18, అక్టోబర్ 2018, గురువారం

న్యస్తాక్షరి - 60 (ద-శ-హ-ర)


అంశము - దసరా సంబరములు
ఛందస్సు- తేటగీతి
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ద - శ - హ - ర' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - మత్తేభము
న్యస్తాక్షరములు - 
1వ పాదంలో 1వ అక్షరం - ద
2వ పాదంలో 6వ అక్షరం - శ
3వ పాదంలో 12వ అక్షరం - హ
4వ పాదంలో 16వ అక్షరం - ర.

76 కామెంట్‌లు:

 1. దయగొనుచు మాకభయమిడి రయము గావు
  శరణు శరణంటి దుర్గమ్మ శక్తి మాత
  హరణంబు సేయగ వెతలన్నియు హర
  రమణి రావేల జాగేల రమ్ము మాత

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. "హరణమును జేయ వెతలన్నియు హర..." అనండి.

   తొలగించండి
 2. మైలవరపు వారి పూరణ

  అంశము - దసరా సంబరములు


  దయను గని , బతుకమ్మవై దారి చూపు
  శక్తివని కొల్చు తెలగాణ సంబురములు !
  హరుని రాణికి నింద్రకీలాద్రి యందు
  రమ్య నవరాత్రశోభలు రండు గనుడు !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దసరా పర్వమునందు దేవి నవరాత్రప్రాభవంబొప్పగా
   వెస దుర్గాంబ శమింపజేయునఘముల్ , వే రండు సేవింపుడీ !
   మసి జేయున్ దనుజాళి , జీవుల హసింపన్ జేయు మా తల్లి , మీ...
   కసమానాద్భుతసంపదల్ గలుగు మా యమ్మన్ రహిన్ మ్రొక్కుడీ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి


 3. దసరా సంబరముల్ జిలేబి! వసతిన్ ధాత్రిన్ జనాళిన్ భళా
  మసగుల్ వీడ శకాక్షి పూజలు,ఉమా! మాహేశి కాలంజరిన్
  పసదప్పెల్లను ద్రోలగా, దశహరా, ప్రార్థింప రండోయి యీ
  శ, సతిన్,షడ్భుజ శాక్రి సౌమ్య హిమజన్ సంభారమందున్ వెసన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పసదప్పి + ఎల్లను' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

   తొలగించండి
 4. దమము వీడుచు మదిలోన తనరు కొనగ
  శమము మానగ నిరతము శాంతి గాను
  హరిహ రాదుల సేవించి భక్తి కొలువ
  రమ్య మైనట్టి బ్రతుకంత లాస్య మనగ

  రిప్లయితొలగించండి
 5. దరికి జేరెడి శిష్యులు గురుల తోడ ,
  శక్తిపద్యాల పగటి వేషముల తోడ ,
  హసితవదనల బొమ్మలహంగు తోడ ,
  రమ్యనవరాత్రపర్వమ్ము రాణ కెక్కె .

  రిప్లయితొలగించండి


 6. దశమి ! విజయదశమి ! ప్రమిదల వెలుంగు
  శక్తి నిచ్చుగాక శివాని శాంతి జేర్చి
  హరము గాన దుష్ట జన సంహార మనగ
  రభస కాశ్మీరమును వీడి రాలి విరుగ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. దయ ను జూపి oప దుర్గ కు దండ మిడుచు
  శ మ దమాది గుణమ్ములు సత్వ రముగ
  హర ణ మొనరించి యేకత నల రు నట్లు
  రమ్య నవ రాత్రి శోభ లు రహి ని బెంచు

  రిప్లయితొలగించండి
 8. శంకరాభరణం....అంశము - దసరా సంబరములు ..ఛందస్సు- తేటగీతి
  న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ద - శ - హ - ర' ఉండాలి
  *************************
  దశదిశలు దసరా మహోత్సవము దాటె
  శక్తి మాతను కొలిచిరి భక్త జనులు
  హర రమణి! కడు దీనభక్తావళి గని
  రమ్ము తడసేయక గరుణ రక్ష జేయ


  🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
  🌷వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 9. (ద)శముఖంబుల వాడును దానవుడగు
  (శ)త్రువును జంపి రాముండు సన్నుతముగ
  (హ)ర్షమును బంచు కాల మీయవని కందు
  (ర)రయ దశహరోత్సవముల కరణి నిచట.

  (ద)నుజు డైనట్టి మహిషుని తగినరీతి
  (శ)క్తి జగదంబ దుర్గయై సంహరించ
  (హ)ర్షమును బూని జనులంద రవని జేయు
  (ర)మ్యపర్వంబు దశహరా కామ్యదంబు.

  (ద)క్షులైనట్టి పాండవు లక్షయమగు
  (శ)స్త్ర సంపత్తులను శమీశాఖిక పయి
  (హ)రికి మ్రొక్కుచు దాచ నా యవనిజమును
  (ర)మణులను గూడి పూజించు సమయ మిద్ది.

  (ద)శ దినంబుల పర్వమీ ధరను జూడ
  (శ)స్త్రములపూజ, సర్వార్థ సంపదలన
  (హ)రహమును గోరి జగదంబ కర్చనలును
  (ర)మ్యగతి జేయుట దశహరా యనంగ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ నాలుగు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 10. దేవిక
  ----

  దనుజ సంహరణమ్మె మోదమ్మవగ ద
  శదిన పర్వదినమ్మాయె; శక్తి నహర
  హమ్ము దశ దినమ్ముల గొల్చి హర్షముగను
  రమ్యముగ విరియును సంబరమ్ము లిలను!

  రిప్లయితొలగించండి
 11. దరిఁజేరన్ నిను కల్గె నా మనమునన్ తల్లీ!విరాగంబు,వా
  నర చాంచల్య శతప్రయుక్త గుణ విన్యాసంబు లార్పంగ,చె
  చక్కెర దుర్గాంబ!నమస్కరించెద హర శ్రీ పాద సాన్నిధ్యాన్ని మో
  క్ష రమన్ నాకిడ వేడెదన్ శుభము దీక్షన్ పొందగా నమ్మరో!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రసాద రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదం చివర గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. Productive text నా cell లో ఉన్న కారణంచేత నేను ఒకటి type చేస్తుంటే ఇంకొకటి పడుతున్నది
   అది సాన్నిధ్య--సాన్నిధ్యాన్ని కాదు
   క్షమించండి

   తొలగించండి
 12. దయను చూపుము దుర్గ కాత్యాయని! శివ!
  శరణు, దుష్టుడౌ మహిషుని సంహరించి
  హర్షము నొసంగితివి ప్రజ కన్నపూర్ణ!
  రమ్య పదముల మ్రొక్కెద సౌమ్యపు మది

  రిప్లయితొలగించండి
 13. దనుజ సంహార మొనరించి ధరణి గాచె
  శక్తి దేవేరి దుర్గ కు భక్తి తోడ
  హరుని రాణికి మ్రొక్కు చు జరుపు దశ హ
  రంపు బ్రతుకమ్మ మిన్నంటి రహి ని గూర్చు

  రిప్లయితొలగించండి
 14. మీకు మీకుటుంబ సభ్యులందరికీ "విజయదశమి" శుభాకాంక్షలు.

  శ్రీమాత్రే నమః

  కందము:
  అమ్మకడ నున్న శిశువుల
  కిమ్మహిలో భయము గలద?హే జగదంబా!
  మమ్మాకలి బాధలు, కను
  మమ్మా! కలికల్మషములు మరియంటవుగా!

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  నేటి అంశము :: దసరా సంబరములు
  ఛందస్సు :: మత్తేభము
  న్యస్తాక్షరములు ::
  1వ పాదంలో 1వ అక్షరం - ద
  2వ పాదంలో 6వ అక్షరం - శ
  3వ పాదంలో 12వ అక్షరం - హ
  4వ పాదంలో 16వ అక్షరం - ర.
  సందర్భం :: భారత దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంబరాలలో భాగంగా భక్తులు చేసే దాండియా నృత్యం అసమానమైనది. జమ్మి ఆకును పట్టుకొని
  శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ।
  అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ।।
  అనే శ్లోకం చెప్పుకొని పాపములనుండి విముక్తిని పొందడం జరుగుతుంది. పులివేషం మొదలైన దసరా వేషాలు, బొమ్మలకొలువులు, రామలీలలు మున్నగు సాంస్కృతిక కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. దుష్టుల శక్తి నశిస్తుంది. వారి అహంకారం కూడా తొలగిపోతుంది. అమ్మవారి భక్తులు మెప్పును విజయాన్ని పొందుతారు. జగదంబ ఊరేగింపుగా వచ్చి తన దర్శనభాగ్యమును ప్రసాదించి అందఱినీ అనుగ్రహిస్తుంది. అని దశరా సంబరాలను గుఱించి విశదీకరించే సందర్భం.

  దసరా పండుగ సంబరాల సరదా దర్శించుడీ; దాండియా
  యసమానమ్ము, శమీ సమీపగతి పాయంజేయు బాపమ్ములన్,
  దసరా వేషము మోదకారి, యహమున్ దప్పించు మెప్పించుచున్,
  లసదాత్మన్ జగదంబ భక్తులను లీలన్ జేర నూరేగెడిన్.
  కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (18-10-2018)

  రిప్లయితొలగించండి
 16. దహి వడలు, గారె బూరెలు, దప్పడములు
  శర్కరా పాయసంబును సకినములును
  హల్వ, పులిహోర సిద్ధము హాయి గాను
  రమ్ము, మీరు రాగను, సంబురములు మాకు

  రిప్లయితొలగించండి
 17. దమము గూర్చుకొనగ గొప్ప తరుణ మిదియె
  శమము నేర్వదగు భువిని శాంతి కొఱకు
  హంస వలె మెలగ వలెనహింస తోడ
  రమణకెక్క పండుగ సంబరాలు భువిని !

  రిప్లయితొలగించండి
 18. కవి పండితులు
  శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
  ======================
  "ద" , "శ" , "హ" , "ర" -- ఈ అక్షరాలను
  1,2,3,4 పాదములలో ఒకటవ,రెండవ,
  మూడవ,నాల్గవ అక్షరాలుగా వినియోగిస్తు
  దసరా సంబరాలను వర్ణించవలెను
  ==========================
  న్యస్తాక్షరి
  ========

  దండిగ కదిలిరి జమ్మి పూజకు జట్టుగ జనం
  ఆశ నిరాశల విజయం కోరగ మనకు మనం
  మనోహరముగ మనసులు తనిసెనన కమ్మదనం
  పిలిచెర పిల్లన గ్రోవిగ పడుచుల జాణ తనం

  ====##$##====

  ముప్పై ఏళ్ల క్రితం ఇరవై ఏళ్ళ వయసులో
  సురేందర్ కొత్త బట్టల జేబు నిండా బంగారం
  (జమ్మి)వేసుకుని దోస్తులను వెతుకుతు బయలు
  దేరే వాడు, ఈ రోజు బయటికెళ్ళటం లేదు ఒక
  వేళ వెళ్ళినా, దూరం నుంచే తెలిసిన వాడెవడైన
  కనిపిస్తె "వీడొకడు, వీడికొక నమస్తే పెట్టి పలక
  రించాలి కాబోలని" విసుక్కుంటున్నాడు.

  పల్లెటూరి తల్లి దండ్రులకు దూరంగా పట్నంలో
  కాపురమున్న బాలరాజు , దసరాకు ఊరెళ్ళి
  అక్కడి ముసలి తల్లిదండ్రుల,ఇతర రక్తసంబంధీ
  కుల కళ్ళలోకి చూసే ధైర్యం లేక, జమ్మితో కాళ్ళకు
  దండం పెట్టడానికి మనసొప్పక, భార్యాపిల్లలను
  తీసుకుని అత్తగారింటికి వెళ్ళి భారీగా చేతి
  చమురునొదిలించుకున్నాడు భార్యావిధేయుడు.

  ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
  ---- ఇట్టె రమేష్
  ( దసరా శుభాకాంక్షలతో శుభోదయం )

  రిప్లయితొలగించండి
 19. గురువు గారు కంది శంకరయ్య గారికీ, ఇతర పెద్దలకు దసరా శుభాకాంక్షలు......

  సీ..
  లోకాల సృష్టించి లోకుల పాలించి
  లయము చేసే తల్లి లలిత లలిత
  మా కల్మషంబులు మాయమ్మ బాపుచు
  లబ్ధినిచ్చేనుగ లలిత లలిత
  సిద్ధ గంధర్వ వశిన్యాది దేవత
  లమ్మనిన్నే వేడె లలిత లలిత
  మా కన్న తల్లి కామాక్షి భవానీ య
  లక వలదేయమ్మ లలిత లలిత

  తే.గీ.

  లాలనా పాలనా చేయ లలిత లలిత
  లక్ష్మి రూపిణీ మాయమ్మ లలిత లలిత
  లాస్యమే చేయ రావమ్మ లలిత లలిత
  లక్ష కుంకుమార్చన నీకు లలిత లలిత

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
   "ఇచ్చేనుగ, లాలనా పాలనా" అన్న ప్రయోగాలు సాధువులు కావు.

   తొలగించండి
 20. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂న్యస్తాక్షరి🤷‍♀....................
  నాలుగు పాదాల మొదటి అక్షరాలు
  ద..శ..హ..ర.. రావాలి. తేటగీతిలో దసరా
  సంబరాల గురించి..

  సందర్భము: ఈ సంసార సాగరాన్ని తరించని నాడు ఎన్ని పండుగలు వచ్చినా ఎన్ని సంబరాలు చేసుకున్నా ప్రయోజన మే మున్నది? ఏదో సాధించినా మనే మిథ్యా తృప్తి తప్ప..
  భవ సాగరాన్ని తరించడానికి కావలసింది దైవానుగ్రహమే! అది లేని నాడు పండుగ సంబరాలలో మిగిలేవి పిండి వంటలే!
  అందుకే ఈ విజయదశమి పర్వదిన సందర్భంగా దనుజ సంహారిణియైన ఆ సర్వ మంగళా దేవిని వేడుకుంటున్నాను సంసార సాగరాన్ని తరింప చేయమని..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  దనుజ సంహారిణీ! మమ్ము దయ గొని భవ

  శరధి దాటింప జేయవే! సంబరము ల

  హరహమును జేసికొందుమే! యటుల గాక

  రహిని పండుగ లెన్నైన లాభ మేమి?

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  18.10.18
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 21. దనుజ లెవ్వరు ధరలోన తమము విడక
  శమము తోనుండు పుణ్యుల చంపనెంచు
  హంతకుల నుగ్రవాదుల నాటవికుల
  రయమునను మార్చ శారద రాత్రులండ్రు

  రిప్లయితొలగించండి
 22. న్యస్తాక్షరి :-

  అంశము - దసరా సంబరములు
  ఛందస్సు- తేటగీతి
  న్యస్తాక్షరి - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా *'ద - శ - హ - ర'* ఉండాలి

  *తే.గీ**

  దశమి నాటి కనకదుర్గ దయను జూపు
  శత్రుసంహారి,కాళికా,చండి,పాప
  హరిణి,శర్వాణి,భార్గవి,పరుల,గౌరి
  రక్షణము మాకు నీవే శరణము తల్లి
  .....................✍చక్రి

  *అందరికీ దసరా శుభాకాంక్షలు*

  రిప్లయితొలగించండి
 23. దశముఖ ప్రహరం బయ్యె దశమి దినము
  శరముల జయించె నరుఁడు దశమి దినమ్ము
  హరసతి సమయించె మహిషాసురు దశమిని
  రహి నొసంగు జనులకు దశహర నేఁడు


  దశకంఠక్షయ కార్య కారణమునం దన్నామ మే కల్గగన్
  విశదంబే దశహారి నాఁగ దిశలన్విఖ్యాతియే ధాత్రినం
  ద శమీ పల్లవ దాన నిష్కలహ విస్తారక్రియా సంతతిం
  బశుపత్యర్ధ శరీరినిం బ్రజలకున్ మందారఁ బ్రార్థింపరే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 24. దశవిధాలుగ పూజలే దసరయనగ
  శత్రునాశిని దుర్గమ్మ సంపదొసగు!
  హక్కు నవరాత్రి పూజలుమక్కువనగ
  రక్ష గూర్చును దేవి నారాధ్యులవగ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంపద + ఒసగు' అన్నపుడు సంధి లేదు. "సంపద నిడు" అనండి.

   తొలగించండి
 25. దనుజానీకపు సార్వభౌముడు మహత్త్వాకాంక్ష గాంక్షించుం
  గనియెన్ శక్తి శరాసనాంగి నెద దుష్కర్మంపు మాయాభ్రమన్
  జననిన్ మాన్య నమాయికంచు నహమేశాంతించబెండ్లాడగా
  పనిచెన్జచ్చెను పోరులో దశహరాపర్వార్ధమౌసార్ధకమ్-
  .....శంకర్జీ డబ్బీకార్������

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకర్ జీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సార్థకమ్' అని హలంతంగా ప్రయోగించరాదు. "పర్వార్థ సార్థక్యమై" అందామా?

   తొలగించండి
 26. దరహాసమ్మున భక్తులన్ దనుపు మాతా! అన్నపూర్ణేశ్వరీ!
  ధరపైనొక్క శఠుండు రాక్షసుడు తా దండించుచున్ లోకులన్
  నిరతమ్మున్ కెరలించ, శూలపు హతిన్ నిర్భీతితోచెల్గి సం
  గరమందున్ కడతేర్చి నావు మహిషున్ గౌరీ! రహిన్ జూపుమా!

  రిప్లయితొలగించండి
 27. అందరికీ విజయదశవి పర్వదిన శుభాకాంక్షలు

  తేటగీతి
  దయను గురిపించ దుర్గమ్మ ధరణి పైన
  శరదృతువు న వాసవి గుడి మెఱపు లమర
  హర్షమున నవరాత్రుల నమ్మఁ గనుచు
  రహిఁ గొనఁగ ప్రొద్దుటూరు తరలిరి సురలు

  రిప్లయితొలగించండి
 28. దనరుచేమంతిపూలనుదండజేసి
  శర్వుపత్నియోగిరిజమ్మ! సరమువేసి
  హర్షమొదవగ భక్తితోహారతిచ్చి
  రయముజేసెదబూజనురమ్ము మాత!

  రిప్లయితొలగించండి
 29. మత్తేభవిక్రీడితము
  దసరా వేడుక చీల్చెనంట దివిలో దైవాల ముక్కోటులన్
  ప్రసరించన్ దిశలెల్ల వేంకట ప్రభల్ బ్రహ్మోత్సవాల్జూడగా
  నసమానంబగు వాసవీమ ప్రహతా హర్మ్యమ్మునన్ బ్రొద్దుటూ
  ర సమారంబముఁ గాంచ మైసురున వారల్ జేర చాముండినిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వాసవీమ ప్రహతా'...?

   తొలగించండి
  2. గురుదేవులకు ధన్యవాదములు. వాసవీమాత వ్యాపించిన అన్న భావముతో వ్రాశాను.సవరణలు సూచించ ప్రార్థన

   తొలగించండి
 30. దశమిరోజున దుర్గను దలచుకొనుచు
  శమము గల్గించమనుచును సన్నుతించి
  హరుసముగ నాప్తులనుగూడి యవనిజనులు
  రమ్యముగచరించుదురు పురమ్ములందు !!!

  రిప్లయితొలగించండి
 31. .......పూజ్య గురుదేవులకు, కవిమిత్రులందరకూ విజయ దశమి శుభాకాంక్షలు.....

  రిప్లయితొలగించండి


 32. 1 .దయను జూపవమ్మ జనని త్వరితముగను
  శరణు కోరితి కావుము సన్నుతాంగి
  హర్షమొసగుచు దీవించు మనవరతము
  రక్కసుల దును మాడిన లలిత వీవె.

  2.దక్ష సుతవీవె రక్షించు తల్లి మమ్ము
  శక్తి యుక్తుల నొసగుము జగతి యందు
  హరుని తోగూడి యనయమ్ము హర్ష మొసగు
  రమణతోమము బ్రోవుము రయము గాను

  రిప్లయితొలగించండి
 33. దమము నణచగ దిగివచ్చు దమన శమని
  శక్తి మూలము దుర్గమ్మ శైల పుత్రి
  హరుని పట్టపు రాణియే ఆదిశక్తి
  రక్త వర్ణపు వస్త్రాల రమ్య ధార

  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 34. దనుజుండౌమహిషాసురున్ మడచగా, దాక్షాయణిన్ దుర్గగా
  జనులాదుర్దశ నుండి కాచెనని పూజల్ సేతురెంతో ముద
  మ్ముననుత్సాహముతోడనా భవహరిన్ మోక్షమ్మిడన్ గోరుచున్
  గనగా తక్కువె రెండుకన్నులెగయన్ కర్పూర దీపంబులే

  రిప్లయితొలగించండి
 35. గురువర్యులకు, కవిమిత్రులందరికి విజయదశమశుభాకాంక్షలు.

  దశ విధములుగ దుర్గమ్మ తల్లిని గన
  శరదృతువు లోన విజయ దశమి వరకును
  హవన సహిత పూజ లొనర్చి హారతు లిడ
  రహిని కల్గించవె దసరా లహరహమ్ము!

  రిప్లయితొలగించండి
 36. దశమిపండుగ కొరకయి తనయవచ్చి
  శరదృతు నవరాతిరుల పూజలనొనర్చె
  హర్మ్యపుముఖద్వా రము ముందు నాకరమయి
  రమణులందరు బతుకమ్మలాడుకొనిరి

  రిప్లయితొలగించండి
 37. దేవిక
  -----

  దయను కావుమా యనటంచు ధరణియందు
  శత్రు నాశని యైనట్టి శక్తి గొల్చి
  హర్షమున జనులే దశహరను సంబ
  రముగ జరిపిరీ దినమున రాణ తోడ!

  రిప్లయితొలగించండి