26, అక్టోబర్ 2018, శుక్రవారం

సమస్య - 2827 (అష్టమి నాడె...)


కవిమిత్రులారా,
అట్ల తదియ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ"
(లేదా...)
"అష్టమి నాడె యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్" 

99 కామెంట్‌లు:

  1. ఆట పాటల తోడుగ హాయిగాను
    చెట్ల చాటున నూగుచు చెన్ను గాను
    నాడు వారికి కష్టమైనప్పు డొక్కొ
    నష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒక్కొ + అష్టమికి = ఒక్కొ యష్టమికి' అవుతుంది.

      తొలగించండి
  2. కన్నె లందరు వఱువాత కలసి మెలసి
    చద్ది యన్నము గోంగూర ముద్ద తినగ
    నూయ లూగుచు పాడుచు నోము లనుచు
    మంచి భర్తను కోరుచు మనుసు పడగ
    అష్టమికి జరుపగ నొప్పు నట్ల తదియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మరి అష్టమికి జరుపవచ్చు అన్నదానికి అన్వయం?

      తొలగించండి
    2. కన్నె లందరు వఱువాత కలసి మెలసి
      చద్ది యన్నము గోంగూర ముద్ద తినగ
      మంచి భర్తను కోరుచు మనుసు పడగ
      అష్టమికి జరుపగ నొప్పు నట్ల తదియ
      నూయలూగుచు పాడుచు నోము లనగ

      తొలగించండి
  3. తే.గీ.
    చవితి నాడె వినాయక చవితి వచ్చు
    ఉట్టి నెగురుచు చూచుచు కొట్టు పండు
    గష్టమికి జరుపగనొప్పు, నట్లతదియ
    వచ్చు వనితలంత కలిసి పాడు వేళ.

    రిప్లయితొలగించండి


  4. దురితములతొలగింపగ దుర్గ పూజ
    నష్టమికి జరుపగ నొప్పు, నట్లతదియ
    నేడు గద జిలేబులవలె నేర్పు గాను
    చేయవమ్మ చిరాయువు చెల్వుగాన


    జిలేబి

    రిప్లయితొలగించండి

  5. కంది వారివ్వాళ సెలవా :)



    స్పష్టము గాను తెల్పి తిని శాంభవి శంకరి పూజ చేతురే
    యష్టమి నాడె యట్లతదియన్ ముదితల్ ముదమారఁ జేతురే,
    స్ప్రష్టము లెల్ల బోవ పతి చక్కగ నేళ్ళును గూడి తోడుగా
    వేష్టము గాన లేమ! యలివేణి ! జిలేబి ! శుభాంగి తొయ్యలీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పూరించి చూస్తే సమస్యాపాదమే
      మారిపోయిందిస్మీ :)


      జిలేబి

      తొలగించండి


    2. స్పష్టము గాను తెల్పి తిని శాంభవి శంకరి పూజ చేతురే
      యష్టమి నాడె, యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్
      స్ప్రష్టము లెల్ల బోవ పతి చక్కగ నేళ్ళును గూడి తోడుగా
      వేష్టము గాన నేడె!అలివేణి ! జిలేబి ! శుభాంగి తొయ్యలీ !


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఆకాశవాణి రికార్డింగు పూర్తి చేసికొని ఇంతకు ముందే నెలవు చేరాను. మీరు ఊరి పేరు 'బొంగుళూరు' అని వ్రాసారేం?

      తొలగించండి
  6. పంచపాండవు లన్నచో మంచమునకు
    కోళ్ళవలె ముగ్గురని రెండు వేళ్ళుచూపు
    వాడు మిక్కిలి యోచించి పలికె నిట్టు
    లష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ.

    కృష్ణ జన్మోత్సవం బిందు కీర్తితముగ
    నష్టమికి జరుపగ నొప్పు, నట్లతదియ
    తెలుగు వారల పండుగై వెలుగుచుండు
    తదియనాడన సందియం బది యికేల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మూర్ఖుని వాక్యంగా మొదటిది, విరుపుతో రెండవది... మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. సుదతులకు శుక్రవారమచ్చొచ్చెనొక్కొ
    వరునిగోరుచు నుమపూజదురితముడగ
    కన్నియలపల్లెలేచె సంకల్పమునకు
    నష్టమికిజరుపుగనొప్పునట్లతదియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్జీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని అష్టమికి అన్వయం? 'అచ్చివచ్చె'ను 'అచ్చొచ్చె' అనడం సాధువు కాదు. 'దురిత ముడుగ' అనండి.

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    కష్టమె ! యెంత చెప్పినను కాదనుచుందువు , సంప్రదాయసం...
    పుష్టము భారతమ్ము , మరుపో మరియేమొ యెరుంగబోను , నీ
    యిష్టము వచ్చినట్లు తగునే ? పది రోజులు దాటినంతనే
    అష్టమి ., నాడె యట్లతదియన్ జరుపందగు కాంతలెల్లరున్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాద్రపద శుద్ధచవితిని వారణాస్యు
      భక్తిఁ బూజించి , దుర్గగా శక్తి కొలది
      ఆశ్వయుజపూర్ణిమకు ముందు అమ్మపూజ
      అష్టమిని జరుపగ., నొప్పు నట్లతదియ.

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. ఇష్టముతోడ రామనవ
    మెప్పుడు నా తిథి యందె జేతురే !
    కష్టము లేక కన్నయను
    కన్నుల గొల్తురె యష్టమీ తిథిన్ !
    తుష్టిగ విఘ్నదేవుని చ
    తుర్థిన నర్చన సల్పుచుందురే !
    యష్టమి నాడె యట్లతది
    యన్ ముదితల్ ముదమంద జేతురే ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నవమి + ఎప్పుడు' అన్నపుడు యడాగమం వస్తుందనుకుంటాను. 'చతుర్థిని' అనాలి కదా!

      తొలగించండి
  10. రామ జననము నవమికి,లకుముకుని జ

    యంతి చవితికి,కనక దుర్గమ్మ పూజ

    అష్టమికి జరుపగ నొప్పు; నట్లతదియ

    నాశ్వయుజ తదియ దినమునందు జరుపు!

    పర్వదినముల జరుప శుభముల నిడవె!


    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లకుముకి' అంటే ఒక పక్షి. 'లకుముకుడు' అన్న పదం లేదు.

      తొలగించండి
  11. వచ్చు కృష్ణు జన్మ దినము కచ్చితముగ
    అష్టమికి, జరుపగ నొప్పు నట్లతదియ
    విదియ తదుపరి రోజున ముదితలు నలి
    కోర్కె లన్నియు తీరగ కువలయమున

    రిప్లయితొలగించండి
  12. కృష్ణ .జయంతి జరుగును తృష్ణ తోడ
    అష్టమిన; జరుప గ నొప్పు నట్ల తదియ
    నేడు మగువ లెల్ల రు జేరి వేడుక లర
    నాడి పాడరె యుల్లాసమతి శ యింప

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "కృష్ణుని జయంతి..." అనండి.

      తొలగించండి
  13. కష్టము కాదటంచు నిల కాంతలు వేకువ ఝామునన్ భళా
    నిష్టము తోడభోజ్య మని నెమ్మిని చద్దిని నుల్లిచా రులన్
    నిష్టగ భుజియించి సిరి పాటల నాటల నూయలూగు చున్
    అష్టమి నాడె యట్ల తదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ పూరణలోను అష్టమికి అన్వయం? "భళా యిష్టము..." అనండి. మూడవ పాదంలో గణదోషం. 'నిష్ట' కాదు, "నిష్ఠ" అనాలి.

      తొలగించండి


  14. శ్రావణమ్మున కృష్ణుని జన్మదినము
    అష్టమికి జరుపగ నొప్పు ,నట్లతదియ
    నాశ్వయజ బహుళమునందు నాచరింతు
    రిలను అట్లతో ముదమున నింతు లెల్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దినము + అష్టమి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. "జన్మదినమె యష్టమికి" అనండి. 'ఆశ్వయుజ' టైపాటు.

      తొలగించండి
  15. తే.గీ.
    తెలుగు బ్రాహ్మణుండు తిథిని తెలియగోర
    తనదు పంచాంగ మందున తదియ గలదు
    నట్ల తదియ గలదు పర్వ మగుచు, నేల
    నష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ.

    రిప్లయితొలగించండి
  16. ఇష్టసఖీ! యదెట్లు దగునే? మరియాదను మీర నొప్పునే?

    వ్యష్టిగఁ బర్వముల్ జరుప వచ్చునె? యత్తరి నీకు కూడదం

    చష్టమి నాడునా దదియ, యచ్చెరువుం గొలిపించ, నెట్లుగా

    నష్టమి రోజు నట్ల తదియన్ జరుపందగు కాంతలెల్లరున్?.

    కంజర్ల రామాచార్య.



    రిప్లయితొలగించండి
  17. మనసు పొంగగ వత్తురు మనుమరాండ్రు
    వేచిచూడుము, చేయుమా వేడ్కమీర
    సరుకులన్నియుదెచ్చితి సరిగ మున్ను
    యష్టమికి, జరుపగనొప్పు నట్లతదియ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మున్నె యష్టమికి' అనండి.

      తొలగించండి
  18. అష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ
    బాణసంచ కాల్చగ నొప్పు ఫాల్గుణమున
    డబ్బు యున్న యమ్మలు బాగ డాబుచేయ
    లోకురెల్ల మెచ్చురుచూడు లోకరీతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'డబ్బు + ఉన్న = డబ్బున్న' అవుతుంది. యడాగమం రాదు. "డబ్బు లున్న... మెత్తురు..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారు

      అష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ
      బాణసంచ కాల్చగ నొప్పు ఫాల్గుణమున
      డబ్బు లున్న యమ్మలు బాగ డాబుచేయ
      లోకురెల్ల మెత్తురుచూడు లోకరీతి

      తొలగించండి
  19. కృష్ణుడు జనించె శ్రావణ కృష్ణ పక్ష
    యష్టమికి,జరుపగనొప్పు నట్లతదియ
    నాశ్వయుజ కృష్ణ పక్షమి నారుబయట
    నాడు వారందరు గలసి యాటలాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కృష్ణపక్ష మష్టమికి...' అనండి.

      తొలగించండి
  20. కష్టము నాయెనా వనిత కారణ మేమిటొ జెప్పజాలనే
    యిష్టము వచ్చినట్లుమరి యింతికి దోచిన రోజులందునన్
    నష్టము లాభముల్ గనక నచ్చిన రీతిన పండుగేమిటో!
    అష్టమి నాడె యట్లతదియన్ ముదితల్ ముదమారఁ జేతురే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటప్పయ్య గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం.
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. దశహరాయుత్సవములందుదాక్షిపూజ
    యష్టమికిజరుగనొప్పు,నట్లతదియ
    తనరయాశ్వయుజబహుళ తదియనాడు
    వచ్చుబిన్నపెద్దలలరుపండుగగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దాక్షి'...?

      తొలగించండి
  22. ఏతిథికి చేయ బూనరదెట్టి పనిని?
    జనులు జాతీయ పండుగల్ చక్కగాను;
    పరగ వనితల నలరించు పండుగేది?
    అష్టమికి ;జరుపగ నొప్పు ;నట్లతదియ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. ఈ లోకంలో జనాలను ఉద్ధరించడానికి విచ్చేసి కొత్తగా పీటను స్థాపించిన కా"రణ" జన్ముడు శ్రీ శ్రీ శ్రీ విట్టుబాబా వారి ఉపదేశం:

    అష్టమి తోడ రాగ నిక యా నవమీ తిథి యంత కష్టముల్
    భ్రష్టము జేయునే సుఖము, వారిజ నేత్రల కేమి చెప్పుదున్
    స్పష్టము సేయనెంచితిని సాగును మీ మది కోరుకున్న దా
    *"యష్టమి నాడె; యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్"*

    రిప్లయితొలగించండి
  24. ఈ రోజు శంకరా భరణము వారి సమస్య


    అష్టమికి, జరుప నొప్పు నట్ల తదియ

    నా పూరణము సీసములో

    పాడ్యమి నాడొచ్చు పండుగ సంవత్స
    రాదిగ నొప్పును, రామ నవమి


    జరుపుదు రెల్లరు సంతసాన నవమి
    నాడు, నమవస దినమున చేతు


    రుగద దీపావళి,రూఢిగ కొలుతురు
    చవితి దినమున గజముఖు నెల్ల


    జనులు, గిరిధరు పూజలుచేసి కొట్టుదు
    రుట్లును ముదముతో జట్లు గూడి


    (అష్టమికి, జరుప నొప్పు నట్ల తదియ)

    మగువ లెల్ల నాశ్వీయుజ మాసమందు,

    దశమి నాడొచ్చును విజయదశమి యనుచు

    పిల్లలకు ముదముగ తెల్పె తల్లి యొకతె


    పూసపాటి కృష్ణ సూర్య కుమార్, బంధ కవి ,గుంటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చు'ను 'ఒచ్చు' అనరాదు. ఆశ్వయుజాన్ని ఆశ్వీయుజ మన్నారు. సమస్యలో 'జరుపగ నొప్పు' అని ఉంటే మీరు ' జరుప నొప్పు' అని మార్చారు. అలా చేయకూడదు.

      తొలగించండి
  25. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    అష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ

    సందర్భము: *అటటాలు* = అ దట..
    ఇ దట..అనో.. అ దంట.. ఇ దంట.. అనో.. పదే పదే చెబుతూ తన కేమీ తెలియ దని చెప్పకనే చెప్పడం.. అంతా స్పష్టాస్పష్టం.. నమ్మకం లేని వాని మాట తీరు..
    ఉమ్మడి పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లా మాండలికం..
    "అబ్బో! వాళ్ళు చెప్పే వన్నీ అటటాలే!" అని వాడుక.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఇలను దుర్గాష్టమిని దుర్గ గొలుతు రంట!..
    స్వర్ణ మా దేవి యిడు నంట!.. వారు తదియ
    యందు పసిడి కొనెద రంట! అమ్మ పూజ
    నష్టమికి జరుపగ... నొప్పు నట్ల తదియ

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    26.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. భలే భలే వెలుదండ వారూ..
      నేను వీటికే 'ట'నిజాలు అని పేరు పెట్టుకున్నానండీ
      😀🙏🏻

      తొలగించండి
  26. ఊయలల నూఁగఁగఁ దమిని నువిద లెల్ల
    లేచి యుదయమ్ము దిని యట్లు లేనగవులఁ
    బాటవముగఁ బాడి యలర నేటి నుండి
    యష్టమికి జరుపగ నొప్పు నట్ల తదియ


    ఇష్టము తోఁ గురంటకము నేపుగ నద్ది తలమ్ము లందునన్
    మృష్టపు భోజనమ్ము దిన మిక్కిలి యింపగు నట్లతోమనో
    యష్టిగ నాడి యాశ్వయుజమం దప రార్ధము పంచ వాస రో
    నాష్టమి నాఁడె యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్

    [పంచ + వాసర + ఊన + అష్టమి : ఐదు రోజులు తక్కువగా నష్టమి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. ముఖ్యంగా 'వాసరోనాష్టమి' అన్న రెండవ పూరణ అత్యుత్తమంగా ఉన్నది. అభినందనలు.
      మా ఇంట్లో క్యాలెండర్లో ఈరోజే అని ఉన్నది. వృద్ధాశ్రమంలో ఉన్న నాకు పండుగలు వస్తున్నదీ, పోతున్నదీ తెలియడం లేదు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2827
    సమస్య :: అష్టమి నాడె యట్లతదియన్ జరుపందగు కాంతలెల్లరున్.
    *అష్టమి నాడే అట్లతదియను జరుపుకోవాలి* అనిఅనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఆశ్వయుజమాసంలో బహుళ తదియ నాడు అట్లతద్ది నోము నోచుకొంటే మంచి భర్త లభిస్తాడు. సౌభాగ్యం సిద్ధిస్తుంది. చింతలు తీరిపోతాయి అని 54 రోజుల క్రితం శ్రావణమాస బహుళ అష్టమి నాడు (కృష్ణాష్టమి పండుగలో కలసికొన్నప్పుడు) మీకు చెప్పినాను కదా. ఆ అట్లతదియను ఇప్పుడు మహిళలు అందఱూ చేస్తున్నారు అని ఒక పెద్ద ముత్తైదువ తన వద్దకు వచ్చిన ఆడపిల్లలకు విశదీకరించే సందర్భం.

    “ఇష్టుడు భర్త యౌను, వరియించును భాగ్యము మిమ్ము, చింతలున్
    భ్రష్టములౌ నుమన్ బహుళ పక్షములో తదియన్ భజింప, నా
    కిష్టమె యట్లతద్ది యని” యేర్పడ జెప్పితి ముందుగానె నే
    నష్టమి నాడె ; యట్లతదియన్ జరుపందగు కాంత లెల్లరున్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (26-10-2018)

    రిప్లయితొలగించండి
  28. కష్టము లెల్ల దీరగను , కామితముల్ నేరవేర్చు తల్లికిన్
    తుష్టిని గూర్చు పూజలను తృప్తిగ జేయుచు, గారవించుచున్,
    పుష్టిని గూర్చుమంచు పరిపుష్టి నొసంగెడి యట్లనిచ్చుచున్,
    అష్టమి నాడె యట్ల తదియన్ జరుపం దగు కాంతలెల్లరున్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మరి అష్టమికి అన్వయం?

      తొలగించండి
  29. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఇష్టుడు భర్తగా కుదురనిమ్మని గౌరికి పూజచేయుచున్
    సుష్టుగ నట్లనున్ తినుచు సుమ్ముగ నూగుచు నూయలందునన్
    కష్టము లేనిచో దశమి కావల నెన్మిది రోజులౌచునా
    యష్టమి నాడె యట్లతదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్

    రిప్లయితొలగించండి
  30. కష్టముగాదలంపకనుగన్ననియుత్సవమాచరించుమా
    యష్టమినాడె,యట్లతదియన్ జరుపందగుగాంతలెల్లరున్
    దుష్టిగబిండివంటలనుదుగ్ధపుపాయసమన్నమాదులన్
    బుష్టిగదేవతాదులకుభోజ్యముగానిడిదాగ్రహించియున్

    రిప్లయితొలగించండి
  31. పాస్టరు కేమితెలుసు జ
    న్మాష్టమి వేడుకల గాంచి మదిలో తలచెన్
    నిష్టము గను స్త్రు లట తా
    మష్టమికి జరుపగ నొప్పు నట్లతదియనే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      తేటగీతి పాదంతో కందపద్య పూరణ. అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  32. డా. పిట్టా సత్యనారాయణ
    pittasatyanarayana733@gmail.com
    drpittasatyanarayana@gmail.com
    అప్పుడప్పుడే సెలవుల నప్పళించి
    నట్టి విద్యాలయాలో నైరి నెలవు
    మారె కాలము తరుణులు మరొక పూట
    నష్టమికి జరుపగ నొప్పు నట్ల తదియ

    రిప్లయితొలగించండి
  33. శ్రేష్ఠమగు పూజ దుర్గకు నిష్ఠ తోడ
    నష్టమికి జరుపగ నొప్పు ; నట్లతదియ
    నాశ్యయుజ కృష్ణ తదియనె యాచరింప
    వనిత సౌభాగ్యవతిగనె వరలు నిజము

    నిన్నటియా సమస్యకు నా పూరణ

    వాణిని చదువుల రాణిని
    మానవులకు విద్య నొసగు మాత భగవతిన్
    వీణా పాణిని గురు దొర
    సానిన్ గొల్చెద నమేయ సౌఖ్యము లందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఆశ్వయుజ' టైపాటు.

      తొలగించండి
  34. నగధరుని జన్మదినమును నయముగాను
    నష్టమికిజరుపగ నొప్పు, నట్లతదియ
    నాడు నాటపాటలతోడ యతివలంత
    జరుపుకొందురు వ్రతమును సంతసముగ!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోడ నతివలంత..' అనండి.

      తొలగించండి
  35. కష్టము గల్గనీయకను కాంతను ప్రేమగ జూచువాడెగా
    యిష్టుడు, సుందరాంగుడిల యింతికి వచ్చునంచు మం
    చెష్టరు నుండి వచ్చిన సుచిత్రయె యట్లవ్రతమ్ముఁ జెప్పెనే
    యష్టమి నాడె, యట్లతదియన్ ముదితల్ ముదమార జేతురే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కల్గనీయకయె... డిల నింతికి వచ్చుచు నుండు నంచు (గణదోషం)..' అనండి.

      తొలగించండి
  36. దేవకీ,వసుదేవుల జీవమనగ
    పుట్ట కొమరుండు వేడుకల్ పూర్తిగాను
    అష్టమికిజరుపగ!"నొప్పునట్లుతదియ
    ఆడబడచుల నుయ్యాలలాడుచుంద్రు!

    రిప్లయితొలగించండి
  37. రమణులకు గౌరినికొలిచి రాత్రి పూట
    రహిగ సద్దుల బతుకమ్మ లాడుకొనుట
    నష్టమికి జరుపగ నొప్పు; నట్ల తదియ
    యుత్సవమునాడు నూయల నూగ నొప్పు

    రిప్లయితొలగించండి
  38. ఎపుడు జరుప దగుననుచు నెఱుక లేక
    కొంద రతివలకు కలిగి సందియమ్ము
    సంప్రదింప గను శకారు సముడు పలికె
    "అష్టమికి జరుపగ నొప్పు నట్లతదియ"

    రిప్లయితొలగించండి
  39. రిప్లయిలు
    1. శంకర్జీ గారూ
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మాధవుండు + ఏ .. అన్నపుడు సంధి నిత్యం యడాగమం రాదు. ఇష్టపడేటి.. అన్నది సాధువు కాదు పెన్మిటిని నీయగ... అనండి.

      తొలగించండి

    2. Shankarji Dabbikarఅక్టోబర్ 26, 2018 8:42 PM
      దుష్టులధర్మ నాశకులదున్మగ పుట్టిన మాధవుండు నే
      శ్రేష్టదినంబునన్ సుజనశ్రేయమొసంగగ పర్వమిచ్చె త
      న్నిష్టపడంగపెన్మిటిని నీయగ దుర్గను దల్తురెన్నడో
      అష్టమినాడె;యట్లతదియన్ ముదితల్ ముదమారజేతురే

      తొలగించండి
  40. సవరించిన పూరణ
    కష్టము కాదటంచు నిల కాంతలు వేకువ ఝామునన్ భళా
    యిష్టము తోడభోజ్య మని నెమ్మిని చద్దిని నుల్లిచా రులన్
    అష్టమి నాడె యట్ల తదియన్ జరుపం దగుఁ గాంత లెల్లరున్
    సుష్టుగ పూజలన్ జరిపి సోయగ మందున నూయలూగు చున్

    రిప్లయితొలగించండి
  41. సుదతులకు శుక్రవారముశుభకరమ్ము
    వరునిగోరుచు నుమపూజదురితముడగ
    కన్నెలాకృష్ణుగొల్వరేకాన్కలీయ
    నష్టమికిజరుపుగనొప్పునట్లతదియ

    రిప్లయితొలగించండి
  42. అష్టమి యరిష్టమని కొందరనుచు నుంద్రు
    కాని నక్షత్రమే ముఖ్య మగుట పెండ్లి
    "అష్టమికి జరుపగ నొప్పు , నట్లతదియ
    యెల్ల పనులకు శుభమని యెంచ రాదు.
    (ఇక్కడ "అట్ల" అనే దానిని "ఆ విధంగానే" అనే అర్థం లో తీసూన్నాను. కేవలం తిథిని బట్టే మంచి చెడూ నిర్ణయం కావు. నక్షత్రం ప్రథానం అని )

    రిప్లయితొలగించండి