10, అక్టోబర్ 2018, బుధవారం

చక్ర సీస బంధము

    శ్రీ  వెంకటేశ్వర  ప్రార్ధన 


శ్రీ వేంకటరమణా! శ్రీ నంద నందనా! శ్రీ గోపికాలోల! శ్రీనివాస!
శ్రీలక్ష్మి వల్లభా! శ్రీ అర విందాక్ష! శ్రీ గరుడ గమనా! శ్రీ గిరీశ!
శ్రీ పుండరీకాక్ష! శ్రీ నీరజోదరా! శ్రీ బలి బంధనా! శ్రీ శుభాంగ!
శ్రీదానావారాతి! శ్రీ ద్విజ వాహనా! శ్రీఅపరాజితా! శ్రీ సిరీశ!
శ్రీ శతానందుడా! శ్రీ వర్దమానుడా! శ్రీ భక్తవత్సలా! శ్రీ రమేశ!
శ్రీమధు సూధనా! శ్రీ సామ గర్భుడా! శ్రీ సహస్రవదనా! శ్రీధరుండ!
శ్రీగోవర్ధన ధరా! శ్రీ సుడివాల్దొరా! శ్రీ పురుషోత్తమా! శ్రీకరుండ!
శ్రీ సచ్చిదానంద! శ్రీఅవ్యయానంత! శ్రీ నేత! శ్రీజాని! శ్రీ శిఖండి!
అంబు జోదరా! యమకీల! యజ్ఞపురుష !
జలశయన! రమా కాంతుడా! చక్రపాణి!
పాంశు జాలికా! దైత్యారి! పరమ పురుష! 
కాచు మయ్య మమ్ము సతము కరుణ తోడ 

పద్యము చదువు విధానము : మధ్య వృత్తములో  పసుపు పచ్చ రంగు గల( శ్రీ)తో మొదలు పెట్టాలి. (శ్రీ వెంకట రమణా) అని చదివి చిన్న వృత్తములో గల  (శ్రీ )తో కలిపి 'నందనందనా' అని  చదువుకొంటు పైకి వెళ్ళి   మరల గులాబీ రంగు గడిలో గల (శ్రీ)తో మొదలై 'గోపికాలోల' అని చదివి చిన్న వృత్తములో గల (శ్రీ) కలుపు కొని 'శ్రీనివాస' అని చదువు కోవాలి.   అలా అన్ని గడులు పూర్తి చేసి చివరిలో (శ్రీ శిఖండి) చదివి పైన పసుపు పచ్చ రంగు వృత్తములో  (అంబుజోదరా)   అనుకొనుచు పూర్తి వృత్తము చుట్టి (మమ్ము) తో ఆపి పైన కోణములలో (సతము కరుణ తోడ) అని పూర్తి చేసుకోవాలి. ఈ పద్య విశేషము  (శ్రీ)  అన్న అక్షరము చిన్న వృత్తములో బంధించ  బడి ప్రతి పదము మరల( శ్రీ ) తోటే ప్రారంభము అవుతుంది.   
బంధ కవి   పూసపాటి కృష్ణ సూర్య కుమార్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి