పూర్వము వృక్ష రాజు అను మహనీయుడు దగ్గిరలో నున్న కొలనులో స్నానము చేసి బయటకు రాగానే అతడు చక్కని స్త్రీ రూపము దాల్చాడు . ఒకనాడు ఇంద్రుడు ,సూర్యుడు ఆ దోవలో వెళ్తూ ఆ సుందరమగు స్త్రీని చూచి మోహించి ఆవిడతో సంగమించారు . అప్పుడు ఇంద్రుని వలన వాలి సూర్యుని వలన సుగ్రీవుడు పుట్టారు. వృక్ష రాజును తన భార్యగా గొనిన ఆ ఇంద్రుడే తన పుత్రుడైన వాలిని కాపాడుతాడు. రాముని తో జరుగ బోవు ఈ యుద్ధములో నీవు ఇంద్రుని (నీ మామ తండ్రి గారు) పూజ చేయమని, ఆయనే కాపాడుతాడు అని ఒక వృద్ధ స్త్రీ తారకు చెప్పినదను భావన
కంద పాదమును సీసములోనికి మార్చి నా పూరణము
స్నానము చేయ విస్మయముగ వృక్షరాజు తనువు మారి , నెలతుక నయ్యె, దారిని బోవుచు స్వారాట్టు,రోహిత్తు లిరువురు మోహించి సురతము సలు ప దినమణికి బుట్టె బలుడు సుగ్రీవుడు, బలబేధి వనితను కలసి యిచ్చె నుగ వాలినిఁ, దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్ సతము తన పుత్రుని, వెత బడగ వలదు.మాతా ,పూజ భక్తి తోడ చేసి కోరుము యింద్రుని, యీ సమరము లోన నీ వల్లభునకు గెలుపు కలుగగ ననుచు తారతో యనె వృద్ధ వనిత యొకతె
ప్రభాకర శాస్త్రి గారూ, మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు. మీరు ప్రయోగించిన 'ఫూల్‌వాలి' ప్రయోగమే సముచితంగా ఉన్నది. మైలవరపు వారన్నట్లు 'పూవాలి' అంటే దుష్టసమాసమయ్యే అవకాశం ఉంది.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2814 సమస్య :: వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ముల బ్రోచు నెప్పుడున్. *వాలిని భార్యగా పొందిన స్వామియే జగద్రక్షకుడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: *శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్* అని ఆదిశంకరాచార్యులవారు తాను రచించిన సౌందర్యలహరి అనే గ్రంథంలో చెప్పియున్నారు కదండీ. ఇల్లాలు తోడుగా ఉంటేనే పురుషుడు సంపూర్ణంగా శక్తిశాలి ఔతాడు అనడం సత్యం సుమండీ. శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించేందుకు శ్రీరాముడుగా అవతరించి రాక్షస సంహారం చేయదలచి శక్తిమంతు డయ్యేందుకు శక్తి స్వరూపిణి శ్రీ లక్ష్మీస్వరూపిణి భూజాత ఐన సీతను వరించినాడు. భవిష్యత్తులో లంకాదహనమునకు కారణం కాగల అగ్ని యైన సీతాదేవిని భార్యగా స్వీకరించిన ఆ సీతాపతి ఆ స్వామి సర్వజగద్రక్షకుడు అని విశదీకరించే సందర్భం.
గు రు మూ ర్తి ఆ చా రి ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
దయచేసి నిన్నటి పూరణ స్వీకరించండి .
పొరపాటున పద్యం మత్తేభంలో వ్రాశాను . చేయునది లేక సమస్యను ------------------------------------------------------------------------------------------------- కూడా మత్తేభం లోనికి మార్చాను . ----------------------------------------------- కావున నన్ను క్షమించండి ***********************
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== వాలిని భార్యగా గొనిన స్వామి జగమ్ముల బ్రోచునెప్పుడున్ ======================== లోకములను పాలించు ఏ దేవుడికిని వాలి భార్యగా ఉన్నట్లు కనిపించదు, పైగా గౌతముని భార్య అహల్య, దేవ- రాజు ఇంద్రునికి అక్రమ సంతానంగా పుట్టిన వాలి పురుషుడు కూడాను,ఈ తీరున కనబడు అసంబద్దతె సమస్య ========================= సమస్యా పూరణం - 280 ==================
తల్లి కదా తానందరికి చండిక- శక్తిగ తాను అఖండిక అమ్మల కమ్మగ మాతృక- సురలు అసురుల మొక్కుల పాతృక దుష్టుల దునుమాడి దీపించెను- తానై కపాల కరవాలిని భార్యగా గొనిన స్వామి- జగమ్ముల బ్రోచునెప్పుడున్ మాలిని
====##$##====
సూక్ష్మము అణువు, అతి సూక్ష్మము పరమాణువు, అట్టి పరమాణువున కేంద్రకము చుట్టు కక్ష్యలుగా చలించునవి ఎలక్రానులు, ప్రోటానులు,న్యూట్రాన్లు,కేంద్రక విఛ్ఛిత్తి, కేంద్రక సమ్మేళనములుగా అపార శక్తి వెలువడును.
"యాదేవీ సర్వభూతేషు - శక్తి రూపేణా సంస్థితః "
ప్రయివేటు ఆర్టీసీ బస్సు "పల్లె వెలుగును" పరిశుభ్రంగా ఉంచుకుని జాగ్రత్తగా చూసుకునే డ్రైవర్ ఇంజిన్ బానెట్ పై " నేను శక్తిని నాపై కాళ్ళు పెట్ట కూడదు " అని వ్రాయిస్తాడు.
వాడికి తెలిసిన శక్తి నిర్వచనం మనలో చాలా మందికి తెలియదేమో !
కాల మహిమ నగ్ని యలుఁగ జ్వాలిగ నంగిరసుఁ డయ్యె భారము మోయన్ మే లొనగూడుఁ దమి సినీ వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
[సినీవాలి = అంగిరస మునీంద్రుని కూతురు]
కాల సమాన తారక విఘాతక జన్మ నిమిత్త మిత్తరిన్ శూలినిఁ గామపాశమున సోలఁగఁ జేయుము మీనకేతనా కాలగళుండు వీరవరుఁ గ్రౌంచనిషూదను గాంచు నీ సినీ వాలిని భార్యగాఁ గొనిన, స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశూలాయుధుండు జగముల
రిప్లయితొలగించండిపాలించెడి వాడు హరుడు పరమేశ్వరుడే
కాలుండని పేరు సినీ
వాలిని తన సతిగగొన్న స్వామియె ప్రోచున్!
బాలగ భండ తనయు నవ
తొలగించండిలీలగ ఖండన మొనర్చ లేతగు చేతిన్
చాలిత రక్తాంకిత కర
వాలిని తన సతిగగొన్న స్వామియె ప్రోచున్!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణలో మొదటి పాదం అర్థం కాలేదు. వివరించండి.
ధన్యవాదములు గురుదేవా!
తొలగించండిలలితా పరమేశ్వరియే బాలా త్రిపుర సుందరిగా భండాసుర సంహారంలో భండాసురుని పుత్రుని వధిస్తుంది!
“భండపుత్ర వధోత్సుక్య బాలా విక్రమ నందితా” యని లలితా సహస్రనామములలో ఒక శ్లోకం! దాని ఆధారంగా పూరించాను!
🙏🙏🙏🙏
క్షమించాలి! “భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా”!
తొలగించండిమేలుగ నహల్యఁ బ్రోయుచు
రిప్లయితొలగించండిగేలిగ హరువిల్లుఁ ద్రుంచ గింగురుమనగా
వీలుగ సీతను;...తునుమను
వాలినిఁ;...దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్ :)
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిపద్యం బాగుంది. కాని సీత రావణసంహారానికి కారకురాలైంది. వాలి వధకు కాదు కదా!
గడబడ ఐనది విరుపు :(
తొలగించండివాలిని చంపకుండా రావణుడను చంపడం ఎలా సాధ్యం సార్ ;)
తొలగించండి
రిప్లయితొలగించండికాలంజరి,కాత్యాయని,
కాలక,కాళిక,కిరాతి,గౌరమ్మ,జయం
తీ, లంభ, బాభ్రవి, సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్!
మొత్తం పదిమందిని...
తొలగించండి
తొలగించండికందం చిన్నదై పోయింది యేమి చేద్దాం :)
జిలేబి
నమస్తే జిలేబి గారూ ! సినీ వాలి = అనగా ? ?
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిపార్వతికి ఉన్న పర్యాయపదాల లిస్టుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గురుమూర్తి గారూ,
సినీవాలి అంటే రెండర్థాలున్నాయి. ౧) చంద్రకళ కనిపించే అమావాస్య, ౨) పార్వతి.
తొలగించండిగురుమూర్తి గారు
పైన కంది వారర్థం చెప్పేసారు .
ఈ కాలానికి అర్థం చెప్పు కావాలంటే సినీ - సినిమా లో వాలి - కోతి - హీరో :)
జిలేబి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికాలుని గెల్చి బాలకుని గాచినవాడు , దయార్ద్రుడౌచు శ్రీ...
కాళభుజంగరాజముల గాచి విముక్తినొసంగినాడు , కా...
పాలియె కాని లోకముల పాలకుడాతడె , ఈశుడౌ , సినీ...
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చిరుసవరణతో... (మన్నించండి)
తొలగించండికాలుని గెల్చి బాలకుని గాచినవాడు , దయార్ద్రుడౌచు శ్రీ...
కాళమదేభరాజముల గాచి విముక్తినొసంగినాడు , కా...
పాలియె కాని లోకముల పాలకుడాతడె , ఈశుడౌ , సినీ...
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
🙏శ్రీశక్త్యె నమః🙏
తొలగించండిలీలారూపిణి , శ్రీ చ...
క్రాలయ , శక్తిస్వరూపఁ , గాళిఁ గరాళిన్
మాలీకృత రుండను , కర...
వాలినిఁ దన సతిగ గొన్న స్వామియె ప్రోచున్!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణలు అవధానిగారూ! అభినందనలు!🙏🙏🙏
తొలగించండినమస్తే అవధానిగారూ ! సినీ వాలి = ? ?
తొలగించండిమైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి*****
సినీవాలి = చంద్రకళ కనిపించే అమావాస్య, పార్వతి.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండివాలము లేకనె నరుడగు
జాలమ్మది యేల నరుడె జాయగ గూడన్
కాలము మారెను నొక"గై"
వాలిని తన పతిగ గొన్న;స్వామియె ప్రోచున్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిమాలిని !నందయంతి! సతి! మాతృక !కౌశికి కొండచూలి చం
డాలిక ! నీలలోహిత! మృడాని ! జయంతి ! భవాని! సౌమ్యయున్,
కాలక! అన్నపూర్ణ ! ఉమ! కాళిక! పార్వతి ! శక్తి యా సినీ
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండికందం సరిపోలేదని వృత్తాన్ని స్వీకరించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొన్నెప్పుడో మీరు నాకేమో పంపానన్నారు. నాకైతే ఇంతవరకు అందలేదు.
"ఆడువారి మాటలకూ..."
తొలగించండి
తొలగించండి:)
జిలేబి
మాలిని ,దశభుజ ,భార్గవి
రిప్లయితొలగించండికాలక ,గాంధర్వి ,పింగ, కాలంజరి చం
డాలిక, పురుహూతి,సినీ
వాలినిఁ, దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవతల పర్యాయ పదాలతో పద్యం వ్రాయడం మీకు కొట్టినపిండి.
రిప్లయితొలగించండికం
కూలార్చె రాఘవు డనిని
మేలునిడెడు రాముడు కడు మేలిమి సీతన్
పాలిత సుర సీతాపతి
వాలిని, దన సతిగ గొన్న స్వామియె, ప్రోచున్
🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷 వనపర్తి🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిక్షమించాలి. మీ పద్యభావం అర్థం కాలేదు.
పాలనియై లోకములకు ;
రిప్లయితొలగించండిమాలినియై స్తుతిసుమముల ; మదమత్సర దై
త్యాలివధోద్ధురధరకర
వాలిని ; దనసతిగ గొన్న స్వామియె ప్రోచున్ .
ప్రశస్తమైన పూరణ బాపూజీగారూ! 🙏🙏🙏🙏
తొలగించండిబాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శంకరార్యులకు , సీతాదేవి గారికి ధన్యవాదాలు .
తొలగించండికాలుడునగజాధీశుడు
రిప్లయితొలగించండిఫాలాక్షుడుసాంబశివుడుభస్మాంగుండా
మాలతినింబోలు సినీ
వాలినిదనసతిగగొన్నస్వామియెప్రోచున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలాక్షు డు పరమేశుడు
రిప్లయితొలగించండికాలు డు శశి మౌళి శివుడు గంగాధరు oడా
శూలి సుర లు కోరసినీ
వాలి ని దన సతి గ గొన్న స్వామి యె ప్రోచు న్
రెండవ పాదం చివర గంగా ధరు డా అని చదవాలి
తొలగించండిరాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూర్వము వృక్ష రాజు అను మహనీయుడు దగ్గిరలో నున్న కొలనులో స్నానము చేసి బయటకు రాగానే అతడు చక్కని స్త్రీ రూపము దాల్చాడు . ఒకనాడు ఇంద్రుడు ,సూర్యుడు ఆ దోవలో వెళ్తూ ఆ సుందరమగు స్త్రీని చూచి మోహించి ఆవిడతో సంగమించారు . అప్పుడు ఇంద్రుని వలన వాలి సూర్యుని వలన సుగ్రీవుడు పుట్టారు. వృక్ష రాజును తన భార్యగా గొనిన ఆ ఇంద్రుడే తన పుత్రుడైన వాలిని కాపాడుతాడు. రాముని తో జరుగ బోవు ఈ యుద్ధములో నీవు ఇంద్రుని (నీ మామ తండ్రి గారు) పూజ చేయమని, ఆయనే కాపాడుతాడు అని ఒక వృద్ధ స్త్రీ తారకు చెప్పినదను భావన
రిప్లయితొలగించండికంద పాదమును సీసములోనికి మార్చి నా పూరణము
స్నానము చేయ విస్మయముగ వృక్షరాజు తనువు మారి , నెలతుక నయ్యె,
దారిని బోవుచు స్వారాట్టు,రోహిత్తు లిరువురు మోహించి సురతము సలు
ప దినమణికి బుట్టె బలుడు సుగ్రీవుడు, బలబేధి వనితను కలసి యిచ్చె
నుగ వాలినిఁ, దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్ సతము తన పుత్రుని, వెత
బడగ వలదు.మాతా ,పూజ భక్తి తోడ
చేసి కోరుము యింద్రుని, యీ సమరము
లోన నీ వల్లభునకు గెలుపు కలుగగ
ననుచు తారతో యనె వృద్ధ వనిత యొకతె
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
'కోరుము + ఇంద్రుని + ఈ' అన్నపుడు యడగమం రాదు. "కోరుమా యింద్రుని నీ సమరము" అనండి.
రిప్లయితొలగించండిపరమాత్ముడొకడే పురుషుడు తతిమ్మా అందరు నెచ్చెలులే
లోలాక్షి! పురుషుడొకడే
నే! లోతక్కువ జనులిక నెచ్చెలు లే లె
మ్మా! లాఘవముగనడచచు
వాలిని, దన సతిగ గొన్న స్వామియె, ప్రోచున్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర 'నడచుచు/నడపుచు' అని ఉండాలనుకుంటాను. టైపాటా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆ లయకారుడు భవుడా
ఫాలాక్షుడు భవహరుడగు భసితాంగుండున్
హేలగ గిరిసుతను సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్"*
మరొక పూరణ
బాలుని బ్రోచిన శంకరు
డాలమునందున.త్రిపురుల నంతము చేసెన్
లీలగ కరమంది సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్.
నమస్తే ఉమాదేవి ! సినీ వాలి = ? ?
