దేవి స్త్రోత్రము
సీ: తామసీ! శాoభవీ! దశభుజా! సాత్వికి!
          బాలచంద్ర! కన(కా)భరణ భూషి 
     తా! విజయ! భవాని! సావిత్రి! రంజనీ!
          కాత్యాయనీ!(చ)ర్చ! కామ పూజి
     తా!
యమునా! పింగ! ఛాయ! శాకంబరీ! 
          విశ్వజనని!  బాబ్రవి! పరదే(వ)
     తా! కిరాతీ! హిండి! శాకినీ! నగజాత!  
          నిర్గుణా! సక(ల) మునిగణ సేవి
     తా! గిరిజా! శాక్రి! యోగినీ! నిస్తులా!
          వారుణీ!సతి!  పంచ వదన సం(యు)
     తా! సురస! మలయ
వాసి(నీ)! మాతృక! 
          మాలిని! మంగళ! మారి పురల!                                              
     తారుణ్య
దాయిని! కారుణ్య కౌము(దీ)!
          పురుహూతి! శాంకరి! పుత్రి! భంజ!                                  
    తాపిత
ధారిణి! దాక్షి! సురాసుర   
          వి(ను)త! భవ్య!  నగనందిని! భగవతి! 
    తాలికా
వితరిణి! దాక్షాయణి! స(ని)! 
          నారాయణీ! ఉమ! యోగమాయ! బుద్ది!                      
    తాతోటు నాశిని! ధర్మ స్వరూపిణి!   
          (కరు)ణాoత  రంగిణీ!   గట్టు పట్టి
!
తే: తాయి! ఖర్పర  గు(ణ)నిక ధారిణి! శివ!     
     నిత్య సం(తో)షి! శ్యామలా! సత్య! ధిషణ !
     భక్తితో(డ) జేతును పూజ భద్రకాళి
     కాచ వలయు నీ దీనుని  కరుణ
తోడ.
పద్యము
చదువు విధానము 
దేవి నామములతో దశ దళ పద్మము ఇది. సీస పద్యములో ప్రార్ధన.   
ముందుగా వృత్తములో గులాబీ రంగు
వద్ద బాణము గుర్తు పెట్టిన చోటు
నుంచి ”తా“తో
మొదలు బెట్టి తామసీ అని చదువుకుంటూ ఆ దళము చివరకు వచ్చిభూషితా అని మరల విజయ అనే పాదము చదువు కొంటు పెద్ద వృత్తములో పది పాదాలు పూర్తి చేసుకోవాలి. చివరి పాదము గట్టు పట్టి దగ్గిర ఆపి మరల తా తో క్రింద బాణము గుర్తు గల కొస భాగములో అక్షరములు
కలిపి చదువుకోవాలి. కొస భాగములలో 3 పాదములు 
మాత్రమే కనిపిస్తాయి. భద్రకాళి వరకు మాత్రమే. ఈ బంధములో విశేషము   తా అన్న అక్షరము తోటి 10 పాదాలు మొదలు అవుతాయి.  దానితో బంధము జరిగింది. అంతటితో అయి పోలేదు. ఎత్తుగీతిలోని ఆఖరి పాదములోని
ఒక్కొక అక్షరము పద్యములోని అన్ని
పాదములలో  బంధించబడినది.  కాషాయ రంగు బుల్లి వృత్తములలో అక్షరములు బంధించ బడినవి.  మొదటి గులాబీ రంగు దళములో కా రెండవ దళములో చ అలా వరుసగా బంధించ బడినవి. అవి మొత్తము కలిపి చదువుకున్న చిత్రం పూర్తి  అవుతుంది. ఇది ఈ చిత్ర బంధ విశేషము. 
(అర్ధములు) 
తాళికా వితరిణి =
ఓర్పు ప్రసాదిoచునది, తాకత్తు రూపిణి = బలమైన రూపము గలది, తాటోటు నాశిని = మోసం
నాశనము చేయునది,తాపిత ధారిణి  =పట్టు చీర
ధరించినది,తామ్రాక్ష =  ఎర్రని కనులు
కలది, తాయి = తల్లి, తారుణ్య దాయిని =
యవ్వనము ప్రసాదిoచునది, తారణ తరింప
చేయునది, ఖర్పరము = కపాలము, గుణనిక=  హారము.
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ బంధకవి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి