22, అక్టోబర్ 2018, సోమవారం

సమస్య - 2823 (స్నాన జపము లేల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"స్నాన జపము లేల జంద్య మేల"
(లేదా...)
"స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా"

128 కామెంట్‌లు:

  1. వేన వేలు చదివి వెన్నుని గాథను
    భక్తి తోడను ననురక్తి తోడ
    ముక్తి నొంది నట్టి మూర్ఖుని నాకిక
    స్నాన జపము లేల జంధ్య మేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      భక్తితో వేనవేలు వెన్నుని కథలు చదివినవాడు మూర్ఖు డెలా అవుతాడు. అక్కడ నా సవరణ ..."ముక్తి నొంది నట్టి పుణ్యుడ నాకిక..."

      తొలగించండి
    2. జిలేబీ గారన్నట్టు 'వెన్నుని గాథలు' అని ఉండాలి.

      తొలగించండి

    3. కంది వారికి జగమంతా జిలేబి మయము గా వున్నది :)


      జిలేబి

      తొలగించండి
  2. ఆ.వె.
    క్రైస్తవమతమందు పుస్తకాల చదివి
    మతము స్వీకరించు మానవుండు
    షూటు బూటు తోడ గాటుమాటలె,గాని
    స్నాన జపములేల జంధ్యలేల?

    రిప్లయితొలగించండి
  3. నిండు మనసు తోన మెండుభక్తి యెలేని
    పూలు పండ్ల తోన పూజ ఘనము
    పరుల మెప్పు కొఱకు ప్రకటన జేయంగ
    స్నాన జపము లేల జంధ్య మేల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోన' అనకుండా 'తోడ' అనండి.

      తొలగించండి


  4. ఆ నభవుని కొలువనా యనలుని కొలు
    వంగ నెల్ల హరిమ వడియె సూవె
    మీన మేషముల సమీకరణము లేల
    స్నాన జపము లేల జంధ్య మేల!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జీపీయెస్ వారు

      మీ ఒట్టుకు జట్టుగ సప్పోర్టు :)


      జిలేబి

      తొలగించండి
    2. మైలవరపు వారి విజయనగరం అవధానములో:

      శ్రీమతి గుమ్మా నాగమంజరి గారు ఉవాచ:

      *******************************

      నాల్గవ అంశం *వర్ణన* పృచ్ఛకులు శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి

      *వర్ణనాంశం: సీతాపహరణ సమయంలో శ్రీరాముడు సీతను వెదకు సందర్భంలో ప్రతి చెట్టు, పుట్టను మా సీతను చూచారా అని అడిగినప్పుడు ప్రకృతిలో ప్రతి ఒక్కటీ బదులు పలికిన సందర్భం* సీసపద్యంలో...

      అవధాని గారి గొంతు గాద్గదికమై, అత్యంత కరుణ రసాత్మకమైన పూరణ అత్యద్భుతముగా జాలువారింది.

      *నాకు నోరున్నచో నా సీత జాడను*
      *చెప్పియుందు నటంచు చెట్టుతలచె*
      *భాష నాకున్నచో పరమాత్మునకు సీత*
      *గురుతు చెప్పుదు నని కొండ తలచె*
      *నా సవ్వడికి భాషణమ్మది యున్నచో*
      *బదులు చెప్పెదనని నదియు తలచె*
      *తల్లియై యుండినే తల్లడిల్లుచునుంటి*
      *మాట రాదని ధరా మాత తలచె*

      *మాట లేకున్న వేరొక్క మార్గమేది*
      *జానకీ మాత యేగిన జాడతెలుప*
      *ఏమి చేయుదుననుచు చింతించి యెంతొ*
      *నింగి జూచుచు జగతి కన్నీరు కార్చె*


      తొలి పాదంలో *నా సీత* యని *చెట్టు* పలకడం ఎంతో హృద్యంగా ఉన్నది. చెట్టు ఉద్బీజము. సీత భూజాత. సోదరి కనిపించక తల్లడిల్లుటిచట గమనార్హము





      తొలగించండి
    3. ఆఖరి పాదంలో చిన్న సవరణ

      *నింగి జూచుచు ప్రకృతి కన్నీరు కార్చె*

      తొలగించండి
    4. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    5. వర్ణన హృదయ విదారకమును హృద్యముగను నుండి కన్నీరు విషాదానంద సందేహాస్పద జనితముగా నున్నది నాకు.
      కవి శేఖరులు మురళీ కృష్ణ గారికి నభినందనలు.

      తొలగించండి
    6. మాన్యులు శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు.. మీ వంటి వారి పరిశీలనకు నోచుకొని ప్రశంసింపబడుటచే నా పద్యమునకు చరితార్థత కలిగినది.. హేమ్నః సంలక్ష్యతేహ్యగ్నౌ విశుద్ధిశ్శ్యామికాపి వా 🙏🙏అనేక నమస్సులతో.. మురళీకృష్ణ

      తొలగించండి
    7. ఈ తపాలా బంట్రోతు జన్మ ధన్యమైనది...

      ప్రభాకర శాస్త్రి

      తొలగించండి
    8. శాస్త్రి గారి మీరు మాకు గురుశ్రేష్టులు. శాస్త్ర విజ్ఞానాంగ్ల భాషా ప్రభృతుల.

      తొలగించండి
  5. సమస్య :-
    "స్నాన జపము లేల జంధ్య మేల"

    *ఆ.వె**

    వేల్పు పట్ల సుంత విశ్వాసముండక
    కులమతాల పట్ల కోప పడెడు
    మనుషులంత నొకటియను హేతువాదికి
    స్నాన జపము లేల జంధ్య మేల
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి
  6. సాటి మనుజులందు సమత మమత లేక
    సత్య నిరతి వీడు స్వార్థు లకు ను
    కపట నాటకం పు ఖలు లకు కుహ నం పు
    స్నాన జపము లేల జంధ్యమేల

    రిప్లయితొలగించండి
  7. (శంకరశాస్త్రి తన మిత్రుడు మాధవాచార్యులతో )
    మాధవా ! వినుమిదె ; మనవంటి వారలే
    వారకాంత లనగ బరగువారు ;
    వారి యాతనలను వారింపకున్నచో
    స్నాన జపము లేల ? జంధ్య మేల ?

    రిప్లయితొలగించండి
  8. ఆకలియని చేరు అన్నార్థి కించుక
    అన్నమిడిన చాలు నదియె మేలు
    మదిన నిలిపి సతము మాధవుఁ సేవింప
    స్నాన జపములేల జంధ్యమేల.

    రిప్లయితొలగించండి
  9. ప్రాణ కోటి పట్ల పరగంగ నొక్కింత
    కనికరమ్ము లేక కర్కశముగను
    మసలు చుండు నట్టి మనుజుల కిలలోన
    స్నాన జపము లేల ? జంధ్య మేల ?

    రిప్లయితొలగించండి


  10. పూట పూట కున్ను పులకరింతలనంగ
    నాట, వెలది తోడు నాట లాడ
    చల్ల గాను బెల్టు షాపుల బోవగ
    స్నాన జపము లేల జంధ్య మేల!


    నారాయణ :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. నమ్ము కొన్న వారి నట్టేట ముంచుచు
    సొంత లాభ మొకటె చూచు కొనుచు
    చిత్త శుద్ధి లేక చేయుచు నుండెడి
    "స్నాన జపము లేల జంద్య మేల"

    రిప్లయితొలగించండి
  12. పురహితంబు గోరు భూసురుండని యెంచి
    భువిని మ్రొక్కు చుందు రవనతులయి
    దుష్టుడౌచు వాడు దుర్మార్గగముడైన
    స్నాన జపము లేల జంధ్య మేల

    రిప్లయితొలగించండి


  13. ఛీఛీ ఆచారముల్ :)


    దీనారమ్ముల దేశమందు భళిరా దీమమ్ము, తీర్థమ్ము లౌ
    పానీయమ్ములు గంధమాదని సుమా ! బారుల్ సదాచారముల్,
    మీ నాగా నెఱి యేల నాకు, కలదోయ్ మించారు జోష్‌ ఓ ఖరోష్!
    స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. తే: వేదములను చదివి విజ్ఞాన గని యని
    పేరుగొన్న యట్టి పెద్ద, బడుగు
    జనులు పడెడు పాట్లఁ గనకున్న మదిలోన
    స్నాన జపము లేల జంద్య మేల

    రిప్లయితొలగించండి
  15. డా. పిట్టా ‌సత్యనారాయణ
    పనుల లోన సేవ ప్రతిఫలించు నటుల
    నీతి జెలగ మదిని నిష్ఠ యదియ
    కల్లబొల్లి యుగపు గడన లక్ష్యంబైన
    స్నాన జపములేల జంధ్య మేల?

    రిప్లయితొలగించండి
  16. ఆత్మ తత్త్వ మెఱిగి యాద్యంతములు లేని
    దైవ చింతనమున ధన్యులైన
    యోగ దీక్షనుండు యోగీశ్వరులకెల్ల
    స్నాన జపములేల?జంద్య మేల?

    రిప్లయితొలగించండి
  17. మైలవరపు వారి పూరణ

    నేనా ! వృద్ధుడ , జూడుమా గలితదంతిన్ , గోళ్లునూడెన్ , సదా..
    త్మానందస్థితిఁ బొంది , మానితిని మాంసాహారమున్ ! నమ్మురా !
    దీనత్వమ్ముననుండి యేలనిటు , సందేహింప ? దానమ్మిడన్
    స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జందెంబు నా కేలరా ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      స్వర్ణకంకణ మిస్తానని బాటసారిని పిలుస్తున్న పులి కథ గుర్తుకు వచ్చింది.

      తొలగించండి
  18. డా.పిట్టా ‌సత్యనారాయణ
    ఒక కర్మయోగి ఉవాచ:

    నేనేచూపుల కైన జంధ్యము గొనన్ నిష్ఠల్ మరీ యొప్ప నా
    స్నానం బంతరమైన శుద్ధి హృది వే శ్వాసల్ హరిన్ దల్చుటల్
    నేనే శాంతిని గోరుదో యిడుదదే నిత్యంబు సంఘంబుకున్
    నానా రీతుల సత్కృతుల్ నెరపెదన్ నా కింక లేవే భ్రమల్
    స్నానంబుల్ జప నిష్ఠ లేల ,మడియున్ జంధ్యంబం నా కేలరా?


    రిప్లయితొలగించండి
  19. మనసుమాధవుపయి మరులుగొనివరల
    నమలినపుటెడందనజుడునుండ
    యమనియమచయంబులాదరువైయుండ
    "స్నాన జపము లేల జంద్య మేల"

    రిప్లయితొలగించండి
  20. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    స్నానంబున్ జప నిష్టలేల
    మడియున్ జంద్యంబు నా కేలరా
    ======================
    స్నానము, జపములు నాకెందుకు
    మడి ఆచారములు, జంద్యములు
    నాకెందుకనుటలో వైపరీత్యమే
    ఇచట సమస్యగా గైకొనడమైనది
    ======================
    సమస్యా పూరణం- 289
    ==================

    శరీరమును కాదెన్నడు నేను -
    అధ్యాసము వైపుకు అసలు రాను
    ఉపాధులను ఇక చూడగ లేను -
    దేహ భావనకు పోనే పోను
    మలిన రూపమునకు సోకులేల -
    దీనికి పై పూతలు చాలురా
    స్నానంబున్ జప నిష్టలేల -
    మడియున్ జంద్యంబు నా కేలరా

    (అధ్యాసము = నేను శరీరమును అను భావన)

    ====##$##====

    " చర అచరములలో తానున్నానని
    వాటికి ఆధారభూతుడిని తానేనని
    ఉపాధులను వీడిన అఖండ పరిపూర్ణుడు
    చూడు నిశ్చయముగా అతడే ముక్తుడు "

    ( ఆత్మనిష్టా విధానము-వివేక చూడామణి )
    ( 339 / 581 )

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    --- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  21. ఓనమాలు దిద్ది యొజ్జపై నిందలా?
    తల్లిదండ్రు లన్న దయను లేక,
    సాటి మనిషి పైన సమ భావమే లేద?
    *"స్నాన జపము లేల జంద్య మేల"*

    రిప్లయితొలగించండి
  22. ఈనాదేహమనంతచింతనసదాహేరంబునర్చింపగా
    యానారాయణుకృష్ణునచ్యుతుని దివ్యాకారముంజూచుచున్
    ధ్యానావస్థితమానసంబున మహాత్మా నందమందుండగా
    స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా

    రిప్లయితొలగించండి
  23. మంచి మనసు గల్గి మానవ సేవకు
    సతము పాటు పడెడు సజ్జ ను నకు
    విధుల యందు మున్గి వీలు పడని వేళ
    స్నాన జపము లేల జంధ్యమేల

    రిప్లయితొలగించండి
  24. బ్రాహ్మణుండొకండు పరతత్వమున మున్ గె
    దేహమందు భ్రాంతి తీరి పోయె
    ఆ సమాధినిష్టు డౌ యోగివరునకు
    స్నానజపము లేల ? జంధ్యమేల
    (నేను గమనించిన కొన్ని పూరణలలో ఆవ్యక్తి సంకుచితుడనీ అతడికి "స్నానజపము లేల జంధ్యమేల?" అనే భావం ఉన్నది. ఐతే అతడెంత దుర్మార్గుడైనా జపము, జంధ్యము లేకుండా సరిపోతుంది కానీ స్నానం అవసర మౌతుంది. అందుకే దేహభ్రాంతి లేని యోగిని తీసుకున్నాను . దేహభ్రాంతి లేదు కనుక స్నానం అవసరం లేదు )

    రిప్లయితొలగించండి
  25. దానంబుల్ పలురీ తులంజరు పుచున్ తాపేరు ప్రఖ్యాతు లున్
    భానుండం టినకాం తిరేక వలెకీర్తిన్ పొంగు చున్ తేలగా
    ఆనారా యణుడే నుమెచ్చి వరముల్ సంధించి దీవించగా
    స్నానంబున్ జప నిష్ట లేల మడియన్ జంధ్యంబు నాకేలరా

    రిప్లయితొలగించండి
  26. మానవత్వమంత మరచినవారికి
    దానవత్వమందు దాచుకొనుచు
    హీనుడట్లు మెలగ మానవుడందురా?
    స్నానజపములేల జంద్యమేల

    రిప్లయితొలగించండి


  27. బసవన్న

    ఏనాడైనను నన్ను వీడి భగుడా యేడైన వెళ్ళావకో?
    నీ నాట్యంబును చూడకుండ గడిపానే నేను? శంభో శివా!
    నీ నందిన్! జడదారి! తెల్లనిదొరా! నీవాడ, సేనాపతీ!
    స్నానంబుల్ జప నిష్ఠ లేల ,మడియున్ జంధ్యంబు నా కేలరా?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాకుంటే ఈ పద్యంలో వ్యావహారికాలు ఉన్నాయి.

      తొలగించండి
  28. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2823
    సమస్య :: స్నానంబున్ జప నిష్ఠ లేల? మడియున్ జంద్యంబు నాకేలరా ?
    *స్నానము జపము నియమనిష్ఠలు మడి ఆచారము జంద్యము ఇవన్నీ నాకెందుకురా?* అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: ధూర్జటి మహాకవి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో పాదసేవ అనే భక్తిమార్గము యొక్క విశిష్టతను వివరిస్తూ
    ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్ చూచె దా
    నే విద్యాభ్యనం బొనర్చె కరి? చెం చే మంత్ర మూహించె?
    అని అంటూ ఓ పరమేశ్వరా! నీ పాదసేవ యందు ఆసక్తి ఉంటే చాలు (స్నానము మొదలైన ఇతరములు లేకపోయినా సరే) భక్తులు జ్ఞానులై నీ అనుగ్రహాన్ని పొందుతారు కదా అని తెలియజేస్తాడు.
    ఆదిశంకరాచార్యులవారు తన దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో మొదటి శ్లోకంలోనే
    న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో ..... అని అంటూ ఓ జగన్మాతా! జపము ధ్యానము మొదలైనవి లేకున్నా సరే సదా నిన్ను అనుసరిస్తే చాలు కష్టములు తొలగి నీ అనుగ్రహం సిద్ధిస్తుంది అని అన్నారు.
    కాబట్టి ఓ స్వామీ! “*తిన్నని*” వలె నీ భక్తకోటిలో చేరి నీ పాదసేవ చేసే నాకు ఈ స్నాన జప నిషఠలతో, మడులు ఆచారములు మొదలైనవాటితో పని లేదు కదా! అని విన్నవించుకొనే సందర్భం.

    నే నీ భక్తుడ, నీవె దిక్కని యెదన్ నీ సేవలో నుండు నీ
    సేనన్ జేరితి, నన్ను బ్రోవుము దయన్ శ్రీ కాళ హస్తీశ్వరా !
    నేనే తిన్నడ నేల నాకు తపముల్ నీ మంత్రముల్ తంత్రముల్ ?
    స్నానంబున్ జప నిష్ఠ లేల? మడియున్ జంద్యంబు నాకేలరా ?
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (22-10-2018)

    రిప్లయితొలగించండి
  29. డా.పిట్టా సత్యనారాయణ
    పగలున్ రేతిరి కవితలె
    తగ పని రెండేసి మార్లు తలపించ వలెన్
    సగమే జీతము దెచ్చిన
    మగనిన్ వాకిటనె నిల్పు మగువా!జే జే!!

    రిప్లయితొలగించండి
  30. సకల మంత్ర తంత్ర శాస్త్రంబులన్నియు,
    సగుణ బ్రహ్మఁ దెలుపు సాధనములె,
    నిర్వికల్పమైన నిత్యసమాధికిన్
    స్నానజపములేల జంద్యమేల..

    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టా సత్యనారాయణ
    ఎగవేయన్ మన సంస్కృతిన్ మహిళ లెట్లేగేరు శబరీమలన్
    మగవారెట్టుల నొప్పిరో హిత మిదే?మై మర్చి యాందోళనన్
    పగవారట్టులె చూచిజూడక మనన్ భాసించు తద్భక్తునిన్,
    మగనిన్ వాకిట నిల్పునట్టి మగువా!మా జోతులం బొందుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  32. డా.పిట్టా
    అవనిన్ గార్మిక కోవకైన చెలికాహ్వానంబునౌ సప్తమిన్*
    సవరించున్ బతుకమ్మ బంతులనటన్ సద్దుల్ మరీ బంచగన్*
    నవమిన్ *వచ్చిన బావ కా దశిమి* యెన్నాళౌను నా సంబురాల్?
    నవరాత్రోత్సవముల్ గణింపగనగున్ నాల్గౌ దినమ్ముల్ గనన్

    రిప్లయితొలగించండి
  33. డా. పిట్టా
    అవిరళ కృషియే పూజగ
    ఛవినిన్ గడపంగ దినము జారును యుగమై
    అవనిని పేదల బ్రతుకున
    నవరాత్రోత్సవములొప్పు నాలుగు దినముల్

    రిప్లయితొలగించండి
  34. ఏనాడైనను దుష్ట వర్తనముతో నేమార్చ నేనెవ్వరిన్
    శ్రీనారాయణు పాద సేవ మఱువన్ సేవింతు సద్భక్తితో
    వీనిన్ వానిని నిందసేయ నెపుడున్ వేధింప నెవ్వారినిన్
    "స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా"

    రిప్లయితొలగించండి
  35. ఎల్ల వేళలందు ఈశ్వరుఁ తలచుచు
    లౌకికమగు కాంక్షలైన లేక
    బాహ్యచింత మరచి భాసిల్లు వారికి
    స్నాన జపము లేల జంద్య మేల.

    రిప్లయితొలగించండి
  36. సర్వభూతములను సమముగా జూచెడు
    నాత్మతత్వ మెరుగు నార్యునకును
    దేహభావరహిత తేజోమయునకును
    స్నాన జపములేల జంద్యమేల?

    రిప్లయితొలగించండి
  37. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పట్టుబట్టి తాము పరమాత్మ నెంచంగ
    మూఢ భక్తి లోన మున్గి తెరలు
    బాహ్యబంధ విముఖ భాగవతుల కెల్ల
    స్నాన జపము లేల? జంథ్య మేల?

    రిప్లయితొలగించండి
  38. భవుని మదిని నిలుపువానికి వేరుగ
    స్నాన జపము లేల జంద్య మేల
    అవి బయటకు చూపు ఆడంబరములేను
    రాందనెఱిన ముక్తి లభ్యమెటుల

    రిప్లయితొలగించండి
  39. బ్రాహ్మణుడయిసంధ్య వార్చకయుండిన
    స్నాన జపము లేల జంద్యమేల
    శుధ్ధ మనము గలిగి శుధ్ధిగ నుండుచు
    జపముజేయవలయు జంద్య ధరుడు

    రిప్లయితొలగించండి
  40. ఆటవెలది
    పట్టి ప్రక్క నుంచి పంచ ప్రాణమ్ముల
    ముడచి లోని కరణములవి నాల్గు
    బాహ్య చింత వీడు పరమయోగులకిక
    స్నాన జపము లేల? జంద్య మేల?

    రిప్లయితొలగించండి
  41. వర్తనమ్ము గాంచఁ బాప యుక్తమ పల్కు
    లెల్లను బరుషములు తల్లడిల్లఁ
    జేరఁ గల్మషమ్ము చిత్తమున మెయి న
    స్నాన జపము లేల జంద్య మేల

    [అస్నానము = స్నానము లేమి]


    వీనుల్ విందుగఁ గూయు నా విహగముల్ విన్నేగి యేపారగం
    గానన్ వేడుక మీఱ జంతువులు చక్కం దిర్గు చుండంగ నీ
    మీనంబుల్ సత ముండ సంతసముగన్ మీనాకరం బందునన్
    స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా

    [ జంద్యంబును + ఆకు = జంద్యంబు నాకు; ఆకు = విస్తరి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  42. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పానీయంబుగ ధూమమున్ కుడుచుచున్ బంగారు బెంగాలులో
    నానాజాతుల చేపలన్ తినుచుచున్ నందమ్ముతో త్రాగుచున్
    గానంబుల్ భజనల్ త్యజించి వనిలో కైవల్య మొప్పారగా
    స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తినుచు నే నానందమ్ముతో...' అనండి.

      తొలగించండి
  43. గు రు మూ ర్తి ఆ చారి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,

    కుక్కుట పలలమ్ము గొంతు వరకు మెక్కి

    రాత్రి ‌కాగ విస్కి ‌ రమ్ము గ్రోలి

    నియమ రహిత ధారుణీ సురునకు నింక

    స్నాన జపము లేల జంధ్య మేల ?

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  44. దీనారమ్ములపై మనస్సుడుగబుద్ధిన్ నే నియంత్రించుచున్
    దానమ్ముల్ ధృతితోడ చేయుచును సద్భక్తిన్ వివేకమ్ముతో
    నేనేతప్పుల చేయకుండ హరినే నిత్యమ్ము ప్రార్థించెడిన్
    స్నానంబున్ జప నిష్ఠ లేల మడియున్ జంద్యంబు నా కేలరా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'నిత్యమ్ము ప్రార్థించెదన్' అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  45. నీ నామమ్మది తారకమ్మనుచు నిన్నేనమ్మి ధ్యానింతునే
    హే నారాయణ దీన బాంధవ విభో హేమాంగ గాంచంగ నీ
    వే నా డెందము లోన యుండ నిక పై వేషమ్ము లై నిల్చెడిన్
    స్నానంబున్ జప నిష్ఠలేల మడియున్ జంద్యంబు నాకేలరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లోన నుండ... వేషమ్ములై నిల్చు నా ...' అనండి.

      తొలగించండి
  46. " కామాతురాణాం న భయం న లజ్జా "
    అన్నట్లుగా , నిరంతరస్త్రీవ్యామోహితుడైన ఒక కాముకుడు తన సఖునితో అంటున్న ఘట్టము.

    స్నానంబన్న రతిశ్రమాంబువుల స్విన్నాంగమ్ములం దొప్పగన్,

    ధ్యానాంచజ్జపనిష్ఠలౌ సతతకన్యానామసంకీర్తనన్,

    జానొందున్ మడి దేవతాంబరములన్, జందెమ్ము నిర్బంధమౌ,

    స్నానంబుల్ జపనిష్ఠ లేల? మడియున్ జందెంబు నాకేలరా?.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  47. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    స్నాన జపము లేల జంద్య మేల

    సందర్భము: ఎటో యెటో తిరిగి వచ్చిన యొకానొక బ్రాహ్మణునికి కడుపులో కరకరా ఆకలి మొదలయింది. అప్పటి కింకా స్నాన జపాదులు కానే లేదు. శ్రీ మతితో యిలా అంటున్నాడు.
    (ముందుగా భోంచేయా లని అతని మనసులో వున్నది.)

    3 లోకోక్తు లీ చిన్న పద్యంలో పొందు పరచడం విశేషం.

    1. జగ మెరిగిన బ్రాహ్మణునికి జందె మేల?
    2. కడుపులో ఎలుక లరుస్తున్నాయి.
    (ఆక లేస్తున్నది)
    3. ఆకొన్న కూడే అమృతము..
    (సుమతి శతక పద్య పాదం)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పరగ జగ మెఱిగిన
    బ్రాహ్మణునికి జందె
    మేల? కడుపులోన నెలుక లఱచె...
    నమృత మనగ వినమె
    యాకొన్న కూడె!.. యీ
    స్నాన జపము లేల? జంద్య మేల?

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    22.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  48. భక్తి యొకటె మహిని ముక్తి మార్గ మనుచు
    యాత్మ శుద్ధి తోడ నంత రంగ
    మందు హరిని గొలుచు నట్టి మనుజుల కీ
    స్నాన జపములేల జంద్య మేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మార్గ మనుచు। నాత్మశుద్ధి...' అనండి.

      తొలగించండి
  49. అరుణ గిరిని చేరి, అప్పను ధ్యానించి
    నేనెవడను? యంటు నేతి నేతి
    మార్గమందు వెడ, రమణుల వోలెను, మరి
    స్నాన జపములేల జంద్య మేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎవడను + అంటు = ఎవడ నంటు' అవుతుంది. ఐనా 'అంటు' అన్న ప్రయోగం సాధువు కాదు. 'అనుచు, అంచు' అనాలి. అక్కడ 'నే నెవడ నటంచు' అనండి.

      తొలగించండి
  50. ధన్యవాదాలు గురువు గారు... సరి చేసాను


    అరుణ గిరిని చేరి, అప్పను ధ్యానించి
    నేనెవడన?టంచు నేతి నేతి
    మార్గమందు వెడ, రమణుల వోలెను, మరి
    స్నాన జపములేల జంద్య మేల?

    రిప్లయితొలగించండి
  51. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    స్నాన జపము లేల జంద్య మేల

    సందర్భము: మనసులో మొలకగా ఉన్న భక్తి మహావృక్షంగా ఎదిగినప్పుడు మడి మైల అనేవి దానికి సహకరించ వలసిన అవసరం లేదు. భక్తి దృఢతరం కావడానికే విధి నిషేధాలు కానీ భక్తి సుస్థిరమైన తర్వాత వాటితో పనిలేదు కదా! అవి కేవలం భావ శాసనాలే!
    స్నానాలు జపాలు అన్నీ చివరికి పరిగణించ తగినవి కావని తేలుతుంది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మనసులోన భక్తి మహితమైనప్పుడు
    మడియు మైల లేల మహితలాన?
    విధి నిషేధము లవి వింత భావమ్ములే!
    స్నాన జపము లేల? జంద్య మేల?

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    22.10.18
    -----------------------------------------------------------
    ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    స్నాన జపము లేల జంద్య మేల

    సందర్భము: ఇది వేమన పద్యానికి మరో రూపం లాంటిది.
    ఆత్మశుద్ధి కలిగినవాడు ఆచారాన్ని పాటిస్తే అందరూ గౌరవిస్తారు లేకపోతే "చెప్పేవి శ్రీరంగనీతులు దూరేవి దొమ్మరి గుడిసెలు" అని ఈసడిస్తారు.
    భాండ శుద్ధి అంటే వంట పాత్రలు శుభ్రం చేయటం. ఓపికతో శుభ్రం చేయకుండా అలాగే వండితే వస్తుం దనుకున్న రుచి రాదు సరికదా కంపుకొట్టినా ఆశ్చర్యం లేదు. అతిథులు భోజనం చేసే మాట దేవు డెరుగు..
    అలాగే చిత్తశుద్ధి కలిగి శివ పూజ చేస్తే శీఘ్రంగా ఫలితం వస్తుంది. చిత్తశుద్ధి లేకుండా స్నానాలు జపాలు మొదలైన నియమాలను పాటిస్తూపోతే నియమాలను పాటించడమే జరుగుతుంది కానీ గమ్యాన్ని చేరుకోవడం జరుగదు కదా!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ఆత్మశుద్ధి యున్న నాచార మది ముద్దు..
    భాండ శుద్ధి యున్న వంట ముద్దు..
    చిత్త శుద్ధి యున్న శివపూజలే ముద్దు..
    స్నాన జపము లేల? జంద్య మేల?

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    22.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి


  52. పాప బుద్ధి తోడ పనులు చేయుచు నుండి
    చెడ్డ వారి తోడ చెలిమి చేసి
    నటన చేయు నట్టి నయవంచకుల కిల
    స్నాన జపము లేల జంధ్య మేల

    రిప్లయితొలగించండి
  53. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  54. [10/22, 9:26 AM] Dr Umadevi B: రెండవ పూరణ

    డా.బల్లూరి ఉమాదేవి

    చిత్త శుద్ధిలేక చెత్త(డ్డ)పనులు చేసి
    మేక తోలు కప్పు మెకము వోలె
    సంచరించ జగతి నెంచి చూడగ వాని
    స్నాన జపము లేల జంధ్య మేల.

    రిప్లయితొలగించండి
  55. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    స్నాన జపము లేల జంద్య మేల

    సందర్భము: లెక్క చేయడానికి ఎక్కాలు వల్లె వేయాలి. లెక్కలు చేయడానికి వచ్చిన తరువాత ఎక్కాలు వల్లె వేస్తూ కూర్చుంటే ఫలిత మేమున్నది? అంతవరకు నేర్చుకున్న ఎక్కాలతో లెక్కలు చేయవలసి ఉన్నది కదా!
    (అవి చేయకుండా ఎక్కాలే వల్లిస్తానంటే ఎలా?)
    మనుష్యుని ప్రజ్ఞ ఈశ్వరార్పణమైన తరువాత (కర్తృత్వం భోక్తృత్వం నశించిన తరువాత) స్నాన జపాదులతో నిమిత్తం ఏమున్నది?
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    లెక్క చేయు కొఱకు నెక్కాల వల్లింప
    వలయు; వచ్చెనేని వల్లె వేయ
    నేమి ఫలము? ప్రజ్ఞ
    ఈశ్వ రాంకితమైన
    స్నాన జపము లేల? జంద్య మేల?

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    22.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి