27, అక్టోబర్ 2018, శనివారం

సమస్య - 2828 (ఖర పాదార్చనము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్"
(లేదా...)
"ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

117 కామెంట్‌లు:

 1. వరముల్ కోరుచు పూజలన్ మునిగి భావావే శమున్ పొందినన్
  పొరుగిం టన్విరి యంగపూ లనుమ హాభోగం బుగాత్రుంచి నన్
  పరమా నందము నొందుచున్ మదిని సంబాళిం చమోహం బటన్
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మా టికిన్

  రిప్లయితొలగించు
 2. శరణమ్మంచును వేడ భక్తులకిలన్ సర్వాత్ముడే ప్రేమతో
  వరముల్ భూరిగ నిచ్చి గాచునతడే భక్తాళినే బ్రోచుచున్
  పరిపాలించెడు రక్షకుండట విరూపాక్షుండెయౌ చంద్ర శే
  ఖర పాదార్చన మొక్కటే హితము గల్గంజేయు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 3. నిరతం బందుచు కష్టసంతతు లిలన్ నిస్సార సంసార సా
  గర మధ్యంబున గూలియున్న జను డ క్కైవల్య ధామంబు నే
  కరణిన్ బొందుటయో యటంచు మదిలో గాక్షించినన్ జంద్ర శే
  ఖర పాదార్చన మొక్కటే హితము గల్గంజేయు ముమ్మాటికిన్.

  రిప్లయితొలగించు
 4. పరుసపు పలుకుల నుడువక
  విరులను పూజించి భక్తి వేయి విధమ్ముల్
  పరులను అభిమా నించగ
  ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అక్కయ్యా
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   మూడవ పాదంలో సంధి దోషం. "పరులనె యభిమానించగ" అనండి

   తొలగించు
  2. పరుసపు పలుకుల నుడువక
   విరులను పూజించి భక్తి వేయి విధమ్ముల్
   పరులనె యభిమా నించగ
   ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయన్

   తొలగించు
 5. డా. పిట్టా సత్యనారాయణ
  ధర లింగార్చన పేదకౌ వరమయా దాక్షిణ్యమున్ బొందగా
  నెర నీవే తవ హస్త శోభ గనగా నిర్ణాయకమ్మౌ గతి
  న్నర చెంబౌ జలలింగధారల నిడన్నాయాసమే ?చంద్రశే
  ఖర పాదార్చనై మొక్కటే హితము గల్గం జేయు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 6. డా.పిట్టా నుండి
  ఆర్యా సమస్యా పాదంలో "న" గా టైపాటును సవరించినాడను.

  రిప్లయితొలగించు
 7. కరముల కన్నయ నెత్తుక
  చరచర చెరసాల వీడి సహదేవుడు రా ;
  నరచెడి గాడిద కనబడె ;
  ఖరపాదార్చనము హితము గల్గం జేయున్ .

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   వసుదేవుడు సహదేవు డయ్యాడు

   తొలగించు
 8. శిరమున గంగను దాల్చిన
  కరుణా సంద్రుండు వాడె కరకంఠుండా
  సురవంద్యుండగు శశిశే
  ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్.

  రిప్లయితొలగించు

 9. మైలవరపు వారి పూరణ


  🕉నమశ్శివాయ 🙏🙏

  వరమౌ పుణ్యదమైన కార్తికమునన్ పంచాక్షరిన్ మంత్రమున్
  స్థిరచిత్తమ్మున నిల్పి భక్తి దనరన్ సేవించినన్ చాలు దు...
  ర్భర దుఃఖమ్ములు దూరమై చనును , విశ్వాసమ్మునన్ చంద్రశే...
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.

   తొలగించు
  2. శ్రీ కోట రాజశేఖరావధాని గారికి ప్రణామములతో....

   అరుదైనట్టి పురాణగాథల సమస్యాపూర్తి గావించి , సు...
   స్వర సంగీతము మేళవించి , నవ పుంభావస్వరూపమ్మునన్
   సరసీజాసను రాణి బోలిన కవీంద్రా ! యంచు శ్రీ రాజశే..
   ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్ !!


   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


   తొలగించు
  3. ఈ సారి నెల్లూరికి వెళ్ళినపుడు...December లో

   తొలగించు
  4. కోట రాజశేఖర్ గారి ప్రశంసారూపమైన మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించు
 10. నిరతమ్మున్ శివ నామ సంస్మరణ తో నిత్యున్ మహాదేవుని న్
  హరునిన్ భక్తి ప్రపత్తి తో గొలిచి తామత్యo ఠశుద్దాత్ముల్లై

  పరమేశున్ సుర వంద్యు సత్య శుభ గున్ భాస్వoతునిన్ చంద్ర శే
  ఖర పాదార్చ న మొక్క టే హితము గల్గన్ జేయు మూమ్మా టికీ న్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాజేశ్వరరావు గారూ
   మీ పూరణ బాగున్నది. అభినందనలు
   'తా మత్యంత' టైపాటు.

   తొలగించు
 11. కం.
  తరతరములలో భక్తులు
  పరమేశ్వరుని కొలువంగ పరమార్థముకై
  వరములిడు చంద్రమశ్శే
  ఖరపాదార్చన హితముం గల్గం జేయున్ .

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మల్లేశ్వర్ గారూ
   మీ పూరణ బాగున్నది అభినందనలు.
   పరమార్థమునకై .. అనడం సాధువు అంటారు

   తొలగించు
 12. బరువులు మోయక దండిగ
  పరువులు తీయుచు తిరిగెడి పాపాత్ములకున్
  నరవరులకు నేతలకున్
  ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ
   మీ వ్యంగ్యాత్మక పూరణ బాగున్నది. అభినందనలు

   తొలగించు
 13. కరముల కన్నయ నెత్తుక
  చెర విడి వసుదేవు డట్లు చెచ్చెర రాగా
  నరచెడి గాడిద కనబడె ;
  ఖరపాదార్చనము హితము గల్గం జేయున్ .
  (శంకరార్యులకు ధన్యవాదములు)

  రిప్లయితొలగించు
 14. డా. పిట్టా సత్యనారాయణ
  హరి చెరసాలన జననం
  బరయగ నా కంసు భటుల యారడి మాన్పన్
  అరమోడ్పు కనుల పితకౌ
  ఖరపాదార్చనము హితము గల్గం జేయున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. డా. పిట్టా వారూ,
   మీ పూరణ బాగున్నది అభినందనలు.
   "చెరసాలను" అనండి

   తొలగించు
 15. పరమును జేరగ గోరెడు
  నరవరులకు నెపుడు గొల్వ నానందముతో
  వర గౌరీశుడు శశిశే
  ఖర పాదార్చనము హితము గల్గం జేయున్

  రిప్లయితొలగించు


 16. గాడిద పాలు లీటర్ 5000 రూపాయలట :)


  కరభంపు దుగ్ధమునకు న
  గరంబున గలదు జిలేబి గట్టి బజార
  మ్మ! రహస్యమిద్ది వినుమా
  ఖర పాదార్చనము హితము గల్గం జేయున్!

  జిలేబి

  రిప్లయితొలగించు
 17. సమస్య :-
  "ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్"

  *కందం**

  ఖర పాదార్చనమేలా
  చిరము హితము కలుగజేయు? శివ,నటరాజున్,
  పరమేశ,చంద్రమశ్శే
  ఖర, పాదార్చనము హితముఁ గల్గం జేయున్
  .....................✍చక్రి

  రిప్లయితొలగించు
 18. హరియే పుత్రుని గా జనించె , శిరమం దా విష్ణునే దాల్చి నే
  పరమానందము నొందు వేళ భళిరా ! పాపమ్మెదో తీరకన్
  ఖరరూపాన పరీక్ష దక్కెను మహత్కార్యమ్ము సాధింపగా
  "ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్"
  (అనుకున్నాడు వసుదేవుడు)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ధనికొండ వారూ,
   మీ పూరణ బాగున్నది అభినందనలు
   'తీరక' అన్నది కళ. ద్రుతాంతం కాదు "తీరికే" అనండి.

   తొలగించు
 19. ఖరతుల్యనరుని నీ పే
  దరికమునన్ గొలుచు నొక పదవి ప్రాప్తింపన్
  సిరి గొలువ సాయ పడునే !
  ఖరపాదార్చనము హితముఁ గల్గం జేయున్

  రిప్లయితొలగించు
 20. హరహర శంభో యనుచు ను
  నిరతము శివ నామ జపము నీ మము తోడ న్
  కర మను రక్తి గ శశి శే
  ఖర పాదార్చ నము హితము గల్గoజేయున్

  రిప్లయితొలగించు
 21. నరుడై మహినన్ బుట్టియు
  పరులన్ దూషించి బదుక ఫలమే మయ్యా!
  పరుషపు మాటల నాడక
  ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వెంకటప్పయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మహినిన్"అనండి.

   తొలగించు
 22. మత్తేభవిక్రీడితము

  గిరిజన్ శంకరుడందఁ గల్గు సుతుడే గీలాలకున్ దారకా
  సురునిన్ ద్రుంచునటంచు నెర్గి సురలున్ సూనాస్త్రునిన్, చంద్రశే
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గన్ జేయు ముమ్మాటికిన్
  హరుడే జూడ నపర్ణ మోహమిడగా నర్థించి సాధించిరే

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయ దోషం ఉంది.

   తొలగించు
 23. హరహరశివశివభువిలో
  నరరూపపురాసభములు నలువైపుల ప
  య్యెరవోలెదిరుగు శశిశే
  ఖరపాదార్చనముహితముగల్గంజేయున్
  పొరుగూరికిపిల్లకొరకు
  నరుగుచునుండగఖరమొకటరుగుటగని గాం
  చరెదుశ్శకునమన ననిరి

  ఖరపాదార్చనముహితముగల్గంజేయున్


  రిప్లయితొలగించు
 24. మ: నరుడా చేసిన పాపకార్యఫలముల్ నాశమ్ముగాకుండగా
  కెరలించున్ మరుజన్మనైన విధిగా కీలించి తత్కాలమున్
  నిరతమ్మున్ తగు మార్గమందు చనినన్ నిష్కర్షగా చంద్రశే
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 25. స్వరముల్ గూర్చగనెంచిసాధకులు శ్రీ వాణిన్ మదిన్ దల్చియ
  క్షరముల్ నిల్పుచు సామవేదమును సాకారంబుగావించుచున్ సు
  స్థిరమౌమోక్షముగల్గజేయుటకు యస్థిత్వంబు గోరి చంద్ర శే
  ఖరపాదార్చన మొక్కటేహితము గల్గంజేయు ముమ్మాటికిన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. రాధాకృష్ణారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సాకారంబు గావించి సు|స్థిరమౌ... జేయుటకు నస్తిత్వానకై చంద్ర..." అనండి. (మూడవ పాదంలో గణదోషం )

   తొలగించు
 26. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


  అరయన్ క్షీర సముద్ర సంజనితమై యాభీలమైనట్టి , త

  ద్గరళాత్యుల్బన మాపి , కంఠమున సంస్థంభించి లోకావళిన్

  గరుణన్ బ్రోచెను పార్వతీశుడగు గంగాధారి || చంద్రశే

  ఖర పాదార్చన మొక్కటే హితము గల్గం జేయు ముమ్మాటికిన్


  { గరళ + అతి + ఉల్బనము = గరళాత్యుల్బనము ;

  ఉల్బనము = పొంగు ; }


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించు


 27. దొరకొని బిల్వదళమ్ములు
  మరియును గోక్షీరమంది మంత్రసహితమున్
  నిరతము జేసెడి శశిశే
  ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్.

  రిప్లయితొలగించు
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 29. గురువు గారికి నమస్కారములు వచ్చే వారం సమస్య ?

  రిప్లయితొలగించు


 30. పరమాత్ముడుకలడంతట
  కరిలో హరిలో నరయగ కరభములోనన్
  వెఱవక రమణీ చేయగ
  ఖర పాదార్చనము హితము గల్గం జేయున్!

  జిలేబి

  రిప్లయితొలగించు


 31. అరయన్ పార్వతి, దుర్గ, శారదయు, మా యార్యాణి శర్వాణి యా
  సురసన్ కర్వరి కొండచూలి గిరిజన్ శోభిల్లు మా శైలజన్,
  వరమాలన్ మనువాడినట్టి శివుడా భద్రేశుడౌ చంద్ర‌శే
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్!  జిలేబి

  రిప్లయితొలగించు
 32. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
  *"దీపావళి పండుగన్ జరుపనౌఁ గద పున్నమి నాటి రాతిరిన్"* (ఛందోగోపనం)
  మీ పూరణలను గురువారం లోగా
  *padyamairhyd@gmail.com*
  చిరునామాకు గురువారం సాయంత్రం లోగా
  మెయిల్ చేయండి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు

  1. ఛందోగోపన మిచ్చినాడ జనులీ సారెట్లు పూరింతురో
   క్రిందామీద పడంగ చూతు భళిరా క్రీడల్ సుమా ఛందమో ?

   జిలేబి
   పరార్ :)

   తొలగించు
  2. అందీయందని దేది కాదురయరో యందంపు మాలేనురో!

   తొలగించు
 33. చిర కీర్తిన్ లభియింప భూధవులు వాసిన్ రమ్య సాహిత్య సం
  భరితానంత వినోద చిత్తులయి సంభావింపరే సత్కృతుల్!
  స్మరణీయంబుగ నష్టదిగ్గజములున్ భాసించెగా-రాజ శే
  ఖర పాదార్చన మొక్కటే హితముఁగల్గంజేయు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 34. పరశంభు మహిమ మదిలో
  పరి పరి విధముల నుడువుచు, పరమేశ హరీ
  వరదా యన భక్తా శే
  ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్

  శేఖర= శ్రేష్ఠము?

  రిప్లయితొలగించు
 35. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గ
  ల్గం జేయు ముమ్మాటికిన్

  సందర్భము: పరమహంస యోగానంద గురువు యుక్తేశ్వరగిరి. వారి గురువు లాహిరీ మహాశయులు. వారి గురువు మహావతార్ బాబా.
  క్రియా యోగానికి ఆద్యులైన మహావతార్ బాబా నుండి క్రమంగా గురు పరంపరగా యోగానంద గారికి ఆ యోగం లభించింది.
  ఆ మహావతార్ బాబాయే ఆదిశంకరుల గురువైన గోవింద యతీంద్రులకు, ఆది శంక రులకు, కబీరుకు క్రియాయోగ దీక్ష నిచ్చినా డంటారు.
  ఈ విషయం శ్రీ తుమ్మపూడి కోటీశ్వర్ రావు గారు రచించిన "శ్రీ లీలా సమాధి" అనే గ్రంథంలో (పు42) పేర్కొనబడింది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  స్మరణం బర్చన; యాది శంకరులకున్,
  సన్యాసియౌ నాది శం
  కరు నాచార్యులకున్, కబీరునకు దీ
  క్షన్ గూర్చినా డందు.. రా
  హరుడే తా నవతార బాబ యయి.. విం
  తౌ నేమి? యా చంద్ర శే
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గ
  ల్గం జేయు ముమ్మాటికిన్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  27.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించు
 36. గరళమ్మున్ గొనె ఫాలనేత్రుడు సదా భక్తాళినిం కావగన్
  మరి యా కాలుని పాశమున్ బడక మార్కండేయు రక్షించె నా
  కరుణాలోలుడు నాగభూషణుడు పింగాక్షుండు నౌ చంద్రశే
  ఖరపాదార్చన మొక్కటే హితము గల్గం జేయు ముమ్మాటికిన్..!!!

  రిప్లయితొలగించు
 37. మిత్రులందఱకు నమస్సులు!

  వరదంబై, స్మరియించు మానవులఁ దా వర్ధిల్లఁజేయన్, శుభా
  కరమైనట్టి హృదంతరాళమునఁ సత్కారుణ్య మేపారఁగా,
  ధరనెల్లప్పుడుఁ గాచుచుండు నిధియౌ, తద్దివ్య బాలేందుశే
  ఖరపాదార్చన మొక్కటే హితముఁ గల్గంజేయు ముమ్మాటికిన్!

  రిప్లయితొలగించు
 38. అరయన్మానవకోటికెల్లరకునాహారంబుమోక్షంబుశే
  ఖరపాదార్చనమొక్కటేహితముగల్గంజేయుముమ్మాటికిన్
  పరమేశుండెజనంబులన్మనిచికాపాడున్ సదాజాలితోన్
  నరవిందాక్షునివేడగానిడున్
  న ష్టై శ్వర్యముల్దాదగన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వేడగానె యిడు నష్టైశ్వర్య .. అనండి. లేకుంటే గణదోషం

   తొలగించు
 39. నిరతముగొలువగ భక్తిని
  పరమాత్ముడెయిచ్చుమనకుపరమపదంబున్
  నరయుమయిట్లుగనాశే
  ఖరుపాదార్చనముహితముగల్గంజేయున్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   పదమునే యరయగ .. అనండి

   తొలగించు
 40. ఖండిత నాసికా కర్ణ శూర్పణఖ మనోగతము:

  వర రఘువీర సుదారిత
  గురు నాసా కర్ణ దుష్ట గుణ శూర్పణఖా
  దురవస్థవిమోచనమీ
  ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్


  గరళగ్రీవ భుజంగ భూషణ లసత్కైలాస హైమప్రభా
  భరితక్ష్మాధర సన్నివాస గిరిజాప్రాణేశ దుర్వార దు
  ష్పురదైత్యత్రయ ఖండనాత్త సుయశఃపూర్ణుండు బాలేందు శే
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. కామేశ్వరరావు గారూ,
   మీ పూరణ రెండు పూరణలు వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు

   తొలగించు
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించు


 41. ఆకాశవాణి -
  సమస్యా పూరణ - కార్యక్రమం -
  27th Oct 2018
  నిర్వహణ - శ్రీ కంది శంకరయ్య

  లింకు :)

  https://varudhini.blogspot.com/2018/10/27th-oct-2018.html


  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పూరణలన్ని వినే అవకాశంం కల్పింంచినంందుకు జిలేబి గారికి ధన్యవాదములు.

   తొలగించు
  2. పూరణలన్ని వినే అవకాశంం కల్పింంచినంందుకు జిలేబి గారికి ధన్యవాదములు.

   తొలగించు
 42. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)


  రమణా రెడ్డి ఉవాచ:

  పరువున్ బోయెను చీట్లపేకలను పాపాత్ముండనై యోడగా
  జరుపన్ జాలక రోజువారి వ్యయముల్ జంజాట మాయెన్ గురూ
  వరముల్ పంచగ పండుగందు వడిగా వయ్యారి యత్తయ్యవౌ
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 43. కం.
  భరమౌ సంసారములో
  చరించి యలసితిని, దుఃఖ సాగరమందున్
  తరియించ చంద్రమశ్శే
  ఖర పాదార్చన హితముం గల్గం జేయున్ .

  రిప్లయితొలగించు
 44. దురితమ్ముల్ వెలయించు మానవులిలన్ దుష్కార్యముల్జేయుచున్
  నిరవద్యమ్ముగ సజ్జనాళి కిడుముల్ నిత్యమ్ము గల్గించగా
  పరమాత్మా మము గావుమయ్య యనె డా భక్తాళికిన్ చంద్ర శే
  ఖర పాదార్చన మొక్కటే హితము గల్గంజేయు ముమ్మాటికిన్!

  రిప్లయితొలగించు


 45. పరమాత్ముండు జిలేబి తాగలడుగా పద్మంబులోపంకిలో
  నరయంగన్ గల డాత డెల్ల జగతిన్ నామంబు రూపంబులే
  క! రహస్యంబులు లేవు గానగలవే గ్రామ్యాశ్వమందున్ వెసన్
  ఖర పాదార్చన మొక్కటే హితము గల్గం జేయు ముమ్మాటికిన్

  జిలేబి

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ
   మీ పూరణ బాగున్నది అభినందనలు
   'పంకమం దరయంగన్' అనండి

   తొలగించు


 46. అరె! దస్కంబులు దండిగాను దొరుకున్ నమ్మంగ గ్రామ్యాశ్వ దు
  గ్ధరసంబున్!పరుగెత్తు వాటినిగనన్ దంబంబు వీడన్ దగున్
  ఖర పాదార్చన మొక్కటే హితము గల్గం జేయు ముమ్మాటికిన్,
  వరమైగానగ వచ్చు నీవు రమణీ వార్ధక్యమందున్ సుమా :)


  జిలేబి

  రిప్లయితొలగించు
 47. అరుణోదయ మాయెననుచు
  కరుణతొ వేడగ మనమున ఘనముగ తలువన్
  తరుణమిదేగద శశిశే
  ఖర పాదార్చనము హితము కల్గం జేయును!!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. గంగాప్రసాద్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కరుణతొ అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. అక్కడ 'కరుణను' అనండి.

   తొలగించు
 48. క్రొత్తగా వ్రాస్తున్నాను.కావున మీ సూచనలు అవసరము.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. చాలా చాలా బాగుంది...

   "తో" ను "తొ" గా వ్రాస్తే సారు ఒప్పరు. "కరుణన్" అన వచ్చునేమో...

   తొలగించు
 49. తిరువణ్ణామల యందలి
  యరుణాచలమే నిజముగ నభవుండనగన్
  స్మరణమ్మున కరుణించ శి
  ఖర పాదార్చనము హితముఁ గల్గం జేయున్

  రిప్లయితొలగించు
 50. స్వరముల్ గూర్చగనెంచిసాధకులు శ్రీ వాణిన్ మదిన్ దల్చియ
  క్షరముల్ నిల్పుచు సామవేదమును సాకారంబుగావించిచసు
  స్థిరమౌమోక్షముగల్గజేయుటకు నస్థిత్వానకై
  చంద్ర శే
  ఖరపాదార్చన మొక్కటేహితము గల్గంజేయు ముమ్మాటికిన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించు
 51. కరుణాసాగరరాజరాజహర గీర్వాణార్తిదూరా !ధరా
  ధరపుత్రీవర నీలకంథర పరా!దక్షాధ్వరాంతా!శుభం
  కరమాంపాహి సదాగతిన్నిడుమృడా!కాలాంతకా!రాజశే
  ఖర పాదార్చనమొక్కటే హితముగల్గంజేయు ముమ్మాటికిన్

  రిప్లయితొలగించు
 52. స్వరముల్ గూర్చగనెంచిసాధకులు శ్రీ వాణిన్ మదిన్ దల్చియ
  క్షరముల్ నిల్పుచు సామవేదమును సాకారంబుగావించిసు
  స్థిరమౌమోక్షముగల్గజేయుటకు నస్థిత్వానకై
  చంద్ర శే
  ఖరపాదార్చన మొక్కటేహితము గల్గంజేయు ముమ్మాటికిన్
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించు
 53. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2828
  సమస్య :: ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గన్ జేయు ముమ్మాటికిన్.
  *గాడిద పాదాలను పూజించడం ఒక్కటే నిజంగా మేలును కలిస్తుంది* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: అమృతం కోసం దేవతలు రాక్షసులు కలసి పాలసముద్రాన్ని చిలికేటప్పుడు కవ్వంగా ఉండిన మందర పర్వతం నీటిలో మునిగిపోగా, విష్ణుమూర్తి ఆదికూర్మంగా అవతరించి ఆ మందర పర్వతాన్ని పైకెత్తినాడు. సముద్రమథనం జరుగుతూ ఉండగా, అక్కడ హాలాహలమనే విషం పుట్టి ప్రళయకాలము నందలి అగ్ని వలె అంతటా వ్యాపిస్తూ ఉండగా అందఱూ భయభ్రాంతులై శంకరుని శరణు వేడినారు. *పరహితమె పరమ ధర్మము* *ప్రభుధర్మము* అని భావించిన శంకరుడు తన దేహంలో సగభాగంగా ఉన్నటువంటిది, సర్వమంగళ యగు పార్వతీసతి అనుమతింపగా, అన్నిలోకములకు హితమును చేయదలచి ఆ కాలకూట విషాన్ని తాను మ్రింగి లోకకల్యాణం చేసినాడు. కాబట్టి ఆ చంద్రశేఖరుని పాదములను అర్చించడం ఒక్కటే అందఱికీ హితమును కలిగిస్తుంది. ఇది నిజం అని పరమశివుని మహిమను గుఱించి విశదీకరించే సందర్భం.

  సురలున్ దైత్యులు సంద్రమున్ జిలుకగా, శోభిల్లు శ్రీ కూర్మమై
  హరి దా మందర మెత్తగా, ఘన విష మ్మావిర్భవింపంగ, నా
  గరళమ్మున్ హరు డాహరించె హితుడై, కైమోడ్చు డా చంద్రశే
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గన్ జేయు ముమ్మాటికిన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (27-10-2018)

  రిప్లయితొలగించు


 54. ధరలో జూచుచు నుండగా నధిక తాపంబుల్ సతమ్మున్ మము న్
  చిరకాలమ్ము న నుండియున్ కరము చింతా క్రాంతులన్చేయగా
  గిరిజా వల్లభు నెప్పుడున్ విడక కేలున్ మోడ్చెదన్ చంద్ర శే
  ఖర పాదార్చన మొక్కటే హితముఁ గల్గం జేయు ముమ్మాటికిన్.
  రిప్లయితొలగించు
 55. కృతజ్ఞతలు.అలాగే స్వీకరిస్తాను.ప్రయాణంలో ఉన్నాను.

  రిప్లయితొలగించు