2, అక్టోబర్ 2018, మంగళవారం

సమస్య - 2806 (కలు సేవింపుఁ డని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్"
(లేదా...)

"కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్"

80 కామెంట్‌లు:

 1. అల గోవుల పొడిచి పొడిచి
  విలువగు పాలిమ్మనుచును పీడింపక తా
  మలయక నే పాలిడు...మే
  కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్ :)

  పొడిచి = injections ఇచ్చి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "He even had a pet goat named Nirmala who sometimes travelled with him and when she didn't, his well-wishers organised goats to supply him with fresh milk. In fact, his trip to Europe and London for the Round Table Conference in 1931 was aided by a number of generous local nannies."

   http://trivia.serendip.in/trivia/getting-gandhis-goats

   తొలగించండి
  2. మేకలు..
   శాస్త్రి గారూ...భలే
   😀👌🏻👏🏻🙏🏻💐

   తొలగించండి


  3. మేక పాలు త్రాగి మేధయు పడసెను
   మాట కట్టి బెట్టి మాన్యుడాయె
   సత్యమును బలుకుచు స్వాతంత్ర్యమను తర
   కలు కుడుచన నేర్పె గాంధి తాత!


   జిలేబి

   తొలగించండి
  4. అలగుచు, "జనముల్! మీరీ
   పలు బంధమ్ముల భరించి వరలుచు నిక మా
   ర్పలుకక మా వంశపు తున
   కలు సేవింపుఁడ"నిగాంధి ఘనయశ మందెన్

   గాంధి = ఇందిరా గాంధి
   పలు బంధములు = Emergency excesses
   మార్పలుకక = మారు పలుకక

   తొలగించండి


  5. అలగా జనులారా! రా
   హులు పల్కుల మీరు వినుడి! హుంకారంబుల్
   వలదర్రా! పీకక యీ
   కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్!

   జిలేబి

   తొలగించండి
  6. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   *****
   జిలేబీ గారూ,
   శాస్త్రి గారి పూరణలకు మీ కౌంటర్ పూరణ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి

 2. కలుషిత జంక్ ఫుడ్స్ తినుటను
  వలదని హితమును పలుకుచు బాగును గూర్చే
  పలురకముల గింజల మొల
  కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్"


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని గాంధీ గారి కాలంలో జంక్‌ఫుడ్స్ ఉన్నాయా?

   తొలగించండి
 3. వలదు జనులార జీవుల
  బలి,మానుము,సాత్వికమగు బలము నిడెడు నం
  బలిని గొనుచు సతతము మొల
  కలు సేవింపుడని గాంధి ఘన యశ మొందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్యకుమార్ గారూ...
   బావుందండీ. తెలుగునేలను దాటి మత్స్య దేశంలో అంబలి తాగించాం నిన్న....నేడు గుజరాతీయులు కూడా.....😁👌🏻👏🏻🙏🏻💐

   తొలగించండి
  2. సూర్యకుమార్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 4. పిలిచెను జనాళిని బలిమి
  కలిగిన దేశమిదియనుచు కదలిక తెచ్చెన్
  విలువైన స్వతంత్రపు తర
  కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. బలిచేయక పశువుల వలె
  యిల నేలెడు ప్రభువు లంత యీప్సిత ములకై
  పలువిధ ములదుష్టుల కిను
  కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ భావం కొంత అస్పష్టంగా ఉన్నది.
   "...వలె నిల... లంత నీప్సితములకై..." అనండి.

   తొలగించండి
  2. బలిచేయక పశువుల వలె
   నిల నేలెడు ప్రభువు లంత నీప్సిత ములకై
   పలువిధ ములదుష్టుల పలు
   కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్

   తొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  అల సేవారతి నేర్వగా శ్రవణపుత్రాఖ్యానమున్., శాంత్యహిం...
  సల, సత్యంపు మహత్వమున్ గన హరిశ్చంద్రీయమున్ ., సుంత మే...
  నలుపుంబొంద శమంబునందుటకు గీతార్థమ్ములన్ తేనె చు...
  క్కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీమతి సీతాదేవి గారికి నమోవాకములు 🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి


  2. తలకడచుచు నాటి శ్రవణు
   ని లసితమగు శాంత్యహింసనీతములన్ మీ
   రిలగాంచి హరిశ్చంద్రు న
   కలు, సేవింపుఁడని, గాంధి ఘనయశ మందెన్!


   జిలేబి

   తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 7. కుల మత భేదము లెంచక
  యెలమిన్ సుఖ శాంతు లంది యెల్లరు మనఁగన్
  దలఁచుచు దీన జనుల పా
  కలు సేవింపుఁ డని గాంధి ఘనయశ మందెన్.

  రిప్లయితొలగించండి
 8. పలుమాటలేల జనులిక
  తెలవారెను లెండు విజయ దీప్తులు మనకున్
  కలుగును వదలుం డరమరి
  కలు, సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్.

  రిప్లయితొలగించండి
 9. చెలువ పు మనసులు కలిగియు
  నలుగు రి తో కలసి మెలసి నవ్య పథము నన్
  విలసిల్లి వీ డ వలె నలు
  కలు ; సేవింపు డని గాంధి ఘన యశ మందెన్

  రిప్లయితొలగించండి
 10. "కలకలలాడెడి బహుభా
  షల యువకులు యువతులు మన జననీపదముల్
  కలసి మెలసి రత్నపు మొల
  కలు సేవింపు" డని గాంధి ఘనయశ మందెన్ .

  రిప్లయితొలగించండి
 11. కులముల కన్నను విలువలు
  యిలమేలని జాతిపితగ నింపును గొనుచున్
  కలరా వ్యాపించిన పా
  కలు సేవింపుడని గాంధి ఘనయశ మందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'విలువలు + ఇల = విలువ లిల' అవుతుంది. యడాగమం రాదు. "విలువలె యిల..." అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా! సవరించెదను!

   తొలగించండి


 12. మత్తేభవిక్రీడితము

  బలిమిన్ చాటెను దేశ వైభ వము శోభల్గాన స్వాతంత్ర్యమున్
  కలయై నిల్పి జనాళి మానసము చర్ఖాచక్రమున్ద్రిప్పి మా
  లల యస్పృశ్యత దేశ మెల్ల తొలగన్ లవ్వాడి వారింట నూ
  కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. పలురోగాలకు మూల
  మ్మిలలో తైలమ్మనంచు నిది యెరగినవా
  రలు క్షేమమొసంగెడు పుల
  కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తైలమ్మటంచు' అనండి.

   తొలగించండి
 14. ఇలలో ధనమే మూలము
  కలి బాధలు దాటి సుఖముగా జీవింపన్
  కలుగన్ స్వేచ్ఛయు-మరి రూ
  కలు సేవింపుడని గాంధి ఘన యశ మందెన్

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2806
  సమస్య :: కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గొనెన్.
  కల్లు త్రాగడం మంచిపని అని చెప్పి కీర్తిని పొందినాడు అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: 1869 వ సంవత్సరం అక్టోబరు 2 వ తేదీన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారు గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. మన భారతదేశదేశాన్ని పరిపాలిస్తూ ఉండిన ఆంగ్లేయులతో పోరాడే విషయంలో సత్యము అహింస అనే ఆయుధాలతో ముందు నిలిచినాడు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూ *పురుషులతో పాటు స్త్రీలు(అమ్మలక్కలు) కూడా భరతమాతను సేవించాలి* అని చెప్పినవాడై మనకు స్వేచ్ఛను ప్రసాదించి జాతిపితగా కీర్తిని పొందినాడు అని విశదీకరించే సందర్భం.

  అల *యక్టోబరు రెండు* నాడు మన మోహన్ దాసు జన్మించె, మీ
  రలు సేవింపుడు భారతాంబ నని చేరన్ బిల్చుచున్, నిత్యబో
  ధలలోనన్ పురుషాళితో సమముగా ధైర్యమ్ముగా నమ్మల
  క్కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గొనెన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (2-10-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అల యక్టోబరు రెండున
   నిలబుట్టి పురుషులతోడు నిల్చుచు నాంగ్లే
   యులతో పోరుచు నమ్మ
   క్కలు సేవింపుఁడని, గాంధి ఘనయశ మందెన్!


   జిలేబి

   తొలగించండి
  2. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
   ******
   జిలేబీ గారూ,
   రాజశేఖర్ గారిని అనుకరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. పలు రోగమ్ములు కల్గు ధ్వంసమగుచున్ స్వాభావికమ్మౌ గుణ
  మ్ములు సంఘమ్మున తగ్గి గౌరవము సంపూర్ణమ్ముగా జీవిత
  మ్ములు కల్లోలములౌను కాననికపై మొత్తమ్ముగానాపనీ
  కలు సేవించుట, శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్"*

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. అల యక్టోబరు రెండున
   నిలబుట్టి పురుషులతోడు నిల్చుచు నాంగ్లే
   యులతో పోరుచు నమ్మ
   క్కలు సేవింపుఁడని, గాంధి ఘనయశ మందెన్!


   జిలేబి

   తొలగించండి
  2. సూర్యనారాయణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 17. పలుమార్లును సేవింపగ
  గలుగదు హానియు ధృడమగు కాయంబిలలో
  బలమది పెరుగు సతము మొల
  కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్.

  రిప్లయితొలగించండి
 18. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  =========================
  కలు సేవించుట శిష్ట కార్యమనుచున్
  గాంధీ యశంబును గనెన్.
  =========================
  దుష్టులను చేరి కొలుచుటయే బుద్ది
  మంతుల లక్షణమని తలచిన గాంధీ
  గొప్ప కీర్తి ప్రతిష్టలను పొందినాడని
  చెప్పటంలో అసంబద్దతె సమస్య
  =======================
  సమస్యా పూరణం- 272
  ==================

  ఈస్టిండియా పేరుగ కంపెనియది-
  వర్తకమునకిచటి కొచ్చినది
  దేశమును అది ఆక్రమించినది-
  బానిసలుగ మనలను చేసినది
  జాతి ద్రోహులు తరించిరి-
  కలు సేవించుట శిష్ట కార్యమనుచున్
  గాంధీ యశంబును గనెన్-
  తెల్లోడిని నిరసించి ఉద్యమ బాటగన్

  ====##$##====

  "చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష" , "నలుగురితో
  పాటు నారాయణ, ఊరితో పాటు గోవిందా "
  యని అందరి వలె తలపోయక

  బారిస్టర్ పట్టాతో లక్షలు ఆర్జించ గలిగిన
  అవకాశమున్నను జాతి విముక్తికై పోరాడిన
  మన బాపూజీ గారి జయంతికై శుభాకాంక్షలు

  (మాత్రా గణనము - అంత్య ప్రాస)
  ---- ఇట్టె రమేష్
  (శుభోదయం)

  రిప్లయితొలగించండి
 19. కలలోసైతముజెప్పడు
  కలుసేవింపుడనిగాంధి,ఘనయశమందెన్
  నలనాంగ్లేయులపాలన
  నిలకున్లేకుండజేసిహింసారహితోన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అందెన్ + అల = అందె నల' అవుతుంది. అదనంగా నకారం? 'హింసారహి'?

   తొలగించండి
 20. కలుగగ స్వాతంత్ర్యము వెస
  వెలుగంగను భరతభూమి విశ్వమునందున్
  సలుపక పనుల నవకతవ
  కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్

  రిప్లయితొలగించండి
 21. బలిమిని కలిమిని బడయుచు
  నిలపై స్వాతంత్ర్య ఫలమె యీప్సిత మవ్వ
  న్నెలమిని వలదంచును కిను
  కలు; సేవింపుడని గాంధి ఘనయశ మందెన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శిష్ట్లా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...యీప్సితమై తా। నెలమిని...' అనండి.

   తొలగించండి
 22. అలజడి లేపఁగ నాంగ్లే
  యుల మన మందు మన భూమి నుండెడు వసన
  మ్ములు వస్తువులు మఱియు నూ
  కలు సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్


  కల నందైనఁ దలంప రాదు నర సంఘాతంపుఁ గార్యమ్ములన్
  వల దెన్నండు విరోధ భావ మెద భావ్యంబౌను సచ్ఛాంతమే
  చల మేలన్ సుజనాభ్ర మందున నహింసా సత్యముల్ మేటి రి
  క్కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబుం గనెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. మీ యారోగ్యము పూర్తిగా కుదుటపడి నట్లు భావించెదము.

   తొలగించండి
 23. కలుఁ త్రావంగ నిషేధమున్, దళితసంఘాస్పృశ్యనిర్మూలమున్,

  బలు సామాజికరుగ్మతల్ దొలగగన్, స్వాతంత్ర్యముం గోరుచున్,

  జెలువొందం దగు నూలుఁ దానె వడుకన్ జెన్నొందు చేనేత కో

  కలు సేవించుట, శిష్టకార్యమనుచున్ గాంధీ యశంబున్ గనెన్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 24. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అల గోమాతల పాలకై పొడుచుచున్ హైరాణ గావించ...కే
  విలువల్ గానివి మేలు పాలిడుచు తాపీగా విహారించెడిన్
  మిలమిల్ నల్లని తోలుతో మెరిసి మెమ్మెమ్మేల రాగాల...మే
  కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్!

  రిప్లయితొలగించండి
 25. చంపారన్ లో గాంధీజీ కుష్టురోగులను చూసి బాధపడి వారికి సేవచేసిన సందరోభాన్ని యూహించి......

  విలయమ్మాడ దరిద్రమే జనులనే పీడించె రోగమ్ములే
  యల నిర్భాగ్యుల జేరుచున్ తగు సహాయమ్మంద జేయంగ ప
  ల్లెలలోనంగల కుష్టురోగులను జాలిన్ జూపుచున్, జేరి పా
  కలు సేవించుట శిష్టకార్యమనుచున్ గాంధీ యశంబున్ గనెన్.

  రిప్లయితొలగించండి
 26. మత్తేభవిక్రీడితము
  తలపున్ జేయక క్షీరసేవనము పథ్యంబంచ నారోగ్యమే
  కలతన్ రేపగ వైద్యుడొక్కడు తగన్ ఖండించి సూచించగన్
  దెలిసెన్ శ్రేయము గూర్చ జీర్ణమున ప్రత్యేకంపు పాలిచ్చు మే
  కలు, సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పథ్యం బంచు' టైపాటనుకుంటాను.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు.

   పథ్యంబంచు+అనారోగ్యమే = పథ్యంబంచ నారోగ్యమే

   తొలగించండి
 27. కందం
  విలువలు దెలియుడటంచున్
  ప్రలోభముల్ వీడి మీరు భారతమాతన్
  యిల వాడి దండి లవణపుఁ
  గలు, సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మాతన్ + ఇల = మాత నిల' అవుతుంది. యడాగమం రాదు.

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

   విలువలు దెలియుడటంచున్
   ప్రలోభముల్ వీడి మీరు భారతమాతన్
   భళి వాడి దండి లవణపుఁ
   గలు, సేవింపుఁడని గాంధి ఘనయశ మందెన్

   తొలగించండి
  3. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 28. Android phone key board లో అరసున్నా టైప్ చేయటం ఎలా ?
  ఎవరన్నా తెలియజేయగలరు.

  రిప్లయితొలగించండి
 29. కలిమి కలదనుచు నీల్గక
  కుల మత భేదముల చేరుకొన నీయక యా
  కలి దీరని పేదల పా
  కలు సేవింపుడని గాంధి ఘన యశ మందెన్!

  రిప్లయితొలగించండి
 30. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  కలు సేవింపుఁడని గాంధి
  ఘనయశ మందెన్

  సందర్భము: సులభము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "కలవారలకైనను పే
  దలకైనను మనవి యొకటె..
  దయతో వినుడీ!
  ఇలలో చెడిపోదలచిన
  కలు సేవింపుఁ" డని గాంధి
  ఘన యశ మందెన్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  2.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 31. గలభా జేసెద వేలరో! సభలనున్ కాంగ్రేసు సభ్యుండవై
  ఖలుడా! కల్లును త్రాగవద్దనుచు తా ఖండించి మద్యమ్మునున్
  జలసాగా నుడికించుచున్ కలుపుచున్ జావౌచు భాసిల్లు నూ
  కలు సేవించుట శిష్టకార్య మనుచున్ గాంధీ యశంబున్ గనెన్

  రిప్లయితొలగించండి