14, అక్టోబర్ 2018, ఆదివారం

సమస్య - 2817 (మృత్యువు మనుజులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్"
(లేదా...)
"మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్"

121 కామెంట్‌లు:

  1. ప్రత్యక్షము నంత్యమ్మున...
    కృత్యమ్ములనందు లేదు కీర్తియు గతియున్
    సత్యమ్మిదియె...నహంకృతి
    మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్!

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    *ఓం నమశ్శివాయ*

    నిత్యము తిండి, మైథునము, నిద్రలె శాశ్వతమౌనె ? మానవా !
    మృత్యువు పుట్టినప్పుడె లిఖింపబడెన్ , గమనించుచుండె , స...
    ద్భృత్యుడవౌచునీశుని భజింపగ నాపగ గల్గునాతడే
    మృత్యువు ., మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

    2. ఎందుకు చనిపోతున్నావురా ఎంకట్రావూ.. అంటే.. పాపం..👇అంటున్నాడు 😊

      నిత్యంబప్పులతిప్పల...
      పత్యారోగ్యంపు వెతలు, భార్యాబాధల్
      సత్యంబన్నియి మాపెడి
      మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగి

      తొలగించండి

  3. Until liberation get recycled :)


    సత్యంబగు పరమాత్ముని
    ప్రత్యంతము చేరక తమ బతుకుల నీడ్వన్
    నిత్యంబగు మరు జననము,
    మృత్యువు, మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. (1)
    కృత్యము లెవ్విధి నున్న న
    నిత్య మ్మీ కాయ మెపుడొ నిను వీడు ననన్
    సత్య మనాయాసమ్మగు
    మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్.
    (2)
    సత్య మిది తప్ప దెన్నఁడు
    మృత్యువు మనుజులకు; గొప్ప మే లొనఁగూర్చున్
    గత్యంతరములఁ జూడక
    నిత్యమ్ముఁ జరింప ధర్మ నిరతిని వినుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగున్నది.
      అనాయాసేన మరణమ్
      వినాదైన్యేన జీవనమ్ ౹
      దేహాంతే తవ సాయుజ్యమ్
      దేహి మే పరమేశ్వర: ౹౹
      {దేహి మే మధుసూదన : ౹౹}

      తొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    భృత్యుని వలె నెద్దుకు వలె
    కృత్యము లొనరించి యలసి గిసగిసలాడన్
    సత్యము ఫలముగ రాలెడి
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనరించున్!

    రిప్లయితొలగించండి
  6. ( స్వాతంత్ర్యసంగ్రామ యోధుడు అల్లూరి సీతారామరాజు)
    సత్యము నీదునామ మిక
    చయ్యన నిండును భారతమ్మునన్ ;
    స్తుత్యము నీ చరిత్ర మిట
    శూరత నిల్పగ నాంధ్రులందునన్ ;
    స్మృత్యము రామరాజ ! ఘన
    కృత్యము నీదగు నాత్మదానమే ;
    మృత్యువు మానవాళికి న
    మేయహితంబును గూర్చు నెప్పుడున్ .

    రిప్లయితొలగించండి
  7. డా. పిట్టా సత్యనారాయణ
    సత్యమె పెద్ద నినిద్దురన చావు కదా!మరి యంత తేలికౌ
    భత్యము మూట గట్టుకొని బాధల వీడెడి యాత్ర వోలె సాం
    గత్యము జేయగావలె నగౌరవ దుఃఖ దరిద్ర బాహ్యమౌ
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్

    రిప్లయితొలగించండి
  8. అత్యధిక రోగములవియె
    నిత్యము బాధించుచుండ నీరస పడి యో
    భృత్యుండు వగచె నిట్టుల
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనఁ గూర్చున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒక'ను 'ఓ' అనరాదు. "నీరస పడె నా। భృత్యుండు..." అందామా?

      తొలగించండి
  9. నిత్యము బాధలు పడెడియ
    గత్యము తొలగింప జేసి గమ్యము జేర్చున్
    సత్యమ్మిది చింతింపగ
    మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్
    ****)()(****
    (అంతు,పొంతు లేక బాధలతో బ్రదుకు నీడ్వ వలసి రావటమే నరక ప్రాయము.దానినుంండి విముక్తిని కలిగించేది మృత్యువు)

    రిప్లయితొలగించండి
  10. సత్యమ సత్యము దెలియుచు
    నిత్యము హరినామ జపము నిష్టగ జేయన్
    సత్యమె! మోక్షము నిచ్చెడి
    *"మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్"*

    రిప్లయితొలగించండి

  11. పరలోకమున ఉన్న తండ్రీ గావుమయా ! ఆమెన్ !ఆదివారము


    సత్యము యేసునాధుడనె ! సాధ్యము ప్రేమసుధారసంబునే
    నిత్యము గ్రోలుచున్ జనులు నేయపు మార్గము లో ప్రయాణమై
    జాత్యపు రీతిగా నడత జాదుకొనన్ గమకమ్ము జేయగా
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బొత్తిగా evangelist అయిపోయారు...ఈ రోజిక అల్లరి లేదా?

      తొలగించండి

    2. పైన మైలవరపు వారు ఓ నమశ్శివాయ అంటేను :) కొంత కాంపిటీషన్ కై యేసునాధుని‌ నారదా అన్నాము మిగిలిందొక్కరే వార్నీ లాగేద్దాము :)


      జిలేబి

      తొలగించండి
    3. ఒక జిహాదీ కొరికగా చెప్పండి...ఇదే ఛాన్సు!

      తొలగించండి
    4. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    మృత్యువు మానవాళికి నమేయ
    హితంబును గూర్చు నొప్పుగన్
    =====================
    చావు అనునది మనుషులకు
    ఎనలేనిదై మేలు చేయుచున్నదను
    టలో అసంబద్దతె ఇచట సమస్య
    ========================
    సమస్యా పూరణం - 283
    ==================

    నిన్నటిదయ్యె నా అవివేకము-
    తెలిసి వచ్చెగ నేటి వివేకము
    నేటి జీవితము సుఖముల నాకము-
    రేపటికది ముదిమిగ శోకము
    మార్పుగ మరి నేను సమసకున్న-
    బతుకున రుచియేది చెప్పగన్
    మృత్యువు మానవాళికి నమేయ-
    హితంబును గూర్చు నొప్పుగన్

    ====##$##====

    కోర్కెల చేర్పుతో జీవితం కొనసాగినట్లు
    తరముల మార్పుతోనే గతిశీలక సమాజంలో
    అభివృద్ది కాననగును.

    ఒంటికి ఆకులు చుట్టుకున్న నాటి మనిషి
    నేడు అంగారకుడి పైకి పయనమై పోతున్నడు.

    చరిత్రలో చదివిన కొత్త రాతి పాతరాతి
    యుగములవి యెన్ని కలవో ముడి చమురును
    నేల బొగ్గును అడుగు చెబుతాయి.

    కల్పాంతములు, కల్పాదులు కొనసాగుటకు
    మృత్యువొక మాధ్యమం కాదా

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ----- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  13. నిత్యము బాధించు రు జ యు
    నత్యంత పు హేయమైన నల జడి యగు చో
    సత్యము త త్సమయం బున
    మృత్యువు మనుజుల కు గొప్ప మే లొన గూర్చు న్

    రిప్లయితొలగించండి
  14. సత్య మెరుగ నచికేతుడు
    మృత్యువునే యాశ్రయించె మృత్యువె గురువౌ
    సత్యమ్ము నెరుగ దలచిన
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనగూర్చున్

    రిప్లయితొలగించండి

  15. Accept or perish


    సత్యమిదే! ఖుదాయొకడె! సాగిలబెట్టుటదేల, మూర్తులన్
    నిత్యమటంచు! భీతిలక, నివ్వెర చెందెడు రీతి అల్ యి లాహ్
    ముత్యపుకాంతి యైనిలువ, ముంగట మ్రొక్కన, కుత్తుకల్ గొనన్
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. అత్యుగ్రమైన లేమికి
    ప్రత్యహమును గుందు నొకడు బహుదీనుండై
    సత్యం బిట్లని తలచెను
    మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్

    రిప్లయితొలగించండి
  17. గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2817
    సమస్య :: మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్.
    *మరణమే శరణమై మానవులకు గొప్ప మేలును చేకూర్చుతుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: దేహానికి మరణం సిద్ధించినప్పుడు యీ దేహాన్ని వదలివేసి జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. దైవ సాయుజ్యాన్ని పొందేందుకు మెట్టు మరణమే కదా!
    బ్రహ్మదేవుడు వరం కోరుకోమంటే *మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే* అని హిరణ్యకశిపుడు మొదలైన రాక్షసులు కోరుకొన్నారు. వారు మందబుద్ధులు.

    మరణమే లేని దేవతలు (అమరులు) అమేయుడైన భగవంతునిలో లీనమయ్యే అవకాశం లేదు అని చెప్పవచ్చు.

    అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనమ్।
    దేహాన్తే తవ సాయుజ్యం, దేహి మే మధుసూదన ! అనే శ్లోకంలో
    దైన్యము లేని జీవితాన్ని, అనాయాస మరణాన్ని, మరణం తరువాత దైవసాయుజ్యాన్ని మానవులు కోరుకొంటున్నారు.
    కాబట్టి ఎటువంటి శ్రమ ఆయాసము లేనటువంటి మృత్యువు మానవులకు గొప్ప మేలును చేకూరుస్తుంది అని విశదీకరించే సందర్భం.

    మృత్యువు లేని జీవనము మేలను దైత్యులు మందబుద్ధు, లా
    మృత్యువు లేని దేవత లమేయునిలోన విలీనమౌదురే?
    మృత్యువు దైవలీనతకు మెట్టగు, నే శ్రమ గూర్చనట్టిదౌ
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (14-10-2018)

    రిప్లయితొలగించండి
  18. మృత్యువు దేవత గావున
    మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్
    నిత్యముదనువెంటాడుచు
    సత్యముగానుండునటులసాకుచునెపుడున్

    రిప్లయితొలగించండి
  19. అత్యంతంబగు రోగపు
    భృత్యుడు మిక్కుటముగ వెతపడుచునె తలచెన్
    "గత్యంతరంబు లేదిక
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనగూర్చున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "భృత్యుడు మిక్కుటముగ పడి వెతలన్ దలచెన్" అందామా?

      తొలగించండి
  20. తలపండి తలపులు వెలవెల బోవగ
    కనులు దృశ్యములను కాంచ లేక ,


    వినికిడి లోపము వీనులకు గలుగ,
    మధుమేహము, జతకు రుధిర మందు

    వత్తిడి పెరుగగ ,నత్తరి సతి భువి
    నివదలి వెడలగ ,నిజము గద ని


    లన మృత్యువు మనుజులకు గొప్ప మేలొన
    గూర్చు ననుచు పలుకుదురు నరులు,

    నిక్కమిది నేటి దినముల, నేర మనగ

    వచ్చు ముసలి వారలకు జీవనము చేయ,

    కూరిమి దినములం జేయు నేర ములకు

    తగిన శిక్ష గదా యని తలచు జనత

    పూసపాటి కృష్ణ సూర్య కుమార్ బంధకవి గుంటూరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వత్తిడి' అన్న పదం లేదు. అక్కడ 'ఒత్తిడి' అనండి. 'ఇలన' కాదు "ఇలను" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారు సరి చేస్తాను

      తొలగించండి
  21. నృత్యము హరి నామముతో,
    కృత్యము హితచర్య,దైవ కృపయగు ధనమున్,
    నిత్యము దుష్క్కృతికిని తగు
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనరించున్.

    రిప్లయితొలగించండి
  22. దేవిక
    -----

    ప్రత్యక్షర సత్యమ్మిది
    నిత్యము సంసార బంధ నిర్మగ్నులుగా
    నత్యంతము రోయు నెడల
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనగూర్చున్ !

    సత్యంబౌ పరమాత్మను
    ప్రత్యయముగ జేరగాను ప్రవిమల మతియై
    నిత్యము వేడగ; పైకొని
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనగూర్చున్ !

    రిప్లయితొలగించండి
  23. దేవిక
    -------
    రెండవ పూరణ లో రెండవ పాదం చివర ' మతులై, అని'చదువ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకాంత్ (దేవిక?) గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. దేవిక
      -------

      ధన్యవాదాలు గురుదేవా! నమస్సులు.

      తొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సత్యముగా సత్యము నిలుచుట'...? 'గత్యంతరము + అసత్యపు' అన్నపుడు యడాగమం రాదు. "గత్యంతర మ్మసత్యపు" అనండి.

      తొలగించండి
    2. సత్యానికి మృత్యువు లేదని నా భావం

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  25. భృత్యుల వేదింపులతో
    నిత్యము పలుబాధలఁ గొని నీల్గుట కంటెన్
    సత్యమది యంత్య దశలో
    మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్

    రిప్లయితొలగించండి
  26. నిత్యము లోకకంటకపు నేర చరిత్రులు దారుణమ్ములౌ
    కృత్యములెన్నియో సలుపు - పృథ్వికి వారల యున్కి భారమౌ -
    సత్యముగాదె వచ్చినను క్ష్మానిలయమ్మునుఁ గావ వారికిన్
    మృత్యువు, మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  27. నిత్యము బాడుగ యింటను
    సత్యము నివసించలేము సత్వరమేను య
    నిత్యులు శాశ్వతు జేరగ
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనరించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కందంలో రెండవ పాదం చివర తప్పక గురువుండాలి. గమనించి సవరించండి.

      తొలగించండి
  28. గత్యంతర కృత కల్మష
    కృత్య వినాశ మొనరించు గీర్వాణుండే
    సత్యము దలంప నచ్చట
    మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్

    [మృత్యువు = యమధర్మరాజు]


    సత్య పథోన్నతస్థిత విషాద విహీన వికుంఠ లోక స
    చ్ఛైత్య సమాశ్రయప్రదము చక్రి నిరంతర దివ్య కామ్య సాం
    గత్య విరాజమాన సుర కాయ నిరీక్షిత ధామ మందగన్
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  29. ముత్యంబున్బలె బ్రతుకుచు
    నిత్యము గొలుచుచు ననంతునిన్ జేరంగా
    నత్యుత్తమ మగును హఠాత్
    మృత్యువు ; మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హఠాత్ + మృత్యువు = హఠాన్మృత్యువు' అవుతుంది.

      తొలగించండి
  30. మృత్యువుదేవతాసమముమృత్యువునిచ్చునుమోక్షమెట్లనన్
    నిత్యముమృత్యుభీతినికనేమముదప్పకదేవతార్చనల్
    ప్రత్యహమున్సదాక్రమముదప్పకజేయుటగారణంబునన్
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్"

    రిప్లయితొలగించండి
  31. సత్యపుమార్గమందునను సాగుచు మానవ జీవితమ్మునన్
    నిత్యము పూజనమ్ములను నిష్ఠగ జేయుచు చక్రపాణికిన్
    భృత్యులనాదరించి కడుఁ బ్రేమముతోచన, ముక్తిచేకొనన్
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాధాకృష్ణారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సత్యమునకు మరణమేది...' అనండి. (సత్యంబుకు.. అనరాదు. 'సత్యంబునకు' అనడం సాధువు).

      తొలగించండి
  33. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    # Me Too

    కృత్యము లెన్నియో సలిపి కీర్తియు విత్తము శుష్మమొప్పుచున్
    నిత్యము కైపులో మునిగి నీతియు భీతియు నొల్లకుండిరే!
    సత్యము! బాలివుడ్డునను చానల చెర్చెడి రావణాసురల్
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్ :)

    రిప్లయితొలగించండి
  34. నిత్యము రాక్షసులంత య
    కృత్యము ల్జేయగ, మరేమి కృప జూపక యా
    కాత్యాయని జంపే, యా
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనరించున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. 'చంపే' అనడం వ్యావహారికం. "కృత్యములన్ జేయకుండ కృప... కాత్యాయని చంపగ నా। మృత్యువు..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు తమరికి... వందనాలు సార్...

      తొలగించండి
  35. నిత్యము సత్యము పలికిన
    సత్యమునకుమరణమేదిచక్కనివసుధన్
    గత్యంతర మ్మసత్యపు
    మృత్యువు మనుజులకుగొప్ప మేలొన‌ రించున్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  36. నిత్యానందపుటాశే
    సత్యంబును వీడి వాడి సహనములేకన్
    పత్యంబందున బ్రతుకక
    మృత్యువుమనుజులకు గొప్పమేలొనగూర్చున్

    రిప్లయితొలగించండి
  37. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    పథ్యము లుండలేను భగవంతుడ ! యిమ్మధుమేహ రోగ సాం

    గత్యము చేత ‌నంగములు నాశ ‌మయెన్ | బ్రతుకంగ నేటికిన్ ?

    మృత్యువుఁ గౌగిలించుటయె మే లగు ! లో బరికించినన్‌‌ భువిన్ ,

    మృత్యువు మాన వాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్ |

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతిదోషం. సవరించండి.

      తొలగించండి
  38. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    మృత్యువు మానవాళికి నమేయ
    హితంబును గూర్చు నొప్పుగన్

    సందర్భము: నిజానికి మానవుని జీవితంలో పుట్టడమే మొట్టమొదటి కష్టం. అంటే యింక కష్టాలే వస్తా యన్న మాట జీవితంలో... చిట్టచివరి కష్టం మృత్యువు. సుఖ మెక్క డున్నది? మన భ్రమ గాని.. అందుకే "లోకం శోక హతం చ సమస్తం" అన్నారు.
    ఇది రూఢిగా మనసులో నాటుకుంటే లోకంలో మరేదీ ఆకర్షించజాలదు. లోక బంధాలు క్రమంగా విడివడిపోతుంటాయి. దివ్యానందానుభవాలు క్రమంగా వరిస్తూ వుంటాయి. ముక్తికోసం చేసే సాధనలో నిశ్చలత్వం చిక్కుతుంది.
    అటువంటి వానికి మాత్రమే కష్టా లన్నీ తొలగిపోయి మృత్యువువల్ల అమేయ హితం గాని శాశ్వత సుఖం గాని కలుగుతాయి. అతనికి జన్మ వుండదు గదా!
    అటువంటి సాధన చేయలేకపోయిన వానికి కూడ మృత్యువువల్ల కష్టా లన్నీ తొలగిపోతాయి. సుఖం కలుగుతుంది. కాని అది శాశ్వతమైనది కాదు. కొద్దిపాటిది మాత్రమే! అతడు మళ్ళీ జన్మ తీసుకోవలసి వుంటుంది కదా!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    సత్యము.. జన్మమే మొదటి
    సంకట మావల సంకటమ్ములే
    మృత్యువు వచ్చుదాక మన
    మీదను గూలును.. చేయగావలెన్
    నిత్యము ముక్తి సాధనను
    నిశ్చల చిత్తముతోడ.. నప్పుడే
    మృత్యువు మానవాళికి న
    మేయ హితంబును గూర్చు నొప్పుగన్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    14.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  39. హత్యల, రేపుల జేసియు
    నత్యుగ్రపు మరణశిక్ష కడలుట కంటెన్
    సత్యాహింసల మెలగ హఠాన్
    మృత్యువు మనుజాళి కెపుడు మేలొనగూర్చున్

    రిప్లయితొలగించండి
  40. హత్యల రేపుల జేసియు
    నత్యుగ్రపు మరణశిక్ష కడలుట కంటెన్
    సత్యమ్మున మెలగ హఠాన్
    మృత్యువు మనుజాళి కెపుడు మేలొనగూర్చున్.
    (revised poem sir! I could not delete the above Pl do it)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవిప్రసాద్ గారికి నమస్సులు!

      "రేపు" అన్న పదం మీరు పద్యంలో వాడినందుకు అభినందనలు. నేను నా ఆటవిడుపు ఉత్పలమాలలో భ గణంగా "రేపెడి" అన్న పదం వ్రాసి భయపడి "చెర్చెడి" అని మార్చితిని. "చెర్చు" పదం నిఘంటువులో ఉన్నది. కానీ రేపు రేపే!

      తొలగించండి
    2. Dear Sastri gi your pogiding is wonderfully inspiring to the literature preminching janams!

      When we enjoy and honour english words mixing in our literature I am afraid whether the British or even our highly educated Indians love and honour the similar reciprocal action!

      Such features may look good for jovial conversations but not in the poetry.

      Let us try to respect our own literature and keep its sanctity to our future generation!

      I sincerely apologize to you if I hurt your feelings.


      తొలగించండి
    3. రవిప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    4. Dear Kameswara Rao garu:

      I too respect your sentiments; and was surely expecting this comment from you. Happy that I provoked you. English didn't ban any new or imported words but absorbed them gladly both in its prose and poetry and still does. Hence it became the universal language. On the other hand, Sanskrit, ancient Greek and Latin are dead (not spoken by any or written by few). A decade ago, "jaiho" entered the Oxford English Dictionary...

      With kind regards....

      తొలగించండి
    5. Oxford English Dictionary:

      "The second edition, comprising 21,728 pages in 20 volumes, was published in 1989."

      https://en.m.wikipedia.org/wiki/Oxford_English_Dictionary

      తొలగించండి
    6. "సీతారామాచార్యులు రచించిన - ''శబ్ద రత్నాకరము'' (33 1/2 వేల పదాలతో) అనే నిఘంటువు వచ్చాయి."

      http://www.telugusahityam.com/2014/04/shabda-ratnakaram.html?ం=౧

      ******************************

      శబ్దరత్నాకరములో 33.5 వేల పదములు ఉన్నవట. Oxford English Dictionary లో పది సంవత్సరాల క్రితం ఒక మిలియను (పది లక్షలు) పదములు ఉన్నవట. millionth word గా "జై హో" పోటీ చేసినది.

      ఉందుకే English ను Universal Language అంటారు కామోసు.

      తొలగించండి

    7. ఏమండోయ్ జీపీయెస్ వారు

      ఆంధ్ర భారతి లో యెన్ని పదాలున్నాయో వారు ఒక‌ కౌంటర్ చూపిస్తే బాగుండు.


      జిలేబి

      తొలగించండి
    8. ఆంధ్ర భారతి సంకలనంలో ఎన్నైనా పదాలు ఉండవచ్చును. కానీ మన కంది సారుకు అత్యంత ప్రియమైనది శబ్దరత్నాకరమే...

      🙏

      తొలగించండి


    9. నీ ఘంటము హృదిపలుకుల
      మోఘోలిని దాటి పలుక మ్రోగింపగ తా
      నా ఘంకళి వలయును ను
      ల్లాఘ నిఘంటువు జిలేబి శ్లాఘ్యము గానన్ :)


      జిలేబి

      తొలగించండి
    10. "'Jai ho', a Hindi exclamation which translates as 'may you be victorious', narrowly missed the million mark and became the 999,999th term to enter
      the language"

      https://www.telegraph.co.uk/news/newstopics/howaboutthat/5495410/Millionth-word-in-the-English-language-Web-2.0.html

      తొలగించండి
  41. నిత్యము వీడకుండగను నీడగ జీవుల వెంబడించునే
    మృత్యువు, మానవాళికినమేయ హితంబును గూర్చు నొప్పుగన్
    సత్యమహింసలన్నవవి శాశ్వత కీర్తి ప్రతిష్ఠలిచ్చుచున్
    మృత్యువు లేనివానిగను మేదిని యందున నిల్పునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  42. సత్యంబిది నే నుడివెద,
    యత్యంత భయానకమగు యగ్నికి బలియై
    గత్యంతరమమర నపుడు
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొన గూర్చున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నుడివెద నత్యంత...మగు నగ్నికి...' అనండి.

      తొలగించండి
  43. సత్యము గాంచుమో నరుడ సాధనఁ జేయుము ముక్తి మార్గమున్
    మృత్యువు నాపలేరు మిడిమేలపు భోగపుటూహ లేలనో
    సత్యము నాకళించి సదృశమ్మగు వర్తనమాచరింప నా
    *"మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారూ!!
      ఇన్నాళ్ళకు సాధించాను. ధన్యవాదములు
      🙏🏻🙏🏻

      తొలగించండి
  44. కం . నిత్యము అరిషడ్వర్గము
    భృత్యుడె యవగన్ మనుజుడె పృథ్వికి బరువై
    సత్యము శ్రీపదమునిలువ
    మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిరాట్ల వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిత్యము + అరి' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. 'అవగన్' అన్న రూపం సాధువు కాదు. "నిత్య మ్మరిషడ్వర్గపు। భృత్యుండై మానవుండు పృథ్వికి..." అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. కం . నిత్యమ్మరిషడ్వర్గపు
      భృత్యుండై మానవుండు పృథ్వికి బరువై
      సత్యము శ్రీపదమునిలువ
      మృత్యువు మనుజులకు గొప్ప మే లొనఁగూర్చున్.

      సరిచేసాను గురువుగారు .

      తొలగించండి
  45. భృత్యుండగుచును భువిలో
    నిత్యము నభిమానము విడి నీచుల చెంతన్
    కృత్యముల నాచరించక
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనగూర్చున్.

    రిప్లయితొలగించండి
  46. మరొక పూరణ

    మృత్యువ దెప్పుడున్ జతకు మేదిని యందున వచ్చుచుండుటన్
    సత్యమిదంచువేదములు చక్కగ దెల్పుచు నుండుగా జనుల్
    సత్యములౌనుడుల్ వినుచు సాయము బాయక చోయుచుండినన్
    మృత్యువు మానవాళికి నమేయ హితంబును గూర్చు నొప్పుగన్.

    రిప్లయితొలగించండి
  47. దేవిక
    --------
    నిత్యమ్మెదురౌ సంకట
    ప్రత్యూహమ్ము లెదిరించి ప్రగతి నలరుటే
    సత్యంబు గాని;యెవ్విధి
    మృత్యువు మనుజులకు గొప్ప మేలొనగూర్చున్ ?

    రిప్లయితొలగించండి