మైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ***** విట్టుబాబు గారూ, మీ రెండు పద్యాలు బాగున్నవి. "బాపును + అతడే" అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ "...బాపు నతండే" అనండి.
మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఆంధ్ర కల్పవృక్షము' అని తాటిచెట్టును గురించి హైస్కూలులో ఒక పాఠం ఉండేది. మీరు ఆ చెట్టును ప్రస్తావించలేదు కదా?
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2812 సమస్య :: ఖరమా జీవన మందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా. *ఓ గాడిదా! నీవు నా జీవితంలో సుఖములకు నిలయంగా మారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: తపము శౌచము దయ సత్యము అనే నాలుగు పాదాలతో విరాజిల్లుతూ వృషభ రూపంలో ఉండిన ధర్మదేవత కలియుగంలో సత్యము అనే ఒకే పాదంతో మిగిలియండగా ఆ వృషభాన్ని కలిపురుషుడు కాలితో తన్నినాడు. పరీక్షిన్మహారాజు ధర్మదేవతను ఊరడించినాడు. కలిని నిగ్రహించి నీవు ఈ ప్రదేశంలో ఉండేందుకు వీలులేదు అని కోపించినాడు. ప్రాణివధ స్త్రీ ద్యూత మద్యపానము అనే నాలుగు స్థానములలో కలి ఉండేందుకు అనుమతించాడు. కలి ఇంకనూ కోరగా వైరమునకు నిలయమైన బంగారంలో కూడా ఉండేందుకు అవకాశం కల్పించాడు. ఓ కర్బురమా ఓ బంగారమా! ఓ అగ్నిశేఖరమా! నిన్ను పూజిస్తాము. నీవు మాలో వైరములను పెంచకుండా దయతో మా జీవితాలలో సుఖములకు నిలయంగా మారు అని విన్నవించుకొనే సందర్భం.
ధరలో ప్రాణివధాదులన్ కలికి సంస్థానాలుగా నిచ్చుచున్ కర మాశన్ కలి గోర నిచ్చె నిను సాక్షాత్ శ్రీ పరీక్షిత్తు; క ర్బురమా! వైరము పెంచకమ్మ! నిను నే పూజింతు నో అగ్నిశే ఖరమా! జీవన మందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా! అగ్నిః ఇవ శేఖరమ్ అస్య=అగ్నిశేఖరమ్ (బంగారము) కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (9-10-2018)
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ======================= ఖరమా జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా ======================= "ఓ నా గాడిద నా జీవితంలోని అన్ని సుఖములకు నిలయముగా నీవు మారవా! "అని అనడంలో అసంబద్దతె ఇచట సమస్య ========================= సమస్యా పూరణం- 278 =================
లోక కళ్యాణార్థం చేయు యజ్ఞమునకు "హవిర్భోక్త" ను నిర్ణయించు నెపమున భృగు మహర్షి నీ యెదపై కాలితో తన్నెను కదా! అది చూసి అలిగిన లక్ష్మీదేవి అడవులకేగి ఇడుము లు బడుతున్నది, ఓ శ్రీహరి అట్టి లక్ష్మీదేవిని ప్రేమతో చేరదీసి ఆవిడ పాలిట అన్ని సుఖ ములు నీవుగా మారవా !
డా. పిట్టా సత్యనారాయణ (చాకలి మడియేలు యొక్క సంక్రాంతి పర్వ దిన ప్రార్థన) ఖరహర యను రాగమె శ్రీ హరికిని ప్రియమౌనుగాదె యది చాలును నీ స్మరణము కర్మ సుయోగమె ఖరమా! జీవనమున సుఖంబుల నిడుమా
సందర్భము: బలరామ కృష్ణ కుచేలురు సాందీపని వద్ద విద్య అభ్యసించినారు. అతడు గురు దక్షిణగా సముద్ర స్నానానికి వెళ్ళి మృతుడైన తన కొడుకు కావా లంటాడు. కృష్ణుడు సముద్రుణ్ణి అడిగితే "పంచజను డనే రాక్షసుడు మింగినాడు సముద్ర గర్భంలో వున్నా" డంటాడు. కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి ఆ రాక్షసునితో యుద్ధం చేసి సంహరించి పొట్ట చీలిస్తే గురు పుత్రుడు కనిపించడు. ఒక శంఖం వుంటే దాన్ని తీసుకుంటాడు. అదే పాంచజన్యం. కృష్ణుడు తర్వాత గురు పుత్రుడు నరకలోకంలో వున్నా డని గ్రహించి అక్కడకు వెళుతాడు. పాంచజన్యం పూరిస్తాడు. యమ ధర్మరాజు సాదరంగా ఆహ్వానం పలికి గురు పుత్రుని అప్పగిస్తాడు. అతణ్ణి తెచ్చి కృష్ణుడు అప్పగిస్తే గురు దంపతు లెంతో సంతోషిస్తారు. విష్ణుమూర్తి పంచాయుధాలలో నొకటైన ఓ పాంచజన్య ముఖరమా! మా జీవితంలో సుఖాలను కలిగించుమా!... అని కవి ప్రార్థన. ముఖరము..అంబుజము= శంఖము ~~~~~~~~~~~~~~~~~~~~~~~ గురు దక్షిణ కొర కేగిన హరి జలనిధిఁ బంచజనుని నంత మొనర్పన్ దొరికితివి.. పాంచజన్య ము ఖరమా! జీవనమునన్ సు ఖంబుల నిడుమా!
దీనినే *కందార్థము* గా మలచినచో....
గురు దక్షిణ కొర కేగిన హరి జలనిధిఁ బంచజనుని నంత మొనర్పన్ దొరికితివి.. పాంచజన్య ము ఖరమా! జీవనమునన్ సు ఖంబుల నిడుమా! పావన ధ్వని గల అంబుజోత్తమమా!
✒~డా.వెలుదండ సత్యనారాయణ 9.10.18 -----------------------------------------------------------
సరిచేసి రోడ్ల గతుకులు
రిప్లయితొలగించండిబిరబిర పరుగెత్తి పట్టు వీధుల కుక్కల్...
మొరలిడెదను వినుమా! శే
ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(1)
రిప్లయితొలగించండినిరతము భక్తులఁ బ్రోచెడి
కరుణాత్ముఁడు వేంకటపతి కడు మోదమునన్
తిరముగ నున్న తిరుమల శి
ఖరమా! జీవనమునన్ సుఖమ్ముల నిడుమా!
(2)
స్థిర కైలాస నివాస! భక్తజన సంక్షేమప్రదా! శంకరా!
వర నాగాభరణా! త్రినేత్ర! హర! దుర్వారాఘ విధ్వంసకా!
నిరతంబున్ తవ పాద సేవన రతిన్ నిన్నెంచెదన్, జంద్రశే
ఖర! మా జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!
🙏🏻🙏🏻
తొలగించండినిరతము పూరణల జడిని
మరతుము మాకష్టములను మాన్యవరేణ్యా!
వరమది శంకర కవిశే
*"ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా"*
🙏🏻
తొలగించండి( శ్రీకృష్ణదేవరాయలతో అల్లసాని పెద్దనామాత్యుడు )
రిప్లయితొలగించండివరమా! కవులందరకును ;
ఝరమా ! ధ్వనికిని ; రసముల జల్లుల సిరి కా
కరమా! సుమహౌదార్య శి
ఖరమా ! జీవనమునన్ సుఖంబుల నిడుమా !
👏👏
తొలగించండిఅద్భుతమైన పూరణ!అభినందనలు!!
తొలగించండివామనకుమార్ గారూ !
తొలగించండిసీతాదేవి గారూ !
ధన్యవాదాలండీ .
బాపూజీ గారూ,
తొలగించండిఅనుప్రాసతో అతి మనోహరంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
నిరతము నీనామ జపమె
రిప్లయితొలగించండిహరియించును పాతకముల నంగజ హరుడా
కరుణించుము మము శశిశే
ఖర, మా జీవనమునన్ సుఖంబుల నిడుమా!
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఖరమా జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా"
హర! నీ పాదములందు భక్తినిడుమా ! యన్యంబు మాకేల ? దు...
ర్భరమౌ కష్టమదెంతదైన ననుకూలమ్మౌను మా పాలిటన్ !
గిరిజాస్యోత్పలచంద్ర ! భాసితవియత్కేశా ! వరా ! చంద్రశే...
ఖర ! మా జీవనమందు సౌఖ్యములకాగారమ్ముగా మారుమా"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
భరమే! మోయుట యిన్ని బట్టలను ., నీ బాధన్ కనుంగొంటి , నా
తొలగించండివరకున్ నీకిటువంటి కష్టమునిడన్ బాధాకరమ్మే సుమీ !
కరుణన్ జూడుము! సమ్మె చేయ తగునా ? గడ్డిన్ ప్రసాదించెదన్ !
ఖరమా ! జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారికి శాస్త్రిగారి గాలి సోకినట్లుంది! నమోనమః!
తొలగించండిఅది గుఱ్ఱం గాలి... ఇబ్బందిలేదు😊🙏
తొలగించండిమైలవరపు మురళీకృష్ణ
హర హర మహాదేవ!!
తొలగించండిహర! యని కృష్ణుడె మురళీ
ధరుడే శివ కీర్తనలను ధారణ జేసెన్
హరధర! యో కైలాస శి
*"ఖరమా జీవనమునన్ సుఖంబుల నిడుమా"*
👌🏻👏🏻🙏🏻
తొలగించండిబరువుల ధారణ జేయుచు
భరియంచిన నీదు బాధ బాపును యతడే!
మురళీకృష్ణను గావుము
*"ఖరమా జీవనమునన్ సుఖంబుల నిడుమా"*
మైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి*****
విట్టుబాబు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. "బాపును + అతడే" అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ "...బాపు నతండే" అనండి.
రిప్లయితొలగించండిఅరయగ శరణార్థిని నా
యరకొర తెలివిడి జిలేబి యయ్యె !వినతి గాం
చి రహిని జేర్చుచు హరశే
ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా!
హరశేఖర - గంగానది
మా గంగే జ్ఞాన్ జగాయే ! మోక్ష దిలాయే
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరిపరి విధముల గృహమున
రిప్లయితొలగించండిపరిమళ భరితము వేప బహు క్షేమంబౌ
సురుచిర ముగదంత ములను శే
ఖర మా జీవనమునన్ సుఖంబుల నిడుమా
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ భావం స్పష్టంగా లేదు. రెండవ పాదంలో గణదోషం. "పరిమళ భరితమ్ము వేప..." అంటే సరి!
కరుగగ తుహిన విసరము చి
రిప్లయితొలగించండిగురించ తరుశాఖలెల్ల కోయన పికము
ల్లరుదెంచగ మధుమాసము
ఖరమా! జీవనమునన్ సుఖంబుల నిడుమా!
ఖరము= వేడిమి
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పికముల్ + అరుదెంచగ = పికము లరుదెంచగ' అవుతుంది. అక్కడ ద్విత్వ లకారం రాదు.
ధన్యవాదములు గురుదేవా!సందేహిస్తూనే వ్రాశానండీ!
తొలగించండిమురిపించగ మధుమాసము గా స్వీకరించ ప్రార్ధన!
వరకల్పకభూజంబా!
రిప్లయితొలగించండివరదాయిని! వాంఛితార్థవైభవదాయీ!
సురలోకజన్య!తరు శే
ఖరమా! జీవనమునన్ సుఖంబుల నిడుమా
మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆంధ్ర కల్పవృక్షము' అని తాటిచెట్టును గురించి హైస్కూలులో ఒక పాఠం ఉండేది. మీరు ఆ చెట్టును ప్రస్తావించలేదు కదా?
రిప్లయితొలగించండిసరదా పూరణ (జీపీయెస్ వారి కంకితం :))
అరయన్ కాటిని కంకశాయములు నిన్నారాధనల్ జేయనే
శరవేగంబుల రాజధాని నడుమన్ సాగింప యుద్ధంబులన్
వరమిచ్చెన్కద యంచు చెప్పిరి జనుల్ ! వర్రోడు జిహ్వాపముల్
గురుగుర్రంచు జనాళి కండల రుచిన్ గ్రోలంగ మౌనంబకో ?
నరుడై జన్మను నొంది మాకు తెలగాణా తెచ్చి నావీవు శే
ఖర ! మా జీవనమందు సౌఖ్యములకాగారమ్ముగా మారుమా!
జిలేబి
👏👏👏
తొలగించండిజై ఆంధ్రభారతీ! శునకాయనమః !
😁👌🏻👏🏻🙏🏻💐
తొలగించండివర్రోడు జిహ్వాపముల్! పద ప్రయోగాలలో మీకు మీరే సాటి జిలేబీజీ!*****
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
'తెచ్చితే చంద్రశేఖర...' అంటే బాగుంటుందేమో?
తొలగించండిసీతాదేవి గారికి
నమో నమః
ఆంధ్రభారతి నుండి కొట్టుకొచ్చిన పదాలంతే !
ఇప్పుడు మీరు వేరుగా రాయటంతో వాహ్ క్యా పదమ్స్ హై అని నాకే అనిపించేస్తోందండోయ్ !
ఇవ్వాళ దీనికి కిక్కిచ్చిన వారు శ్రీమాన్ జీపీయెస్ వారు
సో వఱ్ఱోడు జిహ్వాపమ్ములకు క్రెడిట్ వారికే చెల్లు :)
నెనర్లు
జిలేబి
"ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది...."
సారు మనసులో "సరదా" అంటే ప్రభాకర శాస్త్రిగారే గుర్తొస్తారు కామోసు. సారీ జిలేబీ! ఇకపై అంకితం మానండి. అది నా సొత్తు....
తొలగించండిసరదా అంత పవర్ "పుల్" పదమై పోయిందన్న మాట :) సరదా = జీపీయెస్ :)
జిలేబి
నిరతము నీ నామంబు ను
రిప్లయితొలగించండిమరువక జపియించు మమ్ము మరులు గ గను చున్
కొరత లు తొలగగ శశి శే
ఖర ! మా జీవ న ము నన్ సుఖం బుల నిడు మా !
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వరమిడి కాపాడుము,స
రిప్లయితొలగించండిత్వరముగ మము భూతనాథ!పరమ దయాళో!
నిరతముఁగొల్తును శశి శే
ఖర!మా జీవనమునన్ సుఖంబుల నిడుమా.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరయన్ శంకరు డంటవెం డినగ మున్ నాట్యమ్మునే జేయగన్
రిప్లయితొలగించండిగిరిజా దేవియు సంతసం బునను బృంగీశున్ సమీపిం పగన్
తిరమౌ నిద్దరు నాట్యమం దునను నుద్వేగమ్ము నన్ చంద్ర శే
ఖరమా జీవన మందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2812
సమస్య :: ఖరమా జీవన మందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా.
*ఓ గాడిదా! నీవు నా జీవితంలో సుఖములకు నిలయంగా మారు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: తపము శౌచము దయ సత్యము అనే నాలుగు పాదాలతో విరాజిల్లుతూ వృషభ రూపంలో ఉండిన ధర్మదేవత కలియుగంలో సత్యము అనే ఒకే పాదంతో మిగిలియండగా ఆ వృషభాన్ని కలిపురుషుడు కాలితో తన్నినాడు. పరీక్షిన్మహారాజు ధర్మదేవతను ఊరడించినాడు. కలిని నిగ్రహించి నీవు ఈ ప్రదేశంలో ఉండేందుకు వీలులేదు అని కోపించినాడు. ప్రాణివధ స్త్రీ ద్యూత మద్యపానము అనే నాలుగు స్థానములలో కలి ఉండేందుకు అనుమతించాడు. కలి ఇంకనూ కోరగా వైరమునకు నిలయమైన బంగారంలో కూడా ఉండేందుకు అవకాశం కల్పించాడు.
ఓ కర్బురమా ఓ బంగారమా! ఓ అగ్నిశేఖరమా! నిన్ను పూజిస్తాము. నీవు మాలో వైరములను పెంచకుండా దయతో మా జీవితాలలో సుఖములకు నిలయంగా మారు అని విన్నవించుకొనే సందర్భం.
ధరలో ప్రాణివధాదులన్ కలికి సంస్థానాలుగా నిచ్చుచున్
కర మాశన్ కలి గోర నిచ్చె నిను సాక్షాత్ శ్రీ పరీక్షిత్తు; క
ర్బురమా! వైరము పెంచకమ్మ! నిను నే పూజింతు నో అగ్నిశే
ఖరమా! జీవన మందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!
అగ్నిః ఇవ శేఖరమ్ అస్య=అగ్నిశేఖరమ్ (బంగారము)
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (9-10-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండి
రిప్లయితొలగించండిఅరయ బతుకాయె నీవలె
ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా
హర యని యనుదినమున్ శం
కరునికి నుతిజేసితి మయ! సఖుడ కరుండా !
జిలేబి
రిప్లయితొలగించండిపాటనై వస్తున్నా ! కేసీ యార్ ప్రముఖ కవులతో పాటల రాయించి వస్తున్నారని మా యేబీయెన్ వార్త :)
మన పాముల పల్లీయులెవరైనా రాస్తున్నారా ? :)
అరరే పాటల కేసి యారిక జనారాధ్యుండు గా వచ్చు! దీ
ర్చురయా కష్టము లెల్ల మీకు! భళి ఖర్చుల్తగ్గు ! రాష్ట్రంబు బం
గరుభూమిన్ తల దన్ను రండి నుతులన్ కాసింత జేర్చండి ! శే
ఖర ! మా జీవనమందు సౌఖ్యములకాగారమ్ముగా మారుమా!
జిలేబి
నేడేమిటో ఈయన్ని జిలేబీలిచ్చుక్కొడుతున్నారు..
తొలగించండి😄👌🏻👏🏻🙏🏻💐
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వరమో! శాపమొ! పుట్టినావు సుత నా వంశాంకురమ్మంచు నే
రిప్లయితొలగించండిమురియన్, నీవొక మొద్దువైతివికదా! పో! నిన్ భరించంగ నా
తరమా! యేముని వద్దనైనఁగొని కాస్తంతైన జ్ఞానమ్మునో
"ఖరమా! జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా"*
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
భరియించితి మిడుమలనే
రిప్లయితొలగించండితరియింపగ జేయవయ్య ధరనిక నైనన్
కరుణించియు పురహర!శే
ఖర !మాజీవనమునన్ సుఖంబుల నిడుమా !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరతమునినుబూజించెద
రిప్లయితొలగించండికరుణాకర!సాంబశివుడ!కాశీనాధా!
హరిహరరూపా!శివ!శే
ఖర!మాజీవనమునన్ సుఖంబులనిడుమా!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరమేశు జట నివాసిని
రిప్లయితొలగించండిధర వాసిత జీవప్రాణ దాయిని, దామో
దర పాదోద్బవి, హర శే
ఖర,మా జీవనమునన్ సుఖంబుల నిడుమా"
హరశేఖర = గంగ
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య :-
రిప్లయితొలగించండిఖరమా జీవనమునన్ సుఖంబుల నిడుమా
*కందం**
చిరకాలము మము గాచెడు
పరమేశ్వర,శంకర,పశుపతి,విషధరుడా,
మరుగొంగ,చంద్రమశ్శే
ఖర; మా జీవనమునన్ సుఖంబుల నిడుమా
.........................✍చక్రి
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిదురితము లెల్లనురబాపుచు
సరుగున భక్తుల మొరలను జవమున వినుచున్
కరుణను చూపెడు విధుశే
ఖరమా జీవనమునన్ సుఖంబుల నిడుమా.
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో ఒక 'ర' అదనంగా టైపయింది.
ధర నిన్నొక్కడ నర్చఁ జేయ ఫలముల్ తథ్యమ్ము శీఘ్రమ్మె, నీ
రిప్లయితొలగించండిపరివారమ్మనుకూలమై యొసగిడిన్ వాంఛాసమూహమ్ము, ని
ర్భరకారుణ్యమయాంతరంగవిలసద్భస్మాంగరాగేందుశే
ఖర! మా జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తరగని గనివై భక్తుల
రిప్లయితొలగించండిమొరవిని బ్రోచెడు యిడుముల మ్రొక్కులవాడా!
కరుణను వేంకట గిరిశే
ఖర! మా జీవనమునన్ సుఖంబుల నిడుమా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రిప్లయితొలగించండిరాశాను నీకు చెప్పలేక ఎదుటపడి మనసు తెలుప లేక ......"
పరిపాకంబన విద్య, 'స్నాతకుడ' సంపాదింతుఁగొల్వున్ వెసన్
మరులయ్యెన్ దొలిచూపునందె సుముఖీ! మత్తేభరాట్యాన! వా
తెర నెత్తంగనులేక నీ యెదుట ప్రీతిందెల్ప వ్రాతిద్దె లే
ఖ, రమా! జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!.
రామకృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'రాట్ + యాన = రాడ్యాయ' అవుతుంది. 'వ్రాత + ఇద్దె' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
గురువు గారూ,
తొలగించండిధన్యవాదములు. సవరించినాను
"ఇదే నా మొదటి ప్రేమ లేఖ
రాశాను నీకు చెప్పలేక ఎదుటపడి మనసు తెలుప లేక ......"
పరిపాకంబన విద్య, 'స్నాతకుడ' సంపాదింతుఁగొల్వున్ వెసన్
మరులయ్యెన్ దొలిచూపునందె సుముఖీ! మత్తేభరాడ్యాన! వా
తెర నెత్తంగనులేక నీ యెదుట, ప్రీతిం దెల్పగా వ్రాతు లే
ఖ, రమా! జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!.
తొలగించండివారెవ్వా ! యేమి విరుపండీ ఊకదంపుడు గారు !!!
సెబాసో ! అదురహో అదురహో ! అదురహో !
జిలేబి
రిప్లయితొలగించండిధరణీ జనులను బ్రోవగ
వరదుడు తిరువేంకటపతి వాత్సల్యముతో
పరిశోభిలు శేషాద్రి శి
ఖరమా! జీవనమునన్ సుఖంబుల నిడుమా!!!
మురియుచు పున్నమి దినముల
వరుసగ నుపవాసముండి వ్రతమొనరింతున్
కురియుమ చార్విని శివశే
ఖరమా! జీవనమునన్ సుఖంబుల నిడుమా!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వరమా?భాగ్యమ!నాదియీయదనుమీపాదాలుబట్టంగశే
రిప్లయితొలగించండిఖర!మాజీవనమందుసౌఖ్యములకాగారమ్ముగామారుమా
నిరతిన్నమ్ముచునాదుసేవలకునిన్నేనెంచుగొంటిన్సదా
హర!రక్షించియుదీనునిన్, నిడుమయాహారాదిపానీయముల్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
=======================
ఖరమా జీవనమందు సౌఖ్యముల
కాగారమ్ముగా మారుమా
=======================
"ఓ నా గాడిద నా జీవితంలోని అన్ని
సుఖములకు నిలయముగా నీవు
మారవా! "అని అనడంలో అసంబద్దతె
ఇచట సమస్య
=========================
సమస్యా పూరణం- 278
=================
నీ ఉరమును తన్నెను ఆ భృగువు -
సైచని సతి పెట్టుకొనెను తగవు
లీలగా నెంచు మోమున నగవు -
మేమెన్న తరమా సురలకు సిగవు
అలిగి కానకేగిన అగ్నిశిఖ -
రమా జీవనమందు సౌఖ్యముల
కాగారమ్ముగా మారుమా -
నీ పొందై చెలగు మధుర సఖ్యముల
====##$##====
లోక కళ్యాణార్థం చేయు యజ్ఞమునకు
"హవిర్భోక్త" ను నిర్ణయించు నెపమున భృగు
మహర్షి నీ యెదపై కాలితో తన్నెను కదా! అది
చూసి అలిగిన లక్ష్మీదేవి అడవులకేగి ఇడుము
లు బడుతున్నది, ఓ శ్రీహరి అట్టి లక్ష్మీదేవిని
ప్రేమతో చేరదీసి ఆవిడ పాలిట అన్ని సుఖ
ములు నీవుగా మారవా !
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
----- ఇట్టె రమేష్
(శుభోదయం)
__/\__
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసురగణ పూజిత! భక్తవ
తొలగించండిర రక్షక! రమావినోద! రక్షిత కరి రా
డరవిందాక్ష! జితమనః
ఖరమా జీవనమునన్ సుఖంబుల నిడుమా
వరుసన్ వచ్చెడు వత్సరమ్ములఁ దలంపన్ భీతి మా కయ్యెడిం
గరుణాయత్త మనోవిలాసమున రక్షాదక్ష వత్సమ్మ! మ
మ్మరయన్ రా ఖర! కావుమా! వికృతి నామాబ్దార్తి సంహర్తృ శే
ఖరమా! జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా
హరి నామస్మరణ మొసఁగుఁ
తొలగించండిబరమ పదమ్ము తరువంచు వత్సర మంచున్
గిరి యంచును గావలదు ము
ఖర మాజీవనమునన్ సుఖంబుల నిడుమా!
[ముఖరము = అసంబద్ధవచనము లాడునది; ఆజీవనమునన్ = బ్రతుకు నంత వరకు; ఇడుమా = విడువుమా]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
హర ! శంభో ! శివ ! సత్కృపానిలయ ! ఘోరాఘాద్రి తేజః పవీ !
శరణంటిన్ , నిను వేడు చుంటిని , ప్రభూ ! స్వామీ భవన్నామమే ,
అరయన్ - దాట భవాంబుధిన్ , బ్రవహణం బై నొప్పు నో చంద్రశే
ఖర ! మా జీవన మందు సౌఖ్యముల కాగారంబుగా నిల్వుమా !
[ ఘోర+అఘ+ అద్రి తేజః పవీ = మహా పాపము లను
కొండకు వజ్రాయుధము తో సమాన మైన వాడా •
ప్ర వ హ ణ ము = నౌ క ]
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
సురతో సరియగు కల్లును
రిప్లయితొలగించండిమరిమరి గ్రోలంగఁ జేసి మైకము నిడు మా
ధురి గల తాళమ! తరుశే
ఖరమా! జీవనమునన్ సుఖంబుల నిడుమా!
(హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి ధన్యవాదాలతో...)
అద్భుతం!
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
విరిసెన్ పువ్వులు పూవులే నిచట సంప్రీతిన్ తెలంగాణలో
కురిసెన్ వానలు మెండుగా నిచట కోకొల్లల్ గజిల్లాలలో
మురియన్ పండుగ జేయుచున్ "కవిత"రో ముమ్మార్లు మాచంద్రశే
ఖర! మా జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి(చాకలి మడియేలు యొక్క సంక్రాంతి పర్వ దిన ప్రార్థన)
ఖరహర యను రాగమె శ్రీ
హరికిని ప్రియమౌనుగాదె యది చాలును నీ
స్మరణము కర్మ సుయోగమె
ఖరమా! జీవనమున సుఖంబుల నిడుమా
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిఖరమే యోండ్రను గాలిబీల్చి వదలన్ కాదే సుహృద్యోగ మి
త్తరి నీ గానమె దుర్లభంబు జపమే యౌనేమొ కాంక్షల్ వినా
గురి మీరన్ నడి వీపుపై భరముతో గుందేటి నీ సత్ శ్రమమల్
బరిలో గెల్చును యోపికల్ గదియగా భావింతు నెవ్వేళ నిన్
ఖరమా !జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'గెల్చును + ఓపిక' అన్నపుడు యడాగమం రాదు.
కరమౌ భక్తిని నీదు పూజనములన్ గావించుచున్ నిత్యమున్
రిప్లయితొలగించండిపరమాత్మానిను గాంచి సొంతకనులన్, ప్రార్థించగన్ కాశిలో
స్థిరసంకల్పముతోడవచ్చితిమి యుద్దీపించు మోచంద్ర శే
ఖర! మాజీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీహరిపాదముద్రితపరత్త్వచిహ్నములు
రిప్లయితొలగించండి" రేఖామయధ్వజకలశాతపత్ర
వజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రైః
భవ్యై రలంకృతతలౌ పరత్త్వచిహ్నైః"
అనే సుప్రభాతశ్లోకం మరియు
పరాశరభట్టరు " శ్రీగుణరత్నకోశములోని
" శ్రీరంగహర్మ్యతలమంగళదీపరేఖాం"
అనే శ్లోకం, ప్రేరణగా---------
పరతత్త్వాంచితశంఖచక్రవరకల్పక్ష్మాజవజ్రాబ్జసుం
దరదివ్యాంకుశయుక్సుధాకలశముద్రాశ్రీశపాదద్వయీ
కరసంవాహనసక్తరంగపురమాంగళ్యప్రభాదీపరే
ఖ! రమా! జీవనముందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిసుదీర్ఘసమాసంతో శోభిల్లుతున్న మీ పూరణ మనోరంగా ఉన్నది. అభినందనలు.
ఇరువది నైదవ వరిసన
రిప్లయితొలగించండిమరువక మముజేరునట్టి మమతలుబంచే
వరమగునుగాది పండుగ
"ఖర" మాజీవనమునన్ సఖంబులనిడిమా
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పంచే' అనడం వ్యావహారికం.
పరమేశా! ప్రమథాధిపా! మలహరా భద్రేశ పాలింపరా!
రిప్లయితొలగించండిగిరిజామానసచోరుడా! శబరుడా! కీర్తింతు నిన్నేసదా
కరకంఠా! దహనాంబకా! త్రినయనా! కాలాంతకా! చంద్రశే
ఖర! మా జీవనమందు సౌఖ్యముల కాగారమ్ము గా మారుమా!
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరమేశ్వర జగదీశ్వర
రిప్లయితొలగించండిహరహర మహదేవశంభు హారతులిత్తుమ్,
పొరలిన విషమును గొని ,శే
ఖర!మా జీవనమునసుఖంబు లిడుమా
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
ఓ బడుగు రైతు బావిఁ ద్రవ్వే ముందు గునపము(ఆఖరము) నకు చేసుకొన్న విన్నపము :
రిప్లయితొలగించండికందం
తిరిపెమ్మెత్తక యుండ యె
కరమున నొక బావిఁ ద్రవ్వి కమతమ్మున నే
వరిపండించఁ దలఁచ నా
ఖరమా! జీవనమునన్ సుఖంబుల నిడుమా!
మత్తేభవిక్రీడితము
తిరిపెమ్ముల్ దిన నా కుటుంబమునకున్ దేలేని నిర్భాగ్యుడన్
మరలే దెచ్చియు బావిఁ ద్రవ్వ సిరులే మాత్రమ్ము లేవయ్యె నా
భరమే నీదని నమ్మి యీ యెకరమే పండించ నిన్బట్ట నా
ఖరమా! జీవనమందు సౌఖ్యముల కాగారమ్ముగా మారుమా!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
ఖరమా జీవనమునన్ సుఖంబుల
నిడుమా
సందర్భము: బలరామ కృష్ణ కుచేలురు సాందీపని వద్ద విద్య అభ్యసించినారు. అతడు గురు దక్షిణగా సముద్ర స్నానానికి వెళ్ళి మృతుడైన తన కొడుకు కావా లంటాడు.
కృష్ణుడు సముద్రుణ్ణి అడిగితే "పంచజను డనే రాక్షసుడు మింగినాడు సముద్ర గర్భంలో వున్నా" డంటాడు. కృష్ణుడు సముద్రంలోకి వెళ్ళి ఆ రాక్షసునితో యుద్ధం చేసి సంహరించి పొట్ట చీలిస్తే గురు పుత్రుడు కనిపించడు. ఒక శంఖం వుంటే దాన్ని తీసుకుంటాడు. అదే పాంచజన్యం.
కృష్ణుడు తర్వాత గురు పుత్రుడు నరకలోకంలో వున్నా డని గ్రహించి అక్కడకు వెళుతాడు. పాంచజన్యం పూరిస్తాడు. యమ ధర్మరాజు సాదరంగా ఆహ్వానం పలికి గురు పుత్రుని అప్పగిస్తాడు. అతణ్ణి తెచ్చి కృష్ణుడు అప్పగిస్తే గురు దంపతు లెంతో సంతోషిస్తారు.
విష్ణుమూర్తి పంచాయుధాలలో నొకటైన ఓ పాంచజన్య ముఖరమా! మా జీవితంలో సుఖాలను కలిగించుమా!... అని కవి ప్రార్థన.
ముఖరము..అంబుజము= శంఖము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురు దక్షిణ కొర కేగిన
హరి జలనిధిఁ బంచజనుని
నంత మొనర్పన్
దొరికితివి.. పాంచజన్య ము
ఖరమా! జీవనమునన్ సు
ఖంబుల నిడుమా!
దీనినే *కందార్థము* గా మలచినచో....
గురు దక్షిణ కొర కేగిన
హరి జలనిధిఁ బంచజనుని
నంత మొనర్పన్
దొరికితివి.. పాంచజన్య ము
ఖరమా! జీవనమునన్ సు
ఖంబుల నిడుమా!
పావన ధ్వని గల
అంబుజోత్తమమా!
✒~డా.వెలుదండ సత్యనారాయణ
9.10.18
-----------------------------------------------------------
రిప్లయితొలగించండిరెండవ పూరణ
హరహర భవహర శంకర
శరణంటిని కావుమయ్య జవమున నీవే
గిరిజా రమణా శశిశే
ఖర మాజీవనమునన్ సుఖంబుల నిడుమా.
మరొకపూరణ
కరములు జోడించి కొలుతు
కరిముఖ జనకా త్వరితముగా మాకిలలో
పరపతి పెంచుము సృణిశే
ఖర మాజీవనమునన్ సుఖంబుల నిడుమా.