నేడు “”మీటూ” ఉద్యమములో చేసిన పోరుకు ఒక మంత్రి పదవి కోల్పోయినాడు అట్టి తెగింపు గల మగువల (మగడు = రాజు లేక అధిపతి) వారిని కోర్టు ద్వారముల వద్ద నిలిపిన ఘనత కు జేజే అను భావన
వెగటు పనులతో నిత్యము మగువలనేడ్పిoచుచుండు మంత్రుల గుట్టున్ వగచక మీటూ యని నా
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ======================= మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మా జోతలం బొందుమా ======================== మగడిని ఇంట్లోకి రానివ్వక వాకిట్లోనే ఆపిన ధైర్యశాలి ఓ కాంతామణి నీకు మా అభినందనలను, నమస్కారము లను అందచేస్తున్నాము అందుకొను- మనుటలో వైపరీత్యమే సమస్య ========================= సమస్యా పూరణం - 288 ===================
ముదిమిని అసహాయులు వారు - నేనుండ అనాథలు కానే కారు జన్మనిచ్చిన దాతలు వీరు - వీరిని మించిన దేవతలు లేరు వెంట తెచ్చె వారిని కొడుకై - తలప వారికెవరు లేరందుమా మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా - మా జోతలం బొందుమా
====##$##====
" రెక్కలు నీవవి ఆడిన తరుణం నీ పరివారము నీకై శరణం ముదిమి భారమై కదలని దేహం నాయను వారిలో కరిగిన మోహం "
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2822 సమస్య:: మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా! మా జోతలం బొందుమా. *భర్తను వాకిటిలోనే నిలబెట్టే భార్యామణీ! మా నమస్కారాలను అందుకో* అని వేడుకొనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం. సందర్భం :: ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల మధ్య కూడా గిల్లి కజ్జాలు చోటుచేసికొన్నాయని ఒక కవి ఒక సంస్కృతశ్లోకంలో చమత్కరించాడు. ఆ శ్లోకం ఇదే.
కస్వం? శూలీ, మృగయ భిషజం, నీలకంఠః ప్రియేఽహం, కేకా మేకాం కురు, పశుపతిః, నైవ దృశ్యే విషాణే।। స్థాణు ర్ముగ్ధే! న వదతి తరుః, జీవితేశః శివాయాః, గచ్ఛాటవ్యా మితి హత వచః పాతు వ శ్చంద్రచూడః।। శివుడు ఆలస్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టి “ఓ ప్రియా! తలుపు తీయి. నేను శూలిని” అన్నాడట. ఆలస్యానికి అలిగిన పార్వతి శూల అంటే రోగ విశేషము అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే నీవు వైద్యుని వెదుకుతూ వెళ్లు”అన్నదట. “నేను నీలకంఠుడిని” అని అని శివుడు అంటే, నెమలి అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే నెమలి లాగా ఒక కేక పెట్టు” అని అన్నదట. “నేను పశుపతిని” అని శివుడు అంటే ఎద్దు అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే నీకు కొమ్ములు కనబడటం లేదే” అని అన్నదట. “నేను స్థాణువును” అని శివుడు అంటే కదలకుండా ఉండే చెట్టు అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే “చెట్టు మాట్లాడదు కదా” అని అన్నదట. “నేను శివ యొక్క భర్తను” అని శివుడు అంటే నక్క అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే అడవిలోకి పో” అని చమత్కారంగా మాట్లాడిందట. ఇంట్లోకి రానీయకుండా కొంతసేపు వాకిట్లోనే మగని నిలబెట్టిన ఓఅర్ధనారీశ్వరీ! మా నమస్కారములను అందుకొని అమ్మవై మమ్ము సర్వదా కాపాడు అని జగదంబను ప్రార్థించే సందర్భం. పైన ఉదహరించిన శ్లోకమునకు నా అనువాద పద్య పూరణ.
మగువా! శూలిని, వైద్యునిన్ వెదుక బొమ్మా, నీలకంఠుండ నే, సుగతిన్ కేకను వేయుమా, పశుపతిన్, సొంపారు శృంగాల నే ను గనన్, స్థాణువు నే, తరుల్ పలుకనౌనో? నే శివా నాథుడన్, నగజాతా! యటవీస్థలిన్ దిరుగుమా నాతో పనేమంచు నీ మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా! మా జోతలం బొందుమా. కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (21-10-2018)
పగవారిని నెన్నికలను
రిప్లయితొలగించండిజగనుడు నోడించి నీదు సఖుడై రాగా
తగురీతి హారతి నిడగ
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే!
ఎన్నికలలో
తొలగించండి😄👏🏻🙏🏻🌹
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅగజానన! కొమరుని నిలి
పి గట్టి గన్వాకిట, భళి పింగేక్షణుడిన్
రగులుకొనచేసితివటా!
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే!
జిలేబి
👌🏻👏🏻🙏🏻🌹
తొలగించండిజిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చేసితి వకట' అంటే బాగుంటుందేమో? 'అట' దీర్ఘాంతం కాదనుకుంటాను.
సగభాగము నిచ్చితిగద
రిప్లయితొలగించండివగపేటికి విరహ మేల వనితా నిజమే
పగబూనుచు దరి జేరక
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పగ బూనకు మని వేడిన' అంటే అన్వయం బాగుంటుందేమో?
సగభాగము నిచ్చితిగద
తొలగించండివగపేటికి విరహ మేల వనితా నిజమే
పగబూ నకుమని వేడిన
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే
అగణితదుర్భావంబున
రిప్లయితొలగించండివగనిడ నట జేరినట్టి వానిని ఖలునిన్
తెగ నరుక బూని దలచుచు
మగనిన్, వాకిటనె నిల్పు మగువా జేజే"
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కం॥
రిప్లయితొలగించండితగనట్టి చెలిమి సేయుచు
భుగభుగమని పొంగు మద్యమునుగ్రోలంగా
మిగిలినదింటికి తేగా
మగనిన్ వాకిటనె నిలుపు మగువా జేజే.
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తేగా'కు బదులు 'తెచ్చిన' అనండి.
తగురీతి నతిథివర్యుని
రిప్లయితొలగించండినగణిత సద్భక్తితోడ నాహ్వానించన్
సుగుణాన్వితుడై వెలిగెడి
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే.
తగురీతి నతిథిదేవుని
తొలగించండిసత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పగవారిని యాహవమున
రిప్లయితొలగించండిమగధీరుని వలెనె దునిమి మరలియు రాగా
తగురీతిని హారతి నిడ
"మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పగవారిని నాహవమున' అనండి.
మగువయు మాంచాలాంబయు
రిప్లయితొలగించండితెగనాడెను పతినిఁజూచి,ఢీరత్వంబున్
సుగుణమతిఁజూపవేమని--
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జే జే.
ధీరత్వంబున్ అని 2వ పాదం చదువ ప్రార్థన
తొలగించండిప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండినేడు “”మీటూ” ఉద్యమములో చేసిన పోరుకు ఒక మంత్రి పదవి కోల్పోయినాడు అట్టి తెగింపు గల మగువల (మగడు = రాజు లేక అధిపతి) వారిని కోర్టు ద్వారముల వద్ద నిలిపిన ఘనత కు జేజే అను భావన
రిప్లయితొలగించండివెగటు పనులతో నిత్యము
మగువలనేడ్పిoచుచుండు మంత్రుల గుట్టున్
వగచక మీటూ యని నా
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే"
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...యని యా...' అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసిగలో దాల్పితి పారిజాతమును నిస్సిగ్గౌ గతిన్ , నల్వురిన్
నగుబాటయ్యెను జీవితంబు , నిను నే నమ్మన్, మదిన్ నీవుగా
పొగలన్ రేపితి , గోపబాల ! యిక పో పొమ్మంచు రోషమ్మునన్
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మా జోతలం బొందుమా !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
నిస్సిగ్గు.. పదం.. నిస్సిగ్గుగానే ప్రయోగించితిని😊🙏
తొలగించండిమైలవరపు మురళీకృష్ణ
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజై మురళీకృష్ణా!
రిప్లయితొలగించండితగనా పుష్పముఁ బొందగ
తగునా నీకిటుల కృష్ణ! తాపము బెంచన్!
తగని పనియె చేసితివని
*"మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే"*
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గగనం బందున నుండిశం కరుని యాకాపా లివేషం బునన్
రిప్లయితొలగించండివెగటున్ గాంచుచు రోషమం దునను నావేగం బునేపట్ట గన్
పగలే కుండిన చాలునో యనుచు భావానం దమున్ మోహమున్
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మాజోతలం బొందుమా
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొంత అన్వయలోప మున్నది.
వెగటుం బుట్టగఁ జేయు చేష్టలవి, ద్వంద్వీభూతదుష్టార్థవా
రిప్లయితొలగించండిగ్ప్రగుణీభూతమనోవికారకటువక్త్రాంతఃప్రతీయమ్ము , మెం
డుగఁ దోపన్, దగు నట్టి దుర్మతిని " మీ టూ " వేది తోడ్పాటునన్
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా! మా జ్యోతలం బొందుమా!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శిగతరిగి యిల్లుజేరిన
రిప్లయితొలగించండిసొగసులఖని తానమాడ చొప్పడకున్నన్
తగునా లోనికనుచు తన
మగనిన్ వాకిటనె నిల్పుమగువాజేజే
పగతోశత్రువు ప్రక్కలోనసిగ విధ్వంసంబుసృష్టింపగా
తొలగించండినగుచున్ చోద్యముచూచుచుండ బ్రజలానందింతురే నేతలన్ మగవారాతరుముండటంచనరె యామంత్రాంగముందెప్పరే
మగనిన్ వాకిటనిల్పునట్టిమగువామాజోతలంబొందుమా
శంకర్ జీ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
అగణిత సద్గుణ రాశిగ
రిప్లయితొలగించండినగు పించెడు దేవుడ ను చు న ర్మిలి సతమున్
సుగతిని బూజిoప దలచి
మగ నిన్ వాకిట ను నిల్పు మగువా జేజే
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
( రణరంగం నుండి యింటికి వచ్చిన ఖడ్గతిక్కనకు
రిప్లయితొలగించండిభార్య చానమ్మ చేసిన మర్యాద )
అగణితమగు శ్రమ దిక్కన
పగతుల విడి యిలు నురుకున పరుగున జేరన్
వగచి పసుపు మంచములిడి
మగనిన్ వాకిటనె నిల్పు మగువా ! జేజే !
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
మగడట భోగపు వాడల
రిప్లయితొలగించండిబుగులన్నది లేక తిరిగి మోహము మీరన్
స్థగికను తనతో తెచ్చిన
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
=======================
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా
మా జోతలం బొందుమా
========================
మగడిని ఇంట్లోకి రానివ్వక వాకిట్లోనే
ఆపిన ధైర్యశాలి ఓ కాంతామణి నీకు
మా అభినందనలను, నమస్కారము
లను అందచేస్తున్నాము అందుకొను-
మనుటలో వైపరీత్యమే సమస్య
=========================
సమస్యా పూరణం - 288
===================
ముదిమిని అసహాయులు వారు -
నేనుండ అనాథలు కానే కారు
జన్మనిచ్చిన దాతలు వీరు -
వీరిని మించిన దేవతలు లేరు
వెంట తెచ్చె వారిని కొడుకై -
తలప వారికెవరు లేరందుమా
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా -
మా జోతలం బొందుమా
====##$##====
" రెక్కలు నీవవి ఆడిన తరుణం
నీ పరివారము నీకై శరణం
ముదిమి భారమై కదలని దేహం
నాయను వారిలో కరిగిన మోహం "
( భజగోవిందమ్ - 5 / 31 )
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం)
_/\_
తొలగించండిగురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించండిజగతిన సుందర సత్యము
మగసిరి మమతల మధురిమ మనసున జయహో
కనుడీ సరాగ వలపుల
మగనిన్ వాకిటనె నిల్పుమగువాజేజే
వెంకట నారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జగతిని' అనండి.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2822
సమస్య:: మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా! మా జోతలం బొందుమా.
*భర్తను వాకిటిలోనే నిలబెట్టే భార్యామణీ! మా నమస్కారాలను అందుకో* అని వేడుకొనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన విషయం.
సందర్భం :: ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల మధ్య కూడా గిల్లి కజ్జాలు చోటుచేసికొన్నాయని ఒక కవి ఒక సంస్కృతశ్లోకంలో చమత్కరించాడు. ఆ శ్లోకం ఇదే.
కస్వం? శూలీ, మృగయ భిషజం, నీలకంఠః ప్రియేఽహం,
కేకా మేకాం కురు, పశుపతిః, నైవ దృశ్యే విషాణే।।
స్థాణు ర్ముగ్ధే! న వదతి తరుః, జీవితేశః శివాయాః,
గచ్ఛాటవ్యా మితి హత వచః పాతు వ శ్చంద్రచూడః।।
శివుడు ఆలస్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టి “ఓ ప్రియా! తలుపు తీయి. నేను శూలిని” అన్నాడట. ఆలస్యానికి అలిగిన పార్వతి శూల అంటే రోగ విశేషము అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే నీవు వైద్యుని వెదుకుతూ వెళ్లు”అన్నదట. “నేను నీలకంఠుడిని” అని అని శివుడు అంటే, నెమలి అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే నెమలి లాగా ఒక కేక పెట్టు” అని అన్నదట. “నేను పశుపతిని” అని శివుడు అంటే ఎద్దు అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే నీకు కొమ్ములు కనబడటం లేదే” అని అన్నదట. “నేను స్థాణువును” అని శివుడు అంటే కదలకుండా ఉండే చెట్టు అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే “చెట్టు మాట్లాడదు కదా” అని అన్నదట. “నేను శివ యొక్క భర్తను” అని శివుడు అంటే నక్క అని అర్థం చేసికొన్నానంటూ “అలా ఐతే అడవిలోకి పో” అని చమత్కారంగా మాట్లాడిందట.
ఇంట్లోకి రానీయకుండా కొంతసేపు వాకిట్లోనే మగని నిలబెట్టిన ఓఅర్ధనారీశ్వరీ! మా నమస్కారములను అందుకొని అమ్మవై మమ్ము సర్వదా కాపాడు అని జగదంబను ప్రార్థించే సందర్భం.
పైన ఉదహరించిన శ్లోకమునకు నా అనువాద పద్య పూరణ.
మగువా! శూలిని, వైద్యునిన్ వెదుక బొమ్మా, నీలకంఠుండ నే,
సుగతిన్ కేకను వేయుమా, పశుపతిన్, సొంపారు శృంగాల నే
ను గనన్, స్థాణువు నే, తరుల్ పలుకనౌనో? నే శివా నాథుడన్,
నగజాతా! యటవీస్థలిన్ దిరుగుమా నాతో పనేమంచు నీ
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా! మా జోతలం బొందుమా.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (21-10-2018)
అద్భుతం!
తొలగించండిగురువర్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారూ! హృదయపూర్వక ప్రణామాలండీ.
తొలగించండిరాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అత్యద్భుతంగా ఉన్నది. అభినందనలు.
అవధాని గారు సమస్య కు తగిన సంస్కృత శ్లోకం పరిచయం చేయడం నా లాంటి వారికి మార్గ దర్శనమవుతు౦ది.మీకు హృదయ పూర్వక అభినందలు.
తొలగించండితెగత్రాగి యర్ధరాతిరి
రిప్లయితొలగించండిమొగసాలను జారిపడిన "మొగుడిని" గనుచున్
మొగమున తలుపును వేయుచు
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే!
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అర్థరాతిరి' దుష్టసమాసం. "నడిమి రాతిరి" అనండి.
మాస్టరుగారూ!ధన్యవాదములు.
తొలగించండితెగత్రాగి నడిమిరాతిరి
మొగసాలను జారిపడిన "మొగుడిని" గనుచున్
మొగమున తలుపును వేయుచు
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే!
సగభాగము తిట్టొద్దని
రిప్లయితొలగించండివగవగవడివడిపరుగిడివనితావడిలో
మగటిమిజూపగవెడలిన
మగనిన్ వాకిటనెనిల్పుమగువాజేజే
శంకర్జీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వనితా వడిలో' అన్నది దుష్టసమాసం. ఒడిని వడి అనరాదు. "వనిత యొడిని తా। మగటిమి..." అనండి.
నగరపుసంచారమునకు
రిప్లయితొలగించండినగజాధీశుండురాగనమ్రతయెపుడున్
దగువిధమగునర్చనకై
మగనిన్ వాకిటనెనిల్పుమగువాజేజే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జగమెఱిఁగిన కవికోవిదుఁ
రిప్లయితొలగించండిమగనాల, సమస్య నిడి సమాధానముగా
తగు పూరణ చేయువరకు
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జే జే !
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కోవిదు' తర్వాత అరసున్న ఎందుకు?
గురువర్యులకునమస్సులు."అరసున్న" టైపింగ్ లో దొర్లిన పొరపాటు.మన్నింప వలెను.ధన్యవాదములు.
తొలగించండిపగలు సనఁగ తెగువ మిగిలి
రిప్లయితొలగించండితగులమ్మునఁ బేక గములఁ దగిలి వెగటుగం
దెగ వాఁగు వాఁడు మగఁడే
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే
[నిల్పు = నిల్పుము]
ఒకఁడు తన మిత్రునితో నన్న మాటలు:
తగునే నీ కిట భార్యనుం దెగడ మిత్రా యల్కతో నవ్వ దా
వగలం జూపుచు నెత్తి మొట్టుచు సురాపానంబు మాన్పింపగన్
నగ రాజాత్మజ సేవన ప్రభల నే నారీ లలామంబు ప్రే
మగ నిన్ వాకిట నిల్పు నట్టి మగువా మా జోతలం బొందుమా
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిశంకరాభరణం!! 21, అక్టోబర్ 2018, ....సమస్య::
రిప్లయితొలగించండిమగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే
**** **** **** *** *** **** ****
కం:
తగని పనులను పొగరుగన్
తెగ జేసిన నూరుకోక ధీరత్వముతో
డ గృహమ్మున కేగెడు తన
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే
🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷వనపర్తి🌷
శాంతిభూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఊరుకొనక' అనండి.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
ఖగమున్ పైనము జేయుచున్ సుధను కంగారొందుచున్ మోయగా
ఖగనాథుండిని పట్టు వీడి భుగభుగ్గగ్గంచు భూమిన్ పడన్
పొగచెట్టౌచును బీడినివ్వగను నీ పోట్గాడు త్రాగంగ నా
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మా జోతలం బొందుమా!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఖగనాథుండిని'...?
ఖగపతి = ఖగనాథుడు
తొలగించండిఅవడా?
(గణాయాస కిట్టింపు)
పగతురతో పోరాడక
రిప్లయితొలగించండిదిగులున పరుగెత్తి ఖడ్గ తిక్కన రాగా
రగులించగ శౌర్యము తన
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే
నిన్నటి సమస్యకు నా పూరణ
నవమియొ దశమియొ యెరుగక
వివిధములగు సందియములు విప్రులుదెలుప
న్నవగతము గాని జనులకు
నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పగవాండ్రన్ గని పారివచ్చితివి సంభావింపగా నింటిలో
రిప్లయితొలగించండిముగురాడంగుల మైతిమింక నదిగో ముత్తైదువల్ దాల్చెడిన్
తగునేనీకు హరిద్రమంచు సతియా దాసమ్మయే యిచ్చుచున్
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువామా జోతులం బొందుమా.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కం॥
రిప్లయితొలగించండినగరమునకు తోడ్కొని నిను
నగలను కొనిపించెదనని నమ్మబలికి నీ
మగడే మాటను దప్పెను
మగనిన్ వాకిటనె నిలిపు మగువా జేజే.
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెగఁద్రాగి వీధులందున
రిప్లయితొలగించండితగవులతోపరులతోడ తన్నులు తినుచున్
సెగ రగిలించగ మదిలో
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జేజే
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తగదని సారాద్రాగుట
రిప్లయితొలగించండిసిగపూలను దెమ్మటంచు శ్రీమతిదెలుపన్
అగుపడ రాత్రికి సారా
మగనిన్ వాకిటనెనిల్పె!మగువాజేజే!
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మగడా!యేమిది,ద్రాగితీవిపుడయిమ్మద్యంపునీళ్ళన్భళా
రిప్లయితొలగించండితగునా!చెప్పుమయంచునాలలనచిత్తంబాగ్రహోదగ్రయై
నగుబాటుంగదెయారయన్మనకుసన్మానింతునిన్నంచుదా
మగనిన్వాకిటనిల్పునట్టిమగువామాజోతలంబొందుమా
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా
మా జోతలం బొందుమా!
సందర్భము: జగత్పతియైన భగవంతుడు వరా లీయడానికి దిగివచ్చినా "బండలు తుడుస్తున్నాను కాసేపు బయట నిలబడండి.." అంటుంది అతి శుభ్రత పాటించే మా శ్రీ మతి.
నన్ను (పతి దేవుణ్ణి) మాత్రం బయట నిలబెట్టదా! అందులో వింత యే మున్నది?
(అదే మాట భర్త భార్యతో అంటున్నాడు.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~
భగవంతుం డరుదెంచినన్ దపనతో
"బండల్ నిమేషంబులో
దగ శుభ్రం బొనరింతు.. నట్లె బయటన్
దండ్రీ! దయన్ నిల్చి యుం
డ గదే!" యన్ గృహిణీమతల్లి, విక విం
తా యేమి? నీ విట్లు నన్,
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా!
మా జోతలం బొందుమా!
✒~డా.వెలుదండ సత్యనారాయణ
21.10.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దేవిక
రిప్లయితొలగించండి-----
పగవాడై మహదేవుడే పరిహసింపంగాను రోషంబుతో
న్మొగి జూపంగను ధిక్కరించి సమరమ్మున్ జేసి రుద్రమ్మ పా
రగ జేయన్ దెసలన్నిటన్ తరిమెగా! రాజస్వమున్ గట్టు నా
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మాజోతలం బొందుమా!
రాజస్వము=ప్రభుత్వానికి చెల్లించే పన్ను
నా ప్రయత్నం :
రిప్లయితొలగించండికందం
మగువే గా మగ వాడికి
తగెడు మధురభావన యన దాంపత్యమునన్
బిగి సడలించక సంధ్యన్
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జే! జే! !
మత్తేభవిక్రీడితము
తగఁ గార్యంబుల దాసియై, కరణమందై మంత్రిగన్, భుక్తి మా
తగ, శయ్యన్ గన రంభ, రూపమునఁ బద్మన్ బోలి, క్ష్మా యై క్షమన్
ప్రగతిన్ గూర్చగ భార్యగన్ గొలువు పూర్తౌ తక్షణమ్మే వడిన్
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మా జోతలం బొందుమా
దేవిక
రిప్లయితొలగించండి----
నిన్నటి పూరణ:
————————————
నవరాత్రోత్సవముల్ గనంగ బిలిచెన్ రమ్మంచు స్నేహార్ద్రత
న్నవనీతమ్మగు వాక్కు తోడ చెలి; నేనత్యంతవశ్యంబుగా
గ విలంబంబొనరించి చేర;కినుకన్ గాంచుచు తా నిట్లనెన్
నవరాత్రోత్సవముల్ గణింపగ దగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితగవున్ రాయలసీమలోన చని నిర్దాక్షిణ్యమౌ పద్ధతిన్
రిప్లయితొలగించండిపగవానిన్ తెగటార్చకుండ పతిరాన్ వాసమ్ముకున్ భీతుడై,
రగులన్ మానసమందుబాధ పతిధీరత్వమ్మునిందించుచున్
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మా జోతలం బొందుమా
(రాయలసీమలో కొంతమంది మగువల అభిప్రాయం)
కందం
రిప్లయితొలగించండిప్రగతిన్ షట్కర్మల గూ
ర్చఁగ కొలువది ముగిసినంత సతి సాన్నిధ్య
మ్ముఁ గలుగ సాయంసంధ్యన్
మగనిన్ వాకిటనె నిల్పు మగువా జే! జే!!
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిపగలే భక్తుల రాకతో తిరుమలన్ భాసిల్లి సాయంత్రమై
చిగురుల్ వేసిన కోరికల్ జెలగుచున్ శృంగారభావమ్ములై
మగతన్ వీడుచు నర్ధరాత్రి నలివేల్ మంగాపురంబందునన్
మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా మా జోతలం బొందుమా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి