ప్రభాకర శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మేధావులు ఒకే విధంగా ఆలోచిస్తారని ఏదో ఆంగ్లసామెత ఉన్నట్టుంది. (Wise men thin alike... అనుకుంటాను. నాకంతగా ఆంగ్లపరిజ్ఞానం లేదు!)
డా. పిట్టా నుండి ఆర్యా, కలడు గలండనెడు..........డో.!నా55వ యీడున ధనికుడనై ఏడు కొండలెక్కినాను.చచ్చినవారు మన వారు కాదేమో!Man's belief in a machine is greater than that of the one in God.I grieve for the dead.
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2813 సమస్య :: తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా, శశిమౌళి ! ప్రీతిగన్. తిరుమలలో దేవుడుగా (శశిమౌళి అంటే) శివుడు విరాజిల్లుతున్నాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం. సందర్భం :: పార్వతీ అమ్మవారు తన ప్రాణనాథుడైన పరమేశ్వరుని చెంత చేరి, ఓ శశిమౌళీ! స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడై కలియుగ ప్రత్యక్షదైవంగా ఇప్పుడు తిరుమలలో కొలువై ఉన్నాడు. సృష్టి కారకుడైన బ్రహ్మదేవుడు ఆ స్వామివారికి నేటినుండి బ్రహ్మోత్సవాలను చేయడానికి సిద్ధమై అక్కడకు చేరుకొన్నాడు. లక్షలాదిగా భక్తులు ఆ బ్రహ్మోత్సవాలను తిలకించి పులకించి తరించిపోయేందుకోసం అక్కడకు చేరుకొంటున్నారు. లయకారకుడవైన నీవు కూడా అక్కడే ఉంటే భక్తకోటికి త్రిమూర్తుల అనుగ్రహం ఒకే క్షేత్రంలో లభిస్తుంది కదా. కాబట్టి ఆ బ్రహ్మోత్సవాలను చూచేందుకోసం మనం కూడా తిరుమలకు పోదామండీ రండి అని పిలిచే సందర్భం.
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== తిరుమలలోన వర్ధిలెను దేవుడు శశిమౌళి ప్రీతిగన్ ====================== తిరుమలలో కొలువై ఉన్నది శ్రీవేంకటేశ్వర స్వామి అయితె శివుడు నెలకొని ఉన్నాడనుటలో అసంబద్దతె ఇచట మనకు సమస్య ================== సమస్యా పూరణం - 279 ==================
తురుష్కుల దండయాత్ర, తురుష్కుల పరిపాలన కాలంలో పెక్కు హిందూ దేవాలయ ములు ధ్వంసము గావించబడినట్లే, విశిష్టాధ్వై తం ఉఛ్ఛ స్థితిలో వెలిగిపోతున్న కాలంలో పెక్కు శివాలయములు వైష్ణవ ఆలయములుగా మార్చబడినవని ఒక వాదన.
ఉన్నది ఒకటే రెండవది లేదనె అధ్వైత వాదికి హరిహర బ్రహ్మాదులు ముగ్గురుగా కనబడరుగా
కొసమెరుపు: తురుష్కుల ఉనికియే మన దేశ ========= మున లేని స్థితి ఉండినను శాంతి నెలకొని ఉండునది కాదేమో ! శైవులు, వైష్ణవులు కత్తులు దూసుకుని యుద్దాలు చేసే వారేమో!
ప్రస్తుతం తురుష్క ఏలుబడి దేశాలలో షియాలు, సున్నీలు తన్నుకుని చచ్చినట్లు.
వైకుణ్ఠాత్పరమో హ్యేష వేఙ్కటాఖ్యో నగోత్తమః | అత్రైవ నివాసామ్యేవ శ్రీ భూమి సహీతో హ్యహమ్ || ....శ్రీ వరాహ పురాణము. పూర్వ భాగ. శ్రీ వేంక. ప్రథమ భాగ. 35. 12.
సందర్భము: తిరుమలలో వెలసిన దేవుడు హరించే వాడే! ఏమేమి టనగా.. శ్రేష్ఠ మైన భక్తుల పాపములను హరించేవాడే! కరుణామృతం కురిపించే చూపుల ప్రసారంచేత గొప్పదైన సంసారమును హరించేవాడే! దేవతల శత్రువుల (రాక్షసుల) ప్రాణములను హరించేవాడే! అందువల్ల తిరుమలలో వెలసిన దేవుడు హరించేవాడే! అంటే హరుడే! ఇందలి విశేషాలు:-- 1. ప్రతి పాదాంతంలోను "హరుడే" అని వస్తుంది... 2. పాదం మొత్తం ఒకే సంస్కృత సమాసం వుంటుంది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ వర భక్త పాప హరుడే! కరుణామృత దృక్ ప్రసార ఘన భవ హరుడే! సుర వైరి ప్రాణ హరుడే! తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే!
✒~డా.వెలుదండ సత్యనారాయణ 10.10.18 -----------------------------------------------------------
(1)
రిప్లయితొలగించండి(తిరుమలలో వెలసిన వరాహస్వామిని గురించి....)
హరియె హిరణ్యాక్షుని వెస
వరాహ రూపమ్ముఁ దాల్చి వధియించెఁ గదా!
హరుఁ డన వినాశకర్తయె;
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే!
(2)
(తిరు=శ్రీ; మల=శైలము; తిరుమల= శ్రీశైలము)
'తిరు' తమిళంపు శ్రీ యనఁగఁ దెల్లమె, యా 'మల' యన్న శైలమౌ
నురు వనమై తనర్చు నది యొప్పుగ నల్లమలాఖ్య యందు స
త్కరుణను భక్తసంఘమునుఁ గాఁచుచు శ్రీభ్రమరాంబ తోడుగాఁ
దిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా శశిమౌళి ప్రీతిగన్.
హరిని హరునిగా ,శ్రీశైలాన్ని తిరుమలగా కావించిన
తొలగించండిమీ భావన కమనీయమండీ !
బాపూజీ గారూ,
తొలగించండిధన్యవాదాలు!
అరయగ శంకర గురువర!
రిప్లయితొలగించండితిరుమల కైలాసమనగ తెలిసితి నిపుడే
విరుపులు చేయగ జాలను:👇
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే :)
తిరు = పూజ్యమైన
మల = కొండ
తిరుమల = (holy hill) కైలాస పర్వతము
సార్! నేను మిమ్మల్ని కాపీ కొట్టలేదు. నిన్న మీరు లీకుజేయగనే తట్టిన ఊహ ఇది !
తొలగించండి
తొలగించండిఎక్కడ ఎక్కడ వికీ లీక్స్ ఎక్కడ :)
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మేధావులు ఒకే విధంగా ఆలోచిస్తారని ఏదో ఆంగ్లసామెత ఉన్నట్టుంది. (Wise men thin alike... అనుకుంటాను. నాకంతగా ఆంగ్లపరిజ్ఞానం లేదు!)
___/\___
తొలగించండిమరుని జనకుండు,సిరిపతి,
రిప్లయితొలగించండితిరుమలలో వెలసినట్టి దేవుడు, హరుడే
మరుని తన నయనము తెరచి
పరిమార్చి హిమగిరి సుతను పరిణయ మాడెన్
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిహరియే వేంకటపతిగా
తిరుమలలో వెలసినట్టి దేవుడు, హరుడే
వరములు గుప్పించుచు మరి
నిరతము భక్తులను గాచి నిలుచును జగతిన్
శాంతిభూషణ్ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండి🙏గానగంధర్వులు ఘంటసాల.. నమోనమః 🙏
తిరువేంకటాధీశ ! జగదీశా ! కరుణనేలగ రావె కమలేశా !
శివరూపమీవనుచు చెప్పుదురు కొందరు...
ఆదిశక్తివటంచు నందురింకొందరు
నారాయణుండవని నమ్ముదురు కొందరు...
హరుడని కొందరందురిల , నంబిక యందురు కొంతమంది , కొం...
దరు హరి యందురంచు మధుధారలు చిప్పిల గానమాధురిన్
స్మరణము జేసి చూపెను రసాల రసాలము ఘంటసాల ! మా
తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా శశిమౌళి ప్రీతిగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహరియించు కష్టచయమును
తొలగించండిహరియించును పాపరాశి నజ్ఞానంబున్ !
హరియించువాడె హరుడౌ !
తిరుమలలో వెలసినట్టి దేవుడు హరుడే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అరయగ నిల మురహరియును
రిప్లయితొలగించండిహరహర యనినంత బలుకు నారుద్రుండే
యిరువురు నామది దోచిరి
"తిరుమలలో వెలసినట్టి దేవుఁడు, హరుఁడే !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు!
తొలగించండివరముల శ్రీహరి నిలచెను
రిప్లయితొలగించండితిరుమలలో ; వెలసినట్టి దేవుడు హరుడే
తిరుపతిలో కపిలమునీ
శ్వరు తీర్థము చెంతనె సతి శాంకరి తోడన్ .
బాపూజీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిహరిహరులొకరె జిలేబీ
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే
మరులుగొలుపునుత్సవములు
మరల మరల రమ్మటంచు మనలను బిలుచున్ !
బీలేజి అన నేమి జిలేబి అననేమి అన్నియు గుండు సున్నాలే
హరి యన నేమి హరుడన నేమి అన్నియు తానే
గోవిందా గోవిందా గొ విందా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరియే భవహరుడై యిల
రిప్లయితొలగించండిదిరుమల లో వెలసినట్టి దేవుఁడు, హరుడే
హరియింప పాపముల శ్రీ
గిరిపై సతితోడ నిలిచె క్షేమము గూర్చన్
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కరుణను చూచెద జనులను
రిప్లయితొలగించండిసరియగు ముడుపుల నుగట్టి సంతస మొందన్
మరువక భక్తిని కొలిచిన
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుడే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కరుణను జూచును' అని ఉంటే బాగుంటుంది.
కరుణను చూచును జనులను
తొలగించండిసరియగు ముడుపుల నుగట్టి సంతస మొందన్
మరువక భక్తిని కొలిచిన
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుడే
రిప్లయితొలగించండికొండ పైన రాజు ఉండు :)
మన ప్రక్కన భిక్షువు :)
సరసి! తలమ్ము బట్టి గద సత్తువ, టెక్కులు ! గానవే సఖీ,
పరపతి వచ్చు కొండని నృపాలడవన్! హరి యందుకే గదా
తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా! శశిమౌళి ప్రీతిగన్
సరసన వాయులింగ మయె చాయగ చక్కగ కాళహస్తిలో !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరి హరులొక్క ట భేదము
రిప్లయితొలగించండితి రమని రార్యు లు గననగు దృష్టా oతము గా
తిరు వేంకటేశ్వ రు డై
తిరుమల లో వెలసినట్టి దేవుడు హరుడే
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "తిరు వేంకటేశ్వరుండై" అనండి.
హరియే కలియుగ మందున
రిప్లయితొలగించండితిరుమలలో వెలసినట్టి దేవుఁడు, హరుఁడే
నారాయణి యండను గొని
పరిణయమునుచేసె హరికి పద్మావతితో
అన్నపరెడ్డి వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిహర!హర!యెన్నియొ మారులు
తిరుమల దర్శించ నేగి తిరుగు ప్రయాణాల్
బరువడి జేయగ మడిసిరి
తిరుమలలో వెలిసినట్టి దేవుడు హరుడే!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని మీరు పూరణలో వెలిబుచ్చిన భావంతో నేను ఏకీభవించడం లేదు.
తొలగించండిడా. పిట్టా నుండి
తొలగించండిఆర్యా, కలడు గలండనెడు..........డో.!నా55వ యీడున ధనికుడనై ఏడు కొండలెక్కినాను.చచ్చినవారు మన వారు కాదేమో!Man's belief in a machine is greater than that of the one in God.I grieve for the dead.
హరిహర నాథుడే వెలిసె నాగిరి శ్రీగిరి విశ్వనాథుడై
రిప్లయితొలగించండితిరుమల వేంకటేశునిగ తీరెను తిర్పతి దేవదేవుడే
యరయగ భేద భావమది యంధున కేతగు; నిర్వురొక్కరే!
తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా శశిమౌళి ప్రీతిగన్
****)()(****
శ్రీగిరి = శ్రీశైలం
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదాలు!
తొలగించండిహరియించగ పాపములను
రిప్లయితొలగించండిపరగిరి శిఖరంబు పైన వరలెడు హరియే
తిరు వేంకట నాథుడనగ
తిరుమలలో వెలసినట్టి దేవుడు హరుడే!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
హరుని దలంచి సంతతమహామహిమాన్వితభక్తి రాజిలన్
రిప్లయితొలగించండిహరి నిట నన్వయించు కొని యా హరరూపిగ గాఢభక్తిలో
తరుగిరిసర్వదేశములఁ దన్మయుడై తిలకించు వానికిన్
తిరుమలలోన వర్ధిలెను దేవుడుగా శశిమౌళి ప్రీతితోన్.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
గురువర్యులు శ్రీ కందిశంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2813
సమస్య :: తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా, శశిమౌళి ! ప్రీతిగన్.
తిరుమలలో దేవుడుగా (శశిమౌళి అంటే) శివుడు విరాజిల్లుతున్నాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: పార్వతీ అమ్మవారు తన ప్రాణనాథుడైన పరమేశ్వరుని చెంత చేరి, ఓ శశిమౌళీ! స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడై కలియుగ ప్రత్యక్షదైవంగా ఇప్పుడు తిరుమలలో కొలువై ఉన్నాడు. సృష్టి కారకుడైన బ్రహ్మదేవుడు ఆ స్వామివారికి నేటినుండి బ్రహ్మోత్సవాలను చేయడానికి సిద్ధమై అక్కడకు చేరుకొన్నాడు. లక్షలాదిగా భక్తులు ఆ బ్రహ్మోత్సవాలను తిలకించి పులకించి తరించిపోయేందుకోసం అక్కడకు చేరుకొంటున్నారు. లయకారకుడవైన నీవు కూడా అక్కడే ఉంటే భక్తకోటికి త్రిమూర్తుల అనుగ్రహం ఒకే క్షేత్రంలో లభిస్తుంది కదా. కాబట్టి ఆ బ్రహ్మోత్సవాలను చూచేందుకోసం మనం కూడా తిరుమలకు పోదామండీ రండి అని పిలిచే సందర్భం.
వరదుని కా రమేశునకు బ్రహ్మ యొనర్చెడి యుత్సవా లటన్
జరుగును నేటినుండియె ప్రశస్తముగా, గన రమ్ము పోద, మా
సిరి యురమందు నుండ విలసిల్లెడి విష్ణువె వేంకటేశుడై
తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా, శశిమౌళి ! ప్రీతిగన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (10-10-2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిఅద్భుతమైన భావనతో మనోహరమైన పూరణ చెప్పారు. అభినందనలు.
శ్రీ గురుభ్యో నమః
తొలగించండిహరియైనను హరుడైనను
రిప్లయితొలగించండిహరియించుచు పాపములను హరులైరిగదా!
ధరలో పాపుల బ్రోవగ
తిరుమలలో వెలసి నట్టి దేవుఁడు హరుడే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తిరుమల శ్రీగిరీంద్రముగ, దివ్యుడు వేంకటనాథు నీశుగన్,
రిప్లయితొలగించండిదిరుమణి యీర్ధ్వపుంఢ్రములఁ దిర్యగుదంచితపుంఢ్రమట్లుగన్,
సిరి ధర నిర్వురన్, గిరిజ శీర్షసురాపగ లట్లు కాంచగన్,
దిరుమల లోన వర్ధిలెను దేవుడుగా శశిమౌళి ప్రీతిగన్.
కంజర్ల రామాచార్య.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిబరువడి నేక పత్నియని బాగుగ నాదరమందె రాముడే
బరువుల కల్కి కాలమున భార్యలునిద్దరు,ఏడు కొండలన్
సరిపడ జేరి భక్తులకు సాయము జేయగ వడ్డి కాసుకే
తిరుమల లోన వర్ధిలెను దేవుడుగా; శశిమౌళి ప్రీతిగన్!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శశిమౌళి'కి అన్వయం?
శశిమౌళి ప్రీతి బొందగా, ఆర్యా,
తొలగించండికవి పండితులు
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
తిరుమలలోన వర్ధిలెను దేవుడు
శశిమౌళి ప్రీతిగన్
======================
తిరుమలలో కొలువై ఉన్నది
శ్రీవేంకటేశ్వర స్వామి అయితె శివుడు
నెలకొని ఉన్నాడనుటలో అసంబద్దతె
ఇచట మనకు సమస్య
==================
సమస్యా పూరణం - 279
==================
అడ్డనామమనెను బసవడు-
నిలువు నామమె యనుచు శ్రీధరుడు
శ్రేష్టము వైకుంఠమనె వాడు-
కైలాసమె మిన్ననె వీడు
వెయ్యేళ్ళకు పూర్వము చూడగ-
భవుని కొలువనగ ఖ్యాతిగన్
తిరుమలలోన వర్ధిలెను-
దేవుడుగా శశిమౌళి ప్రీతిగన్
====##$##====
తురుష్కుల దండయాత్ర, తురుష్కుల
పరిపాలన కాలంలో పెక్కు హిందూ దేవాలయ
ములు ధ్వంసము గావించబడినట్లే, విశిష్టాధ్వై
తం ఉఛ్ఛ స్థితిలో వెలిగిపోతున్న కాలంలో
పెక్కు శివాలయములు వైష్ణవ ఆలయములుగా
మార్చబడినవని ఒక వాదన.
ఉన్నది ఒకటే రెండవది లేదనె అధ్వైత వాదికి
హరిహర బ్రహ్మాదులు ముగ్గురుగా కనబడరుగా
కొసమెరుపు: తురుష్కుల ఉనికియే మన దేశ
========= మున లేని స్థితి ఉండినను శాంతి
నెలకొని ఉండునది కాదేమో ! శైవులు, వైష్ణవులు
కత్తులు దూసుకుని యుద్దాలు చేసే వారేమో!
ప్రస్తుతం తురుష్క ఏలుబడి దేశాలలో
షియాలు, సున్నీలు తన్నుకుని చచ్చినట్లు.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
( శుభోదయం)
_/\_
తొలగించండిధన్యవాదములు - కృతజ్ఞతలు
తొలగించండిహరిహర భేదము మనమే
రిప్లయితొలగించండిర్పరచినదేగద నిజముగ పరమమొకండే
నరులను కాపాడుటకై
"తిరుమలలో వెలసినట్టి దేవుడు హరుడే"
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కం.
రిప్లయితొలగించండితిరుమల బ్రహ్మోత్సవముకు
హరియే యాహ్వానమంపె హరునికి, వచ్చెన్
గిరిజ సమేతము కొండకు
తిరుమలలో వెలససినట్టి దేవుడు హరుడే .
మల్లేశ్వర్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కందం
తొలగించండిఅరయన్ సృష్టికి బ్రహ్మయె
హరియే స్థితికిన్ లయమ్ము హరునకుఁ జెందన్
వరదా! యన 'సంకటముల'
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు 'హరుఁడే' !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండివరదుడు వేంకటరమణుడు
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు, హరుఁడే
నరయగ కైలాసంబున
గిరిజకు భర్తగ వెలసెను కిదుకులవేలా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు .
"హరుడే యరయగ" అనండి.
ఈ రోజు శంకరాభరణంలో "తిరుమలలో ఉన్నది హరుడే" అని నొక్కివక్కాణించిన సుకవులందరికీ ప్రణామాలతో...
రిప్లయితొలగించండిమురళీ కృష్ణుల యాదిగ
నరయంగాఁ జెప్పె శంకరాభరణంబున్
విరియంగాఁ బద్యములవి
*"తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే"*
🙏🏻
తొలగించండిమరియిందరు గూడి యరే
మరిమరి యనృతంబులాడ మహిలో సుమతీ
సరియగు సత్యంబగునా
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే? :)
జిలేబి
విట్టుబాబు గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది అభినందనలు.
"మురళీకృష్ణులు నాది" అనండి.
******
జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధరణీ నర గణ జన్మాం
తొలగించండితర కృత దుష్ట హృదయ జనిత ఘన కలుష సం
హరణము కైలాసం బను
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే
[ తిరుమల = పవిత్రమైన కొండ]
వర కిటియై హిరణ్యదృ గపార భయంకర దైత్యుఁ జంపి శ్రీ
ధరణి సతీ సమేతము త్రిధాముఁడు వేంకట నాథు డింపుగన్
హర సుర పద్మ సంభవుల కప్పుడు సేసిన బాస తప్ప కా
తిరుమల లోన వర్ధిలెను దేవుఁడుగా శశిమౌళి ప్రీతిగన్
[శశిమౌళి ప్రీతి = శశిమౌళికి ప్రీతి]
వైకుణ్ఠాత్పరమో హ్యేష వేఙ్కటాఖ్యో నగోత్తమః |
తొలగించండిఅత్రైవ నివాసామ్యేవ శ్రీ భూమి సహీతో హ్యహమ్ || ....శ్రీ వరాహ పురాణము. పూర్వ భాగ. శ్రీ వేంక. ప్రథమ భాగ. 35. 12.
కామేశ్వరరావు గారూ మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి అభినందనలు
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
హరకిరి జేయ కాంగ్రెసిట హాయిగ నవ్వగ డింపులయ్యరో
పరుగులు బెట్టె తానపుడు భళ్ళున కుందుచు మందిరాలకున్
కరుణను మీరి మెచ్చగను గౌరిని చేకొని వీని కోసమే
తిరుమలలోన వర్ధిలెను దేవుఁడుగా శశిమౌళి ప్రీతిగన్ :)
తిరు = పూజ్యమైన
మల = కొండ
తిరుమల = (holy hill) కైలాస పర్వతము
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ సరదా పూరణ బాగున్నది అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహరియేవేంకటనాధుగ
రిప్లయితొలగించండితిరుమలలో వెలసినట్టి దేవుఁడు ,హరుఁడే"
వరములనిచ్చుచు,భక్తుల
వరదుడుగాబేరునొందెబ్రజలమనసులోన్
సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు
తొలగించండి"వేంకటపతిగా" అనండి
మరువక భక్తిగ గొలుతురు
రిప్లయితొలగించండిశరణని శ్రీవెంకటేశు సాహిత్యమునన్
హరిహరు లొకటగు నామమె
తరతరములుగొలుచుటాయె ధార్మికులెపుడున్
వెంకటేశుడునందు వెంకట+ఈశుడుగలరు
ఈశ్వరప్ప గారూ
తొలగించండిమీ పూరణ బాగున్నది .అభినందనలు
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే
సందర్భము: తిరుమలలో వెలిసిన దేవుడు హరుడే!.. అంటే హరించే వాడే! ఏమేమి హరించే వాడు.. అంటే..
శరణాగతుల పాపములకు హరుడు. (అంటే పాపాలను అపహరించే వాడు.. తొలగించే వాడు.)
భగవంతుని స్మరణ అనే అమృత పానమునందు మత్తు లయిన జనుల జన్మలకు హరుడు. (అంటే జన్మ రాహిత్యాన్ని అనుగ్రహించే వాడు.)
మొక్కులు మొక్కుకున్న భక్తుల కేశములకు హరుడు. (కేశ ఖండనం చేయించుకునే భక్తుల కరుణించే వాడు.)
ఇవన్నీ హరించే వాడు కాబట్టి తిరుమలలో వెలసిన శ్రీ నివాసుడు హరుడే అనవచ్చు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
శరణాగత దురితములకు..
స్మరణామృత పాన మత్త జన జన్మలకున్..
వర భక్తుల కేశములకు..
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే
✒~డా.వెలుదండ సత్యనారాయణ
10.10.18
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు.
తిరువేంకటపతి యేగద
రిప్లయితొలగించండితిరుమలలో వెలసినట్టి దేవుడు, హరుడే
స్థిరముగ శ్రీశైలమ్మున
మెఱిసెను భక్తులను గావ మేదిని యందున్!!!
అరయగ నన్నియు తానని
హరిహర రూపము లొకటని యారాధనతో
నెరిగిన వారందు రిటుల
తిరుమలలో వెలసినట్టి దేవుడు హరుడే!!!
శైలజ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు.
సిరినురమున దాల్చెనుగా
రిప్లయితొలగించండితిరుమలలో వెలసినట్టి దేవుఁడు, హరుఁడే
గిరిజకు నరమేనొసగగ
హరిహరులను గాంచి సురలు హర్షించిరటన్.
కరివరదుండా శ్రీహరి
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు, హరుఁడే
స్థిరముగ కొలువయ్యెను హిమ
గిరిచెంత మురిపెముతోడ గిరిసుత తోడన్
మరొక పూరణ
రిప్లయితొలగించండిహరియించును దురితంబులు
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు, హరుఁడే
కరిముఖ స్కంధుల జనకుడు
గిరిజను గూడుచు సతతము కేళిని సలుపున్.
హరిహరి యని మొఱలిడినన్
రిప్లయితొలగించండిహరియించును పాపములనె యాదరమొప్పన్
త్వరితమ్ముగ కృప తోడను
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య🤷♀....................
తిరుమలలో వెలసినట్టి దేవుఁడు హరుఁడే
సందర్భము: తిరుమలలో వెలసిన దేవుడు హరించే వాడే! ఏమేమి టనగా..
శ్రేష్ఠ మైన భక్తుల పాపములను హరించేవాడే!
కరుణామృతం కురిపించే చూపుల ప్రసారంచేత గొప్పదైన సంసారమును హరించేవాడే!
దేవతల శత్రువుల (రాక్షసుల) ప్రాణములను హరించేవాడే!
అందువల్ల తిరుమలలో వెలసిన దేవుడు హరించేవాడే! అంటే హరుడే!
ఇందలి విశేషాలు:--
1. ప్రతి పాదాంతంలోను "హరుడే" అని వస్తుంది...
2. పాదం మొత్తం ఒకే సంస్కృత సమాసం వుంటుంది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
వర భక్త పాప హరుడే!
కరుణామృత దృక్ ప్రసార
ఘన భవ హరుడే!
సుర వైరి ప్రాణ హరుడే!
తిరుమలలో వెలసినట్టి
దేవుఁడు హరుఁడే!
✒~డా.వెలుదండ సత్యనారాయణ
10.10.18
-----------------------------------------------------------