30, అక్టోబర్ 2018, మంగళవారం

సమస్య - 2831 (పుష్టినిఁ దుష్టి నిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్"
(లేదా...)
"పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట పుర్వుల మందుల మ్రింగ మే లగున్"
(విజయనగరం అవధానంలో రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి పూరించిన సమస్య)

99 కామెంట్‌లు:

 1. దుష్టపు బుద్ధుల తోడను
  కష్టము లేకయె విపణులు కల్తీలిడగా
  యిష్టము హెచ్చ పురువులకు
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కల్తీ కారణము ‌రైతు కష్టము హెచ్చన్!
   👌🏻👏🏻🙏🏻💐

   తొలగించండి
  2. పురుగుల సంగతి నాకంత తెలియదు కానీ దోమలు వృద్ధిజెందుచున్నవి...ఏ మందూ పనిచేయుట లేదు...

   తొలగించండి
  3. ప్రభాకర శాస్త్రి గారూ,
   నిజమే కల్తీ పురుగుల మందులు పురుగులకు పుష్టిని కలిగించే మాట వాస్తవం. చక్కని పూరణ. అభినందనలు.
   'కల్తీ లిడగా। నిష్టము...' అనండి.

   తొలగించండి


 2. కష్టంబును దుష్టిగ తా
  నిష్టగ జేర్చున్ జిలేబి నిమ్మళముగ నీ
  కిష్టంబని తాగకుమా,
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్!


  ఈ నాలుగో వాక్యము అర్థమేమిటో తెలియ కున్నది :)
  అయినా పూరించెద :)

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. హమ్మయ్య ! పూరించేసా :)   కష్టంబును పుష్టిగ తా
   నిష్టగ జేర్చున్ జిలేబి నిమ్మళముగ నీ
   కిష్టమ నకు!దుష్టి! నెటన్
   పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్?
   జిలేబి

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నిష్ఠ'ను 'నిష్ట' అన్నారు. అక్కడ

   తొలగించండి


  3. కష్టంబును పుష్టిగ తా
   రొష్టుగ జేర్చున్ గదా తిరోగతి సూ! నీ
   కిష్టమ నకు!దుష్టి! యెచట
   పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్!

   జిలేబి

   తొలగించండి
 3. ఇష్టముతోడను మనుషులు

  పుష్టిగను మరి తినిన పలు పురువుల మందుల్

  నష్టము నిడు మేనుకు;నే

  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   సమస్యను ప్రశ్నార్థకంగా మార్చి చెప్పిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'మనుషులు' అనడం సాధువు కాదు. "మనుజులు" అనండి.

   తొలగించండి
 4. సృష్టికి యందము తరువులు
  నష్టముగా నెంచి నేడు నాశము జేయ
  న్నిష్టము నేపుగ పెరుగిన
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   భావంలో కొంత అస్పష్టత ఉన్నది. 'సృష్టికి నందము...పెరిగిన..' అని ఉండాలి.

   తొలగించండి


 5. కష్టము లన్ జిలేబి విను గట్టిగ చేర్చును నీకు తొయ్యలీ,
  నిష్టము నాకటంచు మరి నీటుగ మెక్కకుమా! రమామణీ
  తుష్టియు దుష్టి యే ! సరసి!, తొందర పాటున చెప్పకేనెటుల్
  పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట పుర్వుల మందుల మ్రింగ మే లగున్?

  ఓ! అది తుష్టి అన్న మాట ! దుష్టి అనుకున్నా :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ....తొయ్యలీ!
   యిష్టము...
   యడాగమమే కదా! నో ద్రుతమ్స్!!
   😀🙏🏻🙏🏻

   తొలగించండి
  2. దుష్టియె దుష్టి కాదిచట తుష్టియె దుష్టయె సంధి సూత్రమున్
   🤣

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   విట్టుబాబు గారి సూచన గమనించండి.

   తొలగించండి


  4. కష్టము లన్ జిలేబి విను గట్టిగ చేర్చును నీకు తొయ్యలీ,
   యిష్టము నాకటంచు మరి యీహగ, మెక్కకుమా! రమామణీ
   తుష్టియు దుష్టి యే !సరసి! ,తొందర పాటున చెప్పకేనెటుల్
   పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట పుర్వుల మందుల మ్రింగ మే లగున్?

   జిలేబి

   తొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  *నష్టము గల్గునాముదమునన్ నులిపుర్వులకంచు* దల్లి నీ
  కిష్టము లేదనన్ వినక , యెంతయొ ప్రేమగ పోయు గొంతులో !
  *కష్టమె మ్రింగునప్పుడగు , కాని ఫలమ్ము ఘనమ్ము ,* నమ్ముమా !
  పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట పుర్వుల మందుల మ్రింగ మే లగున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నులిపురుగుల మందుతో మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 7. డా.పిట్టా సత్యనారాయణ
  నష్టము మాట నటుంచియు
  సుష్టుగ నవి జల్ల, పోయ సొడ పొడ గలుగన్
  వృష్టియు నెట-మట పంటకు
  పుష్టిని దుష్టి నొసగు గద పురువుల మందుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నష్టపు మాట నటుంచియు...' అనండి.

   తొలగించండి
 8. (గురువు ప్రశ్నలు - శిష్యుల సమాధానాలు )
  "ఇష్టముతోడ బెంచిన వ
  నేందిర యిచ్చిన పండ్ల నేమగున్ ?
  నష్టము నిచ్చు కీటకవి
  నాశన మెవ్విధి గల్గనేర్చునో ?
  సుష్టుగ మంచుకొండ యిడు
  సొంపగు నోషధు లేమిచేయునో ? "
  "పుష్టిని దుష్టి నిచ్చునట "
  "పుర్వుల మందుల " " మ్రింగ మేలగున్ . "

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 9. డా.పిట్టా సత్యనారాయణ
  కష్టము లోన రైతులకు కాల యముండుగ నున్న ద్రావణా
  లిష్టము కొద్ది జేర్తురవి యింటను, పంటపొలాల ,కొట్టమున్
  భ్రష్టులు గాగ పెట్టుబడి పాడవ రోగి యొకండు గ్రోలగన్
  కష్టము బాసి కోలుకొనె కర్షకు లెల్లరు విస్తుబోవగన్
  పుష్టిని దుష్టినిచ్చునట పుర్వుల మందులు మ్రింగ మేలగున్
  (ఆయుర్వేదములో ఆఖరి మందుగా కొన్ని పాషాణాలను యిస్తారు.ఒక్కొక సారి అవి అద్భుతంగా పని చేస్తాయనే నమ్మకం ఉండేది.ఈనాటి చేని పురుగుల మందుల్లో కల్తీలను కూడా సూచిస్తుందీ సమస్య.)

  రిప్లయితొలగించండి
 10. దుష్టములగు కీటకముల
  చేష్టలనుం ద్రుంచి రైతు చిత్తజమగు నా
  కష్టంబు నణచి పంటకు
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్.

  రిప్లయితొలగించండి
 11. శంకరాభరణం...30/10/2018
  సమస్య:

  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్
  నా పూరణ. : కందము
  ***** **** ***

  నష్టము నిడు గద తనువుకు,
  నష్టపు కష్టము లొసంగు నయ్యా !వినుమా!
  యిష్టపడి భుజించకు;నే
  పుష్టిని దుష్టి నొసగు గద పురువుల మందుల్


  🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 12. మాస్టరు చెప్పిన మాటను
  కష్టమనక వినిన మేలు గద కిష్టప్పా!
  నష్టము తీరును పైరుకు
  పుష్టినిఁ దుష్టినొసఁగుఁ గద పురువుల మందుల్

  రిప్లయితొలగించండి
 13. శ్రేష్ఠపు సేంద్రియ పంటలు
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద! పురువుల మందుల్
  నష్టము రైతులకొసగుచు
  కష్టములిడు తిను జనులకు కనుగొన నిజమున్

  రిప్లయితొలగించండి
 14. ఇష్టపు టాహా రము నను
  పుష్టి ని దుష్ టి నొసగు గద ; పురువుల మందు ల్
  నష్టము మాన్పియు పైరుల
  పుష్టి గ పెరు గంగ జేయు పుడమి ని మిగుల న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఇష్టపు టాహారమ్మే పుష్టిని దుష్టి నొసగు...' అంటే అన్వయం బాగుంటుంది కదా?

   తొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2831
  సమస్య :: “పుష్టినిఁ దుష్టి నిచ్చు నఁట పుర్వుల మందులు మ్రింగ మేలగున్.”
  *పురుగుల మందులు మ్రింగితే పుష్టి తుష్టి లభిస్తాయి. ఎంతో మేలు కలుగుతుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: “తప్పులు లేకుండా ఉక్తలేఖనం (డిక్టేషన్) వ్రాయమని మన పూర్వీకుల ఆయుర్వేద వైద్యవైభవాన్ని వివరించే ఈ వాక్యాన్ని చెప్పినాను. ఐతే ఈ విద్యార్థి నేను చెప్పిన వాక్యాన్ని సరిగా వినకుండా కొమ్ము దీర్ఘానికి బదులు కొమ్ము మాత్రమే వ్రాసినాడు. *పూర్వుల మందులు* అనే పదాన్ని *పుర్వుల మందులు* అని వ్రాసినాడు.” అని ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి చేసిన తప్పును గుఱించి తన మిత్రునికి విశదీకరించే సందర్భం.

  స్పష్టత నుక్తలేఖనము వ్రాయగ జెప్పితి నిట్లు వాక్యమున్
  “పుష్టినిఁ దుష్టి నిచ్చు నఁట పూర్వుల మందులు మ్రింగ మేలగున్”
  భ్రష్టత కొమ్ముదీర్ఘమును హ్రస్వముగా లిఖియించె వీడిటుల్
  “పుష్టినిఁ దుష్టి నిచ్చు నఁట పుర్వుల మందులు మ్రింగ మేలగున్.”
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (30-10-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమస్కారం!
   అద్భుతంగా పురించారండి!
   ధన్యవాదాలు

   తొలగించండి
  2. రాజశేఖర్ గారూ,
   ఎలా వస్తాయండీ మీ కిలాంటి వైవిధ్యమైన ఆలోచనలు?
   అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
  3. అవధానివరేణ్యులు శ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారు అందజేసిన ప్రశంసాపద్యము.

   ఇంతటియద్భుతోహ తమకేవిధి వచ్చెడు రాజశేఖరా!
   వింతసమస్యకున్ మరొకవింతగుపూరణ పూరణాన వి
   భ్రాంతపదప్రయోగరుచిరార్ద్రమనోహర దివ్యభావన
   స్వాంతము దీనికిన్ గురుకృపాంతరవీక్షణ కారణమ్మగున్.

   తొలగించండి
  4. సహృదయులు పాలవరపు శ్రీకర్ గారూ! హృదయపూర్వక ప్రణామాలండీ.

   తొలగించండి
  5. శ్రీ కంది శంకరయ్య గురువరేణ్యా!
   హృదయపూర్వక ప్రణామాలండీ.

   తొలగించండి
  6. అవధాని వరేణ్యులు
   శ్రీ చక్రాల రాజారావు గారూ! భక్తిపూర్వక ప్రణామాలండీ.

   తొలగించండి
 16. ఇష్టము లేదు లే దనెద వేలనొ బాలుడ యీ కషాయమున్
  నష్టము జేయు రోగములు నాశనమేనిక నమ్ముమా సుతా!
  యిష్టమ! చెప్పుమా కొడక యీ నులి పుర్వుల బాధ నీకు? రా!
  *"పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట పుర్వుల మందుల మ్రింగ మే లగున్"*

  రిప్లయితొలగించండి
 17. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల
  మందుల్

  సందర్భము: దోమలు ఈగలు మొదలైన పురుగులకు మందులు శ్రద్ధతో పెట్టే కొద్దీ అవి వాటికి అలవాటుపడి.. తిని యింకా బలిసిపోతూ వున్నాయి..
  అగదము= మందు
  సుష్టు=well, good (చక్కగా పెట్టితే.. అని నా ఉద్దేశ్యం..)
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  కష్టము గూర్చెడు పురువుల
  నష్టము జేయంగ నెంచి నానాగదముల్
  సుష్టుగ బెట్టిన బలిసెనె!..
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద
  పురువుల మందుల్!

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  30.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   అవికూడా రోగనిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి.
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 18. పుష్టిని దుష్టి నిచ్చునని బుర్వుల మందులు తిందువేమి? సం

  క్షిష్టపరిస్థితుల్ గలుగుఁ గేవల మయ్యవి పంటచేల ని

  ర్దిష్టము లౌను గాద!, పరిదేవన నొందగఁ, గోరి యెట్లు సం

  పుష్టిని తుష్టి నిచ్చు నట, పుర్వుల మందులు మ్రింగ మేలగున్?

  కంజర్ల రామాచార్య.
  కోరుట్ల.జగిత్యాల జిల్లా.

  రిప్లయితొలగించండి
 19. శిష్టులజతగూడినచో
  పుష్టినిదుష్టినొసగుగద,పురువులమందుల్
  నష్టముజేయునునొడలికి
  కిష్టప్పా!తినకుమెపుడుకేళినినైనన్

  రిప్లయితొలగించండి
 20. పుష్టినిదుష్టినిచ్చునటపుర్వులమందులుమ్రింగమేలగున్
  పుష్టినిదుష్టినిచ్చుననిబొంకులుసెప్పిరివారిమాటలన్
  నిష్టముగాదలంచకుడుకీడునుజేయునుబుర్వుమందులే
  కష్టములెన్నియోకలుగుగాంచనిరోగములుద్భవించుచున్


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. "మాటలే। యిష్టముగా దలంచకుడు నెంతయొ కీడగు బుర్వు..." అనండి.

   తొలగించండి

 21. సృష్టి యదెంత విచిత్రము!
  కష్టము గలిగించు వృష్టి కలిగించు వ్యథల్
  సృష్టము,నిజమిది !యటులే
  "పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్"
  **)(**
  (అనుకూల పరిస్థితులలో అధిక పంట దిగుబడులకు కారణ భూతమై,ప్రతికూల పరిస్థితులలో ప్రాణాలనే బలిగొంటాయి.)

  రిప్లయితొలగించండి
 22. గోష్ఠపు వ్యర్ధము పంటకు
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద; పురువుల మందుల్
  ఇష్టానుసారము కొనగ
  నష్టము రైతుకు, యనేక కష్టములిచ్చున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో 'ష్ఠ' వల్ల ప్రాస దోషం.

   తొలగించండి
 23. కందము చక్కని చందము
  కందము కవులకు మరిమరి విందున్; నాకున్
  కందము వ్రాయుట రాదే
  అందము చెడిన కుకవినని యందురు గాదే
  🙏🙏🙏

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాలకృష్ణ గారూ,
   నడక పట్టుబడిందంటే కందం కంటె సులభమైన పద్యం మరొకటి లేదు.

   తొలగించండి
 24. ఇష్టా గోష్ఠుల జన సం
  క్లిష్ట వికారము లెఱింగి లీలా లీలం
  గష్ట మనక చేయ నడచి,
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద, పురువుల మందుల్

  [పురువుల (న్) = పురువులను; అడచి పురువులను మందుల్ పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద]


  ఇష్టము సేయ మిక్కిలి మహీజన కోటికి నుద్యమించి యే
  కష్టము దేహ మందునను గానఁగ రాదట వేదశాస్త్ర భూ
  ద్రష్ట లొసంగి రంట యుదరస్థిత కీటక నాశకారు లీ,
  పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట, పుర్వుల మందుల మ్రింగ మే లగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 25. మృష్టమగు శాకములొసగు
  పుష్టిని; దుష్టి నొసగు గద పురువుల మందుల్
  తుష్టిగ నెక్కువ వాడిన,
  షష్టిక పండు నధికముగ సరిపడ వాడన్

  షష్టిక = అఱువది దినముల పంట

  రిప్లయితొలగించండి
 26. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  పుష్టిగ నున్నదంచు నొక పుష్పను బెంగలు భూమినందు నా
  కిష్టమదంచుచున్ విరివి క్లిష్టము లెంచక తోటరాముడై
  కష్టము లోర్చుచుండి విషకన్యను భేషుగ కట్టుకున్నచో
  పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట!...పుర్వుల మందుల మ్రింగ మే లగున్ :)

  తోట రాముడు = డింగరి (పాతాళ భైరవి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ
   మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు
   కాకుంటే కాస్త అర్థక్లేశం ఉన్నట్టుంది

   తొలగించండి
  2. 🙏

   అదే సార్! బెంగాలీ (పంజాబీ) విష కన్యను కట్టుకుంటే "అర్ధ" క్లేశము, "అర్ధ" హర్షమూ.. ఆ కత్తికి రెండు వైపులా పదునే. పొరిగింటి వారిపై ప్రయోగించినచో హర్షము, మగనిపై అయితే క్లేశము.

   దినదిన గండం నూరేళ్ళాయుషు ;)

   తొలగించండి
 27. కష్టముగల్గినన్ ప్రజలుకాకరవేప కషాయపానము
  ల్లిష్టముతోడద్రావుచుపరిస్థితి భ్రష్టత చేయిదాటసం
  క్లిష్టమునయ్యెజీవితమొకింత విరాగములేకనిస్పృహన్
  పుష్టినిదుష్టినిచ్చునట పుర్వులమందులమ్రింగమేలగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్జీ గారూ,
   మీ పూరణ బాగున్నది అభినందనలు.
   'పానముల్ + ఇష్టము' అన్నపుడు ద్విత్వ లకారం రాదు.

   తొలగించండి
 28. దుష్టులు లాభార్జనకై
  భ్రష్టునుపట్టించినారు పలుధాన్యాలీ
  దుష్టత్వనివారణకిల
  పుష్టినిదుష్టినొసగుగదపురువులమందుల్

  రిప్లయితొలగించండి
 29. సృష్టి సమతులాహారం
  పుష్టిని దుష్టినొసగుగద!పురువులమందుల్
  నిష్టగ చెట్లకు గొట్టగ
  నష్టము మాన్పించు పంటనాణ్యతబెరుగున్

  రిప్లయితొలగించండి
 30. శిష్టజనాళిసంస్తవనశీలకవీశ్వరకందిశంకరా!

  దృష్టి , వధాననిర్వహణఁ దీర్చగఁ, "రేడియొ" కార్యమగ్నతన్,

  స్పష్టము కాక పోయె నపశబ్దము, పూర్వులు పుర్వులైరి చూడుమా!

  పుష్టినిఁ దుష్టి నటఁ బుర్వుల మందులు మ్రింగ మేలగున్.

  కంజర్ల రామాచార్య.
  కోరుట్ల జిల్లా జగిత్యాల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది ధన్యవాదాలు
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. సవరణతో

   శిష్టజనాళిసంస్తవనశీలకవీశ్వరకందిశంకరా!

   దృష్టి , వధాననిర్వహణఁ దీర్చగఁ, "రేడియొ" కార్యమగ్నతన్,

   స్పష్టము కాక పోయె నపశబ్దము, పూర్వులు పుర్వులైరిటుల్

   పుష్టినిఁ దుష్టి నటఁ బుర్వుల మందులు మ్రింగ మేలగున్.

   కంజర్ల రామాచార్య.
   కోరుట్ల జిల్లా జగిత్యాల.

   తొలగించండి
 31. ఇచ్చిన సమస్య కంద పద్య పాదము నా పూరణము సీసములో

  అమెరికా లో పట్ట భద్రుడైన ఒకడు పండుగకు తన గ్రామమునకు వచ్చి తన తండ్రితో మార్కెట్ లో అనేక రకాలైన కాయ కూరలు పండ్లు ఉన్నాయి అవి చాల బలము అవేమి లేకుండా పెరటి లో పెరిగే ఆకు కూరలు తోటి ఏమి ఆరోగ్యము వస్తుంది కాబట్టి కొనుక్కుని అవి తిన వచ్చు గదా అని చెప్పినప్పుడు తండ్రి తన కొడుకుతో మార్కెట్లో లాగా మన పెరటిలో పండు ఆకు కూరల పైన పురుగు మందులు చల్లము సహజ సిద్దమైన ఎరువును (ఆవుపేడ కలిసిన గడ్డి) సహజ సిధమైన పురుగు మందులు (వేప ద్రావణము) వాడుతాను అని ఆకు కూరలు యొక్క ఉపయోగము చెప్పు సందర్భము


  కొతిమేర పైత్యము మితిమీర కుండగ దేహమున్ కాపాడు , తెల్ల తోట
  కూర యినుము సమ కూర్చును, గోంగూర యెముకలకు బలము ప్రముఖముగ ని
  డును,కరివేపాకు ఘన మైనది మధు మేహుల కిoటి లోని మొక్కలకు లేదు
  దోషము,పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద, పురువుల మందుల్ నెపుడు యెరుగము,

  సహజ మగు నావు పేడతో చల్లి నాము
  యెరువులను మడులుగ తీసి, కరిగినట్టి
  వేప ద్రావణము నిడగ, వేరె మందు
  లేల యనె నొక జనకుడు బాలుని గని

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్య కుమార్ గారూ ఛందో వైవిధ్యంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు

   తొలగించండి
 32. ధన్యవాదములు గురువు గారు........తమరి ప్రోత్సాహానికి
  =====
  వందనము కరములు మొగిచి
  కంది గురువులకు, కవీశ వందనమో, నా
  డెందము నింపవె జ్ఞానా
  నందమటంచును మొరలిడె కందములో నే

  రిప్లయితొలగించండి
 33. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల
  మందుల్

  సందర్భము: ఆర్యా! కంది వారూ! మా కిలాంటి సలహా యీయదగునా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఇష్టపడి యీయ దగునే!
  శిష్టులు మీ రనుచు నమ్మి చేరగ సలహా..
  దుష్టులము గాని మా కిటు..
  "పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద
  పురువుల మందుల్"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  30.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీరు విజ్ఞులు కనుక పురుగుల మం దొసగేదేమిటో వివరిస్తారనే ఈ సమస్య నిచ్చాను.
   ప్రశ్నార్థకమైన మీ పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 34. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల
  మందుల్

  సందర్భము: మన మందులు మనకు పుష్టి తుష్టి ఇస్తాయి. పురుగుల మందులు పురుగులకు పుష్టి తుష్టి ఇస్తాయి. వింత యే మున్నది?
  పురుగుల మందులు= పురుగులయొక్క మందులు
  మన మందులు= మనయొక్క మందులు
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఇష్టముగా మన మందులు
  సుష్టుగ దిన్నపుడు మనకు
  సొంపుగ నొసగున్
  పుష్టినిఁ దుష్టిఁ... బురుగులకు
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద
  పురువుల మందుల్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  30.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 35. క్లిష్టమె యయ్యె తామరకు కేలుల నిండుగ పుండ్లు పుట్టగన్
  గష్టమె యైన నేమి యిక గంధక పాదరసమ్ముతోడ నా
  మాస్టరు చేసి యిచ్చునొక మందును మ్రింగక తప్పదయ్యెనే
  పుష్టినిఁ దుష్టినిచ్చునట పుర్వుల మందుల మ్రింగ మేలగున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని గంధకం, పాదరసాలతో చేసే మందు పైపూతకే కాని మ్రింగడానికి పనికిరాదనుకుంటాను.

   తొలగించండి
 36. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల
  మందుల్

  సందర్భము: మీ మాట విని నిజంగానే ఎవరైనా పురుగుల మందు గనుక తిన్నారో! యిక చూడండి తమాషా!
  కంది మాష్టారూ! మా కిలా చెప్పదగునా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  శిష్టులు మీ రని యెవరేన్
  సుష్టుగ తినిరో! తమాష
  చూడుడు.. కందీ
  మాష్టా! రిటు చెప్పదగునె!
  "పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద
  పురువుల మందుల్!"

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  30.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ పూరణలోని చమత్కారం కడుంగడు బాగున్నది. అభినందనలు.
   ఎవరికైనా ఏమైనా జరిగి కేసు పెడితే నాకు దిక్కు మన అడ్వకేటు అనంతకృష్ణ గారే!

   తొలగించండి
 37. పుష్టిగ మందులు జల్లగ
  పుష్టిగ పైరులు పెరుగగ భుక్తి నొసంగున్
  పుష్టిగ పంటలు, ఒంటికి
  పుష్టినిఁదుష్టి నొసఁగుఁగద పురువుల మందుల్!!
  --యెనిశెట్టి గంగా ప్రసాద్
  కామారెడ్డి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గంగాప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పంటలు + ఒంటికి = పంట లొంటికి' అని నిత్యసంధి. విసంధిగా వ్రాయరాదు. "పంటలె యొంటికి" అనండి.

   తొలగించండి
 38. సవరించిన పూరణము
  ---------------------
  సృష్టికి ప్రాణము తరువులు
  నష్టముగా నెంచి నేడు నాశము జేయన్
  కష్టము వేడుక మీరిన
  పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్

  రిప్లయితొలగించండి
 39. ఉత్పలమాల
  ఇష్టము మాకటంచు ప్రజలెం' చెడు' శీతల పానకమ్ములన్
  స్పష్టముగా పరీక్షలవె 'భాగము' నున్నవటంచుఁ దేల్చగన్
  నష్టము జేయు మ్రింగిన ననైతిక మౌనటులిట్లనందురే? 
  పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట 'పుర్వుల మందుల' మ్రింగ మేలగున్
  రిప్లయితొలగించండి