29, జనవరి 2019, మంగళవారం

సమస్య - 2915 (నీరజమునఁ గలువ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్"
(లేదా...)
"నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్"

61 కామెంట్‌లు:

  1. వారిజ నేత్ర ప్రియంకను
    కూరిమితో రాహులుండు కుల్కుచు చేరెన్
    భారిగ కాంగ్రెసు గెలువగ...
    "నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్!"

    రిప్లయితొలగించండి


  2. తలాతోకా కుదిరిందా ? :)


    జోరుగ సాగుచు మేలుగ
    సారికలుగొనెడు జిలేబి స్వాతంత్ర్యంబౌ
    రా రతగురువే దోచెన్
    నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. శారద రాత్రుల మురియుచు
    వారిజ లోచనిని జేరి వైకల్పి కమున్
    చారు తరములగు చందుడు
    నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆహా అక్కయ్య గారు శారద రాత్రులు... చారు తరములు... నన్నయామాత్యుని యంతిమ పద్యము స్ఫురణకు వచ్చినది.:

      శారద రాత్రు లుజ్జ్వల లసత్తర తారక హార పంక్తులం
      జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవ గంధ బంధు రో
      దార సమీర సౌరభము తాల్చి సుధాంశు వికీర్యమాణ క
      ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరపూరితంబు లై. భార.ఆర.4.141

      / పాండు రుచి పూరములం బర పూరితంబు లై

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    నీ రమణీయవాక్కు కమనీయసుధాసమమౌను , నవ్వులే
    సారతరామృతాంశుకరసాంద్రమనోహరనవ్యదీధితుల్ ,
    సారసలోచనా ! కనులు చాలవు గాంచ .,త్వదాస్యరూపమౌ
    నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్ !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  5. ( సీతారాముల కల్యాణానంతర కమనీయ సన్నివేశం )
    శ్రీరఘురాము డంత దన
    శ్రీమతి జానకి గౌగిలింప , సొం
    పారెడి నాథు సౌహృదయ
    పద్మము ముగ్ధత దాకియున్న , రం
    గారెడి చంద్రబింబముఖి
    గాటపు బ్రేమను దన్మయింపగా
    నీరజ మందునన్ గలువ
    నెచ్చెలికాని నివాస మేర్పడెన్ .

    రిప్లయితొలగించండి
  6. కూరిమి గల కమలమ్మును
    దూరుచు హస్తమ్మె తనకు తోడనుచును తా
    జేరెను కూటమిఁ జంద్రుడు
    నీరజమునఁ గలువ ఱేని నెలవొప్పారెన్

    రిప్లయితొలగించండి
  7. సారస లోచన జానకి
    చారు మనోహర పు రూపు సౌభాగ్యoపున్
    తీరు ను వర్ణింప తరమె
    నీరజ మున కలువ రేని నెల వొ ప్పా రె న్

    రిప్లయితొలగించండి


  8. సోరణి దివ్వె వెల్గుల సుశోభిత రాశి జిలేబి నయ్యరున్
    చేరగ నెమ్మి మీరగ సిసింద్రి శుభాంగిగ తమ్మికంటియై
    మారుచు జీవితమ్మున సమావృతవల్లభుడాతడే యనన్
    నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి

  9. తీరుగ గీచెను చిత్రము

    నీ రీతిన "వనజమందు నిందు"నొకండున్!

    భూరిగ మెచ్చి జనులనిరి

    నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్


    🌱ఆకుల శాంతి భూషణ్🌱
    🌷వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  10. కోరుచు కౌముదిన్ గనగ కోయిల గానము విందు జేయగన్
    వారిజ నేత్రియౌ సతిని ప్రాణమ టంచును మోదమున్ మది
    న్నారమ ణీలలామ మురి యంగను గారవ మొందుచున్ భళా
    నీరజ మందునన్ గలువ నెచ్చెలి కాని నివాస మేర్పడన్

    రిప్లయితొలగించండి
  11. తారాధిపుడా రోహిణి
    కూరిమితో గలియ మామ కోపింపంగా
    మారారినిజేరి వేణీ
    నీరజమున కలువరేని నెలవొప్పారెన్

    భగవంతుని అన్ని అంగములూ నీరజ సమానములే!

    రిప్లయితొలగించండి
  12. "చేరుము భాజపాన , వికసించిన పద్మము భాజపా కదా
    చేరకు మన్య మందు" నని చెప్పగ మిత్ర్రుడు సమ్మతించి తా
    చేరగ భాజపాన కడు క్షేమకరమ్మగు స్థాన మొందెగా
    "నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్"
    (నీరజమందునన్ గలువ అంటే కమలం పార్టీలో కలువగా అనే అర్థం తో పూరించాను. నెచ్చెలి కాడు అంటే ఎవరో నా స్నేహితుడు . తగు స్థానం పొందాడు అంటే అతడికి రాజకీయనివాసమేర్పడింది అని భావం. )

    రిప్లయితొలగించండి
  13. నీరజదళ నేత్రుడదే
    నోరూరగ వెన్న జూసె నోరగ తానున్
    ఓ రమణియనె చెలి గనుమ
    నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్

    రిప్లయితొలగించండి
  14. డా. పిట్టా సత్యనారాయణ
    పోరుచు మనుగడకై నా
    వారిని కడకాన్చి తురకవారుండరె? "మా
    వారని, మను"డన నేడీ
    నీరజమున గలువ రేని నెలవొప్పారెన్!
    (పద్మము గుర్తు చంద్రుని గుర్తుకు ఆశ్రయ మిచ్చినదను భావన)

    రిప్లయితొలగించండి
  15. డా. పిట్టా సత్యనారాయణ
    కారము నావుమాంసమును గాల్చి తినన్నిక నూరకుందుమే?
    పారితి రీదెస"న్నరబు" పాలకులా యిట? మా సహిష్ణుతన్
    తీరిన యా(ఆ)శ చాలునిక తీరిచి దిద్దమె మిమ్ము, బిల్లలన్
    నీరజ మందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్

    రిప్లయితొలగించండి
  16. శారదవేళ జంద్రముఖి జానకి,వాసవ నీల వర్ణుడౌ
    సారసనేత్రు రాఘవుని సన్నిధిజేరి కుతూహలంబు పెం
    పారగ భవ్య మౌ సుమధురాంకము నం శయనించె హాయిగన్
    నీరజ మందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్
    ఆకులశివరాజలింగం
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  17. కారణము మనోజ కృత వి
    కారమునకు మానవులకు ఘనముగ ధవళా
    పూరిత దర్పణ నిభ దళ
    నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్


    వారిధి సంభవుండు శశ బాసిత దివ్య విలాస దేహుఁడున్
    మార విరోధి మూర్ధ గత మాన్య నిశీథ ధవుండు నిత్య కౌ
    మార విరాజి శైల కుసుమ గ్రహ ఋక్ష నభో ధరిత్రి నా
    నీ రజమందునం గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్

    [ధరిత్రి నాన్ +ఈ = ధరిత్రి నా నీ; అవని లోని శైల కుసుమములు గ్రహ నక్షత్రము లన నాకాశమే భూమియన నీ భూధూళి యందు.]

    రిప్లయితొలగించండి
  18. కేతువు తో పోరాడి అలసిన కళల చందమామ మనోగతం :

    హోరుగ యుధ్ధ మాడితిని హో! తను కేతువు తోడ శక్తులున్
    బారుగ సన్నగిల్లినవి పాలపు వెల్లి పెదక్క జేరు దం
    చా రవి జోడు సరి సాగి రమా యొడి జేర దోచెగా
    నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్

    రిప్లయితొలగించండి
  19. అంధ్ర ప్రదేశ్ లో
    కూరగ స్నేహము గతమున
    నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్
    తీరగ మైత్రీ బంధము
    దూరుచునుండె నిపుడు కడుఁ దులువలటంచున్

    రిప్లయితొలగించండి
  20. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    భవిష్య పురాణం:👇

    పోరున భాజపాకు ప్రజ పొట్టిగ కాళ్ళను కత్తిరించగా
    కోరగ సీటునిమ్మనుచు కూరిమి నొల్కుచు మోడివర్యుడే
    కారును చంద్రశేఖరుడు గమ్మున త్రిప్పగ పార్లమెంటునన్...
    "నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్"

    నీరజము = భాజపా ఎన్నికల గురుతు
    కారు = తెరాస ఎన్నికల గురుతు
    కలువ నెచ్చెలికాడు = తెలంగాణ "చంద్రుడు"

    రిప్లయితొలగించండి
  21. విరసపు భావన యీయది
    నీరజమున గలువఱేని నెలవొప్పారెన్
    నీరజమనగా దామర
    నీరజములు దాబూవులగును నెలజోడుగనన్

    రిప్లయితొలగించండి
  22. నిన్నటి పూరణ.

    మేధావిం ధర వెఱ్ఱివాడె యనుచున్
    మేలమ్ములం జేయరే?
    బోధించన్ వరనీతిధర్మగతులన్ మోముం గనం జాలిరే?
    సాధూద్భాసితవేషధారికుహనాసన్న్యాసిమాయావినిన్
    సాధుశ్రేష్ఠునిగా గ్రహింతుము దురాచారున్ జనుల్ మెచ్చగన్.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  23. ఈ రోజు సమస్య

    నీ రజమునఁ గలువఱే ని నెల వొ ప్పారెన్"

    ఇచ్చిన పాదము కందము నా పూరణము సీసములో

    దుర్యోధనుడు చంద్ర వంశపు రాజు కర్ణుడు సూర్య వరమును బడసిన వాడు అను భావన తో భారత యుధ్ద. సన్నివేశము

    దారుణముగ నేడు దనుజుడు చెలరేగి చెండాడు చుండెను సేనలను, ఘ

    టోత్కచునుని నీదు షత్కము తోడ సత్వరమున చంపగ వలయు నోయి

    మిత్రమా యని కడు నాత్రుత తోడ నా రారాజు కర్ణుని కోరె, జూడ

    గ నిట నీరజమున గలువరేని నెలవొప్పారెన్గ హతవిధీ ,భారత సమ

    రమున పార్ధుని కై ముద్గరమును పొంది

    నాడ,నేడిది వాడిన మూడు చావు

    రక్కసునకు పార్ధుని చంప రణము లోన

    కష్టమే యని వగచెను కర్ణు డపుడు

    రిప్లయితొలగించండి
  24. మారెను సమాజ పటములు
    చేరెను నత్యాశచేత చిత్రములెన్నో
    బేరానజిక్కె త్రీడీ
    నీరజమున గలువరేని నెలనొప్పారెన్

    రిప్లయితొలగించండి
  25. పోర గతంపు యెన్నికల మోదముతోచని భాజపాకు తాన్
    తేరగ పొంద పాలనము ధీరులటంచు స్తుతించ వారలన్
    నీరజమందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్
    తీరగమోజు వారలను తిట్టుచు నుండెను క్రొత్తపొత్తుకై

    రిప్లయితొలగించండి
  26. వారిజమే త్వదాస్యమది వాసితలాస్య ముఖాబ్జమౌచు, వి
    ప్పారిన శోభలం గువలయద్వయనేత్రయుగమ్ము భాసిలన్,
    దోరపు హాసచంద్రికలు దోడ్తొడ వెల్గులనీన, నట్లు నీ
    నీరజమందునం గలువనెచ్చెలికాని నివాసమేర్పడెన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  27. నీరజమందునన్గలువ నెచ్చెలికాని నివాసమేర్పడెన్
    వారిజలోచనుల్వినగబండితు లందఱునేకధాటిగా
    నీరజ వాసమున్గురిచి నీమము దప్పక బల్కనట్లుగా
    మారులు మాటలాడకను మౌనముతోడను నుంటినచ్చటన్

    రిప్లయితొలగించండి
  28. నా ప్రయత్నం :
    ఉత్పలమాల
    భారత జ్యోతిషాంపతి నవగ్రహ రాశిని నద్రి కెంపునన్
    నీరజ మందునన్ గలువ నెచ్చెలికాని నివాస మేర్పడెన్
    చేరె కుజుండు విద్రుమముఁ జిక్కె బుధుండట పచ్చఁ, బీతమున్
    గోర గురుండు, వజ్రమును గూడెను శుక్రుడు నార్కి నీలమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ సహదేవుడుగారూ,అభినందనలు!

      తొలగించండి
    2. సహదేవుడు గారు జ్యోతిశ్సాస్త్రపరముగా నున్న మీ పూరణమున గ్రహ స్థితుల వివరణములు నా కవగతము కాలేదు. నా కోసము కొంచెము వివరముగా చెప్ప గోరెదను.

      తొలగించండి
    3. ఆర్యా! నమస్సుమాంజలి గ్రహస్థితులవిషయంగా కాకుండ ఏ ఏ గ్రహాలకు ఏ ఏ జాతిరత్నాలు తగునో అను విషయంగావ్రాయడంనాఉద్దేశ్యము. సవరణలవసరమైన సూచించ ప్రార్థన.🙏

      తొలగించండి
    4. ధన్యవాదములు, నమస్సులు. తెలుసుకుందామని యడిగా నండి. అంతే.

      తొలగించండి
  29. విరబూయును, రేయిబవలు
    సరసిజములు-సవితయు శశి సంచారములన్
    మురిపింతురు, యీరాతిరి
    నీరజమున కలువరేని నెలవొప్పారెన్

    రిప్లయితొలగించండి
  30. ఆ రజనీ కాంతులతో
    జేరిన యా కొలను, నింగి జిలుగులు పరువన్
    దీరిన, ప్రతిబింబంబున,
    నీరజమున కలువఱేని నెలవొప్పారెన్!

    రిప్లయితొలగించండి
  31. కందం
    సూరి, కుజ, బుధ, గురుల్ శు
    క్రారులు కెంపు, పగడ, మరకత, పీత రవ
    క్షీరగ్రాహుల నుండన్
    నీరజమునఁ గలువఱేని నెల వొప్పారెన్

    రిప్లయితొలగించండి


  32. కొంత కుతూహలం కందివారు

    ఈ సమస్య యెవరిచ్చేరు ?

    వారి పూరణ యేమిటో తెలుపుతారా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. వారిజ నేత్రి గాంచె జన వంద్యుడు భానుకులోత్తముండె యౌ
    చారుగుణాబ్ధి సోముడట సాంబశివున్ విలు నెత్తి చూపగా
    నా రఘురాముఁ సీత కనులార ముదమ్మున దాచె గుండెలో
    నీరజ మందునన్ గలువ నెచ్చెలికాని నివాసమేర్పడెన్

    రిప్లయితొలగించండి
  34. అందరికి నమస్కృతులు.
    ఈరోజు కవిమిత్రులు అవుసుల భానుప్రకాశ్ గారు వచ్చి రోజంతా ఉండి తమ *వాగ్దేవతా శతకము* ముద్రణకు ఇవ్వడానికి నాతో కంపోజ్ చేయించుకొని వెళ్ళారు. ఆ పనిలో వ్యస్తుడనై మీ పూరణలను సమీక్షించలేదు. మన్నించండి.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణ లందించిన కవిమిత్రులందరికి అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి