25, అక్టోబర్ 2018, గురువారం

సమస్య - 2826 (సానిన్ గొల్చిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్"
(లేదా...)
"సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్" 

93 కామెంట్‌లు:

 1. మీనము మేషములనకయె
  దీనుడ నైతిని వ్యయించి దీనారములన్
  కానగ రాక ఋణము దొర
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  రిప్లయితొలగించండి

 2. బుట్ట బొమ్మ ముద్దుల గుమ్మ అని ముందనుకొని
  పెండ్లి చేసుకున్నాక జిలేబి విశ్వరూపం
  తెలిసి వచ్చిన మా అయ్యరు వారి మనోవీధి వ్యాఖ్య గా :)

  సన్నాసి బుట్టలో పడ్డాడు :)
  లింకు : http://varudhini.blogspot.com/2015/02/blog-post_14.html
  కానిది తప్పదు కాకన్!
  రాణి జిలేబి యె బసాలు! రతిరాట్టుగ పా
  రాణించి భక్తి గా దొర
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  త్వద్దాసదాస...

  పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భక్త్యంతరంగుండవై
  శ్రీ నారాయణదివ్యమంత్రము మదిన్ సేవించి , భావించి , ది...
  వ్యానందమ్మును పొంది , ముక్తిఁ గొనితో ! ప్రహ్లాద ! భక్తావతం...
  సా ! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దాసదాసు డంటూ మైలవరపు వారు చెప్పిన మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. *అత్తవారిచ్చిన అంటుమామిడితోట..... అన్నీ పోయాయ్... అని *సుబ్బిశెట్టి*

   ఆఖరుప్రయత్నం....

   నే నా సర్వము ధారపోసితిని , సుంతేనిన్ సుఖంబీక , దా
   మేనున్ దాకగనీక , తీపిగనెవో మిథ్యార్థముల్ బల్కుచున్ ,
   శ్రీనాథున్ వరియించు నెట్లయిన నే చింతామణిన్ నేడిదే
   సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 4. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  సానిన్ గొల్చెద రేబవల్ గలుగగన్
  సౌఖ్యంబు సత్సంపదల్
  ======================
  సాని/వెలయాలు/వేశ్య ను పగలు
  రేయనక నిత్యం సేవిస్తు ఉంటాను
  తద్వారా నాకు సుఖములే కాదు
  సంపదలు కూడా చేకూరుతాయని
  చెప్పటంలో అసంబద్దతె సమస్య
  =======================
  సమస్యా పూరణం - 292
  ===================

  నెత్తి మాసినదిగ తానిల్లాలు -
  పాపిడ బిళ్ళతో వెలయాలు
  ఏడుపు గొట్టు కాంతామణి -
  నగుమోము చిందించు చింతామణి
  లేని మగసిరి ఉన్నదిగ -
  ఉలికి పడు వగలాడి పరిష్వంగముల్
  సానిన్ గొల్చెద రేబవల్ -
  గలుగగన్ సౌఖ్యంబు సత్సంపదల్

  ====##$##====

  ఐదు పదులు దాటిన సరసులైన, మగ
  రాయుళ్ళు ఇంట్లో ఆడదున్నప్పటికిని బయట
  "స్టెప్నీ" లను నిర్వహించటంలోని చిదంబర
  రహస్యమేమన

  " అబ్బా! మీ మోటు సరసం చాలండి,
  పోయిన సారి మీరొచ్చినప్పుడు, మీరాడిన
  మోటు సరసం తాలూకు ఒంటి నొప్పులింకా
  పోలేదు.

  మీరొస్తున్నారంటేనే నాకు భయం మొదలౌతుంది "
  ( ఒక వెలయాలి వగలివి )

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రమేష్ గారు మీరు తప్పకుండా పద్యము వ్రాస్తారు మీ భావ పటిమ అమోఘము మీ భావ వ్యక్తీకరణ పద్య రూపములో పంపగలిగితే ఈ బ్లాగు లో వారమెల్లా చూసి సంతోషముతో ఉబ్బితబ్బిబవ్వు అవకాశము గలదు ఒక సారి మూస ధోరణి లో కాకుండా రేపటినుంచి ప్రయత్నం చేసి మమ్మలనలరించమని నా(మా) విన్నపము ఒక సారి పరిశీలించండి

   తొలగించండి

  2. పూసపాటి వారికి వత్తాసుగా
   మొదటి పాదం
   మిగిలిన రెండు పాదాలు ప్రయత్నించండి :)


   తానిల్లాలయ!నెత్తిమాసినదయా!తానేడ్చు కాంతామణీ   జిలేబి

   తొలగించండి
  3. పండితమ్మణ్యులకు తెలిసినంతగా వత్తాసులు ప్రపంచంలో మరెవరికి తెలియవేమో !!!!

   తొలగించండి
  4. మిత్రమా నేను బ్లాగు లోకి రెండు సంవత్సరాల క్రితం వచ్చాను గురువు గారి ఆశీస్సులు తీసుకొని పద్య రచన మొదలు పెట్టాను మొదట్లో చాలా తప్పులు దొర్లేవి ప్రతి పద్యము ప్రతి పద్య పాదము గురువు గారు పరిశీలించి తప్పులు సూచించేవారు వారి సూచనలు పాటిస్తూ తప్పులు పునరావృతం కాకుండా ప్రయత్నం చేసి కొంత పట్టు సాధించాను బ్లాగు లో శ్రీ పోచిరాజు వారు సమయోచిత మార్గదర్శక సూత్రాలను చెప్పేవారు వారిరువురి ఆశీస్సులు ప్రేరణ తోనే స్వల్ప సాఫల్యత చెందాను నేను పండితమణ్యుని కాదు. మీ లాగే నిత్య విద్యా ర్ధిని నా ఙానము సాహిత్య జలధి తీరములో సైకత రేణువంత. మీరు మీ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు తప్పక విజయం సాధిస్తారు మీ మనసు బాధ పడితే ఈ (మీ) విషయములో స్వస్తి నిర్ణయం మీకే మీ పూసపాటి

   తొలగించండి
  5. రమేశ్ గారూ,
   పూసపాటి వారి సలహాను పాటించండి.

   తొలగించండి
  6. నేను ఛంధోరీతిగా మారను గాక మారను
   అందులో స్వేచ్ఛ ఉండదు గాక ఉండదు
   మీ ఛంధోరీతికి వచన కవిత్వానికి నా
   ఈ పద్దతి మధ్యే మార్గం

   తొలగించండి
 5. వేనిన్ గోరను రామా!
  పూనన్ భక్త్యానురక్తి భూరిగ నాలో
  కానన్ రా!మనసా వచ
  సా,నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  రిప్లయితొలగించండి
 6. ఏనాడు న్ నిను మరువక
  మానస మందున నిలిపి యుమా ధవ భక్తిన్
  మానక కైలాస పు వా
  సా ! నిన్ గొల్చెద న మేయ సౌఖ్యము లందన్

  రిప్లయితొలగించండి
 7. జ్ఞానదను భక్తకోటికి
  నానందము గూర్చుదాని ననిశము శుభముల్
  మానక నొసగు శివునిదొర
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్.

  రిప్లయితొలగించండి 8. తానొక చదువుల దైవము ;
  వీనుల విందగు స్వరముల విరియించి విభున్
  మానుగ సంతసపరచెడి
  సానిన్ గొల్చెద నమేయసౌఖ్యము లందన్ .

  (సాని - అధిపురాలు , పూజ్యురాలు )

  రిప్లయితొలగించండి
 9. బానిస బ్రతుకని కొందరు
  కానని గీర్వాణ మందు కౌతుక మొందన్
  తానే ఘనమను సతికంటె
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "తానె సతికంటె ఘనమను..." అనండి.

   తొలగించండి
  2. బానిస బ్రతుకని కొందరు
   కానని గీర్వాణ మందు కౌతుక మొందన్
   తానే సతికంటె ఘనమను
   సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

   తొలగించండి


 10. నీ నాథుండను జంబు నాధుడను ! కన్నీరుల్ సదా గార్చక
  మ్మా! నీ బాంచను కాలు మొక్కదను! కొమ్మా రమ్మ! పూబోడియా !
  ఓ నాగారి! జిలేబి ప్రాణ సఖియా! ఓ నా బసాలా ! ఖులా
  సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్!


  మా అయ్యరు ఉవాచ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. pittasatyanarayana733@gmail.com
  డా. పిట్టా సత్యనారాయణ
  జ్ఞానికి దెలియు నదొక్కటె
  మానిని యన "రామకృష్ణ" మనసున దుర్గౌ
  గాన విభేదము లెన్నక
  సానిని గొల్చెద నమేయ సౌఖ్యములందన్

  కానీ గవ్వయు లేని నాడు దినముల్ గడ్వన్ యుగాలౌను నా
  జానల్ భర్తల బ్రోచు వారు గలరీశద్భేదమే బైట బో
  దా నే నేమిని ద్రిప్పువాడు హరియే దల్చున్ మహా లక్ష్మినిన్
  సానిన్ గొల్చెద రేబవల్ గలుగగన్ సౌఖ్యంబు సత్సంపదల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   రెండవ పూరణలో కొంత అన్వయదోష మున్నట్టుంది.

   తొలగించండి
 12. మిత్రులందఱకు నమస్సులు!

  నీ నామమ్మొక దివ్య మంత్రమనుచున్ నిత్యమ్ము మద్ధృత్స్థలిన్
  బూనన్ నిల్పియు మన్మనోబ్జ మెసఁగం బూజించుచున్ భక్తిచే
  న్మేనెల్లం బులకాంకురప్రకరముల్ నిండార నో శ్రీనివా
  సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్!

  రిప్లయితొలగించండి


 13. దీనుల కాపాడంగన్
  మా నడిమధ్య నగుపడిన మా దైవమ్మా!
  కోనాడుల తిరుమలవా
  సా! నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. సానుల సంపర్కముతో
  నే నెంతయు పేదనైతి , నెర నమ్మితి స్వా
  మీ ! నిను వేంకట గిరివా
  "సా ! నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్"

  రిప్లయితొలగించండి
 15. 25, అక్టోబర్ 2018, గురువారం
  సమస్య -
  "సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్"

  నా పూరణ: కందము
  **** **** **** **** ****

  ఓ నారీ!నా యలివే

  ణీ!నా హృదిమందిరమున నిలిచిన దేవే

  రీ!నిను వీడ నెపుడు మన

  సా! నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్!


  🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2826
  సమస్య :: సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగగన్ సౌఖ్యంబు సత్సంపదల్.
  “రాత్రి పగలు ఎల్లప్పుడూ *సానికి* సేవ చేస్తాను సుఖము కలగాలి, సంపదలు కలగాలి అనే కోరికతో” అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: కలియుగ ప్రత్యక్ష దైవమా! ఓ వేంకటేశా! నిన్నే కీర్తిస్తాను. ఓ శేషాద్రివాసా! తిరుమలకు వచ్చి నీ సేవలలో తరించాలని కోరుకొంటాను. ఓ జగదీశా! నీకు మ్రొక్కుతాను. ఓ శ్రీనివాసా! నిన్నే కొలుస్తాను. ఓ వైకుంఠవాసా! రాత్రి పగలు ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తాను. ఓ భక్తదాసా! నీవు సమస్త సౌఖ్యములను, సకల సంపదలను అనుగ్రహిస్తావని భావిస్తాను అని ఒక భక్తుడు గోవింద నామాలను పలుకుతూ ఏడుకొండల స్వామిని ప్రార్థించే సందర్భం.

  నే నిన్నెంచెద, కోరెదన్ తిరుమలన్ నీ సేవ, శేషాద్రివా
  సా! నిన్ జూచెద, దివ్యభూష! సువిలాసా! శ్రీశ! సద్భక్తదా
  సా! నిన్ మ్రొక్కెద వేంకటేశ! జగదీశా! సద్యశా! శ్రీనివా
  సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగగన్ సౌఖ్యంబు సత్సంపదల్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (25-10-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సవరణతో
   గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
   సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2826
   సమస్య :: సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగగన్ సౌఖ్యంబు సత్సంపదల్.
   “రాత్రి పగలు ఎల్లప్పుడూ *సానికి* సేవ చేస్తాను సుఖము కలగాలి, సంపదలు కలగాలి అనే కోరికతో” అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
   సందర్భం :: కలియుగ ప్రత్యక్ష దైవమా! ఓ వేంకటేశా! నిన్నే కీర్తిస్తాను. ఓ శేషాద్రివాసా! తిరుమలకు వచ్చి నీ సేవలలో తరించాలని కోరుకొంటాను. ఓ జగదీశా! నీకు మ్రొక్కుతాను. ఓ శ్రీనివాసా! నిన్నే కొలుస్తాను. ఓ వైకుంఠవాసా! రాత్రి పగలు ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తాను. ఓ భక్తదాసా! నీవు సమస్త సౌఖ్యములను, సకల సంపదలను అనుగ్రహిస్తావని భావిస్తాను అని ఒక భక్తుడు గోవింద నామాలను పలుకుతూ ఏడుకొండల స్వామిని ప్రార్థించే సందర్భం.

   నే నిన్నెంచెద, కోరెదన్ తిరుమలన్ నీ సేవ, శేషాద్రివా
   సా! నిన్ జూచెద, దివ్యభూష! సువిలాసా! శ్రీశ! సద్భక్తదా
   సా! నిన్ మ్రొక్కెద వేంకటేశ! జగదీశా! సద్యశశ్శ్రీనివా
   సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగగన్ సౌఖ్యంబు సత్సంపదల్.
   కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (25-10-2018)

   తొలగించండి
  2. కోట వారూ,
   మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 17. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన :-


  { నేటి సినిమాలలో చెత్త చెత్త పాటలు వ్రాసే ఒక

  " కవి " ఇలా వాదించాడు }

  **************************************


  నన్నయ తిక్కనాదులు ఘనంబగు భాష రచించి | రింతలో

  చిన్నయసూరి వ్యాకృతి వచించె - మరింత నశక్యమౌగతి ,

  న్నెన్నగ రాని సూత్రముల నెన్నియొ జేర్చుచు ‌|| నందుబాటులో

  నున్న పదార్థముల్ దినుచు నుందు | మి కంతియ గాని , యేరికిన్

  మిన్నున వ్రేలు వస్తువుల మ్రింగుట సాధ్యమె ? బాష యన్నచో

  బిన్నకు గూడ నర్థ మయి పేరిమి కూరిమి గూర్చగా వలెన్ |
  |
  చిన్నయసూరి చేత మృతిజెందె నయో మన తెన్గుబాసయే

  " చిన్నది పెండ్లియాడు నని చెప్పిన " చాలును | చెప్ప నేటికిన్

  " యన్నువ పాణిబంధమున కై తన స్వీకృతి దెల్పె " నటంచు సత్కవీ


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   చివరి పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 18. సేనాపతీ!కపాలి!భ
  వానీపతి!లింగమూర్తి!వాజసనా కా
  శీనాధా!శ్రీ గిరివా
  సా!నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్"

  రిప్లయితొలగించండి
 19. (2)
  ఆనందమ్మున డెందమందు సత మీ వర్చాకృతిన్ నిల్వఁగా,
  నీ నామామృత మెల్లఁ గ్రోలుచు వెసన్, నీ సేవనున్మగ్నునై,
  మేనం బుల్కలు మొల్కలెత్త, భువిపై మిన్నంటు శ్రీశైల వా
  సా! నిన్ గొల్చెద రేఁబవల్, గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్!

  రిప్లయితొలగించండి
 20. ఓ ! నా కన్నయ ! ఏమి లీల లివి ! ఏ యోగమ్మునే జేసితిన్ !
  నే నీ తల్లినె ! నీవె తండ్రివి కదా ! నీ విశ్వరూపమ్ము నా
  మేనన్ చేతన నింపె , ధన్యనయితిన్ మేలైన దీ జన్మ వ
  త్సా ! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్"
  (శ్రీకృష్ణుని విశ్వరూపం చూసిన యశోదమ్మ ఇలా సంభ్రమం తో పలికింది. నీవే తండ్రివి అనేసింది. కానీ ఆ సహజప్రేమ తో మళ్లీ వత్సా అని కొడుకుని పిలిచినట్లే పిలిచింది.)

  రిప్లయితొలగించండి
 21. దానవ వైరి కపాలీ!
  పూనికతో నిన్ను గొల్తు పురహర శంంభో!
  మానక నే వచసా మన
  సా, నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్"

  రిప్లయితొలగించండి


 22. కోనాడుల్ నిను గాంచిరే ద్రుహినుడా ! కొండల్ నివాసమ్ముగా
  నీనామమ్ముల సుప్రభాతముగ నా నెమ్మాను రీతిన్ సదా
  శ్రీనాథుండ!అధోక్షజుండ! అజుడా! శ్రీమంతుడా! శ్రీనివా
  సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈనాడు ఇప్పటివరకూ 23 సంబోధక చిహ్నాలు (!) వచ్చె మీ పూరణలలో. ఏదో కోటా ఉందని విన్నాను ఎప్పుడో. న్యస్తాక్షరిలో కామోసు...దత్తపదిలోనా? తెలియదు...

   __/\__

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 23. నేనెక్కలేను కొండల
  మేనునకా శక్తి లేదు, మించిన భక్తిన్
  నేనిక్కడ, తిరుమల వా
  సా!నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్.

  రిప్లయితొలగించండి
 24. మేనునుగాపాడంగను
  మీనము మేషాలలెక్క మీరుటకంటెన్
  షీనానామకయాదొర
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యములందన్


  రిప్లయితొలగించండి
 25. నీ నామమె భవ హరమని
  నే నమ్మితి చక్రధారి నీరజ నేత్రా
  శ్రీనాథా తిరుమల వా
  సా! నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  రిప్లయితొలగించండి
 26. ఆ నలువ కన్న తండ్రీ!
  మానసమున నిలుపు కొందు మరువక యెపుడున్!
  పూనికతో తిరుమల వా
  సా!నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్"
  ****)()(****
  (....మరువక నెపుడున్ ?)

  రిప్లయితొలగించండి


 27. శ్రీనాథా!హరి! వేంకటేశ! ధరుడా!శ్రీజాని!శ్రీకాంతుడా!
  మానారాయణ!నల్లవేల్పు దొర! రమ్మా మాధవా!శ్రీకరా!
  నానా రీతుల పద్యమాలికల నేనర్చించుచున్ శ్రీనివా
  సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. నే నిన్ అనయము యొజ్జియ
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్
  సానునయమున గురుని సే
  వే నిత్యము దలచిన నిను వేడుకతోనే

  రిప్లయితొలగించండి

 29. రమేశావారు చలించలేదు కాబట్టి :)


  తానిల్లాలయ!నెత్తిమాసినదయా!తానేడ్చు కాంతామణీ!
  తానో?స్వైరిణి!ఱంకుటాలు!సుఖమున్తాగూర్చు మేల్బంతి గా
  కాణేలీ!భళితళ్కులీను నడకల్ కవ్వించి నవ్వించు రా!
  సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాన్-ఛంధోరీతిగా నేనేమి చలింతును
   నాశైలి పండితులు మెచ్చనిది
   "జాంగ్రీయమ్" కదా !!!!

   తొలగించండి

  2. అబ్బే వచనంలో వచన కవిత్వం లో యే ముందు కిక్కు ? ప్రయత్నించండి ఛందాన్ని మెదడుకు కిక్కేకిక్కు

   Want ti become more sharp against ageing ?
   Come and play Chandas :)   జిలేబి

   తొలగించండి
 30. ఆనందంబున మున్గుచు
  నీనామంబును స్మరించి నిర్మల మతితో
  నేనిరతము తిరుమల వా
  సా! నిన్ గొల్చెద నమేయ సౌఖ్యములందన్!

  రిప్లయితొలగించండి
 31. మానగరము మంగళగిరి,
  నోనరసింహా! వెలసితి వుర్వీధరమున్
  పానకముఁ గ్రోలు గిరివా
  సా! నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  రిప్లయితొలగించండి
 32. సమస్య :-
  "సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్"

  *కందం**

  జాను తెనుగున రచించుచు
  వీనుల విందుగ నిరతము వెలయించుచు నే
  గానముచే తిరుమల వా
  సా; నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్
  ........................✍చక్రి

  రిప్లయితొలగించండి
 33. ఊనిన భక్తి సతమ్మును
  మానిత సు మనోర థౌఘ మయ చిత్తుండన్
  నే నుడ్డకేలు వేలుపు
  సానిం గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  [ఉడ్డకేలు వేలుపు సాని = విష్ణువు భార్య, లక్ష్మీ దేవి]


  నానా భూత గణాధి పత్య విల సన్మాన్యా సు కైలాస వా
  సా నాగేంద్ర వరావతంస నుత మూర్ధాలంకృ తేందు ప్రభా
  మౌనీం ద్రామర సిద్ధ యక్షవర రంభా భవ్య సేవా ప్రభా
  సా నిం గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్

  రిప్లయితొలగించండి
 34. ఆటవిడుపు సరదా పూరణ
  (జిలేబి గారికి అంకితం)

  రానిమ్మంచును భాజపాను రణమున్ రాద్ధాంతమున్ జేయగా
  దీనారమ్ములు లేక నా కడనయో దీనుండ నైతిన్ గదా
  వానిన్ వీనిని నేల కొల్చుట మహా భాగ్యంపు కాంగ్రేసు దొ
  ర్సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ వృత్త పూరణలలో నేను వ్రాయాలని ప్రారంభించేదొకటీ, గణ యతి ప్రాస అన్వయ నిబంధనలతో తీరా వ్రాసేదొకటీగా ఉన్నది సార్! రెండూ నవ్వులాటకేననుకోండీ...కష్టే న ఫలే!

   తొలగించండి

  2. సంస్కృత ఛందస్సు కు మారి పోవాలె :) తెలుగు యతి ప్రాసల కష్టాల్ కొంతలో కొంత తప్పి పోతాయి :)

   తొలగించండి
  3. ఉట్టికెక్క లేనమ్మ స్వర్గానికెక్కుటా? తెలుగు వృత్తాల నడక భలే భలే!

   తొలగించండి

  4. కాదండి.
   ఇదే శార్దూలాన్ని ఇంత కష్ట పడకుండా రాయవచ్చు :)

   జిలేబి

   తొలగించండి


  5. రారాయంచును భాజపాను రణమందున్బిల్చి రాద్ధాంతముల్
   దీనారమ్ములు లేక నా కడ నరే దీనుండ నైతిన్ గదా
   వానిన్ వీనిని నేల కొల్చుటికయేలా! నేను కాంగ్రేసు దొ
   ర్సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్


   సిమ్ప్లిఫైడు :) నో యతి నో ప్రాస struggles :)


   తొలగించండి


  6. శాస్త్రీజీ! యిది సాంపిలయ్య మనకై మాట్లాడు రీతిన్ భళా!
   భాజ్పావాళ్ళను కొట్టి వేయ పథకం వేసారు కాంగ్రేసు వా
   ళ్ళంతా వచ్చెడు యెన్నికల్ తెలుపు సామీ వాళ్ళ ప్లానింగు మీ
   రిట్లారాయుచు వృత్తమందు కతలన్ కట్టండి మేల్గాంచగా!


   జిలేబి

   తొలగించండి
 35. నానాభావనిబద్ధరాశికలితామ్నాయమ్ములం దీర్చి, సం

  ధానార్థమ్ము రచించితోయి! మహిఁ దద్వ్యాప్తిం బురాణమ్ములన్

  దీనోద్ధారణకృష్ణవక్త్రవిలసద్గీతోక్తి వెల్గొంద, వ్యా

  సా! నిన్ గొల్చెద రేబవల్ గలుగగన్ సౌఖ్యమ్ము సత్సంపదల్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 36. ఓనారాయణ గోవిం
  దా!నను కాపాడుమంచు ద్రౌపది వేడన్
  మానిని గాచిన శ్రీవ
  త్సా! నిన్ గొల్చెదనమేయ సౌఖ్యములందన్

  రిప్లయితొలగించండి
 37. ఆనందము జేకూర్చుచు
  నీ నేలను బుట్టిన జను లెల్లర బ్రోవన్
  బూనుమయా తిరుమల వా
  సా! నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్!

  రిప్లయితొలగించండి
 38. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 39. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  సందర్భము: *లక్ష్మీ ప్రార్థన*
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  శ్రీ నళినాక్షుని దేవిని

  మానక కొలిచెదను నేను మధురిపు పత్నిన్

  దీనత దొలుగగ సిరి దొర

  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  25.10.18
  -----------------------------------------------------------
  ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్
  సౌఖ్యంబు సత్సంపదల్

  సందర్భము: *హనుమత్ ప్రార్థన*
  ఇందలి విశేషం.. గానానన్.. చిత్తానన్.. భిన్న విభక్తులలో ప్రయోగం ఒకే పద్యంలో..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  గానానన్ నిను గొల్తు నో పవనజా!
  గంభీర పద్యంబులన్
  నే న ప్డప్పుడు తోచినంత వరకే
  నిన్ గొల్తు; కారుణ్య చి
  త్తానన్ నన్ గనిపెట్టి యుండగదవే
  తండ్రీ! సదా రామ దా
  సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్
  సౌఖ్యంబు సత్సంపదల్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  25.10.18
  -----------------------------------------------------------
  శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో

  రిప్లయితొలగించండి
 40. జ్ఞానుల్లర్థులు దీనులార్తులును జిజ్ఞాసన్ప్రయత్నించరా
  నీనామంబిలనాల్కకాభరణమౌనీధ్యాసయే జీవనం
  బౌనారాయణమాధవాచ్యుతహరీ ప్రాణంబువౌశ్రీనివా
  సా!నిన్ గొల్చెదరేబవల్ గలుగన్ సౌఖ్యంబుసత్సంపదల్

  రిప్లయితొలగించండి
 41. మేనున్ బూదిని దాల్చునట్టి ఘనుడా మృత్యుంజయా భక్తితో
  నీనామంబది మాకు రక్షయని నే నిత్యంబు సేవించి ది
  వ్యానందమ్మును బొందితిన్ భవహరా ఫాలాక్ష కైలాస వా
  సా నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్ సౌఖ్యంబు సత్సంపదల్

  రిప్లయితొలగించండి
 42. జ్ఞానము నిచ్చెడు తల్లిని
  నే నిత్యమ్ము భజియింతు నీరజ నేత్రీ
  వాణీ నా మనసా వచ
  సా నిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

  రిప్లయితొలగించండి
 43. కం.
  బాణంబు నెక్కుపెట్టగ
  జానకిని పరిణయమాడె జనకుడు మెచ్చన్,
  శ్రీనామ! భుజబలవికా
  సా! నిన్ గొల్చనమేయ సౌఖ్యములందన్

  రిప్లయితొలగించండి
 44. వీనుల విందగు మురళీ
  గానమ్మును వినుచు మదిని గాంచుచు నిన్నే
  మానక మధురాపురి వా
  సా, నిన్ గొల్చిన నమేయ సౌఖ్యము లందన్!!!

  రిప్లయితొలగించండి
 45. మానుగ నిన్నే గొలిచెద
  నేనెప్పుడు విడక భువిని నిశ్చయ మిదియున్
  దానివి శ్రీ తిరుమల వా
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్.


  :జాణవు వరముల నొసగెడి
  చానవు ,కొలిచిన సతతము జనులకు జగతిన్
  మానిత ముగ ,శ్రీహరి దొర
  సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్.

  రిప్లయితొలగించండి
 46. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  సానిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్
  సౌఖ్యంబు సత్సంపదల్

  సందర్భము: *కృష్ణ ప్రార్థన*
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఆ నాడున్ కఫ వాత పిత్తములు న
  న్నాయాస పెట్టంగ నే
  గానానందమునందు నీదు టెటులో
  కాలంబు పైకొన్నచో..
  నీనా డీదవె కృష్ణ భావ సుధయం
  దే! నా మనోరాజ హం
  సా! నిన్ గొల్చెద రేఁబవల్ గలుగఁగన్
  సౌఖ్యంబు సత్సంపదల్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  25.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి