కంది వారి సాహిత్య జలధిలో నుద్బ వించు సమస్య రాక్షసుని ఎదుర్కొనుటకు కవివరులు తమతమ ఆయుధములతో (సాగర తీరమున ఉదయముననే కాచుకున్నారు అను భావనము తో సరదాగా వ్రాసిన దసరా శుబా కాంక్షల సీస పద్యము. పాదములో మొదటి అక్షరములు కలిపి చదువుకో ప్రార్ధన) పద్యములో పేర్లు రాని కవి శ్రేష్ఠులు చాల మంది ఇంకా వున్నారు వారి పేరులు పాదములు చాలక ఇమడ్చ లేక పోయాను . అన్యధా భావించ వలదు. వారు వీరు అందరు నిత్యమూ బ్లాగులో దీటుగా సమస్యలను ఎదుర్కొనుచు బ్లాగుకు ఎంతో వన్నె తెస్తున్నారు అందరికి దసరా శుభాకాంక్షలు ----- పూసపాటి
శంకరా భరణము కవివరులకు దసరా శుభాకాoక్షలు (శం)కర సాహిత్య జలధి శం కరమున కందివా రి సమస్య గాము తోడ (క)దనము చేసెడి కాంక్షతో నిలిచిరి కవివరు లెల్లరు కలసి మెలసి , (రా)జశేఖరకవి రామబాణముబట్ట, పాసుపతము బట్టె భాస్కరమ్మ , (భ)మిడిపాటి కవికి బ్రహ్మాస్త్రము దొరుక , పరశువు గొనె విట్టు బాబు వారు , (ర)ధమెక్కి కంజర్ల రాముడు పూరించె పాంచజన్యమ్మును, పఠి గురుచర (ణ)ము వారు దాల్చె పినాకము, గద జిలేబీ దాల్చగా ఘన బిట్ర వారు (ము)రిసి కౌమోదకి కరమున బట్టెగా, నంబటి భానుడు నంకుశమ్ము (క)ట్ట, మురళిగారు ఖడ్గము జేకొనె, దార్ల ఘనుడు బ్రహ్మ దండమును స (వి)నయము గా బట్ట,విష్ణాస్త్రమును సదా శివమూర్తి జేకొన, చింత వారు (వ)రుణాస్త్ర మును గొనె, వడలి వారు చురకత్తిని బట్ట, నా వెలిదె ఘనుడు డమ (రు)కమును మ్రోగించె, రుద్రాస్త్రమునుపోచి రాజు వారేబట్టె మోజు తోడ, (ల)లిత కరమున శైలాస్త్రము నర్తించ, ధూమ్రాస్త్ర మా చిటి తోటి విజయ (కు)మరుని కరములో నమరె, విరించి సుదర్శనమును దాల్చె దాడి జేయ, (ద)ర్శి వారొక ఘన త్వాస్త్రాస్త్ర మునుపట్ట, నా ప్రభాకర శాస్త్రి నాదరించె (స)మ్మోహ నాస్తమ్ము సంబరముగ, వర మిస్సన్న ఖడ్గమే మేలనుకొని (రా)జీ పడగ ఖగ రాజాస్త్రము మధుసూధనుడు గైకొనగ సీతమ్మ కోరె (శు)భ కాల చక్రమున్, సూర్య నారాయణుo డడిగె సూర్య ధనువు, నగ్ని ధనువు (భా)ను కవి కోర , శైలజ భౌమ్య ధనువు (కాం)క్ష బడసె,సమస్య రక్కసుని పట్టి (క్ష)ణన మొందింప బారులు కట్టిరి కవు (లు)దయ మునకు పూర్వము కడు ముదము తోడ
నమస్కారములు మొన్న మేము వెళ్ళిన న్యూహాం షైర్లో పెద్దదేవాలయాన్ని నిర్మించారు .షిరిడీ బాబా విగ్రహాన్ని ప్రతిస్టాపన చేసారు. చాలా బాగుంది . పూర్ణ కుంభాభి షేకం , సహస్ర కలశాభి షేకం , చాలాబాగా కన్నుల పండువుగా జరిగాయి. గణపతి ,శివలింగము , దుర్గామాత , మున్నగు విగ్రహ ప్రతిస్టాపన జరిగింది. ఇంకా కొన్ని విగ్రహాల ప్రతిస్టాపన జరుగుతోంది. అదన్నమాట బోస్టన్ ప్రయాణ విశేషములు సోదర సోదరీ మణులందరికీ దశహరా శుభాకాంక్షలు .
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము :: దత్తపది ఇచ్చిన పదాలు :: ఈశ-హర-శివ-భవ {అన్యార్థంలో} విషయము :: దుర్గాదేవి స్తుతి సందర్భం :: శరదృతువులో వచ్చే ఈ శరన్నవరాత్రులను దేవీ నవరాత్రులు అనికూడా అంటారు. క్రమంగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే అవతారాలలో నవదుర్గలుగా పిలువబడుతూ కొలవబడుతూ ఉన్న ఓ జగన్మాతా! శివప్రియా! దుర్గాదేవీ! మహాగౌరీ! శివానీ! సిద్ధిదాత్రీ! నీవే నాకు శరణు. శఠుడనైన నేను నీ మనోహరుని నామాలలో ఒకటైన *హర* అనే మంత్రమును కూడా అహరహమూ జపిస్తాను. ప్రేమరాశివైన నీవు నన్ను దయతో చూడు. భవవామభాగినివైన నీవు సమస్త ప్రాభవములనూ నాకోసం అనుగ్రహించు అని దుర్గాదేవిని స్తుతించే సందర్భం.
‘ఈ శ’ఠు గావుమమ్మ! దయ, నీశమనోహరి! శైలపుత్రి! నా యాశ ఫలింపగా న’హర’హ మ్మనెదన్ హర యంచు, దుర్గ! గౌ రీ! శివ! ప్రేమరా’శి వ’యి ప్రీతిని జూడుము సిద్ధిదాత్రి! నీ వే శరణంటి, ప్రా’భవ’ము నిమ్ము, సదాభవవామభాగినీ! (దత్తపదిలో ఇచ్చిన పదములను ఒకసారి అన్యార్థంలో మరొకసారి స్వార్థంలో ఉపయోగించడం ఈ పద్యంలో ఉన్న విశేషం.) కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (17-10-2018)
కవి పండితులు శ్రీ కంది శంకరయ్య గారి సమస్య ====================== "ఈశ", "హర", "శివ", "భవ" ఈ పదాలను అన్యార్థంలో వినియోగిస్తు దేవీ స్తుతిని గావించవలెను ======================== సమస్యా పూరణం - 21 =================
ఆ ఈ శంకలు మాను కొలువ- దుర్గను చేరుమా మనోహర శివసత్తులదె శివమెత్తి తిరిగిరి- తమ చుట్టు తాము గిర గిర అమ్మకు బలిగ ప్రాణుల చెరబట్టి- గొంతులు కోసిరి బర బర భవదీయులుగా భక్తులు తల్లి- ఆలకించుమా వారి మొర
====##$##====
ఖుర్బానిగ ఒకడు, అమ్మకు బలిగ నింకొకడు అమాయక ప్రాణుల రక్తం కళ్ళ జూస్తున్నారు.
కాలుష్య కారకం, అనారోగ్య దాయకమైన మాంసం ఊరికే దొరకటం లేదు. పదకొండు కిలోల దాణా తిని ఒక కిలో బరువుగ కోడి ఎదుగుతుంది. హైదరాబాద్ లోని CCMB ( Centre for cellular and molecular Biology)వారు కాలుష్య రహిత,ఆరోగ్య కారక, కృత్రిమ మాంసాన్ని ప్రయోగశాలలో ప్రవర్ధనం చేస్తున్నారు, త్వరలో మనమది తిందాం.
అరగంటలో పిడుగులు ఎక్కడ పడనున్నాయో చెప్పే ఈ రోజుల్లో, రంగం పేరిట రంగసాని మన భవిష్యత్తును చెబుతున్నది, హిస్టీరియా పైత్యం తలకెక్కి శిగమూగెను ఇంకొకతి.
ప్రజలనందరిని సాత్వికులుగా మలచ ఓ తల్లీ క్షుద్రతనొదిలి సాత్వికురాలై మా ముందుకు రా తల్లి.
*ఈశ - హర - శివ - భవ* పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ దుర్గా దేవిని స్తుతిస్తూ నచ్చిన ఛందస్సులో
సందర్భము: తేటగీతిలోని భావం సులభం. *తోహరా..* దీనినే మంజరి అంటారు.. దోరా అని కూడ. 2 పాదాలే వుంటాయి. ప్రతి పాదానికి 6 చతుర్మాత్రా గణా లుంటాయి. చివరిది 3 మాత్రల గణం. ఐనా దాన్ని సాగదీసి పలుకుతారు. ప్రాస అంత్య ప్రాస వుంటాయి. తోహరలు హరి కథలలో ఎక్కువ. ఉదా..
ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొ క్కారు మెఱపు వలె నిల్చి.. తన గురు వగు విశ్వామిత్రుని యా శీర్వాదము తల దాల్చి.. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఈ శరత్కాల శుభవేళ నింపుమీర గొలుతు ని న్నఘ హరణము సలుపుదు వని.. మహిమలకు రాశి వట గదమ్మా! హిమగిరి తనయ! భవమును దాటించు నెనరు జూపి..
