19, అక్టోబర్ 2018, శుక్రవారం

సమస్య - 2820 (అల్లునిఁ జంపఁగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్లుఁ జంపఁ దలఁచె నాహవమున"
(లేదా...)
"అల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ క్రుద్ధుఁడై"

106 కామెంట్‌లు:

  1. తనుజు డొక్కడైన తనకు లేకుండుటన్
    శత్రు పీడితుండు సాయమునకు
    చేర బిలిచి వాని చేకొని సత్వాఢ్యు
    నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      అల్లుఁ ... తరువాత కామా(,) పెడితే ఇంకా స్పష్టంగా ఉంటుంది.

      తొలగించండి
  2. చిల్లి గవ్వ కూడ చేతిలో లేకయె
    తల్లి తండ్రులనట తగుల బెట్టి
    యిల్లు వాకిలినిట గుల్ల జేయు చునుండ
    నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    చెల్లెలి పుత్రుడే , యయిన చేటొనరించును కంస ! యన్న నా
    ప్రల్లదుడల్లదే గగనవాణిని నమ్మెను , గోకులమ్మునం...
    దల్లరివానిగా పెరిగెనంచు కనుంగొని , కృష్ణమూర్తి మే...
    నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ సూరం వారికి వందనములతో.. 🙏🙏

      చెల్లెలి పుత్రుడే , యయిన చేటొనరించును కంస ! యన్న నా
      ప్రల్లదుడల్లదే గగనవాణిని నమ్మెను , గోకులమ్మునం...
      దల్లరివానిగా పెరిగెనంచు కనుంగొని , కృష్ణరూపు మే..
      నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
      L

      తొలగించండి
    3. సూచన... దయచేసి సినిమా పేరడగరాదు😊🙏

      అల్లురామలింగడాచిత్రమందున
      కంస పాత్రధారిగా నటింప
      మధురఁ గృష్ణుడైన మా చిరంజీవియే
      అల్లుఁ జంపనెంచెనాహవమున !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

    4. చిత్రము పేరు మురళీకృష్ణ
      దర్శకులు - వెంకటగిరి

      తొలగించండి
  4. అధిక కట్నమునకు నాశించి వేదించి
    కూఁతుఁ జంపినాఁడు క్రూరుఁ డగుచు
    ననుచు క్రోధమంది యా దుష్టుఁ డైనట్టి
    యల్లుఁ జంపఁ దలఁచె నాహవమున.
    (ఇక్కడ ఆహవ మంటే జీవన పోరాటమే)

    రిప్లయితొలగించండి
  5. కల్ల బొల్లి సోది కల్పించి జెప్పుచు
    వల్ల మాలి ప్రేమ నొలక బోసి
    తుదకు మోస గించి దొంగవోలె పాఱు
    యల్లుఁ జంపఁ దలఁచె నాహవమున

    రిప్లయితొలగించండి
  6. వస్త్ర మూడ్చి సతి కి వంత ను గల్గిoచు
    దుస్స సేను భీము దునుమ నెంచి
    శపథము నెర వేర్చ శక్తి తో శకుని మే
    నల్లు జంప దలచె నాహవ మున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భీము' అన్నది ప్రథమావిభక్తిలో లేదు. దుస్ససేనుని, భీముని దునుమ నెంచి... అన్న విపరీతార్థం వస్తున్నది.

      తొలగించండి

  7. కంసుడు

    చెల్లి పెండ్లి చేసి సిరుల నొసంగుచు
    పంపు వేళ నింగివాణి వినుచు
    చెల్లెలిసుతు వలన చేటగు నని యెంచి
    అల్లు జంప దలచె నాహవమున

    రిప్లయితొలగించండి
  8. చెల్లికొడుకు చేత చెల్లు జీవితమని
    విన్నువాణిమాట వినిభయమున
    చిరుత వయసు లోన కరవాలమున, కంసు
    డల్లుఁ జంపఁ దలఁచె నాహవమున

    రిప్లయితొలగించండి
  9. (కుమార్తె సంయుక్తను స్వయంవరంలో గొనిపోయిన పృథ్వి
    రాజును చంపదలచిన కాన్యకుబ్జరాజు జయచంద్రుడు)
    మల్లెలతీవ వంటి తన
    మానితపుత్రిక రాగసంయుతన్
    చల్లగ వెంటబెట్టుకొని
    చయ్యన తళ్కుల ఖడ్గచాలనన్
    ఝల్లన వైరిగుండియలు
    శౌర్యము జూపిన పృథ్విరాజునే
    యల్లుని జంపగా దలచె
    నాహవమందున మామ క్రుద్ధుడై .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      జయచంద్రుని ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ప్రాణ హాని వాని భయమును పెంచగ
    పరమ దుష్టు,కంసు, పతితుఁజేసె
    కృష్ణు, దేవదేవు,గేలి సేయుచును,మే
    నల్లుఁజంపఁదలచె నాహవమున.

    రిప్లయితొలగించండి
  11. నల్లనైన వాని గొల్లను రమ్మన
    వల్లె యనుచు నతడు వచ్చినంత
    చెల్లెలి కొడుకయిన చిన్న వాడైన మే
    నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున

    నిన్నటి న్యస్తాక్షరి కి నా పూరణ

    దశమి సంబరాల్జరుపగ ధరణి లోన
    శక్తి ,ఇచ్ఛ క్రియాజ్ఞాన , సంపదల ,న
    హరహరము కాన్కగా నీ యనరుగుదెంచు
    రమ్య దుర్గను గొలిచి హారతుల నిడరె

    రిప్లయితొలగించండి
  12. కఠిన మనముతోడకంసుడుతనదుమే
    నల్లుజంపదలచెనాహవమున
    ప్రాణభయమువలనభయకంపితుడగుచు
    కంసుడటులజేసెకవివరేణ్య!

    రిప్లయితొలగించండి
  13. సవరణ పద్యం
    వస్త్ర మూడ్చి సతి కి వంత ను గల్పిoప
    నాగ్రహ మున భీముడా దురితుని
    దుస్ససేను ప్రతి న తో తాను శకుని మే
    నల్లు జంప దలచె నాహవ మున

    రిప్లయితొలగించండి
  14. *ఆ.వె**

    దేవకి తనయుండు దివికిజేర్చుననుచు
    ప్రాణభీతి తోడ భయము జెంది
    గలగరించి చూసి కంసుడే తాను మే
    నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  15. అల్లుడల్లరంచు నాలి యన్నకొడుకు
    దనరహస్యజీవితమును తోడ
    పిచ్చికుక్కజేసి వేయులోకములీల
    అల్లుజంపదలిచెనాహవమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్ జీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయదోష మున్నది.

      తొలగించండి
  16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2820
    సమస్య :: అల్లునిఁ జంపగాఁ దలచెఁ నాహవమందున మామ కృద్ధుడై.
    *అల్లుని చంపాలని మామ అనుకొన్నాడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: “ఓ కంసుడా! నీ చెల్లెలైన దేవకీదేవికి అష్టమ గర్భంలో పుట్టబోయేవాడు నిన్ను చంపగలడు” అని అశరీరవాణి పలుకగా కంసుడు తన చెల్లెలిని చంపబోయాడు. బావయైన వసుదేవుని మాటవిని దేవకిని విడిచిపెట్టినాడు.
    *దేవకికి ఎనిమిదవ బిడ్డగా జన్మించిన కృష్ణుడు వ్రేపల్లెలో యశోదానందుల దగ్గఱ పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు* అనే రహస్యాన్ని నారదుడు తెలియజెప్పగా విని ఆశ్చర్యపడిన కంసుడు క్రుద్ధుడై కృష్ణుని అంటే తన మేనల్లుని తక్షణమే (అక్రూరుని ద్వారా తన మధురా నగరానికి రప్పించి) చంపదలచినాడు అని విశదీకరించే సందర్భం.

    “అల్లుడు నీకు, దేవకికి నష్టమ గర్భము నందు బుట్టినా
    డెల్లర పూతనాదుల వధించినవా” డని నారదుం డనన్
    ఝల్లనె గుండె కంసునికి, జంపగ నెంచెను కృష్ణు నంత; మే
    నల్లునిఁ జంపగాఁ దలచెఁ నాహవమందున మామ కృద్ధుడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
      'చంపగ నెంచెను, చంపగా దలచె' అని పునర్తుకి అవుతున్నది కదా?

      తొలగించండి
  17. పత్రికలను చదువ ప్రతి నిత్యమీ వార్త
    కట్టు తప్పి పోగ కన్న బిడ్డ
    అన్య కులపు వాడి ఆలిగావ కసితో
    నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కులపు వాని యాలి యైన కసితో' అనండి.

      తొలగించండి
  18. శేషుని అవతారము లక్షణుడు. మేఘనాధుని చేతిలో సొమ్మసిల్లి హనుమ దయతో తిరిగి బ్రతికి, శేషుని అల్లుడు ( ఇంద్రజిత్తు) ను చంప తలచెను భావన

    శేష నాగు పుట్టె శ్రీరామునికి నను
    జుడుగ, లంక లోన సొమ్మ సిల్లి
    హనుమ కాచ తిరిగి మనికి, నా శేషాహి
    నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇంద్రజిత్తు శేషునికి అల్లు డైన కథ' నాకు తెలియదు.

      తొలగించండి
    2. Sulochana (Ramayana) Sulochana(Sanskrit: सुलोचना, lit. she whose eyes are beautiful) was daughter of the king of the serpents Sheshanaga, who is mentioned in the Indian epic Ramayana. She was married to Indrajit(Meghanada), who was the eldest son of great king Ravana, who defeated Indra, hence received his title.

      తొలగించండి

    3. ఏ రామాయణములో ఈ కథ వస్తుందండి పూసపాటి వారు?


      జిలేబి

      తొలగించండి
    4. Valmiki ramayamamlo ani vinnanu. Okasri pochiraju vari salaha adugutanu talli

      తొలగించండి
    5. జిలేబి గారికి మీరు వెలిబుచ్చిన సందేహమునకు వివరణ వాల్మీకి రామాయణం లో దొరకలేదు. ఏభయి సంవత్సరాల క్రితం సతీ సులోచన అన్న సినిమా వచ్చింది దానిలో నందమూరి ఇంద్రజిత్తు మరియూ అంజలి సులోచనగా నటించారు. దానిలో శేషనాగు పుత్రిక కా తెలిపారు నాటి సినిమాలు నైతిక విలువలకు దర్పణం ఆధార రహితముగా నిర్మాణం జరిగేది కాదు‌ కాబట్టి ఎక్లడో ఆధారము ఉన్నది నాకు లభ్యం అయితే మళ్లీ ప్రస్తావిస్తాను మన బ్లాగులో కవి శ్రేష్టులు నా (మీ) సందేహ నివృత్తి చేయగలరేమో ఎదురు చూద్దాము

      తొలగించండి
  19. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    అల్లుని జంపగా దలచె నాహవ
    మందున మామ కృద్దుడై
    ======================
    మిక్కిలి కోపించిన మామ యుద్ద
    రంగమున అల్లుడిని చంపుటకు
    తలచినాడని చెప్పటంలో విశేషం
    ఇచట సమస్యగా పరిగణించడం
    ======================
    యుద్దమనగా ఇచట ఇంటి గొడవ
    లేదా కుటుంబ కలహంగా చెప్పు
    కొనవచ్చును
    =======================
    సమస్యా పూరణం - 286
    ===================

    షోకులు మరి పెక్కులుగా చేసి-
    ప్రేమ బాసలను ఎన్నో కూసి
    రేపటికి కడుపది పెరుగునని చూసి-
    మనువాడెను మందు పూసి
    కట్నానికి తన్ని పంపు వాని-
    చేష్ట కాగ్రహోదగ్దుడై
    అల్లుని జంపగా దలచె-
    నాహవమందున మామ కృద్దుడై

    ====##$##====

    పెద్దలు కుదిర్చిన వివాహమాడిన దంప
    తులతో పోల్చగ ప్రేమ వివాహ దంపతులలో
    వివాహేతర విచ్చల విడితనములు కాస్త ఎక్కు
    వని NSS (National Sample Survey )
    వారి ఉవాచ.

    కొసమెరుపు:-
    ==========

    1. ప్రేమంటె అదేమిటో పూర్తి స్థాయిలో వివ
    రించ లేని మైనర్లుగా బాలరాజు,బాలమణి
    లు"లౌ"లో పడి "భౌభౌ" మని అరుస్తున్నారు

    2. పెళ్ళి కి ముందే 70% ప్రేమను ఖర్చు చేసు
    కుని మిగిలిన 30% ప్రేమతో బ్రతుకులను
    ఈడ్చలేకపోవటం.

    3. సాలె పురుగు తనకు తాను ఎప్పటికప్పుడు
    నోటి ద్వారా "సలైవా"ను ఉత్పత్తి చేసుకున్న
    ట్లుగా ఈ కాలం ప్రేమికులు తరిగిన ప్రేమను
    భర్తీ చేసుకునే విజ్ఞత కాని రసజ్ఞత కాని కలిగి
    ఉండక పోవటం, కారణం ఈ శకుంతల
    B.Pharm లో14 సబ్జెక్ట్ లు తప్పినదిగా ఉంటె
    ఆ దుష్యంతుడు B Tech లో 24 సబ్జెక్ట్ లు
    తప్పిన వాడిగా ఉన్నారు.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  20. ఉల్లములోన భీతి పెను యుప్పెనగా హృదయమ్మునుండగా
    చెల్లిని బావగారి కడు శీఘ్రముగాచెఱసాలఁ ద్రోసియున్
    కల్లలెరుంగ నట్టియొక కారణజన్ముని కృష్ణు సొంత మే
    నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదటిపాదం - పెనుయుప్పెనయై వణీకించు చుండగా

      తొలగించండి
    2. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పెను + ఉప్పెన = పెన్నుప్పెన' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి


  21. విష్ణు వాత డౌత విధిని మార్చు, జనన
    మొందె నంట, చెల్లి ముద్దుల కొడు
    కంట తనను నడచు, కంసుడాతండు మే
    నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. పద్మవ్యూహ మందు పదిమంది గుమిగూడి
    పిల్లవాని చేరి కల్లరీతి
    పార్థు లేనివేళ పడగొట్టి కృష్ణు మే
    నల్లు జంపదలచె నావహమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పద్మవ్యూహ' మన్నపుడు 'ద్మ' గురువై గణదోషం. పదిమంది దలచె... అన్నపుడు కర్తృ క్రియా పదాల సమన్వయం లోపించింది.

      తొలగించండి
  23. కల్లలెరుంగనట్టి సుత కల్లరివానివరించి చేకొనన్
    బల్లిదుడైన తండ్రి సమభావముఁ గోల్పడి, బాధహెచ్చగా
    నుల్లమునందునన్, కినుక యుప్పెనయై దహియించ, వెఱ్ఱియై
    అల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై

    రిప్లయితొలగించండి
  24. చెల్లెలి కాపురమ్ము మన సిచ్చిన వాని వరించినంతనే
    ఎల్లలు లేనిపేర్మి నన లెంతపరీమళమిచ్చునోయటం
    చెల్లలు దాటుచుండనొక చేటొనగూడని జ్యోస్యులన్నమే
    నల్లుని జంపగా దలిచె నావహమందున మామకృద్ధుడై

    రిప్లయితొలగించండి
  25. ఉల్లమునన్ స్థిరత్వమది యొక్కటి యుండని శల్యు డక్కటా!
    కల్లల ప్రేమ జూపు నల కౌరవనాథుని నమ్మె స్వంత మే
    నల్లుని వైరి జేసికొనె నచ్చెరు వొందగ సేన లెల్ల మే, నల్లు. ని జంపగా దలచె నాహవమందున మామ కృద్ధుడై.

    రిప్లయితొలగించండి
  26. ఉత్పలమాల
    చెల్లికి తమ్మిమొగ్గరముఁ జెప్పుచు నామెయె నిద్రనుండగన్
    మెల్లగ విన్నవాడు మహి మీరెడు వాడగు నంచు కృష్ణుడున్
    వెళ్లుట దెల్పి తిర్గి యని వీడుట నేర్వగ లేక జేసి తా
    నల్లునిఁ జంపఁగన్ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై

    రిప్లయితొలగించండి


  27. అల్లన యోగమాయ పలుకంగన నాకస వీధిలోన, మే
    నల్లునిఁ జంపగాఁ దలచెఁ నాహవమందున మామ కృద్ధుడై,
    పిల్లల నెల్ల చంప తను వీధుల వాడల నంప, రక్కసుల్
    మల్లెల మాలలన్ తురిమి మల్లిక లై చనిరమ్మ పల్లెలన్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. ఆటవెలది
    ఆదియోగియైన నా శంకరుఁడు మోహ
    మంద జేసె నంచు నంగజుండు
    నొసటి కన్ను దెరచి మసిజేయ బూనుచు
    నల్లుఁ జంప దలఁచె నావహమున

    రిప్లయితొలగించండి
  29. ౩.
    కల్లలెరుంగనట్టి సుత కల్లరివానివరించి చేకొనన్
    బల్లిదుడైన తండ్రి సమభావముఁ గోల్పడి, బాధహెచ్చగా
    నుల్లమునందునన్, కినుక యుప్పెనయై దహియించ, వెఱ్ఱియై
    అల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై

    రిప్లయితొలగించండి
  30. asnreddy

    పిల్లనొసంగి తా పదవి ప్రేమముతోనిడి గౌరవించగా
    చెల్లికుమారు డక్రమపు చెన్నున చేయగ పెక్కుకుట్రలన్
    చిల్లర చేష్టలన్ గనుచు చెడ్డమనస్కునిఁ గాంచి క్రుద్ధుడై
    యల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై

    రిప్లయితొలగించండి
  31. మిత్రుఁ డనియె నిట్లు మేటి చరిత భార
    తమున నరుని రాథ తనయుఁడు పెను
    చలము వూని మదినిఁ, జక్క నతఁడు కథ
    లల్లుఁ, జంపఁ దలఁచె నాహవమున


    కొల్లలు గాథ లివ్వసుధ గోత్ర వినాశన పూరితంబులై
    కల్లన రాదు క్రూరమిల క్షత్రియ వంశపు ధర్మ మెంచగం
    దల్లడ మంద లోకములు ధర్మ తనూభవు శల్యుఁ డవ్వ మే
    నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    గొల్లున కాంగ్రెసున్ విడిచి గోలగ టీడిని జేరుచున్ భళా
    మెల్లగ మెల్లగా తనను మ్రింగుచు జీర్ణము జేసుకొంచుచున్
    చల్లగ చల్లగా విధుడు చాపకు క్రిందున నీరునింపగా
    నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. తలచిన వారే చచ్చుట కృష్ణుని కాలం నుండే అలవాటు కామోసు :)


      తొలగించండి
    2. శంకరాభరణం లో చేరి కరెక్ట్ గా రెండేళ్ళౌతోంది...నిరక్షరాస్యునిగా...

      పాతవీ క్రొత్తవీ కలిపి దాదాపు రెండు వేల పూరణలూ పద్య రచనలూ పూర్తి అయి ఉండనోపు. భాగవత, భారత, రామాయణాల జోలికి పోకుండా. ఇది శంకరార్యుల విశాల దృక్పథమునకు తార్కాణం.

      మొన్న నా "శంకరార్పణం" బ్లాగుకు వారి స్పందన:

      "వీక్షించాను. సంతోషించాను. మీ పూరణలతో ఒక పుస్తకాన్ని ఆశించవచ్చా?"

      సారూ! ఆగండి మరో సంవత్సరం...

      అప్పటికి అంతా బాగుంటే "సరదా శంకరాభరణం" అని ఒక చిన్న booklet బయటకు తీస్తాను. అంకితం కంది వారికీ, జిలేబి గారికీ.

      శుభం భూయాత్!

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      Booklet తీయాలన్న మీ ఆలోచన స్వాగతింప దగినది. సంతోషం!

      తొలగించండి

    4. మీ పుస్తక విమోచన కార్యక్రమానికి జిలేబివారికి ఆహ్వానపత్రిక పంపుడీ తప్పక వచ్చెదము :)


      జిలేబి

      తొలగించండి
    5. మీరే కదా ఆవిష్కరణ చేయబోయే వారు :)

      నవ్వులాట కాదు సుమా! నా మనుమరాలి పేరుతో ఇప్పటికి 5 booklets ప్రచురించి ఉన్నాను గత దశాబ్దంలో. వీటిలో 4 పుస్తకాల కాపీలను కంది వారికి సమర్పించాను. ప్రతి booklet title లో "ishani" పేరు ఉన్నది...English language...

      తొలగించండి

    6. Interesting! అండి.

      Pl publish as PDFs and post link


      జిలేబి

      తొలగించండి
    7. No way....

      Please send me your postal mailing address to my e-mail (given in my blog). And you will get one copy each of the 5 booklets by courier if it is in India or Air Mail if it is abroad...promise!

      http://gpsastry.blogspot.com/2012/12/boquet-for-booklet.html

      తొలగించండి
    8. Three "stories' from these booklets appeared in the "Now & Again" column of The Statesman, Calcutta (then they got fed up ;)

      తొలగించండి
  33. ఇప్పుడే ఆకాశవాణిలో సమస్యాపూరణం రికార్డు చేసి బయలుదేరాను. అస్వస్థత, గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా చాలా చోట్ల తడబడ్డాను. నాకైతే అంత తృప్తికరంగా లేదు. రేపు ఉదయం విని మీరే చెప్పాలి ఎలా ఉందో..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. వాయ్స్ అడ్జస్ట్ మాడించేస్తారట :)

      ఇప్పుడే బ్రేకింగు న్యూసు :)



      జిలేబి

      తొలగించండి
  34. అవని బుట్టు నిన్ను నంతమొందించెడు
    వాడనుచును గగన వాణి పలుక
    నాగ్రహించి కంసు డంధుడయి తన మే
    నల్లుఁ జంపఁ దలఁచె నాహవమున.

    రిప్లయితొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    అల్లునిఁ జంపఁగాఁ దలఁచె
    నాహవమందున మామ కృద్ధుఁడై

    సందర్భము: తన చెల్లెలైన దేవకికి వసుదేవునితో వైభవంగా వివాహం జరిపించినాడు.అందరూ పెళ్లి ముచ్చట్లలో మునిగి ఉన్నారు.
    బావమరిదితో బాటు చెల్లెలిని రథము మీద నెక్కించుకుని అత్తవారింటికి కంసుడు పంపే తీసుకు వెళుతున్న సందర్భంలో ఆకాశవాణి చల్లగా చావు ముచ్చట యిలా వినిపించింది.
    "ఓరీ! కంసా! నీ చెల్లెలికి పుట్టబోయే నీ మేనల్లుడే నిన్ను అంత మొందిస్తాడు."
    వెంటనే మితిమీరిన కోపంతో కంసుడు తన అల్లుని చంప దలంచినాడు.
    (ముందస్తు జాగ్రత్తగా చెల్లెలిని చంపితే సరి! అనుకుని రథం మీద నుంచి దేవకిని క్రిందకు లాగి కత్తి దూసి చంపబోయినాడు.)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఎల్లరు పెండ్లి ముచ్చటల
    నింపుగ తాము మునింగి యుండగా
    చల్లగ చావు ముచ్చటను
    "సంబర మేలర! కంస! నీదు మే
    నల్లుడె నిన్ను జంపు" నని
    యభ్ర మయో వినిపించె!.. నంతనే
    యల్లునిఁ జంపఁగాఁ దలఁచె
    నాహవమందున మామ కృద్ధుఁడై

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    19.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  36. అల్లదె దేవకీసుతుడుయాదవశ్రేష్ఠునిజన్మవార్తయున్
    నుల్లమునున్ గకావికలనొంచగగంసుడుక్రోధమొందుచున్
    చెల్లెలుబాధనున్గనకచెప్పుడుమాటలువిన్నవాడునై
    నల్లునిజంపగా దలఁచె నాహవమందున మామ కృద్ధుఁడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జన్మవార్తయే। యుల్లమునున్...' అనండి.

      తొలగించండి
  37. హడల గొట్టినట్టి యలనాటి యశరీర
    వాణి తోడు మౌని వాక్కుల గొని
    కంసు డాగ్ర హించి కరుణ దలచక మే
    నల్లు జంప దలచెనాహవమున!

    గురువర్యులకు నమస్సులు, నా నిన్నటి పూరణను కూడా పరిశీలింప ప్రార్థన.
    దశ విధములుగ దుర్గమ్మ తల్లిని గన
    శరదృతువు లోన విజయ దశమి వరకును
    హవన సహిత పూజ లొనర్చి హారతు లిడ
    రహిని కల్గించవె దసరా లహరహమ్ము!

    రిప్లయితొలగించండి
  38. తల్లి, తమ్ముడు, సతి, ధరణిజనువదల
    మనుచు జెప్పుచున్న, మానుకొనక
    బంతిమోములదొర పాలసముద్రపు
    నల్లు జంప దలచె నాహవమున!!!

    చెల్లి సుతుని వలన చెల్లునాయువనుచు
    గగనవాణి దెలుప కలత బడుచు
    కనికరమ్ము లేని కంసరాజు తన మే
    నల్లు జంప దలచె నాహవమున!!!

    రిప్లయితొలగించండి
  39. అల్లన పెర్గుచుండె నొక యల్లరి బాలుడు నిన్ను జంపగన్
    కల్లయె గాదటంచు గద కందట పల్కెను యోగమాయయై
    ఝల్లనె గుండె కంసునకు జాలిని వీడి దలంచె నయ్యె మే
    నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవ మందున మామ కృద్ధుడై.

    రిప్లయితొలగించండి
  40. మామనిదురయందు మైమరపుకల
    అధికకట్నమివ్వ?నల్లుడలుగ?
    మమతమాని మగడుమనుగడమరువగ
    అల్లు జంపదలచె నాహవమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర గణదోషం. "మైమరపుం గల" అందామా?

      తొలగించండి
  41. అల్లరి కృష్ణుడే తనదు నాయువు తీసెడి వాడటంచు తా
    నుల్లము నందు నెంచుచును నొప్పుగ పంపెనక్రూరుని ,నెమ్మితోడ వ్రే
    పల్లెకు నేగికృష్ణ బలభద్రుల తోడనురమ్మని,రాగ కంసుడా
    యల్లుని జంపగా దలచె నాహవమందున మామ క్రుద్ధుడై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ, మూడవ పాదలలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  42. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఈనాటి సమస్య వృత్తపాదంలో 'క్రుద్ధుఁడు' అనడానికి బదులు 'కృద్ధుఁడు' అన్నాను. గుండు మధుసూదన్ గారు చెప్పేదాక గమనించలేదు. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  43. నల్లనివాడు యింద్రజిత నామము వాడు ననంతు బుత్రికన్
    దొల్లియు బెండ్లియాడెనట దోషమెరుంగక మామ లక్ష్మణున్
    విల్లును బట్టి గూల్చ కపి వీరుడు రక్షణ సేయ లేచి దాఁ
    నల్లునిఁ జంపఁగాఁ దలఁచె నాహవమందున మామ క్రుద్ధుఁడై

    రిప్లయితొలగించండి
  44. డా. పిట్టా సత్యనారాయణ
    తల్లిదండ్రులాజ్ఞ దప్పి తత్తనయకు
    కల్లబొల్లియాశ గలుగజేసి
    ఇల్లు బీకి పంది రేయు యెస్టీ వరు
    నల్లు జంప దలచె నావహమున

    రిప్లయితొలగించండి
  45. డా. పిట్టా సత్యనారాయణ
    చెల్లినయంత నూతగొని సేవల హక్కుల సాధనంబునున్
    వల్లె యనంగనోపక సవాలుగ నా శబరీశు మందిరం
    బల్లన స్త్రీల జేర్చి క్రతువార్పగ జూచెడి యింటిశత్రువౌ
    అల్లుని జంపగా దలచె నావహమందున మామ, కృద్ధుడై

    రిప్లయితొలగించండి