4, అక్టోబర్ 2018, గురువారం

దత్తపది - 146 (వన-జన-ధన-మన)

వన - జన - ధన - మన
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

97 కామెంట్‌లు:



  1. జై జోలియే రామ్ మందిర్ కేలియే


    రామా! భువనమనోహర!
    భామిని ధరణిజ! నతులివి! భారతమనగా,
    నామములన, మీదేన
    ర్రా మాననగా జ్వలించు రాధనమిదియే!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    వనజనయన ! రామా! పా...
    వన ! జనరంజనకర !భగవద్రూపా ! సా...
    ధనమన నీ నామమ్మే
    యని హనుమ నమస్కరించి యంబుధి దాటెన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  3. మనమున బాధ నదిమి జన
    కునిసుత, ఘన యినకుల తిలకుడు రాముని తో
    చనియె వనమునకు, పతిసే
    వన ధర్మమని జనులకు నవనిజ తెలుపుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఘన + ఇనకుల = ఘనేనకుల' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "ఘన రవికుల..." అనండి.

      తొలగించండి
  4. సరదాగా:

    జనకజ యౌవనము విరియ
    ధనధనమన శివుని విల్లు దారుణ రీతిన్
    వినుటకు వీనుల విందై
    ఘనఘనమన ఘంటలచట...కరములు మ్రోగెన్

    రిప్లయితొలగించండి
  5. జీవన ధాత్రిని సుఖముగ
    పావని సీతకు మనుగడ బహుదు ర్భరమౌ
    రావణు మనమున మలినము
    కావున ప్రాజన ముబోలు ధనక మటంచున్
    ధనకము = అత్యాశ
    ప్రాజనము = ముల్లు కఱ్ఱ

    రిప్లయితొలగించండి



  6. శ్రీరామా! జవనమ్ము గాంచినది యీ సీతమ్మ నా కూతుర
    య్యా! రారాజన గొల్చు రాధనముగా ! యావత్తు కాలమ్ము నీ
    కై రారాపుల తాళు నయ్య ధరణిన్! కామంచి పూబోడి యౌ
    రా ! రమ్మా ! మననమ్ము జేయునిను విభ్రాజిల్ల గా నల్లుడా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👏👏👏

      "ఇయం సీతా మమ సుతా సహధర్మ చరీ తవ
      ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా .
      పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా ."

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. పా*వన*ము రామ నామము-'భవ దవాగ్ని'-
    సృ*జన* జరిగెను వాశిష్ఠ సేవితముగ
    సా*ధన* మునయ్యె ధర్మ సంస్థాపనముకు
    *మన*సు పరిమార్చి కైవల్య మార్గ మరయ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సంస్థాపనమునకు' అనడం సాధువు. అక్కడ "సంస్థాపనమున" అనండి.

      తొలగించండి
  8. భు'వన'త్రయావనుఁడు హరి
    భువి రాముం డగుచు 'జన'నమును బొందెను, దా
    నవకులవినాశసా'ధన'
    మవనిజగ జనించె లక్ష్మి యవతార 'మన'న్.

    రిప్లయితొలగించండి
  9. రామ ! దీనావన ! మనోభిరామ ! దేవ !
    జానకీనయనాంజన ! శౌర్యధుర్య !
    యగణితసుధర్మసాధన ! యార్తిహరణ !
    పరమపురుష ! దైత్యదమన ! పాహి ! పాహి !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      శ్రీరామ స్తుతి రూపమైన మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది
    ఇచ్చిన పదాలు :: వన-జన-ధన-మన అనే పదాలను వేఱే అర్థంలో ఉపయోగించి పద్యం వ్రాయాలి.
    సందర్భం :: శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేందుకు శ్రీరాముడుగా అవతరించి రావణాసుర సంహారం చేయగానే లంకలో ఉన్న జానకమ్మ పొంగిపోయింది. తన శ్రీవారి గొప్పదనాన్ని ఎలా పొగడాలో తెలియడం లేదు సీతమ్మవారికి. తన కోసం రాములవారు సాధించిన విజయ పరంపరలను గుఱించి మననం చేసికోవడం మొదలుబెట్టింది.
    మా శ్రీవారు సముద్రాన్ని దాటినారు. వారధిపై నూఱు యోజనాల పాదయాత్ర చేసినారు. రావణునికి హితబోధను కూర్చినారు. హితమును వినని దశకంఠుని వధించారు. మా రాములవారిని ఏమని వర్ణించాలి? అని ఆ వైదేహి తనలో తాను మాట్లాడుకొనే సందర్భం.

    “వననిధి దాటినారు, ఘన వానర సైన్యము తోడ నూఱు యో
    జనముల పాదయాత్ర నట సంతస మందుచు జేసినారు, బో
    ధనలను గూర్చినారలు హితమ్మని, రావణు జంపినార, లే
    మనదగు” నంచు బల్కె జనకాత్మజ రాములవారి నెంచుచున్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (4-10-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోజ్ఞంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. . సవరణతో
      గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
      నేటి అంశము :: దత్తపది
      ఇచ్చిన పదాలు :: వన-జన-ధన-మన అనే పదాలను వేఱే అర్థంలో ఉపయోగించి పద్యం వ్రాయాలి.
      (విషయము :: రామాయణ విషయము)
      సందర్భం :: శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేందుకు శ్రీరాముడుగా అవతరించి రావణాసుర సంహారం చేయగానే లంకలో ఉన్న జానకమ్మ పొంగిపోయింది. తన శ్రీవారి గొప్పదనాన్ని ఎలా పొగడాలో తెలియడం లేదు సీతమ్మవారికి. తన కోసం రాములవారు సాధించిన విజయ పరంపరలను గుఱించి మననం చేసికోవడం మొదలుబెట్టింది.
      మా శ్రీవారు సముద్రాన్ని దాటినారు. వారధిపై నూఱు యోజనాల పాదయాత్ర చేసినారు. రావణునికి హితబోధను కూర్చినారు. హితమును వినని దశకంఠుని వధించారు. మా రాములవారిని ఏమని వర్ణించాలి? అని ఆ వైదేహి తనలో తాను మాట్లాడుకొనే సందర్భం.

      “వననిధి దాటినారు, ఘన వానర సైన్యము తోడ నూఱు యో
      జనముల పాదయాత్ర నట సంతస మందుచు జేసినారు, బో
      ధనలను గూర్చినారలు హితమ్మని, రావణు జంపినార, లే
      మనదగు” నంచు బల్కె జనకాత్మజ రాములవారి నెంచుచున్.
      కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (4-10-2018)

      తొలగించండి
  11. చేవ నగు పించ రాముడు చెండె దుష్ట
    భాజన నసుర రావణు పంత మూ ని
    శీల శోధన గావించి సీత గొని యు
    మరలె సుజన మనస్కుల మదు లు పొంగ

    రిప్లయితొలగించండి
  12. జన' కుని పలుకులను శిరసావహించి
    కాననములకు సతితోడ గ'మన'మయ్యె
    వనమున సతినపహరించ ప'వన' సుతుడు
    సా'ధన'ముగనొప్పెను సీతజాడ తెలియ

    రిప్లయితొలగించండి
  13. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    "వన" , "జన" , "ధన" , "మన" -
    ఈ పదములను అన్యార్థముగా
    వినియోగిస్తు రామాయణమును
    ప్రస్తావించవలెను
    =======================
    దత్తపది - 20
    ==========

    వనములకేగెనదె రాముడు-
    ఇనకులముగ వెలిగె సోముడు
    జనకసుత మనో ధాముడు-
    అసురులకదె బండన భీముడు
    సేతు బంధనగ యశో సముడు-
    జానకి మనసిజ కాముడు
    మర్యాదకు ప్రథముడు-
    పురుషోత్తమ సార్థక నాముడు

    ====##$##====

    పండితులకు శాస్త్ర కోవిదులకు వినమ్రతతో
    ===============================
    పరిష్కృతమునకై మనవి
    ===================

    శ్రీకృష్ణుని అవతార సమాప్తి అనగా క్రీ.పూ
    3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రితో ద్వాపర యుగం
    ముగిసి కలియుగం ప్రారంభమైనది.

    యుగముల కాల గణనను అనుసరించి త్రేతా
    యుగము నాటి రాముడు మనకు 8,69,000
    సంవత్సరముల దూరము నాటివాడు (గడచిన
    ద్వాపర యుగం 8,64,000 + గడచిన కలియు
    గం 5000 ) .

    శ్రీరామ నవమి పర్వదిన సంధర్భముగ
    పండితులు లెక్కించే రామజననం క్రీ.పూ.5114
    జనవరి 10 వ తేది. అనగా రాముడు మనకు
    7126 సంవత్సరముల క్రిందటి వాడు, మరి ఆ
    కాలము ద్వాపరమే అవుతుంది కదా!!!!

    ( మాత్రా గణనము- అంత్య ప్రాస)
    ----- ఇట్టె రమేష్
    (శుభోదయం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వినమ్ర మనవి: ఎవడో కాకి లెక్ఖలు గట్టి వ్రాసినవాడినదాని గురించి పట్టించుకోకండి.

      తొలగించండి
    2. మీకు తెలిసినది చెబితె నలుగురికి మేలు చేసినవారౌతారు కదా మహాశయా

      తొలగించండి
    3. 'మన తెలుగు' చంద్రశేఖర్ గారూ,
      బహుకాల దర్శనం! ఈమధ్య చాలాకాలంగా బ్లాగులో సమస్యాపూరణలు చేయడం లేదు... కారణం?

      తొలగించండి


  14. నవనవ లాడు గాధ భళి నాటికి నేటికి రాధనంబు జే
    ర్చు వరమిదేను దేశము సుశోభిలు! వీరుడు కౌసలేయుడే
    సవరిచి విల్లు నెక్కిడి సుశారదు చాపము ప్రాజనమ్ముగా
    ను విరిచి పాణిబంధమన నొప్పగ సీతకు పెన్మిటాయెగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    వనజ నయన ! అనిలసుత వినుత ! కావ

    రావ నర్మిలి తో నను రామన ! ‌ దను

    జ నిధన ! సమస్త పాప నాశ కర ! రఘుకు

    ల జలనిధి చంద్ర ! స్వామి ! శ్రీరాఘవేంద్ర !

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి


  16. 1.వనజాక్షిని గొంపోవగ
    ధనదుని సోదరుడురవచ్చె దర్పము తోడన్
    జనకజ పై మరులు గొనుచు
    మనమున నిండగ దురూహ మౌనిగ వచ్చెన్.

    2.వనజ సంభవ జనకుండ వనుచు సతము
    మ్రొక్కులలిడుదును ముందు గాను
    ధనదు సోదరున్ గూల్చిన దాశరథివి
    కరుణ చూపుసుజనపాల కౌసలేయ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సోదరుడు(ర) వచ్చె, మ్రొక్కుల నిడుదును' టైపాట్లు.

      తొలగించండి


  17. ఇదియే సీతసుమా గనన్! జవనమైయీడేర్చు నీభార్యయై
    పదికాలంబుల పాటు రాధనమువిభ్రాజిల్లగా రామభ
    ద్ర!దిశాపాలుర సాక్షి గామనసులో తానిన్ను కైసేయున
    య్య దివారాత్రము భూజ! నవ్యపు సతిన్ యాజన్యుడా గైకొనన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  18. మనవి! రాఘవ!సీతను మనువుగాన
    మగువ యోజనగంధసుమా! జవనము
    గాను రాధనమును జేర్చు కలికి ! మనసు
    నొవ్వక నిను కైసేయు మనోజవముగ!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  19. మనవి! సీతయిదియె మనువాడ రాఘవ!
    జీవనమ్ము గూడి సేయ నిరువు
    రు!మనసున గొలుచు సురుచిరము యోజన
    గంధ రాధనపు సుకన్య రామ!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పైన వరుసగా ఉన్న మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  20. డా…పిట్టాసత్యనారాయణ
    చేవన నీదెసంస్స్కృతికి జీవన నాడి యటన్న నేడు నా
    భావన మారె మా ఋజన భాగ్యములే భవ బంధనమ్ములౌ
    గావవె రామ రాజ్యమనగా వనితల్ జొర నాలయాలలో
    స్థావరమంద నిమ్న కుల ధామములే దొరలిిండ్లుగా మనన్
    కావరమూర మీరిరిట గాంచగరాగదె రామ నీతినిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యంలో భావం కొంత అస్పష్టంగా ఉన్నది.
      'చేవ + అన' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
    2. చేవయనీది …మాఋజ..రోగం…బలవంతంగాశబరిమలై ప్రవవేా
      శం సై…ఈనాటి ఎస్సీయెసటీల ధామాలు బెయిలు లేనిజెయిలు వేసే హక్కు గలవారు…వారి కీహక్కంకెనన్నాళ్ళు…యితరుల భూములు తమవే అంటే పరిష్కారం చూపని అధికాాారులు ఇదేనారామరాజ్యం…రామాఇటురా!

      తొలగించండి


  21. యోజన గంధ రాధనపు యోగము నీదగు నయ్య రామచం
    ద్రా జనకాత్మజన్ రమను దారగ నిచ్చితి జీవనమ్ము వి
    భ్రాజిత మైన రీతిని శుభమ్ముల నీమనసార గానగా
    కూజితమై మహీజ భళి కొంగుముడిన్ నిను కట్టివేయగా!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  22. మానన - మన్నన - ఆంధ్ర భారతి ఉవాచ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. జనక సుతను బెండ్లాడెను
    వనముకరిగె దండ్రియాన వారధిగట్టెన్
    ధనథుని సోదరు జంపెను
    మనవాడగు రాముడెంతొ మాన్యత నొందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వనమున కరిగె' అనడం సాధువు. "వని కరిగెను దండ్రియాన..." అనండి.
      (ఉదయం మీ పూరణ ఎందుకో నా దృష్టికి రాలేదు. ఆలస్య స్పందనకు మన్నించండి).

      తొలగించండి
  24. జనకుడనుపగరాముడుజానకిగొని
    వనమువెంబడిబోవుచుమునులకొఱకు
    ధనదుసోదరుమారీచుదరిమిజంపి
    మననసుఖముగసాగించమద్దతిచ్చె

    రిప్లయితొలగించండి
  25. జనకసుతా జీవన! పా
    వనమూర్తీ!రాఘవేంద్ర! వానర వంద్యా!
    ఘనమగు వారధి బంధన!
    మనసారగ నిన్ను దలతు మంగళరూపా!

    రిప్లయితొలగించండి
  26. హనుమంతుఁడు సీతాదేవిని నోదార్చు సందర్భము:

    వనరఁ జన దనయ మిచ్చట
    మనఁ గలరే పొలసుదిండ్లు మగువా వెఱపిం
    చిన నిను నీ పెనిమిటి ధన
    ధన వచ్చి తునుము గద పదితలల మొఱకునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'ధనధన వచ్చి' ... మీ సహజ పదప్రయోగానికి కొంత భిన్నంగా ఉన్నట్టుంది.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      అచ్చతెనుగు పదములతోనే పూరణము చేయవలెనని యాశించి చేసిన పద ప్రయోగ మది. వనరు, చనదు, అనయము, పొలసుదిండి, మగువ, పెనిమిటి, ధనధన (ధ్వన్యనుకరణము), తునుము, పది తలల మొఱకు మున్నగునవి.

      తొలగించండి
    3. శంకరయ్య గారి భావము:
      *************************
      "ధనధన" "ఘనఘన" మొదలగునవి ప్రభాకర శాస్త్రి గారి సహజ పద ప్రయోగములు...పైన వారి పూరణ చూడగలరు👆
      **************************

      😊

      తొలగించండి

    4. "సహజ పద ప్రయోగ ప్రభాకరుల్ " :)


      జిలేబి

      తొలగించండి
    5. మహదానందము శాస్త్రి గారు మనయిరువురి భావము లొకటియై వెల్గినవి. ఇరువురము నచ్చ తెనుగు వారలమే కదా!

      తొలగించండి
    6. మీరు "అప్పుడప్పుడూ"...నేను "ఎప్పుడూ" విధిలేక.

      నమో నమః కామేశ్వర రావు గారు.

      తొలగించండి
    7. మనలో మాట:

      భారతావనిలో పుట్టి సాధుపుంగవుల నెవ్వరినీ కనులార కాంచలేక పోయితినే అని నేను తరచు చింతించుచుంటిని. ఆ కొరత డెబ్భై నాల్గవ ఏట కంది శంకరులను చూచిన వెంటనే తీరినది...చాలా సార్లు...

      తొలగించండి
    8. "అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |"

      తొలగించండి


    9. మనలో మాట! మునుపు నే
      గనలే దండీ మన కవి కంది వరులలా
      గున సాధుపుంగవుల; వే
      మన తాతవలెన్ జిలేబి మన్నిక గ‌నిరే !


      జాల్రా
      జిలేబి

      తొలగించండి
    10. వెఱ పొసఁగనివి నిజములు ప్రియము హితము
      నొసఁగు నెట్టి వట్టి పలుకు లొలుకటయును
      వేద పఠన మభ్యసనముఁ బాదుకొనఁగ
      దాని వాఙ్మయ తపమని తలఁచ వలయు ... శ్రీకృష్ణ. సూ. సుధా. 17.15.

      తొలగించండి
    11. 👏👏👏

      బాగు బాగు జిలేబి గారు...

      కామేశ్వర రావు గారూ:

      మీ భగవద్గీత తర్జుమా వడివడిగా పరుగులిడుచున్నది. పూర్తి ఐనదా?

      తొలగించండి
    12. శాస్త్రి గారు ఆగస్టు నెలలోనే పూర్తి యయినది.

      తొలగించండి
    13. G P Sastry (gps1943@yahoo.com)అక్టోబర్ 04, 2018 6:42 PM
      👏👏👏

      గత రెండేండ్లలో శంకరాభరణ పూర్వపు పుటలను 90% చదివితిని ఇప్పటివరకు.

      శంకరాభరణమునకు మారు పేరు:

      "కంది శంకర వచనామృతము"

      తొలగించండి


    14. ఏకం సమస్యా విప్రాః బహునాం పరిష్కృతి :) (పరిష్కరోతి ?)


      జిలేబి

      తొలగించండి
    15. 👏👏👏

      శంకరాభరణం సమస్య - 2039

      "అనుమానించెడు పతి గల యతివ సుఖించున్"

      కనివిని యెరుగని నగలను
      ఘనమగు చీరలను వంద కాళ్ళకు చెప్పుల్
      కొని చాలునొ లేదో యని
      యనుమానించెడు పతి గల యతివ సుఖించున్!

      (కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

      తొలగించండి
    16. శాస్త్రి గారూ,
      మీరు పేర్కొన్న 'సాధుత్వం' నాలో లేదండి. సాధారణ మానవుడనే. అందరిలాగే నాలోనూ కొన్ని లోపాలు, బలహీనతలు ఉన్నాయి. (మడిసన్నాక కొన్ని లోపాలు, దోషాలు ఉండాల! లేపోతే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటుంది?)

      తొలగించండి
    17. కామేశ్వర రావు గారు రచించిన "పద్మావతీ శ్రీనివాసం" లో రెండేండ్ల క్రితం చదివితిని...భృగు మహర్షి క్రుద్ధుడై శ్రీమన్నారాయణుని కాలితో ఎద పై తన్నినపుడు శ్రీవారు ఆ పాదములోనున్న కన్నును చెరచి వారి అహంకారమును పారద్రోలినారట!

      ఈ కంది శంకర నారాయణుల వారూ అంతే...

      తొలగించండి
  27. త్రిభువన మోహన రామా
    ప్రభువర మునిజన విహార పావన నామా
    శుభకర మనసిజ సోమా
    ప్రభు!శబరిని గనుమ సేతు బంధన రామా!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మనసిజ రూపా' అంటే అన్వయం బాగుంటుందేమో?

      తొలగించండి
    2. చక్కని పూరణము శైలజ గారు. గురువు గారు సూచించినది యర్థవంత మైనది.
      “శబరిని గనుమ” యని యెంత వేడినా సీతారాముఁడు చూడ గలఁడు గాని సేతుబంధన రాముఁడు చూడ లేఁడు కదా!

      తొలగించండి
    3. ధన్యవాదములు గురువుగారు..మీ సూచన అద్భుతం...నాకది తట్టలేదు..అలాగే గురుతుల్యులు కామేశ్వరరావు గారికి ధన్యవాదములు....నిజమే సర్....

      తొలగించండి
  28. జనకజ మనసును గెలిచిన
    ఘనుడగు పావన చరితుని కార్యము కొరకై
    మునివంద్యుని నామము సా
    ధన జేసిన కపివరుండు తరిషము దాటెన్.

    రిప్లయితొలగించండి
  29. పావనమయిన మనసుతో పయనమయ్యె
    గురువు యొక్క ప్రయోజన మెరిగి రాము
    డడవులకుతాను, బోధనఁ బడసె నచట
    నస్త్ర విద్యలందున కడు నర్థితోడ

    రిప్లయితొలగించండి
  30. పావనమగు రాముని కథా పఠన మెపుడు
    మనుజునకు ప్రయోజనమిడు; మానవత్వ
    మరసి మనవలయు ననుచు, నంత మంచి
    తనము వీడ రాదనుచు బోధనలు చేయు!

    రిప్లయితొలగించండి
  31. డాపిట్టా సత్యనారాయణ
    తామయి సంస్కృత భాషను
    నీమంబగ నేర్వ దొరలు నిక్కుచు రాగా
    సామంబుగ నొక ప్రశ్నకు
    భీముని సతి తార యనుచు వే(వేయ్ మన) వ్రాసెన్

    రిప్లయితొలగించండి
  32. డా…పిట్టాసత్యనారాయణ
    భీముడు'తార'వేమనల పిల్లల బుఱ్ఱల నింపుటేల వే
    బాముకొనంగ జాలు పలు పట్టుల విద్దెలు "సీప్లస్ ప్లసుల్"
    రామజపంబు సేయగనె రాలును రూకలు పొట్ట కూటి కో
    భీముని భార్య తార యని వేమన వ్రాసెను భారతమ్మునన్

    రిప్లయితొలగించండి
  33. రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
      "ధర్మబద్ధు డగుచు" అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
  34. వనము పాల్జేసె నూత్నయౌ వనము నంత
    తండ్రి పొంటె రంజన వీడి దాశరథియె
    బంధనముల కాదనె ధర్మ పథము కొఱకు
    నేమన గలరు రఘురాము నెవ్వరేని ?

    రిప్లయితొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂దత్తపది🤷‍♀....................
    *వన - జన - ధన - మన*
    పై పదాలను అన్యార్థంలో రామాయణార్థంలో
    నచ్చిన ఛందస్సులో

    సందర్భము: పవన కుమారుని మనస్సే ఒక నందనవనం. అందులో శ్రీ రామచంద్రుడే ఒక కల్పవృక్షం. అలా భావించి హనుమ పరవశించిపోతూవుంటాడు.
    అహరహం రాముని కరుణా కటాక్షాల కోసం ప్రేమ పూర్వకమైన ఆ ప్రభుని దీవన కోసం ఆరాటపడుతూవుంటాడు. రాముని కళ్యాణ గుణాలను కీర్తిస్తూ వుంటాడు. భజన చేస్తూ వుంటాడు.
    అట్లైనప్పటికి హనుమంతుడు దుష్ట రాక్షసుల వీపులు ధనధన మనిపిస్తూనే వుంటాడు (దుష్ట శిక్షణలో భాగంగా రామునికి సహకరిస్తూనే..).
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మన మను నందనమున రా

    ముని కల్పకముగఁ దలంచి

    మురిసి యతని దీ

    వనకయి భజన యొనర్చుచు

    ధన ధన మనిపించు హనుమ

    దనుజుల వీపుల్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    4.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂దత్తపది🤷‍♀....................
    *వన - జన - ధన - మన*
    పై పదాలను అన్యార్థంలో రామాయణార్థంలో
    నచ్చిన ఛందస్సులో

    సవరణతో...

    సందర్భము: దత్త పదా లొక్కొక్కటి ఒక్కొక్క పాదంలోనే రావాలి. క్రమంగానే రావాలి యనుకుంటే.... క్రింది పద్యం పరిశీలించవచ్చు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వనధి నహో లంఘించెను!

    జనక సుతను వెదకి చూచె..

    శత్రు సభను బో

    ధన చేసె.. నట్టి ధీరుని

    మనమున స్మరియింతు నెపుడు

    మారుత పుత్రున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    4.10.18
    -----------------------------------------------------------
    శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో

    రిప్లయితొలగించండి
  37. నా"వ న"డుపు వాడ నాపేరుగుహుడంద్రు
    సరసి"జన"యనయగు సాధ్విఁగూడి
    బా"ధన"ణచుకొనుచు వనవాసములకేగు
    రా"మ న"న్నుబ్రోవ రమ్ము స్వామి

    రిప్లయితొలగించండి
  38. ఆటవెలది
    నావ నడుప మీర లావలి యొడ్డుకుఁ
    జనఁగ గుహుని భాగ్య మనెద రామ!
    సకియ గాక నాదు సాధనముండగ
    రామ! నతులఁ గాళ్లఁ దేమఁ జేతు

    రిప్లయితొలగించండి