24, అక్టోబర్ 2018, బుధవారం

సమస్య - 2825 (చిన్నయసూరి చేత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో"
(లేదా...)
"చిన్నయసూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే"

136 కామెంట్‌లు:

 1. విన్నప మిద్దియె శంకర:
  మిన్నున కంటినది తెల్గు మీదయ తోడన్
  చెన్నుగ నొప్పను నేనిది:
  "చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఒప్పుట కేమున్నదింక నొజ్జయె చెప్పెన్

   యతికోసం ఏదో వ్రాశా...ఒప్పునో లేదో..
   😁😁

   తొలగించండి
  2. G P Sastry (gps1943@yahoo.com)అక్టోబర్ 24, 2018 8:06 AM

   "చిన్నయసూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాస"...యే
   మన్నవు శంకరార్య! యనుమానము లేదయ నీదుచేతనే
   మిన్నగ నేర్చ క్త్వార్థకము మేలుగ నిత్యపు నుత్వసంధియున్
   పన్నుగ పద్యముల్ నుడివి పండుగ జేసితి రోజురోజిటన్

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ
   అధిక్షేపమో ప్రశంసయో తెలియదు కానీ మీ రెండు పూరణలు మనోరంజకంగా ఉన్నాయి అభినందనలు

   తొలగించండి
  4. అక్షరాలా ముమ్మాటికి నిజం! గత రెండు నెలలుగా నా "శంకరార్పణం" ను పెక్కు దేశాలనుంచీ తెలుగు ప్రియులు వందలు వందలు వీక్షించిరి...Portugal నుంచీ 188

   తొలగించండి


 2. ఎన్నగ నిలిచె జిలేబీ
  చిన్నయసూరి వలన, మృతిఁ జెందెఁ దెలుఁ గయో,
  యెన్నగ నాంగ్లపు మోజున,
  మిన్నగ నిపుడైన నేర్వు మేటి తెలుంగున్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి


 3. మన్నిక గాను వ్యాక రణ మంతయు ప్రోదిగ శిల్ప మాయెనా
  చిన్నయసూరి చేత; మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే
  యెన్నగ నాంగ్ల భాష పయి యెంతయొ మోజును గాన నెల్లరున్
  మిన్నగ నిప్పు డైన మరి మేటిగ నేర్వుడు తెల్గు లెస్సగన్ !

  అరవ మామి
  ఉవాచ :(

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆడబడుచు సీరియస్ పూరణ:
   (జిలేబి గారికి అంకితం)

   అన్నులు శంకరాభరణ మందున జేరుచు కొల్లకొల్లగా
   చెన్నుగ నాంగ్లభాషనిట చీల్చుచు చెండగ చిత్తుచిత్తుగా
   పన్నుగ వృద్ధిజెందగను పాపము వచ్చును నిట్లుపల్కగా:
   "చిన్నయసూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే"

   తొలగించండి

  2. ఆడ పడుచు సరదా పూరణ :)   అన్నా! తెలుంగు బతికెను
   చిన్నయసూరి వలన! మృతిఁ జెందెఁ దెలుఁ గయో
   యన్నుల 'చేతబడి' వలన
   టన్నుల కొలదిగ పదముల టాంకారంబై :)


   జిలేబి

   తొలగించండి
  3. "From the endearing term, ‘Anna’ to words like Abba, Achcha, Bapu, Bada Din, Bachcha and Surya Namaskar, over 70 new Indian words from Telugu, Urdu, Tamil, Hindi and Gujarati alongside 900+ Indian words that already exist in the OED have turned global.

   https://www.google.co.in/amp/s/www.thebetterindia.com/119321/oxford-dictionary-indian-origin-words/amp/"

   తొలగించండి


  4. తిన్నగ నాంగ్లంబందున
   మిన్నగ బతికెను జిలేబి మించారగనన్ !
   అన్నా! చెప్పితి తప్పక
   చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో!


   జిలేబి

   తొలగించండి
  5. జిలేబీ గారూ,ప్రభాకర శాస్త్రి గారూ,
   సంవాద రూపంగా మీ పూరణ పద్యాలు బాగున్నవి అభినందనలు.

   తొలగించండి
  6. జిలేబి గారూ:

   మీ అనుమతి, సమ్మతి లేకుండా మీ profile picture నా "శంకరార్పణం" బ్లాగులో నా పద్యంతో సహా ప్రచురితమైనది.

   మీరు తీవ్రంగా protest చేస్తే తొలగించగలను క్షమార్పణలతో.

   😊

   తొలగించండి

  7. జిలేబి ఎచట వుండును ?

   జిలేబి


   ఎక్కువగా


   చదివిన


   టపాలలో


   ఉండును !


   జిలేబి

   తొలగించండి
 4. మన్నన బొందెనుగ తెలుగు
  చిన్నయసూరి వలన; మృతి జెందె తెలుగయో
  భిన్నము జేయగ భాషను
  క్రన్నన నన్యపు పదములు కటువగు నిజమే

  క్రన్నన = పిమ్మట

  రిప్లయితొలగించండి
 5. డా.పిట్టా సత్యనారాయణ
  ఉన్నది యుండగ లక్షణ
  మన్ననిదే యనగ మేలు మరి శా‌సించన్
  సున్న యగును నుడికారము
  చిన్నయసూరి వలన మృతి జెందె తెలుగయో!

  రిప్లయితొలగించండి
 6. డా.పిట్టా సత్యనారాయణ
  చిన్నగ బాతి పెట్టవలె చేష్టల జూపెడి లక్షణార్థులన్(Bury the grammarian)
  వన్నెలులవెన్ని వచ్చినను వాడుకతో నవి మన్ను వాణినిన్
  బన్నుగ నర్ధ బిందువులు వల్పలగిల్కులు మాయమాయె నా
  చిన్నయసూరి చేత మృతి జెందెనయో మన తెల్గు బాసయే!

  రిప్లయితొలగించండి
 7. మిన్నగ వాడుక నుడిఁ జే
  కొన్న గిడుగు రామమూర్తి గురుఁ డిట్టులఁ దా
  నన్నాఁడఁట నిశ్చయముగ
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో!

  రిప్లయితొలగించండి
 8. చిన్నయసూరి తెన్గునుడిఁ చెక్కిన శిల్పవిధమ్ము మల్చి, వి

  ద్వన్నుతగా నొనర్చ నల వ్యాకృతికల్పనఁజేసె భాషకున్

  వన్నెను గూర్చ, నొక్కడయొ! భ్రష్ఠమొనర్చగ , వాని హేతునన్

  జిన్న! యసూరి చేత మృతిఁ జెందె నయో మన తెన్గు బాసయే,

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 9. నన్నయతిక్కనాది కవినాయకు లిచ్చిన కావ్యసంపదల్
  వన్నెయు వాసియుం గలిగి వర్ధిలె వ్యాకరణంపువేత్తయౌ
  చిన్నయసూరిచేత ; మృతిజెందెనయో ! మనతెల్గుబాసయే
  పన్నుగ పల్కలేని పరభాషల మోజుల డింభకాళిచే .

  రిప్లయితొలగించండి
 10. మన్నన గొప్పగ బొందగ
  ఎన్నగ పరవస్తు పేరుయె కలమునకు నే
  పిన్నలు పెద్దలు యనుకొనె
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "పేరునె ... పెద్ద లనుకొనిరి" అనండి

   తొలగించండి


 11. ఏదో రాసేమా, పోయేమా అని లేకుండా సమాసాలు, సంధులు, వ్యాకరణము, దీర్ఘము, హ్రస్వము అనుచు అబ్బబ్బ యేమి తలనొప్పి తెచ్చి పెట్టితి వయ్యా బాలవ్యాకరణ మనుచు సులభమనుచు :)  అన్నా! పదాను శాసన
  మెన్నగ నిచ్చితి తెలుంగు మేటిగ నిలువం
  గన్నా యని రుద్దగ నా
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో!  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. మిన్నుల నంటుమ ధురమగు
  విన్నను చాలును తెనుగున వీనుల విందౌ
  మిన్నక గిట్టని వారలు
  చిన్నయ సూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో

  రిప్లయితొలగించండి
 13. మన్నన గలిగె ను తె లుగు కు
  చిన్నయ సూరి వలన ; మృతి చెందె తెలు గ యో
  యెన్నగ నాంగ్ల ము నేర్చి యు
  చెన్న గు తెలుగు ను మరచుట చేతను గదరా !

  రిప్లయితొలగించండి
 14. Pittasatyanarayana733@gmail.com
  డా.పిట్టా సత్యనారాయణ
  విన్నప సన్న లెన్నియును వే వివరింపగ వాడుకౌనొకో
  తిన్నని భక్తి వోలె గను తీవ్రత వచ్చి వరించె నాంగ్లమున్
  బన్నుగ సాగి పో గనమె భారత భారతినైన; సంస్కృతం
  బెన్నగ వాడ్క దప్పెనిక భీకర సూత్రము లిచ్చి యిచ్చి నా
  చిన్నయసూరి(grammarian as a common noun)చేత మృతి జెందెనయో మన తెల్గు బాసయే!

  రిప్లయితొలగించండి
 15. రిప్లయిలు
  1. అన్నుల మిన్నగా బొగడ నప్పయదీక్షితరాయలాదులే

   ఖిన్నుల మైతిమీ జిగిబిగిం గల తెన్గును తూలనాడగన్,

   చిన్నదనానఁ బల్కితివొ? చిత్రమనోభ్రమ నొంది యంటి వే

   చిన్నయసూరి చేత మృతి జెందె నయో మన తెన్గు బాసయే?

   కంజర్ల రామాచార్య.   తొలగించండి
  2. రామాచార్య గారూ
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు .

   తొలగించండి
 16. సన్నుతి జేయగా పొగిడి సంతస మందున నీయగా ఘనం
  బన్నను సూరియంచు నిల భాసిలు మోయని కీర్తినీ యగా
  యెన్నగ లేనిపం డితుడ యివ్విధి నిందలు మోపుచున్ నినున్
  చిన్నయ సూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గు బాసయే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. "కీర్తనీయుగా నెన్నఁగ" అనండి.

   తొలగించండి
  2. సన్నుతి జేయగా పొగిడి సంతస మందున నీయగా ఘనం
   బన్నను సూరియంచు నిల భాసిలు మోయని కీర్తనీ యగా
   నెన్నగ లేనిపం డితుడ యివ్విధి నిందలు మోపుచున్ నినున్
   చిన్నయ సూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గు బాసయే

   తొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  మున్ను మహాప్రబంధగత పూర్వకవీశ్వర దివ్య భావనో...
  త్పన్నవిభిన్నశబ్దచయవార్ధి మథించి , సుధానురూపమౌ
  వన్నెల వ్యాకృతిన్ తెనుగు బాసకు గూర్చగ , బల్కనొప్పునే ?
  చిన్నయసూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే??

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. ఒప్పుకోము ఒప్పుకోము :)


   జిలేబి

   తొలగించండి
  2. తెలుసు.. తెలుసు.. అలా కాకుంటే నా మనసొప్పుకోదు... 🙏🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి


  3. తిన్నదరగకన్ చెప్పితి
   చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో!
   యెన్నగ తప్పిదమాయెను
   మన్నింపుడి మైలవరపు మహిమాన్వితుడా :)


   జిలేబి

   తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు
   *****
   జిలేబీ గారూ
   మీ అపరాధ క్షమా పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  5. శ్రీమతి జిలేబీ గారికి వందనములు..

   ఎన్నడు మృతిచెందదు , తెలు..
   గెన్నడు మరణింపదార్య ! యెల్లరు నుడువన్
   వన్నెఁ గను., దగునె యిట్లనఁ
   జిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 18. మిన్నగు వాసిగొనె తెలుగు
  చిన్నయసూరి వలన, మృతిఁ జెందెఁ దెలుఁ గయో
  చిన్నలు పెద్దలు పరభా
  షన్నమ్ముచు తెలుగుపైన సాధన మరువన్

  రిప్లయితొలగించండి
 19. మున్నొక డాంగ్లేయుండిటు
  లెన్నుచు నాంధ్రీయదీప్తి నీగతిపలికెన్
  చెన్నుగ "స్థితి"యన దడబడి
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో.

  రిప్లయితొలగించండి

 20. ఒకాయనేమో వ్యాకరణమిచ్చి చంపేడు
  పండితులేమో దూరము దూరమని భాషలోనికి క్రొత్త పదాలకు తడకట్టు (అన్యదేశ్యము :)) వేసి చంపుతున్నారు . :)

  సో హౌ ? :)


  చిన్నయసూరి చేత, మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే,
  పిన్నలు నేర్వుడీ యనుచు పెన్నిధి ఋక్థమటంచు నివ్వ నో
  రన్న పదానుశాసనము! ప్రాజ్ఞులు దూరము దూర మంచు నో
  రన్నరొ! యన్యదేశ్యముల రాపడనివ్వక నాంధ్ర భాషలో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. తిన్నగ తెలుగును నేర్వక
  నెన్నియొ తప్పులు లిఖించు నీశ్వరసూరిన్
  సన్నగ దిట్టుచు పలికెన్
  చిన్నయ "సూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో !"
  (ఇక్కడ సూరి ఒకరు. చిన్నయ్య మరొకరు. సూరి తెలుగుని ఖూనీ చేస్తున్నాడని చిన్నయ్య అన్నాడు)

  రిప్లయితొలగించండి
 22. వేరు మార్గమేది వేంకటేశ!

  మన్నన పొందిన రచనది
  యెన్నగఁ దగు రీతి వ్రాసె నింపుగ తానే!
  అన్నన! యనవచ్చ యిటుల
  *"చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ
   మీ పూరణ బాగున్నది అభినందనలు
   వాట్సప్ లో నా సవరణను గమనించండి

   తొలగించండి
  2. జీపీయస్ వారికి ధన్యవాదాలు
   🙏🏻🙏🏻

   తొలగించండి
  3. ధన్యవాదాలు గురువుగారూ. 🙏🏻🙏🏻
   సవరించిన తరువాత
   మన్నన పొందిన రచనయె
   యెన్నగఁ దగు రీతి వ్రాసె నింపుగ తానే!
   అన్నన! యిటులన వచ్చునె
   "చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో"

   తొలగించండి
 23. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  చిన్నయ సూరి చేత మృతి జెందె
  నయో మన తెల్గు బాసయే
  ========================
  వ్యాకరణ పండితుడు, గొప్ప తెలుగు
  రచయిత అయిన పరవస్తు చిన్నయ
  సూరి వలననే తెలుగు భాష మృతి
  చెందినదనుటలో అసంబద్దతె సమస్య
  ==========================
  సమస్యా పూరణం - 291
  ==================

  శాస్త్రిగా తాను కాకున్నను -
  శర్మగా పేరు లేకున్నను
  నీతి చంద్రికను వెలయించెను -
  వ్యాకరణ ప్రభ వెలిగించెను
  గద్యము తానుద్దరించబడినదిగ -
  మన చిన్నయ సూరి చేత
  మృతి జెందె నయో మన తెల్గు బాసయే -
  పెట్టగాంగ్ల వాత

  ====##$##====

  పరవస్తు చిన్నయ (1809-1861)మొదట
  చిన్నయనే పిదప చిన్నయ సూరిగ మారినాడు.

  తెలుగుతో పాటు ఆంగ్ల భాషా పరిజ్ఞానం
  కలిగిన వ్యక్తిగా మద్రాసు సెయింట్ జార్జి కోట
  లోని కళాశాలలో ఇంగ్లీష్ దొరలకు తెలుగు
  ట్యూటర్ గా అధ్భుత సేవలందించి కళాశాల
  అధ్యక్షులు ఎ.జె. అర్భత్ నాట్ గారి ప్రశంసలు
  పొందినాడు.

  మీకు మీ పేరు చివర శాస్త్రి, శర్మ అనే
  బిరుదెందుకు లేదని అడిగిన ఇంగ్లీష్ దొరతో
  "నేను బ్రాహ్మణేతరుడిని అందుకే లేవనినాడు"
  చిన్నయ. అయితే మీకు ఎలాంటి బిరుదును
  ఈయవలెనని అడిగిన ఇంగ్లీష్ దొరతో చిన్నయ
  సూరి యన్న బిరుదును సూచించాడు

  సంతసించిన ఇంగ్లీష్ దొర "సూరి"యని
  చెక్కించబడిన బంగారు కడియమును ఇంగ్లాండ్
  నుండి తెప్పించి ప్రధానం చేశాడట.

  సూరి గారి చేత ఉద్దతి పొందిన నాటి తెలుగు
  భాషను ఆంగ్లమున సంకరీకరణమొందించి
  చంపుతున్నాము మనమెంతటి పాపులమో !!!

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ----- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి


 24. అన్నుల పదాను శాసన
  మెన్నగ నిచ్చె తెలుగునకు మేధావి సుమా
  అన్నయ్యా తప్పయ్యా
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
 25. సమస్య :-
  "చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో"

  *కందం**

  వెన్నెల వలె తెలుగు వెలిగె
  చిన్నయసూరి వలన; మృతిఁ జెందెఁ దెలుఁ గయో
  చిన్నారులకున్ నేర్పక
  కన్నులముందు కనపడక కడతేరె గదా!😹
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
 26. తన్నులు తినెదవు బిడ్డా !
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁగయో
  నన్న యెడల , నీ ధరణిన్
  సన్నుతి నిడుడురు నతనికి చదువర లెల్లన్

  రిప్లయితొలగించండి
 27. ఎన్నగ ఛాందసమ్మె మనకెంతటి కీడును గల్గ జేయునో
  క్రన్నన మొండి వైఖరియె కర్కశ రీతిని జేటు తెచ్చుగా
  యెన్నియొ గ్రంథరాజములె యిప్పటికిన్ లభియింప లేదుగా
  "చిన్నయసూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే"
  ****)()(****
  ("ఆంధ్రుల సాంఘిక చరిత్ర" గ్రంథ పీఠికలో సురవరం ప్రతాప రెడ్డి గారు వెలిబుచ్చిన ఆవేదన ఈ పూరణకు ప్రేరణ )

  రిప్లయితొలగించండి


 28. స్కూలు మేష్టారు కంది వారి పలుకుగా :(  పొన్నయ్యా ! యేరా ! మా
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో?
  తిన్నగ మాట్లాడుము!లే
  కున్న బడితపూజ యే! హుకుము ! మేష్టార్నోయ్ :)

  జిలేబి

  రిప్లయితొలగించండి


 29. అన్నుల మిన్న! జిలేబీ
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో?
  తిన్నగ చేయుము పూరణ
  తన్నులు తినెదవిక నీవు తప్పుబలుకగా :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ లేటెస్ట్ పూరణలు బాగున్నవి అభినందనలు.
   ఇప్పటికి ఐపోయినట్టేనా? ఇంకా ఉన్నాయా?

   తొలగించండి

 30. అబ్బే ఇంకా పూర్తి కాలేదండి :)


  పొన్నారిగ తెలుగయ్యెను
  చిన్నయసూరి వలన, మృతిఁ జెందెఁ దెలుఁ గయో
  కున్న లు టీవీ యాంక
  ర్లన్నుల చేతబడి సూవె రావడి యగుచున్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 31. దన్నుగ శంకరు కొలువయె
  చిన్నయసూరి వలన! మృతిఁ జెందెఁ దెలుఁ గయో
  తన్నుకొనుచు మాలికనం
  దన్నా కొన్నిదినములు రొదరొదయనంగన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 32. భిన్నముగజెప్పిరిటులుగ
  జిన్నయసూరివలన మృతిజెందెదెలుగయో
  మిన్నగు వ్యాకరణంబున
  జిన్నయసూరిబ్రదికించెజేవకలదిగా

  రిప్లయితొలగించండి

 33. ఇంతకు మించి రాస్తే వాయకొడతారు కాబట్టి చిన్నయ సూరి కంద పురాణం యింతటితో సమాప్తి :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అబ్బే చింతించకండి...కొనసాగనీయండి. కంది వారి వద్ద:

   "జిలేబి గారూ! మీ పూరణ బాగున్నది. అభిననందనలు"

   అనే rubber stamp ఉన్నది

   తొలగించండి


  2. మీ పూరణబాగున్నది !
   మాపై కనికరము చూపు మమ్మ జిలేబీ
   ఓ పద్యవేణి వలదే
   మాపై వర్రోడుకైపు మదిమది గనుమా :)


   జిలేబి

   తొలగించండి
  3. శాస్త్రి గారూ
   నిజమే.. ఆ ముద్ర ఉన్నది కాని దానిని పేస్ట్ చేసేముందు ఆ పూరణను (ఒళ్లు దగ్గర పెట్టుకొని) చదవాలి కదా!

   తొలగించండి
 34. అన్నివిధముల తెఱగువడె
  చిన్నయసూరి వలన; మృతి జెందె దెలుగయో!
  నన్నిటనాంగ్లము వాడుట
  మున్నుగ మానినపుడె యది
  పొదలికనొందున్

  రిప్లయితొలగించండి
 35. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2825
  సమస్య :: “చిన్నయ సూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే”
  చిన్నయసూరి వలన మన తెలుగుభాష పూర్తిగా నాశన మయ్యింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: *పద్యమునకు నన్నయ గద్యమునకు చిన్నయ* అన్నది లోకోక్తి. తెలుగుకు పెద్ద దిక్కు అయిన చిన్నయసూరి వ్యాకరణ భేరి అని పెద్దలమాట.
  19 వ శతాబ్దమునకు చెందిన వాడు, గొప్ప పండితుడు ఐన శ్రీ పరవస్తు చిన్నయసూరి గారు తెలుగులో రచించిన *బాలవ్యాకరణం* *నీతిచంద్రిక* అనే గ్రంథాలు ఎంతో ప్రసిద్ధిని పొందినాయి. తెలుగు భాషకు అంతగా సేవచేసిన ఆ మహానుభావుని సేవలను గుఱించి గొప్పగా చెప్పకుండా అజ్ఞానంతో “చిన్నయసూరి వలనతెలుగుభాష పూర్తిగా నశించింది” అని అనవచ్చునా? అని ప్రశ్నించే సందర్భం.

  వన్నెల తెల్గులోన పరవస్తు రచించెను నీతిచంద్రికన్,
  సన్నుతు లందినా డతడె చక్కగ వ్యాకరణమ్ము వ్రాసి, నా
  చిన్నయసూరి సేవలను జెప్పక నిట్టుల బల్కవచ్చునే?
  “చిన్నయ సూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గుబాసయే”
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (24-10-2018)

  రిప్లయితొలగించండి
 36. [10/23, 11:53 PM] Dr Umadevi B: డా.బల్లూరి ఉమాదేవి.
  కన్నది కలయా యేమిది
  చిన్నయసూరి వలన మృతి చెంది దెలుగయో
  యన్నన్న యిటులనదగునె
  క్రన్నన క్షమ వేడకున్న కలుగును వ్యథలే.

  రిప్లయితొలగించండి
 37. మిన్నగు శబ్ద శాస్త్రమది మేలగు రీతిని వ్రాయగా బడెన్
  చిన్నయసూరి చేత, మృతిఁ జెందె నయో మన తెల్గుభాషయే
  చిన్నతనమ్ముగా తలచి చేయుచు సేవల నాంగ్లభాషకున్
  దున్నల వంటి నాయకులు దుర్గతి తెచ్చిరి మాతృభాషకున్

  రిప్లయితొలగించండి
 38. అన్నన్న యెంత మాటిది
  మిన్నంటెను మిన్నగఁ బుడమిం గ్రన్నన ద
  న్నెన్నఁ దరమె యెన్నండును
  జిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁ గయో


  కన్నుల రాల నిప్పులు వికారమునన్ జను లిట్లు పల్కిరే
  క్రన్నన వ్రాసి తే నడరి కావ్యము గొప్ప దటంచుఁ జెప్పుఁ దాఁ
  బన్నుగఁ జేరి నిత్యమును బండిత మానియ యక్క టక్క టం
  చిన్నయ సూరి చేత మృతిఁ జెందె నయో మన తెల్గు బాసయే

  [అంచు + ఈ+నయ సూరి; నయ సూరి = అందమైన పండితుడు!!! నిందార్థమున]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వరరావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
  3. నేర్చుకొనవలెనని ఆసక్తి - అక్కడ న కారము మీద వత్తు వస్తుందా?

   తొలగించండి
  4. ఈ+నయ => ఇన్నయ. త్రికసంధి. ఆ-ఈ-ఏ అనేమూడింటికీ త్రికం అనేది సంకేతం. ఈ త్రికానికి ఊష్మరేఫేతరమైన అసంయుక్తమైన హల్లు పరం ఐతే హ్రస్వం బహుళంగా వస్తుంది. ఊష్మములు అంటే శ-ష-స-హ అనే అక్షరాలు. అసంయుక్తమైన హల్లు అంటే సంయుక్తాక్షరం కాని హల్లు. ఇక్కడ ఈ అనే త్రికానికి పరమైన అక్షరం న. న అనేది ఊష్మం కాదు. సంయుక్తాక్షరం కాదు. కాబట్టి సంధికార్యం ఉచితమే. బహుళంగా అంటే తరచుగా అనే అర్థం. కాబట్టి సంధి చేయకపోయినా దోషం కాదు కాని చేయటం తరచుగానే కనిపిస్తుంది అని అర్థం. అలాగ్ను ఈనయ, ఇన్నయ అన్నవి రెండూ సాధురూపాలేను.

   తొలగించండి
  5. శ్యామలీయం గారూ, బహు కాల దర్శనం ... సందేహం తీరింది. ధన్యవాదాలు

   తొలగించండి
 39. వన్నెల నందెను యాంధ్రము
  చిన్నయ సూరి వలన! “మృతి జెందె తెలుగయో”
  యన్న దసత్యము సుమ్మీ!
  మిన్నగు మన భాష యమృతమే యగు నెపుడున్!

  రిప్లయితొలగించండి


 40. సున్నములోన నెముక ము
  క్కన్నది మిగులక నడచుము కంద జిలేబీ
  యన్నన్న యెంత దుష్టులు !
  చిన్నయసూరి వలన మృతిఁ జెందెఁ దెలుఁగయో ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
 41. అన్నిట వ్యాకరణంబన
  కొన్నాళ్లకు తెలుగువారు కోర్కెలుదరుగన్
  తిన్నగనాంగ్లముజేరగ?
  చిన్నయసూరివలన మృతిజెందెతెలుగయో!

  రిప్లయితొలగించండి
 42. చిన్నయసూరిచేత మృతిజెందెనయోమన తెల్గుబాస యే
  మన్నను మీకుజెల్లుకవిమాన్యులుకావ్యజగాన రాజులై
  మన్ననలందనీరసపు మాటలతూటలువేయనేల పో
  తన్న వదాన్యులన్ దెలియతప్పదు వ్యాకరణంపుసూచనల్

  రిప్లయితొలగించండి
 43. చిన్నయసూరి దారచనజేసియువ్యాకరణంబుదెన్గునన్
  నన్నతచోటునన్నునచనొప్పుగబెద్దలు సమ్మతించగా
  చిన్నయసూరిచేతమృతిబొందెనయోమనతెల్గుబాసయే
  భిన్నపుభావమున్నిటులభీకరమైనదిబల్కనొప్పునే?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది అభినందనలు
   రెండవ పాదంలో టైపు దోషాలున్నవి.

   తొలగించండి
 44. మన్నన యొందె మన తెలుగు
  చిన్నయసూరి వలన, మృతిఁ జెందెఁ దెలుఁ గయో
  మిన్నంటె నాంగ్ల మోహము
  మిన్నక యుండిన యువతరమే విధి నెగడున్.

  రిప్లయితొలగించండి
 45. మాతృ భాష యందు మమకారముండిన
  తెలుగు భాష లోని వెలుగు గాంచు.
  ఇతర భాషలందు ఇష్టముండు గాక
  మాతృ భాష నెపుడు మరువ రాదు.

  తెలుగుదనములోని వెలుగుదనము జాట
  కలసి మెలసి మనము కదల వలయు.
  ఐకమత్యముండి యత్నంబు జేయగా
  గగన కుసుమ మైన సుగమ మగును.

  రిప్లయితొలగించండి
 46. వన్నెల చిన్నెలన్ చెలగు వ్యాకరణమ్మిట వ్యాప్తి నొందె నా
  చిన్నయ సూరి చేత! "మృతి జెందె నయో మన తెల్గు బాసయే"
  యన్నది కల్ల! యింపొసగు యక్షరమాలయు జేర నాంధ్రమే
  మిన్నగు నట్టిదై వరలు మిన్నును, మన్నును సాక్షులై గనన్ !

  రిప్లయితొలగించండి
 47. రెండవపాదము మొదటన
  సన్నుత
  అని చదువప్రార్ధన

  రిప్లయితొలగించండి
 48. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  "చిన్నయసూరి చేత మృతిఁ
  జెందె నయో మన తెల్గుబాసయే"

  సందర్భము: సంభాషణం.
  *తిట్ల పురాణం*
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  నన్నయ్య భ ట్టనన్ పడదు
  నా సఖు డొక్కని కేమొ చూడగా
  చిన్నయ యన్న నిం కొకడు
  "ఛీ" యను; విందము వారి మాటలన్..
  "నన్నయ భట్టుచేత సుమ
  నాదు తెనుంగున చచ్చె పద్యమే!"
  "చిన్నయసూరి చేత మృతిఁ
  జెందె నయో మన తెల్గు బాసయే!"

  రెండవ పూరణము:

  ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  "చిన్నయసూరి చేత మృతిఁ
  జెందె నయో మన తెల్గుబాసయే"

  సందర్భము: సంభాషణం.
  *తిట్ల పురాణం*
  ఎంతసేపూ నా *భరతం* పట్టడం మాత్రమే తెలుసు. *భారతం* సంగతి పట్టదు.
  మా ఇంట్లో యెప్పుడూ *రణమే! వ్యాకరణం* ఏదీ!
  మా శ్రీమతి ఏమంటుందో చూశారా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఎన్నగఁ బట్టు నా "భరత
  మే!" మరి "భారత" మన్న బట్టదే
  యెన్నడు! నింటిలోన "రణ
  మే!" యెది "వ్యాకరణమ్ము?"త్రోయుచున్
  న న్నిటు బల్కె నాదు సతి...
  "నన్నయచే మన సంస్కృతంబు, నా
  చిన్నయసూరిచేత మృతిఁ
  జెందె నయో మన తెల్గు బాసయే"

  మూడవ పూరణము:

  ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  "చిన్నయసూరి వలన మృతిఁ
  జెందెఁ దెలుఁ గయో"

  సందర్భము: సంభాషణం.
  *తిట్ల పురాణం*
  వాళ్లిద్దరిలో ఒకరికీ మరొకరికీ పడదు. ఒకడు ఏ మాటన్నా యింకొకడు ఖండిస్తా డంతే! వెనకా ముందు చూసేదే లేదు.
  నన్నయ్య గొప్పతనం గానీ చిన్నయ్య భాషా సేవ గాని వారికి పట్టవు.
  నిష్ప్రయోజన కరమైన దూషణలకు ఇది ఉదాహరణము.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  నన్నయ నిటు తిట్టు నొకడు..
  "నన్నయచే పద్య మయ్యొ
  నాశన మాయెన్!"
  చిన్నయ నిటు తిట్టు నొకడు..
  "చిన్నయసూరి వలన మృతిఁ
  జెందెఁ దెలుఁ గయో!"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  24.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 49. మొదటి పద్యం తొలి పాదంలో.. నన్నయ్య.. కాదు.. నన్నయ..

  రిప్లయితొలగించండి
 50. అన్నుల మిన్నయైన తెలుగమ్మకు నందము పెంచనెంచుచున్
  మిన్నగ నందజేసినది మేలగు వ్యాకరణమ్ము వాణియే
  చిన్నయసూరిచేత, మృతిఁ జెందెనయో మన తెల్గుబాసయే
  క్రన్నన విశ్వమంతటను క్రమ్మిన యాంగ్లపు మోజు పెర్గగన్.

  రిప్లయితొలగించండి
 51. అందరికీ వందనములు
  అందరి పూరణలూ అలరించు చున్నవి
  అలరించ నున్నవి

  చెన్నమనేని గ్రామమున - చిన్నయసూరి టుటోరియల్లునన్

  01)
  ___________________________________

  చెన్నమనేని గ్రామమున - చిన్నయసూరి టుటోరియల్లునన్
  చిన్నలు బెద్దలున్ మిగుల - చేరిరి యాంగ్లము లోన నేర్వగన్
  చెన్నుగ నాంగ్ల భాషణను - జేర్చిరి గ్రామము, దేశ మేటిగన్
  చిన్నయసూరి చేత మృతిఁ - జెందె నయో మన తెల్గుబాసయే
  చెన్నమనేని గ్రామమున; - జింతిల నేమి ప్రయోజనంబొకో ???
  ___________________________________

  రిప్లయితొలగించండి