గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2818 సమస్య :: ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్. *శివభక్తులైన ప్రమథులు విష్ణుభక్తి గలవారై నిలువు నామాలను ధరించారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం :: గణపతి నవరాత్రుల సందర్భంగా భూలోకంలో అంతటా పూజలందుకొంటున్న వినాయక స్వామి తొమ్మిది రోజులుగా కైలాసంలో కనిపించలేదట. పార్వతీపరమేశ్వరులు తమ పెద్దకుమారుడైన ఏకదంతుని వెతికి తీసికొనిరమ్మని ప్రమథ గణములను ఆజ్ఞాపించారట. అప్పడు ఆ ప్రమథులు ఆ హేరంబుని కోసం వెతుకుతూ, భూలోకంలో సంచరిస్తూ కడప జిల్లాలో దేవుని కడప అనే పేరుతో ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయమునకు వెళ్లి అక్కడ నిలువు నామాలతో విరాజిల్లుతూ ఉన్న విఘ్నేశ్వరుని కనుగొన్నారు. *దేవునికడప దేవాలయంలో నిలువు నామాల లంబోదరుని నేటికీ మనం దర్శించుకోవచ్చు.* యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః। స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే।।(గీత-3-21) అని అన్నట్లు దేవతాశ్రేష్ఠుడైన గజాననుడు ప్రమాణముగా చూపిన సదాచారమును ప్రమథులు అనుసరించినవారై విష్ణుభక్తితో వేంకటేశ్వర స్వామివారిని సేవిస్తూ తాము కూడా గణనాథుని వలె ఊర్ధ్వపుండ్రములను ధరించినారు అని విశదీకరించే సందర్భం.
అమలత నిత్యమున్ కడప యందలి దేవుని మందిరమ్ములో సుమతిగ నిల్వునామముల శోభిలుచున్న గణేశు గాంచి, భా వము గని, శ్రేష్ఠ మార్గ మని భక్తి భజించుచు వేంకటేశ్వరున్, ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-10-2018)
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== ప్రమథులు విష్ణుభక్తిని దిరంబుగా దాలిచి రూర్ద్వ పుండ్రముల్ ====================== కైలాసంలో నిత్యం శివుడిని సేవిస్తూ ఉండే ప్రమథులు విష్ణుభక్తిని పూని చక్కగా నిలువు నామములను దిద్దు కున్నారని చెప్పటంలో అసంబద్దతె మనకిచట సమస్య. ======================== సమస్యా పూరణం - 284 ===================
"ప్రతి నిత్యం బ్రహ్మ మహేశ్వరుడు మొదలుగా గల దేవతలు శిరస్సులు వంచి నమస్కరించుట చే వారి కిరీటములలోని నవరత్నముల కాంతు లు హారతులు పట్టినట్లుగా తోచే చరణములు గల ఓ వేంకటేశ్వర నిన్ను నేను శరణు జొచ్చితిని"
లింగడైననేమి శ్రీరంగడైననేమి అని ఒక వంక అధ్వైత వాదులు ఘోషించ, మరి ధ్వైత వాది ఈ రీతిగా స్తుతించినాడెందులకో !!!!!
పంచసంస్కృతి అంటే పంచసంస్కారము అనే భావనలో . ఈ వైష్ణవసంప్రదాయపంచసంస్కారములను ఆచార్యుడు ఉపదేశసమయంలో చేస్తాడు. అవి భుజములపై శంఖచక్రచిహ్నధారణ, ద్వాదశోర్ధ్వపుండ్రములు, రామానుజదాసనామము,అష్టాక్షరీమంత్రము, ఆరాధన.
(1)
రిప్లయితొలగించండిశైవ వైష్ణవ చిహ్న భేదావబోధ
లేని యొక మహ్మదీయుఁడు పూని యొక్క
చిత్రమును గీచె నందులో చిత్రముగను
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు.
(2)
అమలిన భక్తితోడను గజాసురుఁ డా శశిమౌళిఁ గుక్షిలో
నమరఁగ నిల్పుకొన్న సమయంబున రుద్రునికై తపించు న
య్యుమకు హితంబు గూర్చఁ గమలోదరు సాయము వేడ నేఁగుచున్
బ్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్.
మహాద్భుతం!
తొలగించండిమా కుటుంబ వ్యవహారం:
రిప్లయితొలగించండిద్రవిడులు నియోగుల వరించ దారుణముగ
మధ్వులయ్యరులను జేర మాట వినక
వైదికులు పెండ్లి యాడగ వైష్ణవులను
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు :)
ప్రభాకర్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముదముగ విబూది రేఖలు, నుదుటిపైన
రిప్లయితొలగించండిపెట్టి రుద్రాక్షలు మెడలో చుట్టి మురిసె
"ప్రమథు లూ.ర్ధ్వపుండ్రములతో వఱలినారు
విష్ణు భక్తులు, యిదియేమి వింత గాదు,
జటిలముగ లేదుగ సమస్య శంకరార్య
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కర్తృపదం ప్రమథులు బహువచనం, క్రియాపదం మురిసె ఏకవచన మయింది. అక్కడ 'మెడ నుంచి శోభ గనిరి। ప్రమథులు...' అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిప్రమథులు శ్రాంతులై నిదుర స్వప్నమునందు రమేశుఁ గాంచుచున్
ప్రముదితులైరి, వారలొక ప్రక్కకు దిర్గి పరుండియుండగా ,
కమలజసూతి వచ్చి , యిది గాంచుచు నిట్లనె వింత జూడుడీ !
ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిప్రమథగణములు బ్రహ్మోత్సవమును గనగ !
తొలగించండిశివవిభూతిని దాల్పక చేరిరంత
తిరుమలను సేవకులు గాంచి తిలకమిడిరి !
ప్రమథులూర్ధ్వపుండ్రములతో వఱలినారు !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిఅడ్డ నామముల శివుని నాడి రమ్మ
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు,
విష్ణు సేవకులు! జిలేబి పేట జనులు
వారి స్వాముల గొల్తురు వరవు గాన!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తే: అడ్డనామాలతోడను హరు భజింప
రిప్లయితొలగించండిప్రమథు, లూర్ధ్వపుండ్రములతో వఱలినారు
హరి సుభక్తులు వైకుంఠ పురమునందు
హరిహరు లభేదమును మది నెరుగలేక
అన్నపరెడ్డి వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడ్డపు విభూతి రేఖల నల దు కౌనిరి
రిప్లయితొలగించండిప్రమధులు ; ఊర్ధ్వ పుంద్ర ము ల తో వర లి నారు
విష్ణు భక్తులు భజన లు వి డు వ కుండ
తన్మయత్వా న నుందురు ధరణీ యందు
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
టైపు దోషాలున్నవి.
రిప్లయితొలగించండిఅమరిరి భక్తి తోడు సయి యండగ గొల్చుచు దేవదేవుడిన్
ప్రమథులు, విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్,
నమరిరి పట్టెదాసరులు నాడుచు పుష్కరనాభుడిన్ ! జిలే
బి,మదిని గొల్వ సేవకులు వెగ్గల మై భళి వెల్గు పున్నెముల్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి"ఎవడురా!నాదు మాత కిరీటమునకు
చేయి జాచినవా"డను చేవ మరిచి
"మేకినిండియ"యని పొలిమేర లిడుచు
ప్రమథు లూర్ధ్వ పుండ్రములతో వరలినారు!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి?
డా. పిట్టా నుండి
తొలగించండిఆర్యా,
ఎ ...ర్*ఈ॥ ,రీ.యతికి నచ్చు ప్రధాన మనరే!దీనికి వివరణ. యివ్వండి.
రి,రీ,రె,రే లకు యతి ఉన్నది. వీటికి ఇ,ఈ,ఎ,ఏ లతో యతి లేదు. ఋకారంతో రీ యతి చెల్లుతుంది.
తొలగించండి
రిప్లయితొలగించండిసభలో వారికి విన్నపాలు
ఈ షడ్జామడ్జ కు టీకా తాత్పర్యము తెలియ జేయ గలరు
షడ్జా మడ్జ కరాడ్జ వీడ్జ వసుధా జలాండ్జ మడ్జాకరే
ఝడ్గద్ కిడ్కి కరాడ్గ రేడ్గ నగనహ్ కడ్జ్యోథ వీడ్య భ్రమహ ।
వీడ్యా లుట్ప్రమ లుట్ప్రయ పద డ్రగ్డగ్ర డగ్డగ్రహ
ఫాదౌట్ప్రేట్ర ప్రటట్ ప్రటరసత్ట్ ప్రఖ్యాత సఖ్యాదయహ ॥
ప్రతి ఒక్కరు దీని వెనుక కత చెప్పి (కాళిదాసు భోజ మహారాజు ) తప్పించు కుంటున్నారు గాని (ఇంక్లూడింగ్ గరికి పాటి వారు ::)
ఈ పద్యానికి అర్థం చెప్పటం లే :)
జిలేబి
మీ రిచ్చిన శ్లోకంలో టైపు దోషాలున్నవి.
తొలగించండిదీని ప్రతిపదార్థాల కోసం నేను ఎంతో ప్రయత్నించాను. దొరకలేదు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండినాడు నా భాషనే వీడ నాంగ్లమునను
వాదనలు జేయ వలసిన వైనమబ్బె
నేడు నుగ్గుపాలను మమ్మి నీడ నిలిచి
ప్రమథులూర్ధ్వ పుండ్రములతో వరలినారు
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రముఖుని భర్గునిం గొలిచి భస్మము సేయువరంబు నొందగన్
రిప్లయితొలగించండితమకము నుండు రక్కసుని ధర్మియె మోహిని రూపుదాల్చియున్
కుమతిని కాల్చి వేయగని కూరిమి తోడను లింగధారులౌ
ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువుగారూ ధన్యవాదములు
తొలగించండిఅమలిన మానసమ్మునను శ్యామ గళున్ భజియించ భక్తితో
రిప్లయితొలగించండినమరుల రక్షకుండు హరి స్వంతమునందున కానుపించ గా
ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్
సుమనమునం దభేదమును సూక్ష్మపు దృష్టిని గాంచి తృప్తితో
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
స్వాతము
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిశివుడు కేశవు డొక్కరే, క్షితిని భేద
రిప్లయితొలగించండిమెంచ రాదంచు విశ్వాస ముంచినట్టి
జనుని స్వప్నంబులో జూడ ననుదినమ్ము
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కేశవునకును,శివునకు లేశమైన
రిప్లయితొలగించండిభేదమేదియు లేదను విషయమొప్ప
ప్రమథులూర్ధ్వ పుండ్రమున వఱలినారు
అమలినంబగు నద్వైత మరసి వారు.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిప్రమథులు విష్ణు భక్తులకు వైరము"కాద"న"నౌ"ననంగ, నా
డమరులు "నడ్డ" "నిల్వు" లని యారడి జేసి ,రనన్య ప్రేముడి
న్నమరిక చాలు; తత్త్వమున కాయువు మూడెను;తీర్థయాత్రలా
శ్రమములు వేడ్కగా దిరిగి రా గల తావులునాయె; నేటికా
ప్రమథులు విష్ణు భక్తిని దిరంబుగ దాలిచి రూర్ధ్వ పుండ్రముల్
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2818
సమస్య :: ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్.
*శివభక్తులైన ప్రమథులు విష్ణుభక్తి గలవారై నిలువు నామాలను ధరించారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: గణపతి నవరాత్రుల సందర్భంగా భూలోకంలో అంతటా పూజలందుకొంటున్న వినాయక స్వామి తొమ్మిది రోజులుగా కైలాసంలో కనిపించలేదట. పార్వతీపరమేశ్వరులు తమ పెద్దకుమారుడైన ఏకదంతుని వెతికి తీసికొనిరమ్మని ప్రమథ గణములను ఆజ్ఞాపించారట. అప్పడు ఆ ప్రమథులు ఆ హేరంబుని కోసం వెతుకుతూ, భూలోకంలో సంచరిస్తూ కడప జిల్లాలో దేవుని కడప అనే పేరుతో ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయమునకు వెళ్లి అక్కడ నిలువు నామాలతో విరాజిల్లుతూ ఉన్న విఘ్నేశ్వరుని కనుగొన్నారు. *దేవునికడప దేవాలయంలో నిలువు నామాల లంబోదరుని నేటికీ మనం దర్శించుకోవచ్చు.*
యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః।
స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే।।(గీత-3-21)
అని అన్నట్లు దేవతాశ్రేష్ఠుడైన గజాననుడు ప్రమాణముగా చూపిన సదాచారమును ప్రమథులు అనుసరించినవారై విష్ణుభక్తితో వేంకటేశ్వర స్వామివారిని సేవిస్తూ తాము కూడా గణనాథుని వలె ఊర్ధ్వపుండ్రములను ధరించినారు అని విశదీకరించే సందర్భం.
అమలత నిత్యమున్ కడప యందలి దేవుని మందిరమ్ములో
సుమతిగ నిల్వునామముల శోభిలుచున్న గణేశు గాంచి, భా
వము గని, శ్రేష్ఠ మార్గ మని భక్తి భజించుచు వేంకటేశ్వరున్,
ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-10-2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
'నిలువు నామాల' లంబోదరుని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు!
శ్రీ గురుభ్యో నమః.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొలువు దీరినట్టి శివుని గొలుచు వారు ;
రిప్లయితొలగించండిపరగ వైకుంఠ వాసుని భక్త జనులు
నిత్య మప్రమేయ నియమ నిష్ఠ తోడ
"ప్రమథు ; లూర్ధ్వపుండ్రములతో వఱలినారు"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
అమలిన భక్తితోడ కడు హర్షము నందుచు నుండి నిత్యమున్
రిప్లయితొలగించండిసమతను జూపి శంకరుని సన్నుత మూర్తిని విష్ణు మూర్తినిన్
క్రమతభజించు నొక్కరుడు కాంచెను స్వప్నము దానిలోన నా
ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ స్వప్న వృత్తాంతపు పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ప్రమథులను గూడి వైకుంఠపథము బట్ట
రిప్లయితొలగించండిశంకరుడు సాయమును గోరి శంక వీడి
ప్రమథు లూర్ధ్వ పుండ్రములతో వరలినారు
చక్కనౌ సమయస్ఫూర్తి చాటుకొనుచు
రవిప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవిక
రిప్లయితొలగించండి----
ఈశుడె భయము నొందగ యసురుని గని;
మోహినిగ రూపు దాల్చి తా మొరగు జేసి
దునుమ భస్మాసురుని హరి; తుష్ఠి నొంది
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వరలినారు!
శ్రీకాంత్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భయము నొందగ నసురుని...' అనండి.
యతి సరి చూడంది మొదటి పాదం లో
తొలగించండినిజమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు.
తొలగించండి"హరుడె భయమును పొందగ నసురుని గని" అంటే సరి.
దేవిక
తొలగించండి----
ధన్యవాదాలు. తప్పు సవరించుకుంటాను.
రిప్లయితొలగించండి(పరమవైష్ణవోత్తముడైన పలనాటి బ్రహ్మనాయని కల )
విశ్వమును విష్ణుమయముగ విశ్వసించు
బ్రహ్మనాయడు శయ్యపై పవ్వళింప
స్వప్నమందు కైలాససంచారులైన
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వరలినారు .
బాపూజీ గారూ,
తొలగించండిబ్రహ్మనాయుని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
దేవిక
రిప్లయితొలగించండి----
వరము నిచ్చిన శూలినె పారు నటుల
జేయ భస్మాసురుడె; హరి చెన్ను మీర
మోహినిగ నసురుని గూల్చె; మోదమునను
ప్రమథు లూర్ధ్వ పుండ్రములతో వరలినారు!
దేవిక గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శివుని జాడ తెలియక, విష్ణువును వేడె
రిప్లయితొలగించండిపార్వతీ మాత, ప్రమథలు; బాగు బాగు
నే వెదికి తెచ్చెదననగానే శివయ్య
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు
బాలకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తెచ్చెద ననగానే ముదమున' అనండి. అన్వయం బాగుంటుంది.
అలాగే గురువు గారు, వందనాలు
తొలగించండి
రిప్లయితొలగించండిహిమగి రులయందు శంభుండు హేలతోడ
నాట్యమాడగ మురిసిరి నంది గూడి
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు"*
విష్ణువును గన భక్తులు వేగ గుడికి.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యద్యపి బహునా ధీషే
రిప్లయితొలగించండితథాపి పఠ పుత్ర వ్యాకరణమ్౹
స్వజన: శ్వజనో మా భూత్
సకలం శకలమ్ సకృత్ శకృత్౹౹
***)()(***
ప్రతి యొక్కరికీ అంతో యింతో వ్యాకరణం తెలియ వలసిన అవసరముంది.లేకపోతే అపార్థాలకు అనర్థాలకు దారి తీసే ప్రమాదముంది.
****)()(****
సకల శాస్త్రాలు కష్టించి చదువ కున్న
వ్యాకరణము కొంతైనను వలయు గాదె?
"యతడు కళ్ళు మూసుకొనె" ననుట మాని
"యతడు కనుమూసె" ననిబల్క నర్థమేమి?
బాగుంది పద్యం. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
తొలగించండిసవరణతో:
తొలగించండియద్యపి బహునా ధీషే
తథాపి పఠ పుత్ర వ్యాకరణమ్౹
స్వజన: శ్వజనో మా భూత్
సకలం శకలమ్ సకృత్ శకృత్౹౹
***)()(***
ప్రతి యొక్కరికీ అంతో యింతో వ్యాకరణం తెలియ వలసిన అవసరముంది.లేకపోతే అపార్థాలకు అనర్థాలకు దారి తీసే ప్రమాదముంది.
****)()(****
సకల శాస్త్రాలు కష్టించి చదువ కున్న
వ్యాకరణము కొంతైనను వలయు గాదె?
"యతడు కళ్ళు మూసుకొనియె" ననుట మాని
"యతడు కనుమూసె" ననిబల్క నర్థమేమి?
హరిహరులనగ నొక్కరే తరచి జూడ
రిప్లయితొలగించండిననుచు గురువులు బలుకగ నాడు నేడు ,
భక్తిముఖ్య మటంచునె బరఁగ దలచి
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
భస్మరేఖాంకితులురుగభలకమందు
రిప్లయితొలగించండిప్రమథులూ,ర్ధ్వపుండ్రములతో వఱలినారు
వేంకటేశుని సేవకువెళ్ళునట్టి
యర్చకులుదమఫాలమధ్యమునతనర
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భస్మరేఖాంకితులు గద భవుని భటులు' అంటే బాగుంటుందేమో?
దేవిక
రిప్లయితొలగించండి----
అర్థ నారీశ్వరుండైన యట్టి శివుని
రాణి పార్వతి విష్ణు స్వరూపిణి యని
దెలిసి మిక్కిలి ముదమున తేజరిల్లి
ప్రమథులూర్థ్వ పుండ్రములతో వరలినారు!
దేవిక గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
ప్రమథులు విష్ణుభక్తిని దిరంబుగా
దాలిచి రూర్ద్వ పుండ్రముల్
======================
కైలాసంలో నిత్యం శివుడిని సేవిస్తూ
ఉండే ప్రమథులు విష్ణుభక్తిని పూని
చక్కగా నిలువు నామములను దిద్దు
కున్నారని చెప్పటంలో అసంబద్దతె
మనకిచట సమస్య.
========================
సమస్యా పూరణం - 284
===================
గద్దనెక్కెడి వాడుగ మీవాడు-
ఎద్దుపై తిరుగాడు మీవోడు
పాముపై పవళించెనుగా చూడు-
బూదిని పూసుకొనె నిన్నా నేడు
గేళి చేసిరన అడ్డనామదారులై-
ప్రమథులు విష్ణుభక్తిని
దిరంబుగ దాలిచి రూర్ద్వ పుండ్రముల్-
హరిభక్తులుగా ముక్తిని
( రూర్ద్వ పుండ్రముల్ = నిలువు నామములు )
====##$##====
14 వ శతాబ్దపు సంస్కృత కవి "ప్రతివాది
భయంకర అన్నంగారాచార్య " గారి విరచితం
వేంకటేశ్వర ప్రపత్తి లోని 9 వ స్తోత్రం
"నిత్య నమద్విధి శివాది కిరీట కోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహాః ప్రరోహైః
నీరాజనావిధి ముదార ముపాద ధానౌ
శ్రీ వేంకటేశ్వర చరణౌ శరణం ప్రపద్యే "
"ప్రతి నిత్యం బ్రహ్మ మహేశ్వరుడు మొదలుగా
గల దేవతలు శిరస్సులు వంచి నమస్కరించుట
చే వారి కిరీటములలోని నవరత్నముల కాంతు
లు హారతులు పట్టినట్లుగా తోచే చరణములు
గల ఓ వేంకటేశ్వర నిన్ను నేను శరణు జొచ్చితిని"
లింగడైననేమి శ్రీరంగడైననేమి అని ఒక వంక
అధ్వైత వాదులు ఘోషించ, మరి ధ్వైత వాది ఈ
రీతిగా స్తుతించినాడెందులకో !!!!!
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం)
__/\__
తొలగించండిపంచసంస్కృతి అంటే పంచసంస్కారము అనే భావనలో .
రిప్లయితొలగించండిఈ వైష్ణవసంప్రదాయపంచసంస్కారములను ఆచార్యుడు ఉపదేశసమయంలో చేస్తాడు.
అవి భుజములపై శంఖచక్రచిహ్నధారణ, ద్వాదశోర్ధ్వపుండ్రములు, రామానుజదాసనామము,అష్టాక్షరీమంత్రము, ఆరాధన.
ప్రముదితవిష్ణుపాదయుగపావనభక్తినిమగ్నచిత్తుడై
క్రమమున నిద్ర నందు కలఁ గాంచె నిరంతరపంచసంస్కృతిన్
భ్రమనొక భక్తుడ, త్తరి, భవాశ్రయభవ్యగణాధిపాదులౌ
ప్రమథులు, విష్ణుభక్తిని దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నలిన జాత్మజులు ముని వరులు మహేశు
రిప్లయితొలగించండిముదమునఁ గొలువఁ గైలాసమున కరుగ స
నక సనంద నాదు, లటఁ దనరి హసించఁ
బ్రమథు, లూర్ధ్వపుండ్రములతో వఱలినారు
[వఱలు = ప్రకాశించు]
ప్రమదము చిత్తమం దలర వైష్ణవు లధ్వర కార్య దక్షులున్
శమ దమ భక్తి భావ రత శాంత గుణవ్రజ దీప్త కాయు లా
విమల చరిత్రు లుత్తములు విప్ర వరేణ్యులు పంచ జీవ కం
ప్ర మథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వ పుండ్రముల్
[మథి = వాయువు (చలించునది)]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఅమలినభక్తితోడనసదాశివుగొల్తురుమూడుప్రొద్దులన్
రిప్లయితొలగించండిబ్రమధులు,విష్ణుభక్తినిదిరంబుగదాలిచిరూర్ధ్వపుండ్రముల్
గ్రమమునుదప్పకుండగనుగంజదళాక్షునిసేవజేతకై
విమలపుమానసంబుననవిష్ణునినామముసంస్మరించుచున్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భక్తితోడను..మానసంబునను...' అనండి.
చక్రి చెల్లినరయ రాగ సంతసమున
రిప్లయితొలగించండిప్రమథు లూర్ధ్వ పుండ్రములతో వఱలినారు
వేల్పులకులేని హరిహర భేదమేల
పుడమినందిన్ని నాళ్ళుగ పొసగు చుండె
వఱలు=ప్రకాశించు, ప్రవర్తిల్లు
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
కుములుచు పెండ్లి యాడుటకు కుందుచు తాళక బ్రహ్మచర్యముల్
విమల మనమ్ము తోడను తపించుచు శాఖను వీడకుండ తాం
రమణుల నాంధ్ర దేశమున లావుగ రోయగ కానరానిచో...
ప్రమథులు విష్ణుభక్తినిఁ దిరంబుగఁ దాలిచి రూర్ధ్వపుండ్రముల్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తాం'...?
తాం = తాము
తొలగించండిఆంధ్రభారతి
'తాం' అన్నదానికి కేవలం తెలంగాణా మాండలిక కోశంలో 'స్నానము' అన్న అర్థం ఉన్నది. ఆ తరువాత 'తాము' అన్నదానికే అర్థాలున్నవి.
తొలగించండిఓ! నేను తప్పుగా అర్థం చేసుకొన్నాను సార్!
తొలగించండి"తాం" కు బదులుగా "తా" అంటే సరియేమో?
భవుడు రుద్రుడైచెలగంగభయము గలుగ
రిప్లయితొలగించండిపరుగులెత్తెదేవేంద్రుడువరుస మరచి
అతిధు లందరుతమతమ అదుపు దప్ప
ప్రమధులూర్ధ్వపుండ్రములతోవరలి నారు
కొరుప్రోలు రాధాకృష్ణారావు
రాధాకృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరిహరులకు నభేదమె యరయు వారు
రిప్లయితొలగించండినిశ్చలమగు మదిని బహు నిష్ఠ తోడ
విష్ణు దేవుని చెంతకు వెడలి నపుడు
ప్రమథు లూర్ధ్వపుండ్రములతో వఱలినారు"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరిహరులొకటే యంచు తా నవని దెలుప
రిప్లయితొలగించండిహరిని భక్తిగ బూజించు హరుని గాంచి
స్వామి పథమందు జరియింప భక్తి తోడ
ప్రమథు లూర్థ్వ పుండ్రములతో వఱలి నారు.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
ప్రమథు లూర్ధ్వ పుండ్రములతో
వఱలినారు
సందర్భము: సంభాషణం
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"ఎనయ వైష్ణవుల్ శైవుల నేమి యనిరి?"
"అడ్డ నామాలతో వార లలరినారు."
"ప్రేమతో వైష్ణవుల గూర్చి యేమి అనిరి
ప్రమథు" "లూర్ధ్వ పుండ్రములతో
వఱలినారు."
✒~డా.వెలుదండ సత్యనారాయణ
15.10.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అమరశిల్పి జక్కణగుడి హరిహరందు
రిప్లయితొలగించండిహరిహరులబేధమేమియు వరలనీక
గట్ట?#శిల్పియుకల్పన గమనమందు
ప్రమథు లూర్థ్వపుండ్రములతోవరలినారు!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హరిహరందు'...?
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
శివదర్శనార్ధము మాధవుడు కైలాసమునకు వచ్చు
సందర్భమున స్వాగతించు ప్రమథులు =
. . . . . . . . . . . . .. . . . . . .. . . . . . . ...
అమల చరిత్రు డచ్యుతుడు నంబుజనాభుడు శౌరి శ్రీధవుం
డమర గణాభివంద్యుడు హిమాద్రికి రాగ :-- హరిన్ స్తుతించుచున్
ప్రమథులు విష్ణుభక్తిని దిరంబుగ దాలిచి రూర్ద్వపుండ్రముల్ |
సుమశరవైరి భాషిలెను లోఁగొనుచున్ మృదుభాషితమ్ములన్ |
( లోఁగొనుచు = లోపలికి తీసుకొని పోయి సత్కరించు )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
ప్రమథు లూర్ధ్వ పుండ్రములతో
వఱలినారు
సందర్భము: ప్రమథులు విభూతి రేఖలతో మెరిసిపోయారు. విష్ణు భక్తు లేమో ఊర్థ్వపుండ్రాలతో వెలిగిపోయారు.
ఏ గుర్తులూ లేనివారు బ్రాహ్మిని అనగా బ్రహ్మ యొక్క దేవేరిని, సరస్వతిని సేవించేవారు..(అనగా సారస్వత ప్రియులు).
వారు గుర్తుల కతీతులు. వ్రాతలందు కూడ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
భస్మ ధారులై మెరిసిరి ప్రమథు.. లూర్ధ్వ
పుండ్రములతో వఱలినారు పొసగ విష్ణు
భక్తు.. లీ గుర్తు లవి యేవి? బ్రాహ్మిఁ గొలుచు
వా రతీతు.. లతీతులు వ్రాతలందు..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
15.10.18
-----------------------------------------------------------