5, అక్టోబర్ 2018, శుక్రవారం

సమస్య - 2808 (శంకరుఁ డెత్తె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ"
(లేదా...)
"శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

48 కామెంట్‌లు:

  1. సంకట దైత్యులన్ దునుమ చయ్యన శూలము నేమిఁజేసెనో?
    వంకలు లేని యోగిజన వంద్యులు,తాపసు లెందునుందురో?
    శంకలు వీడి దైత్య గణసంఘము పోరుకు రాగ నేమయెన్?
    శంకరుడెత్తె--మంచు మల--శైలజ భీతిలి కంపమొందగన్.

    క్రమాలంకారంలో పూరణం

    రిప్లయితొలగించండి
  2. కంకటి కోరురా వణుడు కైపున కొండను నూయలూ పగా
    పొంకము మీరుచున్ మిగుల పూనక మొందిన రాక్షసా ధమున్
    కొంకుప డంగనా తనికి కోరిన రీతిగ నేలతాలుపున్
    శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొం దఁగన్

    రిప్లయితొలగించండి

  3. పాముల పట్నం వారు హోసూరుకు వెళితే :)


    వెడలె హోసూరున కరరె వేడి తగ్గి
    చివ్వున చలిగాలియు తాక శిరము పైన
    శంకరుం డెత్తెఁ జలి; మల! సతి! బెదరఁగ,
    వెడలె నాసుపత్రి కి సుమా వేగముగను !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    (శివనింద వినిన పాపమని భీతి గొనినది.. వెంటనే అతనిని పంపించుమని చెలికత్తెకు చెప్పింది.. అనే భావంతో...)


    జంకది యేల బాల ?! మనసా హరునెంచుట యుక్తమౌనె , నీ...
    శంకరుడేలు ప్రాంతము శ్మశానము , పాములు భూషలౌను ! న...
    న్నింక వరింపుమంచు శివనిందను జేయగ , సాధురూపమున్
    శంకరుఁ డెత్తె మంచుమల., శైలజ భీతిలి కంపమొందఁగన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. శివుని దర్శించ కైలాస శిఖరము చని
    యచట నందీశ్వరుడు తన నడ్డగించ,
    రావణాబ్రహ్మ, కనుచుండ లయకరుడగు
    శంకరుం, డెత్తెఁ జలిమల సతి బెదరఁగ

    రిప్లయితొలగించండి
  6. పంకజనాభనిత్యపరిపాలితశక్రధనుంజయాది శౌ

    ర్యాంకితసత్త్వదీపితవిశాలయశోవిభవాత్తదేవతా

    సంకటకారి రావణనిశాచరు డాయెడ దేవభాగ్యలే

    శంకరు డెత్తె మంచుమల శైలజ భీతిలి కంప మొందగన్.

    రిప్లయితొలగించండి
  7. వికృతవేషాన తనలీల విస్తృతముగ
    విశద మొనరించ నేతెంచి విశ్వవిభుడు
    వెరపు గూర్చుచు నచ్చోట కరము లపుడు
    శంకరుం డెత్తెఁ జలిమలసతి బెదరఁగ.

    రిప్లయితొలగించండి
  8. ఈ సమస్యను రేపటికి షెడ్యూల్ చేయబోయి పొరపాటున ఈరోజు పోస్ట్ చేసాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి


  9. వంకలు వాగు లన్నియును స్వామి!యహర్పతి చూచినాను నీ
    వింకను వ్యోమ మార్గమున వింతల చూపగ బిల్వ లేదనన్,
    డొంకెన నొత్తి పట్టి భళి డోమిణి వాడివలెన్ సెబాసు మా
    శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. నాకు తెలిసిన శివ పురాణము ఇదియొకటే 🙏

    పద్య పోషణ జేయుచు పగలు రేయి
    శంకరాభరణమ్మున శాస్త్ర విధిని
    మురిసి కాకుల, పికముల, మోసి...కంది
    శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ

    రిప్లయితొలగించండి
  11. కింకరుడయ్యు కోపమునఁ గీడ్పడు నంచు నెఱింగి మత్తుడై
    శంకరశక్తియుక్తులును, శౌర్యము లెంచక దుష్టచిత్తుడై
    రంకెలు వేయుచున్ నిలిచి రావణదైత్యుడు దివ్యధర్మనా
    శంకరు డెత్తె మంచుమల శైలజ భీతిలి కంప మొందగన్.

    రిప్లయితొలగించండి
  12. పొంకపు రావణాసురుడు భోరున జేరి యు శైవ ధామమున్
    శంకరు వేయి భంగు లను సంస్త వ మున్నొ న రించి వేడగన్
    శంకరు గానకన్ గనలి శక్తి యుతు oడగు దైత్యుడైన ని
    శ్శ్ణoకరు డెత్తే మంచు మల శైలజ భీతిలి కంప మొందగన్

    రిప్లయితొలగించండి
  13. సమస్య :
    శంకరుడెత్తె మంచుమల
    శైలజ భీతిలి కంపమొందగన్

    వంకలు లేని బ్రహ్మకుల
    వజ్రము ; రావణనామధేయుడున్ ;
    శంకరపాదసేవన వ
    శంవద మానసపంకజాతుడున్ ;
    బంకజనేత్రయౌ మయుని
    పట్టికి నాథుడు ; సర్వలోక నా
    శంకరుడెత్తె మంచుమల
    శైలజ భీతిలి కంపమొందగన్ .
    (మయుని పట్టి -మండోదరి )

    రిప్లయితొలగించండి
  14. వంక రబుద్ధి గలరా వణుడు రోషము
    చెంది నుగ్రతన్ శైలము చెంగ లించ
    నుగ్రత నొందిన యీశుడు నోప లేక
    శంకరుం డెత్తి జలిమల సతిబె దరఁగ

    రిప్లయితొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2808
    సమస్య :: శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంప మొందఁగన్.
    *శంకరుడు మంచు కొండను ఎత్తినాడు పార్వతీదేవి భయపడేటట్లుగా* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఏ పని చేయడానికైనా వెనుకాడని వాడు, జంకు గొంకు లేకుండా ప్రవర్తించే వాడు, ఎక్కడైనా సరే నాకు అడ్డమే లేదు, నాకు అపజయమే లేదు అని అనుకొనేవాడు ఐన దశకంఠుడు పూలబాణాలు గల మన్మథుని చేతిలో నిత్యం అపజయం పాలయ్యే వాడు. విశ్వవో బ్రహ్మకు కైకసికి పుత్రుడైన ఆ సాధునాశంకరుడు (రావణుడు)ఒకనాడు తనకు ఇరవై చేతులున్నాయన్న గర్వంతో పార్వతీపరమేశ్వరులున్న మంచుకొండను పెకలించి పైకెత్తే ప్రయత్నం చేశాడు. తాను ఉన్న కొండ కదులుతూ ఉండగా పార్వతి భయంతో కంపించింది అని విశదీకరించే సందర్భం.

    జంకును గొంకు లేక యనిశమ్ము జరించెడి రావణుండు, నా
    కంకిలి లేదు నా కపజయమ్మును లేదని యెంచు వాడు, మీ
    నాంకుని చేతిలో నపజయమ్మును పొందెడి వాడు, సాధు నా
    శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంప మొందఁగన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (5-10-2018)

    రిప్లయితొలగించండి
  16. సరదాగా...

    శంకరరావు గారికట శైలజ భార్యట, మంచి జంట, యే
    వంకలుఁ బెట్టలేని పరివారము మెచ్చెడి కాపురంబు, గో
    రింకకు బుద్ధిపుట్టె నొక రేయిని త్రాగెద నంచు నింక నా
    *"శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్"*

    గమనిక: నేను సూక్ష్మ రూపమున నుంటూ గమనిస్తున్నందువలన మంచుముక్క కూడా పర్వతము వలె గోచరించినది

    రిప్లయితొలగించండి
  17. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    శంకరుడెత్తె మంచుమల
    శైలజ భీతిలి కంపమొందగన్
    ======================
    మంచుమల లేదా కైలాసమును
    రావణుడు ఎత్తడానికి ప్రయత్నించుట
    విన్నాము కాని శంకరుడె ఎత్తినాడు అది
    చూసి పార్వతి భయంతో వణికినదని
    చెప్పటంలో అసంబద్దతె సమస్య
    ==========================
    సమస్యా పూరణం- 274
    ==================

    భోళా శంకరుడనెను ఒకడు -
    తిక్క శంకరుడనె నింకొకడు
    ఆశుతోషుడన్నాడు వాడు -
    అమాయకుడని నవ్వెనుగ వీడు
    ఉగ్రుడై తాండవమాడ -
    చేకొని డమరుకము శంకరుడెత్తె
    మంచుమల శైలజ భీతిలి -
    కంపమొందగన్ చెక్కిలి నొత్తె

    ( ఆశుతోషుడు = అల్ప సంతోషుడు )
    ( మంచు మల = హిమాలయమ/కైలాసము)
    ( శైలజ=పార్వతి) ( భీతిలి = భయపడి)
    ( కంపమొందగన్ = వణికిపోతు)

    ====##$##====

    ఉన్నది ఒకటే రెండవది లేదనుచు అద్వైత
    గళమెత్తిన జగద్గురు శంకరుల వారు త్రిదేవుల
    లో త్రిమూర్తులలో ఒకరైన,ఆదిమధ్యాంత రహి
    డైన,లయకారుడైన,మంగళ కారుడైన శివుడిని
    తనతో ఎలా అన్వయింప చేసుకున్నాడో కదా

    "మనసు బుద్ది అహంకారము-
    చిత్తము నేను కాను
    స్వరములు రుచులు వాసనలు-
    చూపులు నావి కావు
    అంతరిక్షము భూమి అగ్ని-
    వాయువున మరి లేను
    చిదానంద రూపుడను - నేనేగా శివుడను"

    ( నిర్వాణ షట్కము 1 / 6 )

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస)
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం)

    రిప్లయితొలగించండి
  18. మంకుతనమ్మునం దనదు మాటయె నెగ్గు నటంచుఁ గ్రీడి, నీ

    వింక తొలంగుమంచు నల నీశుడు, నిర్వురు పందికోసమై

    బింకముతో శరమ్ములను విల్లుల నెక్కిడ, భీకరాస్త్రమున్

    శంకరుడెత్తె ; మంచుమల, శైలజ భీతిలి కంపమొందగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి

  19. ఎవరు చూసొచ్చేరు రాసుకుంటూ పోవడమే :)


    ఇంకను నింక పైకనుచు నింతియె కోరన మోదమొందుచున్,
    శంకరుఁ డెత్తె మంచుమల, శైలజ భీతిలి కంపమొందఁగన్,
    బింకము వీడి కౌగిలిని పింగళుడాతడి సైకొనంగ నా
    వంకన ముద్దులీను తన భార్యకు తోడుగ నాట్యమాడెగా


    జిలేబి

    రిప్లయితొలగించండి
  20. శంకరుడెత్తెమంచుమలశైలజభీతిలికంపమొందగన్
    శంకరువాసమేయదిగశంకరుకొండనునెత్తుటెట్లగున్
    బొంకములేనిమాటలనుబూరగవీలగునేదయాకరా!
    శంకరుడెత్తగాగిరినిశైలజభీతిలికంపమొందునే!

    రిప్లయితొలగించండి
  21. యఙ్ఞ భూమిక సాక్క్షిగ యగుడు పడుచు
    అగ్నిగుండమున సతియె యాహుతవగ
    పట్టరానట్టి కినుకను పార్వతి మెయి
    శంకరు డెత్తె జలిమల సతి బెదరగ

    చలిమల సతి = దక్క్షుని భార్య

    రిప్లయితొలగించండి
  22. భక్తజనములకెప్పుడభయమిచ్చు
    శంకరుండెత్తెజలిమలసతిబెదరగ
    రాక్షసాధిపుడగునట్టిరావణుండు
    బాహుగర్వముతోడనబలముజూపి

    రిప్లయితొలగించండి


  23. కింకరుడన్ శివా యనుచు కేలును జోడ్చుచు రావణుండటన్
    శంకయు లేక పేగులను సక్రమ రీతిని తీసి కొల్వగా
    సంకట మేమియున్ పడగ చక్కగ మెచ్చుచు తాను హస్తమున్
    శంకరుఁ డెత్తె ,మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్.

    రిప్లయితొలగించండి
  24. తేటగీతి
    ఆత్మలింగము లంకేశుడందగోరి
    ఘోర తపముజేసిన జాలిఁ గూడడనుచుఁ
    బ్రేవు వీణగ మ్రోగించి వినుచు దిగగ
    శంకరుండె, త్తెఁ జలిమల సతి బెదరఁగ

    ఉత్పలమాల

    లంకకు రాజుగా నిలచి రావణుడందఁగ నాత్మలింగమున్
    వంకలు లేని భీషణ తపంబును జేసిన రాడటంచుఁ దా
    జంకక ప్రేవు వీణయనఁ జక్కఁగ మీటి వరంబునీయఁగా
    శంకరుఁడె, త్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్

    రిప్లయితొలగించండి
  25. పరమ భక్తుండు లంకాధి పతియె తాను
    పిలువ నేమి తనదు మొర వినడు గాదె
    శంకరుం, డెత్తె జలిమల , సతిబెదరగ
    కదలి వచ్చె నా రావణుఁ గడకు తుదకు.

    రిప్లయితొలగించండి
  26. జంకకనింతయైననది శంభునివాసమటంచెరింగియున్
    పెంకితనమ్ముతోడ తన పెక్కు కరమ్ములతో మదమ్మునా
    లంకకు రాజు పెట్టుచును రంకెలు, కోపముఁ జెందునట్లునా
    *"శంకరుఁ ,డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్"*

    రిప్లయితొలగించండి
  27. పుష్పకమున చరించుచు ముదముతోడ
    యడ్డు తగలగ రజితాద్రి ,యాగ్రహమున
    దీవిరాయుడు కుపితుడై, దిక్పతుల వ
    శంకరుం డెత్తె జలిమల సతి బెదరఁగ!!!


    శంకర నామధేయమును చక్కగ గల్గిన నండుడొక్కడున్
    బింకముతోడనాటకము బ్రీతిగ నాడుచు బెద్ద డొల్లయౌ
    పొంకపు శైలరాజమును పూనికతోతన చేత బట్టుచున్
    శంకరు డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్!!!

    నండుడు =నటుడు

    రిప్లయితొలగించండి
  28. రావణుం డన నామ మరయఁగ నోపఁ
    బుష్ప కావరోధన రోష పూరిత హృది
    భర్గ భక్తుఁడు దానవ వంశ నిత్య
    శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ

    [శంకరుఁడు = సుఖమును గలుగఁ జేయు వాఁడు.]


    శంక యొకింత లేక నిజ సత్త్వ మదాన్విత ఘోర చిత్తుఁడై
    శంకర కింకరుండు విధి సత్కుల జాతుఁడు రావణుండు లం
    కాంకిత దానవవ్రజ వరాధిప దైత్యుఁడు సేవ్య హృల్లస
    చ్ఛంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్

    రిప్లయితొలగించండి
  29. ఆత్మ లింగ ము కొఱకు తా నాశ తోడ
    చేరె కైలాస మును దైత్య శేఖరుండు
    రావణుడు శంభు గానక రౌద్రుడ పర
    శంక రు డెత్త్తె చలి మల సతి బెదర గ

    రిప్లయితొలగించండి


  30. రమేశా వారి భావమునకు చిరు ప్రయత్నం


    శంకరుడాశుతోషుడట!చండుడు చంద్రకళాధరుండటన్
    డొంకెన చేత బట్టి చను డొంకల వాగుల తిక్క వాడటన్
    నింకయు చెప్ప గాను విని నివ్వెర బోవ జనుల్ త్రిశూలమున్
    శంకరుడెత్తె, మంచుమల, శైలజ భీతిలి కంపమొందగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  31. అంకిలిఁ జేయ లోకముల నాత్రిపురాసురనాస్తికాధముల్,

    బింకము తోడ వారి నట వే దెగటార్చ, సురల్ నుతించ, ని

    శ్శంకితవిష్ణుదేహకృతచాపధరోగ్రభయంకరాకృతిన్,

    శంకరుడెత్తె; మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్.
    కంజర్ల రామాచార్య.



    రిప్లయితొలగించండి
  32. రక్షకుండైన శివునికిరక్షయైన
    గిరిని కైలాస వాసులౌ గౌరి,గంగ
    బసవ,శివగణములు పరవశమునందు
    రావణుండూప గిరిని పరాకునున్న
    శంకరుండెత్తె "జలమలసతిబెదరగ!"

    రిప్లయితొలగించండి
  33. లంకవిభుండు దానవుడు రావణుడే తపమాచరింపగన్
    జింకలతాల్పు శోభితుడు చేరడు తాఁ గరుణింపడయ్యె నా
    శంకరు, డెత్తె మంచు మల శైలజ భీతిలి కంపమందగన్
    సంకటహారియీశ్వరుడు చయ్యన వచ్చెను వాని ముందుకున్

    రిప్లయితొలగించండి

  34. శంకరి సంగడమ్మునను చక్కగ నాట్యము చేయు చుండగా
    జంకునెరుంగనట్టి మను జాశనుడీశ్వరు దర్శనార్థమై
    బింకముతోడఁ దాల్చికడు భీకర రూపము, కాంచ కిన్కతో
    శంకరు, డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందగన్

    రిప్లయితొలగించండి
  35. రేపు ప్రసారం కానున్న ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం వారి *సమస్యా పూరణ* కార్యక్రమాన్ని రికార్డు చేయడానికి ఉదయం వెళ్లి ఇప్పుడే నెలవు చేరుకున్నాను. ప్రయాణం వల్ల అలసిపోయాను. విశ్రాంతి తీసుకొని వీలైతే రాత్రికి మీ పూరణలపై స్పందిస్తాను. ఆలస్యానికి మన్నించండి.

    రిప్లయితొలగించండి
  36. బింకము లేకపోయె తన విన్నపమౌ మొరలాలకింపడా
    వంక హిమాద్రి జాతఁగొని పాటవమొప్పగఁ నాట్యకేళిలో
    నింకిన శంకరున్ గనుటె నీప్సితమంచు మునీంద్ర లోక నా
    శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్

    రిప్లయితొలగించండి
  37. అద్రి కన్యను చేకొన్న యభవుడేగ !
    రావణుండేమి జేసెను లాఘవముగ ?
    తప్పు బట్టగ రాదుగా తఱచు భువిని!
    శంకరుం ; డెత్తెఁ జలిమల ; సతి బెదరఁగ !

    రిప్లయితొలగించండి
  38. రంకెల వేయుచున్ చెలఁగు రావణు చేతుల నొత్తి వేయగా
    సంకట పడ్డ రక్కసుడు శైలము నిల్పగ లేక నేడ్వ నా
    వంకర బుద్ధి వానికిల భంగము గూర్చిన కాలి వ్రేలినిన్
    శంకరు డెత్తె, మంచుమల శైలజ భీతిలి కంప మొందగన్!

    రిప్లయితొలగించండి
  39. డాపిట్టాసత్యనాయణ
    వంకలన్ జటాజాటపు వాసి గాంచి
    శంకలుదయింప బోరుకై సాగు గిరిజ
    మంకుతనమును మాన్పగ మహిమ జూప
    శంకరుండెత్తె జలిమల సతి బెదరగ

    రిప్లయితొలగించండి
  40. డా…పిట్టాసత్యనారాయణ
    శంకర!చంద్ర శేఖరుని సైపగజాలని వర్గకూటముల్
    వంకలబెట్టుచుండ తన వాసిని బూన్చగ జెప్పె నిట్టులన్
    "లెంకలు బెట్టుకోరె సరి లేదిక మార్గము యెన్నికాళియే"
    శంకరుడెత్తె మంచుమల శైలజ (తెలంగాణ)భీతిలి కంపమొందగన్

    రిప్లయితొలగించండి
  41. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    "శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ"

    సందర్భము: ఈ క్రమాలంకార పద్యంలో రెండు సన్నివేశాలు పొదుగబడినవి.
    1. పార్వతిని పొంద గోరి...
    2. మృకండు మహర్షి కొడుకు ప్రాణాలు తీసుకుని పోవా లనుకున్న యమ ధర్మరాజును పారద్రోలడానికి...
    1. తపసి రూపమును...
    2. త్రిశూలమును...
    శంకరుడు ఎత్తినాడు.
    1 వ దానికి 1వ దానిని
    2 వ దానికి 2 వ దానిని
    అన్వయించుకోవలె క్రమంగా..
    మొత్తంమీద ఆ సన్నివేశాలు కింది విధంగా వున్నాయి..
    తపస్సు చేస్తున్న పార్వతిని పొంద గోరి పరమేశ్వరుడు తపసి రూపమెత్తినాడు.
    మృకండు మహర్షి కుమారుని ప్రాణాలు కొని పోవాలని సూర్య సుతుడైన యముడు రాగా అతణ్ణి పారద్రోలి తన భక్తుడైన మృకండు మహర్షి కుమారుని రక్షించుకోవడానికి శంకరుడు త్రిశూల మెత్తినాడు.
    ఆ సందర్భంలో చలమల సతి బెదరి పోయినారు.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పార్వతిని పొందగా గోరి... వర మృకండు
    సూను ప్రాణాలు గొంపోవు సూర్య సుతుని
    ద్రోలగఁ... దపసి రూపు...
    త్రిశూల మపుడు..
    శంకరుం డెత్తెఁ జలిమల సతి బెదరఁగ..

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    5.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  42. ఉ . ఇంకువ పోడగొట్టుకొనయింకికలేదుగదారిమాకుమా
    వంకకుయేరుజూచెదరుపార్వతివల్లభపాహిపాహిమే
    మింకనుతాళలేమనగఎల్లరగాచుమహానువేలుపై
    శంకరు, డెత్తె మంచు మల శైలజ భీతిలి కంపమందగన్ .

    రిప్లయితొలగించండి
  43. వంకరరీతి దైత్యునకు భస్మము జేయు వరమ్మునీయగా
    పొంకము మీర రాక్షసుడు పోరి పరీక్షను జేయబూనగా
    జంకుచు పారగా నగెడు జాయను జూచుచు క్రోధనమ్మునన్
    శంకరుఁ డెత్తె మంచుమల శైలజ భీతిలి కంపమొందఁగన్...

    రిప్లయితొలగించండి