ఈ భావాన్నే తోహరా.. అనే గేయ ఛందస్సులో వీలైనంతమటుకు ప్రయత్నం చేస్తే...
ఈ శర దాగమమున గొలిచెద నఘ హరణము చేయుదు వంచు.. రాశి వటంచును మహిమలకును.. భవ మును దాటింతు వటంచు..
✒~డా.వెలుదండ సత్యనారాయణ 17.10.18 -----------------------------------------------------------
కంది వారి సాహిత్య జలధిలో నుద్బ వించు సమస్య రాక్షసుని ఎదుర్కొనుటకు కవివరులు తమతమ ఆయుధములతో (సాగర తీరమున ఉదయముననే కాచుకున్నారు అను భావనము తో సరదాగా వ్రాసిన దసరా శుబా కాంక్షల సీస పద్యము. పాదములో మొదటి అక్షరములు కలిపి చదువుకో ప్రార్ధన) పద్యములో పేర్లు రాని కవి శ్రేష్ఠులు చాల మంది ఇంకా వున్నారు వారి పేరులు పాదములు చాలక ఇమడ్చ లేక పోయాను . అన్యధా భావించ వలదు. వారు వీరు అందరు నిత్యమూ బ్లాగులో దీటుగా సమస్యలను ఎదుర్కొనుచు బ్లాగుకు ఎంతో వన్నె తెస్తున్నారు అందరికి దసరా శుభాకాంక్షలు ----- పూసపాటి
రిప్లయితొలగించుశంకరా భరణము కవివరులకు దసరా శుభాకాoక్షలు
(శం)కర సాహిత్య జలధి శం కరమున కందివా రి సమస్య గాము తోడ
(క)దనము చేసెడి కాంక్షతో నిలిచిరి కవివరు లెల్లరు కలసి మెలసి ,
(రా)జశేఖరకవి రామబాణముబట్ట, పాసుపతము బట్టె భాస్కరమ్మ ,
(భ)మిడిపాటి కవికి బ్రహ్మాస్త్రము దొరుక , పరశువు గొనె విట్టు బాబు వారు ,
(ర)ధమెక్కి కంజర్ల రాముడు పూరించె పాంచజన్యమ్మును, పఠి గురుచర
(ణ)ము వారు దాల్చె పినాకము, గద జిలేబీ దాల్చగా ఘన బిట్ర వారు
(ము)రిసి కౌమోదకి కరమున బట్టెగా, నంబటి భానుడు నంకుశమ్ము
(క)ట్ట, మురళిగారు ఖడ్గము జేకొనె, దార్ల ఘనుడు బ్రహ్మ దండమును స
(వి)నయము గా బట్ట,విష్ణాస్త్రమును సదా శివమూర్తి జేకొన, చింత వారు
(వ)రుణాస్త్ర మును గొనె, వడలి వారు చురకత్తిని బట్ట, నా వెలిదె ఘనుడు డమ
(రు)కమును మ్రోగించె, రుద్రాస్త్రమునుపోచి రాజు వారేబట్టె మోజు తోడ,
(ల)లిత కరమున శైలాస్త్రము నర్తించ, ధూమ్రాస్త్ర మా చిటి తోటి విజయ
(కు)మరుని కరములో నమరె, విరించి సుదర్శనమును దాల్చె దాడి జేయ,
(ద)ర్శి వారొక ఘన త్వాస్త్రాస్త్ర మునుపట్ట, నా ప్రభాకర శాస్త్రి నాదరించె
(స)మ్మోహ నాస్తమ్ము సంబరముగ, వర మిస్సన్న ఖడ్గమే మేలనుకొని
(రా)జీ పడగ ఖగ రాజాస్త్రము మధుసూధనుడు గైకొనగ సీతమ్మ కోరె
(శు)భ కాల చక్రమున్, సూర్య నారాయణుo డడిగె సూర్య ధనువు, నగ్ని ధనువు
(భా)ను కవి కోర , శైలజ భౌమ్య ధనువు
(కాం)క్ష బడసె,సమస్య రక్కసుని పట్టి
(క్ష)ణన మొందింప బారులు కట్టిరి కవు
(లు)దయ మునకు పూర్వము కడు ముదము తోడ
(పూ)జ్య కంది శంకర కవి పుణ్య జీవి,
(స)రస ముగ మాట లాడుచు సముచితముగ
(పా)మ రులను సతతము కాపాడు నక్క
(టి) కిపుడు నమసము లిడుచుంటిని ఘనముగ
మొదటి అక్షరములు కలిపి చదువుకున్న వచ్చు వాక్యము
శంకరా భరణము కవివరులకు దసరా శుభాకాoక్షలు పూసపాటి
తొలగించుశుభాకాంక్షలు
పూసపాటి సీసములకు పోటి గాడు
సమస్య పూరించండి :)
జిలేబి
చాలా మనోహరంగా ఉన్నది. ధన్యవాదములు.
తొలగించుచాలా బాగున్నదండి. నమస్కారం.
తొలగించు🌹🌹👌👍🌹🌹 !
తొలగించు
తొలగించుజిలేబి గారి సమస్య
సరదాగా పూరణము
కందము జతకు వృత్తము కనగ వచ్చు
శంక రార్యుని బ్లాగులో, స్పర్ధ లేదు
పూసపాటి సీసములకు , పోటు గాడు
కాదతను జిలేబి , చిరుత, కవనమందు
తొలగించుపూసపాటి వారు సమస్యాపాదముల పదమును మార్చరాదు.
సరిచేయుడీ
జిలేబి
తొలగించుదేనినైన బంధకవిత్వ ధేనమందు
ముంచి తేల్చగలరయ సమూహమందు
సీసమన భళి కృష్ణ వశీకరణము
పూసపాటి సీసములకు "పోటిగాడు"
పోటిగాడు - స్నేహితుడు
జిలేబి
చాలా మనోజ్ఞంగా వ్రాశారు సర్...ప్రణామములు..
తొలగించుబంధ కవి యన నెవరు? యే పద్య ములకు
తొలగించుఘనత నొందె?స్పర్ధ యనగ వినెడి పదము?
దేనికి (పు) జేర్చ పవనము? తెలుపు మిపుడె,
పూసపాటి,సీసములకు,
పోటి,గాడు
సరదా పూరణ జిలేబి గారి సమస్యకు
తొలగించుపూసపాటి వారూ! నమోనమహ.
తొలగించుకరుణామ'యీ! శ'మద! శం
రిప్లయితొలగించుకరపత్నీ! పాప'హర'ణ కార్యాచరణా!
సురుచిర గుణరా'శి వ'నుచు
నెరిఁగితి నను'భవ'ముతోడ నివె నీకు నతుల్.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించు🙏శ్రీ దుర్గాష్టమి శుభాకాంక్షలు 💐💐
ఈ శరన్నవరాత్రరాకేందుబింబఁ
బాపహరణైకరూపిణిఁ బాహి! దుర్గ !
రక్తచరణాబ్జవు, సుకృతరాశి వనుచు ,
మదిని దలచిన రక్ష సంభవము గాదె !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించుఈ శరదిందుకాంతి భవదీయ మహోజ్జ్వల దివ్య రూప సం...
తొలగించుకాశము , మానసోత్పల వికాస మనోహరమెంచి చూడగా
కోశము సర్వభద్రములకున్ , శివదమ్ము హితంకరమ్మగున్
లేశము లేదు లేదు జననీ ! భవతాపము దుర్గ ! నిన్గనన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
అద్భుతమైన పూరణ అవధానివర్యా నమస్సులు
తొలగించునమస్కారములు
రిప్లయితొలగించుమొన్న మేము వెళ్ళిన న్యూహాం షైర్లో పెద్దదేవాలయాన్ని నిర్మించారు .షిరిడీ బాబా విగ్రహాన్ని ప్రతిస్టాపన చేసారు. చాలా బాగుంది . పూర్ణ కుంభాభి షేకం , సహస్ర కలశాభి షేకం , చాలాబాగా కన్నుల పండువుగా జరిగాయి. గణపతి ,శివలింగము , దుర్గామాత , మున్నగు విగ్రహ ప్రతిస్టాపన జరిగింది. ఇంకా కొన్ని విగ్రహాల ప్రతిస్టాపన జరుగుతోంది.
అదన్నమాట బోస్టన్ ప్రయాణ విశేషములు
సోదర సోదరీ మణులందరికీ దశహరా శుభాకాంక్షలు .
ఫొటోలు ఎలా పంపాలోతెలియటల్లేదు
రిప్లయితొలగించుశ్రీ కరము యీ “శ” కారము, సిరుల నిచ్చు ,
రిప్లయితొలగించురక్కసుల సంహరణముతో రక్ష కలుగు,
శివము కలుగు దర్శనము, చేతును ,
విభవముల నిమ్మనుచు వేడు చుంటి
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ, నాల్గవ పాదాలలో గణదోషం. సవరించండి.
రిప్లయితొలగించుఈ శరన్నవ రాత్రుల నిమ్ము గాను
వణుకుగుబ్బలిపట్టి! లంభ!వలిగట్టు
దొర కొమరి!యీశి!వరముల దొరపు మమ్మ!
యహరహము మాకు నీవు ఛాయ, దరి వమ్మ!
జిలేబి
🙏
తొలగించుబాగుంది. పద్యంతో పాటు దుర్గా దేవికి ఆంధ్రభారతి నిఘంటు శోధన లింకు సమర్పించండి ఎందుకైనా మంచిది...
తొలగించుఅమ్మకే అ ఆ ఇ ఈ లు నేర్ప మంటారే :)
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'వణుకు గుబ్బలి పట్టి, వలిగట్టు దొర కొమరి' పునరుక్తి అవుతున్నది కదా?
తొలగించుఅమ్మను యెన్ని పేర్లతో పునరుక్తిస్తే యే ముంది :)
జిలేబి
ఈ శరత్తున నినుగంటి మీశురాణి !
రిప్లయితొలగించుమహిషసంహర ! కరుణించు మమ్ము తల్లి !
వాసి గాంచిన వాత్సల్యరాశి వమ్మ !
మరపురానిది భవదీయమహిమ జనని !
బాపూజీ గారూ,
తొలగించుఅద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ!
తొలగించుబహు చక్కని పూరణ బాపూజీగారూ!అభినందనలు!
తొలగించుఈశాని భవాని దయచూడు నేడు గడయు
రిప్లయితొలగించుభవము బంధము లనువీడి భక్తి కొలుతు
పాప హరణము గావించి పరమ ప్రీతి
శివము లొనగూర్చి బ్రతుకును క్షేమ మిడగ
అక్కయ్యా,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదం ప్రారంభంలో గణదోషం. సవరించండి.
ఈశనము నీవె గావున యేడు గడయు
తొలగించుభవము బంధము లనువీడి భక్తి కొలుతు
పాప హరణము గావించి పరమ ప్రీతి
శివము లొనగూర్చి బ్రతుకును క్షేమ మిడగ
పరమప్రీతి సమాసము కదా.. గణ దోషము గమనించండి
తొలగించు(ఈ శ)రత్తులోన నింపార దుర్గాంబ
రిప్లయితొలగించుపాప(హర)ణ గోరి వత్సలతల
రా(శి వ)గుట నిన్ను బ్రస్తుతించెద నమ్మ
శు(భవ)చస్సుమాల నభవురాణి!
మూర్తి గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
*ఈ శ*రత్తున కలుముల నిచ్చి మమ్ము
రిప్లయితొలగించుదే*హ ర*మ నీదు సేవలో తేలియాడ
కా*శి వ*రగుణ సాన్నిధ్య ఫలితమిచ్చి
యమ్మ రక్షింపవే*భవ*మణగిపోవ.
ప్రసాద రావు గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించుకాశి వరగుణ సాన్నిధ్త్య కాంతినిచ్చిఅని 3పాదం చదువ ప్రార్థన
రిప్లయితొలగించుదుష్ట సంహరణము జేసి శిష్ట జనుల
రిప్లయితొలగించుపాలనను జేయు ఘనత సంభవము నీకె
ఈశి!వరదాయి! హిమజ!మహేశ్వరి! కృప
నీ శరణువేడిన మముల నేలుమమ్మ
🌱🌱ఆకుల శాంతి భూషణ్🌱🌱
🌷వనపర్తి🌷
శాంతి భూషణ్ గారూ,
తొలగించుమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారు...
తొలగించు
రిప్లయితొలగించుహేరాలమ్ముగ లంభ! వమ్మవక మాహేశీ! భవానీ హర
మ్మై రమ్మా ! ఉమ ! యీ శరత్తు వసతిన్ మాధుర్య మొప్పార గా
నేరాలమ్ముగ నిమ్మ నీశి వరముల్ ! నేర్పించ వమ్మా శివున్
ధారాళమ్ముగ చేరు మార్గముల గాంధర్వీ!శివానీ ! నతుల్ !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించుఆంగ్లేయులు తమ 2౦౦ సం॥ల పాలన తరువాత వారికి అంతుబట్టైని దుర్గా పూజలలో కోల్కటా కాళిని జూచి మ్రొక్కు వైనము:
శక్తికి పూజ దానికొక సారసనేత్రియె యొజ్జ యంచు నా
సక్తి జిగీశ జెంది రట సర్వ విపత్ హరణంబు సేయ నా
భుక్తియె భక్తిగా గొనిన బోధ శివమ్ముగ మార వింతయౌ
రక్తిని కోల్కటకరాళను కాళిని గాంచినాము త
ద్ముక్తికి చేరువౌ విభవ మూలము గానము, మమ్ము బ్రోవవే!
డా. పిట్టా వారూ,
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాల్గవ పాదంలో గణదోషం. తత్ + ముక్తి = తన్ముక్తి అవుతుంది.
డా. పిట్టా నుఞడి
తొలగించుఆర్యా,
రక్తిని మేము...సరియైనది.ఆ రెండక్షరాలు టైపాటులో మరచినాను.తన్ముక్తి యైనను యతి తప్పదు కదా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించుగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించునేటి అంశము :: దత్తపది
ఇచ్చిన పదాలు :: ఈశ-హర-శివ-భవ {అన్యార్థంలో}
విషయము :: దుర్గాదేవి స్తుతి
సందర్భం :: శరదృతువులో వచ్చే ఈ శరన్నవరాత్రులను దేవీ నవరాత్రులు అనికూడా అంటారు. క్రమంగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే అవతారాలలో నవదుర్గలుగా పిలువబడుతూ కొలవబడుతూ ఉన్న ఓ జగన్మాతా! శివప్రియా! దుర్గాదేవీ! మహాగౌరీ! శివానీ! సిద్ధిదాత్రీ! నీవే నాకు శరణు. శఠుడనైన నేను నీ మనోహరుని నామాలలో ఒకటైన *హర* అనే మంత్రమును కూడా అహరహమూ జపిస్తాను. ప్రేమరాశివైన నీవు నన్ను దయతో చూడు. భవవామభాగినివైన నీవు సమస్త ప్రాభవములనూ నాకోసం అనుగ్రహించు అని దుర్గాదేవిని స్తుతించే సందర్భం.
‘ఈ శ’ఠు గావుమమ్మ! దయ, నీశమనోహరి! శైలపుత్రి! నా
యాశ ఫలింపగా న’హర’హ మ్మనెదన్ హర యంచు, దుర్గ! గౌ
రీ! శివ! ప్రేమరా’శి వ’యి ప్రీతిని జూడుము సిద్ధిదాత్రి! నీ
వే శరణంటి, ప్రా’భవ’ము నిమ్ము, సదాభవవామభాగినీ!
(దత్తపదిలో ఇచ్చిన పదములను ఒకసారి అన్యార్థంలో మరొకసారి స్వార్థంలో ఉపయోగించడం ఈ పద్యంలో ఉన్న విశేషం.)
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (17-10-2018)
అౌద్భుతమైన పూరణ అవధానిగారూ!అభినందనలు!నమస్సులు!
తొలగించుసీతమ్మా! ధన్యవాదాలమ్మా.
తొలగించుChala bagundi kota varu
రిప్లయితొలగించుపూసపాటివారికి ప్రణామాలు.
తొలగించు
రిప్లయితొలగించుబిస్మిల్లా ఖాన్ కాశి లో !
ఈ శహనాయీ నీకై
మాశా అల్లాహ్! శివాని ! మా శివసత్తీ !
కౌశికి! గౌరి! యహరహము
కాశిని గొల్వ భవదీయ కరుణను గనుమా !
జిలేబి
కరుణ{నీశ}రణార్థుని గావు దుర్గ!
రిప్లయితొలగించునిన్ను హృదయ కు{హర}ముల నిలుపు కొంటి
శాం{భవ}ము వోలె చల్లని ఛాయ నిచ్చి
సుగుణ రా{శి!వ}రము నిడి చూపు ప్రేమ !
*ఈశ్మ*శానవాటికఁ వసియించు!కాళి!
రిప్లయితొలగించుఈ*శి! వ*ణకుగుబ్బలిపట్టి! హిమజ ! దుర్గ
భార్గవి! *భవా*ని! మనో*హర* భాషిణి! శివ
కాచి కాపాడు నిత్యము గట్టుపట్టి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుభవము బాపి మాదు భయములు హరయించ;
తొలగించుఈ శరండుడు, ఛలి, ఈ కపటియు
పాప నాశివని యపారముగా నమ్మి
వేడె దుర్గ నిన్ను; వేడ్క తోను
శాంకరి! సుఖదా(యీ! శ)క్తి! శరణు తల్లి ,
రిప్లయితొలగించురం(భ!వ)ర్ణ మాతృక! మాకు రక్ష నిడుముm
సిం(హర)ధ!దుర్గి! సతతము సిరుల నిడుము
ఈశి! వలిగట్టు దొరపట్టి! యెదన దాగు.
ఈశరన్నవరాత్రులుఈప్సితముగ
రిప్లయితొలగించుదుష్టసంహర రాణిగదుర్గగొలువ
శిష్టరక్షణగలుగంగశివముయగుచు
అష్టలక్ష్ములవీక్షణయనుభవమ్ము
కొరుప్రోలు రాధాకృష్ణారావు
ఈశక్తి నిమ్ము మాతా!
రిప్లయితొలగించునీ శక్తిని దెలియు బుద్ధి, నీ విభవము మా
కే శివమునుగూర్చెను గా
యాశింతును పాపములిక హరణమ్మ్మగుగా!
తొలగించుఅద్భుతః
గోలి వారి గోళీ లీ మధ్య తక్కువై పోతున్నాయి.
జిలేబి
జిలేబి గారూ! ధన్యవాదములు.గోల(లి)లెక్కువజేయటానికి ప్రయత్నిస్తాను.
తొలగించుఅంబ శుభ క రీ శరణమ మ్మా భవాని
రిప్లయితొలగించుసంకట హర వై బ్రోవము చారు హాసి
ని భవ బంధ ము లను బాప నిన్ను వే డె
ద శివ ము ల గూర్చు మాకు సదా శివాని
కవి పండితులు
రిప్లయితొలగించుశ్రీ కంది శంకరయ్య గారి సమస్య
======================
"ఈశ", "హర", "శివ", "భవ" ఈ
పదాలను అన్యార్థంలో వినియోగిస్తు
దేవీ స్తుతిని గావించవలెను
========================
సమస్యా పూరణం - 21
=================
ఆ ఈ శంకలు మాను కొలువ-
దుర్గను చేరుమా మనోహర
శివసత్తులదె శివమెత్తి తిరిగిరి-
తమ చుట్టు తాము గిర గిర
అమ్మకు బలిగ ప్రాణుల చెరబట్టి-
గొంతులు కోసిరి బర బర
భవదీయులుగా భక్తులు తల్లి-
ఆలకించుమా వారి మొర
====##$##====
ఖుర్బానిగ ఒకడు, అమ్మకు బలిగ నింకొకడు
అమాయక ప్రాణుల రక్తం కళ్ళ జూస్తున్నారు.
కాలుష్య కారకం, అనారోగ్య దాయకమైన
మాంసం ఊరికే దొరకటం లేదు. పదకొండు
కిలోల దాణా తిని ఒక కిలో బరువుగ కోడి
ఎదుగుతుంది. హైదరాబాద్ లోని CCMB
( Centre for cellular and molecular
Biology)వారు కాలుష్య రహిత,ఆరోగ్య కారక,
కృత్రిమ మాంసాన్ని ప్రయోగశాలలో ప్రవర్ధనం
చేస్తున్నారు, త్వరలో మనమది తిందాం.
అరగంటలో పిడుగులు ఎక్కడ పడనున్నాయో
చెప్పే ఈ రోజుల్లో, రంగం పేరిట రంగసాని మన
భవిష్యత్తును చెబుతున్నది, హిస్టీరియా పైత్యం
తలకెక్కి శిగమూగెను ఇంకొకతి.
ప్రజలనందరిని సాత్వికులుగా మలచ ఓ
తల్లీ క్షుద్రతనొదిలి సాత్వికురాలై మా ముందుకు
రా తల్లి.
( మాత్రా గణనము - అంత్య ప్రాస )
---- ఇట్టె రమేష్
(శుభోదయం)
ఈ శరత్కాల రాత్రుల నెలమి గొలువ
రిప్లయితొలగించుకలుష చిత్తనాశి వరదాయి కాళిమాత!
నీ దయ నసంభవము లేదు నీరజాక్షి
నే నహరహము బూజింతు నేర్పు తోడ!
శాంభవీ నీమనోహరపు చందమరయ ననుభవమువచ్చు పరవశమనగనేమొ
రిప్లయితొలగించుఈశరన్నవరాత్రులం దెవరి కైన
పుణ్యరాశి వరమునీయ మొక్కెదనిను
చేరి యా శనీశ్వరుడు మదిఁ జెండుచుండె
రిప్లయితొలగించుభూతమాత! హరిహర సంపూజిత! శివ!
గట్టు సంభవ! శివమును కలుగజేసి
మోక్షము నొసంగుము సతము దీక్షఁ గొలుతు
నరకుసంహర!పరమేశ నాతి,!దుర్గ!
రిప్లయితొలగించునిన్నువేడెదభవములనెన్నటికిని
లేనిసద్గతినీయుమ వాణి నాకు
సకల సద్గుణ శివకర! జగముతల్లి
వర లక్ష్మీశ జలజ భవ
రిప్లయితొలగించుహర త్రయీ రూప దుర్గ యమ్మల కమవై
పరఁగు శివ వమ్మ నీ విల
నురుతర భక్తిం గొలిచెద ముత్సవ వేళన్
దసరా శుభాకాంక్షలు
రిప్లయితొలగించుసాటి కవివరేణ్యుల కిల సంతసములు
శుభము లుగలుగు గావుత యాభవాని
సాద్వి కరుణన యీశుభ సమయ మందు
కల్ల కాదిది నిజమునే పలుకుచుంటి
భువనేశ్వరి యీ శరదను
రిప్లయితొలగించునవవిధముల భక్తి గొలుతు నహరహమిలలో
భవభయహారిణి జననీ
శివములనిడి గావుమమ్మ చేమోడ్పులివే!!!
పద్మ సంభవ హర విష్ణు పత్నియనగ
రిప్లయితొలగించువాక్సతిగ పార్వతిగ లక్ష్మి వగుచు బరఁగు
సకల గుణ రాశివగు నిన్ను సంస్తుతింతు
నీశ పుత్రుని తొలి పూజ నేడు చేసి
ఈ శతాబ్ధపు దుర్గమ్మయేలయనగ?
రిప్లయితొలగించుఆంధ్రరాష్ట్ర మ్ము వాశి వహ మనకుంచి
భవకుడికినినాశీశ్శు లభయములొసగు!
దుష్ట సంహరణంబున దూటుడంబ!
(వహ=నది)భవకుడు=జీవించేవాడు
గురువు గారికి నమస్సులు
రిప్లయితొలగించుఈ శరన్నవరాత్రి న నీమహిమన
దశ హరములు సంహారమౌ ,దశయు మారు
పుణ్య రాశి వశీకృత పూర్ణ, హాసి
విజయ మిమ్ము విళంబికి విభవ దుర్గ
కరుణామయీ, శరణ మని
రిప్లయితొలగించున హరమగును పాపములని నమ్మిన భక్తుల్
ధరఁ వైభవమున గొలచిరి
కరుణావారాశివమ్మ కావవె జగతిన్
తే.గీ.
రిప్లయితొలగించు"ఈ శ"రన్నవరాత్రుల హిమగిరిసుత
మమ్ము మో"హ ర"హితులుగ మార్చుమమ్మ
శ"శివ"దన శివాని భవాని శంభు పత్ని
శు"భ, వ"ర, సుఖ ప్రదాయిని యభయమిడుమ
కందం
రిప్లయితొలగించుకరుణామయీ! శరణనఁగ
ధరణి నహరహమ్ముఁ బ్రోచి దాక్షిణ్యముతో
గురిపించ శివమ్ముల మా
పరదేవత నీవె దుర్గ! వైభవమిదిగో
రిప్లయితొలగించుకం:భవబంధములన్నింటిని
జవమున హరణమును చేయు శాంకరి వీవే
శివమును గూర్చగ రమ్మా
భవాని యీశనొసగంగ వడిగా పతితో.
2.కం:కరుణామయి యోశివశం
కరి యహరహము నిను గొల్తు కరిముఖ జననీ
కరమున నీశ నొసంగుచు
మరిమరి కూర్చుము శివములుమరువక భువిలో.
ఈశ:సంపదలు
దేవిక
రిప్లయితొలగించు------
తేటగీతి
-------
అతుల శుభముల నొసగు దయామ*యీ! శ*
రత్తు నందున కలుష *హర*ణము జేసి
*శివ*ము గూర్చగ దుర్గవై శిశిర మనము
న యరుదెంచ ధన్యత నొందె నాదు *భవ*ము!
మంజరీ ద్విపద
-------------
అతుల శుభముల నిడు దయామ*యీ!శ*
రత్తు నందున కలుష*హర*ణ జేసి
దుర్గవై యలరి నాదు పరి*భవ* కల
తలు బాపు *శివ*కరీ!తరళిత నేత్రి!
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించు..................🤷🏻♂దత్తపది🤷♀....................
*ఈశ - హర - శివ - భవ*
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
దుర్గా దేవిని స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో
సందర్భము: తేటగీతిలోని భావం సులభం.
*తోహరా..* దీనినే మంజరి అంటారు.. దోరా అని కూడ.
2 పాదాలే వుంటాయి. ప్రతి పాదానికి 6 చతుర్మాత్రా గణా లుంటాయి. చివరిది 3 మాత్రల గణం. ఐనా దాన్ని సాగదీసి పలుకుతారు. ప్రాస అంత్య ప్రాస వుంటాయి.
తోహరలు హరి కథలలో ఎక్కువ. ఉదా..
ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొ
క్కారు మెఱపు వలె నిల్చి..
తన గురు వగు విశ్వామిత్రుని యా
శీర్వాదము తల దాల్చి..
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఈ శరత్కాల శుభవేళ నింపుమీర
గొలుతు ని న్నఘ హరణము
సలుపుదు వని..
మహిమలకు రాశి వట గదమ్మా! హిమగిరి
తనయ! భవమును దాటించు
నెనరు జూపి..
ఈ భావాన్నే తోహరా.. అనే గేయ ఛందస్సులో వీలైనంతమటుకు ప్రయత్నం చేస్తే...
ఈ శర దాగమమున గొలిచెద నఘ
హరణము చేయుదు వంచు..
రాశి వటంచును మహిమలకును.. భవ
మును దాటింతు వటంచు..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
17.10.18
-----------------------------------------------------------