గు రు మూ ర్తి ఆ చా రి [ గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన ]వ్యాకుల భీకరార్ణవము నందు జరించెడు భావ నక్రముల్శోకముగూర్చి , గాయపరుచున్ మది | మిత్రమ ! మానవేల చీకాకులు ? మానవాళి కతి కష్టములం గలిగించు నెప్పుడున్ ||ప్రాకటచింతనామృతము స్వాద మొనర్పగ , విష్ణుమూర్తియేనీ కొనగూర్చి మోక్షమును , నెమ్మిని గాచును నిశ్చయమ్ముగా ! { వ్యాకుల భీకరార్ణవము = వ్యాకుల మనెడు భయంకరార్ణవము ; భావ నక్రముల్ = మనో వికారము లనెడు మొసళ్లు ; స్వాదము = పానము }~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి గారూ,మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధ న్య వా ద ము లు గు రు దే వా
కుచేలుని ఒడయురాలు తనతోఇహలోకమ్మున హాయనమహో వ్రజకిశోరుడు! వినుమ యనుంగుడు! బైసి హలధరుని సోదరుడతడు; హసత్తుని మేలుకొలిపెడు పనిని గొనుమా !జిలేబి
హాయన - కిరణము
జిలేబి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేసె నితడు తొOబై మూడు దోసములనుయేడు తప్పుల మాత్రమే యింక మిగిలెహాయి గా నిహ లోక సంహర్షణములుపొంద లేడు పిదప, గుడ్డ భూమి పైన మాయమై నరకమునకు మరల గలడు,ననుచు తలపోసె బకవైరి తన మనమున నీచ శిశుపాలుని డొగరుల్ నెంచు కొనుచు గుడ్డ = చోటు డొగరుల్ = తప్పులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'తొంబై' అనడం వ్యావహారికం. 'దోసములను + ఏడు' అన్నపుడు యడాగమం రాదు. 'డొగరుల నెంచుకొనుచు' అనండి.
గుడుగుడు బైసణ త్రిప్పుచునడుగడున విడువక ధరుని నారదుడహ! లోగడ పన్నుగడని ధృతరాష్ట్రుడి కొల్వున హా! యటంచు సుంకుల చేర్చెన్!జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ ఉపదేశం... ఆజిని గెల్వనాశల విహాయసమందు చరించుచుంటివౌరా ! జననష్టమెంచవు గదా ! యశముం గొన మోహలోభముల్రాజులకొప్పునొక్కొ ? కురురాజ ! విహంగము గూడ గుడ్ల వి.. భ్రాజిత దృష్టిఁ గాచు, నెడబాయుము భ్రాంతిని, రమ్ము బైటకున్ !! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
హాయి నుండ గ నోర్వక అల్పులైన కౌరవ దురూ హ లోభ ము కక్ష గట్టి గుడ్డి పితరుని మాటను గొట్టి వేసి సంగ రం బై న వారెల్ల చ చ్చిరక ట !
🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼ఆర్యులకు శుభోదయమ్.💐శంకరాభరణం..దత్తపది... హాయ్... హలో... గుడ్... బైభారతార్థంలో.నా ప్రయత్నము.'హా! యి'టనేలచింతిలుదు వర్జన యుద్ధము చేయ. సర్వమున్మాయయె. మో'హలో'భములు మభ్యము పెట్టుచునుండె. యుద్ధమున్హాయిగ చేయుడీ వెలుఁ'గుడం'బర వీధి రహింప కీర్తి. సచ్ఛ్రేయము'బై'కొనున్. ప్రజల శ్రేయము ధర్మము చూడగావలెన్.🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼మీచింతా రామకృష్ణారావు.🙏🏼
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
{సుయోధనునకు శ్రీ కృష్ణుని యుద్బోధ} **)(**నిస్స(హాయు)లు కారుగా నీదు రిపులెయూ(హలో)విహరింపక యుండు మిపుడెయె(గుడు) దిగుడుల త్రోవయె యెంచు కొనకుసర్వ సమ్మతం(బై)యొప్పు శాంతి యెపుడు.
( అభిమన్యుని మరణానంతరం అర్జునుని ఆవేదన )" హా " యని యర్జునుం డట మ హాద్భుతకీర్తితశౌర్యవర్యునిన్ ;తీయని యూహలో మెలగు ధీరుని ; భావితసార్వభౌమునిన్ ; బాయక కౌగిలించుకొను ; " బారగు " డంచను ; ముద్దులాడెడున్ ;మూయని ప్రేమతో శిరము మూర్కొను ; బై బడు ; మూర్చితుండగున్.
అద్భుతంగా ఉందండడీ!అభినందనలు!
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సీతాదేవి గారికి , శంకరార్యులకు ధన్యవాదాలు .
దుర్యోధనుడు కౌరవ సేనలను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు:పలు స*హాయ*ము లందిరి పాండు సుతులుఅహ*హ లో*కువయై బేలలయ్యె వారుచెల*గు డ*రివీరులై పోరు నలసిపోకపగతురకు కన్ను గవలును *బై*ర్లు గమ్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'బేలలైరి వారు' అనండి.
ధన్యవాదములు
శ్రీ భగవానువాచఇహలోకమ్మున జనులెంచు హాయినిచ్చునని దారసూను ద్రవిణముల్ అహరహము ననంగుడు దాసహకారమ్మునిడ బ్రతుకు సంసారంబై
ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తే.గీ.హాయనుచుc గోపబాలురు హాలి తోడదేవుడాడె దాగుడుమూత దాబై యనుచునూహలో నైన బరమాత్ము నూహ జేయcబారనట్టి గోపాలురదెగా భాగ్య మనిన.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రెండవ పాదంలో 'దాబై' అన్నచోట గణదోషం, యతిదోషం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
హాయనుచుc గోపబాలురు హాలి తోడదేవు, తాబైలు వెడలెను ధరణి నాడనూహలో పురాణగుడుని నెఱుఁగ నట్టిధిషణి వ్రేపల్లె వాసులు ధన్యు లయిరి.సరిగా నున్నదని భవిస్తూ,కృతజ్ఞతలతో,🙏
వోట్ల పంచ గుళికలు 731) తే:ఇచ్చెదనుచిత విద్యుత్తు నెల్ల వేళలందు రైతుబిడ్డలకని ముందు తెలిపి గెలచి ,పిదప నా విషయము తలచ బోడు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ32) తే: పూరి పాకలు కాలిన చేరు వాడ లందు .కాలనీ లోమీరు పొంద గలరు మంచి యిళ్ళని మిమ్ముల మాయ జేయు తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ33)తే: అమ్ముకొనవద్దు మీఓటు సొమ్ము గతికి దొంగ కెపుడు వోట్ల నిడగ దోచుకొనునుపుడమి పైన ప్రజల నెల్ల విడువకుండతెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ34)తే: వినవలదు చెడుమాటలు, వీడ వలయుదుష్ట నేతల నెప్పుడు, యిష్ట పడకునోట్ల కట్టలు, లేనిచో పాట్లు కలుగు,తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ35)తే: కూడు బెట్టెద నెప్పుడు కొడుకు వోలె నమ్మి వేయుము వోటు నో యమ్మ లారయనుచు మాయమాటలు చెప్పు ఘనత తోడ తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
మీ పద్యాలు బాగున్నవి.
ధన్యవాదములు గురువు గారు
స్వర్గంలో ఊర్వశి అర్జునునితో... కందంనా కౌగిలిహాయంచున్జాకరులౌ నూహ లోక సహజము విజయా! నాకను గుడ్లను నిండుచుతాకంగా బైలుపడవె తగవా జతకున్?
శ్రీకృష్ణునికి రుక్మిణి సందేశమునీలదే'హ లో' కవినుత నీసరసకుజేరి 'హాయి'నొందగ వలచేటి నన్నుకోరుచున్న యీచైద్యుని 'గుడ్డు' కుడువజేసి హృదిని 'బై'ఠాయించ జేసికొమ్ముగుడ్డుకుడచు= పొగరుఁబోతుతనము యొక్క ఫలితము ననుభవించు.(ఆం.భా)
హాయి గొల్పెడు భవనాన హలొయ నుచునునుండ గోరిక యున్నచో నుండుమయ్యచెడ్డ దారికి గుడ్బైలు సెప్పి యికను గాని యెడలను దుర్గతి గలుగు నీకుననుచు ధార్తరాష్ట్రునితోడ ననియె వృష్ణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అయితే ఆ కాలంలో ఇంగ్లీషు మాట్లాడారన్న మాట!
సాధువు వేషములోని అర్జునుడు అహ! లోలనయన ! ప్రియ! రమ్మ! హాయిగ గుడుగుడు గుంచ మాటల లాడన్సహజీవనమ్ము సాగింప హసితముఖియా! సుభద్ర! బైడాలమకో !జిలేబి
హాయనముం బైశున్యా మేయ క్రియ నా మహా సమీరజు నిహ లోకాయత గేహ విదూర విధాయక రతుఁ డగుడు వినఁగఁ దాపం బయ్యెన్
హా యను కొనెద వేమి నీ వాజి యన్ననూహలో తేలిపోకు మో యుత్తరాఖ్యచెడుగు డాడును వైరుల సేన లచటనొక్క యంబైన సంధించ నోప లేవు.
సీ. నిస్స(హాయు)డనైతి నెలత వలువ లూడ్చు . తరుణమందున గాంచి ధర్మజుడను.పంతమూనుచు జేయు (బై)సకులను గాంచి. వట్టి వా(గుడ)నిరి వైరి మూకయి(హలొ)క మందున యిట్టి దురాత్ములు. బ్రతకవలదు గాదె, భండనమునవారిఁ గూల్చుచు నాదు ప్రతినను నెరవేర్చు. కొనగనిమ్మనుచును కోరె నతడు*తే.గీ.*అనుచు కృష్ణుని తో జెప్పె ననిల సుతుడుశాంతి సమకూర్చు నెపమున చక్రధారిరాయబారిగను కదల నాయదుకులతిలకు నకు ద్రౌపది నుడులఁ స్థిరము గాను.
హా యదుకుల తిలక హా మాధవా హరీగుడ్డి రాజు ముందె కోక లాగహా బ్రతుకిహలోక మందేల నయ్య నాకనులు బైర్లు కమ్మె కావ రార.
ధర్మరాజు సోదరులతో అడవు లందైన నుందము హాయిగాను యుద్ధ మనెడి మాట వలదయ్య నూహ లోను నాగుడయ్య సహోదరులారా మీరు బైలు భూముల యందైన బ్రతక గలము
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కీచకునితో సైరంధ్రి తగునానీకిది హాయిగోరి నను పంతమ్మున్ చెరంబట్టగావగలన్ బైబడి మోహలోభముల సంభావించకే సభ్యతన్ తగులంగానిను నాయనంగుడు విషాదాంతమ్మగున్ నీకదేమగనాలిన్ వగబెట్టగా దగిన సన్మానంబు ముందున్నదే
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం) "జై భారత్ మాతాకీ జై" చనుచున్ హాయిగ డింపులమ్మ నగుచున్ చక్కన్ని నౌకందునన్వినుచున్ మెండు హలోలు దారిననుతా విడ్డూరమౌ రీతినిన్కనుచున్ గుడ్డలు లేనియట్టి శిశులన్ గంగానదీ తీరమున్తినుచున్ తిట్టులు భాజపా జనులవౌ తియ్యంగ బై చెప్పెనే!
చనె డింపులమ్మ హాయిగవినెరా మెండుగ హలోలు ! విడ్డూరము చూచెనుగుడ్డలులే ని శిశువులను! తిట్టగభాజపా భళా బై యనె బో :)జిలేబి
👌
మీ యిద్దరి ఆటవిడుపు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"హాయినిబంచని లోపములో"యిల కౌరవుల యూహ?లోభుల జేయన్ధ్యేయము యేగుడు కొరకే!మాయగుయుద్ధంబులేల?మర్మంబైనన్!
శౌరి ప్రీతి స *హాయ* ము సలుప వచ్చెస్వయముగా ని *హలో* కముఁ బాపమడచి యర్జునా! యంతరం *గుడు* హరి సతమ్ముమాధవుని సహాయం *బై* న మనకు జయము
మిత్రులందఱకు నమస్సులు![భీమాంజనేయుల యుద్ధానంతరం శ్రీకృష్ణుని కోరికపై తాను యుద్ధమున అర్జునుని రథాగ్రాన గల కేతనంపై నిలుస్తానని భీమునితో ఆంజనేయుడు పలికిన సందర్భము]"నేను విహాయసమ్మునను నెమ్మిని నర్జును కేతనమ్ముపైనూనియుఁ జిన్నెగాఁ బరఁగ నుందు, వృకోదర! గెల్పుటూహలోమేనినిఁ బెంచి, యుద్ధమున మీఱి కిరీటి క్రుధాంతరంగుఁడై,మానుచు బైజలన్, మిగుల మండుచు, వైరులఁ జెండుచుండఁగన్!"
హాయని యేడ్చె గృష్ణ గురునా త్మజుడాత్మజులన్ వధించినన్చేయమియూహలో సుతు లచేతనులై బడియుండ బొండుతెండా యవనీసురాధముని హంతను , బారగుడెట్టులయ్యె వాజ్రేయులజెండబైపడి నశింపగజేయగ గేలువచ్చెనో
మాధవుని సహాయార్థ మంపదగు బార్థు నాజలరుహలోచనుని వినమ్రడయ్యు నేడగడ నాజిబారగు డేడగలడు?సంకటంబైన రణమైన సాయమతడె
కౌరవ పాండవుల్ పెనగు కాలమునందువిహాయసోహలోగౌరవనాథుడచ్యుతు నికాయము గోరిబలుండునయ్యెనోపారగుడంచునెంచి హరి పజ్జజయంబని గ్రీడియెంచడేసారథియే జయంబిడె దిశాదశ జూపశుభంబుబైపడెన్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ(ఒక ప్రవచనకర్త అంతరంగావిష్కరణ)కలియుగ భారతమ్మునెట గాంచితి*హాయి*గ గాథ నెంచి పారులదగు యూ *హలో* నెదిగి రేపును మాపిదె పట్టుడంచు నేచెలగితి నాటి భారతమె చిన్మయలీలగ *గుడ్డి*యెద్దుగానలరితి పుణ్య సస్యముల నట్టిటు *బై* బడ వేయ హా విధీ!
గుడ్డలూడ్చిన ఫలితమే కురుపతికినిబైట నపకీర్తి నందించె, బ్రతుకులోన హాయి లేకుండ సామ్రాజ్యమంత వోయియూహలోలేని మృతిగల్గె యుద్ధమందు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి[ గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన ]
వ్యాకుల భీకరార్ణవము నందు జరించెడు భావ నక్రముల్
శోకముగూర్చి , గాయపరుచున్ మది | మిత్రమ ! మానవేల చీ
కాకులు ? మానవాళి కతి కష్టములం గలిగించు నెప్పుడున్ ||
ప్రాకటచింతనామృతము స్వాద మొనర్పగ , విష్ణుమూర్తియే
నీ కొనగూర్చి మోక్షమును , నెమ్మిని గాచును నిశ్చయమ్ముగా !
{ వ్యాకుల భీకరార్ణవము = వ్యాకుల మనెడు
భయంకరార్ణవము ; భావ నక్రముల్ = మనో
వికారము లనెడు మొసళ్లు ; స్వాదము = పానము }
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
గురుమూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
ధ న్య వా ద ము లు గు రు దే వా
తొలగించండి
రిప్లయితొలగించండికుచేలుని ఒడయురాలు తనతో
ఇహలోకమ్మున హాయన
మహో వ్రజకిశోరుడు! వినుమ యనుంగుడు! బై
సి హలధరుని సోదరుడత
డు; హసత్తుని మేలుకొలిపెడు పనిని గొనుమా !
జిలేబి
తొలగించండిహాయన - కిరణము
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చేసె నితడు తొOబై మూడు దోసములను
రిప్లయితొలగించండియేడు తప్పుల మాత్రమే యింక మిగిలె
హాయి గా నిహ లోక సంహర్షణములు
పొంద లేడు పిదప, గుడ్డ భూమి పైన
మాయమై నరకమునకు మరల గలడు,
ననుచు తలపోసె బకవైరి తన మనమున
నీచ శిశుపాలుని డొగరుల్ నెంచు కొనుచు
గుడ్డ = చోటు డొగరుల్ = తప్పులు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తొంబై' అనడం వ్యావహారికం. 'దోసములను + ఏడు' అన్నపుడు యడాగమం రాదు. 'డొగరుల నెంచుకొనుచు' అనండి.
రిప్లయితొలగించండిగుడుగుడు బైసణ త్రిప్పుచు
నడుగడున విడువక ధరుని నారదుడహ! లో
గడ పన్నుగడని ధృతరా
ష్ట్రుడి కొల్వున హా! యటంచు సుంకుల చేర్చెన్!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఉపదేశం...
ఆజిని గెల్వనాశల విహాయసమందు చరించుచుంటివౌ
రా ! జననష్టమెంచవు గదా ! యశముం గొన మోహలోభముల్
రాజులకొప్పునొక్కొ ? కురురాజ ! విహంగము గూడ గుడ్ల వి..
భ్రాజిత దృష్టిఁ గాచు, నెడబాయుము భ్రాంతిని, రమ్ము బైటకున్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహాయి నుండ గ నోర్వక అల్పులైన
రిప్లయితొలగించండికౌరవ దురూ హ లోభ ము కక్ష గట్టి
గుడ్డి పితరుని మాటను గొట్టి వేసి
సంగ రం బై న వారెల్ల చ చ్చిరక ట !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
రిప్లయితొలగించండిఆర్యులకు శుభోదయమ్.💐
శంకరాభరణం..
దత్తపది...
హాయ్... హలో... గుడ్... బై
భారతార్థంలో.
నా ప్రయత్నము.
'హా! యి'టనేలచింతిలుదు వర్జన యుద్ధము చేయ. సర్వమున్
మాయయె. మో'హలో'భములు మభ్యము పెట్టుచునుండె. యుద్ధమున్
హాయిగ చేయుడీ వెలుఁ'గుడం'బర వీధి రహింప కీర్తి. స
చ్ఛ్రేయము
'బై'కొనున్. ప్రజల శ్రేయము ధర్మము చూడగావలెన్.
🙏🏼జైశ్రీమన్నారాయణ🙏🏼
మీ
చింతా రామకృష్ణారావు.🙏🏼
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి{సుయోధనునకు శ్రీ కృష్ణుని యుద్బోధ}
రిప్లయితొలగించండి**)(**
నిస్స(హాయు)లు కారుగా నీదు రిపులె
యూ(హలో)విహరింపక యుండు మిపుడె
యె(గుడు) దిగుడుల త్రోవయె యెంచు కొనకు
సర్వ సమ్మతం(బై)యొప్పు శాంతి యెపుడు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి( అభిమన్యుని మరణానంతరం అర్జునుని ఆవేదన )
రిప్లయితొలగించండి" హా " యని యర్జునుం డట మ
హాద్భుతకీర్తితశౌర్యవర్యునిన్ ;
తీయని యూహలో మెలగు
ధీరుని ; భావితసార్వభౌమునిన్ ;
బాయక కౌగిలించుకొను ;
" బారగు " డంచను ; ముద్దులాడెడున్ ;
మూయని ప్రేమతో శిరము
మూర్కొను ; బై బడు ; మూర్చితుండగున్.
అద్భుతంగా ఉందండడీ!అభినందనలు!
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసీతాదేవి గారికి , శంకరార్యులకు ధన్యవాదాలు .
తొలగించండిదుర్యోధనుడు కౌరవ సేనలను ప్రోత్సహిస్తూ చెప్పిన మాటలు:
రిప్లయితొలగించండిపలు స*హాయ*ము లందిరి పాండు సుతులు
అహ*హ లో*కువయై బేలలయ్యె వారు
చెల*గు డ*రివీరులై పోరు నలసిపోక
పగతురకు కన్ను గవలును *బై*ర్లు గమ్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బేలలైరి వారు' అనండి.
ధన్యవాదములు
తొలగించండిశ్రీ భగవానువాచ
రిప్లయితొలగించండిఇహలోకమ్మున జనులెం
చు హాయినిచ్చునని దారసూను ద్రవిణముల్
అహరహము ననంగుడు దా
సహకారమ్మునిడ బ్రతుకు సంసారంబై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా,నమస్సులు!
తొలగించండితే.గీ.
రిప్లయితొలగించండిహాయనుచుc గోపబాలురు హాలి తోడ
దేవుడాడె దాగుడుమూత దాబై యనుచు
నూహలో నైన బరమాత్ము నూహ జేయc
బారనట్టి గోపాలురదెగా భాగ్య మనిన.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో 'దాబై' అన్నచోట గణదోషం, యతిదోషం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిహాయనుచుc గోపబాలురు హాలి తోడ
తొలగించండిదేవు, తాబైలు వెడలెను ధరణి నాడ
నూహలో పురాణగుడుని నెఱుఁగ నట్టి
ధిషణి వ్రేపల్లె వాసులు ధన్యు లయిరి.
సరిగా నున్నదని భవిస్తూ,
కృతజ్ఞతలతో,🙏
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివోట్ల పంచ గుళికలు 7
రిప్లయితొలగించండి31) తే:ఇచ్చెదనుచిత విద్యుత్తు నెల్ల వేళ
లందు రైతుబిడ్డలకని ముందు తెలిపి
గెలచి ,పిదప నా విషయము తలచ బోడు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
32) తే: పూరి పాకలు కాలిన చేరు వాడ
లందు .కాలనీ లోమీరు పొంద గలరు
మంచి యిళ్ళని మిమ్ముల మాయ జేయు
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
33)తే: అమ్ముకొనవద్దు మీఓటు సొమ్ము గతికి
దొంగ కెపుడు వోట్ల నిడగ దోచుకొనును
పుడమి పైన ప్రజల నెల్ల విడువకుండ
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
34)తే: వినవలదు చెడుమాటలు, వీడ వలయు
దుష్ట నేతల నెప్పుడు, యిష్ట పడకు
నోట్ల కట్టలు, లేనిచో పాట్లు కలుగు,
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
35)తే: కూడు బెట్టెద నెప్పుడు కొడుకు వోలె
నమ్మి వేయుము వోటు నో యమ్మ లార
యనుచు మాయమాటలు చెప్పు ఘనత తోడ
తెలుసుకొని వోటు వేయుము తెలుగు బిడ్డ
మీ పద్యాలు బాగున్నవి.
తొలగించండిధన్యవాదములు గురువు గారు
తొలగించండిస్వర్గంలో ఊర్వశి అర్జునునితో...
రిప్లయితొలగించండికందం
నా కౌగిలిహాయంచున్
జాకరులౌ నూహ లోక సహజము విజయా!
నాకను గుడ్లను నిండుచు
తాకంగా బైలుపడవె తగవా జతకున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీకృష్ణునికి రుక్మిణి సందేశము
రిప్లయితొలగించండినీలదే'హ లో' కవినుత నీసరసకు
జేరి 'హాయి'నొందగ వలచేటి నన్ను
కోరుచున్న యీచైద్యుని 'గుడ్డు' కుడువ
జేసి హృదిని 'బై'ఠాయించ జేసికొమ్ము
గుడ్డుకుడచు= పొగరుఁబోతుతనము యొక్క ఫలితము ననుభవించు.(ఆం.భా)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహాయి గొల్పెడు భవనాన హలొయ నుచును
రిప్లయితొలగించండినుండ గోరిక యున్నచో నుండుమయ్య
చెడ్డ దారికి గుడ్బైలు సెప్పి యికను
గాని యెడలను దుర్గతి గలుగు నీకు
ననుచు ధార్తరాష్ట్రునితోడ ననియె వృష్ణి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅయితే ఆ కాలంలో ఇంగ్లీషు మాట్లాడారన్న మాట!
రిప్లయితొలగించండిసాధువు వేషములోని అర్జునుడు
అహ! లోలనయన ! ప్రియ! ర
మ్మ! హాయిగ గుడుగుడు గుంచ మాటల లాడన్
సహజీవనమ్ము సాగిం
ప హసితముఖియా! సుభద్ర! బైడాలమకో !
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహాయనముం బైశున్యా
రిప్లయితొలగించండిమేయ క్రియ నా మహా సమీరజు నిహ లో
కాయత గేహ విదూర వి
ధాయక రతుఁ డగుడు వినఁగఁ దాపం బయ్యెన్
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిహా యను కొనెద వేమి నీ వాజి యన్న
నూహలో తేలిపోకు మో యుత్తరాఖ్య
చెడుగు డాడును వైరుల సేన లచట
నొక్క యంబైన సంధించ నోప లేవు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసీ. నిస్స(హాయు)డనైతి నెలత వలువ లూడ్చు
రిప్లయితొలగించండి. తరుణమందున గాంచి ధర్మజుడను.
పంతమూనుచు జేయు (బై)సకులను గాంచి
. వట్టి వా(గుడ)నిరి వైరి మూక
యి(హలొ)క మందున యిట్టి దురాత్ములు
. బ్రతకవలదు గాదె, భండనమున
వారిఁ గూల్చుచు నాదు ప్రతినను నెరవేర్చు
. కొనగనిమ్మనుచును కోరె నతడు
*తే.గీ.*
అనుచు కృష్ణుని తో జెప్పె ననిల సుతుడు
శాంతి సమకూర్చు నెపమున చక్రధారి
రాయబారిగను కదల నాయదుకుల
తిలకు నకు ద్రౌపది నుడులఁ స్థిరము గాను.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహా యదుకుల తిలక హా మాధవా హరీ
రిప్లయితొలగించండిగుడ్డి రాజు ముందె కోక లాగ
హా బ్రతుకిహలోక మందేల నయ్య నా
కనులు బైర్లు కమ్మె కావ రార.
రిప్లయితొలగించండిధర్మరాజు సోదరులతో
అడవు లందైన నుందము హాయిగాను
యుద్ధ మనెడి మాట వలదయ్య నూహ లోను
నాగుడయ్య సహోదరులారా మీరు
బైలు భూముల యందైన బ్రతక గలము
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండికీచకునితో సైరంధ్రి
రిప్లయితొలగించండితగునానీకిది హాయిగోరి నను పంతమ్మున్ చెరంబట్టగా
వగలన్ బైబడి మోహలోభముల సంభావించకే సభ్యతన్
తగులంగానిను నాయనంగుడు విషాదాంతమ్మగున్ నీకదే
మగనాలిన్ వగబెట్టగా దగిన సన్మానంబు ముందున్నదే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
"జై భారత్ మాతాకీ జై"
చనుచున్ హాయిగ డింపులమ్మ నగుచున్ చక్కన్ని నౌకందునన్
వినుచున్ మెండు హలోలు దారిననుతా విడ్డూరమౌ రీతినిన్
కనుచున్ గుడ్డలు లేనియట్టి శిశులన్ గంగానదీ తీరమున్
తినుచున్ తిట్టులు భాజపా జనులవౌ తియ్యంగ బై చెప్పెనే!
తొలగించండిచనె డింపులమ్మ హాయిగ
వినెరా మెండుగ హలోలు ! విడ్డూరము చూ
చెనుగుడ్డలులే ని శిశువు
లను! తిట్టగభాజపా భళా బై యనె బో :)
జిలేబి
👌
తొలగించండిమీ యిద్దరి ఆటవిడుపు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి"హాయినిబంచని లోపము
రిప్లయితొలగించండిలో"యిల కౌరవుల యూహ?లోభుల జేయన్
ధ్యేయము యేగుడు కొరకే!
మాయగుయుద్ధంబులేల?మర్మంబైనన్!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశౌరి ప్రీతి స *హాయ* ము సలుప వచ్చె
రిప్లయితొలగించండిస్వయముగా ని *హలో* కముఁ బాపమడచి
యర్జునా! యంతరం *గుడు* హరి సతమ్ము
మాధవుని సహాయం *బై* న మనకు జయము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[భీమాంజనేయుల యుద్ధానంతరం శ్రీకృష్ణుని కోరికపై తాను యుద్ధమున అర్జునుని రథాగ్రాన గల కేతనంపై నిలుస్తానని భీమునితో ఆంజనేయుడు పలికిన సందర్భము]
"నేను విహాయసమ్మునను నెమ్మిని నర్జును కేతనమ్ముపై
నూనియుఁ జిన్నెగాఁ బరఁగ నుందు, వృకోదర! గెల్పుటూహలో
మేనినిఁ బెంచి, యుద్ధమున మీఱి కిరీటి క్రుధాంతరంగుఁడై,
మానుచు బైజలన్, మిగుల మండుచు, వైరులఁ జెండుచుండఁగన్!"
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహాయని యేడ్చె గృష్ణ గురునా త్మజుడాత్మజులన్ వధించినన్
రిప్లయితొలగించండిచేయమియూహలో సుతు లచేతనులై బడియుండ బొండుతెం
డా యవనీసురాధముని హంతను , బారగుడెట్టులయ్యె వా
జ్రేయులజెండబైపడి నశింపగజేయగ గేలువచ్చెనో
మాధవుని సహాయార్థ మంపదగు బార్థు నాజలరుహలోచనుని వినమ్రడయ్యు
రిప్లయితొలగించండినేడగడ నాజిబారగు డేడగలడు?
సంకటంబైన రణమైన సాయమతడె
కౌరవ పాండవుల్ పెనగు కాలమునందువిహాయసోహలో
రిప్లయితొలగించండిగౌరవనాథుడచ్యుతు నికాయము గోరిబలుండునయ్యెనో
పారగుడంచునెంచి హరి పజ్జజయంబని గ్రీడియెంచడే
సారథియే జయంబిడె దిశాదశ జూపశుభంబుబైపడెన్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిడా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండి(ఒక ప్రవచనకర్త అంతరంగావిష్కరణ)
కలియుగ భారతమ్మునెట గాంచితి*హాయి*గ గాథ నెంచి పా
రులదగు యూ *హలో* నెదిగి రేపును మాపిదె పట్టుడంచు నే
చెలగితి నాటి భారతమె చిన్మయలీలగ *గుడ్డి*యెద్దుగా
నలరితి పుణ్య సస్యముల నట్టిటు *బై* బడ వేయ హా విధీ!
గుడ్డలూడ్చిన ఫలితమే కురుపతికిని
రిప్లయితొలగించండిబైట నపకీర్తి నందించె, బ్రతుకులోన
హాయి లేకుండ సామ్రాజ్యమంత వోయి
యూహలోలేని మృతిగల్గె యుద్ధమందు.