28, అక్టోబర్ 2018, ఆదివారం

సమస్య - 2829 (అంద ఱొకనిలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్ "
(లేదా...)
"అందఱిలోన నొక్కఁ డగు నందఱు నొక్కనిలో వసింతురే"

61 కామెంట్‌లు:

  1. డా.పిట్టా సత్యనారాయణ
    సత్యము "శంకరపూరణ"
    భత్యమునై మధుర మదిర భాతిని జెలగన్
    అత్యనురక్తిని కవులకు
    నిత్యము గావలె సమస్య నెమ్మది కలుగన్

    రిప్లయితొలగించండి
  2. నిత్యము సాధించుటకై
    ముత్యములగు కైపదముల ముచ్చట మీరన్
    సత్యమ్మీ మాటనరయ:
    "నిత్యముఁ గావలె సమస్య నెమ్మది కలుగన్"

    రిప్లయితొలగించండి
  3. సత్యము పలికిరి భేషో
    నిత్యముఁ గావలె సమస్య నెమ్మది కలుగన్
    ప్రత్యయము పెరుగు చుండును
    కృత్యము వ్రాయగ జ్ఞాని కృతకృత్యు డగున్

    రిప్లయితొలగించండి
  4. సత్యము పూరణ చేసిన
    నత్యుత్తమమైన ధార నందుచు కవితల్
    స్తుత్యంబులౌను గావున
    నిత్యముఁ గావలె సమస్య నెమ్మది కలుగన్.

    రిప్లయితొలగించండి


  5. సత్యము పల్కితి రయ్యా
    పైత్యము పట్టెను జనులకు ప్రబలం బాయెన్
    నాత్యంతికముగ కొల్వున
    నిత్యముఁ గావలె సమస్య నెమ్మది కలుగన్!

    :) పూరించే లోపలే పాదము మారి పోయెను ;)
    అయినా వదలము వదలము శంకరార్యా :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. "నిత్యముఁ గావలె .." సమస్య గత ఫిబ్రవరి నెలలో ఇచ్చినదే. పొరపాటున మరల ప్రకటించాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కంది వారు

      నో ప్రాబ్లెమ్ :) అప్పటికప్పుడు కొత్త తరహా లో పూరి, వడ జాంగ్రి లను జిలేబీలకు జోడించి ఫ్రెష్ గా వేసేస్తాం :)


      జిలేబి

      తొలగించండి


  7. డెందము నందుగ లండర
    విందుడు, సాక్షియ తడేను వినుమా రమణీ,
    యందరికిన్ నత డే, గన
    నంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. సందియములేదు విష్ణువు
    సుందరముగ సర్వమందు శోభిలు సకలం
    బందుండు నతనిలోననె
    యంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్.

    రిప్లయితొలగించండి
  9. భలే...👌🏻
    ఇంత సులువుగా సాధించారా...
    👏🏻💐🙏🏻

    రిప్లయితొలగించండి
  10. విందున సరసన గూర్చొని
    సందడి జేయుచు నగవుల సంబర మందున్
    బొందిరి పరమా నందము
    అంద ఱొకనిలోన నొక్కఁ డందఱి లోనన్

    రిప్లయితొలగించండి
  11. ఎందరొ మహానుభావులు
    నందరికిని వందనములు నందము మీరన్
    క్రిందను మీదను జూసిన
    నంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్!

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    సత్య విలోకనంబిదియ సాధువు శంకర పండితాఖ్యుకున్
    నిత్య సమస్యలుండ నిటు నింపుగ నుద్భవమందె బ్లాగు; పై
    భత్యము కేది రాదనియు బాగుగ నెర్గిన వానప్రస్థతన్
    నిత్యము గావలెన్ గలుగ నెమ్మది మాకు(గృహమేధులమగుమాకు)సమస్య యిచ్చటన్!
    (ఆర్యా, మిమ్ములను వాడుకున్నందులకు నన్ను క్షమించవలెను)

    రిప్లయితొలగించండి


  13. అందడ తండు! కాని కల డందురు ! చూడక పోయినన్ సుమా
    డెందము చెప్పు చుండుగద డెంకణ మున్ సలుపంగ మేలు! తా
    తొందర పెట్టు చుండు సఖి, తొయ్యలి, నీ పరి ణేత యంచు! తా
    నందఱిలోన నొక్కఁ డగు నందఱు నొక్కనిలో వసింతురే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    శ్రీ భగవానువాచ:
    పొందుగ పరమాత్ముడను ప
    సందుగ గనరండు పూజ సారంబిదియే
    "కందిని"గనుడు సమస్యల
    నందరొకనిలోన నొక్కడందరిలోనన్

    రిప్లయితొలగించండి
  15. ఎందర వెన్ని రూపముల నెంచగ జూచిన నొక్కడాతడే
    సుందర సృష్టి యాతనిదె చోద్యము మానవ రూపమన్నదే
    వందన మా చిరాయువుకు వాదన లెందుకు వంత పాడుడీ
    *"యందరిలోన నొక్క డగు నందరు నొక్కనిలో వసింతురే"*

    రిప్లయితొలగించండి
  16. మైలవరపు వారి పూరణ

    *మాయలోడు*

    నందకులాంగనల్ పరుగునన్ జని , చేరి యశోదఁ., బల్క మా
    యందరి యిండ్లలోనితడె యల్లరిఁ
    బాల్పెరుగుల్ హరించె , మీ
    నందనుడంచు.,నంతనొక నారియు నిట్లనె "మాయలాడు వీ...
    డందఱిలోన నొక్కఁ డగు నందఱు నొక్కనిలో వసింతురే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  17. డా. పిట్టా సత్యనారాయణ
    అందని పండ్లు నీ వెరుగునట్టివి పూజలు,తత్త్వ సంపదన్
    బొందవలెన్ నిరామయుని బూర్ణుని యాత్మకు నాత్మయౌ హరిన్
    కంది న మేనికే దెలుసు గాయము నానిన వాని బాధ, వే
    రందరిలోన నొక్కడగు నందరు నొక్కని లో వసింతురే!

    రిప్లయితొలగించండి
  18. సుందర సురుచిర రూపుడు
    కందువ చిత్తము న జనుల కాంక్ష లు దీర్చున్
    పొందు గ మెలగంగ ను తా
    నందరొకరి లోన నొక్క దందరి లోన న్

    రిప్లయితొలగించండి
  19. డెందము లోనప్రే మయని డీకొని కన్నియ గొంతుకో యగా
    నెందరి నైనకా దనుచు నీతిని జాయితి వీడి పోవగన్
    కొందరు కౄరజాతి యువ కోవిదు లుందుర టంచుచూ డగ
    న్నందరిలోన నొక్కఁడగు నందరు నొక్కనిలో వసింతురే

    రిప్లయితొలగించండి
  20. అందరిలోన నొక్కడగు నందరు నొక్కనిలో వసింతు ; రే

    సందియమందులేదు కద! ,సాధుజనావనశిష్టరక్షకుం

    డెందున జూడ నందు గలడేర్పడు నట్లుగ నాత్మలోన వె

    ల్గొందొగ, విశ్వరూపహరిలో జగమంతయుఁ జేరి యుండగన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల. జిల్లా జగిత్యాల.

    రిప్లయితొలగించండి
  21. సుందర సుమనోహరమే
    చందము నే గాంచినంత శ్యామలుడతడే
    కందములో చెప్పెదనిక
    *"నంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్"*

    ఏవర్ణమైనా నలుపులో కలిసిపోతుందికదా...
    అందుకే సర్వమునూ లయం చేసుకోగల సర్వేస్వరుడు శ్యామలుడు.
    🙏🏻

    రిప్లయితొలగించండి
  22. అంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్ "

    కం.
    సందర్శన మావిశ్వము
    సందర్భంబున యశోద చక్కగ జూచెన్
    వందనముతోడ నిట్లనె
    నందరొకనిలోన నొక్కడందరిలోనన్

    రిప్లయితొలగించండి
  23. అందము హృదయానందము
    మందిరమందున కలుగును మనసా వినవే
    డెందమునంతయు వాడే
    అందఱొకనిలోన నొక్కడందఱిలోనన్!!

    రిప్లయితొలగించండి


  24. చిందులు వేయుచు కొట్టగ
    నందరొకని,లోన, నొక్కడందరి లోనన్,
    సందుల గొందుల దూరి ప
    సందుగ తరిమె! సినిమా హసనవాయువు పో :)

    బాలకిట్టన్న , రవితేజ, జిందాబాద్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  25. కందువనాత్మజ్ఞానము
    నొందిన యోగీశ్వరునకు, ఓంకారంబే
    సుందరజగతినిఁ దోచును,
    అందఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్..🙏

    రిప్లయితొలగించండి
  26. సుందర కాండకు వీరుడు
    మందిరమునుగట్టి నాడుమదిలో రామున్,
    వందన జేయగ బహుజను
    లందరొకనిలోననొక్కడందరిలోనన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు




    రిప్లయితొలగించండి
  27. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2829
    సమస్య :: అందఱిలోన నొక్కఁడగు నందఱు నొక్కనిలో వసింతురే.
    *అందఱిలో ఒక్కడుగా ఉన్నాడు. అందఱూ ఈ ఒక్కనిలో ఉన్నారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శ్రీ కృష్ణ పరమాత్మ తన బాల్యంలో గోపబాలకులతోపాటు గోవులను కాచేందుకు గోకులం సమీపంలోని అడవులకు వెళ్లేవాడు. బకాసురుని తమ్ముడు, కంసుని సేవకుడు ఐన అఘాసురుడు కొండచిలువ ఆకారంలో ఉండి కృష్ణుని గోపాలకులను అందఱినీ మ్రింగి చంపివేయాలని అనుకొన్నాడు. ఐతే కృష్ణుడే ఆ కొండచిలువను చంపివేశాడు. దీనిని గమనించిన బ్రహ్మ ఆశ్చర్యపడి బాలకృష్ణుని పరీక్షింపదలచి గోవులను గోపబాలకులను ఒకచోట దాచిపెట్టినాడు. బ్రహ్మదేవునికి గర్వభంగం చేయదలచిన కన్నయ్య తన మాయతో తానే గోవుల రూపాలను గోపబాలకుల రూపాలను ధరించి అమాయకంగా గోకులానికి బయలుదేఱినాడు. కృష్ణమాయ తనమాయకన్నా గొప్పది అని గుర్తించిన బ్రహ్మ ఈ కృష్ణుడు అందఱిలో ఒకడుగా ఉన్నాడు. అందఱూ ఈ ఒక్కనిలో ఉన్నారు అని ఆశ్చర్యపడే సందర్భం.

    అందఱిఁ బ్రోవ కృష్ణుడె యఘాసురుఁ జంప, బరీక్ష బెట్టగా
    నందఱి దాచె బ్రహ్మ, పరమాత్ముడు గోవులు గోపకాళియై
    యందఱి రూప మందగనె యాతనిఁ జూచి యజుండు పల్కె “వీ
    డందఱిలోన నొక్కఁడగు నందఱు నొక్కనిలో వసింతురే.”
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (28-10-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ అవధానిగారూ! నమస్సులు!

      తొలగించండి
    2. అమ్మా! సీతమ్మా! ధన్యవాదాలమ్మా!
      మా పెద్దబ్బాయి క్యాలిఫోర్నియాలో
      చిన్నబ్బాయి టెక్సాస్ లో ఉంటున్నారమ్మా.

      తొలగించండి
  28. క: కుందకు మెప్పుడు నిత్యము
    పొందెడి కష్టముల గూర్చి భువిలోనెపుడున్
    చెందు సుఖములు హరికి తా
    మంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్

    రిప్లయితొలగించండి
  29. అందము చిందగ మానవు
    లందరు గోవిందు నందు ; నందరిలో గో
    విందుం ; డది యెట్లన్న
    న్నంద రొకనిలోన ; నొక్క డందరిలోనన్ .

    రిప్లయితొలగించండి
  30. బృందావన మందున నా
    నంద కిశోరుడె వెలసెను నయనా నంద
    మ్మందించుచు నిజమిదియే !
    "యంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్ "

    రిప్లయితొలగించండి
  31. సుందర సురుచిరయోగము
    నందునవేదాదివిద్దెలంశాలౌట
    న్నందురు నాత్మనెరింగిన
    నందరొకనిలోననొక్కడందరిలోనన్
    సుందరగుప్తవిద్యగనుచున్ప్రతినిత్యము సాధనారతిన్
    బొందినిశుద్ధిజేసిన యమోఘతపఃఫలమందిపూర్ణుడై
    యందరిలోననొక్కడగునందరునొక్కనిలోవసింతు;రే
    మందురుధర్మసూక్ష్మమిది యభ్యసనంబొనరించరేలకో

    రిప్లయితొలగించండి
  32. కంది కుల శేఖరుడు రూ
    పొందించిన బ్లాగు మిగుల నొనరగ నొప్పెన్
    యెందఱికో యని పించెన్
    "యంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్ "
    ***)()(***
    (కందివారి స్ఫూర్తి అందఱి పూరణలలో ప్రతిఫలిస్తున్నది కావున)

    రిప్లయితొలగించండి
  33. వందల విశ్వముల కతడు
    బంధువు, విశ్వములపూల బంతికి తంతున్
    అందక మరి యొప్పారెను
    అంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్

    రిప్లయితొలగించండి
  34. కం.
    సందడి సేయుచు నెన్నిక
    లందున నేతయొకడు ప్రజ లందరి కలువన్
    కొందరిటులననుచుండిరి
    "అంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్ "

    రిప్లయితొలగించండి
  35. సుందరుడౌ భగవంతుం
    డెందు గలడు ? వెదుక నేల యీవిశ్వమునన్
    యందఱిలో గలడు కదా!
    "యంద ఱొకనిలోన నొక్కఁ డందఱిలోనన్ "
    ***)()(***

    రిప్లయితొలగించండి
  36. అందము లొల్కు పథమ్ములు
    విం దొనరించుఁ గనులకు నవియ దేశము నం
    దెందును జూడఁగ మెలఁగుదు
    రంద ఱొకని లోన నొక్కఁ డందఱి లోనన్


    విందుల యందు మందులును బెం దమకమ్మునఁ జిందు లేయరే
    డెందమునం దమంద రహి డిందును బొందియు సందడించుచుం
    గుందక యిందు నెందునను గుంద మరంద సనంద పాన మీ
    యందఱి లోన నొక్కఁ డగు నందఱు నొక్కని లో వసింతురే

    రిప్లయితొలగించండి
  37. కందువయాటలనాడుచు
    నందముగాజెలులమధ్యయహిరిపువడరన్
    బందెములాడుచునయ్యిరి
    యందఱొకరిలోననొక్కడందఱిలోనన్

    రిప్లయితొలగించండి

  38. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)


    "వాడు వాడే వీడు వీడే"

    చందురు నిచ్చటన్ గనుము చక్కని నీ తెలగాణ మందునన్
    చందురు నచ్చటన్ గనుము చక్కని యాంధ్ర ప్రదేశ మందునన్...
    ఇందున నున్నవా డచట నెందున లేడుర నందనందనా?
    కుందకు జగ్గుమోహనుడ! గొప్పగు నీశ్వరు మాయ భ్రాంతియే!
    "అందఱిలోన నొక్కఁ డగు నందఱు నొక్కనిలో వసింతురే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. చందురురుడు తెలగాణని
      చందురుడాంధ్రమ్ములోన జగనుడ, కలరోయ్
      యెందెందువెతికినను నీ
      కందరొకనిలోన నొక్కడందరిలోనన్

      జిలేబి

      తొలగించండి
  39. అందుచునందకుండగనునార్తులబాధలుదీర్చునారమా
    సుందరుడన్నిటన్గలిగిచోద్యపురూపునుమారుచుండుటన్
    నందఱిలోననొక్కడగునందఱునొక్కనిలోవసింతురే
    వందనమట్టివారలకువారలుబిన్నలుబెద్దలైననున్

    రిప్లయితొలగించండి
  40. వేయి తలల తోడ, వేయి సూర్యుల వెలుగు నిడుచు, దర్శనము నిడె నపుడు
    నర్జునునకు హరి, హాటక గర్భుడుగ నొకమారు శివునిగ నొకమారు
    కనబడె, పితరులు,గంధర్వులు మరుద్గణము లెల్ల కనబడె నతనిలోన,
    కనబడె నంద ఱొకని లోన,నొక్క డందఱిలోన నగుపించ తనుకు గలిగె
    సవ్య సాచికి కృష్ణు భీషణపు విశ్వ
    రూపమును గాంచి, వగచి పార్ధు డు పద
    ము లెదుటన ధనువు నొదలి , మోకరిల్లి
    విశ్వ రూపము విడుమని వేడు కొనెను

    రిప్లయితొలగించండి
  41. బొందినివిడువగ చేరుదు
    రంద ఱొకనిలోన, నొక్కడందరి లోనన్
    యందముగచేరు నజరము
    బొంది కలుగువానికిదియె పొసగుచునుండున్

    రిప్లయితొలగించండి
  42. ఎందుగలడాహరియనగ?
    అందరొకనిలోన నొక్కడందరిలోనన్
    సుందర ప్రహ్లాదుడనగ!
    నందుకు తనతండ్రివెదికె నార్భాటమునన్

    రిప్లయితొలగించండి
  43. అందరిని రక్ష జేసెడు
    సుందరుడా నల్లనయ్య చోద్యముగా గో
    విందా యని పిల్చెడు వా
    రందరొకనిలోన నొక్కడందఱి లోనన్


    వందన మోడ్చి పాహి యను భక్తుల గాచెడు దీక్షతో మనో
    సుందరు డైన కృష్ణుడట చోద్యము గాదె తనన్ స్మరించినన్
    ముందుగ వచ్చునంట ముద మొప్పగ ముప్పును తీర్చగా వడిన్
    నందరిలోన నొక్కడగు నందరు నొక్కనిలో వసింతురే

    రిప్లయితొలగించండి
  44. కొందరు చిత్తమందునొక క్రొత్త స్వభావముతోడ వింతగా
    పొందిన జబ్బుతో మెలగు బుద్ధికి తోచిన వ్యక్తి వోలె తా
    నెందుకునెప్పుడెవ్వరిగనెట్టుల మారునొ చెప్పకష్టమౌ
    నందరిలోన నొక్క డగు నందరు నొక్కనిలో వసింతురే
    (Multi personality disorder)

    రిప్లయితొలగించండి
  45. ఉత్పలమాల

    చిందరవందరై మదియె సేయను యుద్ధమటన్నఁ బార్థుడున్
    మైందహనుండు భీతిఁ బరిమార్చుచు జూపఁగ విశ్వరూపమున్
    గందరగోళమున్ విడచి గాంచుచు సర్వము నిట్లు పల్కెనే
    " నందఱిలోన నొక్కఁ డగు నందఱు నొక్కనిలో వసింతురే"

    రిప్లయితొలగించండి
  46. అందరు నందరే యగుచు నందరకున్ కనుపింప, జ్ఞాని తా
    నందరి లోన నొక్కఁ డగు నందఱు నొక్కనిలో వసింతురే"
    కొందరు గొప్పగా మరియు కొందరు కాకయు, సామ్యవాది తా
    నందరి లోన నొక్కడగు నందరు నొక్కని లో వసింతురే.
    (అద్వైతజ్ఞానికి , సామ్యవాదికి ఇద్దరికీ అలాగే కనిపిస్తారు అని. ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అనేది సామ్యవాదసిద్ధాంతం కూడా. సమస్య లో అందరు నొక్కని లో వసింపగన్ అంటే ఇంకా బాగుండేది . ఇక్కడ సమస్యని రెండు చోట్ల పూరించే అవకాశం లభించినది. ధన్యవాదం)

    రిప్లయితొలగించండి
  47. నందుని సుతుడా కృష్ణుం
    డందరి డెందెములలోన నానందముతో
    చిందులు త్రొక్కుచు నుండును
    నందరొకని లోన నొక్కడందఱి లోనన్

    రిప్లయితొలగించండి