12, అక్టోబర్ 2018, శుక్రవారం

సమస్య - 2815 (జ్ఞానము లేనివాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జ్ఞానశూన్యుండు పొందె యశమ్ము సభను"
(లేదా...)
"జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్"

65 కామెంట్‌లు:

  1. చదువు సంధ్యలు లేకున్న చక్క జేయు
    ధనము మెండుగ నింటను తాండ వించు
    మనసు మంచిగ పదుగురి మంచి కోరు
    జ్ఞాన శూన్యుండు పొందెను గౌరవమును

    రిప్లయితొలగించండి
  2. ఇల్లు వాకిలి వీడుచు తల్లినియును
    వేద వేదాంత మరయుచు;...విత్త మందు
    లాభ నష్టమ్ము లరయక లౌక్యమైన
    జ్ఞానశూన్యుండు పొందెను గౌరవమును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డీల్...
      నా పద్యం మీద వ్యాఖ్యానించండి..మీ పద్యం మీద వ్యాఖ్యానిస్త..😁😇

      తొలగించండి
    2. గురువుగారు రారు కదా!
      ఎవ్వరూ నన్ను పట్టించుకోరాయె...
      కిం కర్తవ్య హా!😭

      తొలగించండి
    3. అయ్యా! భయం భయంగా ఉంటొంది! BP కూడా పెరుగుతోంది నాకు. జిలేబీ గారే సమర్ధులు దేనికైనా...

      ___/\___

      తొలగించండి

    4. విట్టుబాబు గారు,

      అడిగారు కాబట్టి లేహ్యము మారిస్తే పూరణ సరిపోతుంది . మీరు సత్వర చర్యలు గైకొనవలె :)


      మానవ సత్వరమ్ము కృశమధ్యమలేహ్యము మీకు గావలెన్ :)

      జ్ఞానము పొందగోరు జన జాలమ! నమ్ముడు నాదు మాటలే!
      పూనికఁ బట్టుడీ యనెద పూర్వపు వైద్య రహస్యమే సుమా
      మానవ సత్వరమ్ము కృశమధ్యమలేహ్యము గైకొనంగనే
      జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్" :)


      నారదా!
      జిలేబి

      తొలగించండి
    5. ధన్యవాదాలు
      జీపీయశోత్తమా!
      మీ పూరణ ప్రశస్తం!
      👌🏻😄🙏🏻💐

      తొలగించండి
    6. ధన్యుడను జిలేబీ గారూ! ప్రణామాలు
      😃🙏🏻🙏🏻

      కృశమధ్యమ లేహ్యము అనగా...

      తొలగించండి
    7. "అంగన లేహ్యము"

      అయ్యా!మీరు జిలేబి గారి వలలో పడ్డారు...ఇక అంధ్రభారతియే గతి:

      http://www.andhrabharati.com/dictionary/

      తొలగించండి
  3. 5:12 AM

    జ్ఞానమె యిడును ప్రఖ్యాత ఖ్యాతి మనకు
    జ్ఞానమె పరువురి మెప్పుకు కారకమగు
    జ్ఞానమె తెలుపు మంచిని గాన నెటుల
    జ్ఞానశూన్యుండు పొందెను గౌరవమును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 5:12 AM

      జ్ఞానమె యిడును ఘనకీర్తి చక్కగాను

      జ్ఞానమె పదుగురి కడు ప్రశంసనిడును

      జ్ఞానమె తెలుపు సర్వము గాన నెటుల

      జ్ఞానశూన్యుండు పొందె యశమ్ము సభను


      🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
      🌷 వనపర్తి🌷

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    ధీనిధిఁ జేయుమమ్మ ! వినుతింతును వచ్చియు రాని మాటలన్ ,
    శ్రీనిధివీవు , నా హృదయసీమ వసింపవె వాణి , యంచు దాన్
    దీనత గోర తల్లి కరుణించెను , ముందుగ సుంతయేని వా...
    గ్జ్ఞానము లేనివాఁడు ఘన గౌరవ దీప్తుల నందె సత్సభన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    రిప్లయితొలగించండి


  5. దాటె జపతపాదుల నెడదన సిరసున
    దాల్చి కర్మమార్గమునందు తాను దిట్ట
    గాంచి భకిమార్గమును మది గాన నతడు,
    జ్ఞానశూన్యుండు, పొందెను గౌరవమును!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. దాటె జపతపాదుల నెడదన సిరసున
      దాల్చి కర్మమార్గమునందు తాను దిట్ట
      గాంచి భకిమార్గమును మది గాన నతడు,
      జ్ఞానశూన్యుండు, పొందె యశమ్ము సభను.

      జిలేబి

      తొలగించండి
    2. టైపాటున్ సవరించు మమ్మ "భకి"లో ఠంచన్ను ఠంచన్నుగా

      తొలగించండి

    3. టై పాటు కాదండోయ్ సరియైన వ్యుత్పత్తి యే. పరిశోధించుడీ :)


      జిలేబి

      తొలగించండి

  6. జ్ఞాన మెరుగక వాళ్మీకి హీనుడగుచు

    బాటసారుల దోచుచు బ్రతుకు నీడ్చె!

    నారదుని కరుణ పరమజ్ఞానియగుచు

    రమ్య రామాయణము వ్రాసి రాజితముగ

    జ్ఞానశూన్యుండు పొందెను గౌరవమును

    🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷 వనపర్తి🌷


    రిప్లయితొలగించండి
  7. అమ్మ దయవున్న నెవరైన నందలమ్ము
    నెక్కవచ్చు,తల్లి దయయే చిక్కులన్ని
    దీర్చు,కాళిదాసు కిడగ దేవి కరుణ
    ఙాన శూన్యుండు పొందెను గౌరవమును

    రిప్లయితొలగించండి
  8. కవిమిత్రులకు మనవి.
    ముందుగా యతిదోషంతో సమస్యను ఇచ్చాను. మైలవరపు మురళీకృష్ణ గారు సవరణను సూచించారు. ఇప్పుడు సమస్యను మార్చాను. గమనించి పూరించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. తానము తప్పిన 'గౌరవ' మునకు కూడ 'యతి' దోషము తప్పదోయ్ :)


      జిలేబి

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. యతిదోషయుత సమస్యా పాదమును ప్రజ్ఞాపాటవములతో నభంగయతి పాదముగా మార్చి సమస్యను పూరించుటయు నొక ప్రక్రియగా భావించ వచ్చును కదా!
      కవివరేణ్యులు మురళీ కృష్ణ గారు కృతకృత్యు లయ్యారు. వారికి నభినందనలు.
      నే నదృష్ట వంతుడనే. నేను సమస్యను జూచు తరి సవరించిన పాదమే కలదు.

      తొలగించండి
    3. అంతియే కాదు మీరిచ్చిన సమస్యా పాదము
      “జ్ఞానము లేనివాఁడు ఘన గౌరవ దీప్తుల నందె సత్సభన్" లో “జ్ఞా - గౌ లకు యతి చెల్లుతుంది. అది విశేష యతి.

      విశేషయతి :- ‘జ్ఞ’తో క, ఖ, గ, ఘ లకు యతి చెల్లడం. దీనిని అప్పకవి యొక్కడే చెప్పినాడు.
      ఉదా-
      *జ్ఞానికి నుపదేశవిధిఁ బ్ర*కాశము సేయం... [భారత.శాం. ౪.౨౫౫] ఇందు “ప్రజనితము సేయం” అని పాఠాంతరము గలదు.
      *కర్మ మధర్మ మ*జ్ఞాన మాగడము [పండితా.పురాతన. ౨౮౪ పు.]
      *జ్ఞానేంద్రియజ్ఞాన*కళ లౌరుసౌరుగా [కాశీ. ౧.౧౩౯]

      తొలగించండి


  9. దానము చేసె నెల్లరకు తాను సహాయము చేసె నెప్పుడున్
    గానము చేసె నీశుని సకాలము నందు జనాళి మానమున్
    ప్రాణము గావ శక్తి తన పాలిటి చేయగ; డంబు టెక్కు, య
    జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. కాళికా మాత కృప చేత కవిగ మారి
    కాళి దాసా ఖ్యు డని తాను ఘనత నొంది
    రచన చేసెను కావ్యాలు రమ్య ముగను
    జ్జ్ణా న శూన్యుoడుపొందెను గౌరవమును

    రిప్లయితొలగించండి
  11. స్వానుభవమ్ము శూన్యమిక, శబ్దసమర్థసమాససంధివి

    జ్ఞానము, వారసత్వమును, సజ్జనసంగతి, యంతమాత్రమే

    యైనను కాళిదాసు కవితాకృతిఁ దాల్చె, సరస్వతీకృపన్

    జ్ఞానము లేనివాడిల యశమ్మును బొందెను జూడ సత్సభన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  12. సార్థకాఖ్య విద్యాధరి ; సన్నుతాంగి ;
    రాజపుత్రికపై పగ రాజుకొనగ
    తంత్రమతియౌచు తెచ్చెను మంత్రి వెదకి
    కాలు డనువాని ; మేకల గాచువాని ;
    రాజసభలోన నటనము రాజిలంగ
    జ్ఞానశూన్యుడు పొందెను గౌరవమును .

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈరోజు ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రంలో 'సమస్యాపూరణ' కార్యక్రమాన్ని రికార్డ్ చేయడానికి వెళ్తున్నాను. సాయంత్రం వరకు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  14. ఆ విరించిరాణి కరుణ నాదరించి
    చేర తనగళమందున చెన్నుగాను
    పలికి పద్యరత్నములను సులువుగ, భువి
    జ్ఞానశూన్యుండు పొందెను గౌరవమును

    రిప్లయితొలగించండి
  15. గొల్ల వాడైన కాళిక నుల్ల మందు
    జపము తపముల సాధించి సంద డించి
    గొప్ప పండితు డాయెను మెప్పు పొందె
    జ్ఞాన శూన్యుండు పొందె యశమ్ము సభను

    రిప్లయితొలగించండి
  16. సరదాగా..😁

    జ్ఞానము పొందగోరు జన జాలమ! నమ్ముడు నాదు మాటలే!
    పూనికఁ బట్టుడీ యనెద పూర్వపు వైద్య రహస్యమేగ, వా
    రానికి పైన నా ఘన సరస్వతి లేహ్యము జప్పరించి యా
    *"జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్"*

    రిప్లయితొలగించండి
  17. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    జ్ఞాన శూన్యుండు పొందెను గౌరవమును

    సందర్భము: అజ్ఞాన మనే ముల్లును జ్ఞాన మనే ముల్లుతో తీసివేయాలి. అప్పుడు జ్ఞానంతో ప్రయోజనం నెరవేరింది కదా! రెండు ముండ్లే కాబట్టి మొదటి ముల్లుతో బాటు రెండవ ముల్లును కూడా పడ వేయాలి అని శ్రీరామకృష్ణ పరమహంస చెబుతాడు.
    విధి నిషేధాలు మనం ఏర్పరుచుకున్నవే! అయితే ఇవి జ్ఞానాన్ని చేరటం కోసమే! చేరిన తర్వాత వీటి ప్రయోజనం నెరవేరుతుంది. అప్పు డా జ్ఞానాన్ని కూడా దాటవలసి వస్తుంది అని అర్థం.
    అప్పుడే పసిపిల్లవాని స్వభావం మానవునికి వస్తుంది. "బాలోన్మత్త పిశాచ వత్" అని కదా పరతత్వ స్వరూపులైన మహానుభావులను గురించి విజ్ఞులైన వారు చెప్పేది.
    (వారికి విషం తెలియదు. అమృతం తెలియదు రెంటినీ ఒకే రకంగా స్వీకరిస్తారు.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    జ్ఞాన మజ్ఞానమును దాటగావలయును
    పూని తాగరా దనగ నజ్ఞాన మగును..
    ఔను.. తాగవచ్చు ననగా జ్ఞాన మగును..
    అట్టి రెంటిని విడనాడి యభవు డౌర!
    హాలహలమును తాగియు నమరు డయ్యె..
    జ్ఞానశూన్యుండు పొందెను గౌరవమును

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    12.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2814
    సమస్య :: “జ్ఞానము లేనివాడు ఘన గౌరవ దీప్తుల నందె సత్సభన్.”
    జ్ఞానము లేనివాడు సభలో గొప్పగా గౌరవాన్ని పొందినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: భీమ అర్జున నకుల సహదేవులు నాలుగు దిక్కులను జయించి అన్నయైన ధర్మరాజునకు దిగ్విజయకీర్తిని సమకూర్చినారు. ఆప్తుల సూచన మేరకు ధర్మరాజు రాజసూయ యాగాన్ని ప్రారంభించాడు. ఓ ధర్మరాజా! సద్గుణములలో పెద్దయైన వాడు అగ్రపూజకు అర్హుడు. శ్రీ నిలయుడు శ్రీకరుడు శ్రేష్ఠుడు అచ్యుతుడు నరనాథులకు నాథుడు ద్విజేశుడు పూజ్యుడు శ్రీ మహావిష్ణుస్వరూపుడు అగు శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయి అని రాజసూయ సభలో భీష్ముడు ఉపదేశించాడు. అట్లేనని ధర్మరాజు సుజ్ఞానము గల కృష్ణునికి మొదటి పూజను నిర్వహింపగా సజ్జనులందఱూ సంతోషించుచుండగా అజ్ఞానియైన శిశుపాలుడు శ్రీకృష్ణునిపై ద్వేషంతో “జ్ఞానము లేనివాడు ఈ సభలో గౌరవమును అందుకొంటున్నాడు” అని పలికే సందర్భం.

    “శ్రీనిలయుండు శ్రీకరుడు శ్రేష్ఠుడు శిష్టుడు కృష్ణు డచ్యుతుం
    డీ నరనాథనాథుడు ద్విజేశుడు పూజ్యుడు నగ్రపూజ స
    న్మానము నందె జ్ఞాని” యని మాన్యు లనన్; శిశుపాలు డిట్లనెన్
    “జ్ఞానము లేనివాడు ఘన గౌరవ దీప్తుల నందె సత్సభన్.”
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (12-10-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో
      గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
      సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2814
      సమస్య :: “జ్ఞానము లేనివాడు ఘన గౌరవ దీప్తుల నందె సత్సభన్.”
      జ్ఞానము లేనివాడు సభలో గొప్పగా గౌరవాన్ని పొందినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
      సందర్భం :: భీమ అర్జున నకుల సహదేవులు నాలుగు దిక్కులను జయించి అన్నయైన ధర్మరాజునకు దిగ్విజయకీర్తిని సమకూర్చినారు. ఆప్తుల సూచన మేరకు ధర్మరాజు రాజసూయ యాగాన్ని ప్రారంభించాడు. ఓ ధర్మరాజా! సద్గుణములలో పెద్దయైన వాడు అగ్రపూజకు అర్హుడు. శ్రీ నిలయుడు శ్రీకరుడు శ్రేష్ఠుడు అచ్యుతుడు నరనాథులకు నాథుడు ద్విజేశుడు పూజ్యుడు శ్రీ మహావిష్ణుస్వరూపుడు అగు శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయి అని రాజసూయ సభలో భీష్ముడు ఉపదేశించాడు. అట్లేనని ధర్మరాజు సుజ్ఞానము గల కృష్ణునికి మొదటి పూజను నిర్వహింపగా సజ్జనులందఱూ సంతోషించుచుండగా అజ్ఞానియైన శిశుపాలుడు శ్రీకృష్ణునిపై ద్వేషంతో “జ్ఞానము లేనివాడు ఈ సభలో గౌరవమును అందుకొంటున్నాడు” అని పలికే సందర్భం.

      “శ్రీనిలయుండు శ్రీకరుడు శ్రేష్ఠుడు శిష్టుడు కృష్ణు డచ్యుతుం
      డీ నరనాథనాథుడు ద్విజేశుడు పూజ్యుడు నగ్రపూజ స
      న్మానము నందె జ్ఞాని” యని మాన్యు లనన్; శిశుపాలు డిట్లనెన్
      “జ్ఞానము లేనివాడు ఘన గౌరవ దీప్తుల నందె సత్సభన్.”
      {అవధాని శ్రీ చిటితోటి విజయకుమార్ గారికి ధన్యవాదాలతో}
      కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (12-10-2018)

      తొలగించండి
  19. బ్రదుకునీడ్చుటకష్టము భరణియందు
    ఙ్ఞానశూన్యుండు,పొందెయశమ్ముసభను
    సకల శాస్త్రఙ్ఞులైనట్టిసత్కవివరు
    లెల్లరానందమునదేలియుల్లమలర

    రిప్లయితొలగించండి
  20. అక్ర మార్జన పరుడెక్కె నందలమ్ము!
    పూర్ణ శంఠయె గనసభా పూజ్యు డయ్యె!
    కటకటా! యేమి యీకలి కాల మహిమ?
    జ్ఞానశూన్యుండు పొందె యశమ్ము సభను!

    రిప్లయితొలగించండి
  21. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =======================
    జ్ఞానము లేని వాడిల యశమ్మును
    బొందెను జూడు సత్సభన్
    =======================
    ఏ మాత్రం తెలివి లేని అజ్ఞానియే ఈ
    లోకంలో సభల యందు గొప్ప పేరు
    ప్రతిష్టలను పొందుచున్నాడని చెప్ప
    టంలో అసంబద్దతె ఇచట సమస్య
    ========================
    సమస్యా పూరణం- 281
    =================

    వేళకు బుద్ధిగ బడికి వచ్చు-
    పాఠములకు మరి చెవులనిచ్చు
    విజ్ఞతను తనలో పెరగనిచ్చు-
    గూమాస్తయై తెలిసి వచ్చు
    పైవేవియును చేయకనె నతడు-
    పూని గాలికి పైకెగయున్
    జ్ఞానము లేని వాడిల యశమ్మును-
    బొందెను జూడు సత్సభన్

    ====##$##====

    క్రమశిక్షణతో బడికి వెళ్ళి, బుద్దిగా పాఠం
    విని, ఓర్పుతో ఇంటిపని చేసి చదువుకొనిన
    వాడు బడిపంతులో లేక దఫ్తర్ గుమాస్తయో
    అవుతాడు, ఇవేవి చేయని వాడు రాజకీయ
    నాయకుడౌతాడు.

    బంధిపోటు రాణి ఫూలన్ దేవి MP గా
    ఉన్నపుడు ఆవిడతో పాటు మరో ఇరవై మంది
    శాల్తీలు పార్లమెంటులో వ్రేలి ముద్ర మేధావులు
    గా ఉండేవారట.

    అంగన్వాడి టీచర్/వర్కర్, ఆశావర్కర్,
    హోంగార్డ్ లాంటి ఉద్యోగాలకు చదువును
    నిర్దేశించే చట్టాలు మరెందుకో సర్పంచ్/MPTC/
    MPP/ZPTC/MLA/MP ల విషయంలో నోరు
    మెదపటం లేదు !!!!

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ----- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  22. ప్రజల రాజ్యమందు స్వేచ్ఛ ప్రబల మవగ
    ఓట్లు వేయంగ మూర్ఖులు నోట్లు గొనుచు
    మందబుద్ధులు వెంటరా మంత్రి యగుచు
    ఙ్ఞాన శూన్యుండు పొందె యశమ్ము సభను!

    రిప్లయితొలగించండి
  23. రానికనెన్నడేనియును రమ్మనిఁ బిల్వకు చూడలేనికన్
    మౌనముగా - సమాజమును మాయలతో నిరతమ్ము దోచునా
    హీనుడు గౌరవాతిథిగనెక్కెను వేదిక జ్ఞానులుండగా
    జ్ఞానము లేనివాఁడు ఘన గౌరవ దీప్తుల నందె సత్సభన్

    రిప్లయితొలగించండి
  24. కాళికా దేవ్యభయ సుప్రకాశ మహిమ
    భూసురాన్వయ సద్గుణ భూషణుండు
    కాళిదాస సన్నాముఁ డొకండు మున్ను
    జ్ఞానశూన్యుండు పొందె యశమ్ము సభను


    ఒకానొక పుత్ర చతుష్క సద్బ్రాహ్మణుని ప్రస్తావించు సందర్భము:

    మానధనుండు విప్ర కుల మాన్యుఁడు సద్గుణ పంచ దేహ జే
    కోనుఁడు గౌరవాన్వయ సముద్భవ సచ్చరితుండు సజ్జ నా
    ధీన విశారదుండు నిజదేశ బలారి సమాన రా డవ
    జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్

    [అవజ్ఞానము = తిరస్కారము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పుత్రచతుష్క సద్బ్రాహ్మణుడు అంటే యేమిటండి పోచిరాజు వారు ?


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబి గారు ధన్య వాదములు.
      నలుగురు పుత్రులు కల్గిన సద్బ్రాహ్మణుఁడు.
      అదే పూరణములో “పంచ దేహ జేకోనుఁడు” అన నొకటి తక్కువ ఐదుగురు పుత్రులు కలవాఁ డని చెప్పఁబడినది.

      తొలగించండి
  25. మరొకపూరణ

    దానము ధర్మమున్ విడక ధారుణి యందున చేయుచున్సదా
    యానన మందునన్ నగవు నందము గూర్చగ నెల్లవారికిన్
    జ్ఞానము పంచుచున్ తిరుగు సాధువు మానసమందుకింద
    జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్"*

    రిప్లయితొలగించండి
  26. అజ్ఞుడగుచు సతతమిల నార్తి బొందు
    జ్ఞానశూన్యుండు ,పొందె యశమ్ము సభను
    జ్ఞానమార్జించి సుజనుడు జగతి యందు
    విజ్ఞుడనుచు మెచ్చి రతని విబుధు లెల్ల.

    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    మానులు లేనిచోట బహు మాన్యత నొందదె యంబుకమ్మిలన్...
    గానము లేనిచోట నొక గార్దభ మొందదె పద్మభూషణం...
    జ్ఞానము లేనివాఁ డిల యశమ్మును బొందెను జూడు సత్సభన్...
    ఆనతి యున్నచో విభుని...యమ్ముచు చాయిని నేతయౌనులే...

    అంబుకము = ఆముదముచెట్టు

    రిప్లయితొలగించండి
  28. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ‌ ,,,,,,,,,,,,,,,,,,,,,,


    పరు నగౌరవించెడు నహంభావి కరయ

    నెంత విఙ్ఞత నుండిన నేమి ఫలము ?

    పిచ్చివాని చేతికి రాయి నిచ్చి నటులె |

    కావునన్ సభామర్యాద గాంచవలయు |


    కాని , నిన్న జనాశ్చర్యకరముగాను

    ఙ్ఞానశూన్యుడు పొందెను గౌరవమును !

    ఙ్ఞాని కావలె ఙ్ఞానిని గనుగొనంగ |

    నయ్యొ నేడు ధనియె మరియాద నొందు ! !


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  29. ఆంధ్ర భాషాదినోత్సవ మందతిథిగ
    విభవమునుజూసి పెద్దగపిలిచి జనులు
    వావిరిగపొగడ తెలుగు భాషయందు
    జ్ఞాన శూన్యుండు పొందె యశమ్ము సభను

    రిప్లయితొలగించండి
  30. మతియె లేనట్టి వాడైన మాన్యుడయ్యె
    లక్షణముగ నిల తెనాలి రామకృష్ణ
    మాత దయతోడ సిద్ధించ మహిత శక్తి
    జ్ఞానశూన్యుండు పొందె యశమ్ము సభను!!!

    రిప్లయితొలగించండి
  31. శివునిభక్తుడు కన్నప్ప చేరిగొలిచె
    కన్నులన్దీసి లింగానికంటు గట్టి!
    చదువు సంధ్యలులేకున్న ?ముదమునందు
    జ్ఞాన సూన్యుడు పొందెనుగౌరవమును!

    రిప్లయితొలగించండి
  32. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    జ్ఞాన శూన్యుండు పొందెను గౌరవమును

    సందర్భము: మానవుడు అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావలసిందే! కానీ జ్ఞానం సంపాదించిన తర్వాత పరతత్వానికి సంపూర్ణ శరణాగతుడు కావలసిందే! కాకపోతే అహంకారం చుట్టుముట్టి అధః పతనానికి దారితీస్తుంది. (పురుష కారానికి మించింది లే దనే దురభిప్రాయమే ఆ అహంకారానికి కారణం.) అందువల్ల పూర్ణ మానవుడు కాలేకపోతాడు.
    "పురుష కారమే గొప్పది" అని భావించకపోయినా "ఆ పురుష కారంతో సంపాదించిన జ్ఞానమే గొప్పది" అని విశ్వసించి దానినే పట్టుకుని వ్రేలాడుతూ పరాత్పరుని విస్మరించే ప్రమాదం వుంది. అదైనా అధ: పతనానికే దారితీస్తుంది.
    శరణాగతుడైన వానికి మాత్రమే జ్ఞానం ఉన్నా చెడుపు చేయదు. ఓ మూల ఉంటుంది. లేని దానితోనే సమానం.
    అటువంటివాని జ్ఞానమే సార్థకత చెందుతుంది. ఆ విధంగా జ్ఞాన శూన్యుడైన వాడే గౌరవం పొందుతాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    తొలుత నజ్ఞాని జ్ఞాని కావలయు.. జ్ఞాని
    యవల దైవమునకు శరణాగతుండు
    కావలయు..సార్థకత యదే జ్ఞానమునకు!
    జ్ఞాన మున్నను పనిలేదు. లేని యటులె..
    జ్ఞానశూన్యుండు పొందెను గౌరవమును

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    12.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  33. మౌనముగానెనుండదగుమౌనియువోలెనునెల్లవేళలన్
    ఙ్ఞానములేనివాడిలయశమ్మునుబొందెనుజూడుసత్సభన్
    దానుగబాడగామిగులదన్మయమొందుచుబాటలెన్నియో
    యానమువేంకటేశ్వరుడెయద్భుతరీతినిబాడెనంచుబో

    రిప్లయితొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    జ్ఞాన శూన్యుండు పొందెను గౌరవమును

    సందర్భము: అజ్ఞానంకంటె జ్ఞానం గొప్పది. కానీ జ్ఞానంకంటె పరతత్వానికి సంపూర్ణ శరణాగతుడు కావడం అంతకంటె పైమెట్టుది.
    శరణాగతుడైన వానిని ఆ పరాత్పరుడు ప్రతిక్షణం చూసుకుంటాడు.
    "యోగక్షేమం వహామ్యహం" అన్న గీతా వాక్యానికి అంతరార్థం ఇదే!
    దీనినే "మార్జాల కిశోర న్యాయ" మంటారు కొన్ని చోట్ల. అనగా పిల్లి పిల్లను తల్లి పిల్లి తన నోట కరచుకొని క్షేమంగా వుండే చోటికి భద్రంగా అడ్డంకుల నన్నింటిని అధిగమించి వేగంగా తీసుకొనిపో గలుగుతుందో అదే విధంగా దేవుడు కూడ శరణు వేడిన తన భక్తుని అన్ని విధాలా శ్రేయస్కరమైన పరమ పదమునకు లేదా మోక్షమునకు తన దాసుని చేరుస్తాడు.
    ఇందులో పిల్లి పిల్లకు ఎలాంటి బాధ్యత లేదు. అట్లే భక్తునకు కూడ ఎలాంటి చింతా లేదు ఒక్క శరణాగతుడు కావడం తప్ప..
    ఇదే మార్జాల కిశోర న్యాయం.
    అలాంటి జ్ఞాన శూన్యుడే గౌరవాన్ని పొందుతాడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పూని యజ్ఞానమున కన్న జ్ఞాన; మంత
    కన్న శరణాగతి యధిక మగును.. ప్రభువె
    చూచుకొనగ "మార్జాల కిశోర రీతి"
    జ్ఞానశూన్యుండు పొందెను గౌరవమును

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    12.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  35. వీనుల విందు సేసెనట వేదిక నెక్కిన సామ్యవాది హృ
    ద్గానము సాగెనచ్చటను గజ్జల సవ్వడి మిన్నుముట్ట,స
    న్మానము పొందవచ్చునన,మానవ సేవకు పూనుకొన్న,అ
    జ్ఞానము లేనివాడిలయశమ్మునుబొందెనుజూడసత్సభన్
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు

    రిప్లయితొలగించండి
  36. వీనులవిందుసేయుటకువేదికజేరినసామ్యవాది హృ
    ద్గానముజేసెనచ్చటనుగజ్జలసవ్వడిమిన్నుముట్ట,స
    న్మానముబొందవచ్చునన,మానవసేవకుపూనుకొన్న,అ
    జ్ఞానములేనివాడిలయశమ్మునుబొందెనుజూడుసత్సభన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  37. కానలందుజీవుల జంపు కఠిన హృదయు
    డైన మృగయుడొక్కడట నాదికావ్య
    మైన రామకథను వ్రాసి మాన్యుడవగ
    జ్ఞాన శూన్యుండు పొందె యశమ్ము సభను.


    : జ్ఞానమె మానవాళికి ప్రశస్తిని పెంచును గాదె చూడగన్
    క్షోణిని శోధకుండ్ర పరిశోధన తెచ్చిన మార్పులన్ గనన్
    ధీనిధి గల్గినట్టి ఘన ధీరుని మెచ్చుచు గౌరవింప య
    జ్ఞానము లేనివాడిల యశమ్మును బొందెను జూడు సత్సభన్


    : మున్ను మూఢుడై చెఱగినన్ ముదము తోడ
    కాళిఁ సేవించి కవియైన కాళిదాసు
    చరిత జదువుచు తెలిపెనే చతురు డొకడు
    జ్ఞాన శూన్యుండు పొందెయశమ్ము సభను

    రిప్లయితొలగించండి
  38. ఉత్పలమాల
    మానవ నైజమున్ దెలిసి మద్దతు నంద ప్రలోభ రాశినే
    బేనుచు నమ్మబల్క ప్రజ వెర్రిగ లోక సభాధిపత్యమున్
    కానుకగా నొసంగిరనె గడ్కరి! మంత్రి! నధర్మ మన్న సు
    జ్ఞానము లేని వాడిల యశమ్మును బొందెను జూడు సత్సభన్

    రిప్లయితొలగించండి
  39. డా. పిట్టా సత్యనారాయణ
    తాను యెక్కిన కొమ్మనే తరగు వాని
    దేవి కరుణించ బాండితి దివ్య భాష
    ‌సంస్కృతోపమకును బేరు సాగె జూవె
    జ్ఞాన శూన్యుండు పొందె యశమ్ము సభను!

    రిప్లయితొలగించండి
  40. డా. పిట్టా సత్యనారాయణ
    జాను తెనుంగు బాపనయ జాగునొనర్చక జిన్ననాటనే
    వేనకు వేల శ్లోకముల వెర్రిగ జ్ఞాపకవర్తి జేయ నా
    సూనుడు తాను నేర్చెనదె"చూడుడు రాజ!"యటంచు దోడ్కొనన్
    వానికి బల్కు రామి తన వాణియె దబ్బరగాగ బుత్రునిన్
    పూనిక ద్రోప గ్రింద బడె పూర్ణ సరస్వతి రూపమట్లు వా
    ర్గానగ వేదమున్ జదివె జ్ఞప్తికి వచ్చెను సర్వ శాస్త్రముల్
    జ్ఞానము లేని వాడిల యశమ్మును బొందెను జూడు సత్సభన్
    *మ్రానుగ శయ్యపై గొనిన మౌఖిక విద్య యనర్థ దాయియౌ!*

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    జ్ఞాన శూన్యుండు పొందెను గౌరవమును

    సందర్భము: అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. పాలను గూర్చి వినడం కన్న పాలను చూడడం మిన్న. దానికన్న పాలను తాగిన వాని కున్న అనుభవం మిన్న. అంటాడు శ్రీరామకృష్ణ పరమహంస.
    అనుభవ జ్ఞానం లేనట్టి వా డొకడు పిచ్చిగా డబ్బు సంపాదించినాడు. డబ్బున్న వాణ్ణి లోకం ఎప్పుడూ ఆకాశాని కెత్తుతూనే వుంటుంది. జైకొట్టుతూనే వుంటుంది. జ్ఞానం వుందా లేదా అని కూడా చూడదు.
    ఇంకా "అతనికి జ్ఞానం లే దని లేదు. వుంది. కాకపోతే అనుభవం మాత్రం లే దంతెే!" అంటుంది లోకం.
    ఎలా పొందినాడు గౌరవం అంటే ఇదుగో ఇలా అని చెబుతున్నా డొకడు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఉన్న జ్ఞాన.. మనుభవమ్ము సున్న.. యైనఁ
    బిచ్చిగా పైసఁ గూరిచి పేరు కెక్కె..
    నడిగితివి యిట్టు; "లెట్టుల ననుభవంపు
    జ్ఞాన శూన్యుండు పొందెను గౌరవమును?"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    12.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి