Continuing our previous discussion in Sankarabharanam:
HYDERABAD: For the first time, two native words of the State- Bathukamma and Bonalu - which are related to Telangana culture and tradition - are all set to be included in the Oxford English Dictionary (OED). Oxford University Press (OUP) has decided to consider these words for drafting for the next edition of dictionary.
It may be recalled that the Oxford English Dictionary has added several south Indian words in its previous editions. They are lungi, vada, dosa, puri, panchayat, anna, gulab jamun, abba(appa), Devi, mirch masala and others. Telangana Jagruthi has been trying for the cultural renaissance of Telangana, when the state was formed.
High time Telugu nighantukarulu poets, pundits come out of the shell and embrace in their literature ( especially traditional poetry styles ) to accept and take forward inclusion principle.
A language that doesnot flow with the time for sure will die and gets only an utopian status.
Hope Telugu or for that matter any of the Indian languages do not get into that drainage.
డా. పిట్టా సత్యనారాయణ ఈ సందర్భంగా నొక సత్యమును జెప్పుట ఆత్మ శ్లాఘమనుకొనకున్న ,నేను తెలంగాణా జాతీయము(Idioms)లను,133ని యెన్నుకొని వాటిని ఆంగ్లం లోనికి మార్చి వివరణతో నొక పుస్తకమును ప్రచురించినాను."Telangana Native Idioms in English"
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2830 గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం సమస్య :: ముదిత నపుంసకున్ గలసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్? *ఒక స్త్రీ నపుంసకునితో కలసి పుత్రుని పొందడం చిత్రమైన విషయం ఏమీ కాదుగదా* అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: జాతరలో బిడ్డ తప్పిపోయి అల్లాడుతున్న తల్లిని జూచిన పెద్దలు “అమ్మా! భయపడవద్దు. ఇక్కడికి దగ్గఱలో ఒక నపుంసకుడు ఉన్నాడు. అతడు చాలా మహిమ గలవాడు. భూత భవిష్యద్వర్తమానములు తెలిసినవాడు. జోస్యం కూడా చెబుతూ ఉంటాడు. నీవు నీ కుమారుని పొందేందుకు అతడు తగిన దారిని చూపించగలడు. అతని దగ్గఱకు వెళ్లు అని చెప్పినారు. వెంటనే ఆ తల్లి అతని దగ్గఱకు వెళ్లింది. ఆమె ఆ నపుంసకుని కలసి మాట్లాడి అతడు చెప్పినట్లు చేసింది. తప్పిపోయిన తన కుమారుని తిరిగి పొందింది. ఇందులో చిత్రమైన విషయం ఏముంది? అని విశదీకరించే సందర్భం.
“అదరకుమా నపుంసకుడటంచు., గనుంగొన నౌను పుత్రునిన్ , పద మహిమాన్వితుం డతడు బాగుగ జెప్పును జోస్యమిట్లు దా... రిది యని” యంచు పెద్ద లన నేగెను తల్లి సుతున్ గనంగ, నా ముదిత నపుంసకున్ గలసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్? (శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారికి ధన్యవాదాలతో) కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (29-10-2018)
ఒకడు భారతము పూర్తిగా చదవ కుండా అభిమన్యుడు అర్జునుని పుత్రుడని తెలుసుకొని తనకున్న జ్ఞానముతో అర్జునుడు పూర్తిగా నపుంసకుడు అని తలచి పేడికి కుడా పుత్రులు పుడుతారు అన్న విషయము మీద పరిశోధన చేయతలచి ఆ విషయము తండ్రితో చెప్పగా ఆప్పుడు అర్జునుడు జన్మతః పేడి కాడు ఆతను శాపవశమున కొంత కాలము మాత్రమే పేడి అయినాడు అతనికి నలుగురు సంతానము అని ఒక తండ్రి తన కొడుకుతో చెప్పు సందర్భము
ఇక్కడ కనిపించిన ఒకరి "గణముల వరుస స్థిరము గావున ఒక్కొక్క వృత్తమునకు ఒకే నడక" అన్న అభిప్రాయం అంత సమంజసం కాదని అనుకుంటున్నాను. గణక్రమం ఒకటే ఐనప్పటికీ, పదసముదాయాలు ఎలా విరుగుతున్నాయి అన్నదాన్ని బట్టీ, పద్యం యొక్క రీతి, శయ్య, పాకం అంటి అనేక ఇతరవిషయాల పైన పద్యం నడక ఆధారపడి ఉంటుంది. ఇదేమీ నేను క్రొత్తగా లేవనెత్తుతున్న సిధ్ధాంతం కాదు.
అలాగే "కానీ అన్ని గణములూ నాలుగు మాత్రలలో నుండవలెను గాన అన్ని కందములకూ ఒకే మధురమైన తీరు" అన్నది కూడా అంతసముచితంగా అనిపించటం లేదు. అన్నీ చతుర్మాత్రాగణాలైనా సరే ప్రతినాలుగు మాత్రలపైన పదాలు విరగాలని నియమం యేమీ లేదు కాబట్టి కందం నడక అనేకానేకవిధాలుగా ఉంటుంది. ఇకపోతే మాధుర్యం అనేది ముఖ్యంగా నడకకు సంబంధించిన విషయం కాదు. నడకవిషయంలో మాటవరసకు కందం బేసిపాదాల్లో 12మాత్రలుంటాయి అవి ఏలాగైనా అమరవచ్చును. కొన్ని ఉదాహరణలు చూదాం: 4-4-4 (ఎంతో ఘనమై నట్టిది), 5-3-4(మీబోటి దొరల పాలన), 3-3-3-3 (మనసు విరిగి యునికి విడచి). అసలు బహువిధమైన నడకల కారణంగానే కందం కవులకు వివిధమైన సందర్భాల్లో రసపోషకమైన చిన్నపద్యంగా చేతి కమరింది!
ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే అని మనవి చేస్తున్నాను. మీ శంకరాభరణం కవీంద్రుల గొప్పను కించపరచటానికి అన్నమాటలు కావని మీకూ ఇక్కడి మీ కవిపరివారానికి నా విన్నపం.
"I wondered for long how and what for our ancient poets invented all these queer prescriptions. Now I know, since I am in the thick of following them every day.
If you write any stuff and nonsense but follow strictly all these constraints, the result would invariably sound nice. It is like a puri press...you just insert a ball of dough in it and press, and you will surely get a nice round puri shape, whatever its taste is."
కవిమిత్రులారా, నమస్కృతులు! నా ఆరోగ్యం బాగున్నది. ఈరోజు ఎక్కడికీ వెళ్ళలేదు. "మరి మా పద్యాలపై ఎందుకు స్పందించ లేదు" అని అడుగుతారేమో... చెప్తున్నా... మన కవి మిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాచవోలు శ్రీధర రావు గారల పుస్తకాలను ముద్రణకు ఇవ్వడానికి ఫార్మాటింగ్ చేస్తున్నాను. రోజంతా లేవకుండా ఆ పని మీదనే ఉన్నాను. దాదాపుగా అయిపోయినట్టే... రేపు తప్పక మీ పూరణలను సమీక్షిస్తాను. మన్నించండి!
పదుగురు చూడగ వింతను
రిప్లయితొలగించండిమదిలో మునివరు డొసగిన మంత్రము నిష్ఠన్
చదువగ దేవుని దయవల
ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్
రిప్లయితొలగించండిकौन ఈ ముదిత :)
హృదయము గుసగుస లాడెను
మదియే తూగెను సరసపు మత్తున భళిరా
మదిమది ! నెలలుతిరిగె, కౌ
ముది తన పుంసకునిఁ గూడి ,పుత్రునిఁ బొందెన్!
जिलेबी
कौन ఈ ముదిత :)
తొలగించండిxxxxxxxxxxxx (పద్యం)
जिलेबी
తొలగించండి:)
పుంసకుడు - పదం లే, "నట్టుంది" :)
జిలేబి
చేపూరి రామారావు గారి పూరణ:
తొలగించండికౌముది అనే యువతి ప్రవర్తన
మదిలో మెదలగ మదనుడు
ముదితకు మొదలైన కాంక్ష మోదముతీరన్
వదలక పడకగదిని కౌ
ముది, తన, పుంసకుని గూడి పుత్రుని బొందెన్
jileabi gaaru:
తొలగించండిContinuing our previous discussion in Sankarabharanam:
HYDERABAD: For the first time, two native words of the State- Bathukamma and Bonalu - which are related to Telangana culture and tradition - are all set to be included in the Oxford English Dictionary (OED). Oxford University Press (OUP) has decided to consider these words for drafting for the next edition of dictionary.
It may be recalled that the Oxford English Dictionary has added several south Indian words in its previous editions. They are lungi, vada, dosa, puri, panchayat, anna, gulab jamun, abba(appa), Devi, mirch masala and others. Telangana Jagruthi has been trying for the cultural renaissance of Telangana, when the state was formed.
https://www.google.co.in/amp/www.newindianexpress.com/states/telangana/2018/oct/27/bathukamma-and-bonalu-set-to-be-included-in-oxford-dictionary-1890574.amp
తొలగించండిHigh time Telugu nighantukarulu poets, pundits come out of the shell and embrace in their literature ( especially traditional poetry styles ) to accept and take forward inclusion principle.
A language that doesnot flow with the time for sure will die and gets only an utopian status.
Hope Telugu or for that matter any of the Indian languages do not get into that drainage.
Regards
ஜிலேபி
తొలగించండిBathukamma , Bonalu words in OED
ఈ వార్తా రచయిత నేనేనండి....v.v. Balakrishna
డా. పిట్టా సత్యనారాయణ
తొలగించండిఈ సందర్భంగా నొక సత్యమును జెప్పుట ఆత్మ శ్లాఘమనుకొనకున్న ,నేను తెలంగాణా జాతీయము(Idioms)లను,133ని యెన్నుకొని వాటిని ఆంగ్లం లోనికి మార్చి వివరణతో నొక పుస్తకమును ప్రచురించినాను."Telangana Native Idioms in English"
__/\__
తొలగించండివదలుము చింతల నాముని
రిప్లయితొలగించండిసదయుడు సంఘోపకారి సన్నుతమతి నీ
విదివిను మాతని మహిమను
ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్.
very well composed
తొలగించండి
రిప్లయితొలగించండిఇది కలికాల మీజగతి నెన్నియొ వింతలు చూచుచుంటి మే
యదనున నైన నేటిజను డెయ్యది యైనను బొందగల్గి సం
పదలు సృజించు శక్తి గనె వాని కసాధ్యము లేదు చూడగన్
ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్.
రిప్లయితొలగించండిమదిమది ! పెండ్లి వేడుకలు ! మానస చోరుడు దగ్గి రాయెనే !
కుదిరెను ముచ్చటల్ కలిసె కొవ్వలిపువ్వు సయాటలన్ పతిన్!
మది సయి తూగె నూగె భళి మాంగలికమ్ముగ చక్కనమ్మ, కౌ
ముది తన పుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్!
जिलेबी
పుంసకుడు = ????
తొలగించండి
తొలగించండిఅట్లాంటి పదం లేదా ! అయితే
ఆంధ్ర భారతి కి కొత్త పదం జిలేబి కానుక :)
పుంస్ - పుమాన్ పురుషుడు - సంస్కృతం అయితే పుంసడు పుంసకుడు - పెన్మిటి , పురుషుడు భర్త అన్న అర్థం లో వేసేసుకోవచ్చు వీరత్రాడు :) (సూక్షి లా అన్న మాట :)
జిలేబి
ఓకె ( జిలేబి భారతి )కి స్వాగతము ముద్రణ హక్కులు నావి రాయితీలు గురువు గారికి
తొలగించండి
తొలగించండి:) మనదంతా ఓపెన్ సోర్సేనండోయ్ :)
వేసుకోవచ్చు ముద్రణ
గిట్టుబాటు ధర రాక పోతే జిలేబీ పూచీ లేదు :)/ డిస్క్లైమరు :)
జిలేబి
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపదుగురు యాత్రకై జనిరి , భర్గుని జూడగ శ్రీ గిరీంద్రమం...
దుదయము దర్శనమ్ము గొనుచుండగ , బాలుడు దారితప్పగా
వెదుకుచు గాంచిరాతనిని , పేడి సమీపమునందు , వెంటనే
ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చక్కని సమర్ధవంతమైన పూరణ అవధానిగారూ! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిమదనుడు శంకరు గెల్చెఁ , గు...
తొలగించండిముదములు వికసించె బవలు , ముదిమి రదనముల్
పదునుగ మొలిచినవట్టులె
ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ పద్యమునకు చిరు సవరణ.. శ్రీ సూరం వారికి వందనములతో..🙏
తొలగించండిసదయు హరు గెలిచె యముడు ., కు..
ముదములు వికసించె బవలు , ముదిమి రదనముల్
పదునుగ మొలిచినవట్టులె
ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఎదుటనె చక్కనైన ఒక యింతిని గీచితివౌర ! ప్రక్కనే
తొలగించండిపొదలను , వాటి ప్రక్కన నపుంసకునిన్ రచియించితీవు , నీ
కిది యెటులౌను ? బాలకుని నిక్కడ గీచితి *చిత్రకారుడా* !
ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట *చిత్ర* మెట్లగున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ముదముగ మానస మందున
రిప్లయితొలగించండికదిలిన ప్రేమను కోరి కాంక్షిం చినచో
వదలని దైవము వరమున
ముదిత నపుంసకునిఁ గూడి పుత్రుని బొందెన్
ముదముగ నాటక మందున
రిప్లయితొలగించండివదలక పేడిగ మనసుల బరుగిడు పాత్రల్
పదిలముగ దాల్చు భర్తను
ముదిత , నపుంసకుని గూడి పుత్రుని పొందెన్ .
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఅది యిది చెత్తను గూర్చన్
కదిలించియు స్వర్ణ తుల్య ఖనిజము నరయన్
యిది పరిశోధక సఫలత
"ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్"
ముదమున బెండ్లి యాడి యొక మోహనయౌవనపుంస్త్వరూపునిన్
రిప్లయితొలగించండిసుదతి, సుఖమ్ము నొందె నవశోభనరాత్రినిరుద్ధభోగ్యయై,
హృదయతనూద్వయీకలితతృప్తిపయోధినిమగ్న, పేరు కౌ
ముది, తన పుంసకుం గలిసి పుత్రుని బొందుట చిత్రమెట్లగున్
కంజర్ల రామాచార్య.
కోరుట్ల. జిల్లా జగిత్యాల.
తొలగించండిహమ్మయ్య! మీరూ పుంసకుం అనేసేరు కాబట్టి పదం ఉందనే అనుకుంటా :)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికధలను వింటి మెండుగ కకావిక లమ్మయె మానసం బునన్
రిప్లయితొలగించండిపదిలము లేక మానవులు పాపపు కృత్యము లందు భోగముల్
ముదముగ పొంద గోరుచును మూర్ఖపు యోచన మోస గించగా
ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్ "
వదలుమిక కల్లమాటలు
రిప్లయితొలగించండిసుదతియె పూరుషుని తోడ సుతునిగనె గదా
వదరుట తగునే? యెవ్విధి
ముదిత నపుంసకునిఁ గూడి పుత్రుని బొందెన్ ?
రిప్లయితొలగించండిఅదె! సంతసమొందకనౌ
ముదిత నపుంసకునిఁ గూడి, పుత్రునిఁ బొందెన్
కద గాజుమూసలోనన్ !
వదంతి కాదిది జిలేబి వాస్తవ మమ్మా !
జిలేబి
సుదతి మనువాడిన సఖుడు
రిప్లయితొలగించండిమది గెలిచిన సుందరుండు మామకు సుతుడౌ
మదనుడు, మదవతి యా కౌ
ముది తన పుంసకుని గూడి పుత్రుని బొందెన్.
మది యలరించున దెవ్వరొ?
రిప్లయితొలగించండియిది సాధ్యమె సంతు బొంద నీభువి లోనన్?
ముదిమి* విధివశమున నొకడు
ముదిత ;నపుంసకుని గూడి ;పుత్రుని బొందెన్.
****)()(****
(*విభక్తి లోపము)
మదిలోనన్ వ్యధ జెందక
రిప్లయితొలగించండిపది యేడులు సంతు లేక బాధలు పడియున్
యెదురీది వెతలకు కౌ
ముది తన పుంసకుని గూడి పుత్రుని బొందెన్.
(అయితే పుంసకుడనే పదం నిఘంటులో కనిపించలేదు.)
వెదకి వెదకి తన దుహీత కు
రిప్లయితొలగించండిముది వయసు న వరుని దెచ్చి ముడి వేయంగన్
ముదము న మెలగంగా నా
ముది తన పుంసకుని గూడి పుత్రుని పొందెన్
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య :: 2830
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
సమస్య :: ముదిత నపుంసకున్ గలసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్?
*ఒక స్త్రీ నపుంసకునితో కలసి పుత్రుని పొందడం చిత్రమైన విషయం ఏమీ కాదుగదా* అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: జాతరలో బిడ్డ తప్పిపోయి అల్లాడుతున్న తల్లిని జూచిన పెద్దలు “అమ్మా! భయపడవద్దు. ఇక్కడికి దగ్గఱలో ఒక నపుంసకుడు ఉన్నాడు. అతడు చాలా మహిమ గలవాడు. భూత భవిష్యద్వర్తమానములు తెలిసినవాడు. జోస్యం కూడా చెబుతూ ఉంటాడు. నీవు నీ కుమారుని పొందేందుకు అతడు తగిన దారిని చూపించగలడు. అతని దగ్గఱకు వెళ్లు అని చెప్పినారు. వెంటనే ఆ తల్లి అతని దగ్గఱకు వెళ్లింది. ఆమె ఆ నపుంసకుని కలసి మాట్లాడి అతడు చెప్పినట్లు చేసింది. తప్పిపోయిన తన కుమారుని తిరిగి పొందింది. ఇందులో చిత్రమైన విషయం ఏముంది? అని విశదీకరించే సందర్భం.
“అదరకుమా నపుంసకుడటంచు., గనుంగొన నౌను పుత్రునిన్ ,
పద మహిమాన్వితుం డతడు బాగుగ జెప్పును జోస్యమిట్లు దా...
రిది యని” యంచు పెద్ద లన నేగెను తల్లి సుతున్ గనంగ, నా
ముదిత నపుంసకున్ గలసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్?
(శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారికి ధన్యవాదాలతో)
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (29-10-2018)
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండికదిలిన యాత్మశక్తి గన గావు పనుల్ రతి క్రీడ జర్పగన్
యిది తన చేతగాదనిన నింతి నపుంంసకు డంచు జెప్పగా
వదలియు నా సతిన్ మిగుల వాసిని గానని నాతి గూడ; నా
ముదిత నపుంసకున్ గలిసి పుత్రుని బొందుట చిత్రమెట్లగున్
హృదయము దోచినట్టి ప్రియుడీ మదనుండని పోరుసల్పి యా
రిప్లయితొలగించండిముదితయె పెండ్లియాడె తన ముద్దుల బావను ప్రేమమీరగన్
ముదమున కాపురమ్మచట మోదము మీరగ జేసి యింతి కౌ
ముది తన పుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్రమెట్లగున్.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిబెదిరిరి సంతు సంఖ్యయెడ బేలగ నొక్క సుతుండు గల్గగా
గదియ కు.నిన్(కుటుంబ నియంత్రణను)విపదగా తనయుండు గతించ నా నరుం
డదె యొక కృత్రిమ వీర్యమును డాసిన గాదె సుతన్ గనెన్ భళా!
ముదిత నపుంసకున్ గలిసి పుత్రుని బొందుట చిత్రమెట్లగున్
ముదిత యొకతె తన పుత్రుని
రిప్లయితొలగించండివెదుకుచు తిరిగి తిరిగి మరి వేదన చెందెన్
ముదము కలిగె జాడ తెలిసి
ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్
ముదనష్టపుజాతకుడనె
రిప్లయితొలగించండిముదితనపుంసకుని,గూడిపుత్రునిబొందెన్
మదనునిబోలెడుభర్తను
బదుగురుమదిమెచ్చునటులబడసినదగుచున్
రిప్లయితొలగించండిఈ కందానికి యెలా ఇంత ప్రాచుర్యం.
Just it flashes me :)
కందం మొత్తం అరవై నాలుగు మాత్రలు
దీన్ని 12, 20 12,20 మాత్రలలో సర్దినారు.
12,20 - 4 మాత్రల ప్రకారం విభాగిస్తే 3, 5 వస్రాయి.
A triangle of l,b 3,4 gives a diagonal of 5.
A double triangle gives a squire.
64 is a perfect squire.
This makes me wonder who is that genius who discovered కందం ?
Any body knows to whom కందం attributed to ?
The more I look into the mathematics of కందం the more it baffles me !
Cheers
Zilebi
గణముల వరుస స్థిరము గావున ఒక్కొక్క వృత్తమునకు ఒకే నడక.
తొలగించండికందానికి వెవేల నడకలు! కానీ అన్ని గణములూ నాలుగు మాత్రలలో నుండవలెను గాన అన్ని కందములకూ ఒకే మధురమైన తీరు...
సమస్య కంద పాదము నా పూరణము సీసములో
రిప్లయితొలగించండిఒకడు భారతము పూర్తిగా చదవ కుండా అభిమన్యుడు అర్జునుని పుత్రుడని తెలుసుకొని తనకున్న జ్ఞానముతో అర్జునుడు పూర్తిగా నపుంసకుడు అని తలచి పేడికి కుడా పుత్రులు
పుడుతారు అన్న విషయము మీద పరిశోధన చేయతలచి ఆ విషయము తండ్రితో చెప్పగా ఆప్పుడు అర్జునుడు జన్మతః పేడి కాడు ఆతను శాపవశమున కొంత కాలము మాత్రమే పేడి అయినాడు అతనికి నలుగురు సంతానము అని ఒక తండ్రి తన కొడుకుతో చెప్పు సందర్భము
సీస:
వినుము కుమార నీ వనుకొన్న విషయము నెచట జరుగ లేదు, నెపుడు భువన
మున ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్తెలుపుమయ్య, పోట కాదు
పార్ధుడు, శక్తిసంపన్నుడు, శృతకర్మ పాంచాలి ఫల్గున బాలుడు గద,
నభిమన్యుడు కలిగె శుభ సుభద్రకు, బభ్రు వాహను డాశ్వేత వాహనునికి
సుమతి చిత్రాంగదకు నయ్యె సుతుడు ,నాగ
పుత్రి కి యిరావ ణుoడును బుట్టె, పేడి
గా మసలె శాప వశమున , కనుము బార
తమ్ము యనుచు సుతునితోడ తండ్రి పలికె,
ముదిత నపుంసకున్గలిసిపుత్రునిబొందుటచిత్రమెట్లగున్
రిప్లయితొలగించండిముదితలనంగచుల్కనయ,పుత్రునిబొందిర,యేమియిట్లుగన్
జదువులులేనివారివలెజయ్యనదప్పుగబల్కనొప్పునే?
ముదితనపుంసకున్గలిసిపుత్రునిబొందుటచిత్రమేగదా
శంకరాభరణం...29/10/2018
రిప్లయితొలగించండిసమస్య:
"ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్"
నా పూరణ. : కందము
***** **** ***
ముదిరిన కోతల రాయు
ళ్ళు దిమ్మదిరుగు విధముగ వరుస గనిరిటులన్!
"కదలి కడతేర్చె చిఱుతను",
"ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్"
( కదలి =జింక )
🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷వనపర్తి🌷
వదనారవింద యే నద
రిప్లయితొలగించండినదీ తటాక భరిత ఘన నగరమ్మున నే
సదనమ్మున నిమ్ముగ నె
మ్ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్
ముదిత సుభద్ర సోమ సమ మోహన రూపుఁడు సవ్యసాచినిం
బదిలపు వీర భావమునఁ బౌరవ రాజస తేజ మేర్పడం
గదలెడు భావి కాల విధి కల్పిత శాప విముక్త భాను మ
న్ముదిత నపుంసకుం గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్
కవిత్రయ శ్రీమదాంధ్ర మహా భారత పఠనములో యాదృచ్ఛికముగా నేఁ డభిమన్యుని నిర్యాణ ఘట్టములో నున్నాను.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,
ముదమున పెండ్లియాడుచు విమోహితుడై రతిదేల్చె గౌ
ముది యను కన్యకా మణిని పున్నమి రేయిని | కామకేళిఁ గౌ
ముది తన పుంసకున్ గలసి భ్రూణము దాల్చెను | సత్కవీంద్ర " కౌ
ముది " తన పుంసకున్ గలసి పుత్రుని బొందుట చిత్రమెట్లగున్ ?
( భ్రూణము = శిశువు , గర్భము )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~~
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
వదలక పట్టు వానరులు వారధి కట్టగ సాగరమ్మునన్
కదలగ నంతరిక్షమున గ్రక్కున సారథి కాళ్ళు లేకయే
వదలుచు పూల బాణముల వాముడు దోచగ నంతరంగమున్
ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్?
(క్రియా సిద్ధిః సత్త్వే భవతి మహతాన్నోపకరణే)
ముదమును పువ్వులుబంచగ
రిప్లయితొలగించండికదలాడెడి కంటిచూపు కాంక్షలుబెంచన్
పదమన జంటను యా కౌ
ముది!తన పుంసకునిగూడి పుత్రునిబొందెన్
మిత్రులు శంకరయ్య గారు,
రిప్లయితొలగించండిఇక్కడ కనిపించిన ఒకరి "గణముల వరుస స్థిరము గావున ఒక్కొక్క వృత్తమునకు ఒకే నడక" అన్న అభిప్రాయం అంత సమంజసం కాదని అనుకుంటున్నాను. గణక్రమం ఒకటే ఐనప్పటికీ, పదసముదాయాలు ఎలా విరుగుతున్నాయి అన్నదాన్ని బట్టీ, పద్యం యొక్క రీతి, శయ్య, పాకం అంటి అనేక ఇతరవిషయాల పైన పద్యం నడక ఆధారపడి ఉంటుంది. ఇదేమీ నేను క్రొత్తగా లేవనెత్తుతున్న సిధ్ధాంతం కాదు.
అలాగే "కానీ అన్ని గణములూ నాలుగు మాత్రలలో నుండవలెను గాన అన్ని కందములకూ ఒకే మధురమైన తీరు" అన్నది కూడా అంతసముచితంగా అనిపించటం లేదు. అన్నీ చతుర్మాత్రాగణాలైనా సరే ప్రతినాలుగు మాత్రలపైన పదాలు విరగాలని నియమం యేమీ లేదు కాబట్టి కందం నడక అనేకానేకవిధాలుగా ఉంటుంది. ఇకపోతే మాధుర్యం అనేది ముఖ్యంగా నడకకు సంబంధించిన విషయం కాదు. నడకవిషయంలో మాటవరసకు కందం బేసిపాదాల్లో 12మాత్రలుంటాయి అవి ఏలాగైనా అమరవచ్చును. కొన్ని ఉదాహరణలు చూదాం: 4-4-4 (ఎంతో ఘనమై నట్టిది), 5-3-4(మీబోటి దొరల పాలన), 3-3-3-3 (మనసు విరిగి యునికి విడచి). అసలు బహువిధమైన నడకల కారణంగానే కందం కవులకు వివిధమైన సందర్భాల్లో రసపోషకమైన చిన్నపద్యంగా చేతి కమరింది!
ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే అని మనవి చేస్తున్నాను. మీ శంకరాభరణం కవీంద్రుల గొప్పను కించపరచటానికి అన్నమాటలు కావని మీకూ ఇక్కడి మీ కవిపరివారానికి నా విన్నపం.
తొలగించండిGood point
BTW, any idea to whom కందం development is attributed to ?
I am fascinated by that brainy chap :)
జిలేబి
తొలగించండికంద పద్య మహత్యం...Beauty of Constraints
http://gpsastry.blogspot.com/2015/06/beauty-of-constraints.html?m=0
"I wondered for long how and what for our ancient poets invented all these queer prescriptions. Now I know, since I am in the thick of following them every day.
తొలగించండిIf you write any stuff and nonsense but follow strictly all these constraints, the result would invariably sound nice. It is like a puri press...you just insert a ball of dough in it and press, and you will surely get a nice round puri shape, whatever its taste is."
తొలగించండిMathematics of కందం
http://varudhini.blogspot.com/2016/08/the-mathematics-of.html
జిలేబి
అదెటులగును ?మూఢమతీ !
రిప్లయితొలగించండికుదరదు గాక కుదరదది కువలయ మందున్ !
వదరెద వేల యిటుల? యే
ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్?
**)(**
(ఒక మూఢునితతో ఒక వివేకి వ్యాఖ్య)
సవరణ: మూఢునితో
తొలగించండికం॥ మదిలో దాగిన వానిని
రిప్లయితొలగించండిముదమున పెళ్ళాడెగాని పుంస్త్వ రహితుడే,
తదుపరి సరోగసి వలన
ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్"
చదువరి యౌయుద్యోగిని
రిప్లయితొలగించండిముదమున చేపట్టె నొక్క ముద్దియ నలితో
మదనుని ప్రేరణనా కౌ
ముది తన పుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్
excellent
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమదవతి పైన మోహమున మాయల మారియొకండు వేసెనే
రిప్లయితొలగించండిబుధజను లొప్పురీతిన నపుంసక వేషము, కర్మచారిగా
సదనముఁ జేరెనా కపటి చానను వంచనతోడ పొందగన్
ముదత నపుంసకున్ గలిసి పుత్రుని బొందుట చిత్రమెట్లగున్.
పదవులకై నేతల తల
రిప్లయితొలగించండిపొదవెను వెనుకంజవేయ ముప్పొనగూడున్
పదపద యేపొద పులి!యే
ముదిత నపుంసకునిగూడి పుత్రుని బొందెన్
హృదయజుడున్ననె గతియని,
రిప్లయితొలగించండిముదుసలి యనాధ బోడిక లుండే
సదనము చేరి, యచట తన
ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్
ముదితన=ముసలితనమున,పుం=మగ.
లేదా
ముదితనపుం+ సకుడు అనవచ్చా?
రెండూ తప్పేనా?తెలుపగలరు
సకుడు=సఖుడు , కూడు= కలయు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసదయులు బంధుమిత్రులనిచాటుదు రోటరుదేవుముంగిటన్
రిప్లయితొలగించండిపదవులుదక్కినంక పనిపాటలులేవనితూలనాడెడీ
హృదయవిహీననాయకులునిభ్యులుపూజ్యులొకోశిఖండినుల్
ముదితనపుంసకున్ గలిసి పుత్రునిబొందుట చిత్రమెట్లగున్
చంపకమాల
రిప్లయితొలగించండిముదిర బలాత్కరింపబడి మోపఁగఁ నింద, ధృవీకరించుచున్
బదులుగ లంచమున్ గొనుచు వైద్యుడు వాని 'నపుంసకుం' డనెన్
వదలఁగ నేరమంతట వివాహము నాడుచు నూరుమారగన్
ముదిత 'నపుంసకున్' గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్?
కవిమిత్రులారా,
రిప్లయితొలగించండినమస్కృతులు!
నా ఆరోగ్యం బాగున్నది. ఈరోజు ఎక్కడికీ వెళ్ళలేదు. "మరి మా పద్యాలపై ఎందుకు స్పందించ లేదు" అని అడుగుతారేమో... చెప్తున్నా...
మన కవి మిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాచవోలు శ్రీధర రావు గారల పుస్తకాలను ముద్రణకు ఇవ్వడానికి ఫార్మాటింగ్ చేస్తున్నాను. రోజంతా లేవకుండా ఆ పని మీదనే ఉన్నాను. దాదాపుగా అయిపోయినట్టే... రేపు తప్పక మీ పూరణలను సమీక్షిస్తాను.
మన్నించండి!