31, అక్టోబర్ 2018, బుధవారం

సమస్య - 2832 (కోడినిఁ బట్టి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్"
(లేదా...)
"కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్"

97 కామెంట్‌లు:

  1. పేడి వెధవా యెవడనెన్

    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్?


    వాడికి పిండము బెట్టా !

    పాడెను కట్టెదము నిపుడె పదిమందెదుటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కట్టెద మిపు డిదె పదుగురి యెదుటన్" అనండి.

      తొలగించండి

  2. జాడించి వారి పిలకలు
    వాడిగ వేదములు జెప్పు వారలు లేరే!
    నేడిక మారెను రోజులు
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్ :)

    రిప్లయితొలగించండి
  3. వేడిగ వండిరి విందున
    బీడున పండిన నుల్లి భేషని పొగడన్
    వాడిగ యల్లము మిర్చీప
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "పండె నదె యుల్లి..." అనండి.

      తొలగించండి
    2. వేడిగ వండిరి విందున
      బీడున పండెనది యుల్లి భేషని పొగడన్
      వాడిగ యల్లము మిర్చిప
      కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    వేడుక వంటవారలిటు పెట్టిరి పేళ్లను కొత్తిమీరకున్
    కో ., డి యనంగ దొండ యని ., కోయుచునుండ , నొకండు పిల్చెనా
    కోడిటు తెండు , వండెదను కూరనటంచన , కోడు భాషలో
    కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోడు భాషతో మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. నాడొక పర్వంబందున
    చేడియ శర్కరనుగాచి చేయ మిఠాయిల్
    కోడల! తెమ్మని యందలి
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్.

    రిప్లయితొలగించండి
  6. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2832
    సమస్య :: కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్.
    *కోడిని ముక్కలుగా కోసి బ్రాహ్మణులు తిన్నారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: పందెములు కాయడంలో నేర్పరియైన ఒక వ్యక్తి “బ్రాహ్మణులు కోడిని కోసికొని తినేటట్లు చేస్తాను” అని క్రొత్తగా ఒక పందెం కాసినాడు. తన పుట్టినరోజు పండుగనాడు కోడి రూపం ఉండేటట్లు ఒక పెద్ద (ఎగ్ లెస్) కేక్ తయారు చేయించాడు. ఇక పందెం గెలవడమే తరువాయి. ఆ వేడుకలో అందఱితో పాటు బ్రాహ్మణులు కూడా ఆ కోడిని ముక్కలుగా కోసి ఇష్టంగా తిన్నారు అని విశదీకరించే సందర్భం.

    కోడిని బ్రాహ్మణోత్తములు కోరి భుజింతురు చూడు డంచు తా
    నాడుచు, కేకు జన్మదిన మందున కుక్కుట రూపమొప్పగా
    వాడుచు, పందెమున్ గెలిచె పద్ధతిగా నొక వాగ్మి ; సత్యమే
    కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (31-10-2018)

    రిప్లయితొలగించండి
  7. తోడుగఁజూచెద రెవరిని?
    పాడెదరెవరన్న!వేద పాఠము లిలలో?
    కాడలు 'మునగ'లు నేమయె?
    కోడిని--శ్రోత్రియులు--కోసి కుడిచిరి ప్రీతిన్.

    రిప్లయితొలగించండి
  8. కోడిని వండి తిందురిలఁ గోసిన ముక్కల నెట్లు తిందురో?

    వేడుక జేయు మాటలివి, వింతగఁ దోచె పలాశికైననున్

    దోడుగ మీరుఁ బాల్గొనిరొ! తోచినదెల్ల సమస్య యౌనొ! యే

    కోడిని బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్?.

    కంజర్ల రామాచార్య.
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      అధిక్షేపాత్మకమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  9. ఏడయ స్వచ్ఛమైన ద్విజుడీ భువినందున వీక్షజేయగన్ ?

    నేడు ధరాసురుండు మరి నీటిన ముంచెను సంప్రదాయముల్ !

    వేడుక జేయనెంచి యొక విప్రుడు కోడిని సంత దెచ్చెనే!

    కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్


    🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీటను ముంచెను' అనండి.

      తొలగించండి
  10. డా.పిట్టా సత్యనారాయణ
    గోడులె మిగిలెను మోడీ!
    ఏడయ యక్రమ కుబేరు డెందుకు పేచీ?!
    కూడిన ద్రవ్యము-"మాయపు
    కోడి"ని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మాయపు కోడితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. కూడి రొకట మామిడిపం
    డోడక తినఁ గోరి, వచ్చె నొకటి యరచి యా
    టాడి విసిగింపఁగఁ దరిమి
    కోడిని, శ్రోత్రియులు కోసి కుడిచిరి ప్రీతిన్.

    రిప్లయితొలగించండి
  12. చూడంగను వారుల్లి ప
    కోడిసైతమ్ము ముట్టుకొనరైరి గదా
    నేడిట్లు వాగె నెవ్వడు
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్

    రిప్లయితొలగించండి
  13. డా. పిట్టా సత్యనారాయణ
    పాడిగ తీర్థయాత్రకని పారులు బారగ దారి నొక్కెడన్
    చేడియ వారలన్ బిలిచి "చేసెద స్నానము సంధ్యవార్చెదన్
    వేడి వకోడిజేతునని వీశెడు పిండిని యుల్లి లేకనే
    "చూడుడ"టంచు జెప్పి కడు చోద్యముగానట నేతి కంచుడున్
    పాడవ బిండి వంటకము;బ్రాహ్మణు లాకలి తోడ ముద్దయౌ
    కోడిని బట్టి ముక్కలుగ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్
    (A wise man is known when he is beaten...ఆకలి రుచి నెరుగదు.)

    రిప్లయితొలగించండి
  14. వాడని ప్రేమతోడ మను
    వాడెడి " కోమల " " డింభశర్మ " యున్
    నేడిదె గుండెలన్ గలిపి
    నిండుగ మెండుగ నిశ్చితార్థమున్
    పోడిమి మీర బంధువుల
    ముందర వేడ్కగ వైటుకేకుతో
    " కో . డి " ని బట్టి ముక్కలుగ
    గోసి ; భుజించిరి గాదె శ్రోత్రియుల్ !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ 'కో.డి' కేకు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. మూడు పనస కాయలు తమ
    వాడను గల తోటలోన వాసిగ గాయన్;
    గూడుచును తఱిమి వేసియు
    కోడిని;శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్"

    రిప్లయితొలగించండి
  16. వేడిమికి తాళలేకన్
    వాడెను మోములు, యలసిరి వారున్ తెలిసెన్
    నేడుయుపాయము యుల్లిప
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మోములు + అలసిరి, నేడు + ఉపాయము + ఉల్లి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "మోములె యలసిరి... నేడు నుపాయ మ్ముల్లి ప।కోడిని..." అనండి.

      తొలగించండి


  17. వేడిగ తినన్ తదితరులు
    కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్
    పోడిమిగల మాకందము
    బాడబులమ్మాయి, రెడ్డి, పరిణయమాడన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. మాడుగుల యగ్రహారపు
    వాడను తమ పెఱటిలోన వాసిగ బెరుగన్
    వాడక మునుపే *కూరా
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్.
    ***)()(***
    *కూరాకు + ఓడి
    ఓడి = విత్తకనే పండే దూసరి వంటి ఒక ధాన్య విశేషము.

    రిప్లయితొలగించండి
  19. వేడుచు నిరతము దేవుని
    వీ డరు సజ్జనుల గోష్ఠి విష్ణు పదం బుల్
    వాడరు మాంసము నెప్పుడు
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచి రి ప్రీతిన్?

    రిప్లయితొలగించండి
  20. కేడీలెవరినిబట్టిరి?
    తోడుందురెవరుబుధులకు?దొరకవవేవీ
    కోడల చూతఫలంబులు?
    కోడిని'శ్రోత్రియులు'కోసి కుడిచిరి ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర్జీ గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      'కేడీలు దేని బట్టిరి?' అనండి.

      తొలగించండి


  21. వేడిరి వేంకటేశ్వరుని వేదిక నెక్కిరి, పెండ్లియాడగన్
    బాడబ లేమ, రెడ్డిని, వివాహము గాంచిరి!కొందరచ్చటన్
    కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె, శ్రోత్రియుల్,
    పోడిమి గాంచు మామిడిని ప్రోక్షణమున్ గొని నారగింపగా!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  22. పోడిమిగల కామాంగము
    తేడిరిలెడు మామిడి గద! తెంపరి గానన్,
    దాడీ చేయగ నాపుచు
    కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  23. వాడిగనిటులుగబల్కుట
    కోడినిశ్రోత్రియులుగోసికుడిచిరిప్రీతిన్
    బాడిగనేదోచెయదియ
    కోడియునొకజీవికాదె?కువలయమందున్

    రిప్లయితొలగించండి

  24. ప్రేమతో గ్రామస్థు లివ్వగ


    బాడబులమ్ము వలదనగ
    తోడుగ వినతులను జేర్చి దోసిలి గానన్
    వేడిగ తెచ్చిన ప్లేటు ప
    కోడిని, శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    '...గూడిరి యొకచోట...' అనండి.

    రిప్లయితొలగించండి
  26. కోడిని బట్టిముక్కలుగ గోసిభుజించిరిగాదెశ్రోత్రియుల్
    వాడిగనట్టులన్బలుకపాపము,కోడియుజీవియేగదా
    కోడినిడకుండగనుగోసినముక్కలుదిందురేభువిన్
    బాడిగదోచెనేయదియపాపవినాశన,రాజశేఖరా!

    రిప్లయితొలగించండి
  27. 3వపాదము మొదటన
    వండకుండగను
    అని చదువ ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  28. వాడకు చెడుమాట లెపుడు
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్?
    పోడిగ శాకముల సదా
    వాడుదురు, కనుగొని నిజము పలుకుమనువుగా

    రిప్లయితొలగించండి
  29. సమస్య :-
    "కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్"

    *కందం**

    వేడుక జరుగెడు చోటను
    కూడు తిన సమయము లేక కొద్ది తరుణమున్
    వేడిమిగా నున్నట్టి ప/చె
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్
    .......................✍చక్రి

    రిప్లయితొలగించండి
  30. పాడిగ సంకీర్తనములు
    పాడిరి సద్భక్తి మీఱ వార్చిరి సంధ్యన్
    వేడి శివుని వని క్షుత్తన
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్

    [క్షుత్తునకు + ఓడి = క్షుత్తున కోడి; ఓడి = నీవార ధాన్యము]


    గూడెము నందు వింతలను గోరి లిఖింపఁగ నెంచి లేఖకుల్
    పాడుచు నేఁగి వేగముగఁ బల్లెకుఁ గాంచఁగ గ్రామవాసులం
    బాడిగ వాఁడి వార్తలను వా రిడఁ గైకొని, వండి యీయ నా
    కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి, భుజించిరి గాదె శ్రోత్రియుల్

    [శ్రోత్రియుడు = వార్తలు సేకరించు వారు; శ్రుతి = సుద్ది]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      సమస్యాపూరణలో వైవిధ్యంగా ఆలోచించడం మీ ప్రత్యేకత. పదాల విరుపు విలక్షణంగా, నిరుపమానంగా ఉంటుంది.
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  31. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    కాళీ ఘాట్, కలకత్తా (1900):

    వాడిగ మంత్రముల్ నుడివి పాడుచు పాటలు కాళిమాతకై
    వేడుక మీరగా బలిని వేయుచు మేకల నమ్మకోసమై
    వాడుక వీడకే మురిసి వండుచు ప్రీతిని మీనరాజముల్
    కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. https://timesofindia.indiatimes.com/city/kolkata/Nepal-King-to-offer-sacrifice-at-Kalighat/articleshow/14289692.cms

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
      మీనరాజములు సరే... మరి కోడికి అన్వయం?

      తొలగించండి
    3. సార్!

      వంగ భూమిలో శ్రోత్రియులకెట్టి అభ్యంతరము లేదు...మేకలు, మీనరాజములు, కోళ్ళు, పీతలు, వగైరా వగైరా...

      తొలగించండి
  32. దాడులు చేయ వద్దు కడు దర్పముతోడుత క్రింది వాక్కులన్
    “కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్”
    వాడి శరమ్ములై తగులు వారల శాపము లన్ని చెచ్చెరన్
    మాడెద వీవు భూమిపయి మ్రాన్పడ నీదుకుటుంబ మంతయున్

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    *"కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్"*

    సందర్భము: మాన్యశ్రీ కంది శంకరయ్య గారూ! కోడి నిజమయిందా! బొమ్మదా! చెప్పనే లేదు. ఏ కోడిని కోసి తిన్నారో ముందు చెప్పండి.
    కోడి నిజమయిందని కొందరు బొమ్మ కోడి యని కొందరు రెండు వర్గాలైపోయారు (మీవల్ల). ఏ కోడిని కోసి తిన్నారో శ్రోత్రియులు! మీరే చెప్పాలి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    కోడి యనగ నిజమైనదొ!..
    వేడుకగా బొమ్మదొ! మరి
    వేడెద తెలుపన్
    నేడే.. కందివరా! ఏ
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్? 1

    కోడి నిజమైన దంచును
    కోడియె బొమ్మది యటంచు
    గురు శంకరయా!
    నే డిరు వర్గములై... రే
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్? 2

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    31.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      నేనేతై శ్రోత్రియుల చేత కోడిని తరుమజేసి మామిడిపండు తినిపించాను.

      తొలగించండి
  34. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    "కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి
    గాదె శ్రోత్రియుల్"

    సందర్భము: మాంసాహారులు శాకా హారులు ఇరుగు పొరుగు వారు. ఒకనాడు వేడుకగా పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ వుండగానే అనుకోకుండా మాటా మాటా ముదిరిపోయింది. అప్పటినుంచి ఎడమొగం.. పెడమొగం.
    ఇలా వుండగా మాంసాహారుల కోడి ఒకనాడు ఉన్నట్టుండి మాయమయింది. శాకాహారులమీద నింద మోపారు.. ఇలా..
    " వీళ్ళ పనే అయ్యుంటుంది. కోడిని బట్టి ముక్కలు చేసి వీళ్ళే తిన్నారు."
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వేడుక మాటలే ముదిరి
    వేడిగ మారె పరిస్థితుల్.. సదా
    కూడి వసింతు రొక్క యెడఁ
    గోళ్ల భుజించెడి వారు, శ్రోత్రియుల్..
    కోడియె మాయ మాయె.. నెట
    కో చనె.. వా రిటు నింద మోపిరే!
    "కోడినిఁ బట్టి ముక్కలుగఁ
    గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్!"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    31.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      ప్రసిద్ధమైన సామెతను ఆధారం చేసికొని చేసిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  35. క్రీడికి నాడు జన్మదినము కేకును దెచ్చిరి కోయబోవగా
    మేడను కోడి కేకుఁగని మీదకు జేరెడు వేళ గాంచుచున్
    వాడపు డాగ్రహించుచు చివాలున దూకుచు వెళ్ళగొట్టెనా
    కోడినిఁ పట్టి, ముక్కలుగఁ గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్

    రిప్లయితొలగించండి
  36. లీడరు పిల్చి యిచ్చెనట లిక్కరు పార్టిని పార్టివారికిన్
    కోడిపులావుఁ గోరిరని కోర్కెను తీర్చగ నెంచి తెచ్చనే
    కోడినిఁ, బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరిగాదె, శ్రోత్రియుల్
    నాడట లేరటంటచటి నాయకు లెల్లరు మోదమందుచున్

    రిప్లయితొలగించండి


  37. బోడులయిన తలలున్ భళి
    బోడులగున తలపులున్? సబూతిదియె సుమా
    వేడుకగా గుమిగూడుచు
    కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సబూత్' అన్యదేశ్యం... అయినా జిలేబీ గారికి అడ్డెక్కడిది?

