వరలక్ష్మి దేవి ప్రార్ధన
శ్రావణ మాసాన సరస గతిని,
దేవి మంగళగౌరి దీవించి స్త్రీల కి
డు నెపుడు నైదవ తనము సని ము
దముతోడ జేసినన్, తరుణు లెల్ల రు ముఖ్య
మైన వార మనుచు మనసు బెట్టి
చేతురు పూజలు సింధుజకున్ శుక్ర
వార పుదయమున వాసి తోడ,
మేలు నిడు సిరీ! ముదముగ జాలి జూపి
సతము నిడు రక్ష, తప్పులు సరసముగ గొ
నుచు మము కరుణించి ముద మ్మిడుచు సతతము
నెమ్మి తోడ చూచుచు మాకు నీడ నిమ్ము.
పద్యము చదువు విధానము గులాబి రంగు గడిలో ఉన్న (వ) తో మొదలు బెట్టి 'వనితలు చేతురు ఘనమౌ వ్రతము' అని చదివి మరల గులాబీ రంగు గడిలోని ( ల) తోటి 'లన్ని శ్రావణ మాసాన సరస గతిని' అని వరుసగా చదువుతూ గులాబీ రంగు వృత్తము (వాసితోడ)తో పూర్తి చేసి ఆకు పచ్చ రంగు వృత్తము (మే)తో మొదలు పెట్టి నిమ్ముతో ముగించాలి. ఈ పద్యములోని విశేషము గులాబీ రంగు వృత్తములోని అక్షరములు కలిపి చదివిన వరలక్ష్మి దేవికి వందనములు చేసెదము అని గులాబీ రంగు వృత్తములో అక్షరములు బంధించ బడినాయి. ఇంతటి తోటి అయి పోలేదు. అకుపచ్చ రంగు వృత్తములో గల పసుపు పచ్చ రంగు చిన్న వృత్తములలోని అక్షరములు కూడా కలిపి చదివితే మొత్తము వాక్యము పూర్తీ అవుతుంది. మొత్తము వాక్యము 'వరలక్ష్మి దేవికి వందనములు చేసెదము మేము సతము ముదము తోడ' అన్న వాక్యము వస్తుంది.
బంధకవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్, గుంటూరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి