావు మైకుతో
  కూపమునన్ బడేసెదరు కొందరుగానరదెంత కాలమో
  రూపము రంగు నిడ్వి నట రువ్వుచు జార్చరె వీనులందు యా
  ద్రౌపది వల్వలూడ్చెనదె1 తత్సభలోన"కిరీటి" నిర్దయన్.(కిరీటి,వక్తపేరు)
  1.ఎడతెగని పొడవు గల ఉపన్యాసము.

  రిప్లయితొలగించండి
 36. డా.పిట్టాసత్యనారాయణ
  పక్కింటి మండోదరి ద్రౌపది ఆనే యువతితో........
  "నీవు రాలేదు పార్కున నెన్నలేని
  చీరలను బ్రదర్శించిరి చేరదీసీ
  ఎట్టులూరెనో తన ముక్కు కిరుగడలను
  ద్రౌపది! వలువ లూడ్చె దత్సభ గిరీటి(కోడి)..(ఆకర్షణ కొరకు అదృష్టం చెప్పే చిలుకకు వలె నియమించబన యంత్రపు కోడి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   మొదటి పూరణలో 'పడేసెదరు' అన్నది గ్రామ్యం. "కూపమునందు ద్రోసెదరు" అనండి. అలాగే "వీనులందు నా" అనండి.
   రెండవ పూరణలో 'ముక్కు కిరుగడలను'...?

   తొలగించండి 37. దుస్ససేనుడా కొలువున దుష్టబుద్ధిఁ

  ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి

  భీము డాదిగ నచ్చట వీరులుగన

  కావుమనివేడ కృష్ణుడు కరుణ జూపె.

  రెండవ పూరణ
  క్రమాలంకారము
  పంచ భర్తృక యైనట్టి వనిత యెవరు?

  దుష్టుడగుచునేమొనరించె దుస్ససేను?

  పాశుపతమను నస్త్రమున్ బడసిరెవరు?

  ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉమాదేవి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   దుస్ససేను... అని డుప్రత్యయం లేకుండా ప్రయోగించారు. "దుస్ససేను డే మొనరించె దుష్టుడగుచు" ఆనండి.

   తొలగించండి
 38. భూపతి దుష్ట సైంధవుడు మున్నుపరాభవమొందె గాదె నీ
  కోపపు చూపు దాకి, మరి గుండును నున్నగ గొట్టలేదె యా
  తాపము తీర భీముడట తాపసులుండగ! నీవెరుంగవే
  ద్రౌపది! వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ గిరీటి నిర్దయన్!!

  రిప్లయితొలగించండి
 39. నిండుసభలోన గుండియ మండులాగు
  దుష్ట శాససనుడూడ్చెను కృష్ణ చీరె
  ఇంతకన్న దుర్మార్గమేమి గనము
  అందరక్కడ గుమిగూడి, నౌరయనగ!!
  ద్రౌపది వలలూడ్చె దత్సభ గిరీటి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పురుషోత్తమ రావు గారూ,
   పద్యం బాగుంది. కాని పూరణ సమర్థంగా లేదు. అన్వయలోపం ఉన్నది. రెండవ పాదంలో యతి తప్పింది.

   తొలగించండి

 40. .. ..సమస్య
  *ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి*

  *కృష్ణ స్మరణం*

  సందర్భము: కారణాల కన్నిటికీ మూల కారణమైన కృష్ణుని స్మరించినాడు ఆ సభలో కిరీటి.. వినలేదా!
  సరిగా చెప్పు మని ప్రశ్నించినావు యిలాగా.. "దుశ్శాసనుడు ద్రౌపది వలువ లూడ్చినాడు. మరి ఆ సభలో కిరీటి?"
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  కారణముల కెల్లను మూల కారణమగు
  శౌరిని స్మరించె, వినవొ! తత్సభఁ గిరీటి...
  సరిగఁ బ్రశ్నించితి విటు...
  "దుశ్శాసనుండు
  ద్రౌపది వలువ లూడ్చెఁ ...
  దత్సభఁ గిరీటి?"

  🖋~డా.వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి

 41. .. .. .. సమస్య
  *ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి*

  *దిక్కులకు దిక్కు*

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  "చెలువ! ది క్కేది?" యని దుస్స
  సేను డంత..
  ద్రౌపది వలువ లూడ్చెఁ ; దత్సభఁ గిరీటి
  దిక్కులకుఁ జూడ సాగె నే దిక్కు లేక...
  "దిక్కు నీవే!" యనుచు వేడె దీన, సాధ్వి...
  ది క్కగుచుఁ గాచె కృష్ణుండు
  దివ్యముగను..

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి

 42. .. సమస్య
  *ద్రౌపది వలువ లూడ్చెఁ దత్సభఁ గిరీటి*

  సవరణతో..
  (శ్రీ కంది వారి సూచన మేరకు)

  సందర్భము: సులభము
  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
  ధర్మమును దైవమును నమ్మి ధర్మ తనయు
  డంత కనుగొనె నంట కం డ్లప్పగించి!
  చావు మూడిన ఖలుడు దుశ్శాసనుండు
  ద్రౌపది వలువ లూడ్చెఁ;
  దత్సభఁ గిరీటి
  నోరు మూసికొనుచుఁ దాను కూరుచుండె

  🖋~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 43. పాపము పుణ్యమున్ గనక పండుగ జేయుచు దుస్ససేనుడే
  ద్రౌపది వల్వ లూడ్చె నదె తత్సభలోనఁ;...గిరీటి నిర్దయన్
  కోపము తోడ జూచుచును కొర్కెను పండ్లను కర్కరమ్మనన్...
  నా పని త్రుంచుటే నిటను నవ్వుచు త్రుళ్ళుచు కైపదమ్ములన్ :)

  రిప్లయితొలగించండి