9, మార్చి 2019, శనివారం

సమస్య - 2952 (యుద్ధము శాంతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్"
(లేదా...)
"యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

33 కామెంట్‌లు:

  1. యుద్ధము జేసి పావని సుయోధను గూల్చుచు శాంతి దెచ్చెనే
    యుద్ధము గాంచగా వగచి యోధుడశోకుడు బౌద్ధుడాయెగా
    యుద్ధము గెల్వ జీవుడిట యోగము నొందడె నాత్మతోడుతన్
    యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  2. బుద్ధిగ స్నేహశీ లమున బోధన జేయుచు మంచిమా ర్గమున్
    హద్ధులు మీరకుం డగను హాసము నందున కయ్యమే యనన్
    పద్ధతి మారినంత కడు భాసుర మైనభ వానిదార తోన్
    యుద్ధమె శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  3. ఇద్ధరిణిన్ జనావళికి నించుక మంచితనంబు మాయమై
    పద్ధతిఁ దప్పగా గనగ బాధలు హెచ్చుచు లోభ, మోహ దు
    ర్బుద్ధులు బుట్టి యాశలవిఁ బొంగిన వేళ మనస్సు మార్పుకై
    యుద్ధము శాంతిదాయకమహో! జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  4. పద్ధతి వీడి రాక్షసుల వంటి దురాత్ముల దుష్కృతమ్ములే

    హద్దులు మీరుచున్ జనుల నంతము జేయుచు రెచ్చిపోవగా

    నిద్ధర నుగ్రవాదము సహింపక వారిని గూల్చ జేసెడిన్

    యుద్ధము శాంతి దాయకమహో జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్.

    రిప్లయితొలగించండి


  5. బద్ధుడను దేశ నేతగ
    విద్ధులయిరి ప్రజలు నేడు వీరికి వలయున్
    శ్రద్ధగ నమ్మిక తమపై !
    యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. క్రుద్ధ మనస్కులైన కడుఁ గ్రూరు లరాచకమూకతో చనన్
    గ్రద్దలవంటి వైరులను క్రన్ననడంచ నసాధ్య మెయ్యెడన్
    శుద్ధ మనస్సుతోనెపుడు చూచిన పృథ్వి నహింసతో తగన్
    యుద్ధము శాంతి దాయకమహోజన పాళికి సౌఖ్యమిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  7. అద్దము వంటి మానసము
    నల్లరి పెట్టెడి క్రోధలోభముల్ ;
    నిద్దపు భావమున్ జెరచు
    నిష్ఠురమత్సరకామమోహముల్ ;
    పద్ధతి మార్చు నున్మదము
    భళ్లున వీడగ సల్పునట్టిదౌ
    యుద్ధము శాంతిదాయక మ
    హో ! జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్ .


    రిప్లయితొలగించండి


  8. ఒక నేత మనోవేదన గా !



    బద్ధుడ భారతీయతకు ! బద్ధుడ దేశము గావ నేతగా !
    విద్ధమయెన్ ప్రజాళి! విను వీధి విమానము లుద్గమించునో
    యుద్ధము? శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్
    బుద్ధియె! మార్గ మెద్దియిక ? పొంకము చేర్చుము వేడెదన్ ప్రభో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    అంగదుడు... రావణునితో..

    మద్ధితవాక్యముల్ వినుమ ! *మా విభుడా* రఘురామమూర్తి తా...
    నిద్ధర వాలిఁ జంపెనొక యిమ్మున , రామునితోడ బోరు సం...
    పద్ధరణమ్ము నమ్ముమిదె, మద్వచనమ్మిక మాన్పజాలుచో
    యుద్ధము., శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరు మార్పు...🙏


      అంగదుడు... రావణునితో..

      మద్ధితవాక్యముల్ వినుమ ! *మా విభుడా* రఘురామమూర్తి తా...
      నిద్ధర వాలిఁ జంపెనొక యిమ్మున , రామునితో రణమ్ము సం...
      పద్ధరణమ్ము నమ్ముమిదె మద్వచనమ్మిక మాన్పజాలుచో
      యుద్ధము., శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  10. హద్ధులు మరచిన యువతకు
    బుద్ధులు నేర్పంగ నెంచి బోధన జేయన్
    పద్ధతి దెలియని మూర్ఘుల
    యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్

    రిప్లయితొలగించండి
  11. చద్దిని మూటగట్టిరటు సాహితి లోకము పద్య రూపమున్,
    పెద్దలు నిర్ణయిం చిరటు వేదిక జేరుచు ముచ్చటించ,యా
    పద్దతి పాటిగాగమరి పాల్గొను పండిత ధీర వైర వా
    గ్యుద్దమె శాంతి దాయకమహో జన పాళికి సౌఖ్య మిచ్చెడిన్
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు, మీర్ పేట్,రంగారెడ్డి

    రిప్లయితొలగించండి
  12. పద్దతి ఛంధో భాషణ
    పద్దతి యవధా నమందు బరువగుచర్చల్,
    పద్దతి జనమాన్యులవా
    గ్యుద్దము శాంతి నొసగు జనులు న్నతిని గనన్
    కొరుప్రోలు రాధాకృష్ణా రావు

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. జైశ్రీమన్నారాయణ🙏🏼
    ఆర్యులకు శుభోదయమ్.
    సమస్య.
    యుద్ధము శాంతిదాయకమహో. జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్.
    పూరణకై నా ప్రయత్నము.

    ఉ. ఇద్ధర దుష్టపాళి పరమేశ్వరునే గనకుండ దౌష్ట్యముల్
    తద్దయు చేయుచుండిరి. విధాతయె వ్రాయ దురాత్ములెల్ల సం
    సిద్ధమగున్ పరస్పరము చిత్రముగా హతమార్చుకొంట కీ
    యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్.
    మీ
    రామకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  15. యుద్ధము మారణాయుధపు హోరునముంచుచు సైనికాళినిన్
    బద్ధులజేయు,చేతనప్రపంచపు నాశనహేతువయ్యదే
    బుద్ధిగ గాంధిగారివగు బోధనలానుచు దూరముంచగా
    యుద్ధమె,శాంతిదాయకమహో జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  16. 09మార్చి 2019 శనివారం
    శంకరాభరణం
    సమస్య

    సమస్య...

    యుద్ధమె శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్

    నా పూరణ  :  ఉత్పలమాల
    **** **** ***

    సిద్ధము గాకుమా నరుడ! శ్రేయము గాదు రణంబు సల్పినన్!

    యుద్ధమె ప్రాణ హాని నిడు యుద్ధమె నాశ మొనర్చు సంపదల్!

    పద్ధతి గాదు న్యాయమును,పాడియు గాదు వచించ నివ్విధిన్

    "యుద్ధమె శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్"


    🌿 ఆకుల శాంతి భూషణ్ 🌿
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  17. జైశ్రీమన్నారాయణ🙏🏼
    ఆర్యులకు శుభోదయమ్.
    సమస్య.
    యుద్ధము శాంతిదాయకమహో. జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్.
    పూరణకై నా ప్రయత్నము.

    ఉ. ఇద్ధర దుష్టపాళి పరమేశ్వరునే గనకుండ దౌష్ట్యముల్
    తద్దయు చేయుచుండిరి. విధాతయె వ్రాయ దురాత్మపాళి సం
    సిద్ధమగున్ పరస్పరము చిత్రముగా హతమార్చుకొంట కీ
    యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్.
    మీ
    రామకృష్ణారావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. దుష్ట దురాత్మల ధూళి పాళి చేసేసారు చింతావారు అదురహో !


      జిలేబి

      తొలగించండి
  18. ముద్దుగ చెప్పినను వినక
    పద్దున దాయాది యుగ్రవాదుల బెంచన్
    యద్దరి ప్రతివాదులపై
    యుద్ధము శాంతి నొసగు జనులున్నతిని గనన్

    రిప్లయితొలగించండి
  19. శ్రద్ధగ దలచుచు నీశు ని
    బద్ధత తోడ మదమోహ పంకిలములపై
    పద్ధతి మీరగ జరిపెడి
    యుద్ధము శాంతినొసగు జనులున్నతినిగనన్

    రిప్లయితొలగించండి
  20. బుద్ధిగనుండకెప్పుడునుబోరులుగొట్టగబల్కనిట్లుగా
    యుద్ధముయుద్ధమంచునునికహోరులువెట్టుచుబెచ్చుమీరుచో
    నుద్ధతితోడనేపరులయుద్ధతిమాన్చగనెల్లవారికిన్
    యుద్ధమెశాంతిదాయకమహోజనపాళికిసౌఖ్యమిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  21. నా ప్రయత్నం :

    కందం
    నిద్దుర వేళను మన సరి
    హద్దుల కడ నుగ్రవాదు లాగడమెంచన్
    సిద్ధమ్మై వారలతో
    యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్

    రాయబారమున కౌరవ సభలో శ్రీకృష్ణ పరమాత్మ :

    ఉత్పలమాల (నేడు ప్రసారమైనది)

    అద్దమనంగ మానసము నంపిరి కోరుచు నర్ధ రాజ్యమున్
    సిద్ధము కాదటన్న విన జెప్పిరి పంచఁగ నూళ్ల నైదిటిన్
    బద్ధతి సంధికిట్లనిరి పాండవు లెంచుచు నాప జూచి యా
    యుద్ధమె, శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  22. శుద్ధ చరిత్ర తనరఁగ వి
    రుద్ధ గమనముఁ ద్యజియించఁ గ్రోధము లున్నే
    యిద్ధాత్రి వలదు నిత్యము
    యుద్ధము శాంతి నొసఁగు జను లున్నతినిఁ గనన్


    కృద్ధత దేశ పౌరులకుఁ గీడులు పెక్కులు కల్గఁ జేయు నీ
    బుద్ధి విహీన ఘాతకులఁ బూర్ణము చంపుట లెల్ల ధర్మ సం
    బద్ధము నిత్య నీచ తమ భావ మహోగ్ర జనఘ్నమై మహా
    యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  23. పద్ధతి లేక మోసమున పాక్ సరిహద్దులలోన జేసెగా
    యుద్ధము;శాంతిదాయకమహో జన పాళికి సౌఖ్య మిచ్చెడిన్
    వృద్ధులు,బాలలున్,మహిళ,పేద,వితంతువులాది సర్వులున్
    సిద్ధ,సమృద్ధ,సంపదల క్షేమము లందరె హింస లేనిచో.

    రిప్లయితొలగించండి
  24. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బుద్ధియు శుద్ధియున్ విడిచి ప్రొద్దున రాతిరి పప్పు పప్పనెన్
    క్రుద్ధుడ నైతి నేనునిక కూర్చొని నుండను బుద్ధిమంతునై
    యుద్ధము జేసి మోడినట హోటెలు పంపెద చాయినమ్మగా
    యుద్ధము శాంతిదాయక మహో జనపాళికి సౌఖ్య మిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  25. పులిపాక సావిత్రి,నరసరావుపేట.
    ఉధ్ధతి జూపి శత్రువుల నుక్కడగించుట పాడిగాని;స
    న్నధ్ధుల,శాంతి కాముకుల,నవ్య విధాన,పథానువర్తులన్
    సిధ్ధమొనర్చి,నెయ్యమును శీఘ్రము పెంచుట,కోరి ఆపుటల్
    యుధ్ధము,శాంతిదాయకమహో జనపాళికి సౌఖ్యమిచ్చెడిన్.

    రిప్లయితొలగించండి
  26. ఉద్ధతినిగాకయెప్పుడు
    బద్ధతిగావాదులాడ పండితులెపుడున్
    సిద్ధాంతము కొఱకావా
    గ్యుద్ధముశాంతినొసగుజనులున్నతినిగనన్

    రిప్లయితొలగించండి
  27. ఇద్దర మానవు లందరు
    నొ ద్దికగా మెల్గి సతము నోరి మి తోడ న్
    క్రుద్దత వీ డ న హింసా
    యుద్దము శాంతి నొసగు జనులున్నతి ని గనన్

    రిప్లయితొలగించండి
  28. యుద్ధము బాహ్యశత్రువిజయోచితమయ్యు హృదంతరారిసం
    బద్ధమదెట్లు తొల్గు, నవి పైతృకబంధముతో జనించవే?
    వృద్ధిని గాంచవే మరల? యిట్టి జయమ్ము కోసమై

    యుద్ధము శాంతిదాయకమహో! జనపాళికి సౌఖ్యమిచ్చిడిన్.

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల.

    రిప్లయితొలగించండి


  29. ఇద్ధర యందున కూడదు
    యుద్ధము ,శాంతి నొసగు జనులున్నతిని గనన్
    సిద్ధము గావలె సతతము
    బుద్దికి పదునిడుచు నుండ పోడిమి కలుగున్.

    రిప్లయితొలగించండి
  30. బుద్ధివిహీనుని జేయున
    విద్ధరణిన కామమాది హీనగుణములన్
    పద్ధతిగా నోడించెడి
    యుద్ధము శాంతినొసగు జనులున్నతినిఁ గనన్

    రిప్లయితొలగించండి