16, అక్టోబర్ 2018, మంగళవారం

సమస్య - 2819 (కాపురము కంటె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాపురము కంటె కన నరకమ్ము గలదె"
(లేదా...)
"కాపురమున్ గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్"
(వూర ఈశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

130 కామెంట్‌లు:



  1. ఇల్లుటాలు చేతిని కర్ర యిరగ దీయ
    పడక కిరువైపులదిగుట వదులు కున్న
    బ్రహ్మ చర్యము కంటె శాపమ్ము గలదె
    కాపురము కంటె కన నరకమ్ము గలదె :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. ప్రొద్దు తిరుగుడు పూవులా పొంగు వాఱు
    బుద్ధి మార్చగ నయమంచు భూరి గాను
    క్షణము మార్చెడి భామతో క్షణిక మైన
    కాపురము కంటె కన నరకమ్ము గలదె ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలె'ను 'లా' అనడం వ్యావహారికం. అక్కడ "పువువోలె" అనండి.

      తొలగించండి
  3. మామ లత్తలు మరుదుల మధ్య నుండి
    మొగుడు మొట్టగ తిట్టగ ముద్దు మీరి
    తోడి కోడండ్రు బావల తోడుగాను
    కాపురము కంటె కన నరకమ్ము గలదె

    రిప్లయితొలగించండి
  4. (1)
    అత్త మామల హింసించి, యాడుబిడ్డ
    లన్న ద్వేషమ్ముఁ జూపుచు ననవరతము
    బాధ పెట్టెడి గయ్యాళి భార్యతోడి
    కాపురము కంటె కన నరకమ్ము గలదె

    (2)
    (దేవతలు, మునులు విష్ణువునకు మొరపెట్టుకొనడం...)

    పాపభయమ్ము లేక మునివాటిక లెల్లను గూల్చు సాధుహిం
    సాపరులైన రాక్షసుల స్వామి సదా దివిజద్విషుండునై
    మా పయి క్రూరకృత్యముల మానని రావణుఁ డేలుచున్న లం
    కాపురమున్ గ్రమించు నరకమ్మొక టున్నదె యెంచి చూడఁగన్.

    రిప్లయితొలగించండి


  5. మూపుపయిన్ రమా మణి దుముక్కని చేతిని దుడ్డు కర్రతో
    సాపుగ వేసి మొట్టి తన స్థానము తెల్పుచు కీచు లాడుచున్
    వేపుడు మాదరింపులన వేకువ జామున తిట్టి పోయగా
    కాపురమున్ గ్రమించు నరకమ్మొక టున్నదె యెంచి చూడఁగన్!

    ఇవ్వాళ డమాలే డమాలు :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. డా. పిట్టా సత్యనారాయణ
    చాలు!యౌవనమున నారి సంగమంబు
    కొరకు మొదలిడి వెతలలో క్రుంగిపోయి
    పేరు దెచ్చుకొనుటకైన పెనుగులాట
    కాపురము కంటె కన నరకమ్ము కలదె?!

    రిప్లయితొలగించండి
  7. ఎంత చెప్పిన మాటలు సుంత వినక ,
    తనదు తలిదండ్రులను గూర్చి తగవుపడుచు ,
    మగువ మనసును నొప్పించు మగని తోడి
    కాపురము కంటె , కన నరకమ్ము గలదె ?

    రిప్లయితొలగించండి
  8. సవతి పోరును దహియింప శాంతిఁగలదె!
    పరగ గయ్యాళి భార్య యింపగునె యెపుడు!
    వాదులాడుట నైజమై,భగ్నమైన,
    కాపురము కంటె కన నరకమ్ముఁగలదె!

    రిప్లయితొలగించండి


  9. భువిని యింద్రలోకమిదియె పుష్యరథము
    కాపురము, కంటె! కన, నరకమ్ము గలదె,
    యిల్లు విడిచి సన్నాసిగ యింకబారి
    బోవ! సంసారమే యనుభోగమయ్య !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భువుని నింద్రలోక..' మనండి.
      ఇల్లు, ఇల్లాలిని విడిచి వృద్ధాశ్రమంలో ఉన్న నా గురించి కాదు కదా ఈ పూరణ?

      తొలగించండి

    2. అయ్యబాబోయ్ కానేకాదండోయ్
      జనాంతికంగా అంతే !


      నెనరులు
      యడాగమ నుగాగాములెప్పడు సరిపడతాయో :)

      తొలగించండి
  10. అత్త మామలు హింసింప నాడు బిడ్డ
    సూటి పో ట గు తూటాల మాట ల నగ
    భర్త వారికి సతతము వంత పాడ
    కాపురము కంటె కన నరక మ్ము గలదె ?

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    ఏ పని చెప్పినన్ విని హసింతురు చిన్న సమస్య యంచు , మీ..
    రాపరు నీటిపంపు , మరి యార్పరు దీపములంచు నీల్గు , మీ..
    పాపల యల్లరేమి యని బల్కెదరిద్ధర నద్దెయింటిలో
    కాపురమున్ గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్దెకొంప అగచాట్లను గురించిన మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూవు దొరికిన ప్రియమైన పొలతికిచ్చు .,
      నిచ్చకములకునెంచి మా యిల్లుఁజేరు !
      మరొక భామను మరిగిన మగనితోడ
      కాపురము కంటె గన నరకమ్ము గలదె ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  12. భార్య జీతమక్కరలేని బానిసయని
    తలచు నీచుడు జూదరి త్రాగుబోతు
    మానవత్వమె కరువైన మగని తోడ
    కాపురము కంటె కన నరకమ్ము గలదె.

    రిప్లయితొలగించండి
  13. పక్షవాతము గల భర్త,పతిని వదలి

    వచ్చిన తనయ,త్రాగెడి వడువు,విధవ

    తోడు కోడలు, సిరిలేమి,కూడు కొన్న

    కాపురము కంటె కన నరకమ్ము కలదె

    రిప్లయితొలగించండి
  14. భార్య బిడ్డలంచు మురిసి భ్రమల దేలి
    పదవి యశము ధనమ్ముల బ్రాకులాడి
    మిథ్యయంచు నెరిగియు యవిద్య మున్గు
    కాపురము కన్న గన నరకమ్ము గలదె!

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా సత్యనారాయణ
    చూపుకు గోచి రక్షణకు చొప్పడినట్టిది ;యీతి బాధలన్
    మోపెడు మోయకున్న నొక మ్రుచ్చు యనన్నవహేళనాయె,నే
    నోపితినయ్య కష్టముల నూరిననన్ మగరాయడంద్రు నా
    దాపున బేరు రాదుగద దగ్గర నైనది మృత్యు వాత యీ
    కాపురమున్ గ్రమించు నరకమ్మొకటున్నదె యెంచి చూడగన్?

    రిప్లయితొలగించండి

  16. ప్రొద్దు దిరుగుడు మనసున్న ముద్దు గుమ్మ
    భర్త నెటులైన హింసించి పరవ సించ
    పక్క పైనను ముళ్ళుంచ చక్క నైన
    కాపురము కంటె కన నరకమ్ము గలదె

    రిప్లయితొలగించండి
  17. కూర్చు స్వర్గమ్ము భువిలోన కొంత తడవు
    తదుపరి వరుస కష్టముల్ దాపురించు
    నెంచి చూడ మానవునకు నిల్లటంపు
    కాపురము కంటె కన నరకమ్ము గలదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  18. తోపుడు బండి జీవితము తోడుగ జోడుగ లాగుచున్ భళా
    రాపగలున్ జిలేబి యగు రాణి సయాటల ద్రేలి పోవుచున్
    కాపురమున్ గ్రమించు; నరకమ్మొక టున్నదె యెంచి చూడఁగన్,
    నీపయనమ్ము లో జనుల నేమపు మాటల నమ్మి క్రొత్తడిన్
    రాపుచు నమ్మి వచ్చిన వరానన కన్నుల నీరు గార్చుటే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రేపగలు'ను 'రాపగలు' అన్నారు. 'దేలిపోవు'ను 'ద్రేలిపోవు' అన్నారు. 'క్రొత్తడి'...?

      తొలగించండి


    2. మొదటి రెండు అప్పుతచ్చులు

      క్రొత్తడి - భార్య - ఆంధ్ర భారతి ఉవాచ

      తొలగించండి
  19. ఒక తండ్రి తన కుమారుడు అమెరికా లోచదువు కుంటాను అని చెప్పి నపుడు దూరపు కొండలు నునుపు అమెరికా పురము ప్రస్తుతం నరక ప్రాయము అని హిత బోధ చెయు సందర్భము

    చతికిల బడెను గానేడు సాఫ్ట్ వేరు
    కొలువు,వీసాలు పొందుట సులువు కాదు,
    ట్రంపు దెబ్బకు వచ్చెను ముంపు, నమెరి
    కా,పురము కంటె కన నరకమ్ము కలదె

    రిప్లయితొలగించండి
  20. మిత్రులను కలసి చాలా కాలమైనది
    మధుమేహమును నియంత్రించుకొని
    రెండు కళ్ళకూ శస్త్రచికిత్స చేయించుకొని
    ఇతరత్రా అనారోగ్యముల నుండి కూడా
    చాలా వరకూ కోలుకొన్నాను

    అందరికీ వందనములు
    అందరి పూరణలూ అలరించు చున్నవి
    అలరించ నున్నవి

    అశోక వనమున సీతామాత దుఃఖముతో :

    01)
    ____________________________________

    కాపురుషుండు,రావణుని - కావలి వారల మధ్య దీనయై
    కాపుర మున్నయట్టి తన - కానన వాసము దల్చి బాధతో
    శోకము యుప్పతిల్లగ య - శోక వనంబున దల్చె నిట్లు; లం
    కాపురమున్ గ్రమించు నర - క మ్మొక టున్నదె యెంచి చూడఁగన్
    కాపటికున్ వధించి నను - గావగ రాముడు వచ్చు నెన్నడో ?
    ____________________________________
    కాఁపురము = నివాసము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      బ్లాగులో మీ పునర్దర్శనం సంతోషకరం. మీ ఆరోగ్య విషయాలు తెలిసి సంతోషించాను.

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      కొన్ని సూచనలు వాట్సప్ సమూహంలో చేసాను చూడండి.

      తొలగించండి
    3. వసంత కిషోర్ గారూ!మీ ఆరోగ్యం బాగవడం' మీరు మళ్ళీ పూరణలు చేయడం మూదావహం! నమస్సులు!

      తొలగించండి
    4. వసంత కిషోర్ గారు మీ పునరాగమనము సంతోష దాయక మైనది. ఆరోగ్యము కుదుట పడినందులకు విచారోపశమము కలిగినది.

      తొలగించండి
    5. శంకరార్యా ! ధన్యవాదములు !
      సీతాదేవిగారూ ! ధన్యవాదములు !
      కామేశ్వరరావుగారూ ! ధన్యవాదములు !

      తొలగించండి
    6. ప్రాసను గుర్తు చేసిన మిత్రులు శేషఫణిశర్మగారికి
      ధన్యవాదములతో

      అశోక వనమున సీతామాత దుఃఖముతో :

      01అ)
      ____________________________________

      కాపురుషుండు,రావణుని - కావలి వారల మధ్య దీనయై
      కాపుర మున్నయట్టి తరి, - కామము హెచ్చిన రాక్షసాధమున్
      చూపులె కాల్చుచుండగ, న - శోక వనంబున సీత దల్చె; లం
      కాపురమున్ గ్రమించు నర - క మ్మొక టున్నదె యెంచి చూడఁగన్
      కాపటికున్ వధించి నను - గావగ రాముడు వచ్చు నెన్నడో ?
      ____________________________________
      కాఁపురము = నివాసము

      తొలగించండి

  21. సవరించినది - క్రొత్తడి -భార్య ఆంధ్ర భారతి ఉవాచ

    తోపుడు బండి జీవితము తోడుగ జోడుగ లాగుచున్ భళా
    రేపగలున్ జిలేబి యగు రేవతి సన్నిధి తేలి పోవుచున్
    కాపురమున్ గ్రమించు; నరకమ్మొక టున్నదె యెంచి చూడఁగన్,
    నీపయనమ్ము లో జనుల నేమపు మాటల నమ్మి క్రొత్తడిన్
    రాపుచు నమ్మి వచ్చిన వరానన కన్నుల నీరు గార్చుటే


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =======================
    కాపురమున్ గ్రమించు నరకమ్మొక
    టున్నదె యెంచి చూడగన్
    =========================
    పరిశీలించి చూడగ సంసారమును
    మించిన నరకము మరొకటి లేదు
    కదా యని చెప్పటంలో విశేషమే సమస్య
    ===========================
    సమస్యా పూరణం - 285
    ==================

    గయ్యాళి సతుల తీరు వేరు-
    బూతు మాట నోట నిరతము పారు
    ఆమె నోటికి మొక్కు వాడ ఊరు-
    భర్త భయపడు చేయ పోరు
    సంసార కుతకుతలు సరిగమలుగా-
    బతుకున గాంచి పాడగన్
    కాపురమున్ గ్రమించు నరకమ్మొక-
    టున్నదె యెంచి చూడగన్

    ====##$##====

    భార్య నోటి దురుసుకు, గయ్యాళి తనానికి
    భయపడి సోక్రటీసు (క్రీ. పూ. 470-399)గొప్ప
    తాత్త్వికుడుగా అవతరించాడు

    భార్య గయ్యాళి తనమునకు విసిగి ఆమెను
    త్యజించి గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా అవతరించాడు
    11 వ శతాబ్దపు రామానుజుడు, అంత మాత్రమే
    కాదు 120 సంవత్సరముల సంపూర్ణ జీవితాన్ని
    జీవించాడు

    భార్య గయ్యాళి తనము తనలోని రచయితను
    మేల్కొలుప గొప్ప రచయిత అయినాడు 19 వ
    శతాబ్దపు లియో టాల్ స్టాయ్

    కొసమెరుపు:- భార్య గయ్యాళి తనము
    =========== కాపురమును నరకముగ
    చేయటమే కాదు ఇతరత్రా కొన్ని లాభములను
    కూడా చేకూర్చుతుందోయ్.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    (శుభోదయం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. రమేశా వారు

      రామానుజలవారి గురించి మీ మాట మరీ జిలేబీయముగా వుంది :) ఆధారమేమి ?


      జిలేబి

      తొలగించండి
    2. యతిగా మారుటకు ముందు అతను సంసారియే
      చరిత్ర చెబుతున్నది నేను కాదు

      తొలగించండి

    3. సంసారి యే. ఆవిడ గయ్యాళి అని యే చరిత్రలో వున్నది ? యతి అయ్యేడు కాబట్టి ఆవిడ భార్య గయ్యాళి అయిపోయిందా ? :)

      జిలేబి

      తొలగించండి
  23. కొండ వలెనుండ పెద్దల యండదండ
    సాగి పోవు కాపురమది చక్క గాను
    పెద్దలను కాదనుచు వీడి, పెట్టు వేఱు
    కాపురము కంటె కన నరకమ్ము గలదె

    రిప్లయితొలగించండి


  24. ఆలు మగలు గూడి సతత మాదరమ్ము
    తోడ నున్న నదియు స్వర్గ తుల్యమగును
    గృహిణి మనసెరుగని యట్టి గేస్తుడున్న
    కాపురము కంటె , కన నరకమ్ము గలదె ?

    రిప్లయితొలగించండి
  25. ద్వారకాపుర మను నొక యూరి యందు
    కాపురమ్ముంటి నీటికే కరవు పట్టె
    నీతియును లేదు, కలహాల నిప్పు, ద్వార
    కాపురము కంటె కడు నరకమ్ము కలదె! (సమస్య తేలికదే కనుక భిన్నార్థం లో ప్రయత్నించాను. )

    రిప్లయితొలగించండి
  26. ద్వారకాపుర మను నొక యూరి యందు
    కాపురమ్ముంటి నీటికే కరవు పట్టె
    నీతియును లేదు, కలహాల నిప్పు, ద్వార
    కాపురము కంటె కడు నరకమ్ము కలదె! (సమస్య తేలికదే కనుక భిన్నార్థం లో ప్రయత్నించాను. )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధనికొండ వారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది అభినందనలు

      తొలగించండి
  27. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    3. మా పురుషోత్త ముండిటుల మాయను జేయుట భావ్యమా,భువిన్
      శ్రీపతి పాణి పీడనము చేసెను వేరొక దారతోడ, నో
      తాపసి నిక్కమా తెలుపు, ధర్మము గాదుగ, తాళి గట్టెనా?
      పాపము గాదె, నేనతని భార్యను,నాకిది శాపమా? నికన్
      తాపము నోర్వబోను, జగధారికి వేరొక భార్య నుండగా
      కాపురమున్ గ్రమించు నరకమ్మొ కటున్నదె యెంచి చూడఁగన్"

      తొలగించండి
    4. కృష్ణ సూర్య కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. శాంత గుణమది లేకున్న సౌఖ్యమేది?
    యాలు మగలిద్దరును గూడి యట్టులుండ
    నలత గలిగించు నట్టులైన కలహాల
    కాపురము కంటె కన నరకమ్ము గలదె?

    రిప్లయితొలగించండి
  29. సిరుల కొలువు కుబేరుని చిత్ర పురము;
    జనులు తహ తహ లాడెయచ్చట వసించ
    నిధులు యున్న నేమి? హరిలేని నగరి యల
    కా, పురము కంటె కన నరకమ్ము గలదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలకృష్ణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  30. అత్త మామల నెల్లపుడెత్తి పొడిచి
    మెత్తనగు భర్త నొంగోలు గిత్త యనుచు
    పవలు రాతిరి తగు వాడు పడతి తొడ
    కాపురము కంటె కన నరకమ్ము గలదె !

    రిప్లయితొలగించండి
  31. ఖలులు చోరులు వంచనా కలితు లరులు
    ననిశ మవినీతి జరియించు జనుల సత్య
    వాదులు నధర్మమార్గులు పర్వి యున్న
    కాపురము కంటె కన నరకమ్ము గలదె.

    కాపురము - చెడ్డ పురమని అభిప్రాయము.

    రిప్లయితొలగించండి
  32. నిత్యమదియిది కొనమను నెలత తోడ
    కాపురము కంటె కన నరకమ్ము గలదె
    యనుచు పతి మనసుకు తోచునప్పుడపుడు
    దానిని సహించ గలవాడె ధన్యుడిలను

    రిప్లయితొలగించండి
  33. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    నిన్నటి పూరణ స్వీకరించ మనవి
    """""""""""""""""""""""



    శివదర్శనార్ధము మాధవుడు కైలాసమునకు వచ్చు

    సందర్భమున స్వాగతించు ప్రమథులు =

    . . . . . . . . . . ‌ . . .‌. . . . . . .. . . . . . . .‌.‌.‌


    అమల చరిత్రు డచ్యుతుడు నంబుజనాభుడు శౌరి శ్రీధవుం

    డమర గణాభివంద్యుడు హిమాద్రికి రాగ , హరిన్ స్తుతించుచున్

    ప్రమథులు విష్ణుభక్తిని దిరంబుగ దాలిచి ‌రూర్ద్వపుండ్రముల్ |

    సుమశరవైరి భాషిలెను ‌‌ లోగొనుచున్ మృదుభాషితమ్ములన్ |


    ( లోగొనుచు = లోపలికి తీసుకొని పోయి సత్కరించు )




    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  34. క్రూరురాలైనభార్యతోగోరిచేయు
    కాపురముకంటెకననరకమ్ముగలదె
    సతముదలపించురణరంగమతిభయంక
    రముగశాపనార్ధాలమయముగగాదె

    రిప్లయితొలగించండి
  35. దేవిక
    ----

    సంకుచితము, స్వార్థమ్మును సంచయమ్ము
    సేయుచు, నిరంతరమ్మును చెరుపు గూర్చి
    వలనుగొను అరిషడ్వర్గ మగ్న దేహ
    కాపురము కంటె కన నరకమ్ము గలదె !


    సంకలిత తుష్ఠి యనియెడు సంతతమగు
    సంపద గల వారలకెల్ల సంతసమెట
    కాపురము కంటె ; కన నరకమ్ము గలదె
    వేరుగను తృప్తి లేని జీవేచ్ఛ లున్న !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేవిక గారూ
      మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో యతి తప్పింది సవరించండి.

      తొలగించండి
    2. దేవిక
      -----
      సంకుచితము, స్వార్థమ్మును సంచయమ్ము
      సేయుచు, నిరంతరమ్మును చెరుపు గూర్చి
      వలనుగొను అరిషడ్వర్గ వలయిత మెయి
      కాపురము కంటె కన నరకమ్ము గలదె!

      తొలగించండి
  36. మనఁ గలమె మన మిటఁ దెల్పుమ యిది గాక
    యొండు నగర ముండదె జను లుండ గలరె
    యచట దుర్గంధ పూరిత మౌర పుత్ర
    కా! పురము కంటె కన నరకమ్ము గలదె

    [కంటె = చూచితివా?]


    వే పయనించ నింపయిన వీధులు సత్పథ రాజ పర్వముల్
    ప్రా పిడ బంధు వర్గమును వైద్యుని సన్నిహితమ్ము నెమ్మినిం
    దీపి జలంపు నూతులును దేవ నిభ ద్విజు లుండ కున్నచోఁ
    గాపురముం గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్

    [కాపురము = చెడ్డ పట్టణము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  37. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఊపిరి పీల్చగా నలవి యొప్పని వీధుల మూకలందునన్
    రూపులు దాచుకొంచుచును రోడ్డున సాగెడి చూపులందునన్
    దాపు హుసేను సాగరపు దారుణ గంధపు ఖైర్తబాదులో
    కాపురమున్ గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  38. చెఱపు కలిగించు కథనాలు చిత్తమందు
    ద్వేష భావమ్ము లెగ ద్రోయ ప్రేమ విడిన
    యమ్మకును, నాలికి నడుమ నవియు నరుని
    కాపురము కంటె కన నరకమ్ము గలదె!

    రిప్లయితొలగించండి
  39. ఓపిక లేని చంచల యదొక్కతు, నిశ్చలపత్ని యొక్కతౌ,

    నేపని లేని పుత్రు డొకడేర్చు జనమ్ముల నంగహీనుడై,

    వ్యాపకమట్లు సంసృజనమందు మరొండు సుతుండు, శౌరి! నీ

    కాపురమున్ గ్రమించు నరకమ్మొకటున్నదె! యెంచి చూడగన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  40. ఆపదవేళలన్గననినాప్తగణంబులుగల్గుయూరునన్
    గాపురమున్ గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్
    నేపురమందుబంధువులుహెచ్చుగనుందురొ యట్టియూరనే
    కాపురముండమేలగునుగాదిదసత్యముధర్మనందనా!

    రిప్లయితొలగించండి
  41. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    అత్తవారింట నడుగిడు నట్టి క్షణమె

    నిండు సంసారమును జేసి ఖండములుగ
    ...........................................................

    మగని మెడవిర్చి కీలుబొమ్మగ నొనర్చి ,

    యత్తమామలను పురుగు లట్టు లరసి
    .......................................................

    ఆర్జనమ్మును మించిన వ్యయము జేసి
    ......................................................


    బెడిదముల నాడి బెదరించు పెండ్ల మున్న

    కాపురము కంటె నిక నరకమ్ము గలదె ? ?


    *************************************************
    *************************************************



    అగ్నిసాక్షిగ కళ్యాణ మాడి నట్టి

    దారను పనికత్తె విధాన దలచు వెధవ
    ........................................................

    వలపుకత్తె తోడ గులికి - వచ్చి , భార్య

    నెట్టి కారణమే లేక కొట్టు వెధవ
    ..............................................................

    ఎప్పుడు సతిశీలమును శంకించు వెధవ
    ...............................................................

    పెండ్లము సుకము నెంచక , పీకె వరకు

    ద్రాగి పంది వలె దొరలి దోగు వెధవ
    ...................................................


    తాళి కట్టగ నా దరిద్రమగు నట్టి

    కాపురము కంటె నిక నరకమ్ము కలదె ? ?


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి అభినందనలు.

      తొలగించండి
  42. రూపము గాంచి మానస స్వరూపము కాంచక, కొంటి హస్తమున్
    దీపము పెట్టకుండ కడు దీక్షగ చూచుచు సీరియళ్ళు తా
    దాపుకు రాదు మన్మథుని తాపము తీర్చగ రాత్రివేళలన్
    కోపముతోడ తిండికిని కొందలపెట్టుచు నుండె నట్టిదౌ
    కాపురమున్ గ్రమించు నరకమ్మొక టున్నదె యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  43. దేవిక
    -----

    కలుషముల బాపు స్వర్గంబు గలదె యిలను
    పాప హారిణియై గంగ పరగు కాశి
    కా పురము కంటె ; కన నరకమ్ము గలదె
    వేరుగ కలుషితము సేయ వెగ్గలముగ!

    రిప్లయితొలగించండి
  44. కట్నకాన్కల విషయము ఖచ్చితముగ
    అత్తమామల సాధింపుఅధికమవగ
    వేదనాభరితముగను వేగలతల
    కాపురము కంటెకననరకమ్ముగలదె
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  45. కోపముతో నిరంతరము కొట్టుకుచచ్చెడి దంపతుల్ మన
    స్తాపము తోడ కృంగుచును దైన్యముగా బ్రతుకీడ్చు వృద్ధులున్
    వ్యాపకమై మొబైలులను పట్టుకు కూర్చొను పిల్లలున్న యా
    కాపురమున్ గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడఁగన్

    రిప్లయితొలగించండి
  46. (అలకాపురమనే గ్రామము,..కుబేరరాజధానికాదు...)
    కాలు మోపిన గుంతలే నేల యంత
    ఎత్తుపల్లములుండు నీవృత్తు నందు
    యిరుకు దారులె భయపెట్టు నరులను, అల
    కాపురము కంటె కన నరకమ్ము గలదె!!!

    నీవృత్తు =గ్రామము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వృత్తునందు । నిరుకు...' అనండి.

      తొలగించండి
  47. అప్పులన్ జేసిరైతన్న కందినట్టి
    పంటనమ్మ దళారులు వెంటబడుచు
    ధరలుదగ్గించ?యూహలాంతర్యమందు
    కాపురము కంటె కన నరకమ్ముగలదె?

    రిప్లయితొలగించండి
  48. ఏపని జేయబూనడు సహింపడు చెంతకు జేరినన్ సదా
    కోపము జూపుచుండు చెలికోరిక తీర్చగ లేని మూర్ఖుడే
    నాపతి, యత్తమామలును నన్నొక బానిస వోలె జూడ నీ
    కాపుర మున్ గ్రమించు నరకమ్మొకటున్నదె యంచి చూడగన్

    రిప్లయితొలగించండి
  49. దోపుగ రావణుండు తన తోపుకు నామెను తెచ్చియుం చగన్
    కాపుగ లంకిణింపనుప కాంచుచు రామతలంపులం మదిం
    చోపుచు రాక్షసాధముల జూచినసీత తలంచెనిట్లు, లం
    కాపురరమున్ గ్రమించు నరకమ్మొక టున్నదె యెంచి చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లంకిణిం బనుప... తలంపులన్ మదిం। జోపుచు...' అనండి.

      తొలగించండి
  50. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2819
    సమస్య :: కాపురమున్ గ్రమించు నరకమ్మొక టున్నదె యెంచి చూడగన్?
    *కాపురం కంటే నరకం మరొకటి ఉంటుందా బాగా ఆలోచిస్తే* అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: పితృవాక్యపరిపాలనకోసం నే నొక్కడినే వనవాసానికి బయలుదేఱుతాను. ఓ సీతా! నీవు యీ అయోధ్యలోనే ఉండు అని శ్రీరామచంద్రుడు పలుకగా
    సీతాదేవి ఓ ప్రాణనాథా! *పతిహీనా తు యా నారీ న సా శక్ష్యతి జీవితుమ్।* అని {అయోధ్యాకాండ-29 వ సర్గ-7 వ శ్లోకంలో} అన్నది.
    “భర్త తోడుగా ఉంటే ఆ జీవితం స్వర్గం అవుతుంది. భర్త తోడుగా లేకుంటే ఆ జీవితం నరకం అవుతుంది. బంగారు జింకను కోరుకొని నేను భర్తకు దూరమైనాను. ఇప్పుడు ఈ లంకాపురంలో ఒంటరిగా కాలం గడుపుతూ కష్టపడుతూ ఉన్నాను. ఆలోచించి చూస్తే ఇప్పటి నా జీవితం కంటే మరొక నరకం ఉంటుందా?” అని సీతమ్మ అశోకవనంలో ఉండి శోకించే సందర్భం.

    కాపుర మౌను స్వర్గముగ కాంతుడు తోడుగ నున్న, నేడు నా
    కాపురమందు తోడనగ కష్టమె, బంగరులేడి గోరి లం
    కాపురమందు నొంటరిగ కాలము బుచ్చుచు నుంటి నిట్లు, నా
    కాపురమున్ గ్రమించు నరకమ్మొక టున్నదె యెంచి చూడగన్?
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (16-10-2018)

    రిప్లయితొలగించండి
  51. శ్రీపతి చెంత చేరి సరసీరుహనేత్రుని వక్షమందునన్
    పాపి భృగుండు మోపగను పాదము, లక్ష్మి తలంచె నిట్టులన్
    శాపము గాదె నాకు గన శాంతము జూపిన విష్ణుమూర్తితో
    కాపురమున్ గ్రమించు నరక మ్మొక టున్నదె యెంచి చూడగన్

    రిప్లయితొలగించండి
  52. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    కాపురము కంటె కన నరకమ్ము గలదె

    సందర్భము: పురుషుని సహనానికి కాపురం ఒక పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గిన వాడు దైవాన్ని చేర్చే ఒక గొప్ప గుణం లేదా అర్హత సాధించినట్టు లెక్క .
    అలా కాకపోయినట్లైతే జీవితం నరకమే!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "సహనమునకు పరీక్షగా సాగు కాపు
    రంబు.. నెగ్గిన నతడు దైవంబు జేరు
    ననఘ గుణము సాధించిన..
    ట్లటుల గామిఁ..
    గాపురము కంటె కన నరకమ్ము గలదె!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    16.10.18
    -----------------------------------------------------------
    ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    కాపురము కంటె కన నరకమ్ము గలదె

    సందర్భము: పడతి పరమునకు లేదా ఆముష్మిక మునకు పైకి ఎగబ్రాకనీయదు. ఎంత సేపూ ఇహమునకే అనగా ఐహికమునకే క్రిందికి లాగుతుంది.
    ఇది తెలుసుకుని జాగ్రత్తగా మసలుకున్న
    ట్లయితే జీవితం సద్వినియోగ మౌతుంది. జాగ్రత్తగా మసలు కోవడం అంటే ఏమి టంటారా! సంసారంలో నిండా మునిగిపోయి ఇదే లోకం అనుకోకుండా గృహిణి సహకరించినా సహకరించకపోయినా తన జాగ్రత్తలో తా నుండి ఆముష్మికంలో ముందడుగు వేయాలి. సహకరిస్తుం దని ఆశించరాదు. ఆశాభంగం పొందరాదు.
    ఇది తెలుసుకుంటే జీవితం స్వర్గతుల్య మౌతుంది. లేకుంటే నరకమే!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పరమునకు పైకి పోనీదు పడతి యెపుడు..
    నిహమునకు క్రిందకే లాగు నెల్ల వేళ..
    తెలిసి మసలిన స్వర్గంబు.. తెలియదేని..
    కాపురము కంటె కన నరకమ్ము గలదె!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    16.10.18
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి