8, అక్టోబర్ 2018, సోమవారం

సమస్య - 2811 (ఖగపతి కిడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్"
(లేదా...)
"ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్ "

92 కామెంట్‌లు:

 1. భగవంతుడ! కష్ట మవగ
  నెగకొట్టెద స్కూలు నేడు నిశ్చితముంగా...
  తెగదీ సమస్య శంకర! 👇
  "ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఇదీ సమస్యాపూరణలో ఒక విధానమే. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  జటాయువు రెక్కలను నరికినాడు రావణుడు. ఆ జటాయువే రామలక్ష్మణులకు సీతాన్వేషణలో దోహదపడింది. రావణవధ జరిగింది. రావణుడు తన సమాచారమనే గాండీవమును జటాయువు చేతిలో పెట్టాడు.. ఆ సమాచారగాండీవమే లంకలోని రాక్షసరాజులందరినీ వధించుటకు కారణభూతమైనది.... ఈ భావంతో పూరణ....

  పగను జటాయువున్ గని విపక్షుని జేయగ రావణుండు , దా
  నగుపడి రామభద్రునకు నంతయు జెప్పెను ఘోరకృత్యమున్ !
  పగగొన లంకజేరుటకుపాయమునానిదిగాదె ! యట్టిచో
  ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. అవధానులవధానులవధా‌ులే

   అద్భుతము !


   జిలేబి

   తొలగించండి
  2. క్లిష్ట సమస్యను తమ నైపుణ్యంతో ప్రశస్తంగా పూరించిన మైలవరపు వారికి అభినందనలు.

   తొలగించండి
  3. రావణుడు శివభక్తుడు.. కానీ కానిపనిచేసి వధార్హుడై రాముని (శ్రీ మహావిష్ణువును) ధనుర్ధారిని చేశాడు..

   నగజాపతిభక్తుండై
   తగని పనినొనర్చి దా వధార్హుండగుటన్
   జగమేలెడి తురగీకృత
   ఖగపతికిడె రావణుండు గాండీవంబున్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  4. మైలవరపు వారి రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి


 3. భగవానుడు తన వాహన
  ముగ తానమ్ము? శివలింగమును తన తలపై
  న గనెనెవడు?నరుడుగొనెన్?
  ఖగపతి కిడె; రావణుండు; గాండీవమ్మున్;


  తెగని సమస్య గలద శా
  స్త్రి గుబ్బెతల చేతిలోన తిరికలు పడగన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 🙏

   నమ్ముము జిలేబి నాకై
   వమ్ము పురాణములు నేను పరుగిడి పోదున్
   కమ్మని నిద్దుర వీడుచు
   గమ్మున జేయంగ దగునె గడబడ పనులన్?

   తొలగించండి

  2. :) మీ ఆలోచన వృత్తము రాయ తోడ్పడె :)


   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. డా.పిట్టాసత్యనారాయణ
  జగమున రగిలిన పగలకు
  దగదామే భస్మమైరి దళన విమతులై
  భుగభుగ మంటల శలభము
  ఖగపతికిడె రావణుండు గాండీవంబున్

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా
  గాండీవమ్మున్....సమస్యలోనిదిగా చదువగలరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   క్షమించాలి. మీ పద్యభావం బోధపడలేదు.

   తొలగించండి
  2. డా.పిట్టా నుండి
   ఆర్యా,
   రాముడుతన లంకకు పిలిపించుకొని,పగతీర్చుకొనడానికే,రాముని వంటి వారు అలా చేయరు,ప్రత్యక్షంగా రావణుడి
   వ్వక పోయినను ఆయుధం తనది రామునికిఇచ్చినట్లే.అందుకే,చావు,ఓటములు.

   తొలగించండి
 6. జగమం దునవింతలు గన
  భగవంతుని లీల లంట బహు చోద్యంబౌ
  నిగమము లెన్నెన్ని పలికిన
  ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   చోద్యమైన మాట అంటూ సమస్యను పూరించారు. బాగుంది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "నిగమముల నెన్ని పలికిన" అనండి.

   తొలగించండి
  2. జగమం దునవింతలు గన
   భగవంతుని లీల లంట బహు చోద్యంబౌ
   నిగమము లనెన్నిపలికిన
   ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్

   తొలగించండి


 7. ఆకాశవాణి రికార్డింగ్ స్టూడియో లో మిక్సింగ్ సౌండ్స్ విన్న తరువాయి కంది వారికి వచ్చిన కైపద ఆలోచన‌:)  యుగళపు వాణి నాకసపు యుగ్మము భాగవతమ్ము సీత గా
  ధ,గులక రాళ్ళ శబ్దములు దారుణ మై వినవచ్చె రేడియో
  న గుబులు రేపె నయ్య శ్రవణమ్ముల కర్ధము నాకు దోచలే
  దు గబగబాల్మ టంచన బుధుల్ విడగొట్టుడి కైపదంబిదే
  "ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్"

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   చమత్కార భరితమైన మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
   మీ పూరణతో పొందిన స్ఫూర్తితో నేను చేసిన రెండు పూరణలను క్రింద చూడండి...

   తొలగించండి
 8. మగజాతి గిట్టని సతికి
  యెగతాళిగనామె భర్త యివ్విధి జెప్పెన్
  మగజాతిని దునుమాడగ
  ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ వ్యంగ్యార్థ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సతికి నెగతాళిగ..." అనండి.

   తొలగించండి
 9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2811
  సమస్య :: ‘ఖగపతి కిచ్చె రావణుడు గాండివమున్ నృపకోటి జంపగన్’
  *గరుత్మంతునికి రావణుడు గాండీవాన్ని ఇచ్చినాడు రాజుల నందఱినీ చంపేందుకోసం* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: తరగతి గదిలో ఉపాధ్యాయుడు అప్పుడప్పుడూ కొన్ని పదాలు ఇచ్చి ఒక్కొక్క పదాన్ని ఉపయోగించి ఒక్కొక్క సొంతవాక్యాన్ని వ్రాయమని చెబుతూ ఉండటం సహజం. ఒకసారి ఒక గురువు
  ‘ఖగపతి’ ‘రావణుండు’ ‘నృప’ ‘గాండివము’ అనే పదాలను ఇచ్చి సొంతవాక్యాలు వ్రాయమన్నాడు. జ్ఞానహీనుడైన ఒక క్రొత్త విద్యార్థి గురువు ఇచ్చిన పదాల నన్నింటినీ కలిపి ఏకవాక్యంగా భావహీనంగా సొంతవాక్యాన్ని ఇలా చెప్పినాడు అని విశదీకరించే సందర్భం.
  ఖగపతి’ ‘రావణుండు’ ‘నృప’ ‘గాండివ’ మంచు గురుండు పల్కి, వ్రా
  యగ నిడె సొంత వాక్యముల నర్థయుతమ్ముగ వేఱువేఱుగా,
  వగవక జ్ఞానహీనుడయి వ్రాసె నొకండిటు లేకవాక్యతన్
  ‘ఖగపతి కిచ్చె రావణుడు గాండివమున్ నృపకోటి జంపగన్’
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (8-10-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ,
   విద్యార్థి సొంతవాక్య నిర్మాణంగా మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 10. వగపు ను బాపియు రాముడు
  తగు నభయము నెవరి కిడెను ? దను జుడెవ రొకో ?
  మగటిమి నరుడేమి గొనె ను ?
  ఖగపతి కిడె; రావణుoడు; గాండీవ మ్మున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   మొన్న అనంతపురం నుండి కె. రాజేశ్వర రావు పేర నాకు వంద రూపాయల మనీ ఆర్డర్ వచ్చింది. అది మీరు పంపినదేనా? అయితే ఎందుకు పంపారో తెలియజేయండి. "జడ కందములు" పుస్తకాల కొరకా?

   తొలగించండి
  2. నేను పోస్టులో పంపిన పుస్తకాలు మీకు అందినవా? లేదా? తెలియజేయండి. అందకపోతే మళ్ళీ పంపిస్తాను.

   తొలగించండి
 11. తగుపదవి యెవరికిడె హరి
  జగతిని? హరు భక్తు డెవరు? శర్వుం డిడె నా
  నగవైరి సుతుని కేమియొ?
  ఖగపతి కిడె, రావణుండు, గాండీవమ్మున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 12. (గురువు ప్రశ్నలు -శిష్యుల సమాధానాలు )
  "ప్రగణితదివ్యమూర్తి హరి
  వాహనగౌరవ మిచ్చె నేరికో ?
  యగణితధూర్తసాధువయి
  యమ్మను జానకి దెచ్చె నెవ్వడో ?
  మగటిమి తోడ పాండుసుత
  మధ్యము డందిన కార్ముకం బెదో ?"
  "ఖగపతి కిచ్చె " "రావణుడు "
  "గాండివమున్ ; నృపకోటి జంపగన్ ."

  రిప్లయితొలగించండి
 13. నగధరు వాహన పదవిని
  తగదనిన వినక పరసతి దరలించె ఖలు
  పగతు దునుమగొనె పార్థుడు
  ఖగపతి కిడె; రావణుండు; గాండీవమ్మున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదం చివర గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!
   నగధరు వాహన పదవిని
   తగదనిన వినక పరసతి దరలించె నుగా
   పగతు దునుమగొనె పార్థుడు
   ఖగపతి కిడె; రావణుండు; గాండీవమ్మున్

   తొలగించండి
 14. జగమునవింటిమె? కంటిమె?
  పగనిట్లుగ దీర్చదగునె?పండితవర్యా!
  తగునా నిట్టుల నీయగ
  ఖగపతి కిడెరావణుండుగాండీవమ్మున్
  (క్షంతవ్యుడను)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   క్షమించమని అడగవలసిన అవసరం లేదు. మీకు సహజమైన విధానంలో పూరణ చేసారు. బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 15. భగువు తన దేహము నడుగ
  ఖగపతి కిడె ,రావణుoడు గాండీవమ్మున్
  నగసుతున కిచ్చె కడు ముద
  ముగ యని పలువు రెదుట నొక మూఢుడు బల్కెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మూఢుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ముదముగ నని..." అనండి.

   తొలగించండి
 16. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  భుగభుగ పొంగ జేసిన సుబుద్ధి గిరీశము నేరికిచ్చెరా?
  వెగటుగ సీత నెవ్వరు గభీమన దొంగిలి పారిపోయెరా?
  నగవుచు నగ్ని దేవుడు వనమ్మున పార్థున కెయ్యదిచ్చెరా?
  రగులుచు భార్గవుండట సరాసరి నిశ్చయమేమి జేసెరా?
  ఖగపతి కిచ్చె; రావణుఁడు; గాండివమున్; నృపకోటిఁ జంపఁగన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి

  2. మైలవరపు వారికి కీచకుడిలా
   జీపీయెస్ వారికి గిరీశం
   దేన్నైనా పూరించే దానికి
   మార్గం సుగమ్యం :)


   జిలేబి

   తొలగించండి

  3. :) నేనే రాద్దామనుకున్నా జిలేబికి శకారుడి లా..

   వదిలిపెడితే పనిబెట్టినట్టుందని వదిలిపెట్టా :)


   జిలేబి

   తొలగించండి
 17. (1)
  తగ నొకఁ డొక్కచో వినత గాథను, రామకథన్ మరొక్కఁ డొ
  ప్పుగ, నొకఁ డా జయమ్మును, దపోనిధి భార్గవరాము సత్కథన్
  నెగడి పఠింప నొక్కఁడు ననేకము లేకములౌట వింటినే
  "ఖగపతి కిచ్చె" "రావణుఁడు" "గాండివమున్" "నృపకోటిఁ జంపఁగన్"
  (జయము = భారతము)
  (2)
  తగ నొక పాఠశాల దరి దారినిఁ బోవుచునుంటి నప్డు ఛా
  త్ర గణము వారి పాఠములఁ దా మొక రొక్కొక రీతి గొంతుఁ బెం
  చి గడబిడన్ బఠింపగ విచిత్రముగా నిననయ్యె నిట్టులన్
  "ఖగపతి కిచ్చె" "రావణుఁడు" "గాండివమున్" "నృపకోటిఁ జంపఁగన్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆహా ! అయ్యవారికి చాలదు ఐదు వరహాలు

   సూపర్ పూరణ


   జిలేబి

   తొలగించండి
  2. ఐదెందుకు... రెండు పద్యాలకు రెండు వరహాలు చాలు! బ్యాంకు అకౌంటు నెంబరు పంపమంటారా?

   తొలగించండి

  3. మీ బ్యాంకు నెంబరు జగద్విదితము పంపించా :)   జిలేబి

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. చాత్రగణ మేక వచనము. వారి, తాములు బహువచనములు కదా. సందిగ్ధముగా నున్నది. నివృత్తి జేయఁ గోరెదను.

   తొలగించండి
  5. కామేశ్వర రావు గారూ,
   మంచి పట్టే పట్టారు. ధన్యవాదాలు. నిజమే అక్కడ కర్తృ, క్రియా పదాలకు సమన్వయం లేదు.
   " ఛాత్ర గణము గూడి పాఠములఁ దగ్గక యొక్కొక రీతి గొంతుఁ బెంచి గడబిడన్ బఠింపగ" అంటే ఎలా ఉంటుందంటారు?

   తొలగించండి
  6. బాగుంటుందండి. ధన్యవాదములు.
   మీ మొదటి భావమే రావలెనన్న:
   ఛాత్ర గణపు వారు పాఠములఁ దా మొక రొక్కొక రీతి గొంతుఁ బెంచి గడబిడం బఠింపగ" ననిన యన్వయము కుదురుతుందని భావించెదను.

   తొలగించండి
 18. నగవైరితా నమృతమును
  జగదంబాపతిని కోరె చక్కని వరమున్
  ఛగలంబొసగె కిరీటికి
  ఖగపతి కిడె,రావణుండు, గాండీవమ్మున్.

  ఛగలము=అగ్ని

  రిప్లయితొలగించండి
 19. నిగమంబులు నేజదివితి
  నగుపడ డన్యుండు సాటి యవనిని నాకెం
  చగనని యొక డిట్లాడెను
  ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్.

  రిప్లయితొలగించండి
 20. స్త్రీలను చెరబట్టిన రావణ,దుర్యోధనులను ఉద్దేశించి సమన్వయముతో.

  మగటిమిఁ గల్గు వారు, మతిమంతులు, విద్యల మిన్నలైనఁ దా

  మగువలఁ బట్టు వార, లట మాన్యపరాక్రమవంతులైననున్,

  దెగడి నశించి పోదురని తెల్పు విధమ్ము , కిరీటిరూపుడౌ

  ఖగపతి కిచ్చె రావణుడు గాండివమున్ నృపకోటిఁ జంపగన్.

  కంజర్ల రామాచార్య.  రిప్లయితొలగించండి
 21. నిన్నటి పూరణ.

  స్థైర్యమదొక్క భార్య యగు, ధైర్యమొకర్తుక, కీర్తి యోర్తు, యా

  శౌర్యసుపాలనమ్మొకతె, సత్యవచస్సతి యొక్క కాంత, తా

  నార్య ధరాతనూభవ నిజాంగన, యార్వురు గారె? యిట్లహో!

  భార్యలు ముగ్గురా? పరమపావనుడౌ రఘురామమూర్తికిన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ నిన్నటి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   రామునకు ముగ్గురు భార్యలన్న విపరీతార్థంతో సమస్య ఉంటే మీరు ఆరుగురు భార్యలను చేశారు.

   తొలగించండి
 22. తగునొకటి ద్వాపరమునకు
  నగుపడు త్రేతంబునందు నతడొక్కరుడున్
  తగవేల యెప్పు డెక్కడ
  ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్?

  రిప్లయితొలగించండి
 23. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  ఖగపతి కిచ్చె రావణుడు
  గాండివమున్ నృపకోటి జంపగన్
  =======================
  రాజుల సమూహమును చంపుటకై
  రావణుడు గాండీవమును గరుడునికి
  ఇచ్చినాడనుటలో అసంబద్దతె సమస్య
  ===========================
  సమస్యా పూరణం - 277
  ==================

  వైనతేయుని చూసి గుర్తెరిగెను-
  చెలిమిని చేయగా జరిగెను
  పూర్వాశ్రమ మతికిక ఒరిగెను-
  ప్రేమలో బడి తాను కరిగెను
  నాగుల దునుమాడుటకు అస్త్రములను-
  ఖగపతికిచ్చె రావణుడు
  గాండివమును నృపకోటి జంపగన్-
  పొందిన గతిగ అర్జునుడు

  ====##$##====

  వైకుంఠ ద్వార పాలకులు జయ విజయులలో
  ఒకడే ఈ రావణుడని చెంత చేరిన గరుడుని
  తానును గుర్తించి తగు రీతిగా సత్కరించుటయే
  గాక శత్రుమూకలైన నాగులను తుద ముట్టించు
  టకై రావణుడు అస్త్రములను ఇచ్చినాడు.
  ఖాండవ దహనమునకు సహకరించిన అర్జునుడి
  కి శతృ రాజుల సంహారమునకుపకరించు గాండీ
  వమును అగ్నిదేవుడిచ్చిన గతిగా.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  --- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి

 24. గబగబగా నేజదివితి
  యుగయుగముల చరితలెల్ల యుత్సుక మతినై
  యగుపడ లేదిట్టి ఘటన
  ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి పాదమున
   తగువిధముగ నేజదివితి గా స్వీకరించ ప్రార్ధన!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 25. తగులము దఱుమఁగ మరణము
  ఖగపతి కిడె రావణుండు గాండీవమ్ముం
  దగఁ దీర్చఁగఁ దన కోరిక
  ను గిరీటి కొసఁగె ననలుఁడు నుతియించి తమిన్


  పగలును రేయినిం జెలఁగి ప్రాణి విరావణుఁ డయ్యె నగ్ని మిం
  టఁ గదియ దిక్కులం జిటపటల్ రవముల్ వెలయంగఁ జేయగం
  బగతుర భారతాంకమునఁ బాటవ మొప్పఁగ, సవ్యసాచి యా
  ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్, నృపకోటిఁ జంపఁగన్

  [ఖగపతి = బాణములకు యజమాని]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. “జిటపట వ్రజ రావము లెల్ల నింపగం” పాఠాంతరముగ నుంచ నొప్పు నని భావించెదను.
   చిటపట ధ్వన్యనుకరణము కనుక సంస్కృత పదముగా గ్రహించినఁ “జిటపటవ్రజ” లో ట గురువగును కదా. సందేహ నివృత్తి చేయ గోరెదను.

   తొలగించండి
  2. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   పాఠాంతరంలో సమాసంలో ఉత్తరపదాద్యక్షరం రేఫసంయుక్తమైనపుడు పూర్వాక్షరం అవసరాన్ని బట్టి లఘువుగాను, గురువుగాను స్వీకరించే సదుపాయం ఉన్నది. (నేను నా పద్యాలలో కచ్చితంగా గురువుగానే వ్రాస్తాను. ఇతరులు ఎలా ప్రయోగించినా అభ్యంతరం చెప్పను).
   "ధగద్ధగద్ధగజ్జ్వల ల్లలాటపట్టపావకే"

   తొలగించండి
  3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   నాసందేహము చిటపట శబ్దము గుఱించియే. మీ వివరణము తో “ట” గురుత్వము పొందగలదని తెలిసి యనుమానము తీరినది. ధన్యవాదములు.

   తొలగించండి
 26. అద్భుతమైన పూరణలార్యా! నమస్సులు!🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్సులు, ధన్యవాదములు డా. సీతా దేవి గారు. మీ పద్యము కూడా చాలా బాగుంది. గబగబా వ్రాసినందుల కేమో ప్రాస జారింది మొదటి పాదములో గమనించండి.

   తొలగించండి
  2. ధన్యవాదములార్యా! నిజమే తొందరలో ప్రాస తప్పినది గమనించలేదు! సవరించెదను!😊😊🙏🙏🙏

   తొలగించండి
 27. ఖగపతికిచ్చెరావణుడుగాండివమున్ నృపకోటిజంపగన్
  నగవునజెప్పితేయదియనాగమనాయుడ!కాద?చెప్పుమా
  ఖగపతికిచ్చెరావణుడుగాండివమయ్యెడజంపరాజులన్
  ఖగపతియెట్లుజంపునటగాండివమారణయాయుధంబుతో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మారణ + ఆయుధము = మారణాయుధము' అవుతుంది. యడాగమం రాదు.

   తొలగించండి
 28. నగధరుడు వాహనపదవి
  సుగుణవతి మహీజ నెవరు చూఱాడె నిలన్
  అగినియె నిడె నర్జునునకు
  ఖగపతి కిడె, రావణుండు, గాండీవమ్మున్!!!

  రిప్లయితొలగించండి
 29. అగశయనుండెవానికట యానకమౌ యవకాశమిచ్చెనో
  పగతుర సంహరింపగల పంక్తి ముఖుండెవడోయి? చాపమా
  మగటిమ గల్గు యింద్రుని కుమారుని దేది? యదెందుకో యనన్
  ఖగపతి కిచ్చె, రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్

  రిప్లయితొలగించండి
 30. పగలునరావణ వేషము
  సగభాగముదుడిపివైచి సాగగనడవిన్
  నగుపడె కొమ్మలమాటున
  ఖగపతికిడె రావణుండుగాండీవమ్మున్ (రాత్రినటుడు)

  రిప్లయితొలగించండి
 31. కందం
  ఖగపతి, రావణులనగన్
  తగియు కిరాతార్జునీయ తగవున నటులై
  నగుపడ ప్రేక్షకులనిరే
  "ఖగపతి కిడె రావణుండు గాండీవమ్మున్"

  చంపకమాల
  ఖగపతి రావణాసురుల గ్రక్కున గుర్తిడు పాత్ర ధారులున్
  మృగమును నాదినాదనుచు మేటిగఁ బోరుచుఁ గ్రీడి శూలులై
  మగటిమి జూపగన్ చివర మాటల ప్రేక్షకులిట్టులాడిరే
  "ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్"

  రిప్లయితొలగించండి
 32. అగణితమౌ సమస్యలనె యాశువుగా పరి పూర్తి జేసితిన్
  బొగడగ బృచ్ఛకోత్తములె పూరణ జేసితి వేలవేలుగా
  నగుపడ దొక్కమార్గమది యందదుపాయమెయీసమస్యకున్
  "ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్ "

  రిప్లయితొలగించండి
 33. నిగనిగలాడు వేదికను నీతుల గాథల నాటకంబులన్
  వగపడు సీత గాథ యయె, భారత గాథను వేయబోవగన్
  ఖగమునుఁ జూసి యర్జునుడు గానక వింటినిఁ గోపమొందగన్
  *"ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్ "*

  ఖగము = బాణము

  రిప్లయితొలగించండి
 34. పగలును రాత్రినూహలను పన్నుగ శంకరు లొల్లుచుండగా
  దిగులున నిన్న రాత్రినట తిక్కగ పోరుచు చీకటీగలన్
  తగవులు తీర్చు కైపదము తన్నుకు చచ్చెడి రీతినిచ్చిరే:👇
  "ఖగపతి కిచ్చె రావణుఁడు గాండివమున్ నృపకోటిఁ జంపఁగన్ "

  రిప్లయితొలగించండి