తొలగించండిడా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పూల మృదుత్వము నేయవ
రిప్లయితొలగించండిలీలగనే తాజయించు లీలావతినిన్
మేలగు నడత గల సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేలుగ మనసున దలచిన
రిప్లయితొలగించండిజాలిని చూపించి వేగ సర్వజ్ఙుండే
శూలియె, త్రినేత్రుడు సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఫాలాక్షుండగు భద్రుడు
రిప్లయితొలగించండికైలాసమ్మున వసించు కరకంఠుండే
శైలేంద్రుని పుత్రి సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాలుడు మార్కండేయుని
రిప్లయితొలగించండికాలుని పాశమ్మునుండి గాచిన దొరయౌ
ఫాలుండౌ శివుడు సినీ
వాలిని దన సతిగ గొన్న స్వామియె ప్రోచున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి పూలతో అంకితం)
నీలపు మేఘముల్ కురిసి నేలను నింగిని హాయిదేల్చగా
మాలల నింపుగా నిముడు మల్లెలు జాజులు బంతి చెండ్లతో
పూలను మేలుగా నిలిపి ముచ్చట మీరిన కొల్వులొందు ఫూల్
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్
ఫూల్ వాలి = (పూలతో విరాజిల్లునది) బతుకమ్మ (మహా గౌరీ దేవి)
https://en.m.wikipedia.org/wiki/Bathukamma
*****************************
మైలవరపు వారి స్పందన:
చక్కగా ఉందండీ.. చివర్లో... పూ వాలిని... అంటే మరింత సొగసు గా ఉంటుంది... నమోనమః 🙏🙏
వాలి.. వలతి ఇతి... ధరించేది... అని అర్ధం
👏👏👏👏
తొలగించండి
తొలగించండిబతుకమ్మకు పూవాలి అని పేరుకనుక్కున్నందుకు వేసుకోండి వీరత్రాడు
అద్భుతః
జిలేబి
సీతా దేవి గారికి ధన్యవాదములు.
తొలగించండిజిలేబి గారూ: మీరిచ్చిన వీరతాడు మైలవరపు వారు లాగేసుకుంటారేమో! పోనీ లెండి...కంది వారి స్టాకులోనుంచీ ఒకటి తస్కరిస్తాను...ఆషాఢభూతిలా...
తొలగించండిమైలవరపు వారికి వీరత్రాడెందుకు జీపీయెస్ వారు ! వారే వీరత్రాడు వేరే దేనికి
మనలాంటి సామాన్యులకే అప్పుడప్పుడూ అవసరం సెబాసో అని భుజాలను చరుచుకోవడానికి :)
కాబట్టి మీ ఖాతాలోకే అది.
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
మీరు ప్రయోగించిన 'ఫూల్‌వాలి' ప్రయోగమే సముచితంగా ఉన్నది. మైలవరపు వారన్నట్లు 'పూవాలి' అంటే దుష్టసమాసమయ్యే అవకాశం ఉంది.
(అష్టాదశ నామాలతో అమ్మకు...)
రిప్లయితొలగించండికాలిక గట్టుపట్టి యుమ కర్వరి కౌశికి నందయంతి చం
డాలిక కప్పుటైదువ మృడాని కపాలిని భద్రకాళియౌ
శైలజ సింహయాన సతి శాకిని శాంభవి శక్తి యౌ సినీ
వాలిని భార్యగా గొనిన స్వామి జగమ్ముల బ్రోచు నెప్పుడున్!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2814
సమస్య :: వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ముల బ్రోచు నెప్పుడున్.
*వాలిని భార్యగా పొందిన స్వామియే జగద్రక్షకుడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: *శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్* అని ఆదిశంకరాచార్యులవారు తాను రచించిన సౌందర్యలహరి అనే గ్రంథంలో చెప్పియున్నారు కదండీ. ఇల్లాలు తోడుగా ఉంటేనే పురుషుడు సంపూర్ణంగా శక్తిశాలి ఔతాడు అనడం సత్యం సుమండీ. శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించేందుకు శ్రీరాముడుగా అవతరించి రాక్షస సంహారం చేయదలచి శక్తిమంతు డయ్యేందుకు శక్తి స్వరూపిణి శ్రీ లక్ష్మీస్వరూపిణి భూజాత ఐన సీతను వరించినాడు. భవిష్యత్తులో లంకాదహనమునకు కారణం కాగల అగ్ని యైన సీతాదేవిని భార్యగా స్వీకరించిన ఆ సీతాపతి ఆ స్వామి సర్వజగద్రక్షకుడు అని విశదీకరించే సందర్భం.
శ్రీ లలనా స్వరూపిణిని, సీతను, భూజను బెండ్లియాడి, దా
నాలము లోన రాక్షసుల నంతము జేయగ రామచంద్రుడున్
లీల జరించె, భావి నవలీలగ లంక దహింపజాలు తత్
జ్వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ముల బ్రోచు నెప్పుడున్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (11-10-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండి: శైలజను కలుప మదనుడు
రిప్లయితొలగించండికోలలను విడువ దహించి కోపముతోడన్(కోటేశ్వరుడే)
మాలిమితోచేరి సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,
దయచేసి నిన్నటి పూరణ స్వీకరించండి .
పొరపాటున పద్యం మత్తేభంలో వ్రాశాను . చేయునది లేక సమస్యను
-------------------------------------------------------------------------------------------------
కూడా మత్తేభం లోనికి మార్చాను .
-----------------------------------------------
కావున నన్ను క్షమించండి
***********************
[ ఒక శైవమతస్తుడు ఇలా వాదించాడు ]
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
సుర దైతేయ నికాయ మప్డు సుధ కై శోధించుచున్ , క్షీరసా
గర మున్మంథ మొనర్చు వేళ విష ముగ్రంబై జనింపంగ , మా
హరుడే గ్రోలి - గళమ్మునన్ నిలిపి భీత్యర్తిన్ నివారించె || నా
హరిసంసేవిత సద్గుణాకరుడు - సర్వాఘాయు నిర్వేద సం
హరుడౌ మా హరుడే కలిప్రజల గాపాడున్ గదా నిత్యమున్ |
హరుడే వర్ధిలె దేవుడై తిరుమల న్నత్యంత సంప్రీతితోన్ |
తిరు '' శ్రీ " యౌ | మల " కొండ "యౌను | కవి ! కానన్ సమర్థం బగున్ |
{ ఉన్మంథము = మథనము ; భీతి + అర్తి = భీత్యర్తి ;
అర్తి = ఆర్తి = దుఃఖము ; అఘాయువు = పాపము ; }
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిసమస్యాపాదాన్ని మార్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఫాలమునందునన్దనరుభస్మపురేఖలుదేజరిల్లగా
రిప్లయితొలగించండిగాలునిరూపమున్గలిగిగావుచుభక్తులనెల్లవేళలన్
మాలతివోలెనాగలుగుమాయమ,శ్రీసతియైనయాసినీ
వాలినిభార్యగాగొనినస్వామిజగమ్ములబ్రోచునెప్పుడున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గాచుచు భక్తుల...' అనండి.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
వాలిని భార్యగా గొనిన స్వామి
జగమ్ముల బ్రోచునెప్పుడున్
========================
లోకములను పాలించు ఏ దేవుడికిని
వాలి భార్యగా ఉన్నట్లు కనిపించదు,
పైగా గౌతముని భార్య అహల్య, దేవ-
రాజు ఇంద్రునికి అక్రమ సంతానంగా
పుట్టిన వాలి పురుషుడు కూడాను,ఈ
తీరున కనబడు అసంబద్దతె సమస్య
=========================
సమస్యా పూరణం - 280
==================
తల్లి కదా తానందరికి చండిక-
శక్తిగ తాను అఖండిక
అమ్మల కమ్మగ మాతృక-
సురలు అసురుల మొక్కుల పాతృక
దుష్టుల దునుమాడి దీపించెను-
తానై కపాల కరవాలిని
భార్యగా గొనిన స్వామి-
జగమ్ముల బ్రోచునెప్పుడున్ మాలిని
====##$##====
సూక్ష్మము అణువు, అతి సూక్ష్మము
పరమాణువు, అట్టి పరమాణువున కేంద్రకము
చుట్టు కక్ష్యలుగా చలించునవి ఎలక్రానులు,
ప్రోటానులు,న్యూట్రాన్లు,కేంద్రక విఛ్ఛిత్తి, కేంద్రక
సమ్మేళనములుగా అపార శక్తి వెలువడును.
"యాదేవీ సర్వభూతేషు -
శక్తి రూపేణా సంస్థితః "
ప్రయివేటు ఆర్టీసీ బస్సు "పల్లె వెలుగును"
పరిశుభ్రంగా ఉంచుకుని జాగ్రత్తగా చూసుకునే
డ్రైవర్ ఇంజిన్ బానెట్ పై " నేను శక్తిని నాపై
కాళ్ళు పెట్ట కూడదు " అని వ్రాయిస్తాడు.
వాడికి తెలిసిన శక్తి నిర్వచనం మనలో
చాలా మందికి తెలియదేమో !
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం )
_/\_
తొలగించండిధన్యవాదములు - కృతజ్ఞతలు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాల మహిమ నగ్ని యలుఁగ
తొలగించండిజ్వాలిగ నంగిరసుఁ డయ్యె భారము మోయన్
మే లొనగూడుఁ దమి సినీ
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
[సినీవాలి = అంగిరస మునీంద్రుని కూతురు]
కాల సమాన తారక విఘాతక జన్మ నిమిత్త మిత్తరిన్
శూలినిఁ గామపాశమున సోలఁగఁ జేయుము మీనకేతనా
కాలగళుండు వీరవరుఁ గ్రౌంచనిషూదను గాంచు నీ సినీ
వాలిని భార్యగాఁ గొనిన, స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్
[సినీవాలి = పార్వతీ దేవి]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణలు రెండూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిరమేశా వారి భావనకు
మాలిని జగజ్జననియు,క
పాలిని,యమ్మలకునమ్మ పార్వతి గట్రా
చూలి దునుమ నసురుల కర
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
జిలేబి
ధన్యవాదములు- కృతజ్ఞతలు
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిరమేశ్ గారి భావానికి మీ పద్యరూపం బాగున్నది. అభినందనలు.
కాలములను లెక్క గొనక
రిప్లయితొలగించండిచాలించక తనదు దీక్ష సన్నుతి సేయన్
శైలసుత నపర్ణ సినీ
వాలిని దన సతిగ గొన్న స్వామియె ప్రోచున్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాళిక చంద్రశేఖరుని కాంచగ, మారుడు వేయబాణముల్
రిప్లయితొలగించండికాలగళుండు తామదను గర్జనతో మసి చేసె చెచ్చెరన్
శైలజ రూపురేఖలకు సంతసమొందుచు నిచ్చనా సినీ
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జాలియుమరచిన సత్యయె
రిప్లయితొలగించండితేలికగాజంపెనరకదిగ్గజమును క
ల్లోలము మాన్పినదౌ దీ
వాలిని దనసతిగగొన్న స్వామియె ప్రోచున్
కాలము మారిన దనివిని
రిప్లయితొలగించండిజాలిగ నొకపేద పిల్ల జవరా లనగన్
మేలిమి యనుకొని తుదకట
వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్
వాలి = ఐంద్రి జ్యేస్టా నక్షత్రము, మాలకాకి,ఇలా....
ఫాలము నందు లోచనము పావన గంగయె జూటమందునన్
రిప్లయితొలగించండిశూలము చేతియందు తలఁ జుక్కల రేణిఁధరించినట్టి యా
శూలియె పర్వతేంద్రు బ్రియసూనను సద్గుణ శీలియౌ సినీ
వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచునెప్పుడున్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
వాలిని భార్యగాఁ గొనిన
స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్
సందర్భము: కవి యశక్తత.. తీర్థ యాత్రలలో ప్రయాణపు బడలిక.. అనేక కారణాలవల్ల వ్రాయా లని వున్నా వ్రాయలేక పోవడం.
పరమేశ్వరుడు నన్ను మన్నించు గాక! జగములను బ్రోచు గాక!
పూరి= పూరీ (పుణ్య క్షేత్రం).
సినీవాలి= పార్వతి
~~~~~~~~~~~~~~~~~~~~~~~
మేలుగ "పూరి"లో నిదుర
మేల్కొని నే డుదయానఁ జూచితిన్
లీలగ నే సమస్య యని
నే ; నపుడే మది దోచెనే "సినీ
వాలి" పదంబు నందముగ
వ్రాయగనైతి ; క్షమించి నన్, సినీ
వాలిని భార్యగాఁ గొనిన
స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్
✒~డా.వెలుదండ సత్యనారాయణ
11.10.18
-----------------------------------------------------------
శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో..