13, అక్టోబర్ 2018, శనివారం

సమస్య - 2816 (వాడిన పూవులే తగును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్"
(లేదా...)
"వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య...)

84 కామెంట్‌లు:

 1. వీడుమవేల వేల్పులకు, వేసిన తప్పగు పెంటజేర్చగన్
  వాడిన పూవులే తగును, భామలకున్ బతుకమ్మ బేర్చగా
  వాడెదరంట తంగెడులు బంతులు నందివర్ధనాల్
  బీడగు భూములందు విరివిన్ గల తెల్లని గున్గుపూవులున్

  రిప్లయితొలగించు
 2. అతి భక్తి తోడ పూలను
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును; వాడిన పూలన్
  సతతము తీయుచు విడిగా
  పతులకు నీయంగవలయు పార్వేయుటకున్ :)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 3. మైలవరపు వారి పూరణ

  ఆడుచు పాడుచుంద్రు బతుకమ్మ ల మా తెలగాణసీమ బూ...
  బోడులు రంగురంగులగు పువ్వుల దెత్తురు , వాటి వాసనల్
  సూడక , భక్తిభావమున చుట్టగ చుట్టుదురంతె , భక్తితో
  వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు


 4. సతతము మాలల తోడుగ
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును, వాడిన పూలన్
  జతకట్టి కొమ్మల కెడన్
  లతాంగి విడుమా ప్రకృతి కెల నొదిగి ప్రిదులన్!


  జిలేబి

  రిప్లయితొలగించు


 5. తోడుగ మానసాంబుధిని దోచెడి వాడ మగండవన్ సఖీ
  నీడగ వెన్క బోవుచు పునీతపు జీవిత మందు కొమ్మ! క్రీ
  నీడల నాతడిన్ వశము నీవుగనన్ మధురోహలన్ వెసన్
  వాడిన పూవులే తగును భామలకున్, బ్రతుకమ్మఁ బేర్చఁగన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 6. సతులొకచోట మిళితమై
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును, వాడిన పూలన్
  ధృతితో పండుగ రోజున
  సతి శాంభవి కరుణతోడ సత్ఫల మిచ్చున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 7. (పేదపిల్ల వసుమతికి పూలు దొరకక చేసిన పని )
  అతుకుల గతుకుల బతుకును
  సతతము గడపెడి వసుమతి చకచక వెదుకన్
  మితసుమము లయిన దొరుకక
  బ్రతుకమ్మల బేర్చదగును వాడిన పూలన్ .

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "వారలు పెద్ద పెద్ద ధనవంతుల పిల్లలు ముందుగానె..." పద్యాన్ని గుర్తుకు తెచ్చారు.

   తొలగించు
 8. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ========================
  వాడిన పూవులే తగును భామలకున్
  బ్రతుకమ్మ బేర్చగన్
  =========================
  వాడిన పూవులే సరియైనవి ఆడవారికి
  బతుకమ్మలను పేర్చి సింగారించుటకు
  అని చెప్పుటలో అసంబద్దతె సమస్య
  ==========================
  సమస్యా పూరణం - 282
  ==================

  గాలిని తాకినవి తాముగ చూడు-
  నీరు తగలకున్న అవి వాడు
  క్రిమి కీటకమ్ముల స్పర్శ తోడు-
  మట్టి సంసర్గముగ నేడు
  ఏరుకొచ్చిరన తీరొక్క విరులు-
  ఎంగిలిగ వాడిన పూవులే
  తగును భామలకున్ బ్రతుకమ్మ-
  బేర్చగన్ సద్దివి కావులే

  ====##$##====

  శివార్చక తత్త్వం
  ============

  ఏమి సేతుర లింగా, ఏమీ సేతురా //ఏమి//

  గంగ ఉదకము తెచ్చి నీకు-
  లింగ పూజలు చేదమంటె
  గంగనున్న శాప కప్ప-
  ఎంగిలంటున్నాయి లింగ //ఏమి//

  మహానుభావ/మాలింగమూర్తి/మాదేవ శంభో

  అక్ష ఆవుల పాడి దెచ్చి -
  అర్పితము చేదమంటె
  అక్ష ఆవుల లేగ దూడ-
  ఎంగిలంటున్నాది లింగ //ఏమి//

  తుమ్మి పూవులు తెచ్చి నీకు-
  తుష్టుగా పూజేదమంటె
  కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద-
  ఎంగిలంటున్నాది లింగ //ఏమి//

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ----- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించు
 9. వీడిరి తోడునీడలనువేదనజెందగ జీవితం బునన్
  వాడినపూలరీతిగనువారలుమారిరిధార్మికమ్ముగన్
  ఆడిన ఆటపాటలనుహర్షమునొందగదెల్యజెప్పగన్
  వాడినపూవులేతగునుభామలకున్ బ్రతుకమ్మబేర్చగన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాధాకృష్ణారావు గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 10. సమస్య :-
  "బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్"

  *కందం**

  అతి సుందరమగు పూవుల
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును;వాడిన పూలన్
  వెతకి వెతకి వేరు పరచి.
  బ్రతుకులు బాగుపరచమని భక్తి కొలిచెదన్
  ....................✍చక్రి

  రిప్లయితొలగించు
 11. వేడుక మీరఁ బూవులను పేర్చి తమిన్ బ్రతుకమ్మ రూపునన్,

  వాడల వాడలందు నొకవారగ జట్టుగఁ జుట్టు సాగుచున్,

  పాడుచు నాడుచుండ, నిట బంతులు తంగెడు గున్గు, పూర్వజుల్

  వాడిన పూవులే, తగును భామలకున్ బ్రతుకమ్మ పేర్చగన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించు

 12. వాడినపూవులేతగునుభామలకున్బ్రతుకమ్మపేర్చగన్
  వాడినపూవులాచెపుమ,భామలుబేర్చుటకున్బ్రదుకమ్మకున్
  వాడినవాటినిన్వదలిపచ్చటిపూలనుబేర్చనమ్మయున్
  బాడియుబంటలున్మఱియుబచ్చగనుండగ జేయునెప్పుడున్

  రిప్లయితొలగించు
 13. సతతము నూతన సుమముల
  బతుకమ్మల బేర్చదగును; వాడిన పూలన్
  మతిమంతులు వాడరెపుడు
  నతులందెడి వేల్పు గొల్వ తగవని తెలియన్!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించు
  3. చివరి పాదమునకు సవరణ
   స్తుతులందెడు వేల్పుగొల్వ సుంతయు తగవన్
   యతి దోషాన్ని సూచించిన జిపి శాస్త్రిగారికి ధన్యవాదములతో నమస్సులు!   తొలగించు
 14. (1)
  వేడుక మించఁగా సతులు వేగమె పుష్పవనమ్ముఁ జేరి తా
  మోడకయే పరస్పర నయోచిత భాషణముల్ సెలంగగన్
  జూడ మనోహరమ్ములగు శోభలతోఁ దరుశాఖలందు జి
  వ్వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్.
  (2)
  వీడని స్నేహభావమున వేవెలఁదుల్ తెలఁగాణ పల్లెలన్
  వేడుక మించఁగన్ గలసి వీనుల విందుగఁ బెక్కు రీతులన్
  బాడియు నాడి చేసికొను పర్వము వచ్చెను; కొమ్మలందు జ
  వ్వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్.

  రిప్లయితొలగించు
 15. గురువు గారికినమస్కారములు
  ఆకాశవాణి లో ఎప్పుడు వస్తుంది?సమయంతెల్పగలరు
  రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించు
 16. ఈవారానికి ఆకాశవాణి వారి సమస్య....
  "నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్"
  మీ పూరణలను గురువారంలోగా padyamairhyd@gmail.com కు పంపించండి.

  రిప్లయితొలగించు
 17. సితతామర పుష్పంబుల
  బ్రతుకమ్మలబేర్చదగును,వాడినపూల
  న్నాతులుదీతురుభక్తిని
  నతులనువేల్జేయుచుండినమ్రతతోడన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం మొదటి అక్షరం గురువయింది. "వాడిన పూల। న్నతివలు..." అనండి.

   తొలగించు
 18. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2816
  సమస్య :: వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్.
  వాడిన పూవులే బ్రతుకమ్మను పేర్చేందుకు తగినటువంటివి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: *భగవత్సేవలఁ బొందరాదె బహు సౌభాగ్యమ్ములం బ్రేయసీ!* అని {పోతనభాగవతం-అష్టమ స్కందం-477 వ పద్యంలో} కశ్యప ప్రజాపతి తన భార్యయైన అదితితో మాట్లాడుతూ దైవసేవ యొక్క మహిమను గుఱించి తెలియజేస్తాడు. కాబట్టి దైవపూజవలన వాడిన జీవిత వృక్షాలు చిగురించి ఫలవంతములు ఔతాయి.
  పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి।
  తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః।।అని {గీత-9వ అధ్యాయం-26 వ శ్లోకంలో} గీతాచార్యులు ఉపదేశించియున్నారు.
  అందువలన భక్తులు పత్రము పుష్పము ఫలము తోయము అనే నాలిగింటిలో ఏ ఒక్కదానితోనైనా దైవపూజ చేయవచ్చు. సకల సౌభాగ్యములను పొందవచ్చు. అందుచేత జీవితం అనే ఉత్తమ పుష్పమును వాడి దైవసేవకు వినియోగించి సౌభాగ్యమును పొందదలచిన భామలకు పూవులతో బ్రతుకమ్మను పేర్చడమే తగిన విధి అని విశదీకరించే సందర్భం.

  వాడిన జీవితాలు ఫలవంతములౌ నిల దైవపూజకై
  వాడిన, పుష్ప తోయ ఫల పత్రములం దొకదాని బూజకై
  వాడిన భక్తి యున్న నగు భాగ్యము; జీవిత సుప్రసూనమున్
  వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (13-10-2018)

  రిప్లయితొలగించు
 19. మోడులువారు జీవిత తమోమయ గాధలు పోల్చి చెప్పగా
  వాడిన పూవులే తగును-భామలకున్ బ్రతుకమ్మఁదీర్చగన్
  పాడగ పాటలన్,బ్రతుకు పండగ,నా తెలగాణ వీధులున్
  వీడని దివ్య కాంతుల,సుభిక్ష,సురక్ష,ల తేలియాడవే!

  రిప్లయితొలగించు
 20. గురువు గారికి నా నమస్కారములు.
  క్రతువున జాజి తోడన్
  బ్రతుక మ్మల బేర్చ దగును,వాడిన పూలన్
  వ్రతమందున్ వాడకుమా
  శృతులన గరికియు శుభైక శృతిగా చేరున్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. "జాజులతోడన్" అనండి. చివరి పాదం అర్థం కాలేదు.

   తొలగించు
 21. జీవితంలో సమస్యలు లేనిరోజు ఉంటుందా! అయితే వేదన పొందకుండా శౌర్యంతో పోరాడి బ్రతుకులో సంతోషాన్ని పొందాలి కదా!! అలా వేదన వీడి ఆటపాటలతో జీవితాన్ని వేడుకగా గడుపుచూ సంతోషాన్ని పొందాలని జీవించడాన్ని నేర్పే ఉత్సవమే బ్రతుకమ్మ పండుగ కదా!!

  ఆడుచుఁ బాడుచున్ మగువ లందరు ముచ్చట గొల్పు రీతిగాఁ
  గూడుచు నుత్సవమ్ముగనుఁ గూరిమి యొప్పగ సంప్రదాయమౌ
  వేడుక జేయుచుండ నట వేదనలన్ విడి తోషమొందగా
  *"వాడిన, పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్"*

  వాడిన = శౌర్యముతో

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాడి' శబ్దానికి శౌర్య మన్న అర్థం ఉంది. కాని శౌర్యముతో అనే అర్థంలో అక్కడ 'వాడిని' అనవలసి ఉంటుంది.

   తొలగించు
  2. ధన్యవాదాలు గురువుగారు

   సవరణతో:
   ఆడుచుఁ బాడుచున్ మగువ లందరు ముచ్చట గొల్పు రీతిగాఁ
   గూడుచు నుత్సవమ్ముగనుఁ గూరిమి యొప్పగ సంప్రదాయమౌ
   వేడుక జేయుచుండ నట వేదనలన్ విడి పేర్చి భక్తితో
   *"వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్"*

   తొలగించు
 22. వేడుకతోడ నంగనలు ప్రీతిని కూరిచి పేర్చిబంతి తం

  గేడును నందివర్థనము కేళికలాడుచు పెక్కు పాటలన్

  పాడుదు రంచుచెప్పితివి, ప్రాణసఖుండ నిజమ్ముసుమ్ము, నీ

  వాడిన పువ్వులే తగును భామలకున్ బ్రతుకమ్మ బేర్చగన్

  రిప్లయితొలగించు
 23. అతివలు గౌరిని కొలువగ
  బ్రతుకమ్మల బేర్చదగును ; వాడిన పూలన్
  కతమున మజ్జన సలుపగ
  వతనుగ పరిసరములన్ని పావనమొందున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వతనుగ'...?

   తొలగించు
  2. గురువుగారికి నమస్కారములు. ధన్యవాదములు
   వతనుగ= మామూలుగ, రివాజుగ as usual అనే భావం తో వ్రాసాను🙏🏽

   తొలగించు
 24. అతివలు చక్కని సుమముల
  బ్రతుక మ్మ ల బేర్చ దగును ; వాడిన పూలన్
  ప్రతి దినము ను తొలగింతురు
  వెతలను బాపoగ వేడి వెలదు లు భక్తిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు


 25. జిలేబి పద్యము - కంది వారి గళము - ఆకాశవాణి సౌజన్యము :)

  సమస్యా పూరణ 13th Oct 2018 లింకు :)


  https://varudhini.blogspot.com/2018/10/blog-post_13.html


  జిలేబి

  రిప్లయితొలగించు
 26. సతతము నవ్య కుసుమములఁ
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలం
  గత మేమైనను మఱి యె
  ట్టి తరుణమునను దలఁచకుమ డెందము నందున్


  తోడుగ రాఁగఁ బత్తనపుఁ దొయ్యళు లెల్లరు బేర్మి నాడుచుం
  బాడుచు నంతరంగములఁ బ్రబ్బఁగఁ దోరపు భక్తి రక్తినిం
  గూడి విభిన్న వర్ణ కుల కోమల పుష్పము లెల్ల, వీడ నా
  వాడిన పూవులే, తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   సాధారణంగా మీరు విరుపుతో పూరణలు చెప్పరు. ఈరోజు చెప్పారు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. నిజమే మీరన్నది.
   వీడి వాడిన పూలను భావముతో వృత్తపూరణము చేయుటచే నట్లు పూరించితిని.

   తొలగించు


 27. వేడుక ముచ్చటల్ గనెడు వేదిక గా నడి రేయి నావలో
  జోడుగ యీడుగా మగని, జొప్పిలు మోహన రూపు పెన్మిటిన్
  తోడగు జీవితమ్ము సయి, తూగెడు మంచము, ముద్దులాటలున్,
  వాడిని పూవులే తగును భామలకున్, బ్రతుకమ్మఁ బేర్చఁగన్


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "జోడుగ నీడుగా" అనండి.

   తొలగించు
 28. సతతము తాజా పూలనె
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును ; వాడిన పూల
  న్నతివలు తొలగించి పిదప
  ప్రతిదినమును శుద్ధి చేసి ప్రణతు లిడదగున్

  నిన్నటి సమస్యకు నా పూరణ

  బూడిదను దాల్చి నుదుటను పుడమి దిరిగి
  ద్వైతమే లేదు జగతి 'నద్వైత' మనుచు
  చాటు దైవమే ననదగు మేటి , కాడు
  జ్ఞానశూన్యుండు ; పొందెను గౌరవమును

  రిప్లయితొలగించు
 29. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వాడను వాడనున్ తిరిగి భామలు చెన్నుగ చౌకళించుచున్
  పోడిమి మీరగా కలిసి పొందుగ నందన మొందుచుండి వా
  రాడగ పాడగన్ మునుపు హాయిగ గౌరిని ప్రీతితోడ కొ
  ల్వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
 30. విఱుపును విడిచి చేసిన పూరణము:

  నుతులఁ దరించి యలసి సొల
  సి తరుణు లుద్వాసన లిఁకఁ జెప్ప నెలమి పూ
  జిత విగ్రహములు జలమున
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ తాజా పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 31. సవరణతో :
  అతి కుతుకం బలరారగ
  నతులిత మగు భక్తి తోడ నన్ని విరులతో
  మతిమంతులె పూజింపగ,
  "బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్"
  ధన్యవాదాలార్యా!
  🌹🙏🙏🌹

  రిప్లయితొలగించు
 32. చేడియ లందరున్ గలసి చేరియొ కింత శుభంబు కోరుచున్
  వేడుక లందునన్ మునిగి వేయిర కమ్ముల పూలశో భలన్
  జోడుగ నాటపా టలను జోరుగ సాగుచు సంతసం బునన్
  వాడిని పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చగన్

  రిప్లయితొలగించు
 33. నమస్కారములు
  గురువులకు ధన్య వాదములు నేను రెండు రోజులు బోస్టన్ వెడుతున్నానుగా.
  అదన్నమాట అసల్ సంగతి ....బై

  రిప్లయితొలగించు
 34. డా. పిట్టా సత్యనారాయణ
  ఆడిన యాట పాటలకు నాశ్వయుజమ్మున గోర్కె బెంపుకై
  చూడగ చంద్రశేఖరుడె శోభిలె నిచ్చి విశాల చీరలన్
  నేడు విమర్శలే జెలగ నెమ్మనమే వసివాడెనే చెలీ!
  వాడినపూవులే తగును భామలకున్ బ్రతుకమ్మ బేర్చగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విశాల చీరలు' దుష్టసమాసం.

   తొలగించు
 35. డా.పిట్టా సత్యనారాయణ
  గతమునకంటెను నధికము
  నతవత్సల బాల, యువక నళినదళాక్షుల్
  వెతలన్ జచ్చిరి భామలు
  బ్రతుకమ్మల బేర్చనగును వాడిన పూలన్

  రిప్లయితొలగించు
 36. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


  బ్రతుకమ పండుగ నాడు త

  న తనయఁ గాటిడగ నొక్క నాగం బకటా

  మృతి జెంద నామె యిటు లనె :-

  " బ్రతుకమ్మల బేర్చ దగును వాడిన పూలన్ "


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించు
 37. సమస్య:*వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మ పేర్చగన్.*
  వేడుక తోడనాడగను విశ్వము నందున గుమ్మడాకులన్
  నేడిట పేర్చుచున్ పిదప నేరుపు తోడను నిత్యమల్లెలన్
  తోడుగ చేర్చుచున్ వడిగ తొయ్యలు లందరు సంబరమ్మునన్
  వాడిన పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మ పేర్చగన్.


  అతివలు పరమాదరమున
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్
  కుతితో పేర్చుచు నెంగిలి
  బతుకమ్మలకెల్ల నాట పాటల తోడన్

  రిప్లయితొలగించు
 38. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  బ్రతుకమ్మలఁ బేర్చఁ దగును వాడిన పూలన్

  సందర్భము: బ్రతుకుల నిచ్చేది బతుకమ్మ. అంటే బ్రతుకులను వికసింపజేసేది అని భావం. ఆ విధంగా వికసింపజేయా లని మనం ఆకాంక్షిస్తున్నప్పుడు బాగా విచ్చుకొన్న పూలతోనే దేవీ స్వరూపిణియైన బ్రతుకమ్మను పేర్చడం సమంజసం. సేకరించిన వాటిల్లో ఒక వేళ వాడిన పూ లేవైనా వుంటే వెతికి తొలగించడం మంచిది.
  అంతే గాని ఎట్టి పరిస్థితిలోను వాడిపోయిన పూలతో పేర్చడం అనేది ఎవరికీ ఆమోద యోగ్యం కాదు.
  వాడిన పూవులు ప్రాణాలు లేని శరీరాలతో సమానం. మృత కళేబరాలను ఎంత కాలం రక్షించినా ఫలిత మే ముంటుంది? ఒకసారి తనువులలోనుంచి ప్రాణాలు నిష్క్రమించిన పిమ్మట ఆ మృతకళేబరాలవల్ల ఏమైనా శుభాలు కలుగుతాయా!
  ("బ్రతుకమ్మల" వద్ద గాని "బ్రతుకమ్మల బేర్చ దగును" వద్ద గాని మామూలుగా విరుస్తారు.
  ఇందులో "పేర్చ " వద్ద విరువడం విశేషం.)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  బ్రతుకులు వికసించును సుమి

  బ్రతుకమ్మలఁ బేర్చఁ...దగును వాడిన పూలన్

  వెతికి తొలగింప.. తనువులు

  గత ప్రాణములైన శుభము కలుగుట వినమే!

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  13.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 39. ammalaadedaru aata paatala thoda...
  akkalaadedaru kaala che la kalupa...
  chelleladedaru kolala thona....
  andaraadedaru alupuleka..
  bathukamma malli raavelaa. vegavegangaaa

  రిప్లయితొలగించు