      తొలగించండి
  38. దేవిక
    ------

    కోడెల కొమ్ములన్నడచి కూతను బెట్టుచు కోడి రాముడే
    వాడిమి జూపగాను కని; వావిరి మోదము నొంది మిత్రులే
    కోడిని బట్టి ముక్కలుగ గోసి భుజించిరి గాదె; శ్రోత్రియు
    వేడుక నొందె మాంసమును వీడితి నంచు దెలుంప నాతడే!

    (ప్రఖ్యాత మల్ల యోధుడు శ్రీ కోడి రామమూర్తి గారు శాకాహారి.)

    వేడుక మీరగ బొగడుచు
    కోడిని; శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిన్
    దాడిమ ఫలంబులనపుడు
    నాడెపు కోడి గెలుపొంద నల పందెమునన్ !

    (నాడెపు=మేలైన)

    రిప్లయితొలగించండి
  39. దేవిక
    -----
    మొదటి పద్యం మూడవ పాదం చివర శ్రోత్రియుల్ అని చదువ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  40. చూడగ నిలచిన చక్కర
    బాడీయేగలిగియున్న పలువిధ బొమ్మల్
    ఆడుచు పిల్లలువాటిని
    కోడిని శ్రోతియలుగోసి కుడిచిరి ప్రీతిన్
    (కోడిని ఆడుచుపిల్లలుకోసొ నీటినగలిపిత్రాగిరి)

    రిప్లయితొలగించండి
  41. వేడుకతోడ తెచ్చుకుని పెద్దదియౌనొక పుచ్చకాయనున్
    కోడినిఁబోలునట్టులుగ కొంచెముకొంచెము చెక్కి సొంపుగా
    నాడుచుపాడుచున్ కుడిచియందరు భోజనమంతమందునా
    *"కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసిa భుజించిరి గాదె శ్రోత్రియుల్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. బాడుగకు తెచ్చిన జనన
      వేడుక, దీపికల నార్పివేసి నడుమనన్
      పోడిమియగు భక్ష్యపతిమ
      కోడిని శ్రోత్రియులు గోసి కుడిచిరి ప్రీతిని

      తొలగించండి
    3. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ప్రతిమ' టైపాటనుకుంటాను.

      తొలగించండి
  42. దేవిక
    -------

    వేడుక జేయగాను పొరుగింటను కూరిమి తోడ బంధువుల్
    కోడిని బట్టి ముక్కలుగ గోసి భుజించిరి గాదె; శ్రోత్రియుల్
    పీడ యిదేల మాకనుచు పెంపగు వాసన నేవగించుచున్;
    వాడిగ మాటలాడ గొడవౌనని పల్కక మిన్నకుండెనే!

    రిప్లయితొలగించండి
  43. వేడిన నైన దిననుగా! ;
    బూడిద గుమ్మడి యనంగ బలకింతురుగా! ;
    మేడి ఫలములను బాలురు ;
    కోడిని ; శ్రోత్రియులు ; గోసి కుడిచిరి ప్రీతిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది అభినందనలు

      తొలగించండి
  44. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    "కోడినిఁ బట్టి ముక్కలుగఁ గోసి భుజించిరి
    గాదె శ్రోత్రియుల్"

    సందర్భము: ఈ రో జంతా మన వాళ్ళు కోళ్లు కోసుకొని తింటూనే వున్నారు. ఐతే అవి రెండు రకాల కోళ్లు.. (పెద్ద పరమార్థ మంటూ యేమీ లేదు సుమండీ!..)
    "అదేం కోడి?" "ఇదేం కోడి" అని ఒక అబ్బాయి అడుగుతూ వుంటే ఒక పెద్ద మనిషి ఇలా చెబుతూ వున్నాడు.. చూడండి.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "కోడి య దేమి?" "కొక్కొరొకొ
    కో యను పాప.. మ దొక్క ప్రాణియౌ..
    కోడినిఁ బట్టి ముక్కలుగఁ
    గోసి భుజించిరి యామిష ప్రియుల్..."
    "కోడి యి దేమి?" "జాతరను
    కొన్నది.. చక్కెర.. దెంత తీపియో!..
    కోడినిఁ బట్టి ముక్కలుగఁ
    గోసి భుజించిరి గాదె శ్రోత్రియుల్!.."

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    31.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి