23, అక్టోబర్ 2018, మంగళవారం

సమస్య - 2824 (శాల్యోదన మిచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్"
(ఛందోగోపనంగా వృత్తంలోను పూరించవచ్చు)

89 కామెంట్‌లు:

 1. రిప్లయిలు


  1. పల్యంకము కిరుకిరుమన
   మూల్యము లేనట్టి మగువ ముద్దుల నడుమన్
   కల్యాణపు శోభనమున
   శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్

   తొలగించు
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
   నిజమే... ఆ సందర్భంలో పాలు, పళ్ళు, ఇతర ఉత్ప్రేరకాలు కావాలి కాని అన్న మెందుకు?
   చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించు
 2. బాల్యమునుండియు ననిశము
  కాల్యమ్మున నిదురలేచి కడుపున నింపన్
  శల్యములను నుసి చేయును
  శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్?

  రిప్లయితొలగించు
 3. కుల్యోదనమున కది సమ
  తుల్యము గాదండ్రు జనులు దోషముగాదే
  శల్యావశిష్ఠు కైనను
  శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్వంబుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కుల్యోదనము =మాంసాహారము
   శాల్యోదనము= మంచి బియ్యపు అన్నము

   తొలగించు
  2. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించు
  3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

   తొలగించు

 4. మగడా ! ఇంట్లో వంట చేసా రారా అంటే, బెల్టు షాపు కాడి పెన్మిటి :)  మాల్యా కింగ్ఫిష రిచ్చును,
  తుల్యంబుగ నాల్క పైన తువ్వరపడుచున్
  కల్యాణి, కిక్కు! మరి నీ
  శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్?

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వహ్వా!

   బెల్టుషాపులో కింగ్ఫిషరా? గుడుంబయా?

   తొలగించు

  2. ఎక్స్ పీ రియన్సు గలవాళ్ళే చెప్పాలి :) ఏదో రైమింగా ఉందని వేసా ?

   అమ్మరా వాళ్ళు ?


   జిలేబి

   తొలగించు
  3. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   బెల్ట్ షాపుల్లో కింగ్ ఫిషర్ సుబ్బరంగా దొరుకుతుంది.

   తొలగించు
 5. (పిండిపదార్థాల నాపమనీ , మూడు మాసాల ఆహారవిధానం వల్ల మధుమేహం , దేహభారం నశిస్తాయనీ ఎలుగెత్తి చాటిన తెలుగువీరుడు
  వీరమాచినేని రామకృష్ణ )
  మాల్యము లివియె ; సమాజపు
  కల్యాణమ్మును దలచిన ఘనమానవుడా !
  మూల్య మెరుంగము ; నిజమే
  శాల్యోదన మిచ్చునొక్కొ జవసత్త్వంబుల్ ?

  రిప్లయితొలగించు
 6. బాల్యమున చెంగ లించగ
  శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్
  మూల్యము చెల్లించ వలె న
  కల్యము నిడు తండులమ్ము కను వృద్దులకున్

  రిప్లయితొలగించు
 7. మూల్యము చెల్లించి కొంటిని
  మాల్యము దేవుని గళమున మంగళ మౌగా
  కల్యాణము నందు విందుల
  శాల్యోదనమిచ్చు నొక్కొ జవ సత్వంబుల్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి, మూడవ పాదాలలో గణదోషం. "మూల్యము చెల్లించితినే.... కల్యాణమందు విందుల" అనండి.

   తొలగించు
  2. మూల్యము చెల్లించి తినే
   మాల్యము దేవుని గళమున మంగళ మౌగా
   కల్యాణ మందు విందుల
   శాల్యోదనమిచ్చు నొక్కొ జవ సత్వంబుల్

   తొలగించు


 8. కైశోరంపుల బుచ్చి గాడి నకొ ? చా, కైపెక్కు కైపుల్ భళా
  యీ శాండో బలిసెన్ పలమ్ముల సుమా ! యీప్రొద్దు రావాడ, గ
  ర్తా! శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ ? లతాతన్వి,ఓ,
  వైశాలీ ! రమణీ జి లేబి వలయున్ వర్రోడు మద్యంబహో !  జిలేబి

  రిప్లయితొలగించు
 9. మైలవరపు వారి పూరణ

  ఆశావాదివిగా జరించుమిల రైతన్నా ! శ్రమన్ జేయుమీ
  దేశమ్మే వ్యవసాయభాసురముగా దీపించురా ! వచ్చురా
  నీ శక్తిన్ గని దైవమే చినుకులందింపంగ ., సంపద్విధా...
  తా ! శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ కృషిన్ మానుచో ?!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. లౌల్యము జిహ్వకు బెరిగిన ,
   మూల్యము చెల్లింపవలయు భువిలో నరుడా !
   తుల్యము విసమున కు నమిత
   శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్??

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించు
  2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
 10. కల్యాణకారకమ్మౌ
  శాల్యోదనమిచ్చునొక్కొజవసత్వంబుల్
  బాల్యంబునుండివెజ్జులు
  శల్యంబౌదేహమిప్డు చక్కెరకనగా

  రిప్లయితొలగించు
 11. శాల్యోదనమొకదెసమరి
  కుల్యోదనకింగ్పిషర్లుకుడువుమటన్నన్
  మాల్యా యేమనితల్చును
  శాల్యోదనమిచ్చునొక్కొజవసత్వంబుల్

  రిప్లయితొలగించు
 12. లౌల్యము తోడన్ ప్రీతిన్
  బాల్యమునన్ శాక పాక బంధురమై సా
  కల్యంబై చెల్వంబై
  శాల్యోదన మిచ్చునొక్కొ జవసత్త్వంబుల్.

  రిప్లయితొలగించు
 13. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  శాల్యోదన మిచ్చు నొక్కొ
  జవ సత్త్వంబుల్
  ======================
  మంచి వరి అన్నము చక్కటి
  పౌష్టికాహారమై బలమును ఆరోగ్య
  మును ప్రసాదించును కదా యనుట
  లో విశేషమే ఇచట సమస్య
  ========================
  సమస్యా పూరణం - 290
  ===================

  తీపి రోగము కీళ్ళ నొప్పులు -
  పెరిగిన నడుము ఒంటి తీపులు
  పొట్టగ తెలిసి వచ్చె సుఖములు -
  రక్త హీనతగ చచ్చు నఖములు
  తెలియనైరి ప్రజలు ముడిబియ్యం -
  రాగులు జొన్నల పటుత్వంబుల్
  తలచిరిగ జనులిట్లు శాల్యోదనమిచ్చు -
  నొక్కొ జవ సత్త్వంబుల్

  (శాల్యోదనము = మంచి వరి అన్నము)

  ====##$##====

  సమయం సాయంకాలం -
  వీధిలో ఎదురెదురు ఇండ్లు
  ==============================

  సుశీల: వంటయ్యిందా ఒదినా
  సుజాత: ఆ అయ్యిందొదినా నాకు పిల్లలకు
  అన్నం చేసిన ఆయనకు రొట్టెలు చేసిన
  సుశీల: ఎందుకట్లొదినా!
  సుజాత: అయ్యో నీకు తెలువదా, మీయన్నకు
  షుగర్ కదా!
  సుశీల: ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలే
  నా తల్లి (బయటికి అనలేదు మనసులో
  గొణిగినది)

  ఆఫీసు క్యాంటీన్- ఉద్యోగుల బాతాఖాని
  =============================

  సురేష్ : అరే బాబు నాల్గుల ఆరు చాయ్ తే
  నరేశ్ : బాబు దాంట్ల ఒకటి వితౌట్ షుగర్

  కొసమెరుపు : షుగర్/మధుమేహం/తీపి
  ========== బీమారి ఇది గొప్ప గొప్ప
  వాళ్ళకే వస్తది, నేను కూడా గొప్ప
  వాళ్ళ గుంపులో చేరిపోయానోచ్

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  (శుభోదయం)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బాగుంది.
   నాకు బిపి, సుగర్ రెండూ లేవు. అంటే నేను గొప్పవాణ్ణి కాదన్నమాట! సంతోషం!

   తొలగించు
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2824
  సమస్య :: శాల్యోదన మిచ్చు నొక్కొ జవసత్త్వంబుల్.
  *ఛందోగోపనము* అనే పద్ధతి ద్వారా ఈ సమస్యకు ముందు కొన్ని అక్షరములను తరువాత కొన్ని అక్షరములను దాచియుంచడం జరిగింది.
  వరి అన్నం తింటే జవసత్త్వాలు కలుగుతాయా? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
  సందర్భం :: వరి అన్నమను భుజించి జీవించే భారతీయ బ్రాహ్మణోత్తముడు ఒకడు అమెరికా వెళ్లి ఆ దేశం వాళ్లు అతిగా మాంసాహారమును తినడం చూచి ఆశ్చర్యపడ్డాడు.
  అప్పుడు ఆ మాంసాహారి “అయ్యా! మనకు కావలసిన అత్యవసర పోషక పదార్థాలైన మాంసకృత్తులు నవామ్లములు (AMINO ACIDS) అధికశాతంలో ఉండేది మాంసంలోనే. అందువలన మా అమెరికా దేశస్థు లందఱూ చాలా ఇష్ఠంగా అధికంగా మాంసాన్నే తింటారు. చక్కగా జవసత్త్వాలను పొందుతారు. ఏ మీమాంస లేకుండా నీవు కూడా మాంసం తిను” అని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా “వరి అన్నం తింటూ ఉంటే మీకు అసలు జవసత్త్వాలు కలుగుతాయా?” అని ఆ అమెరికా దేశస్థుడు ప్రశ్నించే సందర్భం.

  అమితామ్లమ్ముల, మాంసకృత్తులను మాంసాహార మందించు, మా
  ది మహద్భోజన మెన్న మా యమెరికా దేశస్థు లీ మాంసమున్
  దమితో దిందురు, కాంతురయ్య జవసత్త్వా, లేల మీమాంసలున్?
  తమ శాల్యోదన మిచ్చు నొక్కొ జవసత్త్వంబుల్ సువిప్రోత్తమా?
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-10-2018)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజశేఖర్ గారూ,
   మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
  2. సవరణతో
   గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
   సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2824
   సమస్య :: శాల్యోదన మిచ్చు నొక్కొ జవసత్త్వంబుల్.
   *ఛందోగోపనము* అనే పద్ధతి ద్వారా ఈ సమస్యకు ముందు కొన్ని అక్షరములను తరువాత కొన్ని అక్షరములను దాచియుంచడం జరిగింది.
   వరి అన్నం తింటే జవసత్త్వాలు కలుగుతాయా? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
   సందర్భం :: వరి అన్నమును భుజించి జీవించే భారతీయ బ్రాహ్మణోత్తముడు ఒకడు అమెరికా వెళ్లి ఆ దేశం వాళ్లు అతిగా మాంసాహారమును తినడం చూచి ఆశ్చర్యపడ్డాడు.
   అప్పుడు ఆ మాంసాహారి “అయ్యా! మనకు కావలసిన అత్యవసర పోషక పదార్థాలైన మాంసకృత్తులు నవామ్లములు (AMINO ACIDS) అధికశాతంలో ఉండేది మాంసంలోనే. అందువలన మా అమెరికా దేశస్థు లందఱూ చాలా ఇష్ఠంగా అధికంగా మాంసాన్నే తింటారు. చక్కగా జవసత్త్వాలను పొందుతారు. ఏ మీమాంస లేకుండా నీవు కూడా మాంసం తిను” అని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా “వరి అన్నం తింటూ ఉంటే మీకు అసలు జవసత్త్వాలు కలుగుతాయా?” అని ఆ అమెరికా దేశస్థుడు ప్రశ్నించే సందర్భం.

   అమితామ్లమ్ముల, మాంసకృత్తులను మాంసాహార మందించు, మా
   ది మహద్భోజన మెన్న మా యమెరికా దేశస్థు లీ మాంసమున్
   దమితో దిందురు, కాంతురయ్య జవసత్త్వా, లేల మీమాంసలున్?
   తమ శాల్యోదన మిచ్చు నొక్కొ జవసత్త్వంబుల్ ధరిత్రీసురా!
   కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (23-10-2018)

   తొలగించు


 15. జల పుష్పంబులు, కాశ్యపమ్ములవలెన్ శ్రాణమ్ము,పచ్చళ్ళు, లా
  తల శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ ? కురంగాక్షి! కో
  మలి!పర్వేందుముఖీ! జిలేబి! వలయున్ మాంసమ్ము నంజుళ్ళు తె
  మ్మ! లతాంగీ!మన కామకేళి హరిమన్ మత్తున్ సయాటల్ గనన్!


  జిలేబి

  రిప్లయితొలగించు
 16. చాల బాగున్నది అవధానిగారూ! అభినందనలు!💐💐💐

  రిప్లయితొలగించు
 17. భరతోర్విన్ మహనీయులెందరొ మునుల్ వాల్మీకివిఖ్యాతులున్

  పరమోత్కృష్టగుణమ్ములన్ వడసిరీ భవ్యాన్నభుక్తిన్, సదా

  పరమారోగ్యవిధాయకప్రకటసద్భావప్రభాశీలిని

  ర్భరశాల్యోదనమిచ్చు నొక్కొ జవసత్వంబుల్ మనశ్శక్తులన్.

  కంజర్ల రామాచార్య.  రిప్లయితొలగించు
 18. శాల్యంచితధాన్యమె వై

  శాల్యంబునఁ బంట నొసగు, సత్వగుణము నీ

  శాల్యన్నమె యొనగూర్చుచు

  శాల్యోదనమిచ్చునొక్కొ జవసత్వంబుల్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
 19. కుల్యోదన తత్పరులకు
  శాల్యోదనమిచ్చునొక్కొజవసత్త్వంబుల్
  మూల్యముమిక్కుటమైనను
  గుల్యంబునెదిందురెపుడుగోరికలలరన్

  రిప్లయితొలగించు
 20. కందం
  లౌల్యమున నతిథి నై తిన
  బాల్యమ్మందున్న సుతుని వండమనంటిన్
  దుల్యమె మరొకటి? శిరియా!
  శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్?
  (భక్త శిరియాల చరితం)

  రిప్లయితొలగించు
 21. నేటి శంకరా భరణము సమస్య
  “శాల్యోదన మిచ్చునొ క్కొ జవ సత్త్వంబుల్”

  కంద పద్య పాదము నా పూరణము సీస పద్యములో


  ఒకడికి టి.బి. షుగర్, బి.పి. మొదలైన జబ్బులు గలవు. క్షయ వ్యాధికి ఘనమైన ఆహారము తినాలి. ఘనమైన ఆహారము తింటే షుగర్ పెరుగుతుంది. వరి యన్నము (సూపర్ ఫైన్ రైసు, మూడు సార్లు పాలిష్ పట్టించినవి మాత్రమే) తినేవాడు దానిలో పోషకాలు ఉండవు. చివరికి ప్రకృతి ఆశ్రమములో కి జేరుదామని వెళితే ఆ ప్రకృతి వైద్యుడు చెప్పిన మాటలు )మొలకల గింజలు ,కాకర కాయ ఇత్యాది కూరల రసాలు త్రాగుచు , పుల్కాలు ఆకు కూరలు తినమని సలహా చెపుతాడు.


  ఘనమైన భోజనమును తినగవలయు నీక్షయ వ్యాధికి, నీరసమ్ము

  పోగొట్టగ నదిక భోజనము తినిన మధుమేహ రోగంబు నధిక మగును,

  ముప్పు చేయునుగ కల్లుప్పు వాడుక, నీ రుధిరములో నొత్తిడి పెరుగు, చెప్పు,

  పిచ్చి శాల్యోదన మిచ్చు నొక్కొ జవసత్త్వంబుల్ సతము నీకు ,తప్పదయ్య


  నీకు భోజనమున మార్పు, నీవు కూర

  ల రసమున్ త్రాగు, మొలకలు లక్షణముగ

  తినుచు భోజనమున చపాతీలు తినుమ

  నుచు భిషజుడు నొక్కి బలికె నొకని తోడ
  రిప్లయితొలగించు
 22. బాల్యము నుండి యొ సగుసమ
  తుల్య పు టాహార మొసగు తుష్ టి ని పుష్టి న్
  శల్య ము లు పెరుగు కొరకై
  శాల్యోదనమిచ్చు నొక్కొ జవసత్వoబుల్

  రిప్లయితొలగించు
 23. డా. పిట్టా సత్యనారాయణ
  "మాల్యా"యొంటెకు జిలకర
  "శల్యు"నకున్ బాలు,పండ్లు శక్తి నిడునటోయ్
  "యెల్యా!"(ఎల్లయ్య) "రబి"కిడు రూకల్
  "శాల్యోదన"మిచ్చునొక్కొ జవసత్త్వంబుల్?

  రిప్లయితొలగించు
 24. డా. పిట్టా సత్యనారాయణ
  నెర నా జొన్నల రవ్వ గట్క దినగన్ నీమంబు గాదాయె, పో
  జర చల్లంగొని ద్రాగుటే సరి గదా!చాలేండ్లు నిట్లే దినన్
  చెర నేగే నిదె శర్కరల్ రుధిరమున్ జేరంగ నింకెట్టులీ
  ధర శాల్యోదన మిచ్చునొక్కొ జవమున్ ధర్మంబుగా సత్త్వమున్

  రిప్లయితొలగించు
 25. శంకరాభరణం...22/10/2018
  సమస్య:

  స్నానజపములేల? జంధ్యమేల
  **** **** **** ***** *** ***
  ఆ.వె.

  స్నానమాచరించి ధ్యానము గతితప్ప

  పరమ శివుని గొలువ ఫలితమేమి?

  చిత్త మొకటి నిలుపు శివదేవు నర్చింప

  స్నానజపములేల? జంధ్యమేల?

  🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷వనపర్తి🌷

  రిప్లయితొలగించు
 26. కల్యాణపు విందున విష
  తుల్యమగు భరణముతినగ దోషికమొనరన్
  శల్యమగు శరీరమునకు
  శాల్యోదన మిచ్చునొక్కొ జవసత్వంబుల్

  రిప్లయితొలగించు

 27. Veg పూరణ :(  కాల్యపు వేళన గంజియు
  శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్?
  తుల్యము గా వ్యాయామము
  కల్యాణీ చేయవలెను కండలు గూడన్ :)


  జిలేబి

  రిప్లయితొలగించు
 28. పురాంతరమున బహు కాల క్షుద్బాధతో నలమటించు చున్న మిత్రు లొకచో వివాహము జరుగు చుండఁ గని తమలో ముచ్చటించు కొను సందర్భము:

  తుల్యము క్షుధ నరకమునకు
  శల్య మగుట నిక్క మౌను జావక మున్నే
  కళ్యాణోత్సవమునఁ దిన
  శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్


  కాశీనాథ దయా నిమిత్త జన రక్షా దక్ష దేవేంద్ర సం
  కాశ క్ష్మావిభు సంచయాన్వితమ యిక్ష్వాక్వన్యయం బౌను స
  ర్వాశాభగ్నము కాటకమ్మునను దేశావాస బాధాఘ్న మై
  వైశాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ ప్రజాకోటికిన్

  [వైశాలి = విశాల దేశ రాజ పుత్రిక (విశాలుని కూతురు); వైశాలి + ఓదనము = వైశాల్యోదనము; ఓదనము = అన్నము]

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు
 29. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వరముల్ నీయగ వచ్చితీవుగద మా పత్రాలు టెంకాయలన్
  సరియౌ తీయని కుడ్ములన్ కొనుము మా శాకాల్ కపిత్థాలనున్;...
  పరమానందము తోడ నీకిచట తాపాలన్ని తోలంగ ని
  ద్ధర శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ గణేశా వరా?

  రిప్లయితొలగించు
 30. వ్యాకరణ మీమాంస:
  పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఈ క్రింది సమాసము సంశయాత్మకముగా నున్నది. పరిశీలించ గోరెదను.

  “పరగెన్ రక్త నదుల్ పిశాచకుల మంభఃకేలి లోలంబుగన్”

  పిశాచకుల మంభఃకేలి లోలంబుగన్:

  పిశాచకులము యొక్క అంభఃకేలి యని షష్ఠీ తత్పురుష సమాస మనుకున్న “ పిశాచ కులము నంభః కేలి” కా వలెను గదా.

  పిశాచ కులపు అంభః కేలి యని కర్మధారయ సమాస మనుకున్న
  పిశాచ కులపు టంభః కేలి యగును గదా.
  లేక
  పిశాచకులము అంభఃకేలి లోలంబుగన్ – అని యసమాసముగా భావించిన నన్వయము కుదుర గలదా.
  వివరించ గోరేదను.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అర్థవత్ సమాసః అన్నారు పెద్దలు. మనం చెప్పుకునే విగ్రహవాక్యాన్ని బట్టి సమాసనామం!
   ఇక్కడ కులము మాత్రమే కాదు కేలి శబ్దం కూడా ప్రథమలోనే ఉంది. అలా కాకుండా సమాస మనుకుంటే 'కేలీలోలంబుగన్' అని ఉండాలి. పిశాచకులము ప్రథమలోనే ఉంది. కేలి మాత్రం సప్తమ్యర్థంలో ప్రథమ.
   పిశాచకులము = దయ్యాల గుంపు; అంభఃకేలి = జలక్రీడలందు; లోలంబుగన్ = ఆసక్తి చూపునవి కాగా (ఆసక్తి చూపునట్లుగా); రక్తనదుల్ = నెత్తురు వాగులు; పరఁగెన్ = ఒప్పినవి.

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   నేను కూడ దీని నసమాసముగానే యూహించితిని.
   ఇది భార. ద్రోణ. 1. 195. లోనిది.

   సమాసమయితే కేలి లోలంబుగన్ , కేలీ లోలంబుగన్ రెండు సిద్ధ సమాసములే కదా.
   కేలి ఇ కారాంత పుం,స్త్రీలింగము, ఈ కారాంత స్త్రీలింగము కదా.
   రజని, రజనీ లు కూడ ఇదే విధముగా రెండు రూపములు.

   మాలిని.
   త్రిజగదవననిత్యక్రీడనోద్యత్ప్రమోదా!
   రజనిచర విఘాతారంభ లీలా వినోదా!
   భజన నిరత సౌఖ్యప్రాప్తి జాగ్రత్ప్రసాదా!
   నిజతను విభవత్వోన్మీల నాచ్ఛిన్న నాదా! భార. వి. 3. 240

   తొలగించు
 31. కల్యాణీ వలదింకను
  బాల్యము నుండియు వదలక వాడుతినె గదా
  కుల్యోదనమే విధిగన
  శాల్యోదనమిచ్చు నొక్కొ జవసత్త్వంబుల్.

  రిప్లయితొలగించు
 32. అధికారమ్మను మంత్రదండమది తా హస్తమ్మునన్ దాల్చినన్
  బుధుడై వెల్గును జ్ఞానహీను డయినన్ మూఢాళి సేవింపగా
  మధురమ్మంచు ప్రజాధనమ్ముఁ దినెడామాత్యుండ్రనే గాంచ నె
  వ్విధి శాల్యోదనమిచ్చు నొక్కొ జవసత్త్వంబుల్ భువిన్ నేతకున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...దిను నామాత్యుండ్రనే...' అనండి.

   తొలగించు
  2. వి కి త్త్వం లోని వ కు నాల్గవపాదంలో యతి?

   తొలగించు
 33. కల్యాణ మండపమ్మున
  కల్యాణము జరుగు వేళ గమనించితి;నే
  తుల్యమ్మేదీ దీనికి?
  "శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్"

  రిప్లయితొలగించు
 34. సిరిధాన్యాలను సాగుజేసుకొని మిక్సీతోడ శుద్ధీకరిం
  చిరి రోగాల విముక్తికోసరము భక్షిస్తుండ్రహోమానవుల్
  సరదా కైనను కొర్రరాగులను కంచాలందునన్ బెట్టర
  త్తరి శాల్యోదనమిచ్చునొక్కొ జవసత్త్వంబుల్లభాగ్యాలికిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శంకర్జీ గారూ
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'భక్షిస్తుండ్రు' అన్న ప్రయోగం సాధువు కాదు.

   తొలగించు
 35. నిన్నటి సమస్యకు పూరణ :
  ధరలో శ్రేష్ఠమదెట్టి భోజన మనన్ దర్కింపగా నేలరా?
  త్వరితమ్మౌ గతి బల్కగా నగునుగా తాత్సారమే లేకయే
  కరువైనన్ మఱి మాంసమేల కన, శాకాహారమే మేలగున్
  వర శాల్యోదన మిచ్చునొక్కొ జవ సత్త్వంబుల్ నిరాటంకమై
  ****)()(****
  వర శాల్యోదనము = శ్రేష్ఠమైన వరి యన్నము.
  (శ్రేష్టమైన శాకాహారము వలన
  ఎటువంటి ఆటంకాలు {Side effects} ఉండవు.)
  Manage

  రిప్లయితొలగించు