6, అక్టోబర్ 2018, శనివారం

సమస్య - 2809 (కలవాఁ డిల్లిల్లు...)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్"
(లేదా...)
"కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్"

109 కామెంట్‌లు:

 1. ఇలలో వింతలు మెండట
  కలనై ననుతల చలేని కాపురు షులెగా
  తలిదండ్రుల మర చినసంతు
  కలవాఁ డిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   ఉపేక్షించే సంతానం కలవాడు అంటూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
   కాని మూడవ పాదంలో గణదోషం. "తలిదండ్రుల మరచు సుతులు। కలవాడు..." అనండి.

   తొలగించండి
  2. రాజేశ్వరి గారు:

   మీ ఆకాశవాణి సమస్యా పూరణను ఈ రోజు కంది వారి కంఠములో విని మహదానందమైనది. 👏

   తొలగించండి
  3. నాకూ చాలా సంతోష మనిపించింది . నా పద్యంలో యతి తప్పింది చదవరను కున్నాను . మరిఎందుకు చదివారొ ? నా అదృష్టం. ఇరువురికీ ధన్య వాదములు .

   తొలగించండి
  4. ఇలలో వింతలు మెండట
   కలనై ననుతల చలేని కాపురు షులెగా
   తలిదండ్రుల మరచు సుతులు
   కలవాఁ డిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్

   తొలగించండి
 2. కలనున్ గాంచని ధనమును
  పలు దేశమ్ములను దాచి పరుగులతో తా
  నిలలో తీరని యాశల్
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్

  రిప్లయితొలగించండి 3. భిక్షాందేహి యని యెందరనలే అయినా
  దేని కన్నా భారతమే కాబట్టి :)


  ఇలలో న బ్రహ్మ రాతను
  కలలో నైన సఖి మార్చ గలమే సుదతీ
  యల ధర్మేంద్రుండాతడు
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   ఏకచక్రపుర ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. తొలి వేలుపు యంబాపతి
  కలువ హితా మకుటధారి కంతుని రిపువే
  బలిగోరి మూడు కన్నులు
  కలవా డిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వేలుపు + అంబాపతి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ "తొలివేలు పుమాకాంతుడు" అనండి.

   తొలగించండి
  2. ధన్యవాదములు గురుదేవా!
   సవరించిన పూరణ:
   తొలివేలు పుమాకాంతుడు
   కలువహితా మకుటధారి కంతుని రిపువే
   బలిగోరి మూడు కన్నులు
   కలవా డిల్లిల్లు తిరిగి కబళం బడిగెన్

   తొలగించండి


 5. ఇలలో రాజై నెక్కొన
  వలసిన గౌతముడటన్ భవములను వీడెన్
  తలగొరిగె తలపుల గొరిగె
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   గౌతమ బుద్ధునిపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 6. గలగల లాడెడి గంగయు ,
  కిలకిల నవ్వెడి శశియును , కెరలెడి పునుకల్ ,
  వెలయగ మూడగు కన్నులు
  గలవా డిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్ .

  రిప్లయితొలగించండి


 7. అల స్విట్జర్లాండున భళి
  గలదనె కోట్లు మన మోడి గానర్రా దు
  డ్డిలరాక విదేశమ్ముల
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్‌ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి


 8. ములుగు జిలేబీ పేరట!
  యిల చేతిని డబ్బు లేదు! యిడ్లీ సాంబా
  రులకై తిరుగుచు భళిభళి
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. డా…పిట్టాసత్యనారాయణ
  కులసతి లక్ష్మి గలప్పుడు
  కలకలమున దిట్లు దిట్టగా నౌకరులన్
  వెలసిన దీవెన బాయగ
  కలవాడిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్

  రిప్లయితొలగించండి
 10. తలిదండ్రులు సుతుని తమ శ్ర
  మలను మరుచి ప్రేమతోడ మరి సాకంగన్
  మలిదశన సుతుడు మరువగ
  కలవా డిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్


  🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి


 11. ఆదిభిక్షువుని రూపమీతడు  ఇలకద్వైతము నేర్పె నాతడుసుమా! యిమ్మంచు కోరంగ నౌ
  దలదాల్చున్ భళి యన్నపూర్ణయు సుమా! తంత్రమ్ము లామంత్రముల్
  పలుకంగన్ కనకమ్ము ధారగ సదా వఱ్ఱోడు; పూర్ణంబుగా
  కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇల భజగోవిందమ్మును
   పలువుర నోళ్ళను రుచించి పలికెడి రీతిన్
   కలనున్ గాంచని యశమును
   కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   ఆదిశంకరుల ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   *****
   ప్రభాకర శాస్త్రి గారూ,
   జిలేబీ గారి పద్యాన్ని అనుకరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. డా…పిట్టాసత్యనాయణ
  కలుముల్ జాలవు;రాజనీతి గనడాగండాలకున్ భ్రాతయై
  వెలయన్ గీర్తి కిరీట ధారణమునాపేక్ష్షిించి వెచ్చించగా
  నిలయంబున్విడి దాారిమారె తనదౌ నిర్వాకమున్నెన్నకే
  కలవాడే యిలునిల్లు గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్
  (యెలక్షను ప్రచారము లో ధనికులు)

  రిప్లయితొలగించండి
 13. నిలయముఁ గన హిమ శైలము
  గళమున వాసుకి వసించు, కైరవి యుండున్
  తలపై ,నలుదెసలను కో
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   దిగంబరుని నలుదెసల కోకలు కలవాడనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.

   తొలగించండి
 14. కలలో నైనను గనబడ
  రిలలో తన కైన వారలెచ్చో టైనన్
  కలవర పెట్టె డి యాకలి
  కల వా డిల్లి ల్లుదిరిగి కబళoబడి గెన్

  రిప్లయితొలగించండి
 15. అలనాడు ప్రాత చిరుగుల
  వలువం దాల్చిన ఫకీరు భక్తుల కొరకై
  యల షిరిడీ పుర మందున
  గలవాఁ డిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్

  రిప్లయితొలగించండి
 16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2809
  సమస్య :: కల వాఁడే యిలు నిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్.
  *ధనము కలవాడే ఇల్లిల్లూ తిరుగుతూ బిచ్చమెత్తుకొంటూ ఉన్నాడు ఒక గ్రామంలో* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: దేవతలకు తల్లియైన అదితి తన భర్తయైన కశ్యప ప్రజాపతిని జూచి ఓ నాథా! దితిబిడ్డలైన దైత్యులు బలవంతంగా అమరావతిని ఆక్రమించారు. నా బిడ్డలైన ఇంద్రుడు మొదలైనవారు దిక్కలేనివారైపోయారు అని వాపోవగా కశ్యపుడు దితిని *పయోభక్షణము* అనే వ్రతం చేయమంటాడు. దితి అట్లు చేయగా మహావిష్ణువు ఆమెకు కుమారుడిగా వామనమూర్తిగా జన్మిస్తాడు.
  రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు దివ్యదృష్టి కలవాడు. వామనుడు ఉపాయంతో బలిచక్రవర్తి నుండి మూడు లోకాలను సంగ్రహించి తన వశం చేసికొంటాడు అని తెలిసినవాడు.
  దీనిని గుఱించి ఆలోచిస్తూ నిద్రించిన శుక్రాచార్యుడు ఇలా ఒక కల గన్నాడు అని ఊహించి చెప్పే సందర్భం.

  కల వాఁడే కనుపించె శుక్రునికి విక్రాంతుండునై, యన్ని వం
  కల వాఁడే, భువి వామనుం డగుచు దీక్షామూర్తి విచ్చేసె, శ్రీ
  కల వాఁడే బలిచక్రవర్తి నడుగంగా బోయెడిన్, మూడు పో
  కల వాఁడే యిలు నిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (6-10-2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోట రాజశేఖర్ గారూ,
   మీ పూరణ శబ్దాలంకార శోభితమై మనోహరంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. . సవరణతో
   గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
   సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2809
   సమస్య :: కల వాఁడే యిలు నిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్.
   *ధనము కలవాడే ఇల్లిల్లూ తిరుగుతూ బిచ్చమెత్తుకొంటూ ఉన్నాడు ఒక గ్రామంలో* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
   సందర్భం :: దేవతలకు తల్లియైన అదితి తన భర్తయైన కశ్యప ప్రజాపతిని జూచి ఓ నాథా! దితిబిడ్డలైన దైత్యులు బలవంతంగా అమరావతిని ఆక్రమించారు. నా బిడ్డలైన ఇంద్రుడు మొదలైనవారు దిక్కలేనివారైపోయారు అని వాపోవగా కశ్యపుడు అదితిని *పయోభక్షణము* అనే వ్రతం చేయమంటాడు. అదితి అట్లు చేయగా మహావిష్ణువు ఆమెకు కుమారుడిగా వామనమూర్తిగా జన్మిస్తాడు.
   రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు దివ్యదృష్టి కలవాడు. వామనుడు ఉపాయంతో బలిచక్రవర్తి నుండి మూడు లోకాలను సంగ్రహించి తన వశం చేసికొంటాడు అని తెలిసినవాడు.
   దీనిని గుఱించి ఆలోచిస్తూ నిద్రించిన శుక్రాచార్యుడు ఇలా ఒక కల గన్నాడు అని ఊహించి చెప్పే సందర్భం.

   కల వాఁడే కనుపించె శుక్రునికి విక్రాంతుండునై, యన్ని వం
   కల వాఁడే, భువి వామనుం డగుచు దీక్షామూర్తి విచ్చేసె, శ్రీ
   కల వాఁడే బలిచక్రవర్తి నడుగంగా బోయెడిన్, మూడు పో
   కల వాఁడే యిలు నిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్.
   కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (6-10-2018)

   తొలగించండి
 17. అల దానే స్వయమీశ్వరుండు, తన కన్యాదాత యద్రీశుడౌ,

  తొలి మ్రొక్కుల్ గొను నట్టి దేవర సుపుత్రుండే గణాధీశుడౌ,

  చెలికాడయ్యె ధనేశ్వరుం , డయననున్ చిత్రంబు దైవక్రియల్

  కలవాడే యిలునిల్లు గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామమ్మునన్!.

  కంజర్ల రామాచార్య.


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "ధనేశ్వరుండె యయినన్ చిత్రంబు..." అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 18. మైలవరపు వారి పూరణ

  బాలశంకరుడు..

  ఎలమిన్ పేదరికమ్ము బాపుటకు యాచింపంగ ., నా యింతి యా
  మలకమ్మున్ గొనుమన్న., సత్వరమె యమ్మన్ శ్రీసతిన్ బిల్చి , ని...
  స్తులమౌ కాంచనధారనిచ్చె , ఘనవైదుష్యాఖ్యసంపత్తతుల్
  కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
  2. ఇలకు దిగిన నారదుడన
   తలచుచు హరినామమెపుడు తలఁ గలశముతో
   నిలిచిన దాసరి చిడతలు
   కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్ !

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 19. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  కలవాడే యిలు నిల్లు గ్రుమ్మరుచు
  భిక్షన్ గోరె గ్రామంబునన్
  ======================
  సంపద కలవాడే అయినను ఇల్లిల్లు
  తిరుగుతు ఆ గ్రామంలో బిచ్చమెత్తు
  కొను చున్నాడనుటలో అసంబద్దతె
  ఇవ్వబడిన సమస్య
  ========================
  సమస్యా పూరణం - 275
  ===================

  రాజకీయమున పండిన దిట్ట -
  ఎనకేసెను కద సంపదల గుట్ట
  పంచగ దాచెను నోట్ల కట్ట -
  ఓట్లకై పట్టె చేతిని బుట్ట
  పెక్కుగా తనలో లౌక్యము -
  కలవాడే యిలు నిల్లు గ్రుమ్మరుచు
  భిక్షన్ గోరె గ్రామంబునన్ -
  గెలిపించగ తన కోసం రమ్మనుచు

  ====##$##====

  ఎవడు ద్రవ్యమును నెక్కువ నివ్వ జూపునో
  వాడి వైపుకు మొగ్గు చూపెడి వేశ్య వోలే,
  సిద్దాంతములను గాలికొదిలి, ఎండిన పార్టీని
  తామొదిలి, పచ్చని పార్టీ లోకి తొంగి చూసెడి
  "జంప్ జిలానీలు" ఎందరో కదా

  ఇట్టి ప్రభువుల ఏలుబడిని పౌరుడిగా
  బ్రతుకుటకై ఎట్టి విపత్కర పరిస్థితిని కల్పించి
  తివి కదా ఓ ప్రభువా !!

  (మాత్రా గణనము - అంత్య ప్రాస)
  --- ఇట్టె రమేష్
  ( శుభోదయం)

  రిప్లయితొలగించండి
 20. కలుషిత మతిగల కొడుకులు
  తలిదండ్రులదరిమిగొట్ట దలచిరికలలో
  నిలువగ నీడయులేకను
  కలవాడిల్లుల్లు దిరిగి కబళంబడిగెన్

  రిప్లయితొలగించండి
 21. పడుగుపాడునగలయట్టిపరమపురుష!
  వచ్చియుంటినినెల్లూరుపనియుదగుల
  దర్శనంబునుగొఱకుమీదరికిజేర
  నెమ్మినీయుడుమీసెల్లునెంబరిచట
  రాజశేఖర!కవివర!రమ్యతేజ!
  from
  (venkatrama&co,Nellore)
  9866283384

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి


  2. హమ్మయ్య కిట్టించా కందములో


   రెండన గ్రహములు కర్మలు
   రెండన కన్ను గుణమొకటి రెండన కర్మల్
   గుండొక్కటి వేదంబుల
   నండగ తా పడుగుపాడున గలరు స్వామీ :)


   జిలేబి

   తొలగించండి
 22. పలికిన రాగాలే,మది
  పులకింపగ," ఘంటసాల" పొల్పుగ పాడెన్--
  కలతన మధుకర వృత్తిని
  కలవాడిల్లిలుఁదిరిగి కబళంబడిగెన్.
  అమర గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు గారు ఒకనాడు మధుకరవృత్తితో గడిపారు వారిని స్మరించుకుంటూ యీ పద్యం

  రిప్లయితొలగించండి
 23. అలనాడు కాశి పురమం

  దలికాక్షుడు తిరిప మెత్తి నన్నము కొరకా

  చలిమల సుతనే కోరెన్,

  కలవాడిల్లిల్లు తిరిగి కబళం బడిగెన్

  రిప్లయితొలగించండి
 24. అల ఘాణుగాపురపు దీ
  క్షలలో సాధకు డొకండు సద్భక్తుండున్,
  తుల తూగు నట్టి భాగ్యము
  "కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్
  (ఘాణుగాపురం అనే ఒక దత్తాత్రేయక్షేత్రం కర్నాటకరాష్ట్రం లో ఉన్నది. అక్కడ భక్తికి, నిరహంకారానికి ఒక సాధనగా ప్రతివారూ భిక్ష అడగాలి. భిక్ష ఇవ్వాలి)

  రిప్లయితొలగించండి
 25. ఈవారం ఆకాశవాణివారి సమస్య తెలియజేయగలరు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. "వాడిని పూవులే తగును భామలకున్ బ్రతుకమ్మఁ బేర్చఁగన్"

   తొలగించండి


  2. వేడుక ముచ్చటల్ గనెడు వేదిక గా నడి రేయి నావలో
   జోడుగ యీడుగా మగని, జొప్పిలు మోహన రూపు పెన్మిటిన్
   తోడగు జీవితమ్ము సయి, తూగెడు మంచము, ముద్దులాటలున్,
   వాడిని పూవులే తగును భామలకున్, బ్రతుకమ్మఁ బేర్చఁగన్


   జిలేబి

   తొలగించండి
 26. 9922133300?
  రాజశేఖరుగారి నెంబరా
  జిలేబిగారు!

  రిప్లయితొలగించండి
 27. కలిమినినిచ్చెడునతనిని
  బలువురిచేగీర్తినొందుపశుపతినెదలో
  దలచగ,విభూతిమెండుగ
  గలవాడిల్లుల్లుతిరిగికబళంబడిగెన్

  రిప్లయితొలగించండి
 28. బలిమిన కులమునడిగె యెని
  కలవాడిల్లిల్లు దిరిగి; కబళంబడిగెన్
  యలగుచు దీనుడు తన యా
  కలిని కడవబెట్టు మనుచు కడునొ ప్పిపడన్

  కడవబెట్టు=తొలగించు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతారామయ్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అడిగెన్ + అలగుచు' అన్నపుడు యడాగమం రాదు. "బలిమిని' అనడం సాధువు.

   తొలగించండి
 29. ....ప్రణామములు గురువుగారు..ఈ రోజు ఆకాశవాణి పూరణలు మీరు నిర్వహించడం, నా పూరణను మీరు చదవగా విని చాలా సంతోషించాను..ఇది నాఅదృష్టంగా భావిస్తున్నాను...


  చలిమల పైనివసించుచు
  తలపై మున్నీటి రాణి తనువున గౌరిన్
  వెలయించుచు ముక్కన్నులు
  గలవాడిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్!!!

  రిప్లయితొలగించండి
 30. కలవారినిఁ దోచ మదినిఁ
  దలఁచుచు వెదకఁగ ననువులు తటమట గతి వా
  క్కుల మోసపుచ్చు పలు పో
  కల వాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్


  అల వైకుంఠ నివాసుఁడే సుహృదుఁడే యాత్మీయుఁడే యవ్వ దా
  యల మోసమ్మున నేకచక్రపురి బిక్షార్థమ్మ, యూహింపగం
  దలమే, పాండవ వీరపంచకము సంస్త్యాయమ్ములే తిర్గెనే
  కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షం గోరె గ్రామంబునన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 31. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  డింపులయ్య:

  బలుపౌ కాశ్మిరు బ్రాహ్మణుండనుచు నార్భాటమ్ము గావించుచున్
  కలనున్ గాంచని తీరునన్ నడచుచున్ కైలాస శైలమ్మునన్
  గలభా జేయుచు రోజురోజిచట బంగారమ్ము వోల్ వోట్లకై
  కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఇది ఆటవిడుపుగా కాక సీరియస్‌గా చేసిన పూరణలా ఉన్నది. బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 32. కం.
  బలవంతుడు, యువతీ యువ
  కులకాదర్శము, సువక్త, కోవిదుడిలలో
  కళల నరేంద్రుడు, ఙ్ఞానము
  కలవాడిండిండ్లు దిరిగి కంబళమడిగెన్

  నరేంద్రుడు----వివేకానందుడు

  రిప్లయితొలగించండి
 33. కందం
  తలిదండ్రులు లేని ప్రభువు
  నిలలో షిర్డీ పురంపు నేలిక మనదౌ
  కలుషాపహరణమే మదిఁ
  గలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళంబడిగెన్

  మత్తేభవిక్రీడితము
  ఇలలో భక్తుల గావఁగా వెలసి సాయీ!రమ్మనన్ షిర్డి దా
  రుల దివ్యాత్ముడు కృష్ణరామశివ మారుత్యాది రూపమ్ములన్
  దలపున్ పండుచు పాపముల్ గొనెడు సత్కారుణ్యధీసత్వమున్
  గలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్గోరె గ్రామంబునన్

  రిప్లయితొలగించండి
 34. ఇలలోకమ్ముననొందు సౌఖ్యముల పైనేమాత్రమాసక్తి తా
  కలలోనైనను చూపకుండగ నిరంకారుండు విశ్వేశ్వరున్
  ఫలమాశించక గొల్చి దేహమును నిల్పన్ దివ్యమౌ జ్ఞానమున్
  గలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్"*

  రిప్లయితొలగించండి
 35. తలపై వస్త్రము గట్టి చేతనొక పాత్రన్ బట్టి సామాన్యుడై
  యిల షిర్డీ పుర వీధులన్ దిరిగె సాయీశుండె తేజమ్ముతో
  ఖలు పాపమ్ముల ద్రుంచుటొక్కటియె సత్కార్యమ్మనే దీక్షనే
  గలవాడే యిలునిల్లు గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'అనే' అనడం వ్యావహారికం. "సత్కార్యమ్ముగా దీక్షనే" అనండి.

   తొలగించండి
 36. ఇలనాధర్మజుడత్తఱిన్మనగనాయాగ్రామవాసుండుగా
  గలవాడేయిలునిల్లుగ్రుమ్మరుచుభిక్షన్గోరెగ్రామంబునన్
  లలనా!చూచితెయోడలేయగునువాలాయంబుగాబండ్లుగా న్నలధర్మేంద్రునకేయయాచితపుటాహారమ్ములోపించెగా

  రిప్లయితొలగించండి
 37. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్
  గోరె గ్రామంబునన్

  సందర్భము: నాగర్ కర్నూల్ ప్రాంతం లోని వెన్నచర్ల రావిపాకుల గ్రామాల నడుమ నాగమ్మ నల్లగుట్ట ప్రాంతంలో దైవ ప్రేరణతో శ్రీ లింగోజీ రావు గారు శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని నిర్మింపజేశారు.
  అతనికి సహకరించిన వారిలో పోలిశెట్టి బుడ్డయ్య ఒకరు. ఆయన ఒకప్పుడు కోటీశ్వరుడు. కాని విధి వక్రించి ద్రవ్యమంతా కోల్పోయినాడు. భిక్షాటన చేస్తే గాని పొట్ట గడువని పరిస్థితికి వచ్చాడు. దైవ ప్రేరణచేత బిచ్చమెత్తిన దాంట్లోనే తినీ తినకుండా మిగిలించి ఖర్చు భరించి శ్రీ సత్యదేవుని ప్రతిష్ఠ చేయించాడు. స్వామి వారి అనుగ్రహానికి పాత్రుడైనాడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఇల దెైవం బనుకూలమైనవరకే
  యీ తిప్పుడుల్, గొప్ప ; లా
  వల నేవీ! సిరు లున్న వున్నటులె పో
  వన్ సాగెలే మాయమై!..
  తెలియన్ సాగెను తప్పు ; లాత్మ మయుడే
  దేదీప్య మానంబుగా
  వెలుగన్ బుడ్డయ సత్య దేవు నెలకొ
  ల్పెన్ భిక్ష ; నొక్కప్డు తా
  కలవాఁడే యిలు నిల్లుఁ గ్రుమ్మరుచు భి
  క్షన్ గోరె గ్రామంబునన్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  6.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 38. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్

  సందర్భము: ఇల్లిల్లు తిరిగి బిచ్చ మెత్తుకునే తలంపు ఎవనికైతే ఉంటుందో వాడే ఇల్లిల్లు తిరిగి బిచ్చమెత్తు కుంటాడు కదా! ఇందులో విశేషమేముంది?
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఇలను విశేషం బేమిటి?
  యిలు నిల్లును దిరిగి బిచ్చ
  మెత్తుకొనెడు నా
  తల పెల్లప్పుడు మదిలో
  గలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  6.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. వెలుదండ వారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవది వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి


 39. గలగల లాడెడు గంగయు
  గల కాశీ పట్టణమున ఘనుడా వ్యాసుం
  డలయుచు పెక్కురు ఛాత్రులు
  గలవా డిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్ .

  కలిగిన నాడు మిగల్చక
  కలిమిని దాచక జగతిని ఖర్చును చేసెన్
  కలుగగ నష్టము పనిలో
  గలవా డిల్లిల్లు దిరిగి కబళం బడిగెన్ .

  రిప్లయితొలగించండి
 40. కం . కలవాడినియని కనుమిను
  తలపక కలిమినిబలిమిని తప్పకు తార్చన్
  కళవీడె,బ్రతుకువెలవెల
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిరాట్ల వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "కలవాడిని + అని = కలవాడినని" అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "కలవాడ ననుచు కనుమిను..." అనండి.

   తొలగించండి
  2. కం . కలవాడినని కనుమిను
   తలపక కలిమినిబలిమిని తప్పకు తార్చన్
   కళవీడె,బ్రతుకువెలవెల
   కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్.

   చేసాను గురువుగారు .

   తొలగించండి
  3. మొదటి పాదంలో గణదోషం అలాగే ఉంది. "కలవాడ ననుచు కనుమిను" అనండి

   తొలగించండి
  4. కలవాడననచు కనుమిను
   తలపక కలిమినిబలిమిని తప్పకు తార్చన్
   కళవీడె,బ్రతుకువెలవెల
   కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్.
   చేసాను గురువుగారు

   తొలగించండి
 41. కలిమికి యధిపతి సఖుడుగ
  నెలవంకను సుందరముగ నెత్తిన మఱియున్
  దలపై ముద్దుల గంగనె
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది అభినందనలు.
   "కలిమికి నధిపతి" అనండి.

   తొలగించండి
 42. తలపై గంగను,శిగలో
  నెలవంక నిడుచుఁ విబూఁదిని తనువునెల్లన్
  పులుముకొనుచుఁ ముక్కన్నులు
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్ !

  రిప్లయితొలగించండి
 43. తలపై గంగను,శిగలో
  నెలవంక నిడుచుఁ విబూఁదిని తనువునెల్లన్
  పులుముకొనుచుఁ ముక్కన్నులు
  కలవాఁ డిల్లిల్లుఁ దిరిగి కబళం బడిగెన్ !

  రిప్లయితొలగించండి
 44. కులముల్ గోత్రము లెంచి వోటరులనున్ కొండాడి తిన్పించుచున్
  బలమౌ కోళ్ళను మేకలన్ విరివిగా వడ్డించి బిర్యానినిన్
  పలు మార్లెన్నికలందు నోడుచును పల్ భండారముల్ క్రుంగ శ్రీ
  కలవాఁడే యిలునిల్లుఁ గ్రుమ్మరుచు భిక్షన్ గోరె గ్రామంబునన్

  రిప్లయితొలగించండి