కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)
(లేదా...)
"నవరాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్"
(లేదా...)
"నవరాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్"
నవవిధ ములపూ జించగ
రిప్లయితొలగించండినవనిని పాలించు దేవి నారా యణియే
భవబంధ ములకు దూరము
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు.
అవనీపతి శ్రీరాముడు
రిప్లయితొలగించండిచవిగొని రావణుని దునుమె సప్తమి మొదలై
చివరను దశమిని వరకును...
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
ప్రభాకర శాస్త్రి గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు.
వివరింపగ మూలాదిగ
రిప్లయితొలగించండిశ్రవణమ్ము వరకు జరిపెడు సంబరములవే
యవనిని పేరొందిన శర
న్నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. *పేరొందు శర | న్నవరాత్రోత్సవము...* అనండి.
నిన్న ఆకాశవాణిలో మీ పూరణను సవరించి పఠించాను.
రిప్లయితొలగించండిప్రవరాఖ్య! వరూధినిన
య్య! వరించితి నార్యుడ!యిభయానను రమ్మా
నవరస నాయికనయ్యా
"నవరాత్రోత్సవము" లొప్పు నాలుగు దినముల్!
జిలేబి
రిప్లయితొలగించండిజవరాలా వేడుక గా
"నవరాత్రోత్సవము" లొప్పు నాలుగు దినముల్,
తవణించగన్ దినములు న
లువది,మదిని చిలుకవలె కలుగ భావనలున్ !
జిలేబి
జిలేబీ గారూ మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిదివి జులు మె చ్చు విధం బు గ
రిప్లయితొలగించండినవ రాత్రో త్సవ ము లొ ప్పు; నాలుగు దిన ము ల్
కవన ము ల వ ధానమ్ములు
కవుల కు సన్మాన ము లు ను ఘన ముగ జరుగున్
రాజేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికవితా ! మొన్ననె వచ్చియుంటివి గదే ! కంగారుగా నప్పుడే
యవలోకించుచునుంటి వెళ్లుటకు , వృద్ధావస్థయందున్న మా..
కవకాశంబిది మన్మలన్ గనుచునాటాడంగ , నింకెంత ? యా
నవరాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅల్లుడు నాలుగంటే ఒల్లడు..
తొలగించండినవవస్త్రవాహనములును
నవరుచులును నెంచ మూడునాళ్లే కదరా !
భువి పండుగ యన., నెట్లగు
నవరాత్రోత్సవములొప్పు నాల్గు దినంబుల్??!!
తొలగించండిమూడుంటే మూడేమి నాల్గు నలువది యేదైనా ఓకే యనడా అల్లుడు :)
మైలవరపు వారు విజయనగరంలో రేపు జరిగే వారి అవధానానికై వెళ్ళి ఉన్నారు
తొలగించండి
తొలగించండిఅవధానశేఖరలు మై
లవరపు మురళీ వరుల్ భళ!విజయ నగర
మ్ము వసతి గా అవధానము !
రవణించును పట్టణమ్ము రావె జిలేబీ :)
జిలేబి
అవనిన్ భక్తిని పూజలం దుకొన దైవంబంచు నాతల్లి యే
రిప్లయితొలగించండిభవబం ధమ్ములు వీడిచిత్త మలరన్ భావాను భూతిన్ గనన్
పవళిం చంగను సేవలందు కొను నావైష్ణ విదీవిం చగన్
నవరత్రోత్స వముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు
మూడవ పాదంలో గణదోషం సవరించండి
అవనిన్ భక్తిని పూజలం దుకొన దైవంబంచు నాతల్లి యే
తొలగించండిభవబం ధమ్ములు వీడిచిత్త మలరన్ భావాను భూతిన్ గనన్
పవళిం చంగను సేవలందు కొను నావాగ్దేవి దీవిం చగన్
నవరత్రోత్స వముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్
👌
తొలగించండిశివమగు పండుగ దసరా
రిప్లయితొలగించండిస్తవనీయము అమ్మ పూజ సప్తమి యందున్
ప్రవచననియమంబులతో
నవరాత్రోత్సవములొప్పునాలుగుదినముల్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీర్పేట్ ,రంగారెడ్డి
రాధాకృష్ణారావు గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు.
"స్తవనీయ మ్మమ్మ పూజ" అనండి.
జవమేల సంబరాలకు
రిప్లయితొలగించండిస్తవనీయా! గ్రీష్మమగుట చా లురుదీక్షల్
పవలందు వలదువిను మభి
నవ! రాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు
నవదుర్గలునొకచోటన
రిప్లయితొలగించండిబ్రవిలంబగుభక్తితోడభాజితులవగా
బవలునురేలునుజేయగ
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
సుబ్బారావు గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు
భవునర్థాంగి స్తుతులతో
రిప్లయితొలగించండినవరాత్రోత్సవము లొప్పు, నాలుగు దినముల్
కవిసమ్మేళనములతో
నవధానమ్ములును జరుగు నద్భుత రీతిన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు
చవులూరించెడి శోభల
రిప్లయితొలగించండినవరాత్రోత్సవము లొప్పు--నాలుగు దినముల్
చివరివి సాగగ,మేలగు
నవతారంబులనుఁజూపి యమ్మ హసింపన్.
ప్రసాద రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండిధన్యవాదములు
తొలగించండికవులూరు గ్రామమందున
రిప్లయితొలగించండినువిదలు పండుగలఁ జేయ నొడివిరి; చందా
ల వెలితి వలనన్ జరుపఁగ
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.
వివరింప వేంకటేశ్వరు
రిప్లయితొలగించండిస్తవనీయ క్షేత్రమున వసతి పరిమితమై
యవలోకింపఁగ మాకున్
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.
గురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించండికవనము నాకవన౦బగు
నవరాత్రోత్సవము లొప్పు ,నాలుగు దినముల్
కవి విరహ దినములుగద
భవబందురసు౦దర౦బు పరిమళ మగునే.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅవకాశంబిది మాకు లెక్కగన నయ్యారే తటాల్మంచు త
ట్టె వరంబై నవరాత్రి, యంకెయును తట్టెన్నాల్గనన్వేదముల్,
నవలోకింపగ వేదమాత గలదన్నా సర్వలోకంబునన్
నవరాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2821
సమస్య :: నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్.
నవరాత్రి ఉత్సవాలు నాలుగు రోజులే అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
వసంత నవరాత్రాలు, గణపతి నవరాత్రాలు, శరన్నవరాత్రాలు అని నవరాత్రోత్సవాలను మనం జరుపుకొంటూ ఉంటాం.
శరదృతువులో ఆశ్వయుజ మాసంలో మొదలయ్యే శరన్నవరాత్రములను దేవీ నవరాత్రములు అని కూడా అంటాము. పదవరోజు విజయదశమితో కలుపుకొని దసరా పండుగ అని అంటాము.
శక్తి ఆరాధనకు ప్రాధన్యతనిస్తూ అమ్మవారిని క్రమంగా బాలాత్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, కాత్యాయనిగా, లలితా దేవిగా, శ్రీమహాలక్ష్మిగా, సరస్వతిగా, మహిషాసురమర్దినిగా, రాజరాజేశ్వరిగా అలంకరించి దర్శించి తరిస్తూ ఉంటాము.
ఒక భక్తుడు ఐదురోజులుగా అమ్మవారిని దర్శించి, నవరాత్రోత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడానికి లెక్కబెట్టుకొంటే ఇక నాలుగురోజులే ఉన్నాయి అని చెప్పే సందర్భం.
అవనిన్ బాలగ దర్శనమ్మిడెను, గాయత్రీ స్వరూపమ్ము క
న్గవకున్ గన్పడె, నన్నపూర్ణగను శ్రీ కాత్యాయనీ దేవిగా
నవలన్ గన్పడె దుర్గయే లలితగా, నాశ్చర్యమౌ మాకికన్
నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (20-10-2018)
సవరణతో
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2821
సమస్య :: నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్.
నవరాత్రి ఉత్సవాలు నాలుగు రోజులే అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
వసంత నవరాత్రాలు, గణపతి నవరాత్రాలు, శరన్నవరాత్రాలు అని నవరాత్రోత్సవాలను మనం జరుపుకొంటూ ఉంటాం.
శరదృతువులో ఆశ్వయుజ మాసంలో మొదలయ్యే శరన్నవరాత్రములను దేవీ నవరాత్రములు అని కూడా అంటాము. పదవరోజు విజయదశమితో కలుపుకొని దసరా పండుగ అని అంటాము.
శక్తి ఆరాధనకు ప్రాధన్యతనిస్తూ అమ్మవారిని క్రమంగా బాలాత్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, కాత్యాయనిగా, లలితా దేవిగా, శ్రీమహాలక్ష్మిగా, సరస్వతిగా, మహిషాసురమర్దినిగా, రాజరాజేశ్వరిగా అలంకరించి దర్శించి తరిస్తూ ఉంటాము.
ఒక భక్తుడు ఐదురోజులుగా అమ్మవారిని దర్శించి, నవరాత్రోత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడానికి లెక్కబెట్టుకొంటే ఇక నాలుగురోజులే ఉన్నాయి అని చెప్పే సందర్భం.
అవనిన్ బాలగ దర్శనమ్మిడెను, గాయత్రీ స్వరూపమ్ము క
న్గవకున్ గన్పడె, నన్నపూర్ణగను శ్రీ కాత్యాయనీ దేవిగా
నవలన్ గన్పడె మాతయౌ లలితగా, నాశ్చర్యమౌ మాకికన్
నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (20-10-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శివమగు పండుగ దసరా
రిప్లయితొలగించండిస్తవనీయమ్మమ్మపూజ సప్తమి యందున్
ప్రవచననియమంబులతో
నవరాత్రోత్సవములొప్పునాలుగుదినముల్
కొరుప్రోలు రాధాకృష్ణారావు
మీర్పేట్ ,రంగారెడ్డి
రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
========================
నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్
నాల్గౌ దినమ్ముల్ గనన్
=========================
నవరాత్రులను లెక్కించగ అవి నాలుగు
దినములుగానె కనబడుననుటలో గల
అసంబద్దతె ఇచట సమస్య
====================
సమస్యా పూరణం - 287
==================
దుర్గాష్టమికదె సాధారణము -
ఇచ్చిరి మహర్నవమికి ఐఛ్ఛికము
విజయ దశమికి సార్వజనీనము -
మరుసటి రోజుకు ఆకస్మికము
దసర మనకై విసిరినదనన్ -
సెలవులుగ మరి ఆస్వాదించితినన్
నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్ -
నాల్గౌ దినమ్ముల్ గనన్
====##$##====
సంకురాత్రి, శివరాత్రి, నవరాత్రి, నాకివేవియు
తెలియదు
తెలిసిందల్లా ఒకటే
మా యూనియనోళ్ళు పైసలు వసూలు చేసి
ఒక క్యాలెండర్ ఇచ్చిండ్రు, దాంట్ల దసర కోసం
ఎర్ర ఇంకుతో రెండు సెలవులు, పచ్చ ఇంకుతో
ఒక సెలవు ఉన్నయి, వాటికి తోడు పండుగైన
తెల్లారి(కరి/కనుమ) తిని తాగి ఊగనింకె "బ్లూ"
ఇంకుతో నేనొక సెలవు పెట్టుకున్న, గిట్ల నాకు
నాల్గు సెలవులు కలిసొచ్చినై.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం)
రమేశ్ గారూ,
తొలగించండిమీ భావానికి నా పద్యరూపం.....
అవలీలగ లభియించె సె
లవులివె సాధారణము భళా యైచ్ఛికముల్
భవదీయేచ్ఛను లెక్కిడ
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
స్తవనీయంబగు దినములు
రిప్లయితొలగించండినవరాత్రోత్సవము; లొప్పు నాలుగు దినముల్
భవతారిణి బహు ఘనమౌ
యవతారముల ప్రభవించి హర్షము గూర్చన్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఘనమౌ నవతారముల...' అనండి.
రిప్లయితొలగించండిరమేశా వారి భావనకు :)
కవ! సాధారణ మౌత రెండు దినముల్ కష్టమ్ముగా లీవుల
మ్మ! విహారమ్ముల చేయ నాల్గు దినముల్ మాకిచ్చి రీ పారి లీ
వు!వరంబిద్దియె మాకు కొల్వనగజా!వుడ్డూలమే,శాంభవీ!
నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్.
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిరమేశ్ గారి భావానికి మీ పద్యరూపం బాగున్నది. అభినందనలు.
మీరు వ్రాసిన విషయాన్ని గమనించక నేను కందం వ్రాసాను.
ధన్యవాదములు - కృతజ్ఞతలు
రిప్లయితొలగించండిదివిజనిన పితరదేవుల
రిప్లయితొలగించండినవతారము దాల్చినట్టి యమ్మలముగురన్
భువినర్చించిన విధిగన
నవరాత్రోత్సవములొప్పు నాలుగుదినముల్
శంకర్ జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పితర దేవుల' అనడం సాధువు కాదు. "దివి కేగిన పితృదేవుల" అనండి.
అవనీసురలవనీధవు
రిప్లయితొలగించండిలవనిన్ వైశ్యుండ్రుశూద్రులపరాజిత శాం
భవినర్చింతురు బత్తిన్
నవరాత్రోత్సవములొప్పు నాలుగు దినముల్
శంకర్ జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్తవనీయోత్సవమేగుదెంచెమహికిన్ దైత్యాన్వయంద్రుంపగా
రిప్లయితొలగించండిశివపుత్రోదయమొండు మూషికుని నిర్జింపన్ విధాతోత్సవం
బవనిన్ వేంకటనాధుకున్గలిని సంప్రాప్తించె దుర్గమ్మ కే
నవరాత్రోత్సవముల్ గణింపగదగున్ నాల్గౌదినమ్ముల్ గనన్
శంకర్ జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దైత్యాన్వయం' అనడం వ్యావహారికం. అక్కడ "దైత్యాధిపుం ద్రుంపగా" అనండి.
వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
రిప్లయితొలగించండి"ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్"
మీ పూరణలను గురువారం లోగా
padyamairhyd@gmail.com
చిరునామాకు గురువారం సాయంత్రం లోగా
మెయిల్ చేయండి
నవ మన్మథుఁ డగు పతి సం
రిప్లయితొలగించండిభవమై తనరంగ నత్త వారింటను నూ
త్న వధూ వరులకు నింపుగ
నవ రాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
[నవము = కొత్త]
శివ లంకా పుర వాస భామిను లిటుల్ సెప్పంగ నే విన్నవే
యివి సద్వాక్కులు సత్యసంధ వన మత్తేభేంద్ర ఘీంకార వా
గవనీ నాథుఁడు రామచంద్రుఁడు పురంబందుండ గర్వాంధ దా
నవ రాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్
అద్భుతమైన పూరణలార్యా! నమోనమః!🙏🙏🙏🙏
తొలగించండిధన్యవాదములు డా. సీతా దేవి గారు. నమస్సులు.
తొలగించండికామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
అవురా! వచ్చిరె పండుగంచుచునయో యత్తయ్య మామయ్యలున్
దివికిన్ జేరెను మాలులో ధరలు సాధింపంగ బాధాయెనే
భవబంధమ్ములు వీడిపోవుటకునున్ పాకెట్ల ఖాళీకినిన్
నవరాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్
తొలగించండిఅవురా! మామాయత్తయు
క్షవరము చేయంగ పర్సు కలికాలములో
భవబంధమ్ములు కలయన్
నవ రాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్ :)
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
శాస్త్రి గారిని అనుస(క)రిస్తూ వ్రాసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువు గారికి నమస్కారములు ఈ వారం సమస్య తెలుప గలరు రాధాకృష్ణ రావు
రిప్లయితొలగించండిపైన పెట్టాను చూడండి.
తొలగించండిభువనేశ్వరి శ్రీమాతయె
రిప్లయితొలగించండినవదుర్గల రూపులందు నరులను బ్రోవన్
హవణిల్లగ ప్రతి చోటను
నవరాత్రోత్సవములొప్పు, నాలుగుదినముల్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవనిన్గాచగప్రాణికోటినిసదాతాదాత్మ్యభావంబునన్
రిప్లయితొలగించండివివిధాకారములొందుచున్ బ్రజకువేవేలన్గ దాకోరికల్
నవలీలంగనుదీర్చుగావుతను నాయామాతృమూర్తిత్రయపున్
నవరాత్రోత్సవముల్ గణింపగదగున్ నాల్గౌదినమ్ముల్గనన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మూర్తిత్రయిన్' అనండి. లేకుంటే గణదోషం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
రిప్లయితొలగించండినవదుర్గల సేవించ సె
లవు దొరకక నా సుపుత్రి రాకకు పట్టెన్
దివసమ్ములైదు, తనకిక
నవరాత్రోత్సవములొప్పు నాలుగు దినముల్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
(మా వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దమనిషి ప్రతివారం సమస్యాపూరణ కార్యక్రమాన్ని తప్పక వింటాడు. ఆయన ఇవాళ అన్న మాటలు "ఈరోజు పూరణలలో గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ అన్నిటికంటె ఉత్తమంగా ఉన్నది" అని.
గురుదేవులకు ధన్యవాదములు.నా పద్యమును అంతగా మెచ్చిన పెద్దలకు శిరసు వంచి పాదాభివందనములు
తొలగించండిదివిలో చాముండేశ్వరి
రిప్లయితొలగించండిభువిలో మైసూరుదసర పోకడజూడన్?
నవకాశములేకచివర
నవరాత్రోత్సవము లొప్పు నాలుగుదినముల్
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవితా చెప్పెద నాలకింపుమిది విస్తారమ్ము గా భక్తులే
రిప్లయితొలగించండియవనిన్ బాలగ నన్నపూర్ణగను గాయత్రిస్వరూపమ్ములన్
భవహారమ్మగునంచు యెంచినను సప్తమ్యాదులే ముఖ్యమై
నవరాత్రోత్సవముల్ గణింపఁగఁ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఆకాశవాణి సమస్యా పూరణ - 20th Oct 2018- యూ ట్యూబు లంకె :)
https://varudhini.blogspot.com/2018/10/20th-oct-2018.html
చీర్స్
జిలేబి
__/\__
తొలగించండిహరి యాదేవకి గర్భమందు జననంబందంగ నాడింభకున్
రిప్లయితొలగించండిపురిదాటింపగ కారలన్ వెడలు నప్పుణ్యాత్ము గంసానచే
ఖరదైత్యుం డొకడోండ్ర వెట్టగను చక్కంబెట్ట తల్చెం పితా
ఖరపాదార్చన మొక్కటే హితము గల్గంజేయు ముమ్మాటికిన్
శంకర్ జీ గారూ,
తొలగించండిబాగుంది మీ పూరణ. 'పుణ్యాత్ము గంసానచే'..? 'చక్కంబెట్టగా దల్చె తా' అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికరుణాసాగర! శంకరా! భవహరా! కాపాడుమోదేవరా!
రిప్లయితొలగించండినిరతంబీకలిబాధతొల్గగహరా ! నీవే గదా దిక్కనన్
పరమోదారదయాపయోధిజనతాభద్రా!రమాభ్రాతృశే
ఖర, పాదార్చన మొక్కటే హితముఁగల్గంజేయు ముమ్మాటికిన్ .
మీ, ఆచార్యలక్ష్మణపెద్దింటి యానాం.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀.................... నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
సందర్భము: శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు వైభవంగా చేయటం పరిపాటి.
వసతి లేని వారు కొందరు విజయ దశమికి నాలుగు రోజుల ముందు వచ్చే మూలా నక్షత్రం నాడు సరస్వతీ దేవిని ఆవాహన చేసి విజయ దశమి వరకు భక్తితో చేస్తారు.
కాబట్టి అవి ఒప్పవు. ఇవి ఒప్పుతాయి అంటే శోభిల్లుతాయి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
అవు నవును తొమ్మిది దినా
లవనిని జేయుదురు కాని
యవి యొప్పవులే!
చివరివి భక్తిగ జేతురు..
నవరా త్రోత్సవము లొప్పు
నాలుగు దినముల్..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
20.10.18
-----------------------------------------